
ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కంపెనీలలో ఒకటైన 'నిస్సాన్' (Nissan) మరో రెండు కార్లను లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇందులో ఒకటి 5 సీటర్, మరొకటి 7 సీటర్. వీటిని కంపెనీ 2026లో దేశీయ విఫణిలోకి ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.
జపాన్‌లోని యోకోహామాలో ఇటీవల ముగిసిన గ్లోబల్ ప్రొడక్ట్ షోకేస్ ఈవెంట్‌లో నిస్సాన్ కంపెనీ భారతదేశం కోసం తీసుకురానున్న రెండు కొత్త ఉత్పత్తులను ప్రదర్శించింది. దీన్ని బట్టి చూస్తే.. ఇండియన్ మార్కెట్లో తన హవా కొనసాగించడానికి సంస్థ తయారవుతున్నట్లు తెలుస్తోంది.

నిస్సాన్ కంపెనీ ఈ రెండు కార్లను భారతదేశంలో అధికారికంగా 2026లో ప్రారంభించనుంది. ఇవి రెండూ.. ఇప్పుడున్న బ్రాండ్ మోడల్స్ కంటే భిన్నంగా.. ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చే విధంగా ఉంటాయని తెలుస్తోంది. కాగా ఈ కార్లకు సంబంధించిన చాలా వివరాలు వెల్లడికావాల్సి ఉంది. అయితే వీటిని కంపెనీ ప్రత్యేకించి ఇండియన్ మార్కెట్ కోసం డిజైన్ చేస్తోంది, కాబట్టి ఇవి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయని తెలుస్తోంది.
ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో నిస్సాన్ కేవలం ఒక కారును (మాగ్నైట్) మాత్రమే విక్రయిస్తోంది. ఇది ప్రారంభం నుంచి 1.70 లక్షల కంటే ఎక్కువ సేల్స్ పొందింది. దీని ధర రూ. 6.14 లక్షల నుంచి రూ. 11.92 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. డిజైన్, ఫీచర్స్ అద్భుతంగా ఉన్నాయి. పనితీరు కూడా ఉత్తమంగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment