ప్రముఖ విద్యుత్ ద్విచక్రవాహన సంస్థ ఓలా (Ola) తమ మూడో తరం ఎలక్ట్రిక్ స్కూటర్ శ్రేణిని భారత్ మార్కెట్లో తాజాగా విడుదల చేసింది. వీటిలో ఎంట్రీ-లెవల్ మోడల్ ధర రూ.79,999 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమై అగ్రశ్రేణి వేరియంట్ ధర రూ.1,69,999 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఈ శ్రేణిలో ఎస్1 ప్రో (S1 Pro), ఎస్1 ప్రో+ (S1 Pro+), ఎస్1 ఎక్స్ (S1 X), ఎస్1 ఎక్స్+ (S1 X+) ఉన్నాయి.
పేటెంట్ పొందిన 'బ్రేక్ బై వైర్' సాంకేతికతను ఓలా Gen 3 లైనప్‌కు జోడించింది. ఈ సిస్టమ్ బ్రేక్ ప్యాడ్, మోటర్ నిరోధకతను సమతుల్యం చేయడానికి బ్రేక్ లివర్‌పై సెన్సార్లను ఉపయోగిస్తుంది. ఇది రేంజ్‌ను 15% పెంచడమే కాకుండా బ్రేక్ ప్యాడ్ మన్నికను రెట్టింపు చేస్తుంది. ఇక మెరుగైన భద్రత కోసం ప్రతి స్కూటర్లోనూ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) అమర్చారు.
బ్యాటరీ ఆప్షన్స్.. రేంజ్
ఓలా మూడో తరం స్కాటర్లలో వివిధ బ్యాటరీ ఎంపికలు ఉన్నాయి. ఎస్1 ప్రో మోడల్ 3kWh, 4kWh బ్యాటరీలను కలిగి ఉంటుంది. ప్రో+ వేరియంట్ 4kWh, 5.3kWh బ్యాటరీ ప్యాక్‌లను అందిస్తుంది. ఇక ఎంట్రీ-లెవల్ ఎస్1 ఎక్స్ 2kWh, 3kWh, 4kWh బ్యాటరీ ఎంపికలతో అందుబాటులో ఉంది. అయితే ఎస్1 ఎక్స్+ మాత్రం ప్రత్యేకంగా 4kWh బ్యాటరీతో వస్తుంది. ఫ్లాగ్షిప్ ఎస్1 ప్రో+ మోడల్ 320 కిమీ రేంజ్‌ని, 141 కి.మీ.గరిష్ట వేగాన్ని అందిస్తుందని కంపెనీ పేర్కొంది.
ధరలు
మోడల్ | బ్యాటరీ కెపాసిటీ | ధర |
---|---|---|
ఓలా ఎస్1 ఎక్స్ | 2 kWh | రూ.79,999 |
ఓలా ఎస్1 ఎక్స్ | 3 kWh | రూ.89,999 |
ఓలా ఎస్1 ఎక్స్ | 4 kWh | రూ.99,999 |
ఓలా ఎస్1 ఎక్స్+ | 4 kWh | రూ.1,07,999 |
ఓలా ఎస్1 ప్రో | 3 kWh | రూ.1,14,999 |
ఓలా ఎస్1 ప్రో | 4 kWh | రూ.1,34,999 |
ఓలా ఎస్1 ప్రో+ | 4 kWh | రూ.1,54,999 |
ఓలా ఎస్1 ప్రో+ | 5.3 kWh | రూ.1,69,999 |
Comments
Please login to add a commentAdd a comment