ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్రవాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ (Hero MotoCorp).. న్యూ డెస్టినీ 125 (New Destini 125) స్కూటర్‌ను విడుదల చేసింది. దీంతో 125సీసీ స్కూటర్ మార్కెట్‌లో విస్తృత మార్పులకు శ్రీకారం చుట్టింది. అత్యాధునిక సాంకేతికత, అసాధారణమైన మైలేజ్, టైమ్‌లెస్ డిజైన్‌ను మిళితం చేస్తూ పట్టణ వాహనదారుల కోసం దీన్ని రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది.
హీరో న్యూ డెస్టినీ 125 స్కూటర్.. డెస్టిని 125 వీఎక్స్, డెస్టిని 125 జెడ్‌ఎక్స్, డెస్టిని 125 జెడ్‌ఎక్స్ ప్లస్ అనే మూడు వేరియంట్‌లలో లభిస్తుంది. వీటి ప్రారంభ ధరలు (ఢిల్లీ ఎక్స్-షోరూమ్) వరుసగా రూ.80,450, రూ.89,300, రూ.90,300.
ప్రత్యేకంగా పట్టణ వాహనదారుల అవసరాలను తీర్చడానికి రూపొందించిన న్యూ డెస్టినీ 125.. వాహనదారుల భద్రత, సౌలభ్యం కోసం 30 పేటెంట్ అప్లికేషన్‌లతోపాటు ఇల్యూమినేటెడ్ స్టార్ట్ స్విచ్‌లు, ఆటో-కాన్సల్ వింకర్‌ల వంటి సరికొత్త ఫీచర్‌లతో వచ్చింది.
‘హీరో డెస్టిని 125 అనేది మా ఆవిష్కరణ-ఆధారిత విధానానికి, పర్యావరణ అనుకూల చైతన్యాన్ని అందించడంలో మా నిబద్ధతకు నిదర్శనం. 59 కి.మీ మైలేజ్, అధునాతన ఫీచర్లతో ఈ స్కూటర్ ఆధునిక రైడర్‌లకు గేమ్-ఛేంజర్’ హీరో మోటోకార్ప్ ఇండియా బిజినెస్ యూనిట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రంజీవ్‌జిత్ సింగ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment