fog
-
ఉత్తరాదిలో పొగమంచు ఎఫెక్ట్.. వాహనదారుల ఇబ్బందులు
-
ఢిల్లీని కమ్మేసిన పొగమంచు
-
వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు.. చలిపులి పంజా (ఫొటోలు)
-
గన్నవరం: పొగమంచు ఎఫెక్ట్.. గాల్లోనే విమానాల చక్కర్లు
సాక్షి,కృష్ణా: గన్నవరం విమానాశ్రయంలో మంగళవారం ఉదయం దట్టమైన పొగమంచు అలుముకుంది. పొగమంచు ఎఫెక్ట్‌తో విమానాల ల్యాండింగ్‌కు అంతరాయం ఏర్పడింది. షార్జా నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం పది రౌండ్లు గాల్లోనే చక్కర్లు కొట్టింది. చివరకు ఏటీసీ అధికారులు ల్యాండింగ్‌కు అనుమతించకపోవడంతో విమానం హైదరాబాద్ వైపు మళ్లింది. పొగమంచు కారణంగా రన్ వే కనిపించకపోవడంతో విమానాల ల్యాండింగ్‌కు ఆలస్యం అవుతోంది. దీంతో విమానాశ్రయానికి రావాల్సిన పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్టు అధికారులు తెలిపారు. గన్నవరం విమానాశ్రయంలో ఇటీవలి కాలంలో పొగమంచు కారణంగా విమానాల రాకపోకలకు తరచు అంతరాయం ఏర్పడుతోంది. ఇదీ చదవండి.. మిలాన్ విన్యాసాలు ప్రారంభం -
విజయవాడ: పొగమంచు ఎఫెక్ట్.. గాల్లో చక్కర్లు కొట్టిన విమానాలు
సాక్షి, విజయవాడ: గన్నవరం ఎయిర్‌పోర్టులో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. పొగమంచు కారణంగా విమానాలు ల్యాండ్ అయ్యేందుకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ ,చెన్నైల నుంచి బయలుదేరిన ఇండిగో విమానాలు గన్నవరం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కావాల్సి ఉంది. దట్టమైన పొగమంచు కారణంగా వాతావరణం అనుకూలించలేదు. దీంతో విమానాలు గాల్లో చక్కర్లు కొట్టాయి. 8 రౌండ్లు చక్కర్లు కొట్టిన తర్వాత సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి. ఢిల్లీని దట్టమైన పొగమంచు చుట్టుముట్టింది. విమానాశ్రయంలో విజిబిలిటీ సున్నాకి పడిపోయింది. దీంతో 50కి పైగా విమానాలపై ఎఫెక్ట్ పడింది. రైళ్లు , విమానాల రాకపోకలు ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు లైట్లు వేసుకొని వాహనాలు నడుపుతున్నారు. కాగా, హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానం ల్యాండింగ్ సమయంలో ప్రయాణికులు భయాందోళనకు గురైన ఘటన మంగళవారం జరిగింది. ఇండిగో సంస్థకు చెందిన ఏటీఆర్ 72–600 విమానం హైదరాబాద్ నుంచి ప్రయాణికులతో ఉదయం 11 గంటలకు ఇక్కడికి చేరుకుంది. రన్ వేపై దిగేందుకు దగ్గరగా వచ్చిన సమయంలో పైలెట్లు ఒక్కసారిగా విమానాన్ని తిరిగి గాల్లోకి లేపడంతో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. ఐదు నిమిషాల వ్యవధిలో విమానాన్ని తిరిగి సురక్షితంగా రన్‌వేపై ల్యాండింగ్ చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే రన్‌వేపై ల్యాండింగ్ అయ్యే ప్రాంతం కంటే ముందుకు విమానం రావడంతో పైలెట్లు భద్రత ప్రమాణాల్లో భాగంగా వెంటనే టేకాఫ్ తీసుకున్నట్లు ఎయిర్పోర్ట్ వర్గాలు పేర్కొన్నాయి. ఇదే విమానంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కూడా ఉన్నారు. ఇది చదవండి: ఢిల్లీ: 12 ఏళ్ల రికార్డులను దాటేసిన జనవరి చలి -
ఢిల్లీని కమ్మేసిన పొగ మంచు
ఢిల్లీ: ఢిల్లీలో దట్టమైన కాలుష్యానికి తోడు పొగ మంచు అలుముకుంది. పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానాలోని పలు నగరాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పొగ మంచు ప్రభావంతో 30 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. క్యాట్ -3 టెక్నాలజీ లేని విమానాలపై పొగ మంచు ప్రభావం పడుతోంది. ఢిల్లీ వాయు నాణ్యత 328 పి.ఎం.తో వెరీ పూర్ కేటగిరికి చేరింది. కాలుష్యం, పొగ మంచుతో ప్రజలకు అనారోగ్య సమస్యలు తెలుత్తుతున్నాయి. ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. చలితీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నందున అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రాకూడదని అధికారులు హెచ్చరికలు చేశారు. వృద్ధులు, చిన్నపిల్లలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మాస్క్‌లు తప్పనిసరిగా వాడాలని పేర్కొన్నారు. CAT III లేని విమానాలు ప్రభావితం కావచ్చని విమానయాన అధికారులు తెలిపారు. సమాచారం కోసం ప్రయాణికులు సంబంధిత ఎయిర్‌లైన్‌ను సంప్రదించాలని కోరారు. అసౌకర్యం ఏర్పడనున్న నేపథ్యంలో విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. అటు.. పొగ మంచు కారణంగా 30 రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇదీ చదవండి: నేడు కేంద్ర అఖిలపక్ష భేటీ -
ఢిల్లీని వణికిస్తున్న చలిగాలులు
ఢిల్లీ: దేశ రాజధానిని చలి, పొగమంచు వణికిస్తున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 8 డిగ్రీలకు పడిపోయాయి. చలిగాలులు వీస్తుండటంతో గురువారం ఢిల్లీ, పరిసర రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు అలుముకుంది. దీంతో విమానాలు, రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరో కొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. భారత వాతావరణ శాఖ ప్రకారం.. ఈ రోజు ఉదయం 5.30 గంటలకు పంజాబ్, హర్యానా, పశ్చిమ రాజస్థాన్, బిహార్‌లోని పలు ప్రాంతాల్లో చాలా దట్టమైన పొగమంచు కనిపించింది. దేశ రాజధాని గత నెల రోజులుగా తీవ్రమైన చలిగాలులతో అల్లాడిపోతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు సింగిల్ డిజిట్‌కు పడిపోతున్నాయి. పొగమంచు దట్టంగా కమ్ముకోవడంతో దృశ్యమానత(విజిబిలిటీ) 50 మీటర్లకు పడిపోయింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, అస్సాంలోని పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. సబ్-హిమాలయన్ పశ్చిమ బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు పొగమంచు కనిపించిందని ఐఎండీ తెలిపింది. ఇదీ చదవండి: ఆ రోజు కోర్టులకు సెలవు ఇవ్వండి.. సీజేఐకి లేఖ -
HYD: విమాన ప్రయాణికులకు తప్పని తిప్పలు
సాక్షి, హైదరాబాద్: దట్టమైన పొగమంచు కారణంగా దేశవ్యాప్తంగా విమానాల రాకపోకలకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పలు విమానాలు రద్దయ్యాయి. మూడు రోజుల్లో 37 విమానాల రాకపోకలను ఎయిర్‌పోర్టు అధికారులు రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శంషాబాద్ నుండి ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు వెళ్లే విమానాలు.. ఆదివారం 14 విమానాలు, సోమవారం 15 విమానాలు, మంగళవారం 8 విమాన సర్వీసులు రద్దయ్యాయి. విమాన సర్వీసులు రద్దుతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఢిల్లీలో అయితే ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రెండ్రోజులుగా ఎయిర్‌పోర్టులో ఉండిపోయారు ప్రయాణికులు. ఇక హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, ముంబై, కోల్‌కతా నగరాల్లోని ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులకు తలెత్తే ఇబ్బందులను పరిష్కరించేందుకు వార్‌రూమ్‌లను ఏర్పాటు చేశారు. దీంతో పాటు విమాన సర్వీసుల నిర్వహణకు సంబంధించి ఏయిర్ లైన్స్ కు స్టాండర్డ్ ఆపరేటింటగ్ ప్రొసీజర్స్(ఎస్వోపీ)ను విడుదల చేశారు. కాగా, దట్టమైన పొగమంచు కారణంగా ఆది, సోమ,మంగళవారాల్లో ఢిల్లీ ఎయిర్ పోర్టులో 100కు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. 150పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. -
విమానాల ఆలస్యంపై ఆందోళనలు.. దిద్దుబాటు చర్యలు!
ఢిల్లీ: పొగమంచు కారణంగా రాష్ట్ర రాజధానిలో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పదుల సంఖ్యలో విమానాలు రద్దు అవుతుండగా.. చాలామట్టుకు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ క్రమంలో సహనం కోల్పోతున్న ప్రయాణికులు.. విమానయాన సంస్థల సిబ్బందితో వాగ్వాదాలకు దిగుతున్నారు. ఇండిగో ఫ్లైట్ సిబ్బందిపై ఓ వ్యక్తి దాడి చేసిన ఘటనా చూశాం. ఈ క్రమంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) దిద్దుబాటు చర్యకు దిగింది. మూడు గంటలకు మించి ఆలస్యమయ్యే అవకాశం ఉన్న సమయంలో వాటిని ముందస్తుగానే రద్దు చేసుకోవచ్చని విమానయాన సంస్థలకు చెబుతూనే.. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని చెబుతూ కొన్ని డీజీసీఏ సిఫార్సులు విడుదల చేసింది. తాజాగా పొగమంచు ఎఫెక్ట్‌తో విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా.. లాంజ్, భోజనం వంటి కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు బోర్డింగ్ ఏరియాలో పడిగాపులు కాస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. ఇలాంటి సమయంలో.. విమానం గనుక మూడు గంటల కంటే ఎక్కువ ఆలస్యం అయితే ముందుగానే రద్దు చేసుకోవచ్చని DGCA తెలిపింది. అయితే.. ఫ్లైట్ రద్దు, ముందస్తు నోటీసు లేకుండా ఆలస్యం, బోర్డింగ్ నిరాకరించబడిన సందర్భంలో ప్రయాణీకులకు పూర్తి రక్షణ, ఇతర సౌకర్యాల్ని అందించాలి. ఈ నిబంధనలను వెంటనే పాటించాలని అన్ని విమానయాన సంస్థలను ఆదేశించింది. విమానాశ్రయంలో రద్దీని నివారించడం, ప్రయాణికులకు అసౌకర్యాన్ని తగ్గించడం లక్ష్యంగా డీజీసీఏ ఈ సిఫార్సులు చేసినట్లు వెల్లడించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా 3 గంటల కంటే ఎక్కువ ఆలస్యం అయితే, విమాన రద్దును పరిగణించాలి. ఈ సమాచారాన్ని ప్రయాణికులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలి. విమాన సంబంధిత విమానయాన సంస్థ వెబ్సైట్లో విమాన ఆలస్యం గురించి ఖచ్చితమైన సమాచారాన్ని తప్పనిసరిగా అందించాలి. ముందస్తు సమాచారం తప్పనిసరిగా ప్రయాణీకులకు ఎస్సెమ్మెస్గానీ, వాట్సాప్ ద్వారాగానీ, లేదంటే ఈ-మెయిల్ రూపంలో గానీ తెలియజేయాలి. ప్రయాణీకులకు ఆలస్యం గురించి నిర్దిష్ట సమాచారం అందించాలి. ప్రయాణికులకు సలహాలు, సూచనలు అందించడానికి సిబ్బందిని ఏర్పాటు చేయాలి అని DGCA పేర్కొంది. -
బెంబేలెత్తిస్తున్న పొగమంచు.. ఢిల్లీ అతలాకుతలం
ఢిల్లీ: ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో.. చలిగాలుల ప్రభావం దేశమంతటా కనిపిస్తోంది. దేశ రాజధానిలో ఈ పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. దట్టంగా పొగమంచు కమ్మేయడంతో(zero visibility) రవాణా వ్యవస్థలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. సుమారు 100 దాకా విమానాలు, పలు రైళ్లు రద్దు అయ్యాయి. ఇక రెండు వారాల తర్వాత ఇవాళ స్కూల్స్ తెరుచుకోవాల్సి ఉండగా.. చలి కారణంగా వేళల్లో మార్పులు చేశారు. ప్రమాదకర స్థాయిలో కొనసాగుతున్న వాయు కాలుష్యానికి.. పొగ మంచు తోడు కావడంతో ఢిల్లీ జనజీవనం అతలాకుతలం అవుతోంది. ఉదయం 11 గంటలకైనా సూర్యుడి కనిపించడం లేదు. పొగమంచుతో విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. సోమవారం ఉదయం వంద విమాన సర్వీసులు రద్దు కాగా.. మరో 128 సర్వీసులు గంటకు తక్కువ కాకుండా ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో సంయమనం పాటించాలని ప్రయాణికులను ఢిల్లీ ఎయిర్పోర్ట్ కోరుతోంది. మరోవైపు ఢిల్లీ నుంచి దేశవ్యాప్తంగా 18 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దేశ రాజధాని ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల సెల్సియస్ వద్ద కొనసాగుతోంది. శుక్రవారం అది రికార్డు స్థాయిలో 3.9గా.. శనివారం ఏకంగా 3 డిగ్రీల సెల్సియస్ నమోదు అయిన సంగతి తెలిసిందే. మరోవైపు వాయు కాలుష్యం (Air Pollution) తీవ్రంగా పెరగడం ఆందోళన రేకెత్తిస్తోంది. -
ఉత్తరాదిని కమ్మేసిన పొగమంచు.. 22 రైళ్లు ఆలస్యం
ఢిల్లీ: దేశ రాజధాని పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. రోడ్లపై విజిబిలిటీ(దృశ్యమానత) సున్నాకి పడిపోయింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఢిల్లీకి వెళ్లే దాదాపు 22 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఐజీఐ)లో అనేక విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఐజీఐ విమానాశ్రయంలో విజిబిలిటీ 350 మీటర్లుగా నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. మరికొద్ది గంటల్లో ఇది 200 మీటర్ల మేర తగ్గే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, వాయువ్య మధ్యప్రదేశ్, చండీగఢ్ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడింది. #WATCH | Visibility affected in parts of the national capital as a blanket of dense fog covers Delhi. (Visuals from Rajaji Marg shot at 7.30 am) pic.twitter.com/Nfm5eAHTVi — ANI (@ANI) January 14, 2024 ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో దట్టమైన పొగమంచు ఏర్పడింది. తీవ్రమైన చలిగాలులు వీస్తున్నాయి. రోడ్లపై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. తక్కువ వేగంతో ప్రయాణించాలని వాహనదారులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరమైతే తప్పా ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరారు. #WATCH | Visibility affected due to dense fog in Uttar Pradesh's Lucknow as cold wave conditions prevail in the region (Visuals shot at 7.00am) pic.twitter.com/BH6DMRWw3W — ANI UP/Uttarakhand (@ANINewsUP) January 14, 2024 దేశ రాజధానిలో 3.6 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గడంతో ఈ సీజన్లో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. వచ్చే 3-4 రోజుల్లో వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడుతుందని ఐఎండీ తెలిపింది. 22 trains to Delhi from various parts of the country are running late due to dense fog conditions as on 14th January. pic.twitter.com/vmY6LBOSvr — ANI (@ANI) January 14, 2024 ఇదీ చదవండి: ‘ఇండియా’కు ఖర్గే సారథ్యం! -
‘సూరీడు కనిపించి ఏడురోజులైంది’
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌వాసులను గత వారం రోజులుగా ఎముకలు కొరికే చలి గజగజ వణికిస్తోంది. ఈ ప్రాంతంలో ‘సూరీడు కనిపించి ఏడురోజులైంది’ అని స్థానికులు చెబుతున్నారు. పొద్దస్తమానం ఉండే చలి కారణంగా జనజీవనం స్తంభించింది. చలి నుంచి రక్షించుకునేందుకు స్థానికులు రగ్గుల కింద తలదాచుకుంటున్నారు. ఈ పరిస్థితులను గమనించిన జిల్లా యంత్రాంగం గ్వాలియర్‌లో జనవరి 6న అన్ని ప్రీ-ప్రైమరీ పాఠశాలలకు సెలవు ప్రకటించింది. చలి తీవ్రత కారణంగా ప్రీ ప్రైమరీ నుంచి ఐదో తరగతి వరకు నడుస్తున్న అన్ని పాఠశాలలకు జనవరి 6వ తేదీ శనివారం సెలవు ప్రకటించినట్లు గ్వాలియర్ కలెక్టర్ అక్షయ్ కుమార్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆరు నుంచి 12వ తరగతి వరకు అన్ని క్లాసులను మునుపటిలానే నిర్వహిస్తామని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గ్వాలియర్‌లో గత వారం రోజులుగా చలి తీవ్రత అధికంగా ఉంది. జనవరి 2 నుండి రాత్రి ఉష్ణోగ్రతలు 9 నుండి 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతున్నాయి. వాతావరణశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం గ్వాలియర్ ప్రజలు సూర్యుడిని చూసేందుకు మరో రెండు మూడు రోజులు వేచి చూడాల్సివుంటుంది. ప్రస్తుతం జిల్లాలో ఆకాశం మేఘావృతమై ఉండనుంది. ఒకటి రెండు రోజుల్లో చినుకులు కూడా పడే అవకాశాలు కూడా ఉన్నాయి. గ్వాలియర్-చంబల్‌లో దట్టమైన పొగమంచు ఏర్పడుతోంది. -
ఆ రాష్ట్రంలోని పాఠశాలలకు సెలవులు
ఉత్తరప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో తీవ్రమైన చలి వాతావరణం నెలకొనడంతో పాటు ఉదయం, సాయంత్రం వేళ్లల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది. ఫలితంగా విద్యార్థులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని పాఠశాలలకు శీతాకాల సెలవులు ప్రకటించారు. పెరుగుతున్న చలి దృష్ట్యా ఈనెల 14 వరకూ ఘజియాబాద్‌లోని అన్ని పాఠశాలలను మూసివేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. జలౌన్‌లో జనవరి 6 వరకు అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర పాఠశాలలను మూసివేయాలని జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. ప్రయాగ్‌రాజ్‌లోనూ చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అన్ని పాఠశాలలను ఈ నెల 6 వరకు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఒకటి నుంచి 8వ తరగతి వరకు అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర, గుర్తింపు పొందిన పాఠశాలలు మూసివేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వారణాసిలో నిరంతరం పెరుగుతున్న చలి, దట్టమైన పొగమంచు దృష్ట్యా పాఠశాల సమయాలను మార్చారు. జిల్లా మేజిస్ట్రేట్ ఎస్. రాజలింగం ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో జనవరి 2 నుంచి 6వ తేదీ వరకు ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు మాత్రమే పాఠశాలలను నిర్వహించనున్నారు. -
భయపెడుతున్న పొగమంచు.. తెలుగు రాష్ట్రాలకూ అలర్ట్
ఎముకలు కొరికే చలి దేశాన్ని గజగజలాడిస్తోంది. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడం.. మునుపెన్నడూ లేని రీతిలో పొగమంచు (Dense Fog) పలు ప్రాంతాల్ని కప్పేస్తోంది. దట్టంగా వ్యాపిస్తుండడంతో చాలా చోట్ల ఉదయం 10-11 గంటల దాకా కూడా రాత్రిని తలపిస్తోంది. అదే సమయంలో దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థపై పెను ప్రభావం పడుతోంది. ఇక.. శుక్ర, శనివారాల్లో ఉదయం వేళ పొగమంచు దట్టంగా కమ్ముకునే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణశాఖ తెలిపింది. మరీ ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనిష్ఠ ఉష్ణోగ్రత 7 డిగ్రీలకు పడిపోయిందక్కడ. పొగమంచు కొన్ని ప్రాంతాల్లో 50 మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు కూడా కనిపించనంతగా మంచు కమ్మేసింది. చలి పరిస్థితులు తీవ్రంగా ఉండటంతో ఇప్పటికే అక్కడి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అటు గాలి నాణ్యత కూడా పడిపోయింది. మరోవైపు పొగమంచు కారణంగా దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థకు అంతరాయం కలుగుతోంది. విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశీయ, అంతర్జాతీయ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. రైళ్లు కూడా ఆలస్యం అవుతున్నాయి. దీంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లలో పడిగాపులు పడాల్సి వస్తోంది. పొగమంచు దట్టంగా పేరుకుపోయి.. రోడ్లపై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో.. పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు సైతం సంభవిస్తున్నాయి. వీళ్లు జాగ్రత్త! ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతుండడంతో.. సీజనల్ డిసీజ్‌లు వ్యాపించే అవకాశాలున్నాయని.. అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవాళ్లు, ఆస్తమా తదితర శ్వాసకోశ సమస్యలు ఉన్న వాళ్లు మరీ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో.. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో శుక్ర, శనివారాల్లో ఉదయం వేళ పొగమంచు కమ్ముకునే అవకాశాలు ఉన్నాయని.. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు వాతావరణశాఖ సూచించింది. రాష్ట్రం వైపు తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి దిగువ స్థాయిలో గాలులు వీస్తున్నాయని తెలిపింది. ఎక్కువగా ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాల్లో మంచు కురవొచ్చని అంచనా వేస్తోంది. -
337 విమానాలు ఆలస్యం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీని పొగమంచు కష్టాలు వదలట్లేవు. వరుసగా నాలుగో రోజు దట్టమైన పొగమంచు కారణంగా విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గురువారం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 337 విమానాలు ఆలస్యంగా బయలుదేరాయి. కొన్ని విమానాలను సమీపంలోని ఇతర ఎయిర్‌పోర్టులకు దారి మళ్లించారు. ఈ ఎయిర్ పోర్టు నుంచి ప్రతి రోజు దాదాపు 1200ల విమానాలు రాకపోకలు సాగిస్తాయి. కాగా.. పొగమంచు కారణంగా విమానాల రాకపోకల్లో ఇబ్బందులు తలెత్తితే ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా ప్రయాణికులు తమ ప్రయాణాన్ని వాయిదా లేదా రద్దు చేసుకునేందుకు అనుమతిస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ప్రతి ఏడాది చలి కాలంలో నెల నుంచి నెలన్నర రోజులు ఇలాంటి పరిస్థితి తలెత్తడం సాధారణం. -
పట్టాలపై పొగమంచు
రామగుండం/ఓదెల(పెద్దపల్లి): దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కాజీపేట–బల్లార్షా సెక్షన్ల మధ్య బుధవారం రైలు పట్టాలపై పొగమంచు కమ్ముకోవడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. తెల్లవారుజామున పొగమంచు కమ్ముకోవడంతో పలు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్ల రాకపోకలకు విఘాతం కలిగింది. ప్రధానంగా సికింద్రాబాద్–బల్లార్షా–న్యూఢిల్లీ మధ్య ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైళ్ల వేగం తగ్గించి నడిపించారు. సిగ్నల్స్‌ను పొగమంచు కమ్మేయడంతో లోకో పైలట్లు అప్రమత్తమయ్యారు. వేగం బాగా తగ్గించి నడపడంతో రైళ్లు నిర్దేశిత సమయం కన్నా ఆలస్యంగా నడిచాయి. మరోవైపు.. రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాంపైకి వచ్చేవరకూ రైళ్లు కనిపించక ప్రయాణికులు సైతం తికమకపడ్డారు. కాజీపేట– బల్లార్షా సెక్షన్ల మధ్య పెద్దపల్లి, రామగుండం, జమ్మికుంట, ఓదెల, పొత్కపల్లి, కొలనూర్, బిజిగిరిషరీఫ్, హసన్‌పర్తి మధ్య ఈ పరిస్థితి మరింత తీవ్రంగా కనిపించింది. ఉదయం 11 గంటల తర్వాత సూర్యుడు రావడంతో రైల్వేసిగ్నలింగ్ వ్యవస్థ, పట్టాలు యథాతథస్థితికి చేరుకున్నాయి. దీంతో రైళ్ల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి. -
ఉత్తరాదిని ‘కమ్ముకున్న పొగమంచు’
సాక్షి, న్యూఢిల్లీ: చలి పులికి ఉత్తరాది రాష్ట్రాలు గజగజ వణుకుతున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గడంతో పొగమంచు కమ్ముకుంటోంది. దీంతో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హరియాణా, రాజస్థాన్ రాష్ట్రాల్లో మంచుతెరలు దట్టంగా పరుచుకున్నాయి. ఢిల్లీసహా ఆరు రాష్ట్రాల విమానాశ్రయాల్లో సోమవారం ఉదయం పొగమంచు తీవ్రతంగా ఉండటంతో రన్‌వే కూడా కనిపించని పరిస్తితి ఏర్పడింది. దీంతో పలు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ల్యాండింగ్‌కు ఇబ్బందులు ఏర్పడటంతో పలు విమానాలను అధికారులు దారి మళ్లించారు. సోమవారం ఉదయం ఢిల్లీ, అమృత్సర్, ఆగ్రా, ప్రయాగ్‌రాజ్, గ్వాలియర్, జైసల్మేర్ విమానాశ్రయాల్లో జీరో విజిబిలిటీ నమోదైందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. వచ్చే కొద్ది రోజులు చలి మరింత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ అంచనావేసింది. ప్రతికూల వాతావరణ ప్రభావంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. సోమవారం ఉదయం పొగమంచు కారణంగా ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు విమానాల రాకపోకలపై ప్రభావం పడింది. ప్రాణం తీసిన పొగమంచు! బహ్రెయిచ్(యూపీ): దట్టంగా కమ్ముకున్న పొగమంచు ముగ్గురి ప్రాణాలు పోవడానికి కారణమైంది. సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్–బల్రామ్పూర్ రహదారిలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. మంచుదుప్పటి కప్పిన రోడ్డుపై వేగంగా వస్తున్న ట్రక్కును ప్రయాణికుల బస్సు ఢీకొట్టింది. డ్రైవర్లతో పాటు ఒక ప్రయాణికుడు మరణించాడు. 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. -
Fog: విజయవాడ-హైదరాబాద్ హైవేపై నిలిచిన వాహనాలు
సాక్షి,విజయవాడ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చలి పులి పంజా విసురుతోంది. గత రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చాలా చోట్ల దట్టంగా పొగమంచు కురుస్తోంది. దీంతో ఉదయాన్నే నేషనల్ హైవేపై ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచు కారణంగా విజయవాడ - హైదరాబాద్ హైవేపై పలు ప్రాంతాల్లో వాహనాలు నిలిచిపోయాయి. జగ్గయ్యపేట వద్ద భారీ పొగమంచు వల్ల వాహనాలు ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. చెన్నై-కలకత్తా హైవేపై కూడా కొన్ని చోట్ల వాహనాలు నిలిచిపోయాయి. ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలో రాజధాని హైదరాబాద్‌తో పాటు కుమ్రంభీం ఆసిఫాబాద్, రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా ఏపీలో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతపల్లితో పాటు పలు చోట్ల అతి తక్కువ ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. ఇదీచదవండి..ఆ రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు.. -
అమృత్‌సర్‌లో అత్యల్ప ఉష్ణోగ్రతలు.. ఎంతంటే..
దేశంలోని పర్వత ప్రాంతాల్లో కురుస్తున్న హిమపాతం మైదాన ప్రాంతాల్లో చలి తీవ్రతను మరింత పెంచుతోంది. ఉత్తర భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రతపెరిగింది. దీంతో పాటు పలు ప్రాంతాల్లో తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కూడా ఏర్పడుతోంది. వాతావరణ శాఖ ‘ఎక్స్’ హ్యాండిల్లో అందించిన సమాచారం ప్రకారం హర్యానా, పంజాబ్, చండీగఢ్, అస్సాం, మేఘాలయలో రాబోయే ఐదు రోజుల పాటు ఉదయం దట్టమైన పొగమంచు ఏర్పడనుంది. డిసెంబర్ 21 వరకు ఇదేవిధమైన వాతావరణం ఉండనుంది. కాగా గత 24 గంటల్లో హర్యానా, పంజాబ్, చండీగఢ్, యూపీ, ఢిల్లీ, వాయువ్య రాజస్థాన్, ఉత్తర ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బీహార్, మధ్యప్రదేశ్‌లలో ఐదు నుంచి 10 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 2-3 రోజుల్లో ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉంది. గత 24 గంటల్లో పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 3.6 డిగ్రీలుగా నమోదైంది. యూపీలోని బరేలీలో 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మధ్యప్రదేశ్‌లోని రేవా, ఉమారియాల్లో 6.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇదిలావుండగా గత 24 గంటల్లో దక్షిణ తమిళనాడులో 39 ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. తూత్తుకుడి, తిరునల్వేలి, తెన్కాశి, కన్యాకుమారి జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని, దక్షిణ తమిళనాడులోని చాలా చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ బులెటిన్‌లో తెలిపింది. డిసెంబర్ 19న కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం కనిష్ట ఉష్ణోగ్రత 7.1 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. ఈ సీజన్లో సగటు ఉష్ణోగ్రత కంటే ఒక డిగ్రీ తక్కువ. మంగళవారం పాక్షికంగా ఆకాశం మేఘావృతమై, పొగమంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కాగా జమ్మూకశ్మీర్‌లో చలి తీవ్రత కొనసాగుతోంది. ఉత్తర కాశ్మీర్‌లోని గుల్మార్గ్లో మైనస్ ఎనిమిది డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇది కూడా చదవండి: లోక్‌సభ ఎన్నికల్లో యూపీ నుంచి రాహుల్, ప్రియాంక పోటీ? -
Fog In Tirumala Photos: తిరుమలను చుట్టేసిన పొగమంచు (ఫోటోలు)
-
మంచుకురిసే వేళలో.. వాతావరణశాఖ హెచ్చరికలు!
దేశంలోని పర్వత ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. మైదానాలను చల్లని గాలులు చుట్టుముడుతున్నాయి. ఉత్తర భారతదేశంలోని పలుచోట్ల ఉదయం పూట దట్టంగా పొగమంచు కమ్ముకుంటోంది. హర్యానా, పంజాబ్, చండీగఢ్, త్రిపుర, యూపీలోని పలు ప్రాంతాల్లో డిసెంబర్ 14, 15 తేదీల్లో దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. డిసెంబర్ 14న అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలకు వాతావరణశాఖ ఇదే విధమైన హెచ్చరిక జారీ చేసింది. గడచిన 24 గంటల్లో ఢిల్లీ, హర్యానా, పంజాబ్, చండీగఢ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాలలో 6 నుండి 10 డిగ్రీల సెల్సియస్ మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న 24 గంటల్లో ఈ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రత 6 నుంచి 10 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. ఢిల్లీ-ఎన్సీఆర్లోనూ చలి తీవ్రత పెరుగుతోంది. బుధవారం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 7.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది సాధారణం కంటే ఒక డిగ్రీ తక్కువగా ఉంది. మరో రెండు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు తిరిగి పడిపోవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం నగరంలోని గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) అత్యంత పేలవమైన కేటగిరీలో నమోదైంది. డిసెంబర్ 16, 17 తేదీల్లో దక్షిణ తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. డిసెంబర్ 17న కేరళలో కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లలో మంచు కురుస్తోంది. గడచిన 24 గంటల్లో హిమాచల్‌లోని కులు, కిన్నౌర్, లాహౌల్, స్పితి జిల్లాల్లోని ఎత్తయిన ప్రాంతాలు, పర్వత శ్రేణులలో మంచు కురిసింది. ఇది కూడా చదవండి: సీఎం సొంతూళ్లో సంబరాలు... రెస్టారెంట్లో చాయ్ ఫ్రీ! -
తిరుమల క్షేత్రానికి మంచు తెర.. కనువిందు చేస్తున్న ప్రకృతి అందాలు (ఫొటోలు)
-
మన్యం గజగజ..!
సాక్షి, పాడేరు(అల్లూరి సీతారామరాజుజిల్లా): చలికాలం ప్రారంభంలోనే మన్యం ప్రాంతంలో చలిగాలులు ఉధృతంగా వీస్తున్నాయి. ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. శుక్రవారం చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 12.5డిగ్రీలు, అరకులోయ కేంద్ర కాఫీబోర్డు వద్ద 13.9డిగ్రీలు, పాడేరు మండలం మినుములూరు కేంద్ర కాఫీబోర్డు వద్ద 14డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ కారణంగా సాయంత్రం నాలుగు గంటల నుంచే చలిగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటోంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో చలి మరింత వణికిస్తోంది. గిరిజన గ్రామాలు, మండల కేంద్రాలు, ప్రధాన జంక్షన్లలో చలిమంటలు కనబడుతున్నాయి. స్వెట్టర్ల వినియోగం క్రమేణా పెరుగుతోంది. అమ్మకాలు కూడా ఊపందుకుంటున్నాయి. ఇక అర్ధర్రాతి అయితే దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది. ఘాట్ ప్రాంతంలో దీని తీవ్రత ఉధృతంగా ఉంటోంది. ఉదయం 9 గంటల వరకు ఏజెన్సీ ప్రాంతంలో మంచు తెరలు వీడడం లేదు. ప్రజలు హెడ్లైట్ల వెలుగులో రాకపోకలు సాగిస్తున్నారు. వ్యవసాయ పనులు, వారపు సంతలకు వెళ్లే గిరిజనులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు చలితో ఇబ్బందులు పడుతున్నారు. -
దారుణం: పొగమంచుతో వందల కొలది వాహనాలు ఢీ.. ఏడుగురు మృతి
న్యూయార్క్: అమెరికా, లూసియానాలో పొగమంచు కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దాదాపు 158 వాహనాలు వేగంగా వచ్చి ఢీకొన్నాయి. వాహనాలు ఒకదానికొకటి చొచ్చుకొచ్చి మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ఇంటర్‌స్టేట్-55 రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. పాంట్ చార్ట్రెయిన్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో వాహనాలు కుప్పలుగా పడి ఉన్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన భయానక విషయాలను ప్రత్యక్ష సాక్షులు ఈ విధంగా వివరించారు. రహదారి అంతా పొగమంచుతో అస్పష్టంగా కనిపిస్తోంది. దాదాపు 30 నిమిషాల పాటు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. క్షతగాత్రుల రోదనలతో భయానక వాతావరణం ఏర్పడింది. ఓ కారు ఏకంగా వంతెన దాటి నీటిలో పడిపోయింది. డ్రైవర్లు రోడ్లుపైకి వచ్చి సహాయం కోరుతున్నారు. 7గురు చనిపోగా.. దాదాపు 30 మంది గాయపడ్డారు. దాదాపు 11 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. అమెరికాలో కార్చిచ్చు కారణంగా వెలువడిన పొగతో పొగమంచు కలిసిపోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని స్పష్టం చేసిన అధికార యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమయ్యింది. రాష్ట్ర రోడ్డు రవాణా శాఖా అధికారులతో సమన్వయం చేసుకుని తదుపరి కార్యాచరణ చేపడతామని వెల్లడించారు. రహదారిని మూసేసే అంశంపై చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ఇదీ చదవండి: పుతిన్ ఆరోగ్యంపై పుకార్లు.. ఖండించిన క్రెమ్లిన్ -
ఔటర్, హైవేలపై జాగ్రత్త.. పొగ మంచులో ప్రయాణాలొద్దు!
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ, వారాంతం కలిసి రావటంతో నగరవాసులు సొంతూర్లకు పయనమయ్యారు. మరోవైపు రాష్ట్రంలో పొగమంచుతో కూడిన వాతావరణం నెలకొంది. రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు తెల్లవారుజామున ప్రయాణాలకు దూరంగా ఉండాలని కోరారు. పూర్తిగా తెల్లవారిన తర్వాత సూర్యకాంతిలో ప్రయాణించడం శ్రేయస్కరమని సూచించారు. వ్యక్తిగత వాహనాల్లో కుటుంబంతో కలిసి వెళ్లేందుకు సిద్ధమవుతున్న నగరవాసులకు ట్రాఫిక్ పోలీసులు పలు సూచనలు చేశారు. ఔటర్, హైవేలపై జాగ్రత్త.. దట్టమైన పొగమంచు కారణంగా ఔటర్ రింగ్ రోడ్డు, రాష్ట్ర, జాతీయ రహదారులపై ప్రయాణించే సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయా రహదారులలో వాహనాలను నిలపకూడదు. హైవేలపై ప్రయాణిస్తున్నప్పుడు ఏమాత్రం నలత అనిపించినా, నిద్ర వచ్చినా రోడ్డు మీద వాహనాన్ని క్యారేజ్‌పై నిలివేయకుండా రోడ్డు దిగి ఒక పక్కన లేదా కేటాయించిన పార్కింగ్ స్థలంలో మాత్రమే నిలిపివేయాలని సూచించారు. పొగ మంచు కారణంగా రోడ్డు స్పష్టంగా కనిపించదు. ఆగి ఉన్న వాహనాలను ఢీకొని ప్రమాదాలు జరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయని గుర్తు చేశారు. బ్రేకులు వేసేటప్పుడు వెనకాల వస్తున్న వాహనాలను అద్దాల నుంచి చూసి మాత్రమే వేయాలి తప్ప అకస్మాత్తుగా బ్రేకులు వేయకూడదని, ఇతర వాహన డ్రైవర్లు మీ వాహనాన్ని గుర్తించేందుకు వీలుగా బీమ్ హెడ్లైట్లను వినియోగించాలని సూచించారు. డ్రైవింగ్ చేసేటప్పుడు ఇవి పాటించండి ► ఇతర వాహనాలకు తగినంత దూరం పాటించాలి. ► హజార్డ్ లైట్లను ఆన్ చేసి ఉంచాలి. ► సెల్ఫోన్లో మాట్లాడుతూ, కారులో అధిక శబ్ధం మ్యూజిక్‌తో ప్రయాణించకూడదు. వెనకాల వచ్చే వాహనాల హారన్ వినిపించదు. ► పొగమంచులో ఎదుటి వాహనాలు, పశువులు స్పష్టంగా కనిపించవు. అందుకే తరుచూ హారన్ కొడుతూ ప్రయాణించడం ఉత్తమం. ► లేన్ మారుతున్నప్పుడు లేదా మలుపుల సమయంలో కిటికీలను కిందికి దింపాలి. దీంతో వెనకాల వచ్చే ట్రాఫిక్ స్పష్టంగా వినిపిస్తుంది. ► ఐదారు గంటల పాటు కంటిన్యూగా డ్రైవింగ్ చేయకుండా మధ్యలో కాస్త విశ్రాంతి తీసుకోవాలి. (క్లిక్ చేయండి: పండుగ ప్రయాణం.. నరకయాతన) -
పొగమంచుతో విమానాలకు ల్యాండింగ్ కష్టాలు
విమానాశ్రయం (గన్నవరం): దట్టమైన పొగమంచు రన్‌వే ప్రాంతాన్ని పూర్తిగా కప్పి వేయడంతో గన్నవరం విమానాశ్రయంలో గురువారం విమానాల ల్యాండింగ్‌కు ఇబ్బందులు ఎదురయ్యాయి. తొలుత హైదరాబాద్ నుంచి ఉదయం 7.35 గంటలకు వచ్చిన ఇండిగో విమానం రన్‌వేపై దిగేందుకు విజిబిలిటీ లేకపోవడంతో 40 నిమిషాలు గాలిలో చక్కర్లు కొట్టింది. అయినప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సూచన మేరకు విమానం తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయింది. ఉదయం 8.15 గంటలకు న్యూఢిల్లీ నుంచి వచ్చిన ఎయిరిండియా విమానం కూడా ల్యాండింగ్‌కు అనుకూలంగా లేకపోవడంతో అరగంట పాటు గాలిలో చక్కర్లు కొట్టింది. ఒకసారి రన్‌వేపై విమానాన్ని ల్యాండ్ చేసేందుకు పైలెట్లు ప్రయత్నించినప్పటికి విజిబిలిటీ లేకపోవడంతో టేకాఫ్ తీసుకున్నారు. మరో ప్రయత్నంలో సురక్షితంగా విమానాన్ని ల్యాండింగ్ చేయడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. పొగమంచు ప్రభావం తగ్గిన తర్వాత హైదరాబాద్ తిరిగి వెళ్లిన ఇండిగో విమానం కూడా గన్నవరం ఎయిర్‌పోర్టుకి ఉదయం 10 గంటలు దాటిన తరువాత చేరుకుంది. ఫాస్టాగ్ సేవలు ప్రారంభం గన్నవరం విమానాశ్రయంలోని టోల్గేట్లో ఫాస్టాగ్ సేవలు గురువారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. రద్దీ సమయాల్లో టోల్గేట్ వద్ద ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఈ సేవలను వినియోగంలోకి తీసుకువచ్చారు. టోల్గేట్ వద్ద జరిగిన పూజ కార్యక్రమాల్లో పాల్గొన్న విమానాశ్రయ ఇన్చార్జ్ డైరెక్టర్ పీవీ రామారావు ఈ సేవలను ప్రారంభించారు. -
పొగమంచులో విమానం.. ప్రయాణికుల్లో టెన్షన్
రేణిగుంట: పొగమంచు దట్టంగా కమ్మేయడంతో రేణిగుంట విమానాశ్రయంలో ల్యాండింగ్ అవ్వాల్సిన స్పైస్‌జెట్ విమానం 15 నిమిషాలపాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. హైదరాబాద్ నుంచి మంగళవారం ఉదయం 7.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి స్పైస్‌జెట్ విమానం చేరుకుంది. అయితే పొగమంచు దట్టంగా కమ్మేయడాన్ని గమనించిన పైలట్ ల్యాండింగ్ చేయకుండా గాల్లోనే కాసేపు తిప్పారు. దీంతో విమానంలో ఉన్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. 15 నిమిషాల తర్వాత పొగమంచు తొలగడంతో సురక్షితంగా రన్‌వేపై ల్యాండింగ్ చేశారు. చదవండి: తిరుమలలో విరిగిపడ్డ కొండచరియలు.. భారీగా ట్రాఫిక్‌జామ్ -
తిరుమల గిరులను కప్పేసిన మంచు దుప్పటి
-
లాంగ్ కోవిడ్‌తో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి తగ్గుతుందంటున్న వైద్యులు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ బారినపడి కోలుకున్నాక కూడా కొందరిలో అనారోగ్య సమస్యలు చాలాకాలం బాధిస్తున్నాయి. లాంగ్ కోవిడ్ సమస్య ఉత్పన్నమవుతోంది. కరోనాతో తీవ్రంగా జబ్బుపడి, ఐసీయూ, వెంటిలేటర్ వరకు వెళ్లిన బాధితులపైనే లాంగ్ కోవిడ్ ఎక్కువ ప్రభావం ఉన్నట్టు తొలుత భావించినా.. పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని వైద్య నిపుణులు చెప్తున్నారు. కోవిడ్ సీరియస్‌గా మారని వారు, చికిత్స కోసం ఆస్పత్రులదాకా వెళ్లాల్సిన అవసరం పడనివారిలోనూ లాంగ్ కోవిడ్ సమస్యలు కనిపిస్తున్నాయని వివరిస్తున్నారు. వయసుతోగానీ, వ్యాధి తీవ్రతతోగానీ సంబంధం లేకుండా ‘బ్రెయిన్ ఫాగింగ్ (మెదడు మొద్దుబారిపోవడం)’, ఇతర మానసిక సమస్యల బారిన పడుతున్నారని పేర్కొంటున్నారు. ఈ అంశంపై యూకేకు చెందిన ఫ్లోరే ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూరోసైన్స్, మెంటల్ హెల్త్ న్యూరాలజిస్ట్, క్లినికల్ డైరెక్టర్ ట్రేవర్ కిల్పాట్రిక్, ప్రొఫెసర్ స్టీవెన్ పెట్రో పరిశోధన చేశారు. ఇన్‌ఫ్లూయెంజా సహా ఊపిరితిత్తులతో ముడిపడిన వైరస్‌లకు.. మెదడు సరిగా పని చేయకపోవడానికి మధ్య లంకె ఉన్నట్టుగా తమ అధ్యయనంలో తేలిందని వివరించారు. 1918 నాటి స్పానిష్ ఫ్లూకు సంబంధించి డిమెన్షియా, కాగ్నిటివ్ డిక్లైన్, నిద్రలేమి సమస్యలు, 2002 నాటి సార్స్, 2012 లో వచ్చిన మెర్స్ కేసుల్లో యాంగ్జయిటీ, డిప్రెషన్, చురుకుగా వ్యవహరించడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఎదురయ్యాయని తెలిపారు. సార్స్, మెర్స్ నుంచి కోలుకున్నవారిలో 20 శాతం మంది జ్ఞాపకశక్తితో ఇబ్బందులు, అలసట, నీరసం, కుంగుబాటు, ఆం దోళన సమస్యలు ఎదుర్కొన్నారని వివరించారు. (corona leak: అప్పుడే అనుమానం వచ్చింది! మాట మార్చిన డబ్ల్యుహెచ్ఓ సైంటిస్ట్) ముక్కు నుంచి మెదడుకు.. కోవిడ్ పేషెంట్లలో ముక్కును మెదడుతో కలిపే నరాల ద్వారా వైరస్ మెదడుకు చేరుకుంటోందని అంచనా వేసినట్టు పరిశోధకులు తెలిపారు. మెదడులోని ‘లింబిక్ సిస్టమ్’ను ముక్కులోని సెన్సరీ సెల్స్ కలుపుతాయని.. భావోద్వేగాలు, నేర్చుకోవడం, జ్ఞాపకశక్తి వంటి వాటిని లింబిక్ సిస్టమ్ నిర్వర్తిస్తుందని వివరించారు. కరోనా బారిన పడక ముందు, తర్వాత మెదడుకు సంబంధించిన స్కానింగ్‌లను పరిశీలిస్తే.. లింబిక్ సిస్టమ్‌లోని కొన్నిభాగాలు కుంచించుకుపోయినట్టు బయటపడిందని తెలిపారు. మొత్తంగా కొవిడ్ నేరుగా మెదడుపై ప్రభావం చూపుతోందని స్పష్టమైందని వెల్లడించారు. కాగా.. ఈ పరిశోధన, మెదడుపై కరోనా ప్రభావానికి సంబంధించి రాష్ట్రానికి చెందిన సీనియర్ న్యూరాలజిస్ట్ బి.చంద్రశేఖర్‌రెడ్డి, సైకియాట్రిస్ట్ నిశాంత్ వేమన తమ అభిప్రాయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. (corona virus: పండుగ ఊరేగింపులపై నిషేధం!) ఏకాగ్రత, జ్ఞాపకశక్తి తగ్గుతున్నాయి లాంగ్ కోవిడ్ బారినపడ్డవారిలో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు వస్తున్నాయి. ఏదైనా విషయాన్ని వెంటనే గుర్తు తెచ్చుకోలేకపోవడం, మర్చిపోవడం, ఆందోళన, కుంగుబాటు వంటివి కనిపిస్తున్నాయి. ఇది ‘బ్రెయిన్ ఫాగింగ్’కు దారితీసి.. మరిన్ని సమస్యలకు కారణమవుతోంది. నిద్ర సరిగా పట్టకపోవడం, గొంతు కండరాల సమస్య, గురక (ఓఏఎస్) వంటివి కూడా వస్తున్నాయి. కరోనా వచి్చనపుడు సరైన పోషకాహారం తీసుకోకపోవడం, దీర్ఘకాలం బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోవడం, బరువు పెరగడం, మానసిక ఆందోళనలకు లోనవడం కారణంగా లాంగ్ కోవిడ్ సమస్యలు పెరుగుతున్నాయి. నాడీ వ్యవస్థపై కరోనా ప్రభావం తక్కువే అయినా.. కొవిడ్ వ్యాక్సిన్‌తో కొందరిలో నరాల పైపొర దెబ్బతిని జీబీ సిండ్రోమ్ అనే వ్యాధి వస్తోంది. 90 శాతం మంది లాంగ్ కోవిడ్ సమస్యల నుంచి 6 నెలలలోగా కోలుకుంటున్నారు. మిగతావారు 9 నెలల నుంచి ఏడాదిలో కోలుకుంటున్నారు. – డాక్టర్ బి చంద్రశేఖర్‌రెడ్డి, న్యూరాలజిస్ట్, చైర్మన్ ఏపీ కొవిడ్ టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీ లాంగ్ కొవిడ్ సమస్య పెరిగింది కరోనాతో తీవ్రంగా ప్రభావితమైన వారితోపాటు ఆస్పత్రుల్లో చేరాల్సిన అవసరం రానివారు, స్వల్ప లక్షణాలతో కోలుకున్నవారు కూడా లాంగ్ కోవిడ్ సమస్యతో వైద్యుల వద్దకు వస్తున్నారు. నీరసం, నిస్సత్తువ, అయోమయంగా కనిపించడం, చురుకుదనం లేకపోవడం, త్వరగా అలసిపోవడం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జ్ఞాపకశక్తి కోల్పోవడం, యాంగ్జయిటీ, డిప్రెషన్‌కు గురైన వారికి కూడా మేం చికిత్స ఇస్తున్నాం. చాలా మంది త్వరగానే కోలుకుంటున్నారు. వంద మందికి కోవిడ్ వస్తే.. అందులో 30 శాతం మంది వివిధ రకాల లాంగ్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్నారని ఇది వరకే వెల్లడైంది. జూన్‌లో లాంగ్ కోవిడ్ బాధితులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఇప్పటికీ బాధితులు వస్తూనే ఉన్నారు. – డాక్టర్ నిశాంత్ వేమన, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, సన్‌షైన్ ఆస్పత్రి -
గాల్లో చక్కర్లు కొట్టిన ఎయిర్ ఇండియా స్పైస్ జెట్ విమానాలు
-
పొగమంచు.. గంట నుంచి గాల్లోనే విమానం చక్కర్లు
విజయవాడ: గన్నవరం విమానాశ్రయాన్ని పొగమంచు కప్పేయడంతో ల్యాండింగ్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ల్యాండింగ్‌కు అధికారులు సిగ్నల్ ఇవ్వకపోవడంతో గంట నుంచి స్పైస్ జెట్, ఎయిర్ ఇండియా విమానాలు గాల్లోనే చక్కర్లు కొడుతున్నాయి. 67 మంది ప్రయాణికులతో స్పైస్ జెట్ SG3417 విమానం బెంగుళూరు నుంచి గన్నవరంకు వచ్చింది. అయితే ల్యాండింగ్‌కు అంతరాయం ఏర్పడటంతో గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఢిల్లీ నుంచి గన్నవరం వచ్చిన ఎయ్ర్ ఇండియా విమానం సైతం పొగమంచు కారణంగా ల్యాండింగ్ అవ్వలేదు. దీంతో ప్రస్తుతం గన్నవరం ఎయిర్‌పోర్టు సమీపంలో ఈ రెండు విమానాలు గాల్లోనే చక్కర్లు కొడుతున్నాయి. సుమారు గంట పాటు గాల్లోనే చక్కర్లు కొట్టిన అనంతరం గన్నవరం ఎయర్‌పోర్ట్‌లో రెండు విమానాలు సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి. దాదాపు 4 రౌండ్లు అనంతరం ఢిల్లీ నుండి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం గన్నవరంలో ల్యాండ్ అయ్యింది. -
ఘోర విషాదం : పొగమంచు ఎంత పని చేసింది!
కోల్‌కతా : పొగమంచు కారణంగా పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయ్గురి జిల్లా ధూప్‌గురి నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 13 నిండు ప్రాణాలు బలవ్వటంతో పాటు మరి కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఓ ట్రక్కు రోడ్డును కప్పేసిన పొగమంచుతో దారి కనిపించక ఆటోను, కారును ఢీకొట్టింది. దీంతో 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు. 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. -
గన్నవరం విమానాశ్రయంలో పొగమంచు
సాక్షి, కృష్ణా: గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.పొగమంచు కారణంగా పలు విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. బెంగళూరు నుంచి గన్నవరం వచ్చిన స్పైస్ జెట్ విమానం దిగేందుకు విజుబుల్ లేకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయింది. హైదరాబాద్ నుంచి గన్నవరం రావాల్సిన ట్రూజెట్, ఇండిగో విమానాలు ఆలస్యంగా బయలుదేరాయి. ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం చుట్టపక్క గ్రామాలను పొగమంచు ఆవరించింది. ఉదయం 7 గంటల అయినా పొగమంచు వీడలేదు. రహదారులపై మంచుపడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
గన్నవరం విమానాశ్రయాన్ని కమ్మేసిన పొగమంచు
-
భారీ పొగమంచు, తప్పిన ఘోర రైలు ప్రమాదం
భువనేశ్వర్ : ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. భారీ పొగమంచు కారణంగా ముంబై-భువనేశ్వర్ లోక్మాన్య తిలక్ టెర్మినస్ (ఎల్టిటి) ప్రమాదానికి గురైంది. కటక్‌లోని సలాగావ్ -నెర్గుండి రైల్వే స్టేషన్ మధ్య గూడ్స్ రైలును ఢీకొట్టింది. దీంతో పట్టాలు తప్పి ఐదు బోగీలు పక్కకు ఒరిగాయి. ఈ ప్రమాదంలో 50 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ముంబై నుంచి భువనేశ్వర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పొగమంచు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారి జేపీ మిశ్రా తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కటక్‌లోని ఎస్సీబీ మెడికల్ ఆస్పత్రికి తరలించామన్నారు. సంబంధిత రైల్వే, అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలంలో సహాయకార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ ప్రమాదంపై ప్రభు త్రిపాఠి అనే ప్రయాణీకుడు ట్విటర్లో సమాచారం అందించారు. ఎల్టిటి ఎక్స్‌ప్రెస్ ప్రయాణీకులకు సంబంధించిన సమాచారం కోసం హెల్ప్‌లైన్ నంబర్- (0764) 1072 లేదా (0674), 1072 కు కాల్ చేయవచ్చని ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు సూచించారు. ఈ ప్రమాదంతో ఆ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుల నెదుర్కొన్నారు. @DRMKhurdaroad SOS Please send help to rescue passengers from train 12897,Coach B1 passengers — Prabhu Tripathy (@prabhu_tripathy) January 16, 2020 -
మంచు దుప్పటిలో రాజధాని : పలు రైళ్లు జాప్యం
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరాదిని పొగమంచు కమ్మేయడంతో ఢిల్లీ వెళ్లే పలు రైళ్ల రాకపోకల్లో తీవ్ర జాప్యం నెలకొంది. హైదరాబాద్-న్యూఢిల్లీ తెలంగాణ ఎక్స్‌ప్రెస్, ఫైజాబాద్-ఢిల్లీ ఎక్స్‌ప్రెస్‌లు ఆరు గంటలు ఆలస్యంగా నడుస్తాయని అధికారులు వెల్లడించారు. మరోవైపు మంగళవారం ఉదయం ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతాల్లో వాయు కాలుష్యం స్ధాయి ప్రమాదకర స్ధాయికి చేరడంతో వెరీపూర్ క్యాటగిరీగా నిర్ధారించారు. శీతలగాలులకు తోడు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ట్రాఫిక్ కష్టాలను మరింత పెంచాయి. పొగమంచు తాకిడితో రహదారులు, ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
వణికిస్తున్న చలి
-
జనవరి నెలలో పశువుల యాజమాన్యం
చలికాలం ముసుగుపోయి జనవరి మధ్యలో ఎండలు వెల్లిగా మొదలవుతాయి. పశువుల యాజమాన్యం గురించి జనవరి నెలలో కొన్ని మెలకువలను పాటించవలసి ఉంది. ► వేసవి మొదలు కావడంతో ముందుగా మనకు కానవచ్చేది పచ్చిమేత కొరత వర్షాకాలంలో, శీతాకాలంలో ఎక్కువగా లభ్యమయ్యే పచ్చిమేతను సైలేజీ గడ్డిగాను, ‘హే’గాను తయారు చేసుకునే సమయమిది. పాతర గడ్డిని తయారు చేసుకొని వేసవి సమయంలో పశువులకు మేపుకోవచ్చు. ► పశువులను పొగమంచు నుంచి రక్షించుకోవాలి. లేకపోతే న్యూమోనియా వస్తుంది. ► పశువు శరీరంలో తగినంత వేడిని పుట్టించడానికి ప్రొటీన్ కేకులు, బెల్లం కలిపి పశువుకు మేపాలి. ► ఖనిజాల లోపం రాకుండా పశువుల కొట్టాల్లో ఖనిజలవణ మిశ్రమ ఇటుకలను వేలాడదీయాలి. ► జనవరి నెలలో తప్పనిసరిగా నట్టల మందు తాపించాలి. ► బాహ్య పరాన్న జీవుల బెడద నుంచి కాపాడుకోవడానికి కొట్టాల్లో తులసి, లెమన్‌గ్రాస్ లాంటి మొక్కలను వేలాడదీయాలి. ఆ వాసనకు కొన్ని పరాన్న జీవుల నియంత్రణ జరుగుతుంది. ► ఈగలు వాలకుండా వేపనూనె సంబంధిత ద్రావకాలను షెడ్లలో పిచికారీ చేయాలి. ∙జీవాల వలస సమయలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కిందటి వారం ‘సాగుబడి’ శీర్షికలో ప్రచురితమైంది. ► పశువుల్లో గాలికుంటు, పి.పి.ఆర్., చిటుక వ్యాధికి టీకా వేయించాలి. ► పండ్ల తోటలున్న వారు, వారి తోటల్లో స్టైలో హెమాటా లాంటి పశుగ్రాసాలను సాగు చేసుకోవాలి. – డా. ఎం.వి.ఎ.ఎన్. సూర్యనారాయణ (99485 90506), ప్రొఫెసర్–అధిపతి, డిపార్ట్మెంట్ ఆఫ్ లైవ్ స్టాక్ ఫామ్ కాంప్లెక్స్, కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, తిరుపతి -
పొగమంచు కారణంగా నోయిడాలో ప్రమాదం
-
పొగమంచుతో ప్రమాదం: ఆరుగురు మృతి
నోయిడా: ఉత్తర ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దాన్కర్ ప్రాంతంలో మారుతి ఎర్టిగా కారు అదుపుతప్పి కెనాల్లో పడింది. ఈ ప్రమాదం ఆదివారం రాత్రి 11.30 గంటలకు ఢిల్లీకి వెళ్తుండగా జరిగినట్లు తెలుస్తోంది. ఈ కారులో 11 మంది ప్రయాణిస్తుండగా అందులో ఇద్దరు చిన్నారులతో పాటు, మరో నలుగురు మృతిచెందారు. మిగిలిన ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. పొగమంచు ఎక్కువగా ఉండటంతో రోడ్డుపై వెలుతురు తగ్గిపోటం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కారులో ప్రయాణించిన వారంతా ఉత్తరప్రదేశ్‌లోని సంబల్ జిల్లాకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
మంచుగుప్పిట బెజవాడ
-
పొగ.. ముంచు
సాక్షి, హైదరాబాద్ /విశాఖపట్నం: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో పొగమంచు ముంచెత్తుతోంది. సూర్యాస్తమయం నుంచి మరుసటిరోజు సూర్యోదయం వరకు దట్టంగా అలముకుంటోంది. దీంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగమంచు కారణంగా రోడ్డుపై వాహనాలను కూడా గుర్తించలేని పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని, వాహన చోదకులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇన్నాళ్లూ ఏజెన్సీ ప్రాంతాల్లోనే పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉండేది. కానీ మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు మైదాన ప్రాంతాల్లోనూ దాని తీవ్రత అధికమవుతోంది. నాలుగు రోజుల నుంచి తూర్పు గాలులు వీయడం మొదలయ్యాయి. దీంతో ఉపరితలానికి కిలోమీటరు ఎత్తులో ఉష్ణోగ్రతలు తగ్గడానికి బదులు పెరుగుతున్నాయి. దీనివల్ల నీటి ఆవిరి పైకి వెళ్లకుండా ఉపరితలంపైనే ఉండిపోయి పొగమంచు ఏర్పడుతోంది. అదే సమయంలో బలమైన గాలులు కూడా లేకపోవడం ఈ పరిస్థితికి కారణమని వాతావరణశాఖ రిటైర్డ్ అధికారి ఆర్. మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. రానున్న రెండ్రోజులు కోస్తాంధ్రలో పొగమంచు ఎక్కువగా కురుస్తుందని భారత వాతావరణ విభాగం ఆదివారం వెల్లడించింది. పొగమంచు వల్ల ప్రజలు జలుబు, తలనొప్పి, గొంతు, శ్వాసకోశ వ్యాధుల బారినపడే అవకాశం ఉందని, సాధ్యమైనంత వరకు పొగమంచు బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. 17 వరకు హైదరాబాద్‌లోనూ.. హైదరాబాద్‌లోనూ పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ నెల 17 వరకు రాత్రి వేళలతోపాటు ఉదయం 10 గంటల వరకు నగరంలో పొగమంచు తీవ్రత కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. అందువల్ల ప్రయాణికులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కాగా, హైదరాబాద్‌లో ఆదివారం 29.6 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదవగా 17.5 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే ఒక డిగ్రీ అదనం. -
గజ..గజ..గజ
9 డిగ్రీల కనిష్టస్థాయికి ఉష్ణోగ్రతలు l వణుకుతున్న జనం ∙పడిపోయిన పగటìజగిత్యాల/జగిత్యాలఅగ్రికల్చర్ చలి తీవ్రత రోజు..రోజుకు పెరిగిపోతోంది. రాత్రి వేళనే కాదు.. పగటి ఉష్ణోగ్రతలు సైతం పడిపోతున్నాయి. రాత్రి వేళనైతే కనిష్ట ఉష్ణోగ్రతలు 9 డిగ్రీలకు పడిపోయాయి. వారం రోజులుగా చలి తీవ్రత పెరగడంతో ఉదయం పది దాటందే జనం బయటకు రావడం లేదు. సాయంత్రం ఐదు గంటలు అయ్యిందంటే ఇళ్లకు చేరుకుంటున్నారు. 6 నుంచి 8 కి.మీ వేగంతో చలిగాలులు గంటకు 6 నుంచి 8 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ గాలులు జనవరి 2 వరకు ఉండే అవకాశం ఉంది. గరిష్ట(పగటి) ఉష్ణోగ్రతలు 27–29 డిగ్రీల సెల్సియస్ వద్ద, కనిష్ట(రాత్రి) ఉష్ణోగ్రతలు 11–12 డిగ్రీల సెల్సియస్ వద్ద కదలాడుతున్నాయి. గాలిలో తేమశాతం పెరిగింది, ఉదయం 50–62 శాతం, మధ్యాహ్నం 25–35 శాతంగా నమోదవుతున్నాయి. చలి తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా జిల్లా ప్రజానీకాన్ని అప్రమత్తం చేయాలని కలెక్టర్ శరత్ వైద్యాధికారులను ఆదేశించారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. చలి ప్రభావంతో స్వెట్టర్లకు భారీగా డిమాండ్ ఏర్పడింది. ఒక్కో స్వెట్లర్ మొన్నటి వరకు రూ.300 నుంచి రూ.350 ఉండగా, ప్రస్తుతం రూ.400కు విక్రయిస్తున్నారు. చలితో వరినారుకు కష్టం రెండు రోజుల పాటు చలి ప్రభావం ఎక్కువగా ఉండడంతో వరినారుకు ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉందని పొలాస వ్యవసాయ వాతావరణ శాస్త్రవేత్త ఉమారెడ్డి తెలిపారు. ఇందుకోసం వరి నారు మడిలో రాత్రి వేళలో నీరు తీసి ఉదయాన్నే నీరు పెట్టాలని కోరారు. వరినారుపై రాత్రి వేళల్లో కవర్లు కప్పి, ఉదయం తీసివేస్తే చలి ప్రభావానికి గురికాకుండా ఉంటుందన్నారు. చలిపై అప్రమత్తం చలితీవ్రత నుంచి ప్రజలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలన్న కలెక్టర్ శరత్ ఆదేశాలతో వైద్యశాఖ కదిలింది. చలి వల్ల కలిగే నష్టాల గురిం చి అవగాహన కల్పించేందుకు వైద్యాధికారులు ప్రణాళికలు తయారు చేశారు. డీఎంహెచ్‌వో శ్రీధర్ ఆధ్వర్యంలో ప్రజా ఆరోగ్య రక్షణలో భాగం గా చర్యలు చేపట్టారు. చలికాలంలో వచ్చే అనారోగ్య సమస్యలు, నివారణ చర్యలు, పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. వచ్చే వ్యాధులు జలుబు, ఆయాసం, ఆస్తమ, ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందిగా ఉండడం, పిల్లికూతలు, జ్వరం, దగ్గు, ఒల్లునొప్పులు, కళ్ల నుంచి నీరుకారడం, చెవినొప్పి, చెవి నుంచి చీము కారడం, చర్మం పొడిబారడం, డొక్కలు ఎగురవేయడం వంటి సమస్యలు వస్తాయి. చలి నుంచి ఇలా కాపాడుకోవాలి మంచు పడుతున్న సమయంలో బయటకు పోరాదు. స్వెట్టర్లు, మఫ్లర్లు ధరించాలి. చెవులలోకి గాలి వెళ్లకుండా వస్త్రధారణ చేసుకోవాలి. వేడి ఆహారపదార్థాలు తీసుకోవాలి. గోరువెచ్చని నీరు తాగాలి. చర్మం పొడిబారకుండా ఏదైన లేపనం, కొబ్బరినూనె, వ్యాజిలెన్ రాసుకోవాలి. చిన్నపిల్లలకు శరీర ఉష్ణోగ్రతలు తగ్గిపోకుండా ఉన్ని దుస్తులు వేయాలి. గర్భిణులు చాలా జాగ్రత్తగా ఉండాలి. -
దట్టమైన పొగమంచు.. ఏడుగురు దుర్మరణం
చంఢీగడ్: రహదారిని కమ్మెసిన దట్టమైన పొగమంచు ఏడుగురిని బలితీసుకుంది. అంబలా, చంఢీగడ్ జాతీయ రహదారిపై శనివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పొగమంచు జాతీయ రహదారిని కమ్మివేయడంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొని మరో వాహనంపైకి దూసుకుపోయ్యాయి. మృతులంతా చంఢీగడ్‌కు చెందిన వారిగా గుర్తించారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. కాగా పొగమంచు కారణంగా సోమవారం ఛండీగడ్లోనే జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది మృతిచెందిన విషయం తెలిసిందే. గత వారం రోజులుగా ఉత్తర భారతాన్ని పొగమంచు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మంచు కారణంగా ఎదురుగావచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు చేసుకుంటున్నాయి. -
ఉత్తర భారతదేశంలో తీవ్ర పొగమంచు
-
కమ్మేసిన పొగమంచు
సాక్షి, ఢిల్లీ: ఉత్తర భారతదేశంలో పొగమంచు తీవ్ర ప్రభావం చూపుతోంది. దీని వల్ల సాధారణ ప్రజలే గాక వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీ విమానశ్రయం నుంచి విమానాల రాకపోకలకు నిలిచిపోయ్యాయి. పలు విమానాలు ఆలస్యంగా బయలుదేరుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోయ్యాయి. గడిచిన మూడు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. పొగమంచు కారణంగా సోమవారం హర్యానాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురికిపైగా మృతి చెందిన విషయం తెలిసింది. ప్రధాన రోడ్లను సైతం మంచు కప్పివేయడంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక ప్రమాదాలకు దారితీస్తున్నాయి. గడిచిన మూడురోజుల నుంచి చలికి ఉత్తర భారతం వణుకుతోంది. -
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను కమ్మేసిన పొగమంచు
సాక్షి, హైదరాబాద్: పెథాయ్ ప్రభావంతో తెలంగాణలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. హైదరాబాద్ నగర శివార్లలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు అలుముకుంది. దీంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాతావరణం అనుకూలించకపోవడంతో హైదరాబాద్ నుంచి బయలుదేరాల్సిన పలు విమానాలు ఆలస్యంగా నుడుస్తున్నాయి. మరికొన్నింటిని బెంగళూరుకు మళ్లించారు. -
విజయవాడలో దట్టమైన పొగమంచు
-
బెజవాడను కమ్మేసిన పొగమంచు
సాక్షి, విజయవాడ : విజయవాడను మంచు దుప్పటి కప్పేసింది. తెల్లవారుజాము నుంచి దట్టమైన పొగమంచు విజయవాడతో పాటు పరిసర ప్రాంతాలను ముంచేసింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వేకువజామునే రోజు వారి కార్యక్రమాలు, జాగింగ్ చేసే పాదచారులు సైతం ఇబ్బందులు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పొగమంచు తీవ్రంగా అలముకోవడంతో కొన్ని చోట్ల వాహనదారులు ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక జారి కింద పడ్డారు. విమానాల రాకపోక ఆలస్యం : గన్నవరం విమానాశ్రయంలో పొగమంచు దట్టంగా అలముకుంది. దీంతో పలు విమానాల రాకపోకలు ఆలస్యం అవుతున్నాయి. హైదరాబాద్, బెంగుళూరు నుంచి రావాల్సిన స్పైస్‌జెట్, ఇండిగో, హైదరాబాద్ నుంచి రావాల్సిన ట్రూజెట్ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఢిల్లీలో పొగమంచు.. 22 రైళ్లు రద్దు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో పొగమంచు దట్టంగా అలుముకుంది. సమీప దూరంలోని వస్తువులు, వాహనాలు కనిపించకపోవడంతో వాహనదారులు లైట్లు వేసుకుని నడపాల్సి వస్తున్నది. అలాగే పొగమంచు కారణంగా 22 రైళ్లను రద్దు చేయగా 32 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. రెండు రైళ్ల వేళల్లో మార్పులు చేశారు. -
మంచు.. వాహనం ఢీకొని సైక్లిస్టు దుర్మరణం
సాక్షి, చిట్యాల: మంచు కారణంగా రహదారిపై ముందు ఉన్నది ఏదీ కనిపించని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో వాహనం ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని గుండ్రంపల్లిలో జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగింది. సైకిల్‌పై వెళుతున్న యువకుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొనగా అతను అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడిని కంకల వెంకటేశ్(30)గా గుర్తించారు. -
చెన్నైకి ఫ్లైట్‌లో వెళుతున్నారా...అయితే
సాక్షి, చెన్నై: దేశప్రజలంతా సంక్రాంతి ఉత్సాహంతో ఉరకలేస్తోంటే.. చెన్నై విమానాలు మాత్రం గాల్లోకి ఎగరలేక తెల్లబోవడంతోవిమాన ప్రయాణీకులు మాత్రం ఉసూరుమంటున్నారు. దట్టమైన పొగ కారణంగా దాదాపు 10 విమానాలు టేక్‌ఆఫ్‌లు, లాండింగ్‌లు నిలిచిపోయాయి. మరికొన్నింటిని దారి మళ్లించారు. చెన్నైనుంచి బయలు దేరాల్సిన కొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దాదాపు 18 విమానాలను హైదరాబాద్, బెంగళూరు వైపు మళ్లించారు. చెన్నై నగరంలో ‘భోగి’ మంటల వల్ల వ్యాపించిన దట్టమైన పొగతో ఎయిర్‌క్వాలిటీ, రన్‌వే విజిబిలిటీ దారుణంగా పడిపోవడంతో ప్రయాణీకుల ఆందోళన నెలకొంది. విమానాశ్రయ సీనియర్ అధికారి మాట్లాడుతూ రన్‌వే దృశ్యమానత 50 మీటర్లకు పడిపోయిందనిచెప్పారు. ఉదయం మూడున్నరనుంచి తమకు విమాన కార్యకలాపాలు నిలిచిపోయాయి. మరికొన్ని గంటల్లో పరిస్థితి చక్కబడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు తనకు ముంబైలో చాలా ముఖ్యమైన బిజినెస్ మీట్ వుందంటూ భరత్ జైన్ వాపోయారు. చెన్నైకు భోగి మంటలు ఒక ఛాలెంజ్‌గా నిలుస్తున్నాయని మరో సీనియర్ అధికారి తెలిపారు. గతపదేళ్లుగా ఈ విషయంలో కాలుష్య నియంత్రణ బోర్డు తమిళనాడులో అవగాహన పెంచుతోందన్నారు. ఇది ఇలా ఉంటే.. చెన్నై, చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు భోగి సంబరాలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. తెల్లవారుఝామునుంచే సందడి మొదలైంది. పాత బట్టలు, వస్తువులను తగలబెట్టడం శుభాన్నిస్తుందని , అంతేకాదు భోగిమంటలు గాలిని శుభ్రం చేస్తాయని స్థానికుడు కరుప్పన్ సంతోషంగా చెప్పారు. తమిళ సంస్కృతిలో 'భోగీ' ముఖ్య పాత్ర పోషిస్తుందని, ఈపొగ గాలిని కలుషితం చేస్తుందని తెలుసు.. అందుకే తాము ప్లాస్టిక్స్ , టైర్లను నివారిస్తామని చెన్నైవాసి శరవణన్ వివరించారు. -
ఢిల్లీలో విమానాలకు పొగమంచు దెబ్బ
న్యూఢిల్లీ: దేశరాజధానిలో ఆదివారం ఉదయం భారీగా పొగమంచు కురిసింది. దీంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 350కిపైగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దట్టంగా అలుముకున్న పొగమంచు ప్రభావంతో 270 విమానాలు ఆలస్యంగా నడవగా, 50 విమానాలను అధికారులు దారి మళ్లించారు. దీంతోపాటు మరో 35 విమానాలను రద్దుచేశారు. పొగమంచు దెబ్బకు దాదాపు 50 మీటర్లలోపు ఉన్న రన్‌వే మాత్రమే కన్పించడంతో.. కేటగిరీ 3బీ సాంకేతికతతో కొన్ని విమానాల రాకపోకల్ని కొనసాగించారు. -
పొగమంచుతో విమానాల ల్యాండింగ్‌కు అంతరాయం
విమానాశ్రయం (గన్నవరం): పొగమంచు కారణంగా విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో మంగళవారం పలు విమానాల ల్యాండింగ్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో విమానాలు అరగంటపాటు గాల్లోనే చక్కర్లు కొట్టాయి. తెల్లవారుజాము నుంచి గన్నవరం విమానాశ్రయంలో రన్‌వేని పూర్తిగా పొగ మంచు కప్పేయడంతో ఉదయం 8.00 గంటలకు హైదరాబాద్ నుంచి వచ్చిన ట్రూజెట్ విమానం ల్యాండింగ్‌కు ఇబ్బంది ఏర్పడింది. అదే సమయంలో బెంగళూరు నుంచి వచ్చిన స్పైస్‌జెట్ విమానం, వైజాగ్ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానాలకు కూడా ల్యాండింగ్ సమస్య ఎదురవడంతో అరగంటకుపైగా గాలిలోనే చక్కర్లు కొట్టాయి. తర్వాత మంచు తీవ్రత తగ్గడంతో విమానాలను సురక్షితంగా ల్యాండ్ చేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడ రావాల్సిన స్పైస్‌జెట్ విమానం సుమారు గంటన్నర ఆలస్యంగా 10.30 గంటలకు చేరుకుంది. గత మూడ్రోజులుగా పొగమంచు వల్ల విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
కృష్ణా జిల్లాలో పలుచోట్ల పొగమంచు
సాక్షి, నందిగామ: కృష్ణాజిల్లాలో పలుచోట్ల పొగమంచు దట్టంగా అలుముకుంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే గన్నవరం విమానాశ్రయానికి విమాన రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. నందిగామ పరిసరాలను దట్టమైన పొగమంచు ఆవరించింది. 65వ నంబర్ జాతీయ రహదారిపై పొగమంచు తెరలుతెరలుగా రావడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దారి కనబడక వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఎండ వచ్చేవరకు వాహనాలను రోడ్డు పక్కన నిలిపివేస్తున్నారు. ఉదయం 8 గంటలు దాటినా పొగమంచు వీడలేదు. మార్నింగ్ వాక్కు వెళ్లేవారు, పసిపిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. గన్నవరంలోనూ.. గన్నవరం పరిసర ప్రాంతాల్లోనూ పొగమంచు ఆవరించింది. ఎయిర్‌పోర్టులో దట్టమైన పొగమంచు కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. బెంగళూరు, హైదరాబాద్ నుంచి రావాల్సిన స్పైస్ జెట్ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. -
పొగమంచు కారణంగా పలు రైళ్ల రద్దు
న్యూఢిల్లీ : రాజధాని ఢిల్లీని మంగళవారం పొగమంచు కప్పేయడంతో పలు రైళ్లు రద్దు అయ్యాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మంగళవారం ఉదయం 9.6 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగ మంచు దట్టంగా కమ్ముకోవడంతో దారి కనిపించక 18 రైళ్లను రద్దు చేశారు. మరో 28 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీలో పాక్షికంగా వాతావరణం మేఘావృతం అయిందని ఇండియన్ మెటరాలాజికల్ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు. ఉదయం ఎనిమిదిన్నర సమయానికి గాలిలో తేమ 78 శాతంగా నమోదైందని, అలాగే విసిబిలిటీ 1500 మీటర్లుగా ఉందని అధికారులు వెల్లడించారు. ఢిల్లీ గరిష్ట ఉష్ణోగ్రతలు 25.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైందని తెలిపారు. -
దట్టంగా పొగమంచు.. ట్రాఫిక్ అంతరాయం
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాలలో పొగమంచు దట్టంగా అలుముకుంది. వెలుతురు సరిగా లేని కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. నల్గొండ జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో విజయవాడ-హైదరాబాద్ హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మరోవైపు హైదరాబాద్ నగరం మంచు దుప్పటితో మూసుకుపోయింది. నగర్ శివారు ప్రాంతం హయత్ నగర్ పరిసర ప్రాంతాలు ఉదయం తొమ్మిది గంటలు దాటిన తరువాత కూడా సూర్యుడు రాకుండా మంచుతో నిండి ఉండటంతో జాతీయ రహదారి పై వెళ్లే వాహనదారులకి ముందుగా వెళుతున్న వాహనాలు కనపడక తీవ్ర ఇబ్బంది పడుతూ వాహనాలకు లైట్లు వేసుకొని వెళ్ల వలసిన పరిస్థితి ఏర్పడింది. అయితే గత వారం పది రోజుల నుండి చలి బాగా పెరగటంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తుంది. -
వదల బొమ్మాళీ..వదల..!
సాక్షి, న్యూఢిల్లీ:దేశ రాజధాని నగరంలో వరసగా మూడోరోజు కూడా కాలుష్యపొగ కమ్మేసింది. విషవాయువుల కౌగిలిలో ఢిల్లీ అతలాకుతలమవుతోంది. కాలుష్యస్థాయి ప్రమాదకరస్థాయిని మించి నమోదైందని తాజా రిపోర్టులు వెల్లడించాయి. ఈ రోజుకూడా మరింత భయానక పరిస్థితి కొనసాగనుందని హెచ్చరించాయి. వదల బొమ్మాళీ.. అంటూ వెంటాడుతున్న కాలుష్య భూతాన్ని తలుచుకొని ఢిల్లీ జనం బిక్కు బిక్కుమంటోంది. రోడ్లపైకి రావాలంటేనే జంకుతున్నారు. వరుసగా మూడోరోజుకూడా ఇదే పరిస్థితి కనిపిస్తుండటంతో మరింత ఆందోళన చెలరేగింది. అటు వెన్నులో వణుకుపుట్టించే చలి..ఇటు గుండెల్లో దడ పుట్టిస్తున్న కాలుష్యం...ఇదీ ఢిల్లీ మహానగర పరిస్థితి. దీంతో ఢిల్లీ సర్కార్‌పై ఒత్తిడి మరింత పెరుగుతోంది. అటు ప్రయివేటు వాహనాలను చాలా తగ్గించాలని, కాలుష్య నివారణకు తక్షణమే చర్యలు చేపట్టాలని గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. అలాగే సరి-బేసి స్కీమ్‌ను మళ్లీ ప్రవేశపెట్టాలని కోరింది. దీనిపై ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం ఎప్పటికపుడు పరిస్థితిని సమీక్షిస్తోంది. వ్యక్తిగత వాహనాలపై ఆంక్షలు, ప్రభుత్వ స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. అయితే మరోవైపు కాలుష్య కాసారంలో చిక్కుకున్న ఢిల్లీ నగరాన్ని రక్షించే చర్యలు, ఆడ్-ఈవెన్ స్కీమ్‌పై లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ఈ రోజు నిర్ణయం తీసుకోనున్నారు. అటు హర్యానా,పంజాబ్ రాష్ట్రాలు కూడా త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నాయి. మరోవైపు ధూమపానానికి స్వస్తి చెప్పాలని నీళ్లు ఎక్కువగా తాగాలని ప్రముఖ వైద్యులు ప్రజలకు సూచిస్తున్నారు. బయటికి తిరగవద్దని, ఏమాత్రం శ్వాస ఇబ్బంది అనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలని ఢిల్లీ వైద్య బృందం హెచ్చరికలు జారీ చేసింది. దట్టంగా పొగమంచు ఢిల్లీని కప్పివేయడంతో పలురైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. -
ఈ నగరానికి ఏమైంది?
-
ల్యాండింగ్ ట్రబుల్.. గాలిలో హైదరాబాద్ విమానం!
-
ల్యాండింగ్ ట్రబుల్.. గాలిలో హైదరాబాద్ విమానం!
గన్నవరం: భారీగా పొగమంచు కమ్ముకోవడంతో కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో గురువారం ఉదయం పలు విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పొగమంచు కారణంగా వాతావరణం తీవ్ర ప్రతికూలంగా ఉండటంతో విమానాల ల్యాండింగ్ కష్టంగా మారింది. దీంతో ఇప్పటికే గన్నవరం ఎయిర్పోర్ట్ చేరిన హైదరాబాద్ ట్రుజెట్ విమానం ల్యాండింగ్ సమస్యతో గాలిలో చక్కర్లు కొడుతోంది. ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిరిండియా విమానం కూడా ల్యాండింగ్ ట్రబుల్ ఎదురవ్వడంతో గాలిలోనే తిరుగుతోంది. -
28 రైళ్లు ఆలస్యం..10 రైళ్ల వేళల్లో మార్పులు
ఢిల్లీ: దేశ రాజధానిని దట్టమైన పొగమంచు కప్పేసింది. పొగమంచు కారణంగా వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఢిల్లీ మీదుగా ప్రయాణిస్తున్న 28 రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా.. మరో 10 రైళ్ల వేళల్లో మార్పులు చేశారు. దీంతో పాటు ఒక రైలును రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. -
12 పసిప్రాణాలు బలి
► ఉత్తరప్రదేశ్‌లో లారీ, బస్సు ఢీ ►పొగమంచు, అతివేగం వల్లే.. ఎటా(ఉత్తరప్రదేశ్): ప్రతీరోజు లాగే ఆరోజు కూడా స్కూలు బస్సెక్కారు పిల్లలు. కానీ పాఠశాలకు చేరాల్సిన వారి గమ్యస్థానం ఆసుపత్రులకు, మార్చురీలకు చేరింది. ఎంతో సున్నితమైన చిన్నారుల శరీరాలు బస్సులో ఛిద్రమైపోయాయి. పాఠశాలలో ఆటపాటలతో కేరింతలు కొట్టాల్సిన వారు, భయంతో ఆర్తనాదాలు చేయాల్సి వచ్చింది. పొగమంచు, అతి వేగం, యాజమాన్య నిర్లక్ష్యం కలసి 12 మంది విద్యార్థుల ప్రాణాలను బలి తీసుకున్నాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎటా జిల్లాలోని అలీగంజ్–పాలియాలి రహదారిపై గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి చెందగా.. 20 మంది విద్యార్థులు గాయపడ్డారు. మృతుల్లో 12 మంది బాలలు, బస్సు డ్రైవర్ ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చలి అత్యధికంగా ఉండటంతో పాఠశాలలకు సెలవివ్వాలన్న జిల్లా మేజిస్ట్రేట్ ఉత్తర్వులను ధిక్కరిస్తూ స్థానిక జేఎస్ విద్యానికేతన్ తరగతులు నిర్వహిస్తోంది. ఈ పాఠశాలకు చెందిన బస్సు 66 మంది చిన్నారులతో వెళు్తండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ఘటన కు పొగమంచు, అతి వేగమే కారణమని అధికారులు చెబుతున్నారు. మరణించిన విద్యార్థులంతా 5–15 ఏళ్ల విద్యార్థులు కావడంతో ఘటనా స్థలంలో, ఆస్పత్రిలో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ‘ఈ ఘటన తెలిసిన వెంటనే ఎంతో ఆవేదన చెందాను. చనిపోయి న బాలల కుటుంబాల బాధను నేనూ పంచుకుంటున్నాను. మృతి చెందిన చిన్నారులకు నివాళులు’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. -
పొగమంచు.. వాహనదారులకు ఇక్కట్లు
హైదరాబాద్: నగర శివారు ప్రాంతంలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ముఖ్యంగా ఎల్బీనగర్ నుంచి పెద్దఅంబర్‌పేట దరకు పొగమంచు కమ్మేసింది. పొగమంచు కారణంగా రోడ్డు స్పష్టంగా కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగర ఇతర శివారు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి తలెత్తినట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో నెలకొన్న వాతావరణ పరిస్థితులు ప్రస్తుతం హైదరాబాద్‌లోనూ నెలకొంటున్నాయని అధికారులు అంటున్నారు. -
ఆలస్యంగా నడుస్తున్న 70 రైళ్లు
న్యూఢిల్లీ: ఉత్తరాదిలో పొగమంచు కమ్మేసింది. దట్టమైన పొగమంచు కారణంగా పలు రైళ్ల సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఏడు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వేశాఖ ప్రకటించింది. మరో 70 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే మరో 22 రైళ్లు రీషెడ్యూల్ చేసినట్లు వెల్లడించింది. రద్దు చేసిన ఏడు రైళ్లలో ఇవాళ, రేపు బయలుదేరాల్సి ఉంది. రద్దైన రైళ్లలో వారణాసి– జోధ్‌పూర్, న్యూఢిల్లీ–వారణాసి కాశీ విశ్వనాథ్, డెహ్రాడూన్–హౌరా ఉపాసన ఎక్స్‌ప్రెస్, న్యూఢిల్లీ– రాజధాని ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి. అలాగే ఢిల్లీ జంక్షన్– మల్దా టౌన్ ఫరక్కా ఎక్స్‌ప్రెస్, న్యూఢిల్లీ– పూరీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొంది. మరోవైపు పొగమంచు ప్రభావం విమాన సర్వీసుల మీద ప్రభావం చూపుతోంది. గత కొన్ని రోజులనుంచి పలు ఢిల్లీ రైలు సర్వీసులకు, విమాన సర్వీసులకు సమస్యలు తలెత్తుతున్న విషయం తెలిసిందే. -
పొగమంచు ఎఫెక్ట్: 69 రైళ్లు ఆలస్యం
ఢిల్లీ: దట్టమైన పొగమంచు కారణంగా పలు రైళ్ల సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీకి 69 రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా, మరో 16 రైళ్ల వేళలలో మార్పులు చేశారు. కాగా, 4 రైళ్ల సర్వీసులను రైల్వే అధికారులు రద్దుచేశారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఉదయం రన్ వే సరిగా కనిపించడం లేని అధికారులు చెప్పారు. పొగమంచు కారణంగా 9 అంతర్జాతీయ, 3 డొమెస్టిక్ విమాన సర్వీసులు ఆలస్యం కానున్నాయి. ఒక అంతర్జాతీయ, రెండు డొమెస్టిక్ విమాన సర్వీసులను రద్దు చేశారు. గత కొన్ని రోజులనుంచి పలు ఢిల్లీ రైలు సర్వీసులకు, విమాన సర్వీసులకు సమస్యలు తలెత్తుతున్న విషయం తెలిసిందే. -
చలి గుప్పెట్లో తెలంగాణ రాష్ట్రం
-
వణుకుతున్న రాష్ట్రం
► ఆదిలాబాద్‌లో 7 డిగ్రీలు ► మెదక్‌లో 10 డిగ్రీలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాత్రి పూట చలి వాతావరణం కొనసాగుతోంది. పగలు మాత్రం సాధారణం కంటే కాస్తంత ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, హైదరాబాద్, ఖమ్మం, నల్లగొండ, మెదక్, రామగుండంలలో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే గణనీయంగా పడిపోయాయి. గత 24 గంటల్లో ఆదిలాబాద్‌లో 7 డిగ్రీలు, మెదక్‌లో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఖమ్మంలో సాధారణం కంటే ఐదు డిగ్రీలు తక్కువగా 12 డిగ్రీలు, హైదరాబాద్‌లో 3 డిగ్రీలు తక్కువగా 12 డిగ్రీలు, రామగుండంలో 4 డిగ్రీలు తక్కువగా 11 డిగ్రీలు, నల్లగొండలో 3 డిగ్రీలు తక్కువగా 15 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అన్ని ప్రాంతాల్లోనూ పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగానే రికార్డయ్యాయి. మహబూబ్‌నగర్‌లో 4 డిగ్రీలు ఎక్కువగా 34 డిగ్రీలు, మెదక్‌లో 3 డిగ్రీలు ఎక్కువగా 32 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో నాలుగు రోజులపాటు రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. -
బస్సు నుంచి పొగలు..తప్పిన ప్రమాదం
జడ్చర్ల(మహబూబ్‌నగర్ జిల్లా): జడ్చర్ల మండలం మాచారం సమీపంలో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు నుంచి దట్టమైన పొగలు వెలువడ్డాయి. బస్సు డ్రైవర్ అప్రమత్తమై బస్సు నిలిపివేసి ఉద్యోగులను దించివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదసమయంలో బస్సు జడ్చర్ల నుంచి పోలేపల్లి ఫార్మా సెజ్‌కు వెళ్తోంది. షార్ట్ సర్క్యూట్ వల్లే పొగలు వచ్చినట్లు తెలుస్తోంది. ఘటన జరిగినపుడు బస్సులో 50 మంది ఉన్నారు. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. -
ఆరు గంటలు ఆలస్యంగా రైళ్లు
రామగుండం: న్యూఢిల్లీలో పొగమంచు కారణంగా బుధవారం రాత్రి ఢిల్లీ నుంచి చెన్నై వైపు వెళ్లే రైళ్లు ఆరు గంటల ఆలస్యంగా నడుస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఆలస్యంగా నడుస్తున్న వాటిలో గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్ (జీటీ), తెలంగాణ ఎక్స్‌ప్రెస్, దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ తదితర సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లున్నారుు. -
అక్కడి నుంచి అన్ని విమానాలు రద్దు
శ్రీనగర్: వరుసగా రెండో రోజు జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది. పొగమంచు దట్టంగా అలముకోవడంతో సోమవారం అన్ని విమాన సర్వీసులను రద్దు చేసినట్టు ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. పొగమంచు కారణంగా వెలుతురు మందగించడంతో విమానాలను రద్దు చేసినట్టు చెప్పారు. ప్రతికూల వాతావరణంతో ఆదివారం కూడా విమాన సర్వీసులకు ఆటంకం ఏర్పడింది. అంతకుముందు రోజు కూడా పలు సర్వీసులకు అంతరాయం కలిగింది. పరిస్థితిని సమీక్షించి విమాన సర్వీసుల పునరుద్దరణపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు. రానున్న 24 గంటల్లో పొగమంచు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో విమాన ప్రయాణికులకు మరిన్ని రోజులు ఇబ్బందులు తప్పకపోవచ్చని అధికారులు అంటున్నారు. -
మన్యంలో మంచు దుప్పటి
విశాఖ మన్యంలో చలి పులి అప్పుడే గజగజ వణికిస్తోంది. నాలుగు రోజలుగా వేకువజామున నాలుగు గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు మంచు వీడటం లేదు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఉదయం 9గంటల వరకు హెడ్లైట్ల వెలుగులోనే వాహనదారులు నెమ్మదిగా ముందుకు సాగుతున్నారు. పల్లెజనం చలి నెగళ్లను ఆశ్రయిస్తున్నారు. -
మంచుకురిసే వేళలో..
చిత్తూరు జిల్లాలోని పర్యాటక కేంద్రం హార్సిలీకొండను మూడురోజులుగా మంచు తెర కప్పేస్తోంది. వాతావరణం మారడంతో రోజూ చిరుజల్లుల వర్షం కురుస్తోంది. పర్యాటకులు, స్థానికులు రోడ్లపై నడుస్తుంటే మబ్బుల్లో తేలిపోతున్న అనుభూతికి లోనవుతున్నారు. వాహనాలు పగలే లైట్లు వేసుకొని వెళ్లాల్సివస్తోంది. ఎదురుగా పర్యాటకులు నడచివెళ్తున్నా కనిపించని పరిస్థితి నెలకొంది. లోతైన లోయలు, ప్రకృతి అందాలకు నెలవైన కొండపై ఇప్పుడు చలి అధికమైంది. ఈ వాతావరణం కొండకు కొత్త అందాలు తెచ్చిపెట్టగా పర్యాటకుల ఆహ్లదకరమైన వాతావరణ ం ఆస్వాదిస్తున్నారు. ––బి.కొత్తకోట -
పొగమంచులోనూ స్పష్టంగా చూడొచ్చు
న్యూఢిల్లీ: శీతాకాలం పొగమంచులో కూడా రైల్వే డ్రైవర్లు స్పష్టంగా చూసేలా ఇంజిన్లలో ఆధునిక పరికరాన్ని ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది. త్రినేత్ర అనే ఈ కొత్త వ్యవస్థతో డ్రైవర్లు ప్రతికూల వాతావరణంలో ట్రాక్‌ను స్పష్టంగా చూడగలరు. ముందున్న ప్రాంతాన్ని చిత్రీకరించడం, రాడార్ వ్యవస్థ సాయంతో ఈ పరికరం పనిచేస్తుందని రైల్వే శాఖ అధికారి ఒకరు తెలిపారు. దీంతో స్టేషన్ లేదా, సిగ్నల్‌కు ఎప్పుడు చేరేది డ్రైవర్ కచ్చితంగా తెలుసుకునే అవకాశముంటుంది. తిన్నగా ఉన్న ట్రాక్‌పై కిలోమీటరు దూరంలోని వస్తువుల్ని కూడా డ్రైవర్ చూడవచ్చు. -
వేసవిలో దట్టంగా కమ్ముకున్న పొగమంచు
విజయనగరం జిల్లా పార్వతీపురంలో సోమవారం తెల్లవారుజామన చిత్రమైన దృశ్యం ఆవిష్కృతమైంది. మండు వేసవిలో దట్టమైన పొగమంచు ఆవరించడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. కనీసం 20 అడుగుల దూరంలోని వారు కూడా కనిపించని స్థాయిలో పొగమంచు నెలకొంది. ఉదయం 7.30 గంటల వరకు ఇదే పరిస్థితి ఉంది. పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలు మందగించాయి. -
పొగమంచుతో 45 రైళ్లు రద్దు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దట్టమైన పొగమంచు కారణంగా మంగళవారం 45 రైళ్లను రద్దు చేశారు. మరో 30 రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా, కొన్ని రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు చేసినట్టు ఉత్తరాది రైల్వే తెలిపింది. ఈ రోజు ఉదయం ఢిల్లీలో 6.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ రోజు ఆకాశం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఢిల్లీలో పొగమంచు కారణంగా ఇటీవల రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. -
18 రైళ్లు రద్దు, మరో 20 ఆలస్యం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం ఉదయం పొగమంచు దట్టంగా ఆవహించడంతో రైళ్లు, విమానాల రాకపోలకు అంతరాయం ఏర్పడింది. ఉత్తరాది రైల్వే 18 రైళ్లను రద్దు చేసింది. మరో 20 రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా, 7 రైళ్ల ప్రయాణ వేళలను మార్చారు. మంచు కారణంగా ఏడు విమానాల రాకపోకలపైనా ప్రభావం చూపించింది. ఈ రోజు ఉదయం ఢిల్లీలో 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇటీవల ఢిల్లీలో పొగమంచు కారణంగా రైళ్లు, విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్న సంగతి తెలిసిందే. -
పొగ మంచుతో రైళ్ల రాకపోకలకు అంతరాయం
న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశంలో చలి మరింత పెరిగిపోతోంది. దట్టమైన పొగమంచు కారణంగా అక్కడ 18 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని రైల్వేశాఖ అధికారులు తెలిపారు. పగటిపూట అధికంగా 17 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా, ఉదయం వేళల్లో అత్యల్పంగా 6.9 డిగ్రీలే ఉంటుందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. -
మంచు కారణంగా 12 రైళ్లు ఆలస్యం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పొగమంచు కారణంగా 12 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. బుధవారం ఉదయం ఢిల్లీలో మంచు దట్టంగా ఆవహించింది. హౌరా-దురంతో, గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు కనీసం 12 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్టు ఉత్తర రైల్వే తెలిపింది. మంగళవారం ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 15.7 డిగ్రీలు నమోదైంది. ఈ రోజు గరిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీలు నమోదు కావచ్చని వాతావరణ శాఖ తెలియజేసింది. మంచు ప్రభావం మధ్యాహ్నానికి తగ్గుతుందని వెల్లడింది. -
పొగమంచు కారణంగా 89 రైలు సర్వీసులు రద్దు
-
పొగమంచు కారణంగా 89 రైలు సర్వీసులు రద్దు
న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశంలో చలి మరింత పెరిగిపోతోంది. దట్టమైన పొగమంచు కారణంగా అక్కడ 89 రైలు సర్వీసులను రద్దు చేసినట్లు రైల్వేశాఖ అధికారులు తెలిపారు. చలి తీవ్రతకు తట్టుకోలేక బుధవారం రాజస్థాన్‌లో ఇద్దరు వ్యక్తులు మృతిచెందినట్లు వివరించారు. ఢిల్లీకి వెళ్లే 9 రైళ్లను రద్దుచేశారు. గౌహతి రాజధాని ఎక్స్‌ప్రెస్, విక్రమశిలా ఎక్స్ ప్రెస్, మగధ ఎక్స్ ప్రెస్ రైలు సర్వీసులను నిలిపివేశారు. పగటిపూట అధికంగా 23 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా, ఉదయం వేళల్లో 12 డిగ్రీలే ఉంటుందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ లో అత్యల్పంగా 7.8 డిగ్రీలు ఉండగా, అజ్మీర్, జోధ్‌పూర్ 15.1 డిగ్రీల ఉష్ణోగ్రతలతో ఉన్నాయి. కశ్మీర్ లోయ ప్రాంతాల్లో పొగమంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు, వ్యక్తులు కనిపించడం లేదని స్థానికులు చెబుతున్నారు. విమాన సర్వీసులు యథాతథంగా కొనసాగుతాయని శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ అధికారులు వెల్లడించారు. -
విశాఖ మన్యంలో దట్టమైన పొగమంచు
విశాఖ మన్యంలో ఉష్ణోగ్రతలు మరోసారి తగ్గుముఖం పడుతున్నాయి. మూడు రోజులుగా ఏజెన్సీ ప్రాంతాలైన పాడేరు, చింతపల్లి, అరకు తదితర ప్రాంతాల్లో చలి తీవ్రత బాగా పెరిగింది. లంబసింగిలో సోమవారం రాత్రి 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మోదకొండూరు, చింతపల్లి ప్రాంతాల్లో 8 డిగ్రీలు, పాడేరు, అరకులో ఉష్ణోగ్రత 9 డిగ్రీలుగా ఉంది. ఉదయం పది గంటల వరకూ మంచు కురుస్తూనే ఉంది. దట్టమైన పొగమంచు కారణంగా రహదారులపై ఏమీ కనిపించని పరిస్థితి నెలకొంది. పెరిగిన చలి తీవ్రతకు మన్యం వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
ఢిల్లీలో విమానాల రాకపోకలకు అంతరాయం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పొగమంచు దట్టంగా ఆవహించింది. దీంతో శుక్రవారం ఉదయం విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ చేయడానికి వాతావరణం అనుకూలించకపోవడంతో ఓ విమానాన్ని దారి మళ్లించారు. పొగమంచు రైళ్ల సర్వీసులపైనా ప్రభావం చూపించింది. ఢిల్లీలో రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. గత రెండు రోజులుగా ఢిల్లీలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో పొగమంచు ఎక్కువగా ఉంటోంది. -
ఢిల్లీలో విమానాల రాకపోకలకు అంతరాయం
-
లారీని ఢీకొన్న లారీ- ఇద్దరికి తీవ్ర గాయాలు
నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి శివారులో శనివారం ఉదయం ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొనడంతో ఇద్దరు గాయపడ్డారు. పొగ మంచు ఎక్కువగా ఉండడంతో రోడ్డుపక్కన ఆగివున్న లారీ కనిపించక వెనుక వేగంగా వస్తున్న లారీ డీకొంది. ఈ ప్రమాదంలో ఆగిఉన్న లారీ డ్రైవర్, క్లీనర్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని కామినేని ఆస్పత్రికి తరలించారు. -
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన లారీ: ముగ్గురికి గాయాలు
నల్గొండ : నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి శివారులో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారి పక్కనే ఆగి ఉన్న లారీని మరో లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే జిల్లావ్యాప్తంగా దట్టమైన పొగమంచు ఆవరించి ఉంది. ఈ నేపథ్యంలో పొగమంచు కారణంగా రహదారిపై ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించడపోవడం జరుగుతుంది పోలీసులు తెలిపారు. ఆ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. -
దట్టంగా మంచు... ఆగిన విమానాలు
శ్రీనగర్ : శ్రీనగర్‌లో దట్టమైన మంచు కమ్ముకుంది. ఈ నేపథ్యంలో వరుసగా నాలుగో రోజు కూడా శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లవలసిన విమానాలు రద్దయ్యాయి. విమానం కిందకి దిగాలంటే ఎదురుగా 1000 మీటర్ల మేర కనిపించాలని కానీ ఎదురుగా 300 నుంచి 400 మీటర్ల మేర ఉన్న ప్రాంతమే కనిపిస్తుందని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ కారణంగానే గత మూడు రోజులుగా ఉదయం వేళ్లలో విమానాలను రద్దు చేసినట్లు చెప్పారు. శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అడ్వాన్స్డ్ ఇనుస్ట్రుమెంటేషన్ ల్యాండింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రక్షణ, పౌర విమానయాన శాఖ మంత్రిత్వశాఖలకు లోక్‌సభలో విజ్ఞప్తి చేయనున్నట్లు ప్రిపుల్స్ డెమెక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు, లోక్‌సభ సభ్యురాలు మహబూబా ముఫ్తి వెల్లడించారు. శీతాకాలం భారీగా మంచు కురుస్తుండమే కాకుండా కొండ చరియలు విరిగి పడుతుండటంతో జమ్మూ కాశ్మీర్ జాతీయ రహదారిని మూసివేశారు. -
పొగమంచు కాదు.. పొగే
హైదరాబాద్: మీరు ఈ ఫోటోలలో చూస్తుంది తెల్లవారుజామున కురిసే పొగమంచు కాదు, గాలిలోని హిమబిందువులు అంతకన్నా కాదు.. ఇదంతా పరిశ్రమల నుంచి వెలువడుతున్న హానికారకమైన పొగ. ఇలాంటి దృశ్యాలు పారిశ్రామిక వాడలైన జీడిమెట్ల, గాంధీనగర్‌లలో నిత్యకృత్యమయ్యాయి. స్థానిక పరిశ్రమల నుంచి వెలువడే వాయు కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతోంది. కొన్ని పరిశ్రమలు పరిమితికి మించి విషవాయువులను పర్యావరణంలోకి వదులుతున్నా.. కాలుష్యాన్ని అరికట్టాల్సిన పీసీబీ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. తమకు ఆనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయంటూ పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ స్థానికులు వాపోతున్నారు. -
పొగ ‘తాగ’మంటుంది..
పొగబాబులు ఈ విషయం చెబితే నమ్మరు కానీ.. పొగ చూరిన బాడీలోని నికోటిన్లెవల్స్ ఆత్మారాముడ్ని.. మందు పుచ్చుకోమని తెగ ప్రేరేపిస్తుందని శాస్త్రవేత్తలు బాటిల్ బద్దలు కొట్టారు. చాలామంది మందుబాబులు.. చుక్కేసినప్పుడే.. దమ్ము లాగుతామని చెబుతుంటారు. అయితే గొంతులోకి జారుకున్న చుక్క.. ఊపిరితిత్తుల ద్వారా నరనరాల్లోకి చేరుకున్న పొగ.. రెండూ ఒకే న్యూరాన్ సిస్టమ్‌పై ప్రభావం చూపి మద్యంపై మరింత మోజును పెంచుతాయని సైంటిస్టులు సెలవిచ్చారు. ఈ విష వలయంలో చిక్కుకున్న పొగరాయుళ్లు ‘ఆల్క’హానిని బహుమతిగా పొందుతున్నారని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. -
చిరుజల్లులతో పులకించిన తిరుమల
తిరుమల: తిరుమలలో పొగమంచుతో కూడిన చల్లటి వాతావరణం భక్తులను పరవశింపజేస్తోంది. కొన్ని రోజులుగా వేడి, ఉక్కపోత వాతావరణంతో విసిగిపోయిన ప్రజలు ఒక్కసారిగా చిరుజల్లులు కురవడంతో ఆహ్లాదకర వాతావరణంలో సేదతీరుతున్నారు. రెండు రోజులుగా ఉదయం వేళల్లో తిరుమల ఆలయ పరిసరాలను దట్టమైన పొగమంచు కప్పేస్తోంది. దీనికి ప్రకృతి అందాలూ జత కావడంతో భక్తుల్లో ఆనందం రెట్టింపు అవుతోంది. అద్భుతమైన ఈ దృశ్యాలను తమ సెల్ కెమెరాల్లో చిత్రీకరించి సన్నిహితులతో పంచుకుంటున్నారు. -
పొగమంచు కారణంగా 135 రైళ్లు ఆలస్యం
న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశంలో శుక్రవారం పొగమంచు, చలిగాలుల తీవ్రత ఎక్కువ కావటంతో 135 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఆ ప్రాంతాల్లో పలు రవాణా మార్గాలకు పొగమంచు భంగం కలిగిస్తోంది. దీని కారణంగా ఎక్కువగా రైళ్ల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ప్రతికూల వాతావరణం వల్ల మూడు రోజులుగా 135 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని రైల్వే అధికారులు తెలిపారు. రైళ్లతో పాటు వాయు రవాణాకు కూడా పొగమంచు ఇబ్బంది కలిగిస్తోంది. దేశంలో ఏడు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్టు ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. -
చలితో వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు
-
ఎయిరిండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రమయంలో బుధవారం ఉదయం ఎయిరిండియా విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. మస్కట్ నుంచి చెన్నై వెళ్లాల్సిన ఈ విమానాన్ని... చెన్నైలో దట్టమైన పొగమంచు కారణంగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో నిలిపివేశారు. వెలుతురు సరిగా లేని కారణంగా విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లు ఎయిరిండియా అధికారులు తెలిపారు. -
చలికి విశ్రాంతినిచ్చిన కొత్త సంవత్సరం!
న్యూఢిల్లీ: కొత్త సంవత్సరం చలికి విశ్రాంతినిచ్చింది. ప్రధానంగా దేశ రాజధాని హస్తినలో గత కొన్ని రోజులుగా చలితో ప్రజలు వణికిపోతున్నారు.అయితే కొత్త సంవత్సరంతో వారికి కాస్త ఉపశమనం చేకూరింది. తాజాగా గురువారం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు 8.8 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యాయి. గత రెండు రోజులుగా ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 4.5 డిగ్రీల సెల్సియస్ కు పడిపోవడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు కాస్త మెరుగుపడటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా పొగమంచు కారణంగా 40 రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా, 15 రైళ్లను రద్దు చేసినట్లు నార్త్ రైల్వే ప్రకటించింది. మరో ఏడు రైళ్లను రీషెడ్యూల్ చేసినట్లు తెలిపింది. -
తిరుమల కొండపై దట్టమైన పొగమంచు
-
ఢిల్లీలో పొగమంచు కారణంగా 96 రైళ్లు ఆలస్యం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మంగళవారం పొగమంచు దట్టంగా కమ్ముకుంది. దీంతో ఢిల్లీ నుంచి వెళ్లాల్సిన, రావాల్సిన 96 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరో 9 రైళ్లను పూర్తిగా రద్దు చేసినట్టు ఉత్తర రైల్వే తెలియజేసింది. బుధవారం కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చని వాతావరణ శాఖ తెలియజేసింది. ఢిల్లీలో మంగళవారం కనిష్ట ఉష్ణోగ్రత 4.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. -
శంషాబాద్ నుంచి వెళ్లే విమానాలు ఆలస్యం
హైదరాబాద్: పొగమంచు ప్రభావం విమానాల రాకపోకలపై ప్రభావం చూపుతోంది. హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వెళ్లాల్సిన విమానాలు ఆలస్యమవుతున్నాయి. ఇక్కడి నుంచి ఢిల్లీ, ముంబై, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం వెళ్లాల్సిన విమానాలు గంట నుంచి 5 గంటల వరకు ఆలస్యంగా బయల్దేరనున్నట్టు అధికారులు తెలిపారు. కాగా ఉత్తర భారతదేశంలో పొగమంచు ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. విమానాలతో పాటు రైళ్లు ఆలస్యంగా బయల్దేరుతున్నాయి. -
ఆలస్యంగా ఏపీ ఎక్స్‌ప్రెస్
సాక్షి, హైదరాబాద్: పొగమంచు కారణంగా హైదరాబాద్-న్యూఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్ (12723) ఆలస్యంగా నడుస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు తెలిపారు. మంగళవారం (23వ తేదీ) ఉదయం 6.25 గంటలకు నాంపల్లి స్టేషన్ నుంచి బయలుదేరాల్సిన ఈ రైలు సాయంత్రం 5.30కు బయలుదేరనుంది. -
173 విమానాల రాకపోకలకు ఆటంకం
న్యూఢిల్లీ: పొంగమంచు కారణంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. పొంగ మంచు దట్టంగా అలముకోవడంతో వెలుతురు మందగించి విజిబిలిటి 50 మీటర్ల దిగువనకు పడిపోయింది. ఫలితంగా ఆరు గంటల పాటు విమాన రాకపోకలు స్తంభించాయి. 173 విమానాలు ఆలస్యంగా నడిచాయని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ప్రతికూల వాతావరణంగా రెండు విమాన సర్వీసులు రద్దు చేశారు. -
పొగమంచుతో రైళ్లు ఆలస్యం
న్యూఢిల్లీ: ఉత్తరాదిన చలి, పొగమంచు తీవ్రంగా ఉంది. ఢిల్లీలో దట్టమైన పొగమంచు ఆవరించింది. దీనివల్ల రైళ్ల రాకపోకలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. 50 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరో 12 రైళ్ల వేళల్లో మార్పులు చేశారు. ఉత్తరాదిన ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. -
పొగమంచుతో విమానాల రాకపోకలకు అంతరాయం
శంషాబాద్: దట్టమైన పొగమంచు కారణంగా గురువారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే విమానాలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఉదయం 6 గంటల సమయంలో దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోవాల్సిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని చెన్నైకి పంపినట్టు విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా ఇక్కడి నుంచి టేకాఫ్ తీసుకోవాల్సిన విమానాలు కూడా గంటన్నర ఆలస్యంగా బయల్దేరాయి. -
పొగమంచుతో విమానాల రాకపోకలకు అంతరాయం
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయాన్ని గురువారం ఉదయం దట్టమైన పొగమంచు కప్పేసింది. దాంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విమానాశ్రయ అధికారులు దుబాయ్ నుంచి హైదరాబాద్ రావల్సిన ఎమిరేట్స్ ఈకె 524 విమానాన్ని చెన్నైకి మళ్లించారు. అలాగే హైదరాబాద్ నుంచి బయల్దేరాల్సిన పలు విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. మరోవైపు ఎయిర్ ఇండియా విమానం రెండు గంటల ఆలస్యంగా బయలుదేరనుంది. -
ప్రాణాలు తీసిన పొగమంచు
విశాఖపట్నం జిల్లాలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లా వాసులు నలుగురు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. విజయవాడ పరిసర ప్రాంతాలకు చెందిన ఈ ఆరుగురూ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్తుండగా నక్కపల్లి మండలం గొడిచర్ల వద్ద పొగ మంచు వల్ల దారి కనిపించక వీరి కారు ఆగివున్న లారీని ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. మృతిచెందినవారిలో గరిమెళ్ల గోవర్ధనరావు (40), కొండపల్లి శివరామకృష్ణశాస్త్రి (44), వంగా ప్రకాశరావు (55), నల్లమోతు రవి సుధాకర్ (47) ఉన్నారు. * ఆగివున్న లారీని ఢీకొట్టిన ఇన్నోవా * విశాఖపట్నం జిల్లా గొడిచర్ల వద్ద ప్రమాదం * జిల్లా వాసులు నలుగురు మృతి * మరో ఇద్దరికి తీవ్ర గాయాలు నక్కపల్లి (విశాఖపట్నం జిల్లా) : పొగమంచు నలుగురి ప్రాణాలను బలిగొంది. మండలంలోని గొడిచర్ల జంక్షన్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి విపరీతమైన పొగమంచు కమ్ముకుంది. ఎదురుగా వస్తున్న, ముందు వెళుతున్న వాహనాలు కనపడని పరిస్థితి. ఈ నేపథ్యంలో శనివారం వేకువవారుజామున జాతీయరహదారిపై జరిగిన రోడ్డుప్రమాదంలో విజయవాడకు చెందిన నలుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం తరలించారు. వివరాలిలా ఉన్నాయి. విజయవాడ పరిసరప్రాంతాలకు చెందిన ఆరుగురు సిండికేట్‌గా ఏర్పడి రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. విజయవాడలో విక్రయించిన భూమికి సంబంధించి అడ్వాన్సు తీసుకునేందుకు ఇన్నోవా కారులో శుక్రవారం రాత్రి విశాఖపట్నం బయలుదేరారు. విశాఖ జిల్లా నక్కపల్లి సమీపంలో గొడిచర్ల జంక్షన్ వద్ద శనివారం వేకువజామున మూడు గంట లకు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో విజ యవాడ పరిసర ప్రాంతాలకు చెందిన గరిమెళ్ల గోవర్ధనరావు (40, డ్రైవింగ్‌చేస్తున్న వ్యక్తి), కొండపల్లి శివరామకృష్ణశాస్త్రి (44), వంగా ప్రకాశరావు (55), నల్లమోతు రవి సుధాకర్ (47) దుర్మరణం పాలయ్యారు. వీరితో పాటు ప్రయాణిస్తున్న పరశురాం, ఎండీ ఫారుఖ్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఎస్సై విజయ్‌కుమార్, హైవే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరికి ప్రాథమిక చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఎయిర్ బ్యాగులున్నప్పటికీ.. కారు అమర్చిన ఎయిర్‌బ్యాగ్‌లు తెరచుకున్నప్పటికీ వాహనం వేగానికి, ఢీకొట్టిన తీవ్రతకు పేలిపోయాయే తప్ప ముందు సీట్లో కూర్చున్న వారి ప్రాణాలు కాపాడలేకపోయాయి. ఈ సమయంలో వాహనాన్ని విజయవాడ రామవరప్పాడుకు చెందిన గోవర్థన్‌రావు నడుపుతున్నాడు. కారుముందు భాగం నుజ్జవడంతో అతడు సీట్లోనే ఇరుక్కుపోయి ప్రాణాలు విడిచాడు. మిగతావారి తల, ఛాతిపైన బలమైన గాయాలు కావడంతో తీవ్ర రక్త స్రావ మై మరణించారు. పోలీసులు కూడా దీనినే ధ్రువీకరించారు. వాహనంలో ఇరుక్కుపోయిన మృతదేహాలను స్థానిక పోలీసులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది అతికష్టం మీద బయటకు తీశారు. ఆరుగురూ రియల్ఎస్టేట్ వ్యాపారంలో భాగస్వాములు. ఇటీవల విజయవాడలో స్థలం విక్రయించినట్లు సమాచారం. దానికి సంబంధించి అడ్వాన్సు తీసుకునేందుకు విశాఖ బయలు దేరినట్టు తెలిసింది. మృతుల్లో ఒకరైన సుధాకర్ ఏపీ న్యూస్ పేరుతో న్యూస్‌చానల్ ఏర్పాటు ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసింది. దీని ఏర్పాట్ల గురించి కూడా చర్చించేందుకు, అవసరమై స్థలాన్ని, వసతిని పరిశీలించేందుకు విశాఖ బయలుదేరినట్లు సన్నిహితుల ద్వారా తెలిసింది. ఇందుకు సంబంధించిన గుర్తింపుకార్డు ఒకటి మృతుని వద్ద లభించింది. వారివద్ద ఉన్న ఆధారాల మేరకు కుటంబసభ్యులకు పోలీసులు సమాచారం అందించారు.మృతదేహాలను పోస్టుమార్టం కోసం నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజయ్‌కుమార్ తెలిపారు. లారీ కోసం గాలింపు... ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్నవారు మరణించిన విషయాన్ని లారీ డ్రైవర్ గుర్తించాడు. వెంటనే లారీతో సహా వెళ్లిపోయాడని సమాచారం. లారీ ఆగిఉన్న సమయంలో వాహనం ఢీకొట్టిందా? లేక ప్రయాణిస్తూ సడన్ బ్రేక్‌వేయడం వల్ల ఢీకొట్టిందా? అన్నది నిర్ధారించుకోవడానికి పోలీసులు లారీ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. వేంపాడు టోల్గేట్లో సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించి లారీ ఆచూకీ కనుగొనేందుకు యత్నిస్తున్నారు. రవిసుధాకర్ కుటుంబంలో విషాదం ఇబ్రహీంపట్నం : విశాఖపట్నం వద్ద శని వారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇబ్రహీంపట్నం శక్తినగర్కి చెందిన నల్లమోతు రవిసుధాకర్(47) మృతి చెందడంతో ఆయన కుటుంబసభ్యులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. రవిసుధాకర్ గతంలో పలు దినపత్రికల్లో జర్నలిస్టుగా పనిచేశారు. ఆయన రంగమ్మను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి కుమార్తె శ్రీజ బీఫార్మసీ చేస్తోంది. కుమారుడు రాజు రామ్ ఇంటర్ చదువుతున్నాడు. రోడ్డు ప్రమాదంలో రవిశంకర్ మృతిచెందినట్లు తెలియగానే కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులు విశాఖ జిల్లాకు బయలుదేరి వెళ్లారు. గోవర్ధనరావు కుటుంబంలో.. రామవరప్పాడు : విశాఖపట్నం జిల్లా నక్కపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన గరిమెళ్ల గోవర్థనరావు ప్రసాదంపాడులోని సాయిబాబా ఆలయం సమీప ప్రాంత వాసి. గోవర్థనరావు మరో ఐదుగురు రియల్ ఎస్టేట్ పనిమీద శుక్రవారం రాత్రి కారులో విశాఖపట్నం వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది గోవర్థన్‌కు భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. అతడి తల్లిదండ్రులు అడవినెక్కలంలో నివాసం ఉంటున్నారు. ప్రమాదం గురించి తెలియగానే గోవర్థనరావు సమీప బంధువైన ప్రసాదంపాడు ఉప సర్పంచ్ కోమ్మా కోటేశ్వరరావు తదితరులు హుటాహుటిన విశాఖపట్నం బయలుదేరి వెళ్లారు. ఫారుక్ పరిస్థితి విషమం కారులో వీరితోపాటు ప్రయాణిస్తున్న యనమలకుదురు వాసి ఫారుక్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడు విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. ఫారుక్ ఆటోనగర్‌లో బ్యాటరీల దుకాణం నిర్వహిస్తుంటాడు. అతడికి భార్య, ముగ్గురు సంతానం ఉన్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న అతడి కుటుంబసభ్యులు, బంధువులు విశాఖపట్నం బయలుదేరారు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు మంగళవారం ఉదయం ఆందోళనకు దిగారు. విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా అలుముకోవటంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాంతో విమానాశ్రయ అధికారులు శంషాబాద్‌కు వచ్చే పలు విమానాలను దారి మళ్లించారు. షార్జా, మస్కట్, అబుదాబి నుంచి వచ్చే విమానాలను బెంగళూరుకు మళ్లించారు. మరోవైపు ఢిల్లీ, దుబాయి వెళ్లాల్సిన విమానాలను రద్దు చేశారు. దాంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. -
ఢిల్లీలో పొగమంచు.. 50 రైళ్లు ఆలస్యం
ఢిల్లీలో పొగమంచు విపరీతంగా కురుస్తోంది. కన్ను పొడుచుకున్నా ముందు ఏముందో అర్థం కావట్లేదు. దీంతో ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 50 రైళ్లు విపరీతంగా ఆలస్యమయ్యాయి. వాతావరణ శాఖ మాత్రం ఆకాశం నిర్మలంగా ఉంటుందని చెప్పినా, అందుకు భిన్నంగానే కనిపించింది. ఉదయం 8.30 గంటలకు కూడా 600 మీటర్ల వరకు మాత్రమే కనిపించిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. శనివారం ఉదయం 50 రైళ్లు ఆలస్యంగా నడిచినట్లు ఉత్తర రైల్వే వర్గాలు తెలిపాయి. కనిష్ఠ ఉష్ణోగ్రత సుమారు 2 డిగ్రీలకు అటూ ఇటూగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఉదయం 8.30 గంటలకు గాలిలో తేమ 88 శాతం ఉంది. -
నాట్లు.. పాట్లు
తణుకు, న్యూస్‌లైన్ : చలిగాలులు పెరిగారుు. మడుల్లోని నారు ఎదుగుదలను దెబ్బతీస్తున్నారుు. ఫలితంగా వరినాట్లు ఆలస్యమవుతున్నారుు. ఊడ్పులకు అదును దాటిపోతుండటంతో రానున్న రోజుల్లో సాగునీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ఉందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా మడుల్లో 21నుం చి 30 రోజులపాటు పెరిగిన (రెండుమూడు ఆకులున్న) నారును చేలల్లో నాటుతారు. రాత్రి ఉష్ణోగ్రతలు 14-15 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు తగ్గిపోవటం, పొగమంచు అధికంగా కురవడంతో నారు ఎదగటం లేదు. 21 రోజులు దాటినా మళ్లలోని నారు 15 రోజుల క్రితం వేసినట్టుగా ఉంటోంది. దీనిని చేలల్లో ఊడ్చితే నీట మునిగి కుళ్లిపోతుందనే భయంతో నాట్లు వేయడానికి రైతులు సాహసం చేయలేకపోతున్నారు. మరోవైపు నాట్లు వేసిన చేలల్లోని వరి సైతం సక్రమంగా ఎదగకపోవటంతో ఎక్కువ నారు ఉపయోగించాల్సి వస్తోంది. దీనివల్ల నారు సరిపోవడం లేదని రైతులు చెబుతున్నారు. సాధారణంగా రబీలో ఎకరం పొలంలో నాటడానికి 37నుంచి 50 కేజీల విత్తనాన్ని నారుపోస్తారు. 50 కేజీల విత్తనం వేసినా ఆ నారు ఎకరంలో నాటడానికి సరిపోవడం లేదు. పొంచివున్న సాగునీటి కష్టాలు జనవరి మొదటి వారానికల్లా వరినాట్లు పూర్తి చేస్తేనే రైతులు సాగునీటి ఎద్దడి నుంచి బయటపడగలుగుతారు. మార్చి 31నాటికి కాలువల కట్టివేస్తామని అధికారులు ప్రకటించారు. నాట్లు ఆలస్యమైతే సాగు చివరి దశలో నీటికి కొరత ఏర్పడుతుందని ఇరిగేషన్, వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. తణుకు ప్రాంతంలో 75శాతం ఆయకట్టులో మాత్రమే వరినాట్లు పూర్తరుునట్లు వ్యవసాయ శాఖ చెబుతోంది. తూర్పువిప్పర్రు, కె.ఇల్లిందలపర్రు, తణుకు, దువ్వ, కంతేరు, కత్తవపాడు, రేలంగి, కొత్తపాడు, పొదలాడ, కొమ్మర, ఈడూరు తదితర ప్రాంతాల్లో నాట్లు పూర్తికాలేదు. మరో 10 రోజులకు గాని ఊడ్పులు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. నాట్లు 20 రోజులపాటు ఆలస్యమవుతున్నాయని, కాలువలు కట్టివేసే విషయంలో ఇరిగేషన్ అధికారులు స్పష్టత ఇవ్వకపోతే ఆలస్యంగా ఊడ్చిన రైతులు ఇబ్బందిపడే ప్రమాదం ఉందని రైతు సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ నెలాఖరు వరకు సాగునీరు ఇస్తే తప్ప రైతులు గట్టెక్కే పరిస్థితి లేదని పేర్కొంటున్నారు. -
పొగమంచుతో శంషాబాద్‌లో విమానం అత్యవసర లాండింగ్
సంక్రాంతి వెళ్లిపోయినా పొగమంచు మాత్రం ఇంకా తగ్గలేదు. దాంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. బ్యాంకాక్ నుంచి కోల్‌కతా వెళ్తున్న ఓ ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైదరాబాద్‌లో అత్యవసరంగా దింపేయాల్సి వచ్చింది. దట్టమైన పొగమంచు కారణంగా ఆ విమానం ముందుకు వెళ్లే అవకాశం ఏమాత్రం లేకపోవడంతో ప్రమాదాన్ని నివారించేందుకు అత్యవసరంగా విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు ల్యాండ్ చేశారు. పొగమంచు పూర్తిగా తగ్గిన తర్వాత మాత్రమే విమానాన్ని మళ్లీ కోల్‌కతాకు పంపే అవకాశం ఉంది. -
ఔటర్‌పై మృత్యుఘోష!
మహేశ్వరం, న్యూస్‌లైన్: తెలతెల్లవారుతోంది.. తీవ్రంగా మంచు కురుస్తోంది. మహారాష్ట్ర నుంచి తిరుపతి వెళ్తున్న ఓ వాహనం ఔటర్‌పైకి దూసుకొచ్చింది. అందులో మొత్తం తొమ్మిది మంది ఉన్నారు. వీరంతా బంధువులు. గురువారమే బాంద్రా జిల్లా తిరోడా తాలుకా భూత్నాథ్ నుంచి బయల్దేరిన వీరు శుక్రవారం తెల్లవారు జామున ఔటర్‌పైకి చేరుకున్నారు. ముంబై జాతీయ రహదారిలో వచ్చిన వీరి వాహనం పటాన్చెరు వద్ద ఔటర్ రింగు రోడ్డు ఎక్కింది. శంషాబాద్‌లో ఔటర్ దిగి బెంగళూరు హైవే మీదుగా వెళ్లాల్సి ఉంది. కానీ పొరపాటున ఔటర్‌రింగ్ రోడ్డు మీదుగా అలాగే ముందుకు దాదాపు 15కిలోమీటర్లు వచ్చేశారు. తుక్కుగూడ దగ్గర ఔటర్ దిగే వీలున్నా వీరు చూసుకోలేదు. ఈ క్రమంలోనే వేగంగా వెళ్తున్న వీరి వాహనం తుక్కుగూడ - రావిర్యాల మధ్యలో ఆగిఉన్న లారీని వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కార్పియోలో ఉన్న విద్యా యోగేందర్ కట్రే(30), భరత్ బగులై(58), పైరన్బాయి పట్లే(60), వచ్చాల్లా బాయి సురుగురే(55), దీనూ బాయి(60) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. గాయపడిన వారిలో యోగేందర్, ప్రభాబాయి, సుఖ్‌దేవ్‌తోపాటు డ్రైవర్ మనోజ్ ఉన్నారు. వీరిలో యోగేందర్, విద్యా యోగేందర్ కట్రేలు దంపతులు. యోగేందర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నేత, ఏపీఎంసీ చైర్మన్‌గా ఉన్నారు. ఈ ప్రమాదంలో వాహనం ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. క్షతగాత్రులను సాగర్ రింగు రోడ్డులోని మెడికేర్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద విషయం తెలిసి శంషాబాద్ ఏసీపీ భద్రేశ్వర్, పహాడీషరీఫ్ పోలీసులు, తుక్కుగూడ, రావిర్యాల గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పొగమంచే ప్రాణాలు తీసిందా? శుక్రవారం తెల్లవారుజామున తీవ్రంగా పొగమంచు ఉంది. రోడ్డుపై మంచు కమ్ముకోవడంతో ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నా రు. టయోటా ఏరియా వాహనం డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడంతో కూడా ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. అదే విధంగా ఔటర్ రింగ్ రోడ్డుపై సరైన సూచిక బోర్టులు లేవు. దీంతోనే తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రోడ్డు ఎక్కాల్సిన, దిగాల్సిన చోట బోర్డులు ఏర్పాటు చేయలేదు. దీంతో వాహనదారులు గందరగోళానికి గురవుతున్నారు. -
ఢిల్లీలో పొగమంచు
-
అన్నదాత గుండెల్లో మంచు మంటలు
శ్రీకాకుళం రూరల్, న్యూస్‌లైన్: ఖరీఫ్ చివరిలో వరుస దాడులతో అన్నదాతలను అతలాకుతలం చేసిన ప్రకృతి ఇంకా కక్ష తీరినట్లు లేదు. రైతన్నల జీవితాల్లో మంచు మంటలు రేపుతోంది. సెప్టెం బర్ చివరి వారం నుంచి తుపాన్లు, భారీ వర్షాలతో అధిక శాతం ఖరీఫ్ పంటలు నాశనమయ్యాయి. మిగిలిన కొద్దిపాటి ఆహార పంటలతోపాటు కూరుగాయలు, ఇతర ప్రత్యామ్నాయ పంట లను గత కొద్దిరోజులుగా విపరీతంగా కురుస్తున్న మంచు కబళి స్తోంది. వీటికి తోడు జిల్లాలో కొన్ని చోట్ల రబీ సాగు మొదలైంది. ఈ పంటలకు ప్రస్తుతం మంచు, తెగుళ్ల బెడద తీవ్రంగా ఉంది. ఈ ఏడాది రబీ వ్యవసాయానికి మొదట్లో వరద దెబ్బ తగిలింది. దీంతో చాలా వరకు రైతులు నష్టపోయారు. దాని నుంచి తేరుకునే లోగానే మిరప, వంగ, టమాటా, చిక్కుడు, మినుము, పెసర తదితర పంటలకు మంచు, తెగుళ్లు తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా వేలాది ఎకరాల్లో ఉన్న పంట లకు ఇదే సమస్య ఎదురవుతోంది. ఒక్క శ్రీకాకుళం మండలంలోనే సుమారు 500 ఎకరాల్లో మిరపతో పాటు అధిక విస్తీర్ణంలో పెసర, మినుము, వంగ, టమాటా, చిక్కుడు వంటి పంటలు సాగు చేస్తున్నారు. ఇప్పిలి, కళ్ళేపల్లి, కనుగులవానిపేట, బలివాడ, వాకలవలస, బావాజీపేట, రాగోలు, మన్నయ్యపేట తదితర గ్రామాల్లో, పొందూరు, జి.సిగడాం తదితర ప్రాంతాల్లో మిరప సాగులో ఉంది. అదే విధంగా ఎచ్చెర్ల, కోటబొమ్మాళి, కవిటి, గార తదితర మండలాలతోపాటు శ్రీకాకుళం రూరల్ మండలంలోని బావాజీపేట, వాకలవలస, నందగిరిపేట, మన్నయ్యపేట, రాగోలు తదితర గ్రామాల్లో పెద్ద ఎత్తున కూరగాయలు ఆసగు చేస్తున్నారు. అపరాల పంటల విస్తీర్ణం కూడా బాగానే ఉంది. ఈ పంటలకు కీలకమైన ఈ సమయంలో గత కొద్దిరోజులుగా కురుస్తున్న మంచు వల్ల మొక్కలు ముడసర వేసి ఎదుగుదల కోల్పోతున్నాయి. ఆకుముడత, తెల్లమచ్చ సోకుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట వేసి చాలా రోజులు అవుతున్నా మొక్కలు పెరగడం లేదని, ఎన్ని మందులు కొట్టినా ఫలితం కనిపించడంలేదని ఆవేదన చెందుతున్నారు. గత ఏడాది ఈ సమయానికే మిరప పంట చేతికి అందిందని, మంచు, తెగుళ్ల కారణంగా ఈ ఏడాది ఇప్పటివరకు పూత దశకే రాలేదని అంటున్నారు. ఖరీఫ్‌తో పాటు రబీ కూడా పోయే పరిస్థితి ఉందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. మినుము, పెసర, చిక్కుడు పంటల్లో తెల్లదోమ తెగులు విపరీతంగా ఉందని చెబుతున్నారు. -
రెండో రోజూ అదే తీరు
సాక్షి, న్యూఢిల్లీ: నగరంలో పొగమంచు తీవ్రత పెరిగింది. జాతీయ రాజధాని ప్రాంతంలోనూ దట్టమైన పొగమంచు ఆవరించింది. సోమవారం మొదలైన ఈ పొగమంచు తీవ్రత మంగళవారం మరింత పెరిగింది. దీనివల్ల దృశ్యగోచరత 50 మీటర్ల కన్నా తగ్గిపోవడంతో అనేక రైళ్లు, విమానాలు ఆలస్యంగా నడిచాయి. కొన్ని విమాన సేవలను, రైళ్లను రద్దు చేశారు. దాదాపు 200కిపైగా విమానాలు ఆలస్యంగా నడిచాయి. పొగమంచు కారణంగా దృశ్యగోచరత బాగా తగ్గిపోవడంతో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉదయం ఐదు గంటల నుంచి విమాన రాకపోకలను నిలిపివేశారు. దాదాపు ఐదు గంటలపాటు విమానాల రాకపోకలను నిలిపివేయడంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. విమానాశ్రయంలో ప్రవేశ, నిష్ర్కమణ ద్వారాల వద్ద వంద మంది ప్రయాణికులు గుమిగూడి ఉండడం కనిపించింది. పొగమంచు కారణంగా 224 విమానాలు ఆలస్యంగా నడిచాయి. వీటిలో 179 జాతీయ, 45 అంతర్జాతీయ విమానాలున్నాయి. విమానాలు రన్‌వేపై దిగాలంటే కనీసం 50 మీటర్ల దృశ్యగోచరత ఉండాలి. విమానం రన్‌వేపై నుంచి ఎగరాలంటే విమానం ఆకృతిని బట్టి కనీసం 125 నుంచి 150 మీటర్ల దృశ్యగోచరత ఉండాలి. దీని కన్నా తక్కువగా ఉండటంతో విమాన రాకపోకలను నిలిపివేశామని విమానాశ్రయ అధికారి ఒకరు తెలిపారు. ఉదయాన్నే వివిధ పనుల కోసం, జాగింగ్ కోసం రోడ్డెక్కిన నగరవాసులు పొగమంచు వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కార్యాలయాలకు బయలుదేరిన ఢిల్లీవాసులు చలితో వణికిపోయారు. వెలుతురు సరిగా కనిపించక వివిధ ప్రాంతాల్లో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రమాదం పొగమంచు వల్ల గ్రేటర్ నోయిడాలో యమునా ఎక్స్‌ప్రెస్‌పై రోడ్డుప్రమాదం జరిగింది. జీరోపాయింట్ , జెవార్ టోల్ ప్ల్లాజాల మధ్య ఓ టూరిస్ట్ బస్సును ట్రక్కు ఢీకొనడంతో నలుగురు మరణించారు. 24 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని గ్రేటర్ నోయిడాలోని కైలాష్ ఆసుపత్రిలో చేర్పించారు. పొగమంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించలేదని, మద్యం తాగిన డ్రైవర్ బస్సును అతివేగంగా నడిపాడని సమాచారం. ఉమ్రావ్కు వెళ్తున్న బస్సు జెవార్ టోల్ ప్లాజాకు వస్తుండగా ట్రక్కు ఢీకొంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పొగమంచుకు ఇద్దరు బలి
ఘట్కేసర్, న్యూస్‌లైన్: దట్టంగా కురుస్తున్న పొగమంచు ఇద్దరిని బలితీసుకుంది. రోడ్డు సరిగా కనిపించకపోవడంతో ఆటో డివైడర్ ఎక్కి బోల్తాపడడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటన మండలంలోని బైపాస్ రోడ్డు చౌరస్తాలోని యంనంపేట్ వద్ద శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు, మృతుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా దేవరుప్పల మండలం కడివెండి సీతారాంపూర్ గ్రామానికి చెందిన పాండాల ఆంజనేయులు, కవిత(35) దంపతులు 15 ఏళ్ల క్రితం నగరంలోని జగద్గిరిగుట్టకు వలస వచ్చి వెంకటేశ్వరనగర్‌లో నివాసం ఉంటున్నారు. ఆంజనేయులు కార్పెంటర్. కవిత దుస్తులు ఉతుకుతూ ఇస్త్రీ చేసుకుంటూ కుటుంబ పోషణలో తోడ్పడుతోంది. వీరి కూతురు సంధ్య ఇంటర్ పూర్తి చేసుకొని ఇటీవలే బీఏఎంఎస్ కోర్సులో చేరింది. కుమారుడు మధు ఇంటర్ మొదటి ఏడాది కూకట్‌పల్లిలోని నారాయణ కాలేజీలో చదువుతున్నాడు. వీరి బంధువు నల్లగొండ జిల్లా మోత్కూర్ మండలం చిన్నపడిశాల గ్రామానికి చెందిన సైదులు(26) మూడేళ్ల క్రితం వెంకటేశ్వరనగర్కే వలస వచ్చి స్థానికంగా ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. బంధువులవడంతో ఆంజనేయులు, సైదులు స్నేహంగా ఉండేవారు. ఆంజనేయులు స్వగ్రామంలో తన బావమరిది ఇంట్లో విందు ఉండడంతో ఆయన కుటుంబంతో సహా శుక్రవారం ఉద యం సైదులు ఆటోలో వెళ్లాడు. తిరిగి శనివారం తెల్లవారుజామున 3 గంటలకు నగరానికి బయలుదేరారు. 5:30 గంటల సమయంలో ఘట్కేసర్ మండల కేంద్రానికి చేరుకునే సరికి దట్టంగా పొగమంచు కురుస్తోంది. దీంతో రోడ్డు సరిగా కనిపించడం లేదు. బైపాస్ చౌరస్తా యంనంపేట్ వద్ద మలుపు తీసుకోవాల్సిన ఆటో పొగమంచు కారణంగా దారి కనిపించకపోవడంతో నేరుగా కొద్దిదూరం వెళ్లింది. వేగంగా ఉన్న ఆటో డివైడర్ ఢీకొని బోల్తా పడిం ది. ప్రమాదంలో ఆటో నడుపుతున్న సైదులు, కవితకు తీవ్ర గా యాలై అక్కడికక్కడే మృతి చెందారు. ఆంజనేయులు, ఆయన కూ తురు సంధ్య, కుమారుడు మధు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలిం చారు. మధు పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. మృతదేహాలకు గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అంత్యక్రియలకు వారి స్వస్థలాలకు తరలించారు. సైదులుకు భార్య భాగ్యలక్ష్మి ఉందని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. -
పొగమంచుతో విమాన రాకపోకలకు ఆటంకం
-
పొగమంచుతో విమాన రాకపోకలకు ఆటంకం
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో పొగమంచు దట్టంగా కమ్ముకోవడంతో విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది. పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరికొన్ని విమానాలు రద్దయ్యాయి. హైదరాబాద్‌కు రావాల్సిన విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. అలాగే ఇక్కడి నుంచి తిరుపతి, విశాఖపట్టణం, బెంగళూరు, ఢిల్లీకి వెళ్లాల్సిన విమానాలు 30 నుంచి 40 నిమిషాలు ఆలస్యంగా వెళ్లనున్నాయని విమానాశ్రయ అధికారులు తెలిపారు. గోవా, విజయవాడ, లండన్‌కు విమానాలు రద్దు చేసినట్టు వెల్లడించారు. మిగతా ప్రాంతాల్లోనూ మంచు ప్రభావం ఉండడంతో ఇక్కడి రావాల్సిన విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని వివరించారు. పొగమంచు కారణంగా విమాన రాకపోకలకు అంతరాయం కలగడంతో ప్రయాణికులు గంటల తరబడి ఎయిర్‌పోర్టులో వేచి చూడాల్సి వస్తోంది. -
పొగ మంచు కారణంగా పలు విమానాలు రద్దు
శంషాబాద్ విమానాశ్రయంలో దట్టంగా పొగ మంచు కమ్ముకుంది. దాంతో హైదరాబాద్ నగరం నుంచి శుక్రవారం బయలుదేరవలసిన పలు విమానాలను రద్దు చేసినట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఈ రోజు ఉదయం విజయవాడ, రాజమండ్రి, తిరపతి, కొల్కత్తా నగరాలకు బయలుదేరవలసిన విమానాలను రద్దు చేసినట్లు తెలిపారు. అలాగే ఈ రోజు ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోవలసిన బెంగళూరు, విజయవాడ విమాన సర్వీసులు కూడా రద్దు అయ్యాయని విమానాశ్రయ అధికారులు పేర్కొన్నారు. -
శంషాబాద్ విమానాశ్రయంలో పొగ మంచు
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో బుధవారం దట్టంగా పొగమంచు కమ్ముకొంది. దాంతో పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రన్‌వేపై ఈ ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో నాలుగు విమాన సర్వీసులు తాత్కాలికంగా రద్దు అయ్యాయి. తిరుపతి, చెన్నై, గన్నవరం, మధురై సర్వీసులను అధికారులు రద్దు చేశారు. -
స్కూలుకు ఇలా...
స్కూలుకు ఇలా... చూడ్డానికి వరద బాధితుడిలా కనిపిస్తున్న ఇతడి పేరు అబ్దుల్ మాలిక్(40). అబ్దుల్ మాలిక్ ఓ టీచర్! మరి ఇదేంటి అని ప్రశ్నిస్తే.. రోజూ ఈయన పాఠశాలకు వెళ్లేది ఇలాగే..! కేరళలోని మలప్పురం జిల్లాలోని ఓ గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మాలిక్ గత 20 ఏళ్లుగా ఇలా టైర్ ట్యూబేసుకుని.. ఓ చేతిలో టిఫిన్ బాక్సు, బట్టలు పట్టుకుని ఈ నదిని దాటుతూనే ఉన్నారు. ‘ఇది దగ్గరి దారి.. బస్సులో నేను పనిచేసే స్కూలుకు వెళ్లినా.. గంటల సమయం పడుతుంది. లేటైపోతుంది. విద్యార్థులు ఇబ్బందులు పడతారు’ అని మాలిక్ తెలిపారు. గురువారం ఉపాధ్యాయ దినోత్సవం నాడూ ఇదే సీన్.. 15 నిమిషాల్లో నదిని దాటేసిన మాలిక్.. వెంటనే బట్టలు వేసేసుకుని.. చిన్నపాటి కొండ ఎక్కి.. 10 నిమిషాల్లో స్కూలుకు చేరుకున్నారు. మాలి క్‌ను చూడగానే పిల్లలంతా చుట్టుముట్టేసి.. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పెద్దయ్యాక ఏమవుతావురా అని ఓ జర్నలిస్ట్ జహంగీర్ అనే విద్యార్థిని అడిగితే.. మాలిక్ సార్లాగా టీచర్‌నవుతా అని చెప్పాడు. అది విన్న మాలిక్ సార్ కళ్లలో మెరుపు. ఇన్నేళ్లుగా ఆయన కష్టాలను మరిపిస్తోంది.. ఆ మెరుపే.. 100 వాహనాలు ఢీ అడుగు దూరంలో అసలేం కనపడనంతటి దట్టమైన పొగ మంచు కారణంగా గురువారం ఇంగ్లాండ్‌లోని కెంట్ కౌంటీలోని రహదారిపై దాదాపు 100 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. 200 వుంది గాయూలపాలయ్యారు. కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే ఇంతటి ఘోరం జరిగిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కెంట్ కౌంటీలోని నాలుగు లేన్ల షెప్పీ రహదారిలో ఉదయం సమయంలో వంతెన వద్ద దట్టమైన పొగమంచు నిండిఉంది. దీంతో రోడ్డు కనిపించక ఆ రహదారిలో వెళ్తున్న కార్లు, లారీలు, రవాణా వాహనాలు మొత్తం ఒకదానికిమరోటి గుద్దుకొని ధ్వంసమయ్యాయి. ఉదయం సమయంలో వాహనాలు లైట్లు ఆర్పేసి వెళ్లడం సైతం ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు కొందరు తెలిపారు. ఉల్లి @ రూ. 9 ఇది ఒక ఉల్లిపాయ రేటు కాదు.. కిలోదే! ఏ రైతు బజార్లో అని అడ్రస్సులు వెతికేయకండి.. ఇంత డెడ్‌చీప్‌గా ఇచ్చేస్తోంది ఓ ఆన్లైన్ బజార్లో.. గ్రూప్ఆన్ అనే షాపింగ్ వెబ్సైట్ ఈ సువర్ణావకాశాన్ని కల్పిస్తోంది. స్థానిక హోటళ్లలోని డిస్కౌంట్లు, సేవలు వంటివాటిల్లో రాయితీలను అందించే ఈ సైట్ ఢిల్లీకి చెందిన ఓ హోల్‌సేల్ వ్యాపారితో కలిసి ఈ డీల్‌ను అందిస్తోంది. గురువారం నుంచి ఏడురోజులపాటు ఇది అందుబాటులో ఉంటుంది. రోజూ మధ్యాహ్నం ఒంటిగంటకు డీల్ ప్రారంభమవుతుంది. రోజుకు 3 వేల కిలోల ఉల్లిపాయలను విక్రయిస్తారు. స్టాకు ముగియగానే ఆ రోజుకు డీల్ ముగిసిపోతుంది. ఉచితంగా కొరియర్ ద్వారా హోం డెలివరీ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు. మనం బుక్ చేసిన 10 రోజుల్లోగా డెలివరీ అందుతుంది. దేశంలోని 78 పట్టణాలకు చెందినవారికి ఈ డీల్ ప్రత్యేకం. కిలో మాత్రమే ఇస్తారు. వీటి కొనుగోలు కోసం ఈ సైట్లో యూజర్‌గా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రూ.9 కిలో ఉల్లిపాయలు మీకూ కావాలంటే.. www.groupon.co.inకు వెళ్లండి.