ఎల్బీ స్టేడియం: రంగారెడ్డి జిల్లా చెస్ అసోసియేషన్(ఆర్‌ఆర్‌డీసీఏ) ఆధ్వర్యంలో అండర్-7, 13 బాల బాలికల చెస్ టోర్నమెంట్ ఆగస్టు 3న జరగనుంది. ఈ టోర్నీ నేరేడ్‌మెట్ చౌరస్తాలోని ఇండియన్ హైస్కూల్‌లో నిర్వహించనున్నారు.
ఈ పోటీల్లో రాణించిన అండర్-13 బాల బాలికలను వరంగల్‌లో జరిగే అంతర్ జిల్లా అండర్-13 చెస్ టోర్నీలో పాల్గొనే రంగారెడ్డి జిల్లా జట్టుకు ఎంపిక చేయనున్నారు. అండర్-7 బాల బాలికల విభాగాల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారిని తూర్పు గోదావరి జిల్లాలో జరిగే అంతర్ జిల్లా టోర్నీకి ఎంపిక చేస్తారు. జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొనే ఆసక్తి గల వారు తమ ఎంట్రీలను ఆగస్టు 1లోగా పంపించాలి. ఇతర వివరాలకు చెస్ కోచ్ శ్రీకృష్ణ(92461-41111)ను సంప్రదించవచ్చు.
తెలంగాణ మహిళల ఓపెన్ క్యారమ్ టోర్నీ: ఎల్బీ స్టేడియం: తెలంగాణ మహిళల ర్యాంకింగ్ ఓపెన్ క్యారమ్ టోర్నమెంట్ ఆగస్టు 3, 4 తేదీల్లో ఇక్కడి ఎల్బీ ఇండోర్ స్టేడియంలో జరగనుంది. హైదరాబాద్ క్యారమ్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో జరిగే ఈ టోర్నీలో తొలి రౌండ్‌లో ఓడిపోయిన మహిళలకు వన్డే కోచింగ్ క్యాంప్‌ను ఏర్పాటు చేసి వారి ఆట తీరును మెరుగుపరుస్తారు. ఇతర వివరాలకు హెచ్‌సీఏ నిర్వహణ కార్యదర్శి ఎస్.శోభన్‌రాజ్(94403-07023)ను సంప్రదించవచ్చు.
3 నుంచి కుంగ్‌ఫూ, కరాటే పోటీలు: నిష్‌కిన్స్ కుంగ్‌ఫూ యూనివర్స్, షావోలిన్ థాయ్ చీ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో వచ్చే నెల 3వ తేదీ నుంచి రాష్ట్రస్థాయిలో కుంగ్‌ఫూ, కరాటే చాంపియన్‌షిప్ జరగనుంది. కటాస్, వెపన్స్, స్పారింగ్ తదితర విభాగాల్లో ఈ పోటీలు నిర్వహిస్తామని ఆర్గనైజర్లు చెప్పారు. మరిన్ని వివరాలకు ఫోన్ నెం. 99480 99070లో సంప్రదించాలి.
3న రంగారెడ్డి జిల్లా చెస్ టోర్నీ
Published Sat, Jul 26 2014 11:54 PM | Last Updated on Sat, Sep 2 2017 10:55 AM
Advertisement