Canceled
-
రేపటి కేటీఆర్ నల్లగొండ పర్యటన రద్దు
-
ముంబైలో భారీ వర్షం..లోకల్ రైళ్లతో పాటు 36 విమానాలు రద్దు
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్రలోని ముంబైని ఎడతెరిపిలేని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. మహానగరం ముంబైతో పాటు సబర్బన్ ప్రాంతాలలో ఆదివారం రాత్రి 8 గంటల వరకు 100 మి.మీ.కి మించిన వర్షపాతం నమోదైంది.ముంబైలో కురుస్తున్న వర్షాల కారణంగా పలు ప్రాంతాలలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు విమానాలను దారి మళ్లించాల్సి వచ్చింది. దాదర్- మాతుంగా స్టేషన్ల మధ్య సెంట్రల్ రైల్వే సెక్షన్లో నీరు నిలిచిపోవడంతో లోకల్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో పలు రైళ్లను రద్దు చేశారు. ఇదేవిధంగా ముంబై విమానాశ్రయంలో మొత్తం 36 విమానాలు రద్దు చేశారు. ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు ఎయిర్ ఇండియా, ఇండిగో, అకాసా విమానాలతో సహా 15 విమానాలను సమీపంలోని విమానాశ్రయాలకు మళ్లించారు. -
ట్రాన్స్‌జెండర్‌కు ఘోర అవమానం!
మహారాష్ట్రకు చెందిన తొలి మరాఠీ లింగమార్పిడి (ట్రాన్స్ జెండర్) నటి ప్రణీత్ హట్టే ఇటీవల తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. తాను ఒక హోటల్లో రూమ్ బుక్ చేశారని, అయితే తాను ట్రాన్స్‌ను అయినందున సదరు హోటల్ తన బుకింగ్‌ను రద్దు చేసిందని వాపోయారు. ఈ ఘటనపై తన ఆవేదనను ఆమె ఒక వీడియోలో పంచుకున్నారు.దానిలో ప్రణీత్ హట్టే మాట్లాడుతూ ‘నేను నాసిక్‌కు ఒక షోలో పాల్గొనేందుకు వచ్చాను. ఇక్కడ ఉండేందుకు ఓ హోటల్లో రూమ్ బుక్ చేశాను. అయితే నేను ట్రాన్స్‌జండర్‌ను అయినందున హోటల్ యజమానులు నా రూమ్ బుకింగ్‌ను రద్దు చేశారు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్లాలి?’ అని ప్రశ్నించారు. ఈ వీడియో చూసిన ప్రణీత్ హట్టే అభిమానులు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఒక యూజర్ ‘నేను ఇప్పుడే ఫోన్ చేసి హోటల్వారితో మాట్లాడాను. వారు ఇప్పుడు ఖచ్చితంగా సిగ్గుపడివుంటారు’ అని రాశారు. మరో యూజర్ ‘మీరు దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేయాలి’ అని రాశారు.ప్రణీత్ హట్టే మరాఠీ నటి. ఆమె మరాఠీ చిత్రం ‘కరభారి లయభరి’లో గంగ పాత్రలో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ చిత్రం ‘హడ్డీ’లో కూడా ప్రణీత్ కనిపించారు. -
HYD: విమాన ప్రయాణికులకు తప్పని తిప్పలు
సాక్షి, హైదరాబాద్: దట్టమైన పొగమంచు కారణంగా దేశవ్యాప్తంగా విమానాల రాకపోకలకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పలు విమానాలు రద్దయ్యాయి. మూడు రోజుల్లో 37 విమానాల రాకపోకలను ఎయిర్‌పోర్టు అధికారులు రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శంషాబాద్ నుండి ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు వెళ్లే విమానాలు.. ఆదివారం 14 విమానాలు, సోమవారం 15 విమానాలు, మంగళవారం 8 విమాన సర్వీసులు రద్దయ్యాయి. విమాన సర్వీసులు రద్దుతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఢిల్లీలో అయితే ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రెండ్రోజులుగా ఎయిర్‌పోర్టులో ఉండిపోయారు ప్రయాణికులు. ఇక హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, ముంబై, కోల్‌కతా నగరాల్లోని ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులకు తలెత్తే ఇబ్బందులను పరిష్కరించేందుకు వార్‌రూమ్‌లను ఏర్పాటు చేశారు. దీంతో పాటు విమాన సర్వీసుల నిర్వహణకు సంబంధించి ఏయిర్ లైన్స్ కు స్టాండర్డ్ ఆపరేటింటగ్ ప్రొసీజర్స్(ఎస్వోపీ)ను విడుదల చేశారు. కాగా, దట్టమైన పొగమంచు కారణంగా ఆది, సోమ,మంగళవారాల్లో ఢిల్లీ ఎయిర్ పోర్టులో 100కు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. 150పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. -
ప్రభుత్వ సలహాదారుల నియామకాలు రద్దు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో నియమితులైన ప్రభుత్వ సలహాదారుల నియామకాలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వంలో ఏడుగురు అధికారులను సలహా దారులుగా నియమించగా, నియమితులైన సోమేశ్‌కుమార్, చెన్నమనేని రమేష్, రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మ, ఏకే ఖాన్, జీఆర్ రెడ్డి, ఆర్.శోభ నియామకాలను ప్రభుత్వం రద్దు చేసింది. ఇదీ చదవండి: మహాలక్ష్మీ పథకం ప్రారంభం.. మహిళలకు ఉచిత ప్రయాణం -
ఇండిగోకు భారీ షాక్: నిబంధనలు పాటించడం లేదని!
బడ్జెట్ కారియర్ ఇండిగోకు భారీ షాక్ తగిలింది. ల్యాండింగ్ సమయంలో తలెత్తిని సాంకేతిక ఇబ్బంది కారణంగా ఇండిగోపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రూ.30 లక్షల జరిమానా విధించింది. ఈ ఏడాది ఆరు నెలల వ్యవధిలో నాలుగు టెయిల్ స్ట్రైక్స్ చేసినందుకు ఇండిగోపై శుక్రవారం ఈ జరిమానా విధించింది. కార్యకలాపాలు, శిక్షణ , ఇంజినీరింగ్ విధానాలకు సంబంధించిన ఎయిర్‌లైన్ డాక్యుమెంటేషన్‌లో కొన్ని లోపాలను గుర్తించిన చోట పరిశోధనలు నిర్వహించినట్లు నియంత్రణ సంస్థ తెలిపింది. బెంగళూరు నుండి అహ్మదాబాద్‌కు వెళ్లే ఇండిగో విమానం టెయిల్ స్ట్రైక్‌ను ఎదుర్కొన్న పైలట్, కో-పైలట్ లైసెన్స్‌లను రెగ్యులేటర్ సస్పెండ్ చేసింది. ఘటన జరిగిన వెంటనే రెగ్యులేటర్ దర్యాప్తు ప్రారంభించింది. సిబ్బంది నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా ల్యాండింగ్ చేసినట్లు తాము గుర్తించామని, ఆ తర్వాత పైలట్-ఇన్-కమాండ్ లైసెన్స్ మూడు నెలలు , కో-పైలట్ లైసెన్స్‌ను ఒక నెల పాటు సస్పెండ్ చేసినట్లు DGCA తెలిపింది. (క్రిప్టో బిలియనీర్ విషాదాంతం: సూట్‌కేసులో డెడ్‌బాడీ ముక్కలు) కాగా టేకాఫ్ లేదా ల్యాండింగ్ సమయంలో విమానం టెయిల్ (తోకలాగా ఉండే వెనుక భాగం) తాకినప్పుడు లేదా రన్‌వేకి తాకినప్పుడు టెయిల్ స్ట్రైక్ సంభవిస్తుంది. ఇండిగో ఎయిర్‌లైన్స్ 2023 సంవత్సరంలో ఆరు నెలల వ్యవధిలో A321 విమానం ల్యాండింగ్ సమయంలో నాలుగు టెయిల్ స్ట్రైక్ సంఘటనలను ఎదుర్కొంది. దీనిపై రెగ్యులేటరీ ప్రత్యేక ఆడిట్‌ను నిర్వహించింది. దీనికి సంబంధించి నిర్ణీత వ్యవధిలోగా ప్రత్యుత్తరాన్ని సమర్పించాలని ఆదేశిస్తూ రెగ్యులేటర్ విమానయాన సంస్థకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ప్రత్యుత్తరాన్ని సమీక్షించిన తర్వాత, అవి సంతృప్తికరంగా లేవని డీజీసీఏ గుర్తించింది.దీంతో 30 లక్షల జరిమానాతో పాటు,నిబంధనలు, OEM మార్గదర్శకాలకు అనుగుణంగా పత్రాలు, విధానాలను సవరించాలని కూడా ఇండిగోను ఆదేశించింది. (ఇషా అంబానీ అంటే అంతే: అన్‌కట్‌డైమండ్ నెక్లెస్ ఖరీదు తెలుసా?) -
తాళి కడుతున్న ముందే చెప్పు.. విందులో నాన్‌వెజ్ పెడుతున్నారుగా..!
తాళి కడుతున్న ముందే చెప్పు.. విందులో నాన్‌వెజ్ పెడుతున్నారుగా..! -
జపాన్ ఫార్ములావన్ రద్దు
టోక్యో: ఏడాది వాయిదా పడినా కూడా ఒలింపిక్స్‌ను అద్భుతంగా నిర్వహించిన దేశం జపాన్. పారాలింపిక్స్ కూడా ఈ నెల 24 నుంచి అక్కడే జరగనున్నాయి. అయితే వందల సంఖ్యలో దేశాలు, వేల సంఖ్యలో అథ్లెట్లు పాల్గొనే మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమిచ్చిన టోక్యో నగరం పదుల సంఖ్యలో జరిగే ఫార్ములావన్ జపనీస్ గ్రాండ్ ప్రి ఈవెంట్‌ను నిర్వహించలేమని చేతులెత్తేసిం ది. కరోనా మహమ్మారి కారణంగా తమ దేశంలో జరగాల్సిన ఫార్ములావన్‌ను రద్దు చేస్తున్నట్లు బుధవారం నిర్వాహకులు ప్రకటించారు. సుజుకా ట్రాక్‌పై అక్టోబర్ 10న జపాన్ గ్రాండ్ ప్రి జరగాల్సివుంది. ప్రభుత్వం, రేస్ ప్రమోటర్లు, ఫార్ములావన్ వర్గాలు దీనిపై చర్చించిన అనంతరం ఈ సీజన్ రేసు రద్దయింది. -
సైనా, శ్రీకాంత్ ఒలింపిక్స్ ఆశలు ఆవిరి!
న్యూఢిల్లీ: చివరి నిమిషంలో అర్హత నిబంధనలలో మార్పులు చేస్తే తప్ప... టోక్యో ఒలింపిక్స్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ ఆటను చూసే భాగ్యం లేనట్టే. ఆసియాలో కరోనా వైరస్ ఉధృతి ఇంకా కొనసాగుతుండటంతో... క్రీడాకారులతోపాటు టోర్నీ సహాయక సిబ్బంది, ఇతర వర్గాల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని జూన్ 1 నుంచి 6 వరకు జరగాల్సిన సింగపూర్ ఓపెన్ సూపర్–500 టోర్నీని రద్దు చేస్తున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) బుధవారం ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్ అర్హత టోర్నీలలో భాగమైన ఇండియా ఓపెన్, మలేసియా ఓపెన్‌ను కరోనా కారణంగానే వాయిదా వేయగా... సింగపూర్ ఓపెన్‌ను ఏకంగా రద్దు చేయడంతో చివరి అవకాశంగా టోక్యో ఒలింపిక్స్ బెర్త్ ఖరారు చేసుకోవాలన్న భారత స్టార్స్ సైనా, శ్రీకాంత్‌లకు నిరాశ ఎదురైంది. భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారత్ నుంచి వచ్చే అన్ని విమానాలపై సింగపూర్ నిషేధం విధించింది. మరోవైపు జూన్, జూలైలలో జరగాల్సిన ఇతర టోర్నీలు కొరియా మాస్టర్స్, ఇండోనేసియా మాస్టర్స్ వాయిదా పడగా... ఇండోనేసియా ఓపెన్ సూపర్–1000 టోర్నీ, థాయ్‌లాండ్ ఓపెన్, యూఎస్ ఓపెన్ టోర్నీలు రద్దయ్యాయి. దాంతో ఈ ఏడాది జూలై 23న టోక్యో ఒలింపిక్స్ మొదలయ్యే వరకు అంతర్జాతీయ ఎలాంటి బ్యాడ్మింటన్ టోర్నీలు లేకుండా పోయాయి. ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలు రద్దయిన నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్ అర్హత నిబంధనల వివరాలపై మరో ప్రకటన విడుదల చేస్తామని బీడబ్ల్యూఎఫ్ తెలిపింది. టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ నిబంధనల ప్రకారం సింగిల్స్‌లో ఒకే దేశం నుంచి ఇద్దరు అర్హత పొందాలంటే టాప్–16లో కచ్చితంగా ఉండాలి. ప్రస్తుతం ‘టోక్యో’ క్వాలిఫయింగ్ ర్యాంకింగ్స్‌లో మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు ఏడో ర్యాంక్‌లో... సైనా 22వ ర్యాంక్‌లో ఉంది. దాంతో సింధుకు ‘టోక్యో’ బెర్త్ ఖరారయింది. పురుషుల సింగిల్స్‌లో సాయిప్రణీత్ 13వ ర్యాంక్‌లో ఉండగా... శ్రీకాంత్ 20వ స్థానంలో ఉన్నాడు. దాంతో సాయిప్రణీత్‌కు టోక్యో బెర్త్ ఖాయమైంది. పురుషుల డబుల్స్‌లో తొమ్మిదో ర్యాంక్‌లో ఉన్న సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట కూడా ‘టోక్యో’ బెర్త్ దక్కించుకుంది. 31 ఏళ్ల సైనా నెహ్వాల్ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్ చేరగా... 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. ప్రపంచ మాజీ నంబర్‌వన్ అయిన శ్రీకాంత్ 2016 రియో ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయాడు. -
మీ శ్రేయస్సు దృష్ట్యా సభకు రాలేకపోతున్నా: సీఎం జగన్
-
మీ శ్రేయస్సు దృష్ట్యా సభకు రాలేకపోతున్నా: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుపతి ఉపఎన్నిక ప్రచార సభ రద్దు అయ్యింది. కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా సభకు రాలేకపోతున్నానని సీఎం పేర్కొన్నారు. ఈ మేరకు తిరుపతి ప్రజలకు సీఎం వైఎస్ జగన్ బహిరంగ లేఖ రాశారు. ‘‘నిన్న ఒక్కరోజే 2,765 కరోనా కేసులు వచ్చాయి. చిత్తూరులో 496, నెల్లూరులో 296 కేసులు వచ్చాయి. 24 గంటల వ్యవధిలో ఈ రెండు జిల్లాల్లో కరోనాతో నలుగురు మృతి చెందారు. తిరుపతి సభకు నేను హజరైతే వేలాదిగా జనం తరలివస్తారు. ప్రజల ఆరోగ్యం, ఆనందం నాకు ముఖ్యం. బాధ్యత కలిగిన సీఎంగా తిరుపతి సభ రద్దు చేసుకుంటున్నా. ప్రతి కుటుంబానికి కలిగిన లబ్ధికి సంబంధించిన వివరాలతో.. నా సంతకంతో ఇంటింటికి అందేలా ఉత్తరం రాశా. మీ అందరి కుటుంబాల శ్రేయస్సు దృష్ట్యా నేను రాలేకపోయినా.. 22 నెలల్లో మీకు చేసిన మంచి మీ అందరికి చేరిందన్న నమ్మకం నాకుంది.. గతంలో వచ్చిన 2.28 లక్షల కన్నా ఎక్కువ మెజారిటీతో అభ్యర్థిని గెలిపించాలి. డా. గురుమూర్తికి ఓటు వేయాలని రాసిన ఉత్తరం మీకు చేరిందని భావిస్తున్నా. డా. గురుమూర్తిని తిరుగులేని మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నా. మీ అందరి చల్లని దీవెనలు ఓటు రూపంలో ఇస్తారని భావిస్తున్నానని’’ లేఖలో సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. చదవండి: తిరుపతి టీడీపీ ప్రచారంలో కరోనా కలకలం 32.70 లక్షల మందికి వ్యాక్సిన్ -
చైనాలో 11 అంతర్జాతీయ టెన్నిస్ టోర్నీలు రద్దు
వాషింగ్టన్: చైనాలో జరగాల్సిన పలు అంతర్జాతీయ టెన్నిస్ టోర్నీలపై కరోనా ప్రభావం చూపింది. ఈ దెబ్బకి సీజన్ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌తో పాటు మరో 10 టోర్నీలను రద్దు చేస్తున్నట్లు ఏటీపీ, డబ్ల్యూటీఏ వర్గాలు శుక్రవారం ప్రకటించాయి. దీంతో చైనా వేదికగా అక్టోబర్–నవంబర్ మధ్య పురుషుల, మహిళల విభాగాల్లో జరగాల్సిన మొత్తం 11 టోర్నీలు రద్దు అయ్యాయి. ఇందులో ఏడు మహిళల విభాగంలో (చైనా ఓపెన్, వుహాన్, జియాంగ్జి , జెంగ్జూ డబ్ల్యూటీఏ ఫైనల్స్, గ్వాంగ్జూ, జుహై ఓపెన్) ఉండగా... మిగతా నాలుగు (చైనా ఓపెన్, షాంఘై మాస్టర్స్ సిరీస్, చెంగ్డూ, జుహై ఓపెన్) పురుషుల విభాగానికి చెందినవి. చైనా ప్రభుత్వ క్రీడా పాలకుల సూచనల ప్రకారమే ఏటీపీ, డబ్ల్యూటీఏ ఈ నిర్ణయం తీసుకున్నాయి. -
వింబుల్డన్ టోర్నమెంట్ రద్దు
లండన్: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అసాధారణ పరిస్థితులదృష్ట్యా... ఈ ఏడాది ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌ను రద్దు చేస్తున్నట్లు ఆల్ ఇంగ్లండ్ లాన్‌టెన్నిస్ క్లబ్ (ఏఈఎల్టీసీ) బుధవారం అధికారికంగా ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీ జూన్ 29 నుంచి జూలై 12 వరకు జరగాల్సింది. వచ్చే ఏడాది వింబుల్డన్ టోర్నీ జూన్ 28 నుంచి జూలై 11 వరకు జరుగుతుందని ఏఈఎల్టీసీ తెలిపింది. రెండో ప్రపంచ యుద్ధం కారణంగా వింబుల్డన్ టోర్నీని 1940 నుంచి 1945 వరకు నిర్వహించలేదు. ఆ తర్వాత 1946 నుంచి ప్రతి యేటా వింబుల్డన్ నిరాటంకంగా కొనసాగింది. అయితే కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తుండటంతో అందరి ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి వింబుల్డన్‌ను రద్దు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వింబుల్డన్ టోర్నీ రద్దు కావడంతో జూలై 13 వరకు ఎలాంటి టెన్నిస్ టోర్నీలు లేవని అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ), మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) తెలిపాయి. -
ఇంజినీర్లకు ఊరట!
రాష్ట్ర జలవనరుల శాఖలో తన అనుయాయులను కీలక పోస్టుల్లో నియమించుకునేందుకు గత టీడీపీ ప్రభుత్వం జారీచేసిన అడ్డగోలు ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు అడ్డంగా కొట్టేసింది. రాజ్యాంగంలోని రాష్ట్రపతి ఉత్తర్వులకు, జోనల్ వ్యవస్థకు భిన్నంగా ఉన్నాయని స్పష్టం చేస్తూ తీర్పు ఇచ్చింది. టీడీపీ నాయకుల వ్యవహారాల వల్ల నష్టపోయిన ముఖ్యంగా ఉత్తరాంధ్రకు చెందిన ఇంజినీర్లకు దీంతో ఎంతో ఊరట లభించింది. సాక్షి, విశాఖపట్నం: పదోన్నతులు ఒక పద్ధతి ప్రకారం జరిగితే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (డీఈఈ) కనిష్టంగా మూడేళ్ల సర్వీసుతో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ)గా పదోన్నతి పొందుతారు. ఈఈ కూడా కనిష్టంగా మూడేళ్ల సర్వీసు తర్వాత సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్ఈ) అవుతారు. ఎస్ఈ పదోన్నతిపై చీఫ్ ఇంజినీర్ (సీఈ) పోస్టులోకి వెళతారు. కానీ టీడీపీ ప్రభుత్వ హయాంలో నాటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మంత్రాంగంతో పదోన్నతుల విధానం క్రమం తప్పింది. తనకు కావాల్సిన వ్యక్తులను కీలక పోస్టుల్లో కూర్చోబెట్టుకునేందుకు నిబంధనలను, పదోన్నతుల సంప్రదాయాలను తుంగలోకి తొక్కారు. దీంతో జోన్–1 ప్రాంతమైన ఉత్తరాంధ్రకు చెందిన ఇంజినీర్లు తీవ్రంగా నష్టపోయారు. 53 మంది ఇంజినీర్లు తామున్న పోస్టు నుంచి దిగువ పోస్టుకు రివర్సన్ అయ్యారు. చివరకు 2014 సంవత్సరంలో ఇంటిగ్రేటెడ్ సీనియారిటీ ద్వారా పదోన్నతి పొందినవారికీ రివర్సన్ వచ్చిందంటే టీడీపీ ప్రభుత్వ అడ్డగోలు వ్యవహారం ఏ స్థాయిలో జరిగిందో ఊహించవచ్చు. ఇదేమి న్యాయమంటూ ఉత్తరాంధ్ర ఇంజినీర్లు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. దీంతో ఏకంగా 31 మంది బాధిత ఇంజినీర్లు హైకోర్టును ఆశ్రయించారు. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విషయం కాబట్టి తెలంగాణ హైకోర్టు పరిధిలో విచారణ జరిగింది. జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు, జస్టిస్ లక్ష్మణ్‌లతో కూడిన ధర్మాసనం ఈనెల 22వ తేదీన తీర్పు ఇచ్చింది. ఐదుగురు రిటైర్డ్ ఇంజినీర్ల కమిటీ సిఫారసులను సాకుగా చూపించి 2017లో టీడీపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది. నిబంధనలకు అనుగుణంగా జలవనరుల శాఖలో పదోన్నతుల ప్రక్రియను రెండు నెలల్లోగా చక్కదిద్దాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఊరట చెందిన ఉత్తరాంధ్ర ఇంజినీర్ల సంఘం హర్షం ప్రకటించింది. ఏమిటీ వివాదం? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆరు జోన్లను విద్య, ఉద్యోగాల విషయంలో సమన్యాయం చేయాలనే ఉద్దేశంతో భౌగోళికంగా విభజించారు. విద్య, ఉద్యోగ, ఆర్థిక అంశాల్లో వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే భారత రాజ్యాంగంలోని 371(డి) అధికరణ ప్రకారం ఈ ఏర్పాటు చేశారు. 1975 సంవత్సరంలో 32వ రాజ్యాంగం సవరణ ద్వారా దీన్ని రాజ్యాంగంలో చేర్చారు. ఈ ప్రకారం రాష్ట్రంలోని జోన్–1లో ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు, జోన్–2లో ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలు, జోన్–3లో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, జోన్–4లో రాయలసీమ నాలుగు జిల్లాలు ఉన్నాయి. హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లాలన్నీ 5, 6 జోన్లలో ఉన్నాయి. కొన్ని విభాగాల్లో ఉద్యోగులు తమ విద్యాభ్యాసం, స్థానికత ఆధారంగా సొంత జోన్లలోనే పనిచేసే అవకాశం కల్పిస్తూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 610 జీవో తీసుకొచ్చారు. ఏ జోన్‌కు చెందినవారు ఆ జోన్లోనే ఎక్కువ కాలం పనిచేస్తే స్థానిక పరిస్థితులపై పూర్తిస్థాయి అవగాహనతో ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వహించవచ్చనేది ఆ జీవో ఉద్దేశం. ఈ ప్రకారమే ఇప్పటివరకూ జోన్ల వ్యవస్థ అమల్లో ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కీలకమైన జలవనరుల శాఖలో కీలకమైన పోస్టుల్లో తమకు కావాల్సినవారిని కూర్చోబెట్టడానికి ఈ జోన్ల విధానంపై సరికొత్త ఆలోచనకు తెరతీశారు. నాటి మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు మౌఖికంగా ఆదేశాలివ్వడంతో ఇంజనీర్–ఇన్–చీఫ్ కార్యాలయం కసరత్తు ప్రారంభించింది. ఈ విషయం తెలిసి ఉత్తరాంధ్ర ఇంజినీర్ల సంఘం తీవ్రంగా వ్యతిరేకించింది. రాజధాని అమరావతికి వెళ్లి మరీ రద్దు నిర్ణయం వద్దంటూ వేడుకున్నారు. తర్వాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి విన్నవించారు. భయపడినట్లు ఏమీ జరగదని, అందరికీ న్యాయం జరుగుతుందని సర్దిచెప్పి పంపించారు. తీరా రాష్ట్రంలోని 83 మంది ఇంజినీర్లకు రివర్సన్ ఇచ్చేశారు. వారిలో ఉత్తరాంధ్రకు చెందినవారే 53 మంది ఉన్నారు. వారికి రివర్సన్ ఇస్తూ నాటి ప్రభుత్వం 2017, 2018 సంవత్సరంలో జీవోలు జారీ చేసింది. వారిలో ఇద్దరు చీఫ్ ఇంజినీర్లు ఉండటం గమనార్హం. వారికన్నా దిగువస్థాయిలోని సూపరింటెండెంట్ ఇంజినీరు (ఎస్ఈ)గా మారిపోయారు. ఎస్ఈ పోస్టు నుంచి 19 మంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు (ఈఈ)గా మారిపోయారు. ఈఈ పోస్టు నుంచి 32 మందికి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు (డీఈఈ)గా రివర్సన్ అయ్యారు. ఇలా దిగువ స్థాయికి వెళ్లి పోస్టింగ్‌లోకి వెళ్లడం ఇష్టంలేక చాలామంది దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారంటే పరిస్థితిని ఊహించవచ్చు. -
ఆస్తి కాజేసేందుకు కుట్ర
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): హామీగా చేసిన రిజిస్ట్రేషన్ రద్దు చేయకుండా అన్యాయంగా తమ ఆస్తిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ అశోక్‌నగర్‌కు చెందిన ఆశాలత మీడియా ఎదుట వాపోయింది. తమ కుటుంబ అవసరాల నిమిత్తం తీసుకున్న అప్పును వడ్డీతో సహా చెల్లించినా...అప్పు తీరలేదని హామీగా చేసిన రిజస్ట్రేషన్ రద్దు చేయడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇంటికి వచ్చి తమపై దాడికి యత్నించారని వాపోయింది. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ తమ కుటుంబ అవసరాల కోసం భర్త హరికృష్ణతో కలిసి 2016లో నాగమణి, రామకృష్ణల దగ్గర కొంత నగదు అప్పుగా తీసుకున్నానని చెప్పారు. అప్పు తీర్చడం కోసం ఆస్తిని అడుసుమిల్లి మోహనరామదాసుకు వారిద్దరు రిజిస్ట్రేషన్ చేయించారని పేర్కొన్నారు. హామీ పెట్టాలని పటమటలోని 400 చ.గల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్నారు. హామీగా మాత్రమే స్థలం రిజిస్ట్రేషన్ జరుగుతుందని, అప్పుతీర్చినవెంటనే రద్దు చేస్తామని నమ్మబలికారని కన్నీటి పర్యంతమయ్యారు. రిజిస్ట్రేషన్ తర్వాత రూ.10 ఆపైన వడ్డీ లెక్కగట్టి కోట్ల రూపాయల విలువచేసే తమ ఆస్తిని కాజేయాలని కుట్ర పన్నారన్నారు. లక్షల రూపాయలు చెల్లించినా వడ్డీకే చాలలేదంటూ ఒత్తిడికి గురిచేశారన్నారు. మరోచోట ఉన్న 200 చ.గల స్థలాన్ని రిజిస్రేషన్ చేయించుకున్నారన్నారు. నా భర్తను బెదిరించి అశోక్‌నగర్‌లో ఉన్న 195 గజాల ఇంటిని తనఖా చేయించుకున్నారని వాపోయింది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ చేసిన స్థలాలు, ఇల్లు ఖాళీచేయాలంటూ రామదాసు కుమారుడు నందు, రామకృష్ణ, నాగమణి దౌర్జన్యం చేస్తున్నారన్నారు. శనివారం ఉదయం స్థలం వద్దకు వచ్చి గేటు తాళం పగులగొట్టారని, ఎలాగైనా స్వాధీనం చేసుకుంటామని బెదిరించారని తెలిపింది. భయపడి కంట్రోల్ రూమ్‌కు కాల్ చేయడంతో పటమట పోలీసులు వచ్చి కాపాడారని తెలిపింది. వారినుంచి తమను కాపాడాలని పోలీసులను వేడుకుంది. -
ఏపీఎస్ఆర్టీసీలో డబుల్ డ్యూటీలు రద్దు!
-
జంతు హింస నివారణ సంఘ కమిటీ రద్దు
కాకినాడ ఆర్డీవో చైర్మన్‌గా సబ్ కమిటీ 13 మందిపై కేసు నమోదు ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్ కాకినాడ సిటీ: జంతుహింస నివారణ కేంద్రం ప్ర„ýక్షాళనకు కలెక్టర్ కార్తికేయ మిశ్రా చర్యలు చేపట్టారు. ఇటీవల కేంద్రంలో సుమారు 30కి పైగా పశువులు మరణించిన విషయం తెలిసిందే. పిఠాపురం మహారాజా మెమోరియల్ జంతు హింస నివారణ సంస్థ నిర్వహణ బాగోలేదని నిర్ణయించి ఈ మేరకు ఇప్పటి వరకు ఉన్న సంఘ కమిటీని రద్దు చేస్తూ శుక్రవారం కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కాకినాడ ఆర్డీఓను చైర్మన్‌గా ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ కమిటీలో జిల్లా పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్‌తో పాటు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లను కన్వీనర్లుగా, జిల్లా ఎస్పీ నిర్ణయించిన వారిలో ఒకరిని, రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులను సభ్యులుగా నియమించారు. కాకినాడ ఆర్డీవో పర్యవేక్షణ, జంతుహింస నివారణ కేంద్రం పరిసరాలు శుభ్రత విషయంలో చర్యలకు మున్సిపల్ కమిషనర్‌నూ, పశువుల మేత, ఆరోగ్య రక్షణతోపాటు అనారోగ్యం బారిన పడిన పశువులు కోలుకునేందుకు అవసరమైన వైద్య ఏర్పాట్లు చేయాలని పశుసంవర్థకశాఖ జేడీని ఆదేశించారు. కేంద్రంలో పరిస్థితి చక్కబడే వరకు కొత్త పశువులను అనుమతించకూడదని, ప్రస్తుతం ఉన్న వాటిలో ఆరోగ్యంగా ఉన్న సుమారు 150 పశువులను పోషణకు గాను రంపచోడవరం ఐటీడీఏకు అందజేసేలా ఆదేశాలు జారీ చేశారు. సబ్ కమిటీ వారానికి ఒకసారి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. . విరాళాలు అందజేయాలి... జంతుహింస నివారణా కేంద్రానికి విరాళాలు ఇవ్వదలచినవారు రెవెన్యూ డివిజనల్ అధికారి కాకినాడ పేరన ఉన్న బ్యాంకు అకౌంటుకు అందజేయవచ్చని ఆర్డీవో ఎల్.రఘుబాబు ఒక ప్రకటనలో కోరారు. మరిన్ని వివరాల కోసం కాకినాడ ఆర్డీవో కార్యాలయం 0884–2368100 ఫోన్ నెంబర్‌కు సంప్రదించవచ్చన్నారు. . 13 మంది కమిటీ సభ్యులపై కేసు నమోదు: పశువులు చనిపోవడానికి కారణంగా భావిస్తూ 13 మంది కమిటీ సభ్యులపై ఐపీసీ 428, 429 సెక్షన్ల కింద సర్పవరం పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు స్టేషన్ సీఐ చైతన్యకృష్ణ వివరించారు. -
శంషాబాద్‌లో పలు విమాన సర్వీసుల రద్దు
శంషాబాద్ (రాజేంద్రనగర్): వర్షం కారణంగా శంషాబాద్ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే పలు దేశీయ విమాన సర్వీసులు సోమవారం ఆల స్యంగా నడవగా.. మరికొన్ని సర్వీసులు రద్దయ్యాయి. సోమవారం ఉదయం ఇక్క డి నుంచి నాగ్‌పూర్ వెళ్లాల్సిన విమానంతో పాటు చెన్నై, బెంగళూరు, తిరుపతి, గోవా, కొచ్చిన్, చండీఘడ్, ముంబై వెళ్లాల్సిన గో ఎయిర్, జెట్ ఎయిర్వేస్, ట్రూజెట్, ఇండిగో సర్వీసులను రద్దు చేశారు. దీంతో పాటు వర్షం కారణంగా పలు సర్వీసులు నిర్ణీత సమయాని కంటే 45 నిమిషాల నుంచి గంట ఆలస్యంగా నడిచాయి. సాయంత్రం 5 గంటలకు ముంబై వెళ్లా ల్సిన ఎయిర్ ఇండియా విమానం రాత్రి 9 గంటలకు బయలుదేరే అవకాశం ఉందని ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. అలాగే సాయంత్రం 6.10 గంటలకు వెళ్లాల్సిన కొచ్చిన్ విమానం రాత్రి 9 గంటల తర్వాత బయలుదేరనున్నట్లు వెల్లడించాయి. -
‘ఒబామా కేర్’ రద్దుకు ఆమోదం
వాషింగ్టన్: ఒబామా కేర్‌ను రద్దు చేస్తూ, కొత్త వైద్య విధానానికి ఆమోదం తెలుపుతూ అమెరికా ప్రతినిధుల సభ గురువారం అనుకూలంగా ఓటేసింది. కొత్తగా రూపొందించిన అమెరికన్ హెల్త్ కేర్ యాక్ట్‌కు 217–213 ఓట్ల తేడాతో సభ ఆమోదం తెలిపింది. డెమోక్రాట్ సభ్యులంతా కొత్త బిల్లును వ్యతిరేకించగా.. రిపబ్లికన్లు అనుకూలంగా ఓటేశారు. అయితే దాదాపు 20 మంది రిపబ్లికన్లు బిల్లును వ్యతిరేకించినట్లు సమాచారం. ఈ ఓటింగ్ కోసం ఏడేళ్లుగా ఎదురుచూస్తున్నామని ప్రతినిధుల సభ స్పీకర్ పాల్ ర్యాన్ పేర్కొన్నారు. అయితే ఈ బిల్లును సెనెట్ ఆమోదించాల్సి ఉంది. -
ఎయిర్ కోస్టా చేజారిన విమానాలు
⇒ ఉన్న రెండూ జీఈ క్యాపిటల్ వద్ద లీజుకు తీసుకున్నవే ⇒ జీఈ అభ్యర్థనతో రద్దు చేసిన డీజీసీఏ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న విమానయాన సంస్థ ఎయిర్ కోస్టాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఎయిర్ కోస్టా పేరున నమోదైన రెండు విమానాలను కేంద్ర పౌర విమానయాన శాఖ (డీజీసీఏ) రద్దు చేసింది. ఇప్పటికే పైలట్లతో సహా సగానికిపైగా సిబ్బంది కంపెనీకి గుడ్‌బై చెప్పేసిన సంగతి తెలిసిందే. తాజాగా డీజీసీఏ తీసుకున్న నిర్ణయం కంపెనీకి పెద్ద షాక్ అని చెప్పవచ్చు. 112 సీట్లున్న ఎంబ్రార్ ఈ–190 రకానికి చెందిన ఈ విమానాలను జీఈ క్యాపిటల్ ఏవియేషన్ సర్వీసెస్ సమకూర్చింది. విమానాలను లీజుకు తీసుకున్న ఎయిర్ కోస్టా అద్దె చెల్లించకపోవడంతో జీఈ అభ్యర్థన మేరకు డీజీసీఏ తాజా నిర్ణయం తీసుకుంది. రెండు విమానాలను జీఈ తన స్వాధీనంలోకి తీసుకుంది. 2017 ఫిబ్రవరి 28 నుంచి విమాన సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. మే 31 వరకు సర్వీసులు రద్దు చేస్తున్నట్టు ఎయిర్ కోస్టా ఇది వరకే ప్రకటించింది. ఆందోళనకు సిబ్బంది రెడీ..: ఉద్యోగులకు చెల్లించాల్సిన జనవరి, ఫిబ్రవరి వేతనాలను కంపెనీ ఇప్పటికీ చెల్లించలేదు. మొత్తం 600 మంది ఉద్యోగుల్లో సగానికి పైగా కంపెనీకి రాజీనామా చేశారు. మిగిలినవారూ ఒక్కరొక్కరుగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. 40 మంది పైలట్లు సైతం ఇతర సంస్థల్లో చేరిపోయారు. వేతనాలు ఇప్పటి వరకు చెల్లించకపోవడంతో మిగిలిన ఉద్యోగులు పోరాటానికి దిగాలని నిర్ణయించినట్టు ఒక సీనియర్ ఉద్యోగి సాక్షి బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. విజయవాడలోని కంపెనీ కార్యాలయం ముందు నిరసన తెలియజేయనున్నట్లు చెప్పారాయన. ఇంత జరుగుతున్నా ఎల్ఈపీఎల్ ఇప్పటి వరకు స్పందించకపోవడం శోచనీయమని వ్యాఖ్యానించారు. మే 31 తర్వాత కూడా ఎయిర్ కోస్టా సర్వీసులు పునరుద్ధరించే చాన్స్ లేదని స్పష్టమవుతోందన్నారు. -
నా ఫౌండేషన్ రద్దు చేస్తున్నా: ట్రంప్
వెస్ట్ పామ్ బీచ్: తన చారిటబుల్ ఫౌండేషన్‌ను రద్దు చేస్తున్నట్లు అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం వెల్లడించారు. వచ్చే నెలలో పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నందున వివాదాలను తొలగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. దశాబ్దాలుగా ఈ ఫౌండేషన్ డబ్బులు నూటికి నూరుశాతం సేవ కోసమే వెచ్చిస్తున్నామని పేర్కొన్నారు. కాగా, ఈ ఫౌండేషన్ ట్రంప్‌కు అనుకూలంగా ప్రచారం చేసేందుకు నిధులు ఖర్చు చేసిందన్న ఆరోపణలపై న్యూయార్క్ ఏజీ కార్యాలయం విచారణ చేపట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం. -
టికెట్ల రద్దు ప్రహసనమే
నగదు చెల్లించని రైల్వే అధికారులు పెద్ద ప్రక్రియ అనంతరం బ్యాంకు అకౌంట్లలోకి జమ అవస్థలు పడుతున్న ప్రయాణికులు రాజమహేంద్రవరం సిటీ : పెద్ద నోట్ల రద్దు రైల్వే ప్రయాణీకుల సమస్యగా మారింది. రైల్వే టిక్కెట్ రద్దు చేసుకోవాలంటే గంట పాటు ప్రయాస పడాల్సి వస్తోం. టికెట్ రద్దు తరువాత తిరిగి డబ్బులు ఇస్తున్నారా అంటే టికెట్ డిపోజిట్ రసీదు ఇచ్చి, దాన్ని సికింద్రాబాద్ రైల్ నిలయానికి పంపాలని సూచిస్తున్నారు. ఇలా ప్రయాణీకులు తమ టిక్కెట్లను రద్దు చేసుకోవాలంటే మొదటగా రిజర్వేష¯ŒS కౌంటర్లో టిక్కెట్ రద్దు చేసుకుని, తరువాత మొదటి ప్లాట్‌ఫామ్ పై ఉన్న చీఫ్ టిక్కెట్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని సంప్రదించి బ్యాంక్, ఆధార్ వివరాలతో దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంత తతంగం నడిచిన తరువాత కూడా మీ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలకు జమ అవుతాయని అంటుండడంతో ప్రయాణికులు ఆశ్చర్యపోతునారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం ఇప్పటివరకూ రాజమహేంద్రవరం రైల్వేస్టేçÙ¯ŒSలో ఇప్పటివరకూ 641 మంది వారి తమ టికెట్లు రద్దు చేసుకున్నారు. వారికి రైల్వే శాఖ ప్రయాణీకులకు 4లక్షల 58 వేల335 రూపాయలు ఇవ్వాల్సి ఉంది. అలాగే ద్వారపూడి, పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు ప్రాంతాల్లోని ప్రయాణికులు రాజమహేంద్రవరం రైల్వే స్టేష¯ŒSకు రావాల్సి ఉండడంతో వారు ఇబ్బందులు వర్ణనాతీతం. -
వైఎస్ జగన్ తూ.గో.జిల్లా పర్యటన వాయిదా
-
వైఎస్ జగన్ తూర్పుగోదావరి పర్యటన వాయిదా
కాకినాడ: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా పర్యటన వాయిదా పడింది. ఈ నెల 17న జిల్లాలోని తొండంగి దివీస్ ప్రభావిత గ్రామాల్లో వైఎస్ జగన్ పర్యటించాల్సి ఉంది. కాగా అనివార్య కారణాల వల్ల ఆయన పర్యటన వాయిదా పడింది. ఈ నెల 22 న ఆయా గ్రామాల్లో జగన్ పర్యటించి దివీస్ వ్యతిరేక ఉద్యమానికి మద్ధతు ఇవ్వనున్నారు. అదే విధంగా దివీస్ ఉద్యమంలో గాయపడ్డ బాధితులను వైఎస్ జగన్ పరామర్శించనున్నట్టు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు కురసాల కన్నబాబు తెలిపారు. కాగా తొండంగి మండలం కోన తీరప్రాంతంలో దివీస్ లేబొరేటరీస్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పరిసర గ్రామాల రైతులు ఆ భూముల్లోకి ప్రవేశించి పనులను అడ్డుకున్న విషయం తెలిసిందే. దానవాయిపేట పంచాయతీ కొత్తపాకలు గ్రామంలో ప్రభుత్వం దివీస్ లేబొరేటరీస్‌కు 505 ఎకరాలు కేటాయించింది. ఇటీవల రెవెన్యూ అధికారులు ఎకరాకు రూ.5 లక్షల పరిహారం చెల్లించి కొంతమంది రైతుల నుంచి భూములు సేకరించారు. అయితే ఈ పరిశ్రమ వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని, గాలి, నీరు, నేల కలుషితమై తీరప్రాంత గ్రామాల మనుగడ దెబ్బ తింటుందని పేర్కొంటూ.. పంపాదిపేట, కొత్తపాకలు, తాటియాకులపాలెం తదితర గ్రామాల రైతులు భూములిచ్చేది లేదంటూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. -
అంబేద్కర్ స్టడీ సర్కిల్ అడ్‌హక్ కమిటీని రద్దు చేయాలి
మెదక్ మున్సిపాలిటీ: బి.ఆర్.అంబేద్కర్ స్టడీ సర్కిల్ అడ్‌హక్ కమిటీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉపకులాలను విస్మరించడం అన్యాయమని దళిత బహుజన ఐక్య వేదిక నాయకులు ఆగ్రహంవ్యక్తంచేశారు. దళిత ఐక్య వేదిక సమావేశం మంగళవారం మెదక్పట్టణలలోని ఆర్అండ్బి అతిథిగృహంలో జరిగింది. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఒక కులానికి చెందిన వ్యక్తి కాదని, ఓ వర్గం వారు అంబేద్కర్ తమ సొంతం అన్నట్లు అడ్‌హక్ కమిటీ ఏర్పాటు చేయడం దారుణమన్నారు. అంబేద్కర్ సమాజంలోని అన్ని కులాల ఆరాధ్యుడన్నారు. అడహక్ కమిటీని రద్దు చేసి, తిరిగి అన్ని కులాలను కలుపుకొని కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో రామస్వామి, అనంతరావు, దేవయ్య, శంకర్, శేఖర్, భాస్కర్, డానియల్, వినయ్‌సాగర్, అభి, ప్రసాద్, యేసు, గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వమే బాధ్యత వహించాలి...
ఎంసెట్-3 వైఫల్యంపై కిషన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్ : పరీక్షాపత్రం వెల్లడైన కారణంగా ఎంసెట్-2ని రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎంసెట్-3ని నిర్వహించడంలో కూడా పూర్తిగా విఫలమైందని బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి విద్యార్థుల పాలిట శాపంగా మారుతోందని ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. ఎంసెట్-3 ప్రశ్నాపత్రంలో 160కి గానూ 15 ప్రశ్నల్లో తప్పులు దొర్లాయంటే ప్రభుత్వం ఎంత నిరక్ష్యం వహించిందో అర్థమవుతోందన్నారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యారంగంపై దృష్టి సారించి విద్యార్థుల భవిష్యత్‌కు ఇబ్బంది కలగని విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
హన్మకొండ జిల్లా రద్దు!
- ప్రజాభిప్రాయంపై సీఎంకు నివేదికలు - కొత్తగా వరంగల్ రూరల్ జిల్లా - కాకతీయ లేదా భద్రకాళి పేరు పెట్టే యోచన - అధికారులతో కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష - జిల్లాలపై వెల్లువెత్తుతున్న అభ్యంతరాలు - ఇప్పటికే 30 వేలు దాటిన వైనం సాక్షి,హైదరాబాద్: కొత్త జిల్లాల ముసాయిదాపై వెల్లువెత్తుతున్న ప్రజాభిప్రాయాలను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటోంది. వరంగల్ జిల్లాలో కొత్తగా ప్రతిపాదించిన వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలపై పునరాలోచనలో పడింది. వరంగల్ సిటీ కేంద్రంగా ఉన్న వరంగల్, హన్మకొండలను రెండు జిల్లాలుగా విభజించడంపై అక్కడి ప్రజల నుంచి వ్యతిరేకత పెల్లుబికింది. వరంగల్, హన్మకొండ, ఖాజీపేట నగరాలు మూడూ ఒకే జిల్లాలో ఉండాలనే అభిప్రాయాలకు ఎక్కువ మంది మొగ్గుచూపారు. ఇంటెలిజెన్స్‌తో పాటు వివిధ వర్గాల నుంచి ఈ సమాచారాన్ని సేకరించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్ శర్మతో పాటు ముఖ్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా వరంగల్ జిల్లా అంశమే చర్చకు వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. హన్మకొండకు బదులు వరంగల్‌ను జిల్లాగా కొనసాగించాలనే ప్రతిపాదనపై ముఖ్యమంత్రి సమక్షంలో సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు సమాచారం. భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలు మినహాయిస్తే వరంగల్‌లో దాదాపు 30 మండలాలు, 23 లక్షలకుపైగా జనాభా ఉంటాయి. వైశాల్యమూ పెద్దగా ఉంటుందని, దాంతో చిన్న జిల్లాల దృ క్పథమే దెబ్బతింటుందని సమీక్షలో ప్రస్తావనకు వచ్చింది. రాష్ట్రంలో 27 జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించడం తెలిసిందే. సగటున ఒక జిల్లాలో 18 మండలాలు, 13.33 లక్షల జనాభా ఉంటాయి. కానీ వరంగల్ 30 మండలాలు, 23 లక్షల జనాభాతో రాష్ట్రంలోనే పెద్ద జిల్లాగా ఏర్పడుతుంది. తద్వారా పాలనా సౌలభ్యానికి చిన్న జిల్లాలు ఏర్పాటు చేస్తున్న స్ఫూర్తి దెబ్బ తింటుందనే చర్చ జరిగినట్లు సమాచారం. తెరపైకి ‘వరంగల్ రూరల్’ వరంగల్ నగరాన్ని విడదీయకుండా ఉండేందుకు వరంగల్ రూరల్ పేరుతో కొత్త జిల్లా ఏర్పాటు దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అందుకు అనుగుణంగా మార్పుచేర్పుల కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రతిపాదిత హన్మకొండ జిల్లాను రద్దు చేసి, అందులో ప్రతిపాదించిన మండలాలన్నిటినీ వరంగల్ జిల్లాలో కలుపుతారు. దాంతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధితో పాటు ప్రస్తుతం హన్మకొండ జిల్లాగా ప్రతిపాదించిన మండలాలన్నీ కొత్త వరంగల్ జిల్లాలోనే ఉంటాయి. వరంగల్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం మినహా వరంగల్‌లో ప్రతిపాదించిన ఇతర మండలాలతో కొత్తగా వరంగల్ రూరల్ జిల్లా ఏర్పడుతుంది. ఇలా రెండు జిల్లాలు చేస్తే వరంగల్ సిటీ మొత్తం ఒకే జిల్లాలో ఉంటుందని, చిన్న జిల్లాలు ఏర్పాటు చేస్తున్న ప్రయోజనమూ నెరవేరుతుందని సీఎం పేర్కొన్నట్టు తెలిసింది. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్టు సమాచారం. కొత్తగా ఏర్పడే వరంగల్ రూరల్ జిల్లాకు కాకతీయ జిల్లా, లేదా భద్రకాళి జిల్లా అని పేరు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. 30 వేలు దాటిన అభ్యంతరాలు జిల్లాల పునర్వ్యవస్థీకరణ ముసాయిదాపై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. గడిచిన పన్నెండు రోజుల వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్ ద్వారా 29,411 మంది ఆన్లైన్లో తమ విజ్ఞప్తులను నమోదు చేశారు. వీటికి తోడు జిల్లా కలెక్టరేట్లలో, సీసీఎల్ఏలో మరో రెండు వేలకు పైగా అర్జీలు అందినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఆన్లైన్ అర్జీల ప్రకారం అత్యధికంగా వనపర్తి జిల్లా ఏర్పాటుపై 7,738, యాదాద్రి జిల్లాపై 4,386 విజ్ఞప్తులు అందాయి. కొత్త డివిజన్లకు సంబంధించి అత్యధికంగా జగిత్యాల జిల్లాపై 5,168 ఫిర్యాదులు నమోదయ్యాయి. కోరుట్లను రెవిన్యూ డివిజన్ కేంద్రం చేయాలని అత్యధికంగా విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. కొత్త ప్రతిపాదనల స్వరూపం వరంగల్ జిల్లా (21 మండలాలు): వరంగల్ కార్పొరేషన్, హన్మకొండ, ఖిలా వరంగల్, హసన్‌పర్తి, ఖాజీపేట, ధర్మసాగర్, చిల్పూర్, వేలేరు, స్టేషన్ ఘన్పూర్, రాయపర్తి, జఫర్‌గఢ్, నర్మెట్ట, రఘునాథపల్లి, పాలకుర్తి, కొడకండ్ల, ఇల్లంతకుంట, హుజూరాబాద్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్, జమ్మికుంట వరంగల్ రూరల్ జిల్లా (14 మండలాలు) : ఐనవోలు, వర్ధన్నపేట, ఆత్మకూరు, గీసుకొండ, సంగెం, పర్వతగిరి, నెక్కొండ, చెన్నారావుపేట, నర్సంపేట, ఖానాపూర్, దుగ్గొండి, నల్లబెల్లి, శాయంపేట, పరకాల -
సీపీఎస్ విధానం రద్దు చేయాలి
నల్లగొండ టూటౌన్ : సీపీఎస్ విధానం రద్దు చేసి, పాత పెన్షన్ పద్ధతిని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎం.రాజశేఖర్‌రెడ్డి మాట్లాడారు. సీపీఎస్ విధానం ఉద్యోగుల పాలిటశాపంగా మారిందన్నారు. సీపీఎస్ ద్వారా వసూలైన డబ్బులు షేర్ మార్కెట్లో పెట్టడం వల్ల అది కార్పొరేట్లకు ఉపయోగపడే విధంగా ఉందని చెప్పారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల సైదులు, పి.వెంకటేశం, రామలింగయ్య, రాజశేఖర్, వీరాచారి, ఆంజనేయులు, సైదులు, రామారావు, సతీశ్, యాదయ్య, నరేశ్, సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హాంకాంగ్‌ను కుదిపేసిన నిదా టైపూన్
-
సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి
ఎన్పీకుంట: సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని కేంద్ర ఆర్థికశాఖావుంత్రి అరుణ్‌జైట్లీకి వినతిపత్రం ఇచ్చినట్లు ఏపీసీపీఎస్ఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామాంజినేయులు, గౌరవ సలహాదారుడు శ్రీనివాసులురెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు గురువారం ఢిల్లీ పార్లమెంట్ భవన్లో జైట్లీని కలిసి ఈ మేరకు విన్నవించావున్నారు. అంతకు మునుపు కేంద్ర మానవ వనరుల శాఖామంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను కలిసి ఉమ్మడి సర్సీసు రూల్స్‌పై ఆర్డినెన్స్ ఇవ్వాలని కోరామన్నారు. జైట్లీ సానుకూలంగా స్పందించారన్నారు. -
రింగయ్యారు.. ఖంగుతిన్నారు
భద్రాద్రిలో వేలం పాట వాయిదా భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం దుకాణాల నిర్వహణ తదితరాల కోసం బుధవారం వేలం పాటల నిర్వహణలో పాటదారులంతా రింగయ్యారు. కాంట్రాక్ట్ కాల పరిమితిని ఏడాది కాకుండా మూడేళ్లకు పెంచాలని, లేకపోతే తామంతా వేలం పాటకు దూరంగా ఉంటామని దేవస్థానం అధికారులతో తెగేసి చెప్పారు. కార్యనిర్వహణాధికారిణి(ఈఓ) కూరాకుల జ్యోతి ఒక మెట్టు దిగి, కాల పరిమితిని ఏడాది నుంచి రెండేళ్లకు పొడిగించేందుకు అంగీకరించారు. పాటదారులు మాత్రం ససేమిరా అన్నారు. వీరంతా రింగయ్యారని, తక్కువ మొత్తంతో ఎక్కువ కాలంపాటు పాట పాడుకునేందుకు పన్నాగం పన్నారని గ్రహించిన ఈఓ.. మొత్తంగా వేలం పాటలనే రద్దు చేశారు. ఈ అనూహ్య పరిణామంతో పాటదారులంతా ఖంగుతిన్నారు. ఇలా, కథ అడ్డం తిరగడంతో.. ‘దీన్నంతటికీ నువ్వే కారణం’ అంటూ, పాటదారులు తమ ‘రింగ్’ లీడర్‌పై కస్సుబస్సుమన్నట్టు సమాచారం. భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానం పరిధిలో దుకాణాలను అద్దె ప్రాతిపదికన నిర్వహించేందుకు బుధవారం జరగాల్సిన వేలం పాట వాయిదా పడింది. పర్ణశాల దేవాలయం వద్ద కొబ్బరి చిప్పలు పోగు చేసుకునేందుకు, ఫ్యాన్సీ వస్తువులు విక్రయించేందుకు, కుటీరం వద్ద ఫొటోలు తీసేందుకు, సీతవాగు వద్ద గైడ్ లెసైన్స్ హక్కుల కోసం, భద్రాద్రి దేవాలయ ప్రాంగణంలోని రాజగోపురం వద్ద ఫొటోలు తీసుకునేందుకు అధికారులు వేలం పాట పెట్టారు. దుమ్ముగూడెం మండలం కాశీనగరం వద్ద 2.67 ఎకరాల భూమిని మూడేళ్లపాటు కౌలుకు ఇచ్చేందుకు వేలం నిర్వహించారు. కాశీనగరం భూమి కౌలు ఏడాదికి గతంలో రూ.16,200 ఉంది. ఇది ప్రస్తుతం రూ.20వేలకు వెళ్లింది. దీంతో దీనిని దేవస్థానం అధికారులు ఖాయం చేశారు. పాటలన్నింటికీ తీవ్రమైన పోటీ ఏర్పడింది. పాటదారులంతా కాల పరిమితి పెంచాలని డిమాండ్ లేవనెత్తారు. గతంలో ఏడాదికి మాత్రమే లెసైన్స్ హక్కులు ఇచ్చేవారు. దీనిని మూడేళ్లకు పెంచకపోతే పాటలో పాల్గొనేది లేదని వారు తెగేసి చెప్పారు. వాస్తవంగా, భద్రాచలం దేవ స్థానంతోపాటు, పర్ణశాల వద్ద ఫొటోలు తీసేందుకు గతంలో తీవ్రమైన పోటీ నెలకొంది. కానీ, వచ్చిన పాటదారులంతా.. వేలం కాల పరిమితిని ఏడాది నుంచి మూడేళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. దీనికి అంగీకరించకపోతే వేలంపాటకు దూరంగా ఉంటామని స్పష్టం చేశారు. వేలం పాట నిర్వహించేందుకు వచ్చిన ఇన్చార్జ్ ఏఈఓ కనకదుర్గ, సూపరింటెండెంట్ వెంకటప్పయ్య, సెక్షన్ ఇన్చార్జ్ పోతుల శ్రీను చర్చించుకున్నారు. విషయాన్ని దేవస్థానం ఈఓ జ్యోతి దృష్టికి తీసుకెళ్లారు. పాటదారుల డిమాండుకు ఈఓ కొంతవరకు తలొగ్గారు. కాల పరిమితిని ఏడాది నుంచి రెండేళ్లకు పెంచుతామంటూ ఒక మెట్టు దిగొచ్చారు. పాటదారులు మాత్రం ససేమిరా అన్నారు. మూడేళ్లకు పొడిగిస్తేనే వేలం పాటలో పాల్గొంటామని బెట్టు చేశారు. అందరూ ఇదే మాటపై ఉండడాన్నిబట్టి, వారంతా రింగయ్యారని ఈఓ గ్రహించారు. వారి డిమాండును అంగీకరిస్తే దేవస్థానం ఆదాయం తగ్గే పరిస్థితి ఉండడంతో.. ఏకంగా వేలం పాటల నిర్వహణను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ అనూహ్య పరిణామంతా పాటదారులు ఖంగుతిన్నారు. వారిలో కొంతమంది.. తమ ‘రింగ్’ లీడర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలం పాట ఆగిపోవడానికి కారణమయ్యావంటూ నిందించారు. నేడు విస్తా కాంప్లెక్స్ దుకాణాలకు వేలం గోవిందరాజ స్వామి ఆలయం వద్ద, విస్తా కాంప్లెక్స్‌లోని పలు దుకాణాల నిర్వహణకు గురువారం వేలం నిర్వహించనున్నట్టు దేవస్థానం అధికారులు ప్రకటించారు. పాదరక్షలు భద్రపరిచేందుకు, పడమర మెట్ల పక్కన పూజాది సామాగ్రి విక్రయించేందుకు మంచి పోటీ ఉండే అవకాశముంది. గతంలో వీటిని దక్కించుకున్న వారే తిరిగి పొందేందుకు పావులు కదుపుతున్నారు. దీనిపై దేవస్థానం అధికారులు అప్రమత్తంగా ఉండాలని భక్తులు కోరుతున్నారు. -
కివీస్, పాక్ రెండో వన్డే రద్దు
నేపియర్: న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన రెండో వన్డే మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. ఉదయం నుంచి కురిసిన వర్షం సాయంత్రం వరకు కొనసాగింది. మైదానం ఆటకు అనుకూలంగా లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో కివీస్ 1-0తో ఆధిక్యంలో ఉంది. -
మూడో రోజూ వర్షార్పణం
♦ ఆసీస్, విండీస్ మూడో టెస్టు సిడ్నీ: వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేద్దామనుకున్న ఆస్ట్రేలియా ఇక ఆశలు వదులుకోవాల్సిందేమో.. రెండో రోజు కనీసం 11.2 ఓవర్ల ఆట సాధ్యమైనా మంగళవారం మూడో రోజు ఆట మాత్రం పూర్తిగా వర్షార్పణమైంది. ఇప్పటికి విండీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 86.2 ఓవర్లలో ఏడు వికెట్లకు 248 పరుగులతో ఉంది. ఇక ఆటకు రెండు రోజుల సమయం మిగిలి ఉండగా బుధవారం కూడా చిరు జల్లులు కురిసే అవకాశముంది. గత 20 ఏళ్లలో ఆసీస్ గడ్డపై ఓ టెస్టులో రోజు మొత్తం ఆట వర్షం కారణంగా రద్దు కావడం ఇది మూడోసారి మాత్రమే. ఈ సిరీస్‌లో ఆసీస్ 2-0 ఆధిక్యంలో ఉంది. -
ప్యాసింజర్ రైళ్లు రద్దు
విశాఖ - రాయగఢ మార్గంలో విద్యుదీకరణ పనుల దృష్ట్యా పార్వతీపురం మీదుగా వెళ్లే ప్యాసింజర్ రైళ్లను ఈనెల 13 వరకు రద్దు చేశారు. అలాగే, ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆలస్యంగా నడుపుతున్నారు. ఈ మార్గంలో విద్యుదీకరణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. -
శ్రీలంక పార్లమెంటు రద్దు
కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన శుక్రవారం ఆ దేశ పార్లమెంటును రద్దు చేశారు. షెడ్యూలు ప్రకారం 2016 ఏప్రిల్‌లో పార్లమెంటు ఎన్నికలు జరగాల్సి ఉండగా, 8 నెలలు ముందుగానే ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం చేస్తూ పార్లమెంటును రద్దు చేశారు. సంబంధిత గెజిట్ నోటిఫికేషన్‌పై అధ్యక్షుడు శుక్రవారం సంతకం చేశారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. లంక పార్లమెంటులో 225 మంది సభ్యులు ఉన్నారు. అయితే, పార్లమెంటును రద్దు చేస్తానని ఏప్రిల్ 23నే ప్రకటించిన సిరిసేన రాజ్యాంగ, ఎన్నికల సంస్కరణలను ప్రవేశపెట్టేందుకు నిర్ణయాన్ని వాయిదా వేశారు. రాజ్యాంగానికి 19వ సవరణ ఏప్రిల్ చివర్లోనే పార్లమెంటు ఆమోదం పొందినా, ఎన్నికల సంస్కరణల విషయంలో మాత్రం పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. కాగా, జనవరిలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మహీంద రాజపక్సపై విజయం సాధించిన సిరిసేన ప్రధాని రణిల్ విక్రమసింఘే నేతృత్వంలోని మైనార్టీ సర్కారును నియమించారు. -
‘భూదాన్ బోర్డు’ రద్దు
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తు తం ఉన్న ‘ఆంధ్రప్రదేశ్ భూదాన్ యజ్ఞ బోర్డు’ను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కొత్త బోర్డు ఏర్పాటయ్యేవరకు బోర్డు విధులను నిర్వహించేందుకు అథారిటీని నియమించింది. అథారిటీ బాధ్యతలను రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శికి అప్పగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. 2012లో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ భూదాన్ యజ్ఞ బోర్డు, నిబంధనలకు విరుద్ధంగా రూ.వేల కోట్ల విలువైన భూములను అనర్హులకు కేటాయించిందని ఆరోపణలున్నాయి. బోర్డు ఏర్పాటులోనే అవకతవకలు జరిగాయని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. దీంతో బోర్డు చైర్మన్, వైస్ చైర్మన్, ఇతర సభ్యులపై వచ్చిన ఆరోపణలు, భూ కేటాయింపులపై సీబీసీఐడీ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. -
జాట్లకు రిజర్వేషన్ రద్దు
న్యూఢిల్లీ: జాట్ వర్గాన్ని ఓబీసీ జాబితాలో చేర్చుతూ గత యూపీఏ సర్కారు జారీ చేసిన నోటిఫికేషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం తోసిపుచ్చింది. రిజర్వేషన్ కల్పించేందుకు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టింది. జాట్లను ఓబీసీల జాబితాలో చేర్చాల్సిన అవసరం లేదని వెనుకబడిన వర్గాల జాతీయ కమిషన్(ఎన్సీబీసీ) చేసిన సిఫార్సునూ కేంద్రం పట్టించుకోలేదని వేలెత్తిచూపింది. గత ఏడాది మార్చిలో అప్పటి యూపీఏ ప్రభుత్వం 9 రాష్ట్రాల్లో జాట్లకు ఓబీసీ రిజర్వేషన్ కల్పించింది. దీన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం విచారణ జరిపింది. కులం ముఖ్య ప్రాతిపదికే అయినా సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనాన్ని గుర్తించేందుకు దాన్నే పరిగణనలోకి తీసుకోరాదన్న మండల్ కమిషన్ సిఫార్సును ఉటంకించింది. ఇలాంటి రాజకీయ ప్రేరేపిత నిర్ణయాల వల్ల ఇతర వెనుకబడిన వర్గాలకు నష్టం జరుగుతుందంది. దీనిపై నోటీసులు అందుకున్న ప్రస్తుత ఎన్డీఏ సర్కారు.. జాట్లను ఓబీసీ జాబితాలో చేర్చడాన్ని సమర్థించుకుంది. -
‘బ్యాంకు నిర్ణయాన్ని రద్దు చేయండి’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు తమ ఖాతా లావాదేవీలను స్తంభింప చేస్తూ ఎస్బీహెచ్ శాంతినగర్ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసి, తమ ఖాతా లావాదేవీలను యథాత థంగా కొనసాగించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ ఏపీ ఉన్నత విద్యా మండలి సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మంగళవారం ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్టి విచారిస్తారు. ప్రత్యేక హోదాకు ‘కానుక’లు అడ్డంకి! -
ఇసుక విక్రయాలు రద్దు చేయాలి
శింగనమల :‘ఇసుక రీచులను ఎక్కడా డ్వాక్రా మహిళలతో నిర్వహించడం లేదు. వారి ముసుగులో టీడీపీ నాయకులు సొమ్ము చేసుకుంటున్నారు. చంద్రబాబు తన పార్టీ కార్యకర్తల కోసమే ఇసుక విక్రయాలు చేపట్టారు. వాటిని వెంటనే రద్దు చేయాల’ని వైఎస్సార్సీపీ, వామపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశారు. శింగనమల మండలం ఉల్లికల్లు ఇసుక రీచ్ వద్ద బుధవారం వైఎస్సార్సీపీ, వామపక్షాల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి గోపాలు అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నదీం అహ్మద్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలూరి సాంబశివారెడ్డి, పార్టీ నాయకుడు బోయ తిరుపాలు మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు డ్వాక్రా మహిళల పేరుతో ఇసుక రీచులను ప్రారంభించి.. టీడీపీ నేతలకు అప్పగించారని విమర్శించారు. ఇసుక రీచులు పెట్టడం వల్ల భవన నిర్మాణ కార్మికులు, కూలీలు పనుల్లేక రోడ్డున పడ్డారన్నారు. టీడీపీ ప్రభుత్వం ఇసుక విక్రయాలు చేపట్టి టీడీపీ నేతలకు దోచిపెడుతోందని దుయ్యబట్టారు. ప్రభుత్వం ఇసుక విక్రయాలను చేపట్టడం వల్ల సామన్యుడు ఇల్లు నిర్మించుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. గతంలో రూ.వెయ్యికి దొరికే ట్రాక్టర్ ఇసుక ఇప్పుడు రూ.5 వేలకు చేరిందన్నారు. ఇసుక దొరక్క జిల్లాలో ఆరు లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు, కూలీలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ మాట్లాడుతూ.. ఉల్లికల్లు ఇసుక రీచులో అక్రమాలు కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోలేదన్నారు. ఇసుక విక్రయాలు రద్దు చేయాలని ఫిబ్రవరి ఆరున అనంతపురం నగర బంద్ చేపడుతున్నట్లు వెల్లడించారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఓబులు మాట్లాడుతూ ఇసుక రీచులు మాఫియా, టీడీపీ నేతల కనుసన్నల్లో నడుస్తున్నాయని విమర్శించారు. ఇక్కడ మూడడుగులు మాత్రమే ఇసుకను తీయాలని నిబంధన ఉన్నా 20 అడుగులు తవ్వారన్నారు. ధర్నా విషయం తెలుసుకొని ముందస్తుగానే ఇసుక విక్రయాలు నిలిపివేసి, గుంతలు కనపడకుండా చాగల్లు రిజర్వాయర్‌కు వెళ్తున్న నీటిని వదిలారన్నారు. ఇక్కడ ఇన్ని అక్రమాలు జరుగుతున్నా డీఆర్డీఏ అధికారులు పట్టించుకోలేదన్నారు. దీనిపై ఇన్చార్జి పీడీని ఫోన్లో సంప్రదించగా.. జిల్లా కలెక్టర్ దిృ్టకి తీసుకెళ్లి చర్చిస్తున్నామని చెప్పారన్నారు. దీన్నిబట్టి వారు ఏవిధంగా పని చేస్తున్నారో తెలుస్తోందన్నారు. ఇసుక రీచ్ వల్ల ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు తగ్గిపోయే పరిస్థితి ఉందన్నారు. తాగునీరు లేకుండా పోయే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేత శ్రీరామిరెడ్డి, సీపీఎం నాయకులు జాఫర్, నల్లప్ప, సీపీఐ జిల్లా నాయకులు లింగమయ్య, బాలరంగయ్య, చెన్నప్ప యాదవ్, ఇతర నేతలు నారాయణస్వామి, నాగరాజు, పోతన్న, వీరనారప్ప, పద్మావతి, అమీనమ్మ, శంకుతలమ్మ, భాగ్యమ్మ, ఆషాబీ, రామాంజినేయులు,పెద్దన్న తదితరులు పాల్గొన్నారు. అడ్డుకున్న పోలీసులు : ఉల్లికల్లు ఇసుక రీచ్ వద్ద ధర్నాకు వెళుతున్న వారిని పోలీసులు పలుచోట్ల అడ్డుకున్నారు. శింగనమల మరువకొమ్మ, నాయనపల్లి క్రాస్, ఉల్లికల్లు గ్రామం వద్ద అడ్డుకోవడంతో వారు పోలీసులపై మండిపడ్డారు. ఉల్లికల్లు రీచ్ వద్ద ధర్నా చేపట్టడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటుకలపల్లి సీఐ శ్రీనివాసులు, శింగనమల, ఇటుకలపల్లి ఎస్ఐలు రామారావు ఆధ్వర్యంలో దాదాపు వంద మంది పోలీసులతో బందోబస్తు చేపట్టారు. శింగనమల తహశీల్దారు సుధామణిని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఓబులు నిలదీశారు. -
యజమాని లేడా.. రేషన్‌కార్డు రద్దే!
ఆధార్ ఇచ్చినా విడుదల కాని బియ్యం ఆందోళనలో లబ్ధిదారులు మండలంలో తగ్గిన 800 క్వింటాళ్ల కోటా కుటుంబ యజమాని చనిపోతే.. ఇక ఆ ఇంటి రేషన్‌కార్డు రద్దు అయింది. కుటుంబసభ్యులున్నా రేషన్ బియ్యం సరఫరా నిలిచిపోయింది. ఈనెల విడుదలైన రేషన్ బియ్యంలో ఈ విషయం వెల్లడైంది. మండల వ్యాప్తంగా సుమారు 800ల క్వింటాళ్ల బియ్యం తగ్గాయి. దీంతో ఇటూ డీలర్లు అటు లబ్ధిదారులు ఆం దోళనకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళ్లితే.. తెల్లరేషన్ కార్డులున్నవారు కుటుంబ సభ్యులతోపాటు కార్డుల్లో నమోదైన వారి ఆధార్‌కార్డులను సేకరించారు. ఆధార్ కార్డులు ఇవ్వని వారి కార్డులు రద్దు చేస్తామని అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. దీంతో సదరు డీలర్లు తమ కోటా తగ్గుతుందని భావించి లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి ఆధార్‌కార్డులను సేకరించారు. వాటిని గడువులోగా రెవెన్యూ కార్యాలయంలో అందజేశారు. వ్యక్తి మరణిస్తే ఇక అంతే.. ఇదిలా ఉండగా పదేళ్ల క్రితం కుటుంబ యజమానిపై తెల్లరేషన్‌కార్డు జారీ అయింది. అయితే ఆ వ్యక్తి మృతి చెందడంతో అతడి ఆధార్‌కార్డు సమర్పించలేదు. దీంతో కంప్యూటర్లో ఇంటి యజమాని పేరుపై ఉన్న ఆధార్‌కార్డు నంబర్లేక అది స్వీకరించలేదని అధికారులు అంటున్నారు. కార్డుకు సంబంధించిన డేటా రాక బియ్యం విడుదల కాలేదని అధికారులు చెబుతున్నారు. మండల వ్యాప్తంగా సుమారు నాలుగు వందల అంత్యోదయ కార్డులున్నా వాటి పరిస్థితి కూడా ఇదే విధంగా నెలకొంది. ఆధార్‌కార్డులు ఇచ్చినా కార్డు ఎందుకు రద్దు చేశారని లబ్ధిదారులు ఆందోళన చెందారు. ఇటీవల లబ్ధిదారులు రేషన్డీలర్లను నిలదీశారు. అయితే అధికారులు ఇచ్చిన జాబితా మేరకు తాము పంపిణీ చేస్తున్నట్లు డీలర్లు పేర్కొన్నారు. రెండు రోజులుగా లబ్ధిదారులను అధికారులను ప్ర శ్నించేందుకు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేస్తుండగా.. ఆఫీసర్లు మాత్రం సర్వేలో నిమగ్నమై ఉండటంతో ఏం చేయాలో తోచడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. డీలర్లకు కోత.. మండల వ్యాప్తంగా 46 రేషన్‌షాపులున్నాయి. వీటిలో ఒక్కొక్క డీలర్‌కు 15 క్వింటాళ్ల నుంచి 20 క్వింటాళ్ల వరకు బియ్యం కోత పడిందని డీలర్ల సంఘం జిల్లా కార్యదర్శి చిలగాని మోహన్ తెలిపారు. అలాగే చక్కెర కూడా మూడు క్వింటాళ్ల వరకు తగ్గిందన్నారు. -
పండుటాకుల పడిగాపులు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: హుదూద్ తుపా ను బీభత్సం సృష్టించింది. వ్యవస్థలు కుప్పుకూలిపోయాయి. ఉపాధి రంగాలన్నీ దాదాపు మూ సుకుపోయాయి. కార్మికులకు ఉపాధిలేక, కూలీ లకు పనులు దొరకక నానా అవస్థలు పడుతున్నారు. ఇళ్ల గడవడం కష్టంగా తయారైంది. వృద్ధులు, వికలాంగులు, వితంతువుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఒకరిపై ఆధారపడి బతికే వారందరికీ కాసింత భరోసా ఇచ్చే పింఛను కాస్త ప్రభుత్వం పంపిణీ చేయలేదు. జన్మభూమితో లింకు పెట్టి నిలిపేసింది. ఉపాధి లేక ఇంటి పెద్ద దిక్కు, పింఛను రాక వృద్ధులు, వికలాంగులు, వితంతువులు నరకయాతన అనుభవిస్తున్నారు. పూటగడవక, కనీసం మం దులు కొనుక్కునేందుకు సొమ్ములేక అనేక మంది అవస్థలు పడుతున్నారు. ఈ వయసులో తమకెందుకీ ఇబ్బందులని గగ్గోలు పెడుతున్నారు. కొన్నాళ్లు పింఛన్ల సర్వే పేరుతో ప్రభుత్వం కాలయాపన చేసింది. మరికొన్ని రోజులుజన్మభూమిలో పంపిణీ చేద్దామని మెలిక పెట్టింది. ఇంతలోనే అనర్హుల పేరుతో 35 వేల మంది పింఛన్లు తీసేసింది. మరో 26,500మందికి సంబంధించి ఆధార్ సీడింగ్ జరగలేదని గాలిలో ఉంచింది. దీంతో 2 లక్షల 17 వేల 500మందికి పింఛన్లు ఇస్తామని ప్రకటించింది. జన్మభూమిలో పంపిణీ చేస్తామని ఆర్భాటం చేసింది. మొత్తానికి ఈ నెల 11వ తేదీ వరకు 64 వేల మందికి జన్మభూమి కార్యక్రమంలో పింఛన్లు పంపిణీ చేశారు. ఇంతలో హుదూద్ తుపాను ముంచెత్తి జిల్లాను కకావికలం చేసింది. జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో మిగతా 1,47,500 మందికి నేటికీ పింఛన్లు అందలేదు. ఇప్పుడు వారంతా నానా ఇబ్బందులు పడుతున్నారు. కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. జన్మభూమిలో నేతల చేతుల మీదుగా ఇచ్చి మెప్పు పొందాలని ప్రయత్నించి, చివరికీ తమను అవస్థలకు గురిచేశారని లబ్ధిదారులు వాపోతున్నారు. ఎప్పుడూ పంపిణీ చేసినట్టు ఐదు తేదీలోగా ఇచ్చేసి ఉంటే తుపాను కష్టకాలంలో కాసింత ఉపశమనం కలిగేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జన్మభూమి నిర్వహించేదెప్పుడు, తమకు పింఛను ఇచ్చేదెప్పుడని ప్రశ్నిస్తున్నారు. పరిస్థితులన్నీ సద్దుమణిగితే తప్ప తమకు పింఛను వచ్చేటట్టు లేదని ఆందోళన చెందుతున్నారు. జాబితా నుంచి తొలగింపునకు గురైన పింఛనుదారులు, ఆధార్ సీడింగ్ లేదని గాలిలో పెట్టిన లబ్ధిదారులు మరింత ఆందోళన చెందుతున్నారు. రాజకీయ కక్షతో అన్యాయంగా తీసేసిన తాము అభ్యంతరాలు పెట్టుకున్నా ఇంతవరకు అతీగతి లేదని, వాటిని పరిశీలించి పరిష్కరించేదెప్పుడు? తమకు న్యాయం జరిగేదెప్పుడని ఆవేదన చెందుతున్నారు. ఆధార్ సీడింగ్ చేసుకోని వారి పరిస్థితీ అంతే. ఇప్పుడు ఆధార్ కేంద్రాలు తెరిచే అవకాశం లేదని, తమకు సీడింగ్ అయ్యేదెప్పుడని, అంతా పూర్తయి పింఛను వచ్చేదెప్పుడని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ప్రభుత్వం నిర్వాకంతో తమ ఇబ్బందులొచ్చాయని వారు మండిపడుతున్నారు. -
ఐడీ పార్టీల రద్దు యోచనలో డీజీపీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ పోలీసుస్టేషన్లలో ఇన్స్పెక్టర్లు ఏర్పాటు చేసుకున్న ఐడీ పార్టీలను రద్దు చేయాలనే యోచనలో డీజీపీ అనురాగ్‌శర్మ ఉన్నట్టు తెలిసింది. ఈ పార్టీలతో కొందరు ఇన్స్పెక్టర్లు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలు పెరగడంతో డీజీపీ వాటిని రద్దు చేయాలనుకుంటున్నట్టు సమాచారం. పోలీసుస్టేషన్లో చురుకైన ఇద్దరు లేక ముగ్గురు కానిస్టేబుళ్లు లేదా హెడ్‌కానిస్టేబుళ్లను ఐడీ (ఇన్స్పెక్టర్ డిపార్ట్మెంట్)పార్టీగా ఆయా పోలీసుస్టేషన్ హౌజ్ అధికారి(ఇన్స్పెక్టర్) నియమించుకుంటారు. ముఖ్యంగా ఇన్స్పెక్టర్ ఏదైనా ప్రత్యేక కేసు పరిశోధన చేపట్టినప్పుడు ఆయనకు ఈ పార్టీ పూర్తిగా సహకరిస్తుంది. అలాగే పోలీసుస్టేషన్ పరిధిలో నేరాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, వాటి వెనుక ఎవరున్నారనే వివరాలను కూడా ఈ పార్టీ సేకరిస్తూ పూర్తిగా సీఐడీ నియంత్రణలో పనిచేస్తుంది. ఈ విధానం నగర పోలీసు కమిషనరేట్లు మొదలుకుని అన్ని స్టేషన్లలో ఉంది. అయతే, కొన్ని స్టేషన్లలో ఐడీ పార్టీలు తమ ధర్మాన్ని వదలి పూర్తిగా సీఐల సొంతపార్టీలుగా మారిపోయిన ట్టు ఆరోపణలున్నాయి. చట్టవ్యతిరేకపనులకు పాల్పడేవారు, అక్రమ దందాలు కలిగినవారు, సట్టా,మట్కా, జూదగృహాలు నిర్వహించే వారి నుంచి నెలవారీ మామూళ్లను వసూలు చేసిపెట్టే చర్యలకు ఐడీ పార్టీలు పాల్పడుతున్నాయని , ఇందుకు ఆయా సీఐల ప్రేరణ ఉందనే బలమైన ఆరోపణలున్నాయి. ఫక్తు ఇదేపనిలో మునిగితేలుతున్న కొన్ని ఐడీ పార్టీల గురించి డీజీపీకి ఫిర్యాదులు అందినట్టు తెలిసింది. కొందరు ఇన్స్పెక్టర్లు నెలవారి మామూళ్లను లక్షల్లో దండుకుంటున్నారని డీజీపీ దృష్టికి వచ్చినట్టు తెలిసింది. కొందరు కానిస్టేబుళ్లు ఏళ్లతరబడి ఐడీ పార్టీ విధుల్లోనే కొనసాగుతున్నట్టు కూడా ఆరోపణలున్నాయి. దీంతో ఈ వ్యవస్థను దుర్వినియోగం చేయకుండా చర్యలు తీసుకోవాలని డీజీపీ భావిస్తున్నట్టు తెలిసింది. నేర పరిశోధన కోసం అన్ని స్టేషన్లలో క్రైమ్ విభాగాలు, సీసీఎస్‌లు ఉండడంతో ఇక సీఐలకు ప్రత్యేకంగా ఐడీ పార్టీలు ఎందుకని ఆయన అధికారులతో చర్చిస్తున్నట్టు తెలిసింది. -
అవన్నీ తప్పుడు కేటాయింపులే!
-
కోల్గేట్ పై సుప్రీంకోర్టు
-
కేటాయింపులన్నీ రద్దు
‘కోల్గేట్’పై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం 1993 నుంచి కేటాయించిన 218 బ్లాకుల్లో 214 రద్దు న్యూఢిల్లీ: దేశంలో 1993 నుంచి చేసిన బొగ్గు బ్లాకుల కేటాయింపులన్నింటినీ రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ ఇరవయ్యేళ్లలో కేటాయించిన 218 బొగ్గు బ్లాకుల్లో 214 బ్లాకులను రద్దు చేసింది. ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన 4 బ్లాకులకు మినహాయింపు ఇచ్చింది. రద్దు చేసిన బ్లాకుల్లో పనిని నిలిపేసి.. ప్రభుత్వానికి అప్పగించేందుకు మైనింగ్ సంస్థలకు ఆరు నెలల గడువు ఇచ్చింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎం లోధా, మదన్ బి.లోకూర్, కురియన్ జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం 163 పేజీల తీర్పును వెలువరించింది. ఈ తీర్పుతో ఆయా బొగ్గు గనుల కేటాయింపు కోసం కేంద్రం తిరిగి వేలం నిర్వహించేందుకు అవకాశం లభించనుంది. ‘కోల్’గేట్ దుమారం: యూపీఏ హయాంలో బొగ్గు గనుల కేటాయింపు వ్యవహారంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు వెల్లువెత్తిన విష యం తెలిసిందే. ‘కోల్గేట్’ స్కామ్‌గా పేరు పొందిన ఈ వ్యవహారంలో.. ప్రభుత్వానికి లక్షల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లినట్లుగా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) పేర్కొంది. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. సాక్షాత్తూ అప్పటి ప్రధానిగా ఉన్న మన్మోహన్‌సింగ్‌కు కూడా దీనితో సంబంధం ఉందని ఆరోపణలు కూడా వచ్చాయి. యూపీఏ ప్రభుత్వం గద్దెదిగాలంటూ విపక్షాలు కొద్దిరోజుల పాటు పార్లమెంటును స్తంభింపజేశాయి. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాలు కూడా దాఖలయ్యాయి. దీంతో స్పందించిన సుప్రీంకోర్టు విస్తృత దర్యాప్తునకు ఆదేశించి, విచారణ చేపట్టింది. రద్దు చేయవద్దన్న యూపీఏ: బొగ్గు బ్లాకుల కేటాయింపులను రద్దు చేయవద్దని అప్పట్లో జరిగిన విచారణ సందర్భంగా యూపీఏ ప్రభుత్వం కోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఆ బ్లాకులను పొందిన సంస్థలు వాటిల్లో దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల వరకూ పెట్టుబడులు పెట్టాయని.. దీంతోపాటు ఈ కేటాయింపులను రద్దు చేస్తే పెద్ద సంఖ్యలో పరిశ్రమలకు ఇబ్బంది కలుగుతుందని వాదించింది. కానీ ఈ వాదనలను కోర్టు అంగీకరించలేదు. అసలు ఆ బొగ్గు బ్లాకుల కేటాయింపులన్నీ చట్టవిరుద్ధమేనని స్పష్టం చేసింది. అనంతరం అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం... బొగ్గు కేటాయింపులను రద్దు చేయడం వల్ల నెలకొంటాయని భావిస్తున్న పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కోర్టుకు తెలిపింది. దీనిని కూడా పరిగణనలోకి తీసుకున్న కోర్టు 214 బొగ్గు బ్లాకుల కేటాయింపులను రద్దు చేసింది. అన్నీ చట్ట విరుద్ధమే..: ‘కోల్’గేట్ కుంభకోణం విచారణలో భాగంగా 1993 నుంచి 2010 వరకూ కేంద్రంలో ఉన్న వివిధ ప్రభుత్వాలు చేసిన బొగ్గు గనుల కేటాయింపులన్నీ చట్టవిరుద్ధమేనని సుప్రీం కోర్టు నిర్ధారించింది. ఇష్టం వచ్చినట్లుగా, తమకు నచ్చినవారికి బొగ్గు కేటాయింపులు చేశారని.. ఈ విషయంలో ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగిందని వ్యాఖ్యానించింది. పారదర్శకత ఏ మాత్రం లేని విధానం వల్ల జాతీయ సంపద అయిన బొగ్గు అక్రమ కేటాయింపులకు కారణమైందని ధర్మాసనం పేర్కొంది. అసలు స్క్రీనింగ్ కమిటీ ఎప్పుడూ నిలకడగా లేదని.. సరైన విధానమేదీ లేకుండానే, నిబంధనలను పాటించకుండానే ప్రతిపాదనలు చేసిందంటూ ధర్మాసనం తప్పుబట్టింది. నాలుగింటికే మినహాయింపు..: 1993 నుంచి చేసిన 218 బొగ్గు బ్లాకుల కేటాయింపులో.. ఎన్టీపీసీ, సెయిల్లకు కేటాయించిన ఒక్కో బ్లాకు, అల్ట్రామెగా పవర్ ప్రాజెక్ట్స్ సంస్థకు కేటాయించిన 2 బ్లాకులు మాత్రమే సుప్రీంకోర్టు మినహాయింపును ఇచ్చింది. మిగతా 214 బొగ్గు బ్లాకుల కేటాయింపును రద్దు చేసింది. ఈ బ్లాకులు పొందిన సంస్థలన్నీ కూడా.. ఆయా చోట్ల తమ వ్యాపారాన్ని ముగించి, బ్లాకులను ప్రభుత్వానికి అప్పగించడానికి ఆరు నెలల గడువు ఇచ్చింది. ప్రభుత్వానికి పరిహారం చెల్లించండి: కొన్ని సంస్థలు బొగ్గు కేటాయింపులు పొంది ఎలాంటి పనులూ ప్రారంభించకపోవడం వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని ధర్మాసనం పేర్కొంది. దీని పై కాగ్ సూచించిన మేరకు ఆయా సంస్థలు బొగ్గు వెలికితీత అంచనాపై ఒక్కో టన్నుకు రూ. 295 చొప్పు న ప్రభుత్వానికి పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అందరినీ దృష్టిలో పెట్టుకుంటాం! న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో... భవిష్యత్తులో బొగ్గు బ్లాకుల వేలానికి సంబంధించిన అంశంపై సంబంధిత భాగస్వాములు (బొగ్గు బ్లాకుల కేటాయింపు పొందిన సంస్థల) అందరి ఆందోళనను దృష్టిలో పెట్టుకుంటామని కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఈ విషయంలో కోర్టు ఆరునెలల పాటు గడువు ఇచ్చిందని.. ఈ లోగా అన్ని అవకాశాలను పరిశీలిస్తామని ఆయన చెప్పారు. బొగ్గు బ్లాకుల కేటాయింపులను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం వల్ల హర్షణీయమని.. ఇది సరికొత్త విధానానికి తోడ్పడుతుందని కేంద్ర న్యాయ, టెలికాం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. బొగ్గు బ్లాకుల కేటాయింపులో యూపీఏ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందంటూ బీజేపీ చేసిన ఆరోపణల్లోని డొల్లతనం సుప్రీంకోర్టు తీర్పుతో వెల్లడైందని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. ‘కోల్’ వివాదమిదీ..! ► 1992 జూలై: ప్రైవేటు సంస్థలకు తొలుత వచ్చి న వారికి తొలుత ప్రాతిపదికన బొగ్గు గనుల కేటాయింపు ప్రతిపాదనల కోసం స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటుకు బొగ్గు శాఖ ఆదేశాలు. ► 1992 జూలై 14: కోల్ ఇండియా, సింగరేణి సంస్థల ప్రణాళికల్లో లేని 143 కొత్త బొగ్గు బ్లాకుల గుర్తింపు, జాబితా తయారీ. ► 1993 -2010: దాదాపు 1993 నుంచి 2005 మధ్య 70 బొగ్గు బ్లాకులు, 2006లో 53, 2007లో 52, 2008లో 24, 2009లో 16, 2010లో 1.. మొత్తంగా 216 బొగ్గు బ్లాకులను వివిధ సంస్థలకు కేటాయించారు. వీటిలో 24 బ్లాకుల కేటాయింపును మధ్యలో రద్దు చేశారు. ► 2012 మార్చి: బొగ్గు బ్లాకుల కేటాయింపులో అవకతవకలు చోటు చేసుకున్నాయని కాగ్ వెల్లడించింది. 2004-09 మధ్య దాదాపు రూ.10.7 లక్షల కోట్ల లబ్ధి ఆయా సంస్థలకు చేకూరిందని పేర్కొంది. దీంతో వివాదం మొదలైంది. ► 2012 మే 31: ఇద్దరు బీజేపీ ఎంపీల ఫిర్యాదు ఆధారంగా ఈ అంశంపై సీబీఐ విచారణకు కేంద్ర నిఘా సంస్థ (సీవీసీ) ఆదేశించింది. ► 2012 జూన్: ఈ అంశంపై సమీక్షకు బొగ్గు మంత్రిత్వశాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సూచనల మేరకు 80 బొగ్గు బ్లాకులను వెనక్కి తీసుకుని, 42 సంస్థలకు చెందిన బ్యాంకు గ్యారెంటీలను స్వాధీనం చేసుకుంది. ► 2012 సెప్టెంబర్ 6: బొగ్గు బ్లాకుల కేటాయింపులను రద్దు చేయాలంటూ సుప్రీంలో పిల్ . సీబీఐ దర్యాప్తును పర్యవేక్షణలోకి తీసుకున్న కోర్టు. ► 2013 మార్చి: దర్యాప్తు వివరాలను ప్రభుత్వానికి అందజేయొద్దని సీబీఐకి ఆదేశం. ► 2013 ఏప్రిల్ 23: ఈ అంశంపై ఏర్పాటు చేసిన స్థాయీ సంఘం నివేదికను పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్రం. 1993-2008 మధ్య కేటాయింపులన్నీ అసంబద్ధమేనని అందులో వెల్లడి. ► 2013 ఏప్రిల్ 26: దర్యాప్తు అంశాలను కేంద్ర న్యాయశాఖ మంత్రి అశ్వనీకుమార్‌కు అందజేసినట్లు కోర్టుకు సీబీఐ చీఫ్ రంజిత్‌సిన్హా వెల్లడి ► 2013 మే 10: అశ్వనీకుమార్ రాజీనామా ► 2013 జూన్ 11: ‘బొగ్గు’ కేసులో పారిశ్రామిక వేత్తలు నవీన్ జిందాల్, దాసరి నారాయణరావు పేర్లను పేర్కొంటూ సీబీఐ ఎఫ్ఐఆర్. ► 2014 జూలై: ‘బొగ్గు’ కేసులన్నింటి విచారణకు ప్రత్యేక సీబీఐ కోర్టు ఏర్పాటు. ► 2014 ఆగస్ట్: బిర్లా, పరేఖ్‌లపై కేసును మూసివేయాలని సీబీఐ నిర్ణయం ► 2014 ఆగస్ట్ 25: 1993 నుంచి 2010 మధ్య కేటాయింపులన్నీ చట్టవిరుద్ధమని తేల్చిన సుప్రీంకోర్టు. ► 2014 సెప్టెంబర్ 24: 214 బొగ్గు బ్లాకుల కేటాయింపులను రద్దు చేస్తూ సుప్రీం తీర్పు. -
రద్దు యోచనలో.. 8.81 లక్షల ఇందిరమ్మ ఇళ్లు!
పునాదులు కూడా పడని ఇళ్లను రద్దు చేయాలని యోచన నిర్మాణాల్లో ఉన్న ఇళ్లకు ఆధార్ లింకు పేరుతో కొత్త మెలిక హైదరాబాద్: ఇళ్లు మంజూరైనా ఇప్పటికీ పునాదులు తీసుకోని ఇందిరమ్మ ఇళ్లను రద్దు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పునాదులు కూడా పడని 8.81 లక్షల ఇళ్లను గుర్తించి వాటిని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన వాటి బిల్లులను గత 8 నెలలుగా ప్రభుత్వం నిలిపివేసింది. ఈ బిల్లుల కోసం 5.50 లక్షల మంది లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. వీరికి రూ. 450 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి ఉంది. 2014-15 బడ్జెట్లో గృహ నిర్మాణ శాఖకు ప్రభుత్వం రూ. 808 కోట్లు కేటాయించింది. ఇందులో రూ. 450 కోట్లు పెండింగ్ బిల్లులకు పోతే మిగిలిన రూ. 358 కోట్లు నిర్మాణంలో ఉన్న ఇళ్లకు ఏమూలకూ సరిపోవు. దీంతో భారం తగ్గించుకునేందుకు వీలుగా పునాదులకు నోచుకోని ఇళ్ల వివరాలను జిల్లాల వారీగా సేకరించి వాటిని రద్దు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లాలో 24,581, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరులో 78,095, శ్రీకాకుళంలో 74,750, విశాఖపట్నంలో 61,956, విజయనగరంలో 73,735, పశ్చిమ గోదావరిలో 69,801, అనంతపురంలో 81,292, చిత్తూరులో 85,212, తూర్పు గోదావరిలో 84,628, వైఎస్సార్ జిల్లాలో 29,299, కృష్ణాలో 59,087, కర్నూలులో 94,285, గుంటూరులో 64,657 ఇళ్లను రద్దు విషయమై ఆయా జిల్లాలకు సమాచారం పంపినట్లు తెలిసింది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఇళ్లను ఆధార్‌తో అనుసంధానిస్తే మరికొన్ని ఇళ్లు రద్దయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఆధార్ అనుసంధానంపై ఇప్పటికే జిల్లాలకు ఆదేశాలు వెళ్లాయి. ఈ ఏడాది రాష్ర్టం నుంచి కొత్తగా ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఆర్‌ఏవై పథకంలో మంజూరైన 25 వేల ఇళ్లతో సరిపెట్టుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని పట్టణ ప్రాంతాలకే పరిమితం చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది గ్రామీణ ప్రాంతాలకు కొత్తగా ఒక్క ఇల్లు కూడా మంజూరు చేసే పరిస్థితి కన్పించడం లేదు. సిమెంటు, ఐరన్, ఇసుక ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో చాలా మంది లబ్ధిదారులు పునాదులు తీసుకోలేకపోయారు. తనకు అధికారమిస్తే ఎస్సీ, ఎస్టీలకు రూ.1.50 లక్షలు, ఇతరులకు లక్ష రూపాయల వరకు యూనిట్ ధర పెంచుతానని పాదయాత్ర సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రజలకు హామీ ఇచ్చారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో యూనిట్ ధర పెరిగి తాము ఇళ్లు పూర్తి చేసుకుంటామని పేద ప్రజలు ఆశగా ఎదురు చూశారు. అయితే ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది. -
లోక్‌సభలో ‘జ్యుడీషియల్’ బిల్లు
కమిషన్‌లో ఆరుగురు సభ్యులు సీజేఐ నేతృత్వం న్యూఢిల్లీ: కొలీజియం వ్యవస్థను రద్దు చేస్తూ.. ఆ స్థానంలో ఆరుగురు సభ్యుల న్యాయమూర్తుల నియామక జాతీయ కమిషన్(నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్- ఎన్‌జేఏసీ)’ను ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన రెండు బిల్లులను ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఎన్‌జేఏసీని, దాని కూర్పును రాజ్యాంగంలో చేర్చడానికి ఉద్దేశించిన ‘రాజ్యాంగ సవరణ(121వ సవరణ) బిల్లు-2014’తో పాటు ‘నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ బిల్లు-2014’ను కేంద్ర న్యాయశాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్ సభలో ప్రవేశపెట్టారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం, బదిలీల విషయంలో కమిషన్ అనుసరించాల్సిన విధివిధానాలను ఎన్‌జేఏసీ బిల్లులో పొందుపర్చారు. బిల్లులో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఎన్‌జేఏసీకి సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి(సీజేఐ) నేతృత్వం వహిస్తారు. ఇద్దరు సుప్రీంకోర్టు జడ్జీలు, సుప్రసిద్ధులైన ఇద్దరు వ్యక్తులు, కేంద్ర న్యాయశాఖ మంత్రి ఇందులో సభ్యులుగా ఉంటారు. భవిష్యత్తులో ప్రభుత్వాలు సాధారణ చట్టం ద్వారా ఎన్‌జేఏసీ కూర్పును మార్చే అవకాశం లేకుండా.. కమిషన్ కూర్పునకు రాజ్యాంగబద్ధత కల్పిస్తున్నారు. కమిషన్‌లోని ఇద్దరు ప్రసిద్ధ వ్యక్తులను సీజేఐ, ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేతలతో కూడిన కమిషన్ ఎంపిక చేస్తుంది. ఆ ప్రసిద్ధ వ్యక్తుల్లో ఒకరు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ లేదా మహిళావర్గానికి చెందినవారై ఉంటారు. ఆ ప్రసిద్ధ వ్యక్తులు మూడేళ్లపాటు పదవిలో ఉంటారు. వారికి మరోసారి నామినేట్ అయ్యే అవకాశం ఉండదు. యూపీఏ నాటి బిల్లు ఉపసంహరణ న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి మోడీ సర్కారు నూతనంగా మరో బిల్లును రూపొందించిన నేపథ్యంలో.. యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ది జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ బిల్, 2013’ను ప్రభుత్వం సోమవారం రాజ్యసభ నుంచి ఉపసంహరించుకుంది. సంబంధిత స్థాయీసంఘం చేసిన సిఫారసులను పరిగణనలోకి తీసుకుంటూ దీని స్థానంలో కొత్త బిల్లును తీసుకొస్తామని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సభకు తెలిపారు. ఈ అంశంపై రాజ్యాంగ సవరణ బిల్లును కూడా ప్రవేశపెడతామన్నారు. అయితే, తమ హయాంలో తీసుకొచ్చిన బిల్లును తొలగించడాన్ని కాంగ్రెస్ పార్టీ సభ్యులు తప్పుబట్టారు. మార్పుచేర్పుల కోసం సవరణలు చేస్తే సరిపోతుందని సూచించారు. -
ఎఫ్‌వైయూపీ రద్దు
నాలుగు రోజుల ఎడతెగని అనిశ్చితికి ఎట్టకేలకు తెరపడింది. యూజీసీ ఆదేశాల మేరకు మూడేళ్ల కోర్సులోనే ప్రవేశ ప్రక్రియ చేపడతామని ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) ప్రకటించింది. దీంతో విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే బీటెక్ విద్యార్థులు మాత్రం శుక్రవారం కూడా నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇక ప్రవేశాలు మూడేళ్ల డిగ్రీ కోర్సులోనే సాక్షి, న్యూఢిల్లీ : నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుపై నెలకొన్న వివాదం సమసిపోయింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆదేశాల మేర కు ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ) నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంను రద్దుచేసింది. గతంలో బోధించిన మూడేళ్ల డిగ్రీ కోర్సు ప్రకారమే ప్రవేశాలు జరపనున్నట్లు ప్రకటి ంచింది. యూనివర్సిటీ కిందనున్న కళాశాలలన్నింటిలో ప్రవేశ ప్రక్రియను ప్రారంభించాలని డీయూ వైస్‌చాన్స్‌లర్ దినేశ్‌సింగ్... ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్‌ను ఆదేశించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశా రు. యూజీసీ ఆదేశాల మేరకు యూనివర్సిటీ నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంను రద్దు చేయాలని నిర్ణయించామని దినేశ్‌సింగ్ ప్రకటించారు. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని అన్ని కళాశాలలు 2012-13 విద్యాసంవత్సరంలో పాటించిన ప్రక్రి య ప్రకారమే ప్రవేశాలు చేపట్టాలని ఆయన సూచించారు. యూజీసీ, డీయూల మధ్య నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంపై వివాదం కారణంగా అడ్మిషన్ ప్రక్రియపై నెలకొన్న అనిశ్చితి వీసీ తాజా ప్రకటనతో తొలగిపోయింది. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు దినేశ్ ప్రకటించారు. డీయూ పరిధిలోని 64 కళాశాలల్లో 54 వేల సీట్ల కోసం 2.7 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో అడ్మిషన్ ప్రక్రియ సోమవారం మొదలవుతుందని భావిస్తున్నారు. అడ్మిషన్ ప్రక్రి య ఇప్పటికే వారం రోజులు ఆలస్యమైంది. నాలుగేళ్ల గ్రాడ్యుయేషన్ కోర్సును రద్దు చేస్తూ డీయూ తీసుకున్న నిర్ణయం పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. నాలుగేళ్ల కోర్సును వ్యతిరేకిస్తూ ప్రదర్శనలు జరుపుతున్న విద్యార్థి సంఘాలు సంబరాలు జరుపుకున్నాయి. కాగా నాలుగేళ్ల డిగ్రీ కోర్సును రద్దు చేయడంతో పాత పదధతి ప్రకారం అడ్మిషన్ ప్రకియను నిర్వహించే మార్గాలను చర్చించడం కోసం డీయూ కాలేజీల ప్రిన్సిపాల్స్ దినేశ్‌సింగ్‌ను కలిశారు. అడ్మిషన్ ప్రక్రియను సజావుగా నిర్వహిం చేందుకు తగు సూచనలకోసం 12 కాలేజీల ప్రిన్సిపాల్స్‌తో కమిటీని నియమించారు. -
హౌరా-చెన్నై ప్రీమియం రైలు రద్దు
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : హౌరా-చెన్నై మధ్య దువ్వాడ మీదుగా తరలిపోయే 02841/42 నంబరు గ ల ప్రీమియం ఏసీ ఎక్స్‌ప్రెస్ రైలును రద్దు చేశారు. హౌరా నుంచి మే 9 నుంచి జూన్ 27 తేదీల మధ్య ప్రతి శుక్రవారం బయల్దేరే ఈ రైలును సదరన్ రైల్వే రద్దు చేసింది. ఈ రైలుకు ఊహించినట్టుగా ఆదరణ లేకపోవడంతో పాటు, పలు సమస్యలు రావడంతో రైలును రద్దు చేశారు. చెన్నై నుంచి మే 10 నుంచి జూన్ 28 తేదీ మధ్య ప్రయాణించాల్సిన రైలునూ రద్దు చేశారు. -
పలు రైళ్ల రద్దు
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : విశాఖ సమీపంలోని కొత్తవలస-కిరండూల్ రైల్వే మార్గంలో వివిధ అభివృద్ధి పనుల కారణంగా పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నారు. ఈ నెల 3 నుంచి 24వ తేదీ వరకూ అంచెలంచెలుగా పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేసేందుకు వాల్తేరు రైల్వే అధికారులు ఏర్పాట్లు చేశారు. దీని వల్ల కోరాపుట్, కిరండూల్, జగదల్పూర్, భువనేశ్వర్ వెళ్లే ప్రయాణికులకు ఇబ్బంది తప్పదు. విశాఖపట్నం-కిరండూల్ ప్యాసిం జర్(58501)ను మూడో తేదీన కోరాపుట్-కిరండూల్ మధ్య రద్దు చేశారు. ఈ రైలు కోరాపుట్ నుంచే విశాఖకు బయల్దేరుతుంది. కిరండూల్-విశాఖపట్నం(5850 2) ప్యాసింజర్ ఈ నెల 8వ తేదీన కిరండూల్‌లో ఉదయం 6 గంటలకు బదులు 8 గంటలకు బయల్దేరుతుంది. భువనేశ్వర్-జగదల్పూర్ వెళ్లే హిరాకండ్ ఎక్స్‌ప్రెస్(18447) ఈనెల 17వ తేదీన జగదల్పూర్కు షెడ్యూల్ సమయానికే చేరుతుంది. కానీ కోరాపుట్‌లో పాక్షికంగా రద్దు చేస్తున్నారు. తిరిగి కోరాపుట్ నుంచి 18448గా జగదల్పూర్-విశాఖ ఎక్స్‌ప్రెస్‌గా బయల్దేరుతుంది. కోరాపుట్-జగదల్పూర్ మధ్య ఈ రైలు 17న పాక్షికంగా రద్దవుతుంది. 24వ తేదీన కూడా కోరాపుట్-జగదల్పూర్ మధ్య పాక్షి కంగా రద్దు చేస్తున్నారు. కిరండూల్-విశాఖపట్నం ప్యాసిం జర్(58502) ఈ నెల 17వ తేదీన కిరండూల్‌లో ఉదయం 6 గంటలకు బయల్దేరడానికి బదులు ఉదయం 7.30 గంటలకు బయల్దేరుతుంది. -
ట్రిబ్యునల్ తీర్పును రద్దు చేయాలి
ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్), న్యూస్‌లైన్ : కృష్ణా డెల్టాకు ముప్పుగా పరిణమించిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును రద్దు చేయాలని కోరుతూ మంగళవారం రైతులు, కౌలు రైతుల సంఘాల ఆధ్వర్యంలో ఏలూరు పాతబస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘ జిల్లా కార్యదర్శి బి.బలరామ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యం కారణంగా ట్రిబ్యునల్ ముందు కృష్ణా డెల్టా ప్రయోజనాలు కాపాడేలా వాదనలు వినిపించలేకపోయారని విమర్శించారు. నీటిలభ్యత, మిగులు జలాలపై ట్రిబ్యునల్ తీసుకున్న ప్రాతిపదకలు శాస్త్రీయంగా లేవని, ఈ తీర్పును కేంద్ర ప్రభుత్వం గెజిట్‌లో ప్రతిపాదించ కూడదని డిమాండ్ చేశారు. ఈ తీర్పుపై రివ్యూ పిటీషన్‌కు అవకాశాలను పరిశీలించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కౌలురైతు సంఘ జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు కృష్ణా డెల్టా ఆయకట్టుకు తీవ్ర హాని చేసే విధంగా ఉందన్నారు. కాలువ పనుల ఆధునికీకరణను సకాలంలో పూర్తి చేసి కృష్ణా డెల్టా ఆయకట్టు రైతులను కష్టాలనుంచి గట్టెక్కించాలని కోరారు. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన వాస్తవ సాగుదారులకు నష్టపరిహారాన్ని అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నాకు రైతు సంఘం నాయకులు లింగం కృష్ణారావు, గుండపనేని సురేష్, సత్తిబాబు, కౌలు రైతుల సంఘ నాయకులు గండి రాజా తదితరులు నాయకత్వం వహించారు. -
జగన్‌తోనే థర్మల్ ప్లాంట్ల రద్దు
సంతబొమ్మాళి, న్యూస్‌లైన్: వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే..థర్మల్ ప్లాంట్లను రద్దు చేస్తారని ఆ పార్టీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ స్పష్టం చేశారు. కాకరాపల్లి తంపరలో నిర్మితమవుతున్న ఈస్ట్‌కోస్ట్ థర్మల్ ప్లాంట్పనులకు వెళ్లే ఉద్యోగులను అడ్డుకునేందుకు హెచ్‌ఎన్‌పేట వద్ద ఏర్పాటు చేసిన సహాయ నిరాకరణ శిబిరం వద్ద మంగళవారం ఆయన మా ట్లాడారు. ఇన్నాళ్లూ ఎంతో ఓపికతో ఉద్యమించామని..మరో వంద రోజులు ఉద్యమిస్తే..కలలు నెరవేరుతాయన్నారు. ప్లాంట్ వల్ల మత్స్యకారులు, రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని మొత్తకుంటున్నా..ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేకపోవడం బాధాకరమన్నారు. వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను ప్లాంట్ యాజమాన్యం ఎగ్గొట్టేం దుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎంపీగా ఉన్నప్పుడు ప్లాంట్‌ను రద్దు చేయిస్తానని చెప్పిన కృపారాణి..కేంద్ర మంత్రి అయిన తరువాత థర్మల్ యాజ మాన్యానికి కొమ్ముకాస్తున్నారని దుయ్యబట్టారు. కింజరాపు సోదరుల వల్లే.. ఇక్కడ ప్రజా వినాశకర ప్లాంట్లు వస్తున్నాయని దుయ్యబట్టారు. అంతకు ముందు వచ్చిన ప్లాంట్ సిబ్బంది వాహనాలను అడ్డుకుని వెనక్కి పంపారు. ఈ క్రమంలో ఆందోళనకారులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మధ్యాహ్నం 2 వేల మందితో రోడ్డుపైనే సహపంక్తి భోజ నాలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు సుగ్గురామిరెడ్డి, పి.మేనకేతనరెడ్డి, గిన్ని ప్రకాష్, నర్సింహమూర్తి, పి.శ్రీను, జి.కామరాజు, రామారావు, తేజారెడ్డి, నీలాపు అప్పలస్వామితో పాటు 34 గ్రామాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు. -
వచ్చినట్టే వచ్చి..
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి వస్తున్నారని జిల్లా అధికారులు ఉరుకులు, పరుగులు పెట్టారు. వందలాది పోలీసుల హైరానా పడ్డారు. ఇదిగో వస్తున్నారు, అదిగో వస్తున్నారంటూ ప్రజలంతా ఎదురుచూశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఇదే తంతు. చివరకు చావుకబురు చల్లగా చెప్పినట్టు ముఖ్యమంత్రి పర్యటన రద్దయ్యిందనే కబురు అందింది. ఇదీ గురువారం జిల్లాలో నెలకొన్న పరిస్థితి. లక్షలాది రూపాయలు వెచ్చించి చేసిన ఏర్పాట్లు వృథా కావడంతోపాటు అత్యంత కీలకమైన సమయంలో జిల్లా అధికారులు, వందలాది ఉద్యోగులు, పోలీసులు ఒక రోజంతా ముఖ్యమంత్రి కోసం పడిగాపులు కాసి చివరకు ఉసూరుమంటూ వెనుతిరగాల్సివచ్చింది. భారీ వర్షాల వల్ల మునిగిన పొలాలను చూసి, నష్టాలపై జిల్లా అధికారులతో సమీక్షించాల్సిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తన పర్యటనను అర్ధాంతంగా ముగించుకుని వెళ్లిపోయారు. నష్టాన్ని చూడకుండానే.. ఏ రైతునూ పరామర్శించకుండానే.. అధికారుల నుంచి వివరాలు తెలుసుకోకుండానే నరసాపురం మండలం పెదమైనవానిలంకలోని హెలిప్యాడ్ నుంచే వెనుదిరిగారు. షెడ్యూల్ ప్రకారం నరసాపురం, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి గురువారం పర్యటించాల్సి ఉంది. ఆయన వల్ల జిల్లాకు ఒరిగిందేమీ లేకపోగా లక్షల రూపాయలు వృథాగా ఖర్చయ్యూరుు. అధికారులు, సిబ్బంది శ్రమ కూడా వృథా అరుు్యంది. బయల్దేరడమే లేటు తూర్పుగోదావరి జిల్లా పర్యటన పూర్తయిన తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకు ఆయన నరసాపురం మండలం పెదమైనవానిలంక గ్రామానికి చేరుకోవాల్సి ఉంది. ఉదయం హైదరాబాద్‌లోనే రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరిన ముఖ్యమంత్రి తూర్పుగోదావరి జిల్లాకు ఆలస్యంగా చేరుకున్నారు. సాయంత్రం నాలుగు గంటల వరకూ అక్కడే పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత 4.30 గంటలకు పెదమైనవానిలంక చేరుకున్నారు. హెలికాప్టర్ నుంచి సీఎం దిగిన వెంటనే వాతావరణం బాగోలేదని, వెంటనే వెళ్లకపోతే ఇబ్బందని పైలట్ చెప్పడంతో సీఎం హెలికాప్టర్ ఎక్కేశారు. దీంతో ఉదయం నుంచి పడిగాపులు పడిన అధికారులు, సిబ్బంది నీరుగారిపోయారు. మధ్యాహ్నం ఒంటిగంటకు పెదమైనవానిలంకలో సముద్రం కోతకు గురైన ప్రాంతాన్ని చూసి నష్టపోయిన గ్రామస్తులు, మత్స్యకారులతో సీఎం మాట్లాడాల్సి ఉంది. కానీ ఆయన వచ్చీరాగానే వెళ్లిపోవడంతో ఆ కార్యక్రమాలేవీ జరగలేదు. ఇందుకోసం మూడురోజుల నుంచి అధికారులు ఏర్పాట్లు చేశారు. కలెక్టర్‌తోపాటు పలువురు జిల్లా అధికారులు ఉదయం నుంచి సాయంత్రం వరకూ సీఎం కోసం అక్కడే మకాం వేశారు. చివరకు వారంతా నీరసంతో వెనక్కు వచ్చేశారు. రోజంతా పడిగాపులే మరోవైపు సీఎం కోసం తాడేపల్లిగూడెం శశి ఇంజినీరింగ్ కళాశాలలో చేసిన భారీ ఏర్పాట్లు కూడా వృథా అయ్యాయి. ముఖ్యమంత్రి నిర్వహించే సమీక్షా సమావేశం కోసం ఉదయం నుంచే అధికారులు సిద్ధమయ్యారు. అన్ని శాఖల అధికారులు సాయంత్రం వరకూ అక్కడే ఉన్నారు. చివరకు సీఎం రాకపోవడంతో వారి సమయమంతా వృథా అరుు్యంది. సీఎం పర్యటన లేకపోతే ముంపు ప్రాంతాల్లో వారు చేపట్టిన పునరావాస కార్యక్రమాలు, మరమ్మతులు తదితర పనుల్లో నిమగ్నమై ఉండేవారు. సొమ్ము.. శ్రమ వృథా సీఎం పర్యటన కోసం ఖర్చు చేసిన సుమారు రూ.20 లక్షలు బూడిదలో పోసిన పన్నీరైంది. హెలిప్యాడ్ల నిర్మాణం, రోడ్లకు మరమ్మతులు, వందలాది మందికి భోజనాలు, టీఏ, డీఏలు, వాహనాలు, వాటికి కావాల్సిన అయిల్తోపాటు ఇతర ఖర్చులన్నీ కలిపి రూ.20 లక్షలపైనే అరుు ఉంటుందని అధికారుల ద్వారా తెలిసింది. జి ల్లా అధికారులు, వారి సిబ్బంది రావడానికి భా రీ స్థాయిలో వాహనాలు సమకూర్చుకున్నారు. బందోబస్తు కోసం 605 మంది పోలీసులు పని చేశారు. వారికి భోజనాలు, వాహన సదుపా యం, టీఏ, డీఏ అంతా నష్టమే. వారి శ్రమ కూ డా వృథా అయింది. ఇదంతా సీఎం చలవేనని అధికారులు గుసగుసలాడుకోవడం కనిపించింది. ప్రజల్ని సముదారుుంచేందుకు తంటాలు నరసాపురం రూరల్, న్యూస్‌లైన్ : పెదమైనవానిలంక గ్రామానికి వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హెలిప్యాడ్ నుంచే తిరుగు ప్రయూణం కావడంతో ఆయన కోసం ఎదురుచూసిన రైతులు, ప్రజలు నిరాశకు గురయ్యూరు. దీంతో ఎంపీ కనుమూరి బాపిరాజు, ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు, కలెక్టర్ సిద్ధార్థజైన్ అక్కడ వేచివున్న ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. వాతావరణ పరిస్థితులు, సమయం అనుకూలంగా లేకపోవడంతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సభాస్థలికి రాలేకపోయారని ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు. ప్రతికూల పరిస్థితుల వల్ల హెలికాప్టర్‌ను గ్రామంలో దింపడానికి కూడా పైలట్ అంగీకరించలేదని, ఒక్కసారి గ్రామస్తులకు కనిపించి వెళ్లిపోదామని సీఎం బలవంతం చేసి హెలిప్యాడ్ వరకూ వచ్చారని చెప్పారు. శుక్రవారం ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం కావడం వల్ల హైదరాబాద్‌కు వెళ్లిపోవాల్సి వస్తోందని, లేదంటా ఈ రాత్రి పెదమైనవానిలంక గ్రామంలోనే బస చేసేవాడినని కిరణ్‌కుమార్‌రెడ్డి తమకు చెప్పారన్నారు. ఈ విషయూలను రైతులకు, మత్స్యకారులకు తమను చెప్పమన్నారంటూ అక్కడి వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించారు. త్వరలోనే సీఎం వస్తారని చెప్పుకొచ్చారు. నష్టాలపై సీఎంకు నివేదిక పంటలు, ఆస్తి నష్టం రూ.808.18 కోట్లుగా అంచనా ఏలూరు/నరసాపురం రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలో అక్టోబర్ 22 నుంచి 27వ తేదీ వరకు కురిసిన భారీ వర్షాల కారణంగా జిల్లాలో పంటలు, ఆస్తులకు రూ.808.18 కోట్ల మేర నష్టం సంభవించిందని కలెక్టర్ సిద్ధార్థజైన్ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డికి అందజేసిన నివేదికలో పేర్కొన్నారు. నరసాపురం మండలం పెదమైనివానిలంక గ్రామానికి వచ్చి, వెనుదిరిగిన ముఖ్యమంత్రికి నష్టాలపై కలెక్టర్ నివేదిక అందించారు. జిల్లాలో 59 వేల 45 హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లిందని, దీని విలువ రూ.150 కోట్లు ఉంటుందని నివేదికలో పేర్కొన్నారు. 2,453 హెక్టార్లలో ఉద్యాన పంటలకు వాటిల్లిన నష్టం విలువ రూ.41.88 కోట్లు అని వివరించారు. 41 హెక్టార్లలో రూ.5 లక్షల విలువైన పట్టు పురుగుల పెంపకానికి, 9.05 హెక్టార్ల చెరువుల్లో రూ.96 లక్షల విలువైన చేపల నష్టం సంభవించినట్టు వివరించారు. 768.10 కిలోమీటర్ల మేర ఆర్ అండ్ బీ రహదారులు ధ్వంసం కావడంతో రూ.370 కోట్ల 86 లక్షలు, 1139.78 కిలోమీటర్లు పంచాయతీ రోడ్లు దెబ్బతినగా రూ.214.8 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. 220 కిలోమీటర్ల మునిసిపల్ రహదారులకు రూ.23.66 కోట్ల మేర నష్టం జరిగిందని పేర్కొన్నారు. రూ.53 లక్షల విలువైన 358 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు దె బ్బతిన్నాయన్నారు. 8 నీటిపారుదల వనరులు దెబ్బతినటంతో రూ.29 లక్షల నష్టం సంభవించిందన్నారు. జిల్లాలో 1,945 ఇళ్లు దెబ్బతిన్నాయని, భారీ వర్షాల కారణంగా నలుగురు మృతి చెందారని వివరించారు. ముంపు బాధితుల కోసం 21 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 1,054 మందిని ఆదుకున్నామన్నారు. 66 వైద్య శిబిరాలు నిర్వహించి సేవలందించామని పేర్కొన్నారు. భారీ వర్షాలకు రూ.5 లక్షల విలువైన 25 పశువులు మృత్యువాత పడ్డాయని సీఎంకు ఇచ్చిన నివేదికలో వెల్లడించారు.