నగరంలో మళ్లీ భారీ వర్షం
Published Wed, Jul 19 2017 3:58 PM | Last Updated on Tue, Sep 4 2018 4:52 PM
హైదరాబాద్: నగరాన్ని వరణుడు ఇప్పట్లో వదిలేలాలేడు. బుధవారం ఉదయం నుంచి తెరిపినిచ్చిన మధ్యాహ్నం నగరాన్ని వణికించాడు. ఇప్పటికే మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగి స్థానికులు అవస్థలు పడుతున్నారు.
సిటీ రోడ్లు నరక కూపాలను తపిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. మళ్లీ భారీ వర్షం ప్రారంభం కావడంతో.. నగరవాసుల తిప్పలు ఇప్పట్లో తప్పేలాలేవనిపిస్తోంది. పంజాగుట్ట, అమీర్‌పేట్, ఖైరతాబాద్, బంజారాహిల్స్‌తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. వర్షానికి గాలి కూడా తోడవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Advertisement
Advertisement