ట్రాన్స్‌జెండర్‌కు ఘోర అవమానం! | Marathi Actress Pranit Hatte Denied Accommodation In Hotel For Being A Transgender, Video Viral | Sakshi
Sakshi News home page

Actress Pranit Hatte: ట్రాన్స్‌జెండర్‌కు ఘోర అవమానం!

Published Sat, May 11 2024 1:40 PM | Last Updated on Sat, May 11 2024 2:45 PM

Hotel Canceled Booking after Marathi Actress Pranit Hatte

మహారాష్ట్రకు చెందిన తొలి మరాఠీ లింగమార్పిడి (ట్రాన్స్‌ జెండర్‌) నటి ప్రణీత్ హట్టే ఇటీవల తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. తాను ఒక హోటల్‌లో రూమ్‌ బుక్‌ చేశారని, అయితే తాను ట్రాన్స్‌ను అయినందున సదరు హోటల్ తన బుకింగ్‌ను రద్దు చేసిందని వాపోయారు. ఈ ఘటనపై తన ఆవేదనను ఆమె ఒక వీడియోలో పంచుకున్నారు.

దానిలో ప్రణీత్ హట్టే మాట్లాడుతూ ‘నేను నాసిక్‌కు ఒక షోలో పాల్గొనేందుకు వచ్చాను. ఇక్కడ ఉండేందుకు ఓ హోటల్‌లో రూమ్‌ బుక్‌ చేశాను. అయితే నేను ట్రాన్స్‌జండర్‌ను అయినందున హోటల్ యజమానులు నా రూమ్‌ బుకింగ్‌ను రద్దు చేశారు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్లాలి?’ అని ప్రశ్నించారు. ఈ వీడియో చూసిన ప్రణీత్ హట్టే అభిమానులు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఒక యూజర్‌ ‘నేను ఇప్పుడే ఫోన్ చేసి హోటల్‌వారితో మాట్లాడాను. వారు ఇప్పుడు ఖచ్చితంగా సిగ్గుపడివుంటారు’ అని రాశారు. మరో యూజర్‌ ‘మీరు దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేయాలి’ అని రాశారు.

ప్రణీత్ హట్టే మరాఠీ నటి. ఆమె మరాఠీ చిత్రం ‘కరభారి లయభరి’లో గంగ పాత్రలో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ చిత్రం  ‘హడ్డీ’లో కూడా ప్రణీత్ కనిపించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement