మహీంద్రా అండ్ మహీంద్రా దేశీయ మార్కెట్లో రెండు ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేసింది. ఒకటి 'బీఈ 6ఈ', మరొకటి 'ఎక్స్ఈవీ 9ఈ'. వీటి ప్రారంభ ధరలు వరుసగా రూ.18.90 లక్షలు, రూ.21.90 లక్షలు (ఎక్స్ షోరూమ్). కంపెనీ ఈ కార్లను 2025 మార్చిలో డెలివరీ చేయనున్నట్లు సమాచారం.
మహీంద్రా కంపెనీ లాంచ్ చేసిన ఈ రెండు కొత్త ఎలక్ట్రిక్ కార్లు చూడటానికి కొంత భిన్నమైన డిజైన్ పొందుతాయి. ఎందుకంటే ఈ రెండూ INGLO ఆర్కిటెక్చర్ ఆధారంగా నిర్మితమయ్యాయి. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా తయారైన వాహనాలు ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తాయి. కాబట్టి మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ కార్లు లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ పొందుతాయి.
XEV 9e ఒక స్పోర్టి కూపే డిజైన్ పొందుతుంది. త్రిభుజాకార ఎల్ఈడీ హెడ్‌లైట్‌లు, విస్తృతమైన ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు, కూపే స్టైల్ రూఫ్‌లైన్ వంటివి ఇందులో చూడవచ్చు. ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌ల మధ్యలో.. ప్రకాశవంతమైన మహీంద్రా లోగో మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కారులో 12.3 ఇంచెస్ డిస్‌ప్లేలతో కూడిన ట్రిపుల్-స్క్రీన్ సెటప్ ఉంటుంది. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్రైవర్ డిస్‌ప్లే, లేటెస్ట్ కనెక్టివిటీ ఫీచర్లతో పాటు.. ట్విన్-స్పోక్ స్టీరింగ్ వీల్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, 16 స్పీకర్ ఆడియో సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, ఏడీఏఎస్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
BE 6e షార్ప్ క్యారెక్టర్ లైన్‌లు, హుడ్ స్కూప్‌తో కూడిన పాయింటెడ్ హుడ్, సీ షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్, స్ట్రీమ్‌లైన్డ్ బంపర్‌ను కలిగి ఉంది. ఈ కారు ఏరోడైనమిక్ 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్.. ఇల్యూమినేటెడ్ బీఈ లోగో వంటివి దీనిని కొత్తగా చూపిస్తాయి. ఇందులో ట్విన్-స్క్రీన్ ర్యాప్‌రౌండ్ డిస్‌ప్లే ఉంటుంది. ఇందులో కూడా 16 స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్, ఆటోమేటిక్ పార్కింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, ఏడీఏఎస్ వంటివి ఉన్నాయి.
బీఈ 6ఈ, ఎక్స్ఈవీ 9ఈ రెండూ.. 59 కిలోవాట్, 79 కిలోవాట్ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీలు ఉంటాయి. 59 kWh బ్యాటరీ 450 నుంచి 500 కిమీ రేంజ్.. 79 kWh బ్యాటరీ 650 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఇవి రెండూ ఏసీ ఛార్జర్‌కు మాత్రమే కాకుండా డీసీ ఫాస్ట్ ఛార్జర్‌కు సపోర్ట్ చేస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment