సాక్షి, హైదరాబాద్: రాజబహదూర్ స్మారక చెస్ టోర్నమెంట్‌లో ప్రేరణ, ప్రణీత్ విజేతలుగా నిలిచారు. బాలికల అండర్-7 టైటిల్‌ను ప్రేరణ గెలుపొందగా, మనోజ్ఞ, సేవిత విజ్జి రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. బాలుర టైటిల్‌ను ప్రణీత్ చేజిక్కించుకున్నాడు. ఇందులో అర్జున్, తన్మయ్ గుప్తా తర్వాతి స్థానాల్లో నిలిచారు. బాలుర అండర్-9 విభాగంలో మిద్దూశ్, రుత్విక్, హరిచరణ్ సాయి తొలి మూడు స్థానాలు పొందారు. బాలికల విభాగంలో అభిరామి నెగ్గగా... వర్షిత, సాహితి వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.
ఇతర ఫలితాలు
అండర్-11 బాలురు: 1. మేఘాంశ్ రాయ్, 2 నీరజ్ అనిరుధ్, 3. జయంత్; బాలికలు: 1. అంజలి, 2. లాస్యప్రియ, 3. మేఘన; అండర్-13 బాలురు: 1. రాహుల్, 2. ప్రతీక్, 3. బిపిన్ రాజు; బాలికలు: 1. శ్రీలేఖ, 2. హరిలాస్య, 3. వెన్నెల; అండర్-15 బాలురు: 1. కార్తీక్, 2. నాగశేషు, 3. శ్రీకల్యాణ్; బాలికలు: 1. రోహిత్, 2. శ్రీజ్యోతిర్మయి, 3. అయినా మార్యన్.
చెస్ చాంప్స్ ప్రేరణ, ప్రణీత్
Published Thu, Aug 22 2013 11:58 PM | Last Updated on Fri, Sep 1 2017 10:01 PM
Advertisement
Advertisement