
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్‌రెడ్డి ఏసీబీకి చిక్కారు. రూ.8 లక్షల లంచం తీసుకుంటూ భూపాల్ రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్ దొరికిపోయారు. ఆయన ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. సీనియర్ అసిస్టెంట్ మదన్‌మోహన్‌లాల్ ఇంట్లోనూ ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. రంగారెడ్డి కలెక్టర్ ఆఫీసులో నిన్న సాయంత్రం నుంచి ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.
వ్యక్తి ధరణి వెబ్ సైట్‌లో ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి 14 గుంటల ల్యాండ్‌ను తొలగించాలని సీనియర్ అసిస్టెంట్‌ను బాధితుడు కోరాడు. ఈ పని చేసేందుకు సీనియర్ అసిస్టెంట్ మదన్‌మోహన్‌లాల్ రూ. 8 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఆ డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా అధికారులు పట్టుకున్నారు.

Comments
Please login to add a commentAdd a comment