ranga reddy distirct
-
రంగారెడ్డి జిల్లా జన్వాడలో వీఐపీల రేవ్ పార్టీ భగ్నం
-
రంగారెడ్డి: డీఈవో లేట్.. జడ్పీ ఛైర్మన్ క్లాస్
సాక్షి, రంగారెడ్డి: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం.. ఛైర్మన్ అనితా హరినాథ్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. కలెక్టర్ శశాంక, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. విద్య, వైద్యంపై అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. అయితే, డీఈవో సమావేశానికి ఆలస్యంగా రావడంపై జడ్పీ ఛైర్మన్ క్లాస్ తీసుకోగా, సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులందరికి డీఈవో బహిరంగ క్షమాపణ చెప్పారు. స్కూల్ యూనిఫామ్స్ విషయంలో చర్చ వల్ల ఆలస్యమైందని డీఈవో వివరణ ఇచ్చారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని ఆపరేషన్ థియేటర్లు, భవనాలు శిథిలావస్థలో ఉన్నాయని సభ్యుల ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిల్లో వైద్యుల కొరత ఉందంటూ మండిపడ్డారు. విద్య, వైద్యంలో అధికారుల డిప్యూటేషన్ల రద్దు చేయాలని రంగారెడ్డి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు.డిప్యుటేషన్ల రద్దు కుదరదంటూ కలెక్టర్ వివరించారు. మీ సమస్యను సంబందిత శాఖకు సమగ్రంగా వివరించాలని సూచించారు. డిప్యుటేషన్ల విషయంలో అనేక ఒత్తిళ్లు ఉంటాయని కలెక్టర్ అన్నారు. కందుకూరు మెడికల్ కళాశాల రద్దు కాలేదని.. మెడికల్ కళాశాలకు వేరే ప్రాంతంలో స్థలం కోసం చూస్తున్నామని డీఎంహెచ్‌వో తెలిపారు. -
రంగారెడ్డి: వీడిన మైనర్ రాజా కేసు మిస్టరీ
సాక్షి, రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లి మైనర్ బాలుడు రాజా పాశ్వాన్(17) హత్య కేసు మిస్టరీ వీడింది. హౌసింగ్ బోర్డ్ కాలనీలో బాలుడిని గొంతు కోసి అతి కిరాతకంగా హత్య చేసిన సంఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి.. నిందితుడు పంకజ్ పాశ్వాన్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసులో ఇప్పుడు విస్తుపోయే విషయాలు పోలీసులు వెల్లడించారు. నిందితుడు పంకజ్ భార్యపై మైనర్ పలుమార్లు లైంగికదాడికి పాల్పడినట్లు గుర్తించారు. ఆ కోపంతోనే పథకం ప్రకారమే బాలుడిని పంకజ్ హత్య చేసినట్లు పోలీసులు నిర్థారించుకున్నారు. కాగా, బీహార్‌కు చెందిన సంజయ్ పాశ్వాన్ భార్య, కుమారుడితో కలిసి బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చాడు. కాటేదాన్ లక్ష్మిగూడ హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటూ స్థానిక పరిశ్రమలో పని చేస్తున్నాడు. అతడి కుమారుడు ఇదే ప్రాంతంలోని స్క్రాప్ దుకాణంలో పని చేసేవాడు. శనివారం ఉదయం పనికి వెళ్లిన కుమారుడు సాయంత్రం ఇంటికి వచ్చాడు. శనివారం కావడంతో షాప్‌కు వెళ్తి బత్తా తెచ్చుకుంటానని చెప్పి బయటకు వెళ్లాడు. రాత్రి ఇంటికి రాకపోవడంతో అతడి కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు. దుకాణ యజమాని వద్దకు వెళ్లి ఆరా తీయగా డబ్బులు తీసుకుని వెళ్లిపోయినట్లు చెప్పాడు. ఆదివారం ఉదయం హౌసింగ్ బోర్డు కాలనీలోని నిర్మాణుష్య ప్రాంతంలో బండరాయిపై బాలుడు పడి ఉన్నట్లు గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. పంకజ్ భార్యను బెదిరించి రాజా పలుమార్లు లైంగికదాడికి పాల్పడినట్లు తేలింది. ఆ విషయం తెలిసి కోపంతో రగిలిపోయిన పంకజ్.. పథకం ప్రకారమే కూరగాయలు కోసే కత్తితో రాజాని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. చదవండి: ఉరేసుకుందా.. గుండెపోటా? -
తెలంగాణ తెచ్చే శక్తి కేసీఆర్‌కి ఎక్కడిది?
సాక్షి, చేవెళ్ల: కేసీఆర్ పాలనలో దళితులు, గిరిజనులు మోసపోయారని, అందుకే.. ఆదుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ దళిత, గిరిజన డిక్లరేషన్ ప్రకటిస్తోంది అని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. చేవెళ్లలో శనివారం సాయంత్రం జరిగిన కాంగ్రెస్ ప్రజా గర్జనలో రేవంత్ రెడ్డి దళిత డిక్లరేషన్‌పై ప్రకటన చేశారు. ప్రజాగర్జన సభలో దళిత, గిరిజన డిక్లరేషన్ ప్రకటించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఈ సభకు కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే సైతం హాజరయ్యారు. అనంతరం డిక్లరేషన్‌కు సంబంధించిన పోస్టర్లను వేదిక మీద ఉన్న నేతలంతా ప్రదర్శించారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లో కీలకాంశాలు ► ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లు లేని ఎస్సీ, ఎస్టీలకు ఇళ్ల స్థలాలు. ►పేదలు ఇల్లు కట్టుకునేందుకు రూ. 6 లక్షలు సాయం ►పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని నిర్ణయం ►ఎస్సీల కోసం మూడు కార్పొరేషన్లు ఏర్పాటు ►ప్రతి కార్పొరేషన్ ద్వారా రూ.750 కోట్లు మంజూరు ►మండలంలో ఒక గురుకుల పాఠశాల ఏర్పాటు ► దళిత గిరిజన విద్యార్థులకు పది పాస్ అయితే రూ. 10 వేలు. ► డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు రూ. 25 వేలు. ► పీజీ పూర్తి చేసిన విద్యార్థులకు లక్ష రూపాయలు అందజేత. ► అంబేద్కర్ అభయ హస్తం కింద ఎస్సీ, ఎస్టీలకు రూ.12 లక్షలు అధికారంలోకి వస్తే.. ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం పెంచేలా నిర్ణయం తీసుకుంటామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ‘‘ఎస్సీ వర్గీకరణ చేసి న్యాయం చేస్తాం. అంబేద్కర్ అభయ హస్తం కింద ఎస్సీ, ఎస్టీ కుటంబాలకు రూ.12 లక్షల ఆర్థిక సాయం అందిస్తాం. కాంట్రాక్టుల్లోనూ ఎస్సీ, ఎస్టీలకు వాటాల ద్వారా న్యాయం చేస్తాం’’ వెల్లడించారాయన. రేపు అమిత్ షా వస్తారు.. వచ్చే ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్సేనని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. చేవెళ్ల ప్రజా గర్జన వేదిక నుంచి ప్రసంగించిన ఖర్గే.. ► తెలంగాణ ఉద్యమం గుర్తు చేసుకుంటే దుఖం వస్తుంది. ఉద్యమంలో అనేక మంది భాగస్వామ్యం అయ్యారు. కానీ, తెలంగాణ వల్ల ఒకే కుటుంబం లాభపడింది(కల్వకుంట్ల కుటుంబాన్ని ఉద్దేశించి..). తెలంగాణ తెచ్చే శక్తి కేసీఆర్‌కు ఎక్కడిది?. ఇది తెలంగాణ ప్రజల పోరాటం. కేసీఆర్‌కు బలం ఇచ్చింది మేం. కానీ, మాకు మద్దతు ఇవ్వాల్సిన కేసీఆర్ ఇవ్వలేదు. తెలంగాణ ఇచ్చినందుకు సోనియా నివాసానికి వచ్చి ధన్యవాదాలు తెలిపారు. కానీ, తెలంగాణ క్రెడిట్ అంతా నాదే అన్నట్లు కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. ► ప్రజల అభీష్టం.. సొనియా గాంధీ చొరవతో తెలంగాణ ఏర్పడింది. ఇక్కడున్నవాళ్లంతా తెలంగాణ కోసం కొట్టాడినవాళ్లే. కేసీఆర్‌ను గద్దెదించడానికే మీరంతా వచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 12 సూత్రాలను అమలు చేస్తాం. కన్యాకుమారీ నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ భారత్‌జోడో యాత్ర చేశారు. అదీ కాంగ్రెస్ పార్టీ శక్తి. సీడబ్ల్యూసీ సభ్యులు మరింత పెరుగుతారు. వారిలో తెలంగాణ వారికి అవకాశాలు ఉంటాయి. గతంలో సీడబ్ల్యూసీ లో ఉమ్మడి రాష్ట్రం నుండి ఒక్కరే ఉండేవారు. నేను వచ్చాక ఆరుగురికి ఛాన్స్ ఇచ్చాను. సీడబ్ల్యూసీ లో 66 శాతం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు ఉన్నారు. ► రేపు అమిత్ షా ఖమ్మం వస్తున్నారు. కాంగ్రెస్ ఏం చేసిందని అంటారు. హైదరాబాద్ సంస్థానానికి స్వేచ్ఛ కల్పించింది కాంగ్రెస్. ఐఐటీ, ఎయిమ్స్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్. ఐఐటీ, ఎయిమ్స్ ఏర్పాటు చేసిందెవరు? కాంగ్రెస్ హయాంలో నెలకొల్పిన ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారు. దేశంలో పెద్ద పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్మించింది ఎవరు?. ఉమ్మడి ఏపిలో కట్టిన ప్రాజెక్టులన్ని కట్టింది కాంగ్రెస్ పార్టీనే. మా పార్టీ నేతలు పటేల్, నెహ్రూ కలిసి హైదరాబాద్ సంస్థానం ఇండియాలో కలిపారు. కాంగ్రెస్ అభివృద్ధి చేసిన సమయంలో అసలు కేసీఆర్ పార్టీ ఉందా? అని ప్రశ్నించారు ఖర్గే. ► బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉంది. అందుకే నేరుగా బీఆర్ఎస్ను విమర్శించరు. తెలంగాణలో అధికారంలోకి రాగానే.. ప్రభుత్వం లాక్కున్న ఎస్సీ ఎస్టీల భూములను తిరిగి వాళ్ళకే ఇస్తాం. 26 పార్టీలు బీజేపీని గద్దె దించేందుకు సిద్ధమైతే కేసీఆర్ మాత్రం సైలెంట్ ఉన్నారు. కేసీఆర్ తనది సెక్యులర్ పార్టీ అంటాడు. బీజేపీకి మద్దతు ఇస్తాడు. మా 26 పార్టీల లక్ష్యం బీజేపీని గద్దె దించడంతో పాటు బీజేపీకి మద్దతిచ్చే బీఆర్ఎస్ ని సైతం గద్దె దించుతాం. ► కర్ణాటకలో ఐదు హామీలు ఇచ్చి.. అమలు చేస్తున్నాం. తెలంగాణలోనూ అదే చేస్తాం. తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తీరుతుంది. ఇచ్చిన వాగ్దానాలు అమలు పరిచి తీరుతుంది అని ఖర్గే తెలిపారు. రాష్ట్రంలో కేసీఆర్ ని ఓడగొట్టండి. దేశంలో మోదీని ఓడగొట్టండి అని ఖర్గే చేవెళ్ల వేదికగా ప్రజలకు పిలుపు ఇచ్చారు. -
యూత్ ఎంట్రీ.. ఎవరికి ఎగ్జిట్?.. అసలు ఏం జరుగుతోంది?
రంగారెడ్డి జిల్లాలో కొత్త తరం నాయకులు ఎంట్రీ ఇవ్వబోతున్నారా? మంత్రులు తమ తనయులను బరిలో దించడానికి సన్నాహాలు చేస్తున్నారా? ఎమ్మెల్యేలు తప్పుకుని వారసులకు ఛాన్స్ ఇస్తారా ? గులాబీ పార్టీతో పాటు.. కమలం పార్టీ కూడా వారసుల్ని బరిలో దించబోతోందా? అసలు జిల్లా రాజకీయాల్లో ఏం జరుగుతోంది? మూడు ముక్కలు.. ఆరు వక్కలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను మూడు ముక్కలుగా విడగొట్టారు. పాలమూరు జిల్లా నుంచి షాద్ నగర్ అసెంబ్లీ స్థానంతో పాటు.. కల్వకుర్తి నియోజకవర్గంలోని కొన్ని మండలాలను రంగారెడ్డిలో కలిపేశారు. కోడంగల్ నియోజకవర్గంలోని మూడు మండలాలను వికారాబాద్ జిల్లాలో విలీనం చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మహేశ్వరం ఎమ్మెల్యేగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి మంత్రిగా ఛాన్స్ దక్కించుకున్నారు. మేడ్చల్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మల్లారెడ్డి కూడా కేసీఆర్ క్యాబినెట్ లో స్థానం పొందారు. ఈ ఇద్దరు నేతలు వచ్చే ఎన్నికల్లో తనయులను బరిలో దింపాలని ప్లాన్ చేస్తున్నారు. మంత్రి సబితారెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి 2014లోనే చేవేళ్ల ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఈ సారి రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. మంత్రి కేటీఆర్ కోటరీలో కీలకంగా వ్యవహరిస్తున్న కార్తీక్ రెడ్డి .. అధిష్టానం తప్పనిసరిగా ఎమ్మెల్యేగా ఛాన్స్ ఇస్తుందనే ఆశతో ఉన్నారు. ఇక మంత్రి మల్లారెడ్డి తన ఇద్దరు తనయులు భద్రారెడ్డి, మహేందర్ రెడ్డి లకు రాజకీయ భవిష్యత్ కల్పించాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఇద్దరిలో ఒక్కరికైనా ఏదో ఒకచోట ఛాన్స్ ఇస్తారని మల్లారెడ్డి లెక్కలు వేసుకుంటున్నారు. లైన్లో మా వాడున్నాడు ఇక అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం..తమ తనయులకు రూట్ క్లియర్ చేసే పనిలో ఉన్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి... ఇప్పటికే కొడుకు ప్రశాంత్ రెడ్డితో నియోజకవర్గమంతా పాదయాత్ర చేయిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అని క్యాడర్ కు క్లియర్ కట్ సంకేతాలు ఇచ్చేశారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు.. తన తనయుడు రోహిత్ రావు ను వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బరిలో దింపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు రోహిత్ రావు నిర్వహిస్తున్నారు. షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్.. తన తనయుడు రవి యాదవ్ కు వచ్చే ఎన్నికల్లో ఛాన్స్ ఇవ్వాలని అధిష్టానానికి విన్నవించుకున్నారు. అయితే మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి... షాబాద్ జడ్పీటీసీగా ఉన్న తన సోదరుడి కుమారుడు పట్నం అవినాశ్ రెడ్డిని షాద్ నగర్ లో పోటీ చేయించేందుకు కసరత్తు చేస్తున్నారు. అందరిది అదే దారి ఇక బీజేపీ కూడా వచ్చే ఎన్నికల్లో రాజకీయ వారసులకే ఛాన్స్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన సీనియర్ నేత దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ మహేశ్వరం నుంచి బీజేపీ తరపున పోటీ చేయాలని భావిస్తున్నారు. పాలమూరు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తనయుడు మిథున్ రెడ్డిని షాద్ నగర్ నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నారు. శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ కొడుకు రవి యాదవ్.. ఈ సారి టికెట్ దక్కించుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. అయితే కాంగ్రెస్ లో మాత్రం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వారసుల్ని బరిలో దించగల పరిస్థితులు కనిపించడం లేదు. మొత్తంగా బీఆర్ఎస్, బీజేపీలు ఎవరెవరి వారసులకు ఛాన్స్ ఇస్తాయో చూడాలి. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ -
రాహుల్ యాత్రలో కలకలం! భద్రతా వలయాన్ని దాటి వచ్చిన వ్యక్తులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నుంచి భారత్ జోడో యాత్ర కొనసాగించారు. ఉదయం ఆరు గంటలకు బయలుదేరిన యాత్ర 10 గంటల సమయంలో కొత్తురుకు చేరుకుంది. అక్కడ మధ్యాహ్నం భోజన విరామం తీసుకున్న రాహుల్.. మీడియాతో మాట్లాడారు. సాయంత్రం 4 గంటలకు తిరిగి పాదయాత్ర ప్రారంభించి.. రాత్రి ఏడు గంటలకు తొండుపల్లిలో బస చేశారు. కాగా సాయంత్రం జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న తొండుపల్లి, షాపూర్, శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయడంపై కాంగ్రెస్ కార్యకర్తలు విద్యుత్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ కాళ్లపై పడిన కార్యకర్త జోడో యాత్రలో ఓ వ్యక్తి పోలీసు భద్రతా వలయాన్ని దాటు కుని వచ్చి రాహుల్ గాంధీ కాళ్లపై పడటం కలకలం రేపింది. పక్కనే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై ఆ వ్యక్తిని లాగేశారు. ఆ వ్యక్తిని కాంగ్రెస్ కార్యకర్తగా గుర్తించి వదిలేసినట్టు సమాచారం. ఇక మరో వ్యక్తి కూడా పాదయాత్రలోకి చొచ్చుకువచ్చి రాహుల్ పాదాలను తాకేందుకు ప్రయత్నించారు. అయితే రాహుల్ పిలవడం వల్లే ఇద్దరు వ్యక్తులు భద్రతా వలయాన్ని దాటి ఆయన వద్దకు వచ్చారని.. పాదాలను తాకి, ఫొటోలు తీసుకునేందుకు యత్నించారని బాలానగర్ డీసీపీ సందీప్ పేర్కొనడం గమనార్హం. బస్సుపై ఎక్కి.. సెల్ఫీ దిగి.. రాహుల్ పాదయాత్రగా వస్తున్న సమయంలో పాల్మాకుల వద్ద రోడ్డు పక్కన కొందరు ఆర్టీసీ బస్సుపైకి ఎక్కి రాహుల్ గాంధీకి అభివాదం చేశారు. వారిని గమనించిన రాహుల్ స్వయంగా ఆర్టీసీ బస్సు టాప్ పైకి ఎక్కారు. బస్సు డ్రైవర్, కండక్టర్, ఇతర ప్రయాణికులతో మాట్లాడారు. వారితో సెల్ఫీలు దిగారు. రాహుల్ వెంట పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా బస్సుపైకి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. -
ముచ్చింతల్‌లో సీఎం కేసీఆర్.. సమతామూర్తి స్పూర్తి విగ్రహ పరిశీలన
సాక్షి, రంగారెడ్డి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్‌కు చేరుకున్నారు. ముచ్చింతల్‌లోని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆశ్రమంలో జరుగుతున్న శ్రీ రామానుజ సహస్రాబ్ది వేడుకలలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. సమతా మూర్తి కేంద్రాన్ని స్వయంగా పరిశీలించిన సీఎం కేసీఆర్. చిన్నజీయర్ స్వామితో కలిసి రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ ఏర్పాట్లను పరిశీలించారు. 216 అడుగుల సమతామూర్తి విగ్రహం చుట్టూ కేసీఆర్ తిరిగి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా ముచ్చింతల్ గ్రామంలోని చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలోని 40 ఎకరాల సువిశాల ప్రాంగణంలో శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 2 తేదిన ప్రారంభమైన ఈ మహోత్సవం ఫిబ్రవరి 14 వరకు కొనసాగనున్నాయి. రెండో రోజు ఉత్సవాల్లో భాగంగా శ్రీలక్ష్మీనారాయణయాగం నిర్వహించారు. యాగశాలలో అగ్నిహోత్రం ఆవిష్కరణ, 1035 కుండలాల్లో శ్రీ లక్ష్మీ నారాయణ హోమం జరిగింది. ఈ హోమాన్ని ఏక కాలంలో ఐదు వేల మంది రుత్వికులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జీయర్ స్వాములు, రుత్వికులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ముచ్చింతల్‌లోని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆశ్రమంలో జరుగుతున్న శ్రీ రామానుజ సహస్రాబ్ది వేడుకలలో పాల్గొన్న సీఎం శ్రీ కేసీఆర్ https://t.co/n4lKbEcxjw — Telangana CMO (@TelanganaCMO) February 3, 2022 -
వెల్స్పన్ పరిశ్రమను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
-
16 వాహనాలు ఢీ
నందిగామ: రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిధిలోని హైదరాబాద్–బెంగళూరు 44వ జాతీయ రహదారిపై శనివారం ఉదయం దట్టమైన పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదం జరిగింది. వాహనాల డ్రైవర్లకు దారి కనబడని పరిస్థితి నెలకొంది. దీంతో షాద్‌నగర్ నుంచి హైదరాబాద్ వైపునకు వెళ్తున్న ఓ కారు ముందుగా వెళ్తున్న మరో కారును ఢీకొని అక్కడే ఆగిపోయింది. దాని వెనకాలే వస్తున్న కార్లు, లారీలు, బస్సులు ఒకదానికి మరొకటి వరుసగా 16 వాహనాలు ఢీకొన్నాయి. దీంతో పది కార్లు, రెండు బస్సులు, నాలుగు లారీలు దెబ్బతిన్నాయి. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. వరుస ప్రమాదాలతో ఒక్కసారిగా ట్రాఫిక్‌జాం ఏర్పడింది. దీంతో స్థానిక పోలీసులు వాహనాలను పాత జాతీయ రహదారి మీదుగా మళ్లించగా నందిగామ గ్రామంలోంచి పాత జాతీయ రహదారిపై వాహనాలు వెళ్లడంతో అక్కడా వాహనాల సంఖ్య పెరిగి ట్రాఫిక్‌జాం అయింది. సుమారు గంట అనంతరం ట్రాఫిక్ క్లియర్ కావడంతో వాహనదారులు ఊపిరిపీల్చుకున్నారు. -
చెక్కులివ్వకపోతే చిక్కులే..
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ‘రైతుబంధు’ పథకం కింద అర్హులైన ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందజేస్తామని రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. దేశ చరిత్రలోనే తొలిసారి పట్టాదార్ పుస్తకాలు, రైతులకు ఆర్థిక చేయూతనందిస్తున్న రాష్ట్రం మనదేనని అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన ‘రైతుబంధు’ పథకంపై అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్నివర్గాలను భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతానికి వివాదరహిత భూములకు చెక్కులను పంపిణీ చేస్తున్నప్పటికీ, మిగతా వాటికి దశలవారీగా సాయం అందజేస్తామన్నారు. వక్ఫ్, దేవాదాయ, భూదాన్ భూముల విషయంలో ప్రభుత్వంతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, యాదయ్య, అంజయ్యయాదవ్, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ పెంటారెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి కోఅర్డినేటర్ వంగేటి లక్ష్మారెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి, కలెక్టర్ రఘునందన్‌రావు, జాయింట్ కలెక్టర్ హరీశ్, వివిధ మండలాల రైతు సమన్వయ సమితి సమన్వయకర్తలు, బ్యాంకర్లు పాల్గొన్నారు. రైతు రావాలి.. ఆధార్ చూపాలి...కలెక్టర్ రఘునందన్‌రావు.. వ్యక్తిగతంగా రైతు వస్తేనే చెక్కు అందజేస్తాం. ఆధార్‌ను తప్పనిసరిగా చూపాలి. చెక్కులు, పాస్‌పుస్తకాల పంపిణీకి ప్రత్యేక బృందాలను నియమించాలి. రెవెన్యూ గ్రామం యూనిట్‌గా చెక్కులు పంపిణీ చేస్తాం. ప్రతి మండలానికి నోడల్ బ్యాంకును గుర్తించాం. 10వ తేదీ నుంచి 17వ తేదీ మధ్య ఉదయం 7 నుంచి 11 గంటలవరకు, సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల వరకు చెక్కులను నిర్దేశిత ప్రదేశంలో అందజేస్తాం. చెక్కుల జారీ, తేదీ, స్థలం తదితర వివరాలతో కూడిన స్లిప్పులను రెండు రోజలు ముందటే ఆయా గ్రామాల్లో రైతులకు పంపిణీ చేస్తాం. వక్ఫ్, దేవాదాయ భూములను సాగు చేసుకుంటున్న రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భూదాన్ బోర్డు అసైన్డ్ చేస్తే ఆ రైతులకు మాత్రం పెట్టుబడి సాయం దక్కుతుంది. పట్టాదార్లకు కాకుండా ఇతరులకు చెక్కుల పంపిణీ జరగదు. ఆధార్ వివరాలు ఇవ్వని 22 వేల మందికి చెక్కులు ఇవ్వడంలేదు. జిల్లావ్యాప్తంగా 93శాతం రికార్డుల ప్రక్షాళన జరిగింది. మిగతా 7 శాతంలో వివాదాస్పద, కోర్టు కేసులు ఇతరత్రా భూ వివాదాలున్నవి ఉన్నాయి. రైతు బంధు పథకం కింద రూ.283.05 కోట్ల సాయం అందజేస్తున్నాం. బ్యాంకుల్లో నగదును సమృద్ధిగా ఉంచుకోవాలని ఆదేశించాం. నగదు మార్పిడిలో ఇబ్బందులు తలెత్తకుండా బ్యాంకులకు పోలీస్‌బందోబస్తును ఏర్పాటు చేస్తాం. చెక్కులివ్వకపోతే చిక్కులే.. 1965లో భూదాన్ యజ్ఞబోర్డు నోటిఫికేషన్ జారీచేసింది. ఈ భూములను ఎన్నో ఏళ్లుగా సాగుచేసుకుంటున్న రైతులకు పెట్టుబడి సాయం అందించలేమనడం సరికాదు. కబ్జాలో ఉన్న ప్రతి రైతుకూ సాయం చేయాల్సిందే. అలా చేయకపోతే పథకం ఉద్ధేశం పక్కదారి పట్టి ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది. 93శాతం మందికి చెక్కులు పంపిణీ చేసి.. మిగతావారిని విస్మరించడాన్ని కొందరు అనుకూలంగా మలుచుకునే వీలు లేకపోలేదు. -
వివాహిత ఆత్మహత్య
కడుపునొప్పి భరించలేక ఓ వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం ధారూరు మండలం సర్పన్‌పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై మల్లేశం తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన లలిత(25) అనే వివాహితకు మండల పరిధిలోని మోమిన్‌కలాన్ గ్రామానికి చెందిన లక్ష్మన్‌తో 5 సంవత్సరాల క్రితం వివాహమైంది. వివాహితకు తరుచూ కడుపునొప్పితో బాధపడుతూ అస్వస్థతకు గురై అనారోగ్యంగా ఉండేది. ఈ బాధను భరించలేక ఆదివారం రాత్రి తల్లిగారి ఇంట్లోనే దులానికి తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసకుంది. ఈమెకు కొడుకు హరిప్రసాద్, కూతురు శివానిలు ఉన్నారు. తల్లి నర్సమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ప్రాదేశిక సమరం
జిల్లావ్యాప్తంగా 614 ఎంపీటీసీలు,33 జెడ్పీటీసీలకు ఎన్నికలు శివార్లలోని 35 పంచాయతీలపై సస్పెన్స్! వీటి పరిధిలోని ఎంపీటీసీల ఎన్నికలపై ప్రభుత్వానికి కలెక్టర్ లేఖ సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: స్థానిక సంస్థల సమరానికి ముహూర్తం ఖ రారైంది. మండల, జిల్లా ప్రాదేశిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ ప్రకటించింది. దీంతో జిల్లా వ్యాప్తంగా 614 ఎంపీటీసీలు, 33 జెడ్పీటీసీ స్థానాలకు ఏప్రిల్ 6న పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 17న కలెక్టర్ నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. స్వీకరణపర్వం మొదలుకానుంది. కాగా, నగర శివార్లలోని 35 పంచాయతీల్లో ఎంపీటీసీ ఎన్నికలపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. వీటిని కొత్తగా ఏర్పాటుచేసే మున్సిపాలిటీల పరిధిలోకి తీసుకురావాలనే ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. పురపాలికలుగా మార్చే ఆలోచన ఉన్నందున అప్పట్లో ఈ పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేదు. ఇప్పటివరకు ఇవి డీనోటిఫై కాకపోవడంతో పంచాయతీరాజ్‌శాఖ వీటికి కూడా రిజర్వేషన్లను ఖరారు చేసింది. ఈ క్రమంలోనే ఎన్నికల కమిషన్ ఈ గ్రామాల ఎంపీటీసీలకూ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఎస్ఈసీ ప్రకటన నేపథ్యంలో ప్రభుత్వానికి లేఖ రాయాలని జిల్లా కలెక్టర్ బీ.శ్రీధర్ నిర్ణయించారు. నగర పంచాయతీ/మున్సిపాలిటీలుగా ప్రతిపాదనలు ఉన్న గ్రామాలకు ఎన్నికలు నిర్వహించాలా? లేదా? అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని కోరనున్నట్లు ఆయన ‘సాక్షి’కి తెలిపారు. నోటిఫికేషన్ వెలువరించేలోపు దీనిపై ప్రభుత్వం నుంచి వచ్చే ఉత్తర్వుల ఆధారంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. రెండు జడ్పీటీసీలకు ఎసరు! 35 పంచాయతీల పరిధిలోని ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించని పక్షంలో సరూర్‌నగర్, రాజేంద్రనగర్ మండలాల జెడ్పీటీసీలకు కూడా ఎన్నికలు జరిగే అవకాశంలే దు. ఇప్పటికే సరూర్‌నగర్ మండలంలోని సమీప గ్రామాలతో కలుపుకొని బడంగ్‌పేట నగర పంచాయతీగా మారింది. అలాగే మిగతా గ్రామాలను కూడా కొత్తగా ఏర్పాటుచేసే మున్సిపాలిటీల్లో చేర్చాలనే ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. రాజేంద్రనగర్ మండలంలో మణికొండ మినహా మిగతా గ్రామాలన్నింటినీ కొత్త పురపాలక సంఘాల పరిధిలోకి తేవాలనే సర్కారు యోచిస్తోంది. వీటన్నింటికి ఎన్నికలు నిర్వహించకూడదని నిర్ణయిస్తే ఈ రెండు మండలాలు ‘పట్టణ’ మండలాలుగా మారిపోతాయి. ఇదిలా ఉండగా.. విలీనంచేయని ఐదు పంచాయతీల అంశంపై హైకోర్టు ఓ సందర్భంలో స్పందిస్తూ వీటికి పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. ఈ తరుణంలో వీటికి ప్రాదేశిక ఎన్నికలు నిర్వహించే అవకాశం లేకపోలేదు. -
ఐక్యంగా సాగుదాం.. అన్ని సీట్లూ గెలుద్దాం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందనుకోలేదు.. ఉభయసభల్లో బిల్లు ఆమోదం పొందడం ఇప్పటికీ కలగానే ఉంది. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను సాఫీగా పూర్తి చేసినందుకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించి ఆమెకు బహుమతిగా ఇద్దాం.’ అని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం గాంధీభవన్‌లో డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ అధ్యక్షతన జరిగిన జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిం చారు. తెలంగాణ బిల్లును పార్లమెంటు ఉభయసభల్లో ప్రవేశపెట్టినప్పుడు అన్ని పార్టీలు నాటకాలాడాయని, కాంగ్రెస్ ధృడసంకల్పంతో ముందుకు సాగిందన్నారు. పార్టీలో అన్నివిధాలా పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీతోనే మహిళలకు, మైనార్టీలకు ప్రత్యేక స్థానం దక్కిందన్నారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ మాట్లాడుతూ.. సీమాంధ్రలో కొందరు నేతలు పదవులు అనుభవించి పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు వదిలి వెళ్లిపోవడం సరికాదన్నారు. నేతలు, కార్యకర్తలంతా పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేయాలని సూచించారు. పార్టీ ఎవరి సొంతం కాదని, వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని అన్నారు. డీసీసీ సమావేశాలకు గైర్హాజరయ్యే కొందరు నేతలు.. సొంత ప్రాంతంలో తామే బలవంతులమని చెప్పుకుంటున్నారంటూ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. పార్టీ సమావేశాలకు హాజరుకాని మండల బాధ్యులపై తగిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. దేశంలో మతోన్మాద శక్తులు రాజ్యమేలేందుకు కుట్ర పన్నుతున్నాయని, ప్రజల్లో ఈ అంశాన్ని వివరించి వాటికి అడ్డుకట్ట వేయాలని పిలుపుని చ్చారు. సమావేశంలో పీసీసీ ఉపాధ్యక్షుడు నాగయ్య, కార్యదర్శులు టీ.రామ్మోహన్‌రెడ్డి, ఆదిత్యరెడ్డి, పార్టీ నేతలు కాలె యాద య్య, రమేష్, కార్తీక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డుమ్మా ఎందుకు? విస్తృతస్థాయి సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. మంత్రి ప్రసాద్‌తోపాటు కె.లకా్ష్మరెడ్డి, ఆకుల రాజేందర్ మినహా మిగతా ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం చర్చనీ యాంశమైంది. తెలంగాణ ఏర్పాటు నేపథ్యంలో అధినేత్రికి కృతజ్ఞతలు చెప్పేందుకే మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు దూరంగా ఉండడంపై కార్యకర్తలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. -
టీఆర్ఎస్ శిబిరంలో ముసలం!
‘దేశం’నేతల చేరికపై అసంతృప్తి కష్టించేవారిని కాదని వలసలకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆగ్రహం హైకమాండ్‌తో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధం సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: తాజా పరిణామాలు టీఆర్ఎస్లో అసమ్మతిని రాజేశాయి. ఇప్పుడిప్పుడే కాస్తో కూస్తో బలం పుంజుకుంటున్న పార్టీలో టీడీపీ నేతల వలసలతో గ్రూపులకు తెరలేచింది. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో వైరివర్గంగా వ్యవహరించిన హరీశ్వర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డిలు ఇప్పుడు ఒకే గూటికి చేరడం కూడా అసంతృప్తికి ఆజ్యం పోసింది. కష్టకాలంలో పార్టీని బతికించినవారిని కాదని, కొత్త ముఖాలకు ప్రాధాన్యతనివ్వడంపై గులాబీ శ్రేణుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఉద్యమాన్ని అణచివేసిన నేతలకు ఇప్పుడు రెడ్‌కార్పెట్ స్వాగతం పలకడం, సీట్ల ఖరారుపై కూడా హామీలు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని నేతలు ఈ వ్యవహారంపై అధిష్టానంతో తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ అంశంపై ఒకరిద్దరు నేతలు పార్టీ యువనేత కేటీఆర్‌తో మాట్లాడి తమ నిరసనగళాన్ని వినిపించినట్లు తెలిసింది. పార్టీలో చేరుతున్న ఎమ్మెల్యేల గొంతెమ్మ కోరికలు తీరుస్తూ.. పార్టీని నమ్ముకున్న దిగువశ్రేణి నాయకుల గొంతు కోయవద్దని ఘాటుగానే వ్యాఖ్యానించినట్లు సమాచారం. మరోవైపు చేవెళ్ల, తాండూరు నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిత్వంపై గంపెడాశలు పెట్టుకున్న దేశమళ్ల ఆంజనేయులు, రోహిత్‌రెడ్డి కూడా తాజా పరిణామాలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. స్థానిక నేతలతో సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం ఎంతవరకు సబబని వాపోతున్నారు. మరోవైపు జిల్లాలో టీఆర్ఎస్లో పెద్దదిక్కుగా వ్యవహరిస్తున్న హరీశ్వర్‌రెడ్డి బహిరంగంగా నోరు మెదపనప్పటికీ, తాజా పరిణామాలపై కినుక వహించినట్లు తెలిసింది. వీరి చేరికను మొదట్నుంచి హరీశ్వర్ వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో మహేందర్, రత్నం చేరికలను గోప్యంగా ఉంచి ఆఖరి నిమిషంలో మాట మాత్రంగా అభిప్రాయాన్ని కోరడంపై ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. టీడీపీలో వ్యతిరేక వర్గంగా వ్యవహరించి... తన ఎదుగుదలకు అడుగడుగునా అవరోధాలు కల్పించిన మహేందర్‌ను పార్టీలో చేర్చుకోవడం ఆయనను ఆందోళనకు గురిచేస్తోంది. -
గెలుపే లక్ష్యంగా పనిచేద్దాం
పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం అధికార, ప్రతిపక్ష వైఫల్యాలను ఎండగట్టాలని నిర్ణయం గ్రామాల్లో పార్టీ పటిష్టానికి కృషిచేయాలని పిలుపు జంట జిల్లాల నేతలతో సమీక్ష సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ప్రతిఒక్కరూ చిత్తశుద్ధితో కృషిచేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పార్టీ నియోకజవర్గ సమన్వయకర్తలు, ముఖ్యనాయకులతో ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నియోకజవర్గం వారీగా పరిస్థితిని తెలుసుకుని ప్రజల్లో మమేకం అవుతూ, గత నాలుగేళ్లలో అధికార, ప్రతిపక్ష పార్టీల వైఫల్య్టాలు ప్రజలకు వివరిస్తూ, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆయా వర్గాల అభ్యున్నతి కోసం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని ఆదేశించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడాలని, వారి తరఫున ఎక్కడికక్కడ ఆందోళనలు నిర్వహించాలన్నారు. రానున్న ఎన్నికల్లో అన్ని స్థానాలకూ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. తెలంగాణ ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్సారేనని అన్నారు. జల యజ్ఞం కింద పలు ప్రాజెక్టులకు ఈ ప్రాంతంలో అంకురార్పణ చేసిన ఘనత ఆయనదేనని స్పష్టం చేశారు. వైఎస్సార్ హయాంలో పేదలకు పలు సంక్షేమఫలాలు దక్కాయని పేర్కొన్నారు. మహానేత వైఎస్సార్‌కు తెలంగాణ ప్రాంతంలో అత్యధికంగా అభిమానులున్నారని అన్నారు. త్వరలో ఈ ప్రాంతంలో ఓదార్పు యాత్ర చేపడతానని తెలిపారు. పార్టీని బలోపేతం చేసి విజయం సాధించేందుకు నాయకులను, కార్యకర్తలను సమాయత్తం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీఈసీ సభ్యు లు కొలిశెట్టి శివకుమార్, బి.జనార్దన్‌రెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పార్టీ కన్వీనర్లు ఆదం విజయ్‌కుమార్, ఈసీ శేఖర్‌గౌడ్, యువజన, సేవాదళ్ రాష్ట్ర కన్వీనర్లు పుత్తా ప్రతాప్‌రెడ్డి, కోటింరెడ్డి వినయ్‌రెడ్డిలతోపాటు జంపన ప్రతాప్, అమీర్‌అలీఖాన్, పి.విజయారెడ్డి, కాలేరు వెంకటేష్, వెల్లాల రాంమోహన్, శీలం ప్రభాకర్, బాల్‌రెడ్డి, మతీన్, సాజిద్ అలీ, లింగాల హరిగౌడ్, సాయినాథ్‌రెడ్డి, వెంకట్రావు, సింగిరెడ్డి ధన్‌పాల్‌రెడ్డి, ఓ.శ్రీనివాస్‌యాదవ్, పోచంపల్లి కొండల్‌రెడ్డి, సమన్వయకర్తలు సంజీవరావు, కొలను శ్రీనివాస్‌రెడ్డి, రాచమళ్ల సిద్ధేశ్వర్, వడ్డేపల్లి నర్సింగ్‌రావు, విష్ణువర్ధన్‌రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, రూపానందరెడ్డి, సూర్యనారాయణరెడ్డి, సురేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కీసర జాతరకు ఏర్పాట్లు ముమ్మరం
కీసర, న్యూస్‌లైన్: కీసరగుట్టలో ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని భక్తుల కోసం ఏర్పాట్లు ముమ్మరం చేశారు. జాతర జరిగే ప్రాంతంలో చేపడుతున్న ఏర్పాట్లు పూర్తికావచ్చాయి. ఐదు లక్షల వరకు భక్తులు విచ్చేస్తారని అంచనా వేస్తున్న అధికారులు ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లపై సోమవారం సాయంత్రం తుది సమావేశం ఉన్న దృష్ట్యా ఆలోపు పనులు పూర్తి చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ యేడాది జాతరలో భక్తులకు లభించే సౌకర్యాలు ఇలా ఉండబోతున్నాయి... స్వామివారి దర్శనానంతరం పంచామృతతీర్థం, పూజించిన బిల్వపత్రాలను ప్రసాదంగా అందజేస్తారు. క్యూలై న్లలో నిల్చుండే భక్తులకు లింగాష్టకం- శివాష్టకంతో కూడిన చిన్నసైజు కరపత్రాల పంపిణీ. దాతల సహకారంతో ఉచితంగా మంచినీటిప్యాకెట్లు, చిన్నపిల్లలు ఉంటే పాలప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకేట్ల సరఫరా. ప్రస్తుతానికి లక్ష లడ్డూ ప్రసాదాలు సిద్ధం. రద్దీని బట్టి ప్రసాదాల పంపిణీకి చర్యలు. వీవీఐపీలకు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు. జాతర జరిగే ప్రాంతంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం 1,700 మంది పోలీసులు విధులు నిర్వహించనున్నారు. 24 గంటల పాటు మంచినీటి సరఫరా కోసం ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్నానపు గదులు, తాత్కాలికంగా మరుగుదొడ్లను నిర్మించారు. నిరంతర విద్యుత్ సరఫరాకు అదనంగా ఆరు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు. ఒక జనరేటర్‌ను సిద్ధంగా ఉంచారు. వాహనాల పార్కింగ్ కోసం ఏపీ రెసిడెన్షియల్ పాఠశాల వెనుక స్థలాన్ని చదునుచేశారు. జిల్లాస్థాయి క్రీడోత్సవాల సందర్భంగా క్రీడాకారులకు క్రీడాప్రాంగణంలోనే భోజన ఏర్పాట్లు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి కీసరగుట్టకు సుమారు 250 ఆర్టీసీ బస్సులను నడుపనున్నారు. మహాశివరాత్రి ఆ మరుసటిరోజు ప్రతి ఐదు నిమిషాలకు బస్సు సౌకర్యం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. గర్భాలయంలో జరిగే ఆర్జిత సేవలన్నీ మారుతి కాశీవిశ్వేరస్వామి ఆలయంలో జరుగుతాయి. జిల్లా పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో మూడురోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. జాతరకు వచ్చే వికలాంగులు, వృద్ధులను దేవాలయం వరకూ చేరవేసేందుకు బస్టాప్, పార్కింగ్‌స్థలం నుంచి ప్రత్యేక వాహన సదుపాయం. యాత్రికులకు ఎప్పటికప్పుడు తగు సమాచారం ఇచ్చేందుకు కీసరవాణిని సిద్ధం చేశారు. -
లక్ష్యం.. ‘నీటి’మూట!
తాండూరు, న్యూస్‌లైన్: పంటల సాగుకు అనువుగా నీటి వనరులను తీర్చిదిద్దడంలో నిర్లక్ష్యం చోటుచేసుకుంటోంది. ప్రాజెక్టులు, చెరువుల పనుల పురోగతి కుంటుపడుతోంది. రైతాంగం సాగునీటి కష్టాలను దూరం చేయాలనే సంకల్పంతో కోట్లాది రూపాయలతో చేపట్టిన ప్రాజెక్టులు అర్ధంతరంగా ఆగిపోవడం, కొత్తగా చేపట్టాల్సిన చెరువుల నిర్మాణాలకు మోక్షం కలగపోవడంతో లక్ష ్యం నీరుగారుతోంది. యాలాల మండలం విశ్వనాథ్‌పూర్ వద్ద సుమారు రూ.5.9కోట్లతో చేపట్టిన శివసాగర్ ప్రాజెక్టు పనులు అర్ధంతరంగా నిల్చిపోయాయి. 2005లో మొదలైన ఈ ప్రాజెక్టును మూడేళ్లలో అంటే 2008 సంవత్సరంలోనే పూర్తిచేయాల్సి ఉంది. కానీ నేటికీ పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల నిర్మాణానికి సేకరించిన 38 ఎకరాలకు సంబంధించి పరిహారం ఊసే లేదు. ఎకరానికి సుమారు రూ.2లక్షల చొప్పున చెల్లించాలని ప్రాథమికంగా అధికారులు నిర్ణయించినా ఇంతవరకూ అతీగతి లేదు. దాంతో కాల్వల నిర్మాణం, ఆరు ఎకరాల అప్రోచ్ రోడ్డు పనులు మొదలు కాలేదు. ప్రస్తుతం ప్రాజెక్టు అంచనా వ్యయం అదనంగా రూ.కోటి పెరిగింది. పాత రేట్ల ప్రకారం పనులు చేయడం సాధ్యం కాదని కాంట్రాక్టర్ స్పష్టం చేశాడు. పెరిగిన అంచనా వ్యయం చెల్లిస్తే కానీ శివసాగర్ ప్రాజెక్టు పనులు మొదలయ్యే అవకాశం లేదు. ఈ ప్రాజెక్టు ద్వారా వెయ్యి ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యం నెరవేరడం లేదు. ఇక పెద్దేముల్ మండలం నాగులపల్లిలో రూ.2కోట్ల నిధులతో 350 ఎకరాలకు సాగునీరు అందించేందుకు తలపెట్టిన కొత్తచెరువు నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. భూసేకరణకు సంబంధించి రైతులకు చెల్లించాల్సిన పరిహారం లెక్క తేలకపోవడతో చెరువు నిర్మాణ పనులకు మోక్షం కలగటం లేదు. ఏడాదికి పైగా చెరువు నిర్మాణ పనుల ప్రారంభంలో ఆలస్యం జరుగుతోంది. ఇదిలా ఉంటే చెరువు కట్ట నిర్మాణం కోసం దాదాపు ఆరు నెలల క్రితం వికారాబాద్ సబ్‌కలెక్టర్ ఖాతాలో ప్రభుత్వం రూ.68లక్షలు జమచేసింది. చెరువు నిర్మాణానికి సుమారు 40 ఎకరాలను రైతుల నుంచి సేకరించేందుకు అధికారులు నిర్ణయించారు. కానీ ఇంతవరకు భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు ఎంత పరిహారం చెల్లిస్తారనే విషయంలో స్పష్టత లేదు. దాంతో చెరువు పనులు ఆలస్యమవుతున్నాయి. ప్రస్తుతానికి చెరువు వరకు రూ.10లక్షలతో మూడు కి.మీ.మేర అప్రోచ్ రోడ్డు పనులు మొదలైనా ప్రధాన పనుల్లో జాప్యం జరుగుతోంది. అధికారులు ఆయా ప్రాజెక్టుల నిర్మాణం సత్వరమే పూర్తిచేసి సాగునీరు అందుబాటులోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు. పనులు పూర్తిచేసేందుకు కృషి నాగులపల్లి కొత్తచెరువు, శివసాగర్ ప్రాజెక్టు పనులు సత్వరమే పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. ప్రస్తుతం నాగులపల్లి చెరువు అప్రోచ్ రోడ్డు పనులు జరుగుతున్నాయి. శివసాగర్ ప్రాజెక్టు కాల్వల నిర్మాణ పనులు కూడా త్వరలో మొదలుపెడతాం. అదనంగా పెరిగిన అంచనా వ్యయం డబ్బుల కోసం ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాం. ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే ప్రాజెక్టు పనులు మొదలవుతాయి. - నర్సింహ, తాండూరు ఇరిగేషన్ డీఈఈ -
నిధులివ్వరు ..నిర్వహణ ఎలా?
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సర్కారు వైద్యశాలలకు సుస్తీ చేసింది. ఏడాది కాలంగా నిధుల లేమితో ఆస్పత్రుల నిర్వహణ గాడి తప్పింది. ప్రభుత్వం ఏటా విడుదల చేసే నిర్వహణ నిధులు ఈ ఏడు ఇప్పటికీ జాడలేవు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద వివిధ పద్దుల కింద ఇచ్చే వార్షిక నిర్వహణ నిధులు వాస్తవానికి ఆరోగ్య కేంద్రాలకు ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే విడుదల చేయాలి. కానీ మరో రెండున్నర నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్నప్పటికీ.. నిధుల ఊసే లేదు. అసలే అరకొర వైద్యం అందించే సర్కారు దవాఖానాల్లో నిధుల సమస్యను సాకుగా చూపిస్తున్న వైద్యశాఖ.. ఏకంగా ఆస్పత్రుల నిర్వహణను గాలికొదిలే సింది. రావాల్సింది రూ.1.02 కోట్లు జిల్లాలో 48 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ) ఉన్నాయి. ఇవికాకుండా మరో 7 పట్టణ ఆరోగ్య కేంద్రాలు (యూహెచ్‌సీ) ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఆరోగ్య కేంద్రానికి ఏటా వివిధ పద్దుల కింద గరిష్టంగా రూ.1.75లక్షల నిధులు ఇస్తోంది. అవ సరాన్ని బట్టి నిధుల విడుదలలో హెచ్చుతగ్గులు పాటిస్తోంది. ఈ నిధులను ఆస్పత్రి అభివృద్ధి సొసైటీ ఖాతాలో జమ చేస్తుంది. ఈ నిధులతో ఆస్పత్రి అభివృద్ధి కార్యక్రమాలకోసం రూ.లక్ష వినియోగించాల్సి ఉంటుంది. వీటితో చిన్నపాటి మరమ్మతులు, పెయింటింగ్, పరికరాల కొనుగోలు తదితర వాటికి వినియోగించాలి. మరో రూ.50వేలు ఏడాది పొడవునా ఆస్పత్రి నిర్వహణకు ఖర్చు చేయాలి. మిగిలిన రూ.25వేలను ఆస్పత్రిలో పారిశుద్ధ్యం మెరుగుకోసం వెచ్చించాలి. అయితే ఈ ఏడాది మూడు పద్దులకు సంబంధించి రూ.1.02 కోట్లు రావాల్సిందిగా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించారు. అయితే నిధులు ఇప్పటికీ విడుదల కాకపోవడంతో ఆస్పత్రుల్లో పరిస్థితులు అధ్వానంగా, వైద్యసేవలు అరకొరగా మారాయి. ఆఖరి నిమిషంలో జేబుల్లోకి! ఆస్పత్రి అభివృద్ధి సొసైటీకి కేటాయించే నిధులను ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో విడుదల చేస్తే ప్రణాళికాబద్ధంగా ఖర్చవుతాయి. అయితే నిధుల విడుదల ప్రక్రియ గాడి తప్పుతుండడంతో ఒకవైపు ఆస్పత్రి నిర్వహణ అధ్వానంగా మారుతుండగా.. మరోవైపు ప్రజాధనం దుర్వినియోగమవుతోంది. మరో రెండున్నర నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. దీంతో ఇప్పటికిప్పుడు నిధులు విడుదలచేస్తే.. ఆదరాబాదరగా నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని చోట్ల అక్రమాలు జరిగే అవకాశం ఉందని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. నకిలీ బిల్లులతో గతంలో అక్రమాలు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో నిధులు విడుదలైతే వినియోగంపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. -
మరో భూ మాయ!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాలోని మరో మండలంలో బోగస్ పట్టాల బాగోతం బయటపడింది. ఒకే భూమిపై పలువురికి పట్టాలు జారీ చేసిన వైనం ఆలస్యంగా వెలుగు చూసింది. మంచాల మండలం లోయపల్లిలో చోటుచేసుకున్న ఈ ఉదంతంపై జిల్లా యంత్రాంగం జరిపిన విచారణలో ఆశ్చర్యకర విషయాలు వెల్లడయ్యాయి. రెండు దశాబ్ధాల క్రితం ఇక్కడ పనిచేసిన తహసీల్దార్ పేరిట పాత తేదీలతో ఇప్పటికీ పాస్‌పుస్తకాలు, ప్రొసీడింగ్స్ జారీ అవుతున్నట్లు గుర్తించిన యంత్రాంగం.. అక్రమాల వెలికితీతకు డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిని విచారణకు నియమించింది. 1993లో మంచాల తహసీల్దార్‌గా జయరాజ్ ఉన్న కాలంలో ఈ నకిలీ పట్టాలు, ప్రొసీడింగ్స్ జారీకి తెర లేచినట్లు ప్రాథమికంగా తేలింది. లోయపల్లిలోని సర్వేనంబర్లు 334, 335, 370లో దాదాపు 710 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిని సాగుచేసుకుంటున్న రైతులకు పట్టాలు జారీచేసిన తహసీల్దార్.. అక్రమార్కులకు కూడా పాస్‌బుక్కులు ఇచ్చినట్లు బయటపడింది. ఇలా సుమారు కొన్ని వేల మందికి బోగస్ పాస్‌పుస్తకాలు జారీచేసినట్లు తెలుస్తోంది. ఆఖరికి 1993లో జన్మించనివారి పేరిట కూడా పట్టాదారు పాస్‌బుక్కులు సృష్టించినట్లు తేలడంతో జిల్లా యంత్రాంగం అవాక్కయింది. దీంతో జయరాజ్ పనిచేసిన కాలంలో పురుడు పోసుకోనివారి పేర పాస్‌పుస్తకాలు బయటపడిన వైనంపై జాయింట్ కలెక్టర్-1 చంపాలాల్ కూపీ లాగారు. ఈ నేపథ్యంలోనే గురువారం మంచాల మండలంలో పర్యటించిన జేసీ.. ఈ ఘటనపై విచారణ జరిపారు. యాచారం మండలం నల్లవె ల్లిలోనూ ఇదే తరహా అక్రమాలు చోటుచేసుకున్న నేపథ్యంలో బోగస్ పాస్ పుస్తకాల వ్యవహారాన్ని లోతుగా పరిశీలించాలని యంత్రాంగం నిర్ణయించింది. బ్యాంకులకు టోపీ! రెవెన్యూ సిబ్బందితో కుమ్మక్కై పాసు పుస్తకాలను సృష్టించిన అక్రమార్కులు బ్యాంకులనూ బురిడీ కొట్టించారు. పాస్‌బుక్కులు అసలా? కాదా అనే అంశాన్ని నిర్ధారించుకోకుండానే ఎడాపెడా రుణాలిచ్చేసిన బ్యాంకర్లు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆరుట్ల శాఖ, బోడకొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఈ భూములను తనఖా పెట్టి.. అడ్డగోలుగా అప్పులు చేసినట్లు స్పష్టమైంది. ఒకే భూమిని పలువురు తాకట్లు పెట్టి రుణాలు తీసుకున్నా గుర్తించని బ్యాంకర్లు.. తాజాగా అక్రమాలు బయటకురావడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇదిలావుండగా.. నకిలీ పాస్‌పుస్తకాల జారీ వైనంపై సమగ్ర దర్యాప్తు జరుపనున్నట్లు జేసీ చంపాలాల్ ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు. ఈ వ్యవహారంలో రెవెన్యూ సిబ్బంది పాత్ర ఉందా.. ఇవి ఫోర్జరీ సర్టిఫికెట్లా ? నకిలీలలు కేవలం లోయపల్లి గ్రామానికే పరిమితమయ్యాయా? ఇతర గ్రామాల్లో కూడా చోటుచేసుకున్నాయా అనే కోణంలో విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. దీనికోసం డిప్యూటీ కలెక్టర్‌ను విచారణాధికారిగా నియమించనున్నట్లు తెలిపారు. -
పాడిరైతుకు ‘కొత్త’ కానుక
భువనగిరి, న్యూస్‌లైన్: పాల సేకరణ ధరను బుధవారం నుంచి పెంచుతున్నట్టు నల్లగొండ-రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ, సహకార సంఘం (నార్మాక్) చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి తెలిపారు. ఇది పాడి రైతులకు నూతన సంవత్సర కానుక అని ఆయన చెప్పారు. భువనగిరి మిల్క్ చిల్లింగ్ సెంటర్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాణ్యమైన గేదెపాలు లీటరుకు రూ.46 నుంచి రూ.50కి, ఆవుపాల ధర రూ. 21.97 నుంచి రూ.23.22కు పెంచినట్లు జితేందర్‌రెడ్డి చెప్పారు. ఎన్నో ఒడిదొడుకులు ఎదురవుతున్నా రైతుల ప్రయోజనమే ధ్యేయంగా నార్మాక్ ముందుకు సాగుతోందన్నారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటూ, సంక్షేమ పథకాలను అందిస్తోందన్నారు. ప్రైవేట్ డెయిరీల పోటీని తట్టుకుంటూ ఎల్లకాలం రైతులకు అందుబాటులో ఉండి సేవలందించే సంస్థ నార్మాక్ మాత్రమేనని ఆయన స్పష్టంచేశారు. ప్రస్తుతం కరెంట్ చార్జీలు, ఉద్యోగుల జీతాలు, డీజిల్ చార్జీలు పెరిగినా అనవసరపు ఖర్చులను తగ్గించుకుని రైతులకు అధిక రేటు చెల్లిస్తున్నామన్నారు. గతంలో రైతుల నుంచి సేకరించిన రూపాయి కన్వర్షన్ చార్జీలు సుమారు రూ.2 కోట్ల 11 లక్షలను సంక్రాంతి నుంచి సుమారు 60మంది రైతులకు చెల్లిస్తామని తెలిపారు. ప్రస్తుతం లక్షా యాభైవేల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు. ఇందులో కేవలం లక్ష లీటర్ల పాలను మాత్రమే అమ్ముతున్నామని, మిగతా పాలతో ఇతర ఉత్పత్తులు తయారు చేసి విక్రయిస్తున్నామని ఆయన చెప్పారు. ఇందులో మిల్క్ కేక్, కర్డ్కప్స్, బట్టర్‌మిల్క్, పన్నీర్, వెన్న, నెయ్యి తయారు చేసి అమ్ముతున్నట్లు చెప్పారు. తమ డీలర్లతో పాటు, అన్ని మిల్క్ చిల్లింగ్ సెంటర్లలో వీటిని అమ్మకానికి పెడుతున్నట్లు చెప్పారు. శుభకార్యాలకు ఆర్డర్లపై పెరుగును సరఫరా చేయనున్నట్లు వివరించారు. విలేకరుల సమావేశంలో సంస్థ ఎండీ సురేష్‌బాబు, జీఎం రమేష్, డెరైక్టర్లు కాయితి వెంకట్‌రెడ్డి, పి. భూపాల్‌రెడ్డి, చిన్నన ర్సింహారెడ్డి, ఎన్. భిక్షపతి, శ్రీశైలం, పట్నం అమరేందర్ పాల్గొన్నారు. -
13ఏళ్ల బాలికపై ఆరునెలలుగా అత్యాచారం
హైదరాబాద్: నగరంలో కీచకుల పరంపర కొనసాగుతోంది. బాలికలపై అత్యాచార ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఒకవైపు అత్యాచారాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరిస్తున్న అత్యాచార ఘటనలు ఆగడం లేదు. నిర్భయ, అభయ వంటి చట్టాలున్న కామాంధుల ఆగడాలకు కళ్లెం వెయ్యలేని పరిస్థితి నెలకొంది. ఇష్టారాజ్యంగా వీరు చిన్నారులపై అత్యాచారాలకు తెగబడుతున్నారు. కామాంధుల కబంధహస్తాలలో చిన్నారులు నలిగిపోతున్నారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట నిత్యం వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ 13ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లాలోని యాలాల్ మండలం దౌలాపూర్‌లో ఆదివారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లాలో బాలికపై జగదీష్ అనే వ్యక్తి ఆరునెలలుగా అత్యాచారం చేస్తున్నాడు. ఆ బాలిక ఇంటి ప్రక్కనే ఉంటున్న జగదీష్ రోజూ ఆ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడేవాడు. అత్త సాయంతో ఆ నిందితుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఈ విషయాన్ని ఇంట్లో చెబితే కుటుంబీకులను చంపుతానని జగదీష్ బెదరించడంతో ఆ చిన్నారి భయపడి చెప్పలేదు. దీంతో ఆ బాలిక ప్రస్తుతం నాలుగు నెలల గర్భాన్ని దాల్చింది. గత మూడు రోజులుగా బాలిక తీవ్ర కడుపునొప్పి అనడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యుడు బాలిక గర్భవతిని చెప్పడంతో తల్లిదండ్రులు నివ్వెరపోయారు. తన కూతురిపై జరిగిన ఈ ఘటనపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి అత్తను అరెస్టు చేశారు. నిర్భయ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, పరారీలో నిందితుడు జగదీష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
నిధుల వేటలో మృత్యు ఒడికి..
వి. బొంతిరాళ్ల (డోన్‌టౌన్), న్యూస్‌లైన్: రంగారెడ్డి జిల్లా పాలమాకుల గ్రామానికి చెందిన బుర్రనాగరాజు(25), రమాదేవి (23) అన్నాచెల్లెళ్లు. రమాదేవి జ్యోతిష్యం చెప్పేవారు. పూజలు కూడా చేస్తుండటంతో పలువురికి ఈమె పరిచయం అయ్యారు. ఈమె అన్న నాగరాజు హైదరాబాద్‌లోని కింగ్‌కోటి కామినేని ఆసుపత్రిలో ల్యాబ్‌టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. డోన్, హైదరాబాద్‌తో పాటు తదితర ప్రాంతాలకు చెందిన గుప్తనిధుల ముఠా సభ్యులు.. జ్యోతిష్యం చెప్పే రమాదేవి గురించి విన్నారు. ఆమె అన్న నాగరాజుకు అత్యంత సన్నిహితుడైన హైదరాబాద్ అంబర్‌పేటకు చెందిన కరాటే మాస్టర్ రాధాక్రిష్ణను సంప్రదించారు. ఎలాగైనా రమాదేవిని ఒప్పించాలని, తమ ప్రాంతంలోని కోట్ల రూపాయలు విలువ చేసే గుప్త నిధుల రహస్యం చెప్పాలని పట్టుబట్టారు. నిధుల రహస్యం చెబితే లభించే ఆదాయంలో ఒక వంతు భాగాన్ని ఇస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు నాగరాజు, రమాదేవిలు అంగీకరించి బుధవారం మధ్యాహ్నం తమ స్వగ్రామమైన పాలమాకుల నుంచి ప్రెస్ స్టిక్కర్ ఉన్న కారులో డోన్‌కు వచ్చారు. కర్నూలు నుంచి జేసీబీని తెచ్చిన ముఠా సభ్యులు వీరిని వెంటబెట్టుకొని బుధవారం అర్ధరాత్రి బొంతిరాళ్ల గ్రామ శివార్లలోని కంది పొలాల్లోకి వెళ్లారు. తమతో తెచ్చుకున్న పూలు, నిమ్మకాయలు, టెంకాయలు తదితర వాటితో పూజలు చేసి జేసీబీతో నిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. శబ్దం రావడంతో సమీప పొలాల్లోని రైతులు సెల్ఫోన్ల ద్వారా ఈ విషయాన్ని గ్రామస్తులకు చేరవేశారు. గ్రామస్తులందరూ తలోదిక్కున ఘటన స్థలానికి టార్చిలైట్లతో చేరుకున్నారు. మూకుమ్మడిగా గుప్త నిధుల ముఠా సభ్యులను చుట్టుముట్టి కేకలు వేయడంతోపాటు జేసీబీపై రాళ్లురువ్వారు. దీంతో హడలెత్తిపోయిన ముఠాసభ్యులు పరారయ్యేందుకు పరుగులు తీశారు. డ్రైవర్ భయంతో ఇష్టానుసారంగా జేసీబీని తిప్పారు. దీంతో గట్టుకింద నక్కిఉన్న నాగరాజు, రమాదేవిలకు జేసీబీ తగిలి బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. సుమారు గంటన్నర పాటు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియని అయోమయం ఏర్పడింది. తర్వాత గ్రామస్తులు గాలించగా రమాదేవి, నాగరాజుల మృతదేహాలు బయటపడ్డాయి. అదే ప్రాంతంలో నక్కి ఉన్న కరాటే మాస్టర్ రాధాక్రిష్ణను గ్రామస్తులు పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారు. పోలీసుల అదుపులో ముఠా...? ముఠా సభ్యుల్లో.. హైదరాబాద్‌కు చెందిన సుభాష్‌రెడ్డి, నాగేశ్వరరెడ్డి, రాధాక్రిష్ణన్, లక్ష్మారెడ్డి, డోన్‌కు చెందిన ఆంజనేయులుగౌడ్, కోయిలకొండ రాజు, నందికొట్కూరుకు చెందిన విజయుడు, ఓర్వకల్లుకు చెందిన జేసీబీ డ్రైవర్ రవికుమార్, రుద్రవరానికి చెందిన కారు డవ్రైర్ సుంకన్న, కొలిమిగుండ్లకు చెందిన హుస్సేన్‌లు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. దత్త బిడ్డను దారుణంగా చంపారు: తల్లిదండ్రులు పాలమాకుల చెందిన కూలీ నరసింహకు రమాదేవి కుమార్తె. అయితే పదేళ్ల క్రితం షంషాబాద్‌లో నివాసముండే సోదరుడు శ్రీనివాస్, లతల దంపతుల ఇంటికి ఆమె దత్తత వెళ్లింది. శ్రీనివాస్, లతలకు అప్పటికే కుమారుడు నాగరాజు ఉన్నాడు. రమాదేవిని సొంత కూతురిలా పెంచి పోషిస్తూ వచ్చారు. అల్లారుముద్దుగా పెంచుకున్న తన బిడ్డ రమాదేవిని గుప్త నిధుల కోసం తెచ్చి ఉద్దేశపూర్వకంగానే బలిచ్చారని తల్లిదండ్రులు శ్రీనివాసులు, లతలు ఆరోపించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ బిడ్డలను పొట్టన పెట్టుకున్న నిధుల ముఠాను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. రమాదేవి డైరీలో ఏముంది...:? మృతి చెందిన రమాదేవి, నాగరాజుల వ్యక్తిగత డైరీలో ఏముందన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. మృతుల వద్ద ఉన్న నగదుతో పాటు, డైరీని స్వాధీనం చేసుకున్న పోలీసులు వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. మృతుల డైరీలో వారు ఎప్పుడెప్పుడు ఎవ్వరిని కలిసింది. వారితో ఎవ్వరు సంభాషించారు. ఎవ్వరితో కలిసి ప్రయాణం చేస్తున్నారు. గతంలో గుప్త నిధుల కోసం ఎవ్వరితోనైనా ఒప్పందం కుదుర్చుకున్నారా లాంటి రహస్యాలు డైరీలో పొందుపరిచినట్లు సమాచారం. కీలకంగా వ్యవహరించే కొందరు వ్యక్తులు సైతం మృతులకు పరిచయం ఉన్నట్లు తెలిసింది. ఏది ఏమైనప్పటికీ డైరీతో బేరీజు వేసుకొని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడితే గుప్త నిధులకు సంబంధించి మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. నాడే చెప్పిన ‘సాక్షి’ డోన్ మండల పరిధిలోని బొంతిరాళ్లతో పాటు పలు ప్రాంతాలలో గుప్త నిధుల కోసం కొందరు ముమ్మరంగా అన్వేషిస్తున్నారన్న నవంబర్ 1వ తేదీన సాక్షిలో ‘బొంతిరాళ్లలో గుప్త నిధుల వేట’ అనే కథనం ప్రచురితమైంది. హైదరాబాద్, డోన్‌కు చెందిన కొందరు గోల్డ్స్కానర్లతో నిధులను అన్వేషించే ప్రక్రియలో నిమగ్నమయ్యారని అందులో తెలిపింది. ఈ నేపథ్యంలో పూజలు జరిపించి నిధులను కాజేసే ప్రయత్నంలో గురువారం ఇద్దరు మృతి చెందారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గుప్త నిధుల ముఠాలపై నిఘాను కేంద్రీకృతం చేసి తగు చర్యలు తీసుకోవాల్సి ఉంది.