విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై కారు డివైడర్ ను ఢీకొట్టిన సంఘటనలో ముగ్గురు విద్యార్థులు దుర్మరణం చెందారు.
మునగాల: విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై ముగ్గురు విద్యార్థులు దుర్మరణం చెందారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న కారు శుక్రవారం ఉదయం నల్లగొండ జిల్లా మునగాల మండలం ముకుందాపురం వద్ద ప్రమాదానికి గురైంది.
వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. మొత్తం ఐదుగురు విద్యార్థులు కారులో ప్రయాణిస్తుండగా.. ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. క్షతగాత్రులను కోదాడలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.