జింఖానా, న్యూస్‌లైన్: రంగారెడ్డి జిల్లా చెస్ సంఘం ఈ నెల 30వ తేదీన రంగారెడ్డి అండర్-9 చెస్ సెలక్షన్, చాలెంజర్ చెస్ సెలక్షన్ టోర్నీలను నిర్వహించనుంది. నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఈ పోటీలను నిర్వహించనున్నారు. అండర్-9 సెలక్షన్ టోర్నీలో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన నలుగురు బాలబాలికలకు, చాలెంజర్స్ టోర్నీలో టాప్-4లో నిలిచిన ఆటగాళ్లకు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కుతుంది.
ఈ పోటీల్లోఅండర్-5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 కేటగిరీల్లో గెలిచిన వారికి ప్రత్యేక బహుమతులు ఇవ్వనున్నారు. ఆసక్తిగల వారు ఈ నెల 28వ తేదీలోగా తమ ఎంట్రీలను రిజిష్టర్ చేసుకోవాలి. మరిన్ని వివరాలకు శ్రీకృష్ణ (9247143456)ను సంప్రదిం చవచ్చు.
30న చెస్ సెలక్షన్ టోర్నీలు
Published Sun, Mar 16 2014 12:09 AM | Last Updated on Sat, Sep 2 2017 4:45 AM
Advertisement
Advertisement