గురుగ్రామ్: ఆటోమొబైల్స్ సంస్థ జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తాజాగా ’ఎంజీ విండ్సర్’ పేరిట ఎలక్ట్రిక్ యుటిలిటీ వాహనాన్ని ఆవిష్కరించింది. దీని ధర రూ. 9.9 లక్షలు కాగా కి.మీ.కు రూ. 3.5 చొప్పున బ్యాటరీ అద్దె ఉంటుంది. ఇందుకోసం బ్యాటరీ–యాజ్–ఎ–సర్వీస్ (బీఏఏఎస్)ను అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది.
ఒకసారి చార్జ్ చేస్తే దీని రేంజ్ 331 కిలోమీటర్లు ఉంటుంది. ఏదైనా డీసీ ఫాస్ట్ చార్జర్‌తో విండ్సర్‌ను 40 నిమిషాల్లో చార్జ్ చేయొచ్చు. ఎంజీ ఈ–హబ్ ద్వారా ఏడాది పాటు ఉచితంగా పబ్లిక్ చార్జింగ్ సదుపాయాన్ని పొందవచ్చని సంస్థ తెలిపింది. బుకింగ్స్ అక్టోబర్ 3 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది.
ఎంజీ మోటార్ ఇండియాలో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ప్రవేశపెట్టిన తొలి వాహనం విండ్సర్. తాము న్యూ ఎనర్జీ వెహికల్ (ఎన్‌ఈవీ) విభాగంపై మరింతగా దృష్టి పెట్టనున్నట్లు కంపెనీ డైరెక్టర్ పార్థ్ జిందాల్ తెలిపారు. ప్రతి 4–6 నెలల వ్యవధిలో ఒక కొత్త కారును ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment