భారతీయ మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ తన ఈక్యూఎస్ ఎస్‌యూవీ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త లగ్జరీ కారు ప్రారంభ ధర రూ. 1.41 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా రూ. 2 లక్షలు ఎక్కువ ఖరీదు.
బీఎండబ్ల్యూ ఐఎక్స్, ఆడి క్యూ8 ఈ-ట్రాన్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉండే కొత్త మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ అప్డేటెడ్ డిజైన్ పొందుతుంది. కాబట్టి.. ఇది ఒక బ్లాంక్డ్ ఆఫ్ బ్లాక్ ప్యానెల్ గ్రిల్ పొందుతుంది. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ ముందు భాగంలో విస్తరించి ఉన్న లైట్‌బార్‌కు కనెక్ట్ అయి ఉంటుంది. వెనుక భాగంలో కూడా ఎల్ఈడీ టెయిల్ లాంప్ ఉంటుంది.
విలాసవంతమైన క్యాబిన్ కలిగిన ఈ కారు 12.3 ఇంచెస్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 17.7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3 ఇంచెస్ ఫ్రంట్ ప్యాసింజర్ స్క్రీన్‌తో కూడిన హైపర్‌స్క్రీన్ సెటప్ పొందుతుంది. వీటితో పాటు ఫైవ్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఇల్యూమినేటెడ్ రన్నింగ్ బోర్డులు, 15 స్పీకర్ బర్మెస్టర్ సౌండ్ సిస్టమ్ కూడా ఉన్నాయి.
ఇదీ చదవండి: పీఎం సోలార్ రూఫ్‌టాప్ స్కీమ్: 20 లక్షల ఉద్యోగాలు!
కొత్త మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 122 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్ సెటప్ ద్వారా మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ కలిగిన ఈ కారు 4.7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇది ఒక ఫుల్ చార్జితో 809 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment