pranit
-
ట్రాన్స్‌జెండర్‌కు ఘోర అవమానం!
మహారాష్ట్రకు చెందిన తొలి మరాఠీ లింగమార్పిడి (ట్రాన్స్ జెండర్) నటి ప్రణీత్ హట్టే ఇటీవల తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. తాను ఒక హోటల్లో రూమ్ బుక్ చేశారని, అయితే తాను ట్రాన్స్‌ను అయినందున సదరు హోటల్ తన బుకింగ్‌ను రద్దు చేసిందని వాపోయారు. ఈ ఘటనపై తన ఆవేదనను ఆమె ఒక వీడియోలో పంచుకున్నారు.దానిలో ప్రణీత్ హట్టే మాట్లాడుతూ ‘నేను నాసిక్‌కు ఒక షోలో పాల్గొనేందుకు వచ్చాను. ఇక్కడ ఉండేందుకు ఓ హోటల్లో రూమ్ బుక్ చేశాను. అయితే నేను ట్రాన్స్‌జండర్‌ను అయినందున హోటల్ యజమానులు నా రూమ్ బుకింగ్‌ను రద్దు చేశారు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్లాలి?’ అని ప్రశ్నించారు. ఈ వీడియో చూసిన ప్రణీత్ హట్టే అభిమానులు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఒక యూజర్ ‘నేను ఇప్పుడే ఫోన్ చేసి హోటల్వారితో మాట్లాడాను. వారు ఇప్పుడు ఖచ్చితంగా సిగ్గుపడివుంటారు’ అని రాశారు. మరో యూజర్ ‘మీరు దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేయాలి’ అని రాశారు.ప్రణీత్ హట్టే మరాఠీ నటి. ఆమె మరాఠీ చిత్రం ‘కరభారి లయభరి’లో గంగ పాత్రలో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ చిత్రం ‘హడ్డీ’లో కూడా ప్రణీత్ కనిపించారు. -
పావగడలో అర్ధరాత్రి దోపిడీ దొంగల బీభత్సం
వైద్య శాఖ ఉద్యోగి ఇంట్లో రూ.3.60 లక్షల విలువైన బంగారు నగల దోపిడీ = అచ్చ తెలుగులో మాట్లాడిన దొంగలు = బాధితులు చెప్పిన ఆనవాళ్ల మేరకు దొంగల ఊహా చిత్రాలు రూపొందించిన పోలీసులు పావగడ, న్యూస్‌లైన్ : పావగడలో పట్టణ పోలీస్ స్టేషన్‌కు కూత వేటు దూరంలో అలంకార థియేటర్ ఎదురుగా ఉన్న విద్యానగర్‌లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. కాలనీలోని హెల్త్ అసిస్టెంట్ రవిచంద్ర కుమార్ ఇంట్లోకి జొరబడి సుమారు రూ.3.60 లక్షల విలువైన 120 గ్రాముల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటనపై శనివారం పోలీసులు, బాధితుల తెలిపిన వివరాల మేరకు.. శుక్రవారం రాత్రి రవిచంద్రకుమార్, భార్య నాగకీర్తి, అతని తల్లి గంగమ్మ, పదేళ్లలోపున్న కుమారులు ప్రణబ్, ప్రణీత్ నిద్రపోయారు. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో దుండగులు గేటు తాళాలు పగులగొట్టి కాంపౌండ్ లోపలకు వచ్చి, మెయిన్ డోర్‌కున్న లాక్‌ను బండరాయితో ధ్వంసం చేసి ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లోని వారు మేల్కొనే సరికే డ్రాయర్లతో ఉన్న ముగ్గురు లోపలకు వచ్చేశారు. ‘మీకు ఎలాంటి హాని తలపెట్టం.. బంగారు నగలు, డబ్బు ఇవ్వండి’ అంటూ కత్తితో బెదిరించారు. ప్రాణ భయంతో రవిచంద్ర కుమార్ తన వేలికి ఉన్న ఉంగరాన్ని తీసి ఇవ్వగా, అతని భార్య తన ఒంటిపై ఉన్న బంగారు నగలను ఇచ్చేసింది. తర్వాత గంగమ్మ మెడలోని మాంగల్యం సరం, ముత్యాల సరం, చెవిలో కమ్మల్ని దుండగులు కాజేశారు. వారిని ఒక గదిలో బంధించి, డబ్బు కోసం ఇంట్లోని బీరువాలో వెదుకుతుండగా, గంగమ్మ కేకలు వేసింది. దీంతో ఇరుగు పొరుగు వారు వచ్చేసరికి దొంగలు పారిపోయారు. స్థానికుల సమాచారంతో సీఐ భానుప్రసాద్, ఎస్ఐ అశోక్‌కుమార్, సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. దొంగల ఆచూకీ కోసం చుట్టుపక్కల భారీగా గాలించారు. తుమకూరు నుంచి జాగిలాలను రప్పించగా, అవి ఇంటి నుంచి కొంతదూరం పట్టణం వైపు వెళ్లి తిరిగొచ్చేశాయి. వేలిముద్రల నిపుణులు ఆధారాలు సేకరించారు. కాగా దోపిడీ దొంగలు 25-30 ఏళ్ల లోపు ఉన్న వారేనని, వారు అచ్చ తెలుగులో మాట్లాడారని, ఇంటి బయట కూడా మరో దొంగ కాపలా ఉన్నాడని బాధితులు పోలీసులకు వివరించారు. ఏఎస్పీ లక్ష్మణ్, మధుగిరి సబ్ డివిజన్ డీఎస్పీ గురుస్వామి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితులు దొంగల రూపురేఖలను చెప్పిన మేరకు వారి ఊహా చిత్రాలను పోలీసులు రూపొందించారు. త్వరలోనే నిందితుల్ని పట్టుకుంటామని ఏఎస్పీ వెల్లడించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ భానుప్రసాద్ తెలిపారు. -
చెస్ చాంప్స్ ప్రేరణ, ప్రణీత్
సాక్షి, హైదరాబాద్: రాజబహదూర్ స్మారక చెస్ టోర్నమెంట్లో ప్రేరణ, ప్రణీత్ విజేతలుగా నిలిచారు. బాలికల అండర్-7 టైటిల్‌ను ప్రేరణ గెలుపొందగా, మనోజ్ఞ, సేవిత విజ్జి రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. బాలుర టైటిల్‌ను ప్రణీత్ చేజిక్కించుకున్నాడు. ఇందులో అర్జున్, తన్మయ్ గుప్తా తర్వాతి స్థానాల్లో నిలిచారు. బాలుర అండర్-9 విభాగంలో మిద్దూశ్, రుత్విక్, హరిచరణ్ సాయి తొలి మూడు స్థానాలు పొందారు. బాలికల విభాగంలో అభిరామి నెగ్గగా... వర్షిత, సాహితి వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఇతర ఫలితాలు అండర్-11 బాలురు: 1. మేఘాంశ్ రాయ్, 2 నీరజ్ అనిరుధ్, 3. జయంత్; బాలికలు: 1. అంజలి, 2. లాస్యప్రియ, 3. మేఘన; అండర్-13 బాలురు: 1. రాహుల్, 2. ప్రతీక్, 3. బిపిన్ రాజు; బాలికలు: 1. శ్రీలేఖ, 2. హరిలాస్య, 3. వెన్నెల; అండర్-15 బాలురు: 1. కార్తీక్, 2. నాగశేషు, 3. శ్రీకల్యాణ్; బాలికలు: 1. రోహిత్, 2. శ్రీజ్యోతిర్మయి, 3. అయినా మార్యన్.