
ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే అమ్మకానికి ఉన్న టయోటా క్రూయిజర్ హైరైడర్.. ఇప్పుడు మరికొన్ని కొత్త ఫీచర్లతో దేశీయ విఫణిలో అడుగుపెట్టింది. ఈ విషయాన్ని టయోటా కిర్లోస్కర్ మోటర్స్ వెల్లడించింది.
సరికొత్త టయోటా క్రూయిజర్ హైరైడర్ ఇప్పుడు.. ఆరు ఎయిర్‌బ్యాగ్స్ పొందుతుంది. ఈ సేఫ్టీ ఫీచర్ అన్ని వేరియంట్లలోనూ అందుబాటులో ఉందని కంపెనీ స్పష్టం చేసింది. అంతే కాకుండా ఏడబ్ల్యూడీ వేరియంట్‌లో 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ స్థానంలో 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, నిర్దిష్ట వేరియంట్స్‌లో ఎల్రక్టానిక్ పార్కింగ్ బ్రేక్ ప్రవేశపెట్టినట్లు వివరించింది.
కొత్త ఫీచర్లతో ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ప్రారంభ ధర రూ. 11.34 లక్షలు (ఎక్స్ షోరూమ్). అయితే ఈ కొత్త కారు డిజైన్, ఫీచర్స్, ఇంజిన్ ఆప్షన్లలో ఎటువంటి మార్పులు లేదు. కాబట్టి ఈ కారు అదే పనితీరును అందిస్తుందని తెలుస్తోంది.