
ఢిల్లీలో విమానాల రాకపోకలకు అంతరాయం
దేశ రాజధాని ఢిల్లీలో పొగమంచు దట్టంగా ఆవహించింది. దీంతో శుక్రవారం ఉదయం విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పొగమంచు దట్టంగా ఆవహించింది. దీంతో శుక్రవారం ఉదయం విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ చేయడానికి వాతావరణం అనుకూలించకపోవడంతో ఓ విమానాన్ని దారి మళ్లించారు.
పొగమంచు రైళ్ల సర్వీసులపైనా ప్రభావం చూపించింది. ఢిల్లీలో రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. గత రెండు రోజులుగా ఢిల్లీలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో పొగమంచు ఎక్కువగా ఉంటోంది.