సంఘటనాస్థలంలో నుజ్జునుజ్జు అయిన వాహనాలు
నందిగామ: రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిధిలోని హైదరాబాద్–బెంగళూరు 44వ జాతీయ రహదారిపై శనివారం ఉదయం దట్టమైన పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదం జరిగింది. వాహనాల డ్రైవర్లకు దారి కనబడని పరిస్థితి నెలకొంది. దీంతో షాద్‌నగర్ నుంచి హైదరాబాద్ వైపునకు వెళ్తున్న ఓ కారు ముందుగా వెళ్తున్న మరో కారును ఢీకొని అక్కడే ఆగిపోయింది. దాని వెనకాలే వస్తున్న కార్లు, లారీలు, బస్సులు ఒకదానికి మరొకటి వరుసగా 16 వాహనాలు ఢీకొన్నాయి.
దీంతో పది కార్లు, రెండు బస్సులు, నాలుగు లారీలు దెబ్బతిన్నాయి. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. వరుస ప్రమాదాలతో ఒక్కసారిగా ట్రాఫిక్‌జాం ఏర్పడింది. దీంతో స్థానిక పోలీసులు వాహనాలను పాత జాతీయ రహదారి మీదుగా మళ్లించగా నందిగామ గ్రామంలోంచి పాత జాతీయ రహదారిపై వాహనాలు వెళ్లడంతో అక్కడా వాహనాల సంఖ్య పెరిగి ట్రాఫిక్‌జాం అయింది. సుమారు గంట అనంతరం ట్రాఫిక్ క్లియర్ కావడంతో వాహనదారులు ఊపిరిపీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment