chess association
-
చెస్ ఆడటం వల్ల కలిగే ప్రయోజనాలు
చెస్ అనేది అనేక ప్రయోజనాలను అందించి, మేధో సంపత్తిని పెంపొందిచే మనోహరమైన క్రీడ. ఈ క్రీడను క్రమం తప్పకుండా ఆడటం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.దృక్కోణం పెరుగుతుంది: చెస్‌కు క్రమం తప్పకుండా ఆడటం వల్ల వ్యక్తుల యొక్క దృక్కోణం పెరుగుతుంది. ఇలా చేయడం వల్ల ఎదుటివారి కదలికలను సులువుగా పసిగట్టవచ్చు. సామాజిక సంబంధాలు మెరుగుపర్చుకోవడంలో చెస్ క్రీడ కీలకపాత్ర పోషిస్తుంది.జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది: ప్రతి రోజు కొంత సమయం పాటు చెస్ ఆడటం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. చెస్ అనునిత్యం ఆడటం వల్ల దృశ్య నమూనాలను మరింత త్వరగా గుర్తిస్తారు.చురుకుదనం పెరుగుతుంది: చెస్ ఆడటంలో నైపుణ్యం కలిగిన వారు ఇతరులతో పోలిస్తే మానసిక చురకుదనం ఎక్కువగా కలిగి ఉంటారు. వీరి మానసిక స్థితి అథ్లెట్లు, కళాకారుల మాదిరిగా ఉంటుంది.ప్రణాళికా నైపుణ్యాలను పెంచుతుంది: చెస్ క్రమం తప్పకుండా ఆడటం వల్ల ప్రణాళికా నైపుణ్యం, దూరదృష్టి పెరుగుతాయి. ఆలోచనా సామర్థ్యం మెరుగుపడుతుంది.స్వీయ-అవగాహన పెరుగుతుంది: చెస్ ఆడటం వల్ల స్వీయ అవగాహన పెరుగుతుంది. దీని వల్ల మనల్ని మనం విశ్లేషించుకోవచ్చు. మన తప్పులు మనం తెలుసుకోగలుగుతాం.వృద్దాప్యంలో తోడ్పడుతుంది: మానసిక ఉత్తేజాన్ని కలిగించే చెస్‌ను క్రమం తప్పకుండా ఆడటం వల్ల వృద్దాప్యంలో ఎదురయ్యే మేధస్సు క్షీణత వంటి సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.ఏకాగ్రత సాధించేందుకు దోహదపడుతుంది: చెస్ అనునిత్యం ఆడటం వల్ల ఏకాగ్రత లోపం సమస్య నుంచి బయటపడవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.భయాందోళనలను తగ్గిస్తుంది: చెస్ ఆడే సమయంలో చూపే ఏకాగ్రత కారణంగా భయాందోళనలు తగ్గుతాయి.పిల్లల్లో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి: చిన్నతనం నుంచి చెస్ ఆడటం అలవాటు చేసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. -
హంపి, హారిక గేమ్‌లు ‘డ్రా’
ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో రెండో రౌండ్‌లోని తొలి గేమ్‌ను భారత గ్రాండ్‌మాస్టర్స్ కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక ‘డ్రా’గా ముగించారు. జొలాంటా జవద్జా్క (పోలాండ్)తో జరిగిన గేమ్‌ను నల్ల పావులతో ఆడిన కోనేరు హంపి 26 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. బేలా ఖొటెనాష్విలి (జార్జియా)తో జరిగిన గేమ్‌ను నల్ల పావులతో ఆడిన హారిక 64 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. నేడు జరిగే రెండో గేమ్‌లో గెలిచిన వారు మూడో రౌండ్‌కు అర్హత సాధిస్తారు. ఒకవేళ రెండో గేమ్ ‘డ్రా’ అయితే మాత్రం గురువారం టైబ్రేక్‌లు నిర్వహించి విజేతను నిర్ణయిస్తారు. -
3 నుంచి ఆలిండియా చెస్ టోర్నీ
హైదరాబాద్: గచ్చిబౌలిలోని నిథమ్ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర చెస్ అసోసియేషన్, నిథమ్ సంయుక్త ఆధ్వర్యంలో ఆలిండియా ఓపెన్ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్–2017 నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆగస్టు 3 నుంచి 8 వరకు జరిగే ఈ టోర్నీకి సంబంధించిన బ్రోచర్‌ను నిథమ్ ప్రాంగణంలో బుధవారం నిథమ్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ చిన్నం రెడ్డి, ప్రిన్సిపల్ నరేందర్ కుమార్, టోర్నీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ షేక్ ఫయాజ్‌ల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ టోర్నీలో పాల్గొనాలనుకునేవారు ఈ నెల 25వ తేదీలోపు రూ.5 వేలు చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకోవాలి. కాగా రూ. 500 అదనపు రుసుముతో ఆగస్టు 1వ తేదీ వరకు కూడా తమ పేర్లు నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఆసక్తి గలవారు తమ పేర్లను నమోదు చేసుకోవడానికి 8885817666, 9866702431 ఫోన్ నంబర్లలో సంప్రదించాలి. రూ. 10 లక్షల ప్రైజ్‌మనీతో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో టాప్–20 స్థానాల్లో నిలిచిన వారికి నగదు బహుమతులు అందజేస్తారు. ఈ సందర్భంగా నిథమ్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ చిన్నంరెడ్డి మాట్లాడుతూ చదువు, శిక్షణలతో పాటు క్రీడలను కూడా ప్రోత్సహించాలనే తపనతో మొదటి నిథమ్ ఆలిండియా ఓపెన్ చెస్ టోర్నీని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎలాంటి వయో పరిమితి లేకుండా అందరూ పాల్గొనేందుకు అవకాశం కల్పించడం జరుగుతుందని , చెస్ క్రీడాకారులంతా ఈ టోర్నీలో పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నిథమ్ అ«ధ్యాపకులు, టీఎస్‌సీఏ ప్రతినిధులు పాల్గొన్నారు. -
3న రంగారెడ్డి జిల్లా చెస్ టోర్నీ
ఎల్బీ స్టేడియం: రంగారెడ్డి జిల్లా చెస్ అసోసియేషన్(ఆర్ఆర్డీసీఏ) ఆధ్వర్యంలో అండర్-7, 13 బాల బాలికల చెస్ టోర్నమెంట్ ఆగస్టు 3న జరగనుంది. ఈ టోర్నీ నేరేడ్మెట్ చౌరస్తాలోని ఇండియన్ హైస్కూల్లో నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో రాణించిన అండర్-13 బాల బాలికలను వరంగల్‌లో జరిగే అంతర్ జిల్లా అండర్-13 చెస్ టోర్నీలో పాల్గొనే రంగారెడ్డి జిల్లా జట్టుకు ఎంపిక చేయనున్నారు. అండర్-7 బాల బాలికల విభాగాల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారిని తూర్పు గోదావరి జిల్లాలో జరిగే అంతర్ జిల్లా టోర్నీకి ఎంపిక చేస్తారు. జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొనే ఆసక్తి గల వారు తమ ఎంట్రీలను ఆగస్టు 1లోగా పంపించాలి. ఇతర వివరాలకు చెస్ కోచ్ శ్రీకృష్ణ(92461-41111)ను సంప్రదించవచ్చు. తెలంగాణ మహిళల ఓపెన్ క్యారమ్ టోర్నీ: ఎల్బీ స్టేడియం: తెలంగాణ మహిళల ర్యాంకింగ్ ఓపెన్ క్యారమ్ టోర్నమెంట్ ఆగస్టు 3, 4 తేదీల్లో ఇక్కడి ఎల్బీ ఇండోర్ స్టేడియంలో జరగనుంది. హైదరాబాద్ క్యారమ్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో జరిగే ఈ టోర్నీలో తొలి రౌండ్లో ఓడిపోయిన మహిళలకు వన్డే కోచింగ్ క్యాంప్‌ను ఏర్పాటు చేసి వారి ఆట తీరును మెరుగుపరుస్తారు. ఇతర వివరాలకు హెచ్‌సీఏ నిర్వహణ కార్యదర్శి ఎస్.శోభన్‌రాజ్(94403-07023)ను సంప్రదించవచ్చు. 3 నుంచి కుంగ్‌ఫూ, కరాటే పోటీలు: నిష్కిన్స్ కుంగ్‌ఫూ యూనివర్స్, షావోలిన్ థాయ్ చీ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో వచ్చే నెల 3వ తేదీ నుంచి రాష్ట్రస్థాయిలో కుంగ్‌ఫూ, కరాటే చాంపియన్‌షిప్ జరగనుంది. కటాస్, వెపన్స్, స్పారింగ్ తదితర విభాగాల్లో ఈ పోటీలు నిర్వహిస్తామని ఆర్గనైజర్లు చెప్పారు. మరిన్ని వివరాలకు ఫోన్ నెం. 99480 99070లో సంప్రదించాలి. -
30న చెస్ సెలక్షన్ టోర్నీలు
జింఖానా, న్యూస్‌లైన్: రంగారెడ్డి జిల్లా చెస్ సంఘం ఈ నెల 30వ తేదీన రంగారెడ్డి అండర్-9 చెస్ సెలక్షన్, చాలెంజర్ చెస్ సెలక్షన్ టోర్నీలను నిర్వహించనుంది. నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఈ పోటీలను నిర్వహించనున్నారు. అండర్-9 సెలక్షన్ టోర్నీలో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన నలుగురు బాలబాలికలకు, చాలెంజర్స్ టోర్నీలో టాప్-4లో నిలిచిన ఆటగాళ్లకు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కుతుంది. ఈ పోటీల్లోఅండర్-5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 కేటగిరీల్లో గెలిచిన వారికి ప్రత్యేక బహుమతులు ఇవ్వనున్నారు. ఆసక్తిగల వారు ఈ నెల 28వ తేదీలోగా తమ ఎంట్రీలను రిజిష్టర్ చేసుకోవాలి. మరిన్ని వివరాలకు శ్రీకృష్ణ (9247143456)ను సంప్రదిం చవచ్చు.