
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పోలీస్ స్టేషన్‌లో కూడా రక్షణ కరువైంది. స్టేషన్‌లోనే అందరూ చూస్తుండగానే గొంతు కోసిన వైనం కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మిస్సింగ్ కేస్ క్లోజింగ్ కోసం వెళ్లిన ప్రేమికులకు ప్రాణహాని జరిగింది.
పోలీస్ స్టేషన్ రిసెప్షన్‌లోనే అమ్మాయి తరపు బంధువు.. యువకుడి గొంతు కోసేశాడు. దీంతో గొంతుకు నాలుగు కుట్లు పడ్డాయి. గుట్టు చప్పుడు కాకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించిన పోలీసులు.. ఇంటికి పంపేశారు. పోలీస్ స్టేషన్‌లోనే తమకు రక్షణ లేకపోతే ఇంకా బయట మా పరిస్థితి ఎలా ఉంటుందంటూ ఆ ప్రేమ జంట వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment