chess tournment
-
చాంప్స్ హిమాన్షు, జ్ఞానిత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్లో హిమాన్షు అగర్వాల్, జ్ఞానిత నేత చాంపియన్లుగా నిలిచారు. ఎల్బీ స్టేడియం లో జరిగిన ఈ టోర్నీ అండర్–15 బాలుర విభాగంలో నిర్ణీత 5 రౌండ్లు ముగిసేసరికి 4.5 పాయింట్లతో హిమాన్షు, సూర్య సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా హిమాన్షు విజేతగా నిలవగా, సూర్య రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. బాలికల విభాగంలో 3 పాయింట్లతో జ్ఞానిత తొలిస్థానాన్ని దక్కించుకుంది. పి. శ్రేయ రన్నరప్‌గా నిలిచింది. ఇతర వయో విభాగాల విజేతల వివరాలు అండర్–13 బాలురు: 1. ఓజస్, 2. కె. పవన్, 3. అజితేశ్; బాలికలు: 1. సాయిచరిత వరేణ్య, 2. అమృత వర్షిణి. అండర్–11 బాలురు: 1. సంకేత్, 2. అర్జున్, 3. వి. ఆరుశ్; బాలికలు: 1. ఊర్జ, 2. ఇషాన్వి, 3. ఆస్మా బేగం. అండర్–9 బాలురు: 1. శ్రీకృష్ణ ప్రణీత్, 2. కె. నితిక్, 3. సాయి శ్రీతేశ్; బాలికలు: 1. ఆర్. లక్ష్మి సమీరాజ, 2. హర్షిత, 3. నాగ కార్తీక. అండర్–7 బాలురు: 1. శ్రవణ్, 2. అయాన్, 3. సాయి సిద్ధాంత్; బాలికలు: 1. కీర్తిక, 2. అక్షయ, 3. ఫణిశ్రీ. -
బురఖా నిబంధన : తప్పుకున్న భారత క్రీడాకారిణి
హైదరాబాద్ : ఇరాన్లో నిర్వహించబోయే ‘ఏషియన్ టీమ్ చెస్ చాంపియన్‌షిప్’లో పాల్గొనడంలేదని మాజీ వరల్డ్ జూనియర్ గర్ల్స్ చాంపియన్, ఉమెన్ గ్రాండ్ మాస్టర్ సౌమ్య స్వామినాథన్ ప్రకటించారు. జులై 26 నుంచి ఆగస్టు 6 వరకూ ఇరాన్‌లోని హమదాన్‌లో నిర్వహించబోయే ఈ టోర్నీ నుంచి తాను తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఇరాన్ దేశంలో ఉన్న ‘తలకు తప్పనిసరిగా స్కార్ఫ్ ధరించాల’నే నిబంధన వల్ల తాను ఈ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె ఫేస్బుక్లో పోస్టు చేశారు. ‘ఇరానీ చట్టాలలో మహిళలు తప్పనిసరిగా తలపై స్కార్ఫ్ లేదా బురఖా ధరించాలనే నియమం ఉంది. కానీ ఇలా బలవంతంగా స్కార్ఫ్ లేదా బురఖా ధరించడం అంటే నా స్వేచ్ఛకు ఆటంకం కల్గించడమే అవుతుంది. ఇలా చేస్తే నా హక్కులకు, నా మతానికి గౌరవం ఇవ్వనట్లే అవుతుంది. అందుకే నేను ఇరాన్ వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను. టోర్నీలో భాగంగా మమ్మల్ని నేషనల్ టీం డ్రస్ కానీ, ఫార్మల్స్ కానీ, లేదా మరేదైనా స్పోర్ట్ డ్రెస్ వేసుకోమని కోరితే మేము సంతోషంగా ఒప్పుకునేవాళ్లము. అంతేకాని ఇలా మతపరమైన నియమాలను ఆటగాళ్ల మీద బలవంతంగా రుద్దడం సరైంది కాదు. ఇలాంటి అధికారిక చాంపియన్‌షిప్స్‌ను నిర్వహించేటప్పుడు క్రీడాకారుల మనోభావాలను, హక్కులను పట్టించుకోకపోవడం విచారకరం. భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం నాకు ఎప్పటికి గర్వ కారణమే. క్రీడాకారులు వారి ఆట కోసం చాలా విషయాల్లో సర్దుకుపోతుంటారు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం అలా చేయలేమని’ సౌమ్య తన పోస్టులో పేర్కొన్నారు. అథ్లెట్లు ఇలా టోర్నీ నుంచి తప్పుకోవడం ఇదే ప్రథమం కాదు. గతంలో ఇండియా ‘టాప్ షూటర్’ హీనా సింధూ కూడా ఇలానే 2016లో ఇరాన్లో నిర్వహించిన ‘ఏషియన్ ఎయిర్‌గన్ మీట్’ నుంచి తప్పుకున్నారు. అయితే అప్పుడు కూడా తలపై స్కార్ఫ్ ధరించాలనే నియమమే ఇందుకు కారణం. -
అగ్రస్థానంలో కేఎస్ఆర్ఎం రాజు
సాక్షి, హైదరాబాద్: సర్దార్ బిషన్ సింగ్ స్మారక ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో వెటరన్ ప్లేయర్ కేఎస్ఆర్ఎం రాజు, సీనియర్ చెస్ కోచ్ జె. మల్లేశ్వర్ రావు సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. ముషీరాబాద్ క్రాస్ రోడ్స్‌లోని ఆమంత్రణ్ హోటల్లో జరుగుతోన్న ఈ పోటీల్లో 5 రౌండ్లు ముగిసేసరికి వీరిద్దరూ 5 పాయింట్లను సాధించారు. శనివారం జరిగిన ఐదో రౌండ్ గేమ్‌లో ఫణి కనూరి (4)పై రాజు (5), ప్రణీత్ ఉప్పాల (4)పై మల్లేశ్వర రావు గెలుపొందారు. ఇతర మ్యాచ్‌ల్లో షణ్ముఖ తేజ (3.5)పై రాజా రిత్విక్ (4.5), అమిత్‌పాల్ సింగ్ (3.5)పై సాయి వర్షిత్ (4.5), విశ్వనాథ్ ప్రసాద్ (3.5)పై రామానుజాచార్యులు (4.5) విజయం సాధించారు. రెండు రోజుల పాటు జరుగనున్న ఈ టోర్నీలో 180 మంది చెస్ క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో 88 మంది అంతర్జాతీయ ఫిడే రేటెడ్ క్రీడాకారులు ఉన్నారు. -
జ్యూరిచ్ చెస్ టోర్నీ చాంప్ ఆనంద్
జ్యూరిచ్: భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఈ ఏడాది తొలి టైటిల్‌ను సాధించాడు. ఆరుగురు గ్రాండ్‌మాస్టర్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగిన జ్యూరిచ్ క్లాసిక్ చెస్ టోర్నమెంట్లో ఆనంద్ విజేతగా నిలిచాడు. సెర్గీ కర్జాకిన్ (రష్యా)తో బుధవారం జరిగిన చివరిదైన ఐదో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 42 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకొని మొత్తం 7 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. హికారు నకముర (అమెరికా) 6 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. -
ఆనంద్‌కు రెండో విజయం
జ్యూరిచ్: భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ జ్యూరిచ్ క్లాసిక్ చెస్ టోర్నమెంట్లో రెండో విజయం సాధించాడు. హికారు నకముర (అమెరికా)తో మంగళవారం జరిగిన నాలుగో రౌండ్లో ఆనంద్ 41 ఎత్తుల్లో గెలుపొందాడు. అంతకుముందు ఫాబి యానా కరుఆనా (ఇటలీ)తో సోమవారం జరిగిన మూడో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 45 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. నాలుగో రౌండ్ తర్వాత ఆనంద్ ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. -
3న రంగారెడ్డి జిల్లా చెస్ టోర్నీ
ఎల్బీ స్టేడియం: రంగారెడ్డి జిల్లా చెస్ అసోసియేషన్(ఆర్ఆర్డీసీఏ) ఆధ్వర్యంలో అండర్-7, 13 బాల బాలికల చెస్ టోర్నమెంట్ ఆగస్టు 3న జరగనుంది. ఈ టోర్నీ నేరేడ్మెట్ చౌరస్తాలోని ఇండియన్ హైస్కూల్లో నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో రాణించిన అండర్-13 బాల బాలికలను వరంగల్‌లో జరిగే అంతర్ జిల్లా అండర్-13 చెస్ టోర్నీలో పాల్గొనే రంగారెడ్డి జిల్లా జట్టుకు ఎంపిక చేయనున్నారు. అండర్-7 బాల బాలికల విభాగాల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారిని తూర్పు గోదావరి జిల్లాలో జరిగే అంతర్ జిల్లా టోర్నీకి ఎంపిక చేస్తారు. జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొనే ఆసక్తి గల వారు తమ ఎంట్రీలను ఆగస్టు 1లోగా పంపించాలి. ఇతర వివరాలకు చెస్ కోచ్ శ్రీకృష్ణ(92461-41111)ను సంప్రదించవచ్చు. తెలంగాణ మహిళల ఓపెన్ క్యారమ్ టోర్నీ: ఎల్బీ స్టేడియం: తెలంగాణ మహిళల ర్యాంకింగ్ ఓపెన్ క్యారమ్ టోర్నమెంట్ ఆగస్టు 3, 4 తేదీల్లో ఇక్కడి ఎల్బీ ఇండోర్ స్టేడియంలో జరగనుంది. హైదరాబాద్ క్యారమ్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో జరిగే ఈ టోర్నీలో తొలి రౌండ్లో ఓడిపోయిన మహిళలకు వన్డే కోచింగ్ క్యాంప్‌ను ఏర్పాటు చేసి వారి ఆట తీరును మెరుగుపరుస్తారు. ఇతర వివరాలకు హెచ్‌సీఏ నిర్వహణ కార్యదర్శి ఎస్.శోభన్‌రాజ్(94403-07023)ను సంప్రదించవచ్చు. 3 నుంచి కుంగ్‌ఫూ, కరాటే పోటీలు: నిష్కిన్స్ కుంగ్‌ఫూ యూనివర్స్, షావోలిన్ థాయ్ చీ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో వచ్చే నెల 3వ తేదీ నుంచి రాష్ట్రస్థాయిలో కుంగ్‌ఫూ, కరాటే చాంపియన్‌షిప్ జరగనుంది. కటాస్, వెపన్స్, స్పారింగ్ తదితర విభాగాల్లో ఈ పోటీలు నిర్వహిస్తామని ఆర్గనైజర్లు చెప్పారు. మరిన్ని వివరాలకు ఫోన్ నెం. 99480 99070లో సంప్రదించాలి. -
టైటిల్‌కు చేరువలో ప్రాచుర్య కుమార్
ఆలిండియా ఫిడే రేటింగ్ బ్లైండ్ చెస్ సాక్షి, హైదరాబాద్: ఆలిండియా ఫిడే రేటింగ్ అంధుల చెస్ టోర్నమెంట్లో ఒరిస్సా ఆటగాడు ప్రాచుర్య కుమార్ ప్రధాన్ టైటిల్‌కు చేరువయ్యాడు. బేగంపేట్‌లోని దేవనార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ టోర్నమెంట్లో ప్రాచుర్య ఏడున్నర పాయింట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. బుధవారం జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌లో అతను ఢిల్లీకి చెందిన అఖిలేశ్ శ్రీవాస్తవ (6)పై విజయం సాధించాడు. తొమ్మిది రౌండ్ల ఈ టోర్నమెంట్లో ఇక మిగిలింది ఒకే రౌండ్ కావడంతో... ప్రాచుర్య (7.5) టైటిల్ రేసులో నిలిచాడు. ఇతనికి ఏడు పాయింట్లు ఖాతాలో ఉన్న విజయ్ కరియా (గుజరాత్) నుంచి కాస్త పోటీ ఎదురవనుంది. ఆంధ్రప్రదేశ్ ఆటగాడు వెంకట్ రెడ్డి తదితరులు ఆరు పాయింట్లతో ఉమ్మడిగా నాలుగో స్థానంలో ఉన్నారు. ఎనిమిదో రౌండ్ పోటీల్లో వెంకట్ రెడ్డి (6)... మోహన్ నారాయణ్ (మహారాష్ట్ర, 5)పై, విజయ్ కరియా (7)... సౌందర్య కుమార్ ప్రధాన్ (ఒరిస్సా, 6)పై, అశ్విన్ మక్వానా (గుజరాత్, 6.5)... శశిధర్ (కర్ణాటక, 5.5)పై గెలుపొందారు. బలరామన్ (కేరళ, 6.5)... శోభ లోఖండే (మహారాష్ట్ర, 5.5)పై నెగ్గగా, అతుల్ కకడే (మహారాష్ట్ర, 6)... సుమన్ కుమార్ (బీహార్, 5.5)తో గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. ఉడుపా కృష్ణ (కర్ణాటక, 6) చేతిలో మయాంక్ శర్మ (ఢిల్లీ, 5)కు చుక్కెదురవగా, చిరంతన్ మెసారియా (గుజరాత్, 5.5)... స్వప్నిల్ షా (మహారాష్ట్ర, 5.5)తో, ముత్తురామన్ (తమిళనాడు, 5.5)... సుధీర్ కుమార్ నాయక్ (ఒరిస్సా, 5.5)తో గేమ్‌లను డ్రా చేసుకున్నారు. నేడు (గురువారం) చివరి రౌండ్ పోటీలు జరుగుతాయి. ఈ టోర్నీలో14 రాష్ట్రాల నుంచి 111 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. -
చాంప్స్ సాహితి, హరిచరణ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రస్థాయి అండర్-11 చెస్ టోర్నమెంట్‌కు నగరం నుంచి సాహితి, హరిచరణ్ సాయి అర్హత సంపాదించారు. హైదరాబాద్ జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో సూపర్ కిడ్స్ చెస్ అకాడమీలో ఈ టోర్నీ జరిగింది. ఈ సెలక్షన్ టోర్నమెంట్ బాలికల విభాగంలో వి. సాహితి గెలుపొందగా, జి. సాహిత్య రన్నరప్‌గా నిలిచింది. బాలుర విభాగంలో హరిచరణ్ టైటిల్ సాధించగా, కె. తరుణ్ రెండో స్థానం పొందాడు. విభాగానికి ఇద్దరు చొప్పున మొత్తం నలుగురు క్రీడాకారులు త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి చెస్ టోర్నీలో హైదరాబాద్ జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. ప్రత్యేక ప్రైజ్‌మనీ ఈవెంట్ విజేతలు: బాలికలు: 1. త్రిష, 2. వైష్ణవి. 3. సంజన వర్మ, 4. హర్షిత, 5.పద్మప్రియా, 6.సాధ్వి, 7. సుసేన్ రెడ్డి; బాలురు: 1. సాయి సిద్ధార్థ, 2. హర్షిత్‌కృష్ణ, 3. అకిరా సౌమ్యనాథ్, 4. ప్రణవ్, 5. వరుణ్ గోపాల్, 6. రోహిత్, 7. ప్రణీత్ ఉప్పల. -
దూసుకెళ్తున్న తులసీరామ్
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా ఫిడే రేటింగ్ చెస్ టోర్నీలో హైదరాబాద్ ఆటగాడు ఎం.తులసీ రామ్‌కుమార్ తిరుగులేని ఆధిక్యంతో దూసుకెళ్తున్నాడు. హబ్సిగూడలోని సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్లో జరుగుతున్న నాలుగు రోజుల ఈ టోర్నీలో భాగంగా గురువారం సి.వి.విక్రమ్ తేజతో జరిగిన ఏడో రౌండ్లో తులసీరామ్ విజయం సాధించాడు. దీంతో మూడో రోజు ఏడో రౌండ్ ముగిసేసరికి తులసీరామ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు పొట్లూరి సుప్రీత 5వ స్థానంలో, ఎం.తేజ సురేష్ 6వ స్థానంలో కొనసాగుతుండగా, విశ్వనాథ్ వివేక్, సి.వి.విక్రమ్ తేజ, ఎస్.ఎస్.వి.ఆదిత్య, ఎం.సత్యనారాయణ, ఎస్.సుబ్బరాజులు వరుసగా 8 నుంచి 12వ స్థానాల్లో ఉన్నారు. మూడో రోజు పోటీల్లో బ్రహ్మేచ దివేశ్-సత్యగిరి, ఎస్.ఎస్.వి.ఆదిత్య-సత్యనారాయణ, సంకలన్ భారతి-అమిత్ పంచల్ల మధ్య మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. వెంకటరమణపై సాహు దాశరథి, ఆర్.మురళీధరన్‌పై పద్మానంద్ మీనన్, వి.భాస్కర్‌పై పొట్లూరి సుప్రీత, కంది రవిపై ఎస్.సుబ్బరాజు గెలుపొందారు. ఇతర మ్యాచ్‌ల్లో విశ్వనాథ్ వివేక్ చేతిలో కడవ్ ఓంకార్, తేజసురేష్ చేతిలో శివపవన్లు ఓడిపోయారు. ఆకట్టుకుంటున్న సుప్రీత అయితే 13 ఏళ్ల చిన్నారి పొట్లూరి సుప్రీత తన ఆటతీరుతో ఆకట్టుకుంటోంది. టోర్నీలో 19వ సీడ్‌గా బరిలోకి దిగిన సుప్రీత టాప్-8 లో కొనసాగుతూ ప్రశంసలు పొందుతోంది. 1800 లోపు రేటింగ్ పాయింట్లు కలిగిన క్రీడాకారుల మధ్య జరుగుతున్న రూ. 2.50 లక్షల ప్రైజ్‌మనీ గల ఈ టోర్నీలో చివరి రెండు రౌండ్లు శుక్రవారం జరగనున్నాయి. -
ఓవరాల్ చాంప్స్ మనీషా, షణ్ముఖ
అండర్-16 చెస్ టోర్నీ ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: అండర్-16 సెలక్షన్ కమ్ చెస్ టోర్నమెంట్లో ఓవరాల్ బాలికల టీమ్ టైటిల్‌ను ఎం.మనీషా చౌదరి కైవసం చేసుకుంది. అండర్-16 బాలుర ఓవరాల్ టైటిల్‌ను పి.షణ్ముఖ తేజ చేజిక్కించుకున్నాడు. వన్ గోల్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఖైరతాబాద్‌లోని వెంకటరమణ కాలనీ కమ్యూనిటీ హాల్లో మంగళవారం ఈ టోర్నీ ముగిసింది. ఫైనల్స్ ఫలితాలు: బాలికల విభాగం: అండర్-13: 1.సముద్రాల దేవిక, 2.పి.శ్రావణి, అండర్-10: 1.జె.ఎ.ఎస్.శర్వాణి. అండర్-8: 1.యజ్ఞ ప్రియ, 2.ప్రణీత ప్రియ. బాలుర విభాగం: అండర్-15 : 1.ఎస్.బిపిన్ రాజ్, 2.పి.గౌతమ్, 3.ఎం.తరుణ్, 4.ఎ.అఖిల్, 5.సాయి రేవంత్, 6.ఎల్.సాయి చరణ్, 7.సి.హెచ్.రాంమోహన్ రెడ్డి,8. ఎస్.ప్రవీణ్ కుమార్. అండర్-13: 1.ఎ.సాయి సిద్ధార్థ, 2.కుల్‌ప్రీత్ సింగ్, 3.బి.సాయి చాణిక్య రెడ్డి, 4.ప్రీతమ్ రెడ్డి, 5.వి.ప్రదీప్ రెడ్డి, 6. జశ్వంత్, 7.బి.ప్రశాంత్ కుమార్, 8.బి.హర్షిత్. అండర్-10: 1.ఎం.కౌశిక్, 2.జి.సంజన, అండర్-8: 1.టి.కె.సిద్ధార్థ 2. హిమేష్, అండర్-6: జె.ఎస్ఎస్. శ్రీకర్. -
ఆనంద్‌కు మూడో విజయం
ఖాంటీ మాన్సిస్క్ (రష్యా): భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తన ‘డ్రా’ల పరంపరకు తెరదించాడు. క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో మూడో విజయాన్ని నమోదు చేశాడు. వరుసగా ఐదు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్న ఈ ప్రపంచ మాజీ చాంపియన్ ఆదివారం జరిగిన తొమ్మిదో రౌండ్లో వాసెలిన్ తొపలోవ్ (బల్గేరియా)పై 57 ఎత్తుల్లో గెలిచాడు. ఇతర తొమ్మిదో రౌండ్ గేముల్లో కర్జాకిన్ (రష్యా) 64 ఎత్తుల్లో క్రామ్నిక్ (రష్యా)పై, మమెదైరోవ్ (అజర్బైజాన్) 44 ఎత్తుల్లో అరోనియన్ (అర్మేనియా)పై గెలుపొందగా... ఆంద్రికిన్ (రష్యా), స్విద్లెర్ (రష్యా)ల మధ్య గేమ్ 30 ఎత్తుల్లో ‘డ్రా’ అయింది. తొమ్మిదో రౌండ్ తర్వాత ఆనంద్ ఆరు పాయింట్లతో ఆధిక్యంలో ఉన్నాడు. -
ఆనంద్‌కు మళ్లీ ‘డ్రా’నే
ఖాంటీ మాన్సిస్క్ (రష్యా): క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత సూపర్ గ్రాండ్‌మాస్టర్ ఆనంద్‌కు వరుసగా మళ్లీ డ్రా ఫలితమే ఎదురైంది. అర్మేనియా గ్రాండ్‌మాస్టర్, టాప్ సీడ్ లెవొన్ అరోనియన్‌తో శనివారం జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌ను కేవలం 19 ఎత్తుల్లోనే డ్రా చేసుకున్నాడు. ఈ టోర్నీలో అతనికిది ఆరో డ్రా. ఇంకా ఆరు రౌండ్లు మిగిలున్న ఈ టోర్నీలో వీరిరువురు ఐదు పాయింట్లతో ఉమ్మడిగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. -
ఆనంద్‌కు రెండో గెలుపు
క్యాండిడేట్స్ చెస్ టోర్నీ ఖాంటీ మన్‌సిస్క్(రష్యా): ప్రపంచ మాజీ చాంపియన్, భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో రెండో విజయాన్ని నమోదు చేశాడు. శనివారం జరిగిన మూడో రౌండ్ గేమ్‌లో ఈ భారత ఆటగాడు... షకిర్యార్ మమెద్యరోవ్ (అజర్బైజాన్)పై విజయం సాధించాడు. రెండున్నర పాయింట్లతో ఆనంద్ ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. మమెద్యరోవ్తో జరిగిన పోరులో నల్లపావులతో ఆడిన ఆనంద్ ఆరంభం నుంచి ఆటపై పట్టు సాధించాడు. దీంతో ముందడుగు వేయడానికి ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం లభించలేదు. 24వ ఎత్తుతో దాదాపు విజయం ఖాయంచేసుకున్న భారత గ్రాండ్‌మాస్టర్ 31 ఎత్తుల్లోనే ఆట ముగించాడు. మిగతా పోటీల్లో వాసెలిన్ తొపలోవ్ (బల్గేరియా)తో టాప్ సీడ్ లెవొన్ అరోనియన్ (అర్మేనియా), దిమిత్రి అండ్రెకిన్ (రష్యా)తో సెర్గెయ్ కర్జాకిన్ (రష్యా) గేమ్‌లను డ్రా చేసుకున్నారు. -
ఆనంద్‌కు పరీక్ష
నేటి నుంచి క్యాండిడేట్స్ చెస్ టోర్నీ ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): స్వదేశంలో గతేడాది కోల్పోయిన ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ కిరీటాన్ని ఈసారి దక్కించుకునే క్రమంలో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తొలి పరీక్షకు సిద్ధమయ్యాడు. బుధవారం మొదలయ్యే క్యాండిడేట్స్ టోర్నమెంట్ ద్వారా ఈ ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ చాంపియన్ కార్ల్సన్ (నార్వే)తో తలపడే ప్రత్యర్థి ఎవరో నిర్ణయిస్తారు. ఈనెల 31 వరకు జరిగే ఈ టోర్నీలో ఎనిమిది మంది గ్రాండ్‌మాస్టర్స్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో పోటీపడనున్నారు. ఆనంద్‌తోపాటు వ్లాదిమిర్ క్రామ్నిక్ (రష్యా), దిమిత్రీ ఆంద్రికిన్ (రష్యా), వాసిలిన్ తొపలోవ్ (బల్గేరియా), షఖిర్యార్ మమెదైరోవ్ (అజర్బైజాన్), లెవాన్ అరోనియన్ (అర్మేనియా), సెర్గీ కర్జాకిన్ (రష్యా), పీటర్ స్విద్లెర్ (రష్యా) బరిలో ఉన్నారు. విజేతగా నిలిచిన వారు ఈ ఏడాది చివర్లో కార్ల్సన్తో ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో పోటీపడతారు. బుధవారం ప్రారంభోత్సవం జరుగుతుంది. గురువారం జరిగే తొలి రౌండ్లో అరోనియన్‌తో ఆనంద్; తొపలోవ్‌తో మమెదైరోవ్; కర్జాకిన్‌తో స్విద్లెర్; క్రామ్నిక్‌తో ఆంద్రికిన్ ఆడతారు. 6 లక్షల యూరోల (రూ. 5 కోట్ల 6 లక్షలు) ప్రైజ్‌మనీతో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో విజేతకు 1,35,000 యూరోలు (రూ. కోటీ 14 లక్షలు) లభిస్తాయి. -
చెస్ విజేతలు లాస్య ప్రియ, దీప్తాంశ్
బ్రిలియంట్ ఓపెన్ చెస్ టోర్నీ ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: బ్రిలియంట్ ఓపెన్ ప్రైజ్‌మనీ చెస్ టోర్నమెంట్లో జూనియర్ కేటగిరి టైటిల్‌ను పి.లాస్య ప్రియ (గౌతమ్ మోడల్ స్కూల్ మారేడ్‌పల్లి) కైవసం చేసుకుంది. ఓపెన్ కేటగిరి టైటిల్‌ను దీప్తాంశ్ రెడ్డి చేజిక్కించుకున్నాడు. దిల్‌సుఖ్‌నగర్‌లోని బ్రిలియంట్ గ్రామర్ స్కూల్లో ఆదివారం జరిగిన జూనియర్ విభాగం (ఆరో రౌండ్) ఫైనల్లో లాస్య ప్రియ, కె.తరుణ్ సంయుక్తంగా 5.5 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచారు. అయితే ప్రోగ్రెసివ్ స్కోరు ఆధారంగా లాస్య ప్రియ విన్నర్‌గా, తరుణ్ రన్నరప్‌గా నిర్వాహకులు ప్రకటించారు. అలాగే ఓపెన్ విభాగంలో దీప్తాంశ్ రెడ్డి, ఎస్.కె.ఫయాజ్ ఖాన్ (6) పాయింట్లను పొందగా ప్రోగ్రెసివ్ స్కోరుతో దీప్తాంశ్ రెడ్డిని విజేతగా ఎంపిక చేశారు. చివరిదైన ఆరో రౌండ్లో ఎం.దీప్తాంశ్ రెడ్డి (6) ఎం.చక్రవర్తి రెడ్డి (5)పై విజయం సాధించాడు. ఫయాజ్ ఖాన్ (6) సుబ్బరాజు(4)పై గెలిచారు. జూనియర్ విభాగం (6)ఫైనల్ రౌండ్స్‌లో పి.లాస్య ప్రియ (5.5) బి.వి.మేఘాంశ్‌రామ్ (5)పై విజయం సాధించింది. కె.తరుణ్ (5.5)జస్వంత్ (4)పై, కె.యశ్వంత్ (5) సి.హెచ్.సాయి గోపాల్ (4)పై, కె.శరత్ చంద్ర (5) ఎన్.కృష్ణ కళ్యాణ్ (4)పై, కె.విశ్వనాథ్ అరవింద్ (5) కృష్ణ బాలాజీ (4)పై గెలిచారు. -
అండర్-13 చాంప్ ప్రదీప్ కుమార్
ఇంటర్ స్కూల్ చెస్ టోర్నీ ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఇంటర్ స్కూల్ చెస్ టోర్నమెంట్లో అండర్-13 బాలుర టైటిల్‌ను వి.ప్రదీప్ కుమార్ చేజిక్కించుకున్నాడు. అండర్-13 బాలికల టైటిల్‌ను అమిత కరణ్ జైశ్వాల్ గెలిచింది. సుజాత స్కూల్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో మొయినాబాద్‌లోని సుజాత స్కూల్లో మంగళవారం ఈ పోటీలు జరిగాయి. వీటిని స్కూల్ ప్రిన్సిపల్ సునిత లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టోర్నీ డెరైక్టర్ కృష్ణ సింగ్, చీఫ్ ఆర్బిటర్ జ్యోతి గణేష్ పాల్గొన్నారు. ఫైనల్స్ ఫలితాలు: అండర్-10 బాలురు: 1.జస్వంత్, 2. కార్తీక్ రెడ్డి, 3. విశాల్, 4.కుష్, 5.వైష్ణవ్, 6. రోహన్ 7.ప్రవేక్. 8.ఆకాష్, 9.ప్రియాంచ్. అండర్ 10 బాలికలు: 1.వర్షిత, 2.నందిత, 3. త్రిష. అండర్-13 బాలురు: 1.వి.ప్రదీప్ కుమార్, 2.కె.సుమంత్, 3.భరత్ యాదవ్, 4.సి.హెచ్.రితిక్, 5.తరుణ్. అండర్-13 బాలికలు: 1.అమిత కరణ్ జైశ్వాల్, 2.దేవి సృజన, 3.రిషిత. అండర్-16 బాలురు:1. షణ్ముఖ్ తేజ. అండర్-16 బాలికలు: 1.షీతల్. -
చెస్ చాంపియన్స్ సిద్ధార్థ్, ఆశ్రీత్
ఎల్బీ స్టేడియం: ఓపెన్ ర్యాపిడ్ ఇంటర్ స్కూల్ చెస్ టోర్నమెంట్లో 7- క్లాసెస్ టైటిల్‌ను సి.హెచ్.సిద్ధార్థ్ కైవసం చేసుకున్నాడు. 5-క్లాసెస్ టైటిల్‌ను ఆశ్రీత్ గెల్చుకోగా, 3-క్లాసెస్ టైటిల్‌ను ఇమ్రోజ్ గెలిచాడు. ఏ-2హెచ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో వసంత్‌నగర్‌లోని సెయింట్ మార్క్స్ హైస్కూల్లో సోమవారం ఈ పోటీలు జరిగాయి. ఈ టోర్నీ వివిధ విభాగాల ఫైనల్స్ ఫలితాలు ఇలా ఉన్నాయి. ఫైనల్స్ ఫలితాలు: 7- క్లాసెస్: 1.సి.హెచ్.సిద్ధార్థ్ 2. వర్షిని 3. వేదాంత్, 4. వి.ఆదిత్య, 5.వై.అరవింద్. 5-క్లాసెస్: 1.ఆశ్రీత్, 2.మోహిత్ సాయినాథ్, 3.ఎన్.హరిణి, 4.హేమంత్ రిషీ, 5. ఔజస్వ్ గోయల్. 3-క్లాసెస్ :1.ఇమ్రోజ్, 2.తేజస్ భట్, 3.తేజా, 4.అఖిల్, 5.శరత్ గుప్తా. ఓపెన్ విభాగం: 1.దీప్తాంశ్ రెడ్డి, 2.పి.వి.వి.శేశు, 3.హిందుజా రెడ్డి, 4.ఎస్.ఎస్.రాజు, 5.కె.వేణు మాధవ్, 6.దుర్గాప్రసాద్, 7.ఎం.అరుణ్, 8.పి.సాకేత్, 9.వై.మురళీ మోహన్, 10.పి.క్రాంతి కుమార్, 11. ఎం.శివ, 12. కె.రాజేశ్, 13.హరి చరణ్ సాయి, 14.రంగయ్య నాయుడు, 15. ఎస్.రవి. -
చెస్ విజేతలు సాకేత్, బిపిన్రాజు
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: బ్రిలియంట్ ఓపెన్ ప్రైజ్ మనీ చెస్ టోర్నమెంట్ ఓపెన్ కేటగిరీలో సాకేత్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. ప్రత్యూష్ శ్రీవాస్తవకు రెండో స్థానం లభించగా, ప్రతీక్ శ్రీవాస్తవకు మూడో స్థానం దక్కింది. జూనియర్ కేటగిరీ టైటిల్‌ను ఎస్.బిపిన్‌రాజ్ (సాక్రెడ్ హార్ట్ స్కూల్) చేజిక్కించుకున్నాడు. బ్రిలియంట్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో దిల్‌సుఖ్‌నగర్‌లోని బ్రిలియంట్ గ్రామర్ స్కూల్లో ఆదివారం జరిగిన ఓపెన్ కేటగిరీ ఆఖరి ఆరో రౌండ్లో సాకేత్, ప్రత్యూష్ శ్రీవాస్తవల మధ్య జరిగిన గేమ్ డ్రాగా ముగిసింది. ఇద్దరు ఐదున్నర పాయింట్లతో సమంగా నిలిచినప్పటికీ ప్రొగ్రెసివ్ స్కోర్ ఆధారంగా సాకేత్‌ను విజేతగా ప్రకటించారు. జూనియర్ కేటగిరీలో ఎస్.బిపిన్‌రాజ్ (5.5), మిధుష్ (5.5)ల మధ్య కూడా చివరి రౌండ్ గేమ్ డ్రా అయింది. బిపిన్‌రాజ్ ప్రోగ్రెసివ్ స్కోర్‌తో మొదటి స్థానం పొందాడు. మిధుష్, ఎం.తరుణ్ వరుసగా రెండు, మూడో స్థానాలు పొందారు. వెటరన్ పురుషుల టైటిల్‌ను యు.వి.దివాకర్ గెలుచుకోగా, మహిళల టైటిల్‌ను మనీషా చౌదరి గెలిచింది. వివిధ విభాగాల ఫలితాలు ఇలా ఉన్నాయి. ఫైనల్స్ ఫలితాలు ఓపెన్ కేటగిరీ: 1.సాకేత్, 2.ప్రత్యూష్, 3.ప్రతీక్, 4.డి.సురేష్, 5.శోభరాజ్, 6.ఎస్.ఖాన్, 7.ఫయాజ్, 8.వి.ఎస్.ఎన్. మూర్తి, 9.ఎన్.రామ్మోహన్రావు, 10. సందీప్ నాయుడు. అండర్-14 బాలురు: 1.తరుణ్, 2.గులాబ్ అహ్మద్; అండర్-14 బాలికలు: 1,హరిలాస్య, 2.ఎస్.దేవిక; అండర్-12 బాలురు: 1.జయతీర్థ్, 2.మేఘాంశ్ రామ్; అండర్-12 బాలికలు:1.లాస్య ప్రియ, 2. డి.మోహిని; అండర్-10 బాలురు: 1.మిధుష్, 2.కె.తరుణ్; అండర్-10 బాలికలు: 1.సాహిత్య, 2. హంసిక; అండర్-8 బాలురు: 1. పి.రుత్విక్, 2. ఒ.రుత్విక్; అండర్-8 బాలికలు: 1.రచిత, 2. కె.త్రిష. అండర్-6 బాలురు: 1.ప్రణయ్ వెంకటేష్, 2.హరినారాయణ; అండర్-6 బాలికలు:1. అనన్య, 2. సుసేన్రెడ్డి. -
మళ్లీ ఓడిన ఆనంద్
జ్యూరిచ్: ప్రపంచ మాజీ చాంపియన్, భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ జ్యూరిచ్ చెస్ టోర్నీలో రెండో రౌండ్లోనూ ఓటమి పాలయ్యాడు. అమెరికా గ్రాండ్‌మాస్టర్ నకమురతో శుక్రవారం జరిగిన ఈ గేమ్‌ను ఆనంద్ కేవలం 36 ఎత్తుల్లోనే కోల్పోయాడు. దీంతో వరుసగా రెండు పరాజయాలతో టోర్నీలో ఆనంద్ అట్టడుగు స్థానానికి పడిపోయాడు. మరోవైపు ప్రపంచ చాంపియన్ కార్ల్సన్ (నార్వే) తన రెండో రౌండ్ గేమ్‌ను అరోనియన్ (అర్మేనియా)తో డ్రా చేసుకోగా, కరుఆనా (ఇటలీ), ఇజ్రాయెల్ ఆటగాడు బోరిస్ గెల్ఫాం డ్తో డ్రాగా ముగించాడు. ఆరుగురు ఆటగాళ్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో మూడు క్లాసికల్ రౌండ్లు, ఐదు ర్యాపిడ్ రౌండ్లు జరగనున్నాయి. -
హరికృష్ణకు ఏడో స్థానం
విక్ ఆన్ జీ (నెదర్లాండ్స్): ప్రతిష్టాత్మక టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ ఏడో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో చివరిదైన 11వ రౌండ్లో హరికృష్ణ 37 ఎత్తుల్లో బోరిస్ గెల్ఫాండ్ (ఇజ్రాయెల్) చేతిలో ఓడిపోయాడు. మొత్తం 12 మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య జరిగిన ఈ రౌండ్ రాబిన్ లీగ్ టోర్నమెంట్లో హరికృష్ణ మూడు విజయాలు, మూడు పరాజయాలు, ఐదు ‘డ్రా’లతో ఐదున్నర పాయింట్లు సంపాదించాడు. ఎనిమిది పాయింట్లతో లెవాన్ అరోనియన్ (అర్మేనియా) విజేతగా నిలిచాడు. -
చెస్ చాంప్ కార్తీక్
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా ఓపెన్ చెస్ స్కూల్ టీమ్ చెస్ టోర్నమెంట్లో డీఏవీ పబ్లిక్ స్కూల్ కుర్రాడు జేసీ కార్తీక్ చాంపియన్‌గా నిలిచాడు. ఎల్బీ స్టేడియంలో జరిగిన అండర్-19 కేటగిరీ వ్యక్తిగత విభాగంలో అతను అగ్రస్థానం పొందగా... నాగ శశాంక్ (శ్రీకృష్ణ టీమ్), శ్రీసంతోష్ (జీనియస్ చెస్ అకాడమీ) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. జై హింద్ (వేలమ్మాళ్ న్యూ జెన్ పార్క్)కు నాలుగో స్థానం దక్కింది. టీమ్ ఈవెంట్లో శ్రీకృష్ణ జట్టు 9 పాయింట్లతో విజేతగా నిలిచింది. మొత్తం 44 జట్లు ఈ టోర్నీలో పాల్గొన్నాయి. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ఒలింపిక్ సంఘం కార్యదర్శి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ట్రోఫీలు అందజేశారు. తుది స్థానాలు: అండర్-14 టీమ్ ఈవెంట్: 1. నైట్‌రైడర్స్ (10 పాయింట్లు), 2. టాక్టికా చెస్ వారియర్స్ (8), 3. చెస్ టైటాన్స్-మహారాష్ట్ర (8), 4. కింగ్స్ చెస్ అకాడమీ (7), 5. వేలమ్మాళ్ న్యూ జెన్ పార్క్- తమిళనాడు (7). -
ఓయూ జట్టుకు స్వర్ణం
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ పురుషుల చెస్ టోర్నమెంట్లో ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) జట్టు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. మహారాష్ట్రలోని రాహూరిలోని మహాత్మా ఫూలే కృషి విద్యా పీఠ్‌లో గురువారం జరిగిన చివరిదైన ఆరో రౌండ్లో జాదవ్‌పూర్ యూనివర్సిటీ జట్టుతో జరిగిన మ్యాచ్‌ను ఓయూ డ్రా చేసుకుంది. దీంతో 11 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం గెలుచుకుంది. దాదాపు 45 ఏళ్ల విరామం తర్వాత జాతీయ ఇంటర్ వర్సిటీ చెస్ టోర్నీలో ఓయూ స్వర్ణం చేజిక్కించుకోవడం విశేషం. స్వర్ణం గెలిచిన ఓయూ చెస్ జట్టు: సి.ఆర్.జి.కృష్ణ (కెప్టెన్), రవితేజ, దీప్తాంశ్‌రెడ్డి, ఆనంద్ నాయక్, విశ్వనాథ్ ప్రసాద్, నిఖిల్ రెడ్డి. ఓయూ జట్టుకు రాష్ట్ర చెస్ సంఘం ప్రధాన కార్యదర్శి కె.కన్నారెడ్డి కోచ్‌గా, మేనేజర్‌గా శివప్రసాద్‌రెడ్డిలు వ్యవహరించారు. -
హరికృష్ణ గేమ్ డ్రా
విక్ ఆన్ జీ (నెదర్లాండ్స్): ప్రతిష్టాత్మక టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ ఆడిన తొలి రెండు గేమ్‌లను ‘డ్రా’గా ముగించాడు. లెవాన్ అరోనియన్ (అర్మేనియా)తో శనివారం జరిగిన తొలి రౌండ్ గేమ్‌ను 30 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్న హరికృష్ణ... సెర్గీ కర్యాకిన్ (రష్యా)తో ఆదివారం జరిగిన రెండో రౌండ్ గేమ్‌ను 40 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. మొత్తం 12 మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో ఈ టోర్నమెంట్ జరుగుతోంది. భారత్ నుంచి మాస్టర్స్ విభాగంలో కేవలం హరికృష్ణ మాత్రమే పోటీపడుతున్నాడు. సోమవారం జరిగే మూడో రౌండ్లో క్యూబా గ్రాండ్‌మాస్టర్ లీనియర్ డొమింగెజ్‌తో హరికృష్ణ తలపడతాడు. -
చక్రవర్తికి టైటిల్
జింఖానా, న్యూస్‌లైన్: బ్రిలియంట్ ట్రోఫీ చెస్ టోర్నీ ఓపెన్ కేటగిరీలో చక్రవర్తి రెడ్డి టైటిల్‌ని గెలుచుకున్నాడు. బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్లో ఆదివారం జరిగిన ఫైనల్లో చక్రవర్తి రెడ్డి(6)... ప్రభాత్ (5)పై గెలుపొందాడు. రమణ కుమార్ (5)... రాజు (4)పై నెగ్గి రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. జూనియర్స్ కేటగిరీలో వర్షిత, అభినవ్, మేఘరనాశ్రమ్ 6 రౌండ్లకు గాను 5.5 పాయింట్లు సాధించడంతో టై బ్రేక్‌కు దారితీసింది. టై బ్రేక్‌లో వర్షిత్ మొదటి స్థానంలో నిలవగా... అభినవ్, మేఘనాశ్రమ్ వరుసగా రెండు, మూడు స్థానాలను కైవసం చేసుకున్నారు. మిగతా ఫలితాలు: అండర్-14 బాలురు: 1. చేతన్ రాథోడ్, 2.ప్రణీత్; బాలికలు: 1. హరిలాస్య, 2. సాయిశృతి. అండర్-12 బాలురు: 1. మేఘనాశ్రమ్, 2. శ్రీకర్; బాలికలు: 1. మోహిని అశోక్, 2. సాధన. అండర్-10 బాలురు: 1. అభినవ్, 2. ప్రధమ్; బాలికలు: 1. సాహిత్య, 2. అంజలి. అండర్-8 బాలురు: 1. రుత్విక్ రోహన్, 2. ప్రశాంత్; బాలికలు: 1. రచిత, 2. అనూషా రెడ్డి. అండర్-6 బాలురు: 1. ప్రణయ్ వెంకేటేశ్, 2. శ్రీకర్; బాలికలు: 1. సేవిత విజు, 2. నిత్య రాజు. -
సత్తాచాటిన కృష్ణ, రవితేజ
గుర్గావ్: అంతర్జాతీయ గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ఆటగాళ్లు సీఆర్జీ కృష్ణ, ఎస్.రవితేజ సత్తాచాటారు. ఇక్కడి సన్‌సిటీ వరల్డ్ స్కూల్లో జరుగుతున్న ఈ పోటీల్లో ఇద్దరూ మూడున్నర పాయింట్లతో ఉమ్మడిగా రెండో స్థానంలో కొనసాగుతున్నారు. శుక్రవారం జరిగిన నాలుగో రౌండ్ పోటీల్లో కృష్ణ (3.5)... భారత్‌కే చెందిన అంతర్జాతీయ మాస్టర్ ప్రసన్న రఘురామ్ (3.5)తో డ్రా చేసుకోగా, రవితేజ (3.5)... విక్రమ్‌జిత్ సింగ్ (3.5)తో గేమ్‌ను డ్రాగా ముగించాడు. మిగతా ఏపీ క్రీడాకారుల్లో చొల్లేటి సహజశ్రీ (2.5)... ఓమ్ బాత్రా (1.5)పై విజయం సాధించగా, తొషాలి (2)...శంతను (3) చేతిలో పరాజయం చవిచూసింది. మట్ట వినయ్ కుమార్ (2.5)... రాజేశ్ (3.5) చేతిలో, రామకృష్ణ (2)... గగునశ్వి మెరాబ్ (జార్జియా, 3) చేతిలో ఓటమి పాలయ్యారు. అభిలాష్ రెడ్డి (3)... పొంక్షే సారంగ్ (2)పై, దీప్తాంశ్‌రెడ్డి (3)... మోత పంకిత్ (2)పై, కార్తీక్ (3)... సిద్ధార్థ్ (2)పై విజయం సాధించారు. రాహుల్ శ్రీవాస్తవ్ (2)కు అరాధ్య గార్గ్ (3) చేతిలో పరాజయం ఎదురైంది. ఈ టోర్నీలో ఢిల్లీ ఆటగాడు సహజ్ గ్రోవర్ (4) నాలుగు విజయాలతో ఐదుగురితో కలిసి ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. తర్వాతి స్థానంలో ఏపీ ఆటగాళ్లు కృష్ణ, రవితేజ మూడున్నర పాయింట్లతో మరో 17 మందితో కలిసి రెండో స్థానంలో ఉన్నారు. ఈ టోర్నీలో ఇంకా ఆరు రౌండ్లు మిగిలున్నాయి.