సాక్షి, హైదరాబాద్: దట్టమైన పొగమంచు కారణంగా దేశవ్యాప్తంగా విమానాల రాకపోకలకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పలు విమానాలు రద్దయ్యాయి. మూడు రోజుల్లో 37 విమానాల రాకపోకలను ఎయిర్‌పోర్టు అధికారులు రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
శంషాబాద్ నుండి ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు వెళ్లే విమానాలు.. ఆదివారం 14 విమానాలు, సోమవారం 15 విమానాలు, మంగళవారం 8 విమాన సర్వీసులు రద్దయ్యాయి. విమాన సర్వీసులు రద్దుతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఢిల్లీలో అయితే ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రెండ్రోజులుగా ఎయిర్‌పోర్టులో ఉండిపోయారు ప్రయాణికులు.
ఇక హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, ముంబై, కోల్‌కతా నగరాల్లోని ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులకు తలెత్తే ఇబ్బందులను పరిష్కరించేందుకు వార్‌రూమ్‌లను ఏర్పాటు చేశారు. దీంతో పాటు విమాన సర్వీసుల నిర్వహణకు సంబంధించి ఏయిర్ లైన్స్ కు స్టాండర్డ్ ఆపరేటింటగ్ ప్రొసీజర్స్(ఎస్వోపీ)ను విడుదల చేశారు. కాగా, దట్టమైన పొగమంచు కారణంగా ఆది, సోమ,మంగళవారాల్లో ఢిల్లీ ఎయిర్ పోర్టులో 100కు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. 150పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment