మెర్సిడెస్ బెంజ్ ఇండియా భారతీయ మార్కెట్లో కొత్త 'మేబ్యాచ్ ఈక్యూఎస్' ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ధర రూ.2.25 కోట్లు (ఎక్స్ షోరూమ్). 'లోటస్ ఎలెట్రే' ఎలక్ట్రిక్ కారు తరువాత అత్యంత ఖరీదైన కారుగా మెర్సిడెస్ మేబ్యాచ్ ఈక్యూఎస్ నిలిచింది.
కొత్త మెర్సిడెస్ బెంజ్ మేబ్యాచ్ ఈక్యూఎస్ ఎలక్ట్రిక్ కారు.. బ్లాక్ గ్రిల్ ప్యానెల్ పొందుతుంది. బానెట్ మీద బ్రాండ్ లోగో, డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్ అన్నీ కూడా ఇక్కడ చూడవచ్చు. హెడ్ లైట్, టెయిల్ లైట్ అన్నీ కూడా స్టాండర్డ్ మోడల్స్ మాదిరిగా ఉన్నాయి. 11.6 ఇంచెస్ ట్రిపుల్ స్క్రీన్ డిస్‌ప్లే కలిగిన బెంజ్ ఈక్యూఎస్.. ముందు సీట్ల వెనుక భాగంలో కూడా 11.6 ఇంచెస్ డిస్‌ప్లే కూడా ఉంది. కప్ హోల్డర్లు, నాలుగు యూఎస్బీ-సీ పోర్ట్స్, కూలింగ్ కంపార్ట్మెంట్స్ మొదలైనవన్నీ ఇందులో చూడవచ్చు.
మెర్సిడెస్ బెంజ్ మేబ్యాచ్ ఈక్యూఎస్ 680 ట్రిమ్‌లో మాత్రమే లభిస్తుంది. ఇది డ్యూయెల్ ఎలక్ట్రిక్ మోటార్ సెటప్ పొందుతుంది. ఇది 658 హార్స్ పవర్, 950 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ కారు 4.4 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ 210 కిమీ. ఇది ఒక ఫుల్ చార్జితో 611 కిమీ రేంజ్ అందిస్తుంది.
ఇదీ చదవండి: ట్యాక్స్ తక్కువ, నిరుద్యోగ నిధి.. చిన్న దేశంలో బెంగళూరు జంట
మెర్సిడెస్ బెంజ్ మేబ్యాచ్ ఈక్యూఎస్ కారులోని 122 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ 31 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జ్ అవుతుంది. ఈ కారు 20 నిమిషాల చార్జితో 300 కిమీ ప్రయాణించడానికి కావాల్సిన ఛార్జ్ చేసుకుంటుంది. ఈ కారుకు ప్రస్తుతం దేశీయ విఫణిలో ప్రధాన ప్రత్యర్థులు లేదు.
Comments
Please login to add a commentAdd a comment