దట్టంగా పొగమంచు.. ట్రాఫిక్‌ అంతరాయం | traffic disruption with fog on vijayawada- hyderabad highway | Sakshi
Sakshi News home page

దట్టంగా పొగమంచు.. ట్రాఫిక్‌ అంతరాయం

Published Fri, Dec 15 2017 11:11 AM | Last Updated on Tue, Sep 4 2018 5:32 PM

సాక్షి, హైదరాబాద్‌ : హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాలలో పొగమంచు దట్టంగా అలుముకుంది. వెలుతురు సరిగా లేని కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. నల్గొండ జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో విజయవాడ-హైదరాబాద్‌ హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

మరోవైపు  హైదరాబాద్ నగరం మంచు దుప్పటితో మూసుకుపోయింది. నగర్ శివారు ప్రాంతం హయత్ నగర్ పరిసర ప్రాంతాలు ఉదయం తొమ్మిది గంటలు దాటిన తరువాత కూడా సూర్యుడు రాకుండా  మంచుతో నిండి ఉండటంతో జాతీయ రహదారి పై వెళ్లే వాహనదారులకి ముందుగా వెళుతున్న వాహనాలు కనపడక తీవ్ర ఇబ్బంది పడుతూ వాహనాలకు లైట్లు వేసుకొని వెళ్ల వలసిన పరిస్థితి ఏర్పడింది. అయితే గత వారం పది రోజుల నుండి చలి బాగా పెరగటంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement