Nissan india
-
హోండా, నిస్సాన్ విలీనం
టోక్యో: జపాన్ ఆటోమొబైల్ దిగ్గజాలు హోండా, నిస్సాన్ విలీనం కానున్నట్లు ప్రకటించాయి. ఇందుకు సంబంధించి ఇరు సంస్థలు ఒక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. నిస్సాన్‌కు వాటాలున్న మిత్సుబిషి మోటార్స్ కూడా తన వ్యాపారాన్ని విలీనం చేసే చర్చల్లో భాగమయ్యేందుకు అంగీకరించినట్లు కంపెనీలు వెల్లడించాయి. ఈ డీల్‌తో విలీన సంస్థ.. అమ్మకాలపరంగా ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆటోమొబైల్ కంపెనీగా ఆవిర్భవించనుంది. ఫ్రాన్స్‌కు చెందిన రెనోతో భాగస్వామ్యం, అలాగే మిత్సుబిషి మోటార్స్ కార్ప్‌లతో కలిసి హోండా, నిస్సాన్ కూటమి.. జపాన్‌కే చెందిన ఆటోమొబైల్ దిగ్గజం టయోటా మోటర్ కార్ప్, జర్మనీకి చెందిన ఫోక్స్వ్యాగన్లతో పోటీ పడనుంది. విలీనం అమల్లోకి వస్తే మరింత పెద్ద స్థాయిలో కస్టమర్లకు చేరువయ్యేందుకు తోడ్పడగలదని నిస్సాన్ సీఈవో మకొటొ యుషిడా తెలిపారు. ఇటీవలే హోండా, నిస్సాన్ విలీన వార్తలు రావడం తెలిసిందే. ఆటోమొబైల్ పరిశ్రమ క్రమంగా శిలాజ ఇంధనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలు, స్వయంచాలిత టెక్నాలజీల వైపు మళ్లుతున్న తరుణంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.50 బిలియన్ డాలర్ల దిగ్గజం..: మూడు కంపెనీల కలయికతో 50 బిలియన్ డాలర్ల పైగా మార్కెట్ విలువ గల దిగ్గజ సంస్థ ఏర్పాటవుతుంది. వీటి వార్షిక వాహనాల ఉత్పత్తి పరిమాణం 80 లక్షలు ఉంటుంది. 2023లో హోండా 40 లక్షలు, నిస్సాన్ 34 లక్షలు, మిత్సుబిషి మోటర్స్ దాదాపు 10 లక్షల వాహనాలను ఉత్పత్తి చేశాయి. అయితే ఈ మూడూ కలిసినా కూడా ఉత్పత్తిపరంగా టయోటానే అగ్రగామిగా కొనసాగనుంది. 2023లో టయోటా మొత్తం 1.15 కోట్ల వాహనాల తయారీతో టాప్‌లో ఉంది. ఫోక్స్‌వ్యాగన్ సుమారు 89 లక్షల వాహనాల ఉత్పత్తితో రెండో స్థానంలో నిల్చింది. ప్రస్తుతం దాదాపు 68 లక్షల వాహనాలతో (కియా, జెనెసిస్ బ్రాండ్లతో కలిసి) దక్షిణ కొరియా సంస్థ హ్యుందాయ్ మూడో స్థానంలో ఉంది. ప్రయోజనాలేమిటంటే.. ఒకవైపు వాహన కంపెనీలు శిలాజ ఇంధనాల వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లేందుకు తంటాలు పడుతుండగా మరోవైపు చైనా కంపెనీలు కొత్త టెక్నాలజీల విషయంలో దూసుకెళ్తుండటం పరిశ్రమను కుదిపేస్తోంది. చైనాకు చెందిన బీవైడీ, గ్రేట్ వాల్, నియో వంటి చౌక ప్రత్యామ్నాయ ఎలక్ట్రిక్ వాహనాలు.. జపాన్, అమెరికన్ కార్ల కంపెనీల మార్కెట్ వాటాను కొల్లగొడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పరిశ్రమలో కన్సాలిడేషన్ చోటుచేసుకుంటున్నట్లు పరిశ్రమల వర్గాలు తెలిపాయి. ఆరి్థక సమస్యలు, తగ్గుతున్న లాభదాయకతతో నిస్సాన్ సతమతమవుతోంది. చైనాలో అమ్మకాల బలహీన తతో హోండా లాభాలపైనా ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో విలీనం చోటు చేసుకుంటోంది. 2023లో జరిగిన అమ్మకాల పరంగా టాప్ 10 అతిపెద్ద వాహన తయారీదారుల జాబితాటయోటా - 10.3 మిలియన్ వాహనాలువోక్స్ వ్యాగన్ గ్రూప్ - 9.2 మిలియన్ వాహనాలుహ్యుందాయ్ మోటార్ గ్రూప్ - 7.3 మిలియన్ వాహనాలుస్టెలాంటిస్ - 6.4 మిలియన్ వాహనాలుజనరల్ మోటార్స్ - 6.2 మిలియన్ వాహనాలుఫోర్డ్ మోటార్ కంపెనీ - 4.4 మిలియన్ వాహనాలుహోండా - 4.2 మిలియన్ వాహనాలునిస్సాన్ - 3.4 మిలియన్ వాహనాలు(నోట్: విలీన ప్రక్రియ పూర్తైతే హోండా, నిస్సాన్ కలిపి అమ్మకాల్లో టాప్ 3 కంపెనీ అవతరించినట్లువుతుంది.)బీఎండబ్ల్యూ గ్రూప్ - 2.6 మిలియన్ వాహనాలుమెర్సిడెస్ బెంజ్ - 2.5 మిలియన్ వాహనాలు -
అమ్మకాల్లో అదరగొట్టిన నిస్సాన్: ఏకంగా..
నిస్సాన్ ఇండియా అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. మార్కెట్లో 5 లక్షల కార్లను విక్రయించినట్లు కంపెనీ వెల్లడించింది. సంస్థ 2010లో తన కార్యకలాపాలను ప్రారంభించినప్పటి నుంచి మొత్తం 5,13,241 యూనిట్ల సేల్స్ సాధించింది. నవంబర్ 2024లో నిస్సాన్ 9,040 యూనిట్ల కార్లను విక్రయించింది. ఇందులో దేశీయ విక్రయాలు 2,342 యూనిట్లు కాగా.. ఎగుమతులు 6,698 యూనిట్లు. గత ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాది కంపెనీ సేల్స్ గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది.నిస్సాన్ కంపెనీ అమ్మకాలు పెరగటానికి మాగ్నైట్ ప్రధాన కారణం. రూ. 6 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధర వల్ల లభించే ఈ కారును చాలామంది కస్టమర్లు ఇష్టపడి కొనుగోలు చేశారు. ఇది ప్రస్తుతం ఎక్స్-ట్రైల్‌తో పాటు అమ్ముడవుతోంది.ఇదీ చదవండి: ట్రైన్ ఆలస్యమైతే.. అవన్నీ ఫ్రీ: రీఫండ్ ఆప్షన్ కూడా..సన్‌రూఫ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్లెస్ ఛార్జర్, 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన నిస్సాన్ మాగ్నైట్ 1.0 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇవి 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ పొందుతాయి. -
నిస్సాన్ మాగ్నైట్ ఎగుమతులు ప్రారంభం
దక్షిణాఫ్రికాకు సరికొత్త ఎస్యూవీ న్యూ నిస్సాన్ మాగ్నైట్ ఎగుమతులను నిస్సాన్ మోటార్ ఇండియా ప్రారంభించింది. “ఒక కారు, ఒకే ప్రపంచం” విధానంతోపాటు భారత్‌ను గ్లోబల్ ఎక్స్పోర్ట్ హబ్‌గా మార్చాలన్న లక్ష్యంలో భాగంగా ఎగుమతులు చేపట్టింది.ఈ వాహనాలు చెన్నైలోని నిస్సాన్ అలయన్స్ ప్లాంట్ నుండి ఎగుమతి అవుతున్నాయి. సరికొత్త మాగ్నైట్ మోడల్‌ను దిగుమతి చేసుకున్న మొదటి అంతర్జాతీయ మార్కెట్‌గా దక్షిణాఫ్రికా నిలిచింది. భారత్‌లో లాంచ్ అయిన ఒక నెలలోనే, చెన్నై పోర్ట్ నుండి 2,700 యూనిట్లకు పైగా న్యూ మాగ్నైట్ వాహనాలు ఎగుమతయ్యాయి.కాగా 2020 డిసెంబర్లో మాగ్నైట్ లాంచ్ అయినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా 150,000 యూనిట్లకు పైగా అమ్ముడుపోయాయి. ఇది నిస్సాన్క “మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్” చొరవ విజయాన్ని చాటుతోంది. బోల్డ్ లుక్, మెరుగైన భద్రతా ఫీచర్లు, అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన న్యూ మాగ్నైట్ ఈ ఏడాది అక్టోబర్‌లో న్యూ ఢిల్లీలో లాంచ్ అయింది. -
భారతీయ మార్కెట్లో జపాన్ బ్రాండ్ కారు లాంచ్ - పూర్తి వివరాలు
నిస్సాన్ కంపెనీ తన ఎక్స్-ట్రైల్ SUVని రూ. 49.92 లక్షల ప్రారంభ ధర వద్ద దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ కారు 7 సీటర్ రూపంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీనిని సంస్థ సీబీయూ మార్గం ద్వారా దిగుమతి చేసుకుంటుంది.కొత్త డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన నిస్సాన్ ఎక్స్-ట్రైల్ 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కలిగి 12వీ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో వస్తుంది. ఇది 163hp పవర్, 300Nm టార్క్ అందిస్తుంది. ఇది సీవీటీ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది.నిస్సాన్ ఎక్స్-ట్రైల్ డ్యూయల్ పేన్ పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 12.3 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, వైర్లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, కీలెస్ ఎంట్రీ అండ్ గో, ఆటో-హోల్డ్ ఫంక్షన్, క్రూయిజ్ కంట్రోల్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫీచర్స్ పొందుతుంది.మల్టిపుల్ సేఫ్టీ ఫీచర్స్ కలిగిన ఈ కారు దేశీయ విఫణిలో ప్రధానంగా టయోటా ఫార్చ్యూనర్, స్కోడా కొడియాక్, జీప్ మెరిడియన్, ఎంజీ గ్లోస్టర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి ఇది అమ్మకాల పరంగా గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. -
భారత్‌లో భారీగా పెరిగిన జపనీస్ బ్రాండ్ కారు సేల్స్
2024 మే నెల ముగియడంతో వాహన తయారీ సంస్థలు తమ అమ్మకాల గణాంకాలను విడుదల చేస్తున్నాయి. ఈ తరుణంలో భారతదేశంలో అధిక ప్రజాదరణ పొందిన జపనీస్ ఆటోమొబైల్ తయారీదారు 'నిస్సాన్ ఇండియా' కూడా సేల్స్ డేటా రిలీజ్ చేసింది.కంపెనీ విడుదల చేసిన డేటా ప్రకారం.. నిస్సాన్ కంపెనీ మే 2024లో 6204 యూనిట్ల మాగ్నైట్ కార్లను విక్రయించినట్లు సమాచారం. ఈ సంఖ్య ఏప్రిల్ 2024లో 3043 యూనిట్లు మాత్రమే. దీన్నిబట్టి చూస్తే కంపెనీ సేల్స్ భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. మొత్తం అమ్మకాల్లో కంపెనీ మునుపటి కంటే కూడా 34 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి.మే 2023లో నిస్సాన్ అమ్మకాలు 4631 యూనిట్లు మాత్రమే. అదే మే 2024లో కంపెనీ సేల్స్ 6204కు చేరాయి. ఇందులో దేశీయ విక్రయాలు 2211 కాగా.. ఎగుమతులు 3993గా నమోదయ్యాయి. క్రమంగా నిస్సాన్ మాగ్నైట్ సేల్స్ పెరుగుతున్నాయని, రాబోయే రోజుల్లో ఇది మరింత మంది కస్టమర్లను ఆకర్షిస్తుందని.. నిస్సాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ 'సౌరభ్ వత్సా' పేర్కొన్నారు.నిస్సాన్ కంపెనీ భారతీయ మార్కెట్లో ఇప్పడు కేవలం ఒకే కారును విక్రయిస్తోంది. రాబోయే రోజుల్లో కంపెనీ కొత్త కార్లను లాంచ్ చేస్తుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. అయితే కంపెనీ ఇండియాలో తన నెట్వర్క్ పెంచుతూనే ఉంది. ప్రస్తుతం నిస్సాన్ 272 టచ్పాయింట్లను కలిగి ఉంది. వీటి ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు సేల్స్ మాత్రమే కాకుండా సర్వీస్ కూడా అందిస్తోంది.కంపెనీ తన నిస్సాన్ మాగ్నైట్ SUVని ప్రపంచ వ్యాప్తంగా 15 దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు సమాచారం. ఇందులో సీషెల్స్, బంగ్లాదేశ్, ఉగాండా, బ్రూనై వంటి దేశాలు మాత్రమే కాకుండా.. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్, ఖతార్, బహ్రెయిన్, కువైట్ వంటి మధ్యప్రాచ్య దేశాలు ఉన్నాయి. -
ప్రముఖ కంపెనీ కార్ల రీకాల్
తయారీ సంస్థలు తమ వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందించాలని కోరుకుంటాయి. అందుకు అనువుగానే ఉత్పత్తులను తయారుచేస్తాయి. అయితే హార్డ్‌వేర్ కారణాలు, ఇతర సాంకేతిక కారణాల వల్ల కంపెనీ లేదా వినియోగదారులు ఊహించిన విధంగా ఆయా ఉత్పత్తులు పనిచేయవు. దాంతో ప్రధానంగా వాటిలో గుర్తించిన సమస్యలను పరిష్కరించి తిరిగి వాటిని వినియోగదారులకు అందిస్తారు. తాజాగా నిస్సాన్ కంపెనీ తయారుచేసిన మ్యాగ్నైట్ మోడల్ కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. నవంబర్ 2020 నుంచి డిసెంబర్ 2023 మధ్య తయారైన ఈ మోడళ్లలో ముందు డోరు హ్యాండిల్ సెన్సార్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వీటిని రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇదీ చదవండి: ఈవీ పాలసీపై చర్చకు హాజరైన ప్రముఖ కంపెనీ ప్రతినిధులు ఎన్ని యూనిట్లను రీకాల్ చేస్తున్న విషయాన్ని మాత్రం సంస్థ వెల్లడించలేదు. కానీ, గతేడాది డిసెంబర్ తర్వాత తయారైన మోడళ్లలో ఈ సమస్య లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ విషయాన్ని తమ కస్టమర్లకు చేరవేశామని కంపెనీ చెప్పింది. కంపెనీ గుర్తింపు పొందిన సర్వీస్ కేంద్రాల్లో ఉచితంగా రిపేర్ చేసి ఇస్తామని సంస్థ పేర్కొంది. -
రెనో, నిస్సాన్‌ల ఎలక్ట్రిక్ కారు.. లాంచ్ ఎప్పుడంటే?
చెన్నై: వాహన తయారీలో ఉన్న రెనో, నిస్సాన్‌ల సంయుక్త భాగస్వామ్య కంపెనీ నుంచి తొలి కారు భారత మార్కెట్లో 2025లో అడుగుపెట్టనుంది. ఈ మోడల్ 4 మీటర్లకుపైగా పొడవు ఉండనుంది. రూ.5,300 కోట్లతో రెండు చిన్న ఎలక్ట్రిక్ కార్లతోసహా ఆరు కొత్త ఉత్పత్తులను తేనున్నట్టు ఇరు సంస్థలు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించాయి. అలాగే చెన్నై సమీపంలోని ప్లాంటును ఆధునీకరించనున్నారు. ఆరు మోడళ్లలో రెనో నుంచి మూడు, నిస్సాన్ నుంచి మూడు రానున్నాయి. జేవీలో నిస్సాన్‌కు 51, రెనోకు 49 శాతం వాటా ఉంటుంది. ‘ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి ప్రవేశిస్తున్నాం. అలాగే నాలుగు మీటర్ల కంటే ఎక్కువ పొడవున్న పెద్ద వాహనాల్లోకి కూడా ఎంట్రీ ఇస్తాం. భారత్‌లో క్విడ్, కైగర్, ట్రైబర్ ప్యాసింజర్ కార్లను విక్రయిస్తున్నాం. 2022లో దేశీయంగా 84,000 యూనిట్లు రోడ్డెక్కాయి. 28,000 యూనిట్లు ఎగుమతి చేశాం. 2023లోనూ ఇదే స్థాయిలో అమ్మకాలు ఉంటాయి’ అని రెనో ఇండియా ఆపరేషన్స్ సీఈవో, ఎండీ వెంకట్రామ్ మామిళ్లపల్లె తెలిపారు. -
సరికొత్త ఫీచర్లతో అదరగొడుతోన్న..నిస్సాన్ మాగ్నైట్ రెడ్ ఎడిషన్ బుకింగ్స్ షురూ!
జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ ఇండియన్ మార్కెట్లో నిస్సాన్ మ్యాగ్నైట్ రెడ్ ఎడిషన్ కార్‌ను పరిచయం చేసింది. జులై 8 ( నిన్న శుక్రవారం) నుంచి ఈ కార్ బుకింగ్స్‌ను ప్రారంభించినట్లు తెలిపింది. జులై 18న ఈ కారును విడుదల చేయనుంది. మాగ్నైట్ ఎక్స్‌వీ వేరియంట్ ఆధారంగా ఇది రూపుదిద్దుకుంది. 8 అంగుళాల టచ్ స్క్రీన్, వైఫై కనెక్టివిటీ, 7 అంగుళాల ఫుల్ టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్ఈడీ డే టైమ్ రన్నింగ్ లైట్స్, డైమంట్ కట్ అలాయ్ వీల్స్ వంటి హంగులు ఉన్నాయి. మూడు వేరియంట్లలో నిస్సాన్ సంస్థ మ్యాగ్నైట్ రెడ్ పేరుతో మూడు వేరియంట్లలో మ్యాగ్నైట్ టర్బో ఎక్స్‌వీ ఎంటీ రెడ్ ఎడిషన్, మ్యాగ్నైట్ టర్బో ఎక్స్‌వీ సీవీటీ రెడ్ ఎడిషన్, మ్యాగ్నైట్ ఎక్స్‌వీ ఎంటీ రెడ్ ఎడిషన్ కార్లను బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ సందర్భంగా ఈ కార్ల వినియోగదారులకు మెమోరబుల్ జర్నీని అందించేందుకు బోల్డ్ డిజైన్, పవర్ ప్యాక్డ్ పర్మామెన్స్, కంఫర్ట్, అడ్వాన్స్ టెక్నాలజీ, కనెక్టివిటీ ఫీచర్లను జత చేసినట్లు నిస్సాన్ ప్రతినిధులు వెల్లడించారు. నిస్సాన్ మ్యాగ్నైట్ రెడ్ ఫీచర్లు నిస్సాన్ మ్యాగ్నైట్ రెడ్ ఎడిషన్ కార్లలో కారు గ్రిల్స్(కారు హెడ్‌లైట్స్ మధ్యలో ఉండే డిజైన్),ఫ్రంట్ బంపర్ క్లాడింగ్,వీల్ ఆర్చ్, బాడీ సైడ్ క్లాడింగ్‌లు ఉన్నాయి. వీటితో పాటు రెడ్ ఎడిషన్‌లో బోల్డ్ బాడీ గ్రాఫిక్స్, ఎల్ఈడీ స్కఫ్ ప్లేట్,టైల్ డోర్ గ్రానిషన్ పొందుపరిచింది. యాంబినెట్ మూడ్ లైటింగ్, వైర్లెస్ ఛార్జర్,7.0 అంగుళాల టీఎఫ్టీ ఇన్స్ట్రామెంట్ క్లస్టర్, వైఫై కనెక్టివీటి, స్టార్ట్, స్టాప్ కోసం పుష్ బటన్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టం, బ్రేక్ అసిస్ట్ వంటి సదుపాయం ఉంది. కార్లపై డిస్కౌంట్ ఇటీవల నిన్సాన్ ప్రతినిధులు నిస్సాన్ మ్యాగ్నైట్ సీవీటీ వేరియంట్ ఎక్స్, ఎక్స్వీలపై డిస్కౌంట్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ కార్ల ప్రైస్ రేంజ్ రూ.5.88లక్షల నుంచి రూ.10.56లక్షల మధ్య ఉంది. -
ఆ కారుపై లక్ష వరకు బెనిఫిట్ ఆఫర్స్ !
Nissan Compact SUV Kicks: అమెరికా కంపెనీలు ఇండియా మార్కెట్ నుంచి వైదొలుగుతుండటంతో ఇతర కార్ల తయారీ కంపెనీలు ఇండియాలో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అందులో భాగంగా జపాన్ కార్ మేకర్స్ కంపెనీ నిస్సాన్ సరికొత్త బెనిఫిట్ ఆఫర్స్‌తో ముందుకు వచ్చింది. కాంపాక్ట్ ఎస్యూవీ స్టో అండ్ స్టడీ అండ్ విన్ ది రేస్ అనే నానుడి నిజం చేస్తోంది నిస్సాన్ ఆటో. అమ్మకాల పరంగా మెరుపులు లేకపోయినా నిస్సాన్ కంపెనీ ఇండియన్ మార్కెట్లో నిలదొక్కుకుంటోంది. ముఖ్యంగా బడ్జెట్ ధరలో ఆకర్షణీయమై మోడళ్లను రిలీజ్ చేస్తోంది. ఆ ఒరవడిలో కాంపాక్ట్ ఎస్యూవీ కేటగిరీలో కిక్స్‌ను రిలీజ్ చేసింది. తాజాగా ఈ మోడల్ ప్రమోషన్లో భాగంగా పలు బెనిఫిట్ ఆఫర్స్ ప్రకటించింది. సెప్టెంబరు 30 వరకు కొనుగోలు చేసే కార్లపై ఈ బెనిఫిట్ ఆఫర్ వర్తిస్తుంది. కిక్స్ ఫీచర్స్ నిస్సాన్ కాంపాక్ట్ ఎస్యూవీ పెట్రెల్ ఇంజన్‌తో రెండు వెర్షన్లలో లభిస్తోంది. ఇందులో ఒకటి 1.3 లీటర్ టర్బో వేరియంట్ 154 బీహెచ్పీతో 254 ఎన్ఎమ్ టార్క్‌ని రిలీజ్ చేస్తుంది. రెండో వేరియంట్ అయిన 1.5 లీటర్ వేరియంట్ 105 బీహెచ్పీతో 142 ఎన్ఎం టార్క్‌ని ఇస్తుంది. ఇక రెండు వేరియంట్లలో 5 స్పీడ్, 6 స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్‌లో లభిస్తున్నాయి. కిక్స్ ధర ప్రస్తుతం ఇండియాలో ప్రారంభం రూ. 9.5 లక్షల నుంచి గరిష్టంగా 14.65 లక్షల రేంజ్లో లభిస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాలు, డీలర్లను బట్టి ఆఫర్లో కొంత తేడాలు ఉండవచ్చని నిస్సాన్ తెలిపింది. బెనిఫిట్ ఆఫర్స్ ఇలా 1.3 లీటర్ టర్బో వేరియంట్‌పై - క్యాష్ బెనిఫిట్ రూ. 15,000 - ఆన్లైన్ బుకింగ్ బోనస్ రూ. 5,000 - ఎక్సేంజీ బోనస్ రూ.70,000 - సెలక్ట్ కార్పోరేట్ బెనిఫిట్స్ రూ. 10,000 - స్పెషల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.99 శాతం 1.5 లీటర్ వేరియంట్‌పై - క్యాష్ బెనిఫిట్ రూ. 10,000 - ఆన్లైన్ బుకింగ్ బోనస్ రూ. 5,000 - ఎక్సేంజీ బోనస్ రూ.20,000 - సెలక్ట్ కార్పోరేట్ బెనిఫిట్స్ రూ. 10,000 - స్పెషల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.99 శాతం చదవండి : సెడాన్ అమ్మకాల్లో ఆ కారుదే అగ్రస్థానం -
అద్దెకు నిస్సాన్, డాట్సన్ కార్లు
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్ మోటార్ ఇండియా తాజాగా తమ నిస్సాన్, డాట్సన్ బ్రాండ్ల కార్ల సబ్స్క్రిప్షన్ పథకం ప్రారంభించింది. తొలుత హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ నగరాల్లో ఇవి అందుబాటులో ఉంటాయి. తర్వాత దశలో బెంగళూరు, పూణే, ముంబై నగరాల్లో అందుబాటులోకి వస్తాయని కంపెనీ ఎండీ రాకేశ్ శ్రీవాస్తవ తెలిపారు. సబ్ర్స్కిప్షన్ ప్లాన్ ప్రకారం కారును కొనుగోలు చేయనక్కర్లేకుండా నిర్దిష్ట కాల వ్యవధికి నిర్ణీత నెలవారీ ఫీజు కట్టి ఉపయోగించుకోవచ్చని తెలిపారు. నామమాత్రపు రిఫండబుల్ సెక్యురిటీ డిపాజిట్ కట్టి కస్టమర్లు.. సరికొత్త కారును ఎంచుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్లపైనే ఆఫర్ నిస్సాన్ మాగ్నైట్, కిక్స్ ఎస్‌యూవీలకు నెలవారీ సబ్ర్స్కిప్షన్ ఫీజు రూ. 17,999 నుంచి రూ. 30,499 దాకా ఉంటుంది. డాట్సన్ రెడీ–గో హ్యాచ్‌బ్యాక్‌కు సంబంధించి ఇది రూ. 8,999 నుంచి రూ. 10,999 దాకా ఉంటుంది. సబ్స్క్రిప్షన్ సరీ్వసుల సంస్థ ఒరిక్స్ ఇండియాతో కలిసి ప్లాన్లు అందిస్తున్నట్లు శ్రీవాస్తవ వివరించారు. డౌన్ పేమెంట్, సర్వీస్ వ్యయా లు, బీమా వ్యయాల బాదరబందీ ఉండదని తెలిపారు. సబ్స్క్రిప్షన్ ప్లాన్‌లోనే వాహన బీమా, రిజిస్ట్రేషన్ ఫీజు, రోడ్ ట్యాక్స్, ఆర్టీవో వ్యయాలు, మరమ్మతులు సహా నిర్వహణ వ్య యాలు, టైర్లు.. బ్యాటరీలను మార్చడం వంటివన్నీ భాగంగా ఉంటాయని పేర్కొన్నారు. -
నిస్సాన్ కార్లపై భారీ ఆఫర్లు
సాక్షి, న్యూఢిల్లీ: అమ్మకాలు పడిపోవడంతో ఆటో కంపెనీలు వరుసగా తమ వాహనాల కొనుగోలుపై పలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా నిస్సాన్ మోటార్స్ ఇండియా తన పాపులర్ కార్లపై తగ్గింపు ధరలను ప్రకటించింది. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. నిస్సాన్ సన్నీ మోడల్ కారు కొనుగోలుపై గరిష్టంగా 90,000 రూపాయల వరకు ఆఫర్ ఉంది. నిస్సాన్ మైక్రా, మైక్రో యాక్టివా, సన్నీలపై వివిధ రకాల క్యాష్ బ్యాక్ ఆఫర్ లభ్యం. అయితే నిస్సాన్ కిక్స్ కొనుగోలుపై క్యాష్ బ్యాక్ ఆఫర్ లేదు. నిస్సాన్ కస్టమర్లకు ఫైనాన్స్ సులభతరం చేయడానికి కిక్స్‌లో జీరో శాతం వడ్డీ ఎంపిక అందుబాటులో ఉంది. సెప్టెంబర్ 30, 2019 వరకు ఈ తగ్గింపు ఆఫర్ చెల్లుబాటవుతుంది. ఈ ఆఫర్లు ఆయా నగరం, వేరియంట్‌ను బట్టి మారే అవకాశం ఉంది. ఖచ్చితమైన వివరాల కోసం నిస్సాన్ డీలర్‌షిప్‌ను సంప్రదించండి. నిస్సాన్ సన్నీ: నిస్సాన్ సన్నీపై రూ .30,000 వరకు నగదు తగ్గింపుతో పాటు రూ .30,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తోంది. దీంతోపాటు కార్పొరేట్, బ్యాంక్ ఉద్యోగులు, వైద్యులకు 14,000 రూపాయల వరకు అదనపు డిస్కౌంట్లను కూడా ఇది అందిస్తోంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, సీఏలకు, వాస్తుశిల్పులకు 8,000 రూపాయల వరకు ప్రత్యేక తగ్గింపు ఉంది. నిస్సాన్ మైక్రో: మైక్రో హ్యాచ్‌బ్యాక్ కొనుగోలుపై రూ .25 వేల వరకు నగదు తగ్గింపు పొందవచ్చు. అలాగే రూ .20వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్. కార్పొరేట్, బ్యాంక్ ఉద్యోగులు రూ .10వేల వరకు అదనపు ప్రయోజనాలను పొందవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, సిఏలు, వాస్తుశిల్పులకు రూ .5 వేల వరకు తగ్గింపు వర్తిస్తుంది. నిస్సాన్ మైక్రో యాక్టివా: మైక్రో యాక్టివా కోసం, నిస్సాన్ రూ .15 వేల వరకు నగదు తగ్గింపుతో పాటు రూ .20,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్. బ్యాంక్ , కార్పొరేట్ ఉద్యోగులు, వైద్యులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయవాదులు, సిఏలు, వాస్తుశిల్పులకు ప్రత్యేక తగ్గింపు అందుబాటులో ఉంది. నిస్సాన్ కిక్స్ : పెట్రోల్ వెర్షన్ కోసం 7.99 శాతం వడ్డీరేటు, అయిదేళ్ల వారంటీ, రోడ్‌సైట్ అసిస్టెన్స్ , రూ. 17వేల ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్లున్నాయి. అలాగే నిస్సాన్ కస్టమర్లకు మూడేళ్లపాటు జీరో శాతం వడ్డీరేటుతో రుణం. -
కార్ల కంపెనీల ధరల హారన్
న్యూఢిల్లీ: దేశీ ఆటో రంగ దిగ్గజ సంస్థలన్నీ జనవరి ఒకటి నుంచి కార్ల ధరలను పెంచేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే దాదాపు అన్ని కంపెనీలు పెంపు ప్రకటనలు చేశాయి. పెరిగిన ఉత్పత్తి వ్యయాన్ని కస్టమర్లకు బదిలీ చేయడంలో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఒక్కొక్కటిగా వివరణ ఇస్తున్నాయి. ఇప్పటివరకు వెల్లడైన అధికారిక సమాచారం ప్రకారం కనీసం 1.5 నుంచి 4 శాతం వరకు కార్లు, ప్యాసింజర్ వాహనాల ధరలు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పెరగనున్నాయి. నిస్సాన్ మోటార్స్ ఇండియా తమ ప్యాసింజర్ వాహనాల ధరలను 4 శాతం వరకు పెంచనున్నట్లు ప్రకటించింది. ‘అంతర్జాతీయ మార్కెట్లో కమోడిటీల ధరలు పెరిగాయి. ఫారెన్ ఎక్సే్ఛంజ్ రేట్లలో ప్రతికూల మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ధరల భారాన్ని కస్టమర్లకు బదిలీ చేస్తున్నాం. నిస్సాన్, డాట్సన్ ధరలు ఒకటో తేదీ నుంచి పెరగనున్నాయి.’ అని సంస్థ డైరెక్టర్ హర్దీప్ సింగ్ వ్యాఖ్యానించారు. పెరిగిన కమోడిటీ ధరలు, ఫారెన్ ఎక్సే్ఛంజ్ మార్పులు కారణంగా తమ కార్ల ధరలను 2.5% పెంచనున్నట్లు ఫోర్డ్ ఇండియా ఈడీ వినయ్ రైనా వెల్లడించారు. ఇక టాటా మోటార్స్..మోడల్‌ను బట్టి గరిçష్టంగా రూ.40వేల వరకూ ఉండొచ్చని తెలియజేసింది. ‘‘పెరిగిన ముడి పదార్థాల ధరలు, మారిన మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా ఈ పెంపు తప్పటం లేదు’’ అని కంపెనీ ప్యాసింజర్ వాహన వ్యాపార విభాగం ప్రెసిడెంట్ మయాంక్ పరీక్ తెలిపారు. మరోవైపు రెనో, మారుతీ, ఇసుజు, టయోటా కూడా జనవరి 1 నుంచి ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. -
నిస్సాన్ మైక్రాలో ఫ్యాషన్ ఎడిషన్
గుర్గావ్: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘నిస్సాన్ ఇండియా’ తాజా పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని ‘మైక్రా’లో ఫ్యాషన్ ఎడిషన్‌ను తీసుకొచ్చింది. ఇందుకోసం యునైటెడ్ కలర్స్ ఆఫ్ బెనెటెన్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఢిల్లీలో దీని ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధర రూ.6.09 లక్షలు. మైక్రా ఫ్యాషన్ లిమిటెడ్ ఎడిషన్‌లో మెకానికల్‌గా మార్పులేవీ లేకున్నా పలు కాస్మొటిక్ అప్‌గ్రేడ్స్ (ఎక్స్టీరియర్, ఇంటీరియర్) ఉన్నట్లు కంపెనీ తెలిపింది. కొత్త మైక్రా ప్రధానంగా ఫ్యాషన్ బ్లాక్, ఫ్యాషన్ ఆరంజ్ రంగుల్లో లభ్యంకానుంది. -
నిస్సాన్ బంపర్ ఆఫర్లు: కారు గెల్చుకోవచ్చు!
సాక్షి, ముంబై: ప్రముఖ కార్ల ఉత్పత్తిదారు నిస్సాన్ ఇండియా వినియోగదారులకు బంపర్ ఆఫర్లను అందిస్తోంది. నిస్సాన్, డాట్సన్ మోడల్ కార్ల కొనుగోళ్లపై భారీ ప్రయోజనాలను అందించనున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. నిస్సాన్ వెల్లడించిన ఈ పండుగ బొనాంజా ఆఫర్లో కారు కొనుగోలుపై ఒక బంగారు నాణాన్ని అందిస్తోంది. దీంతోపాటు ఉచితంగా కారు గెల్చుకునే అవకాశాన్ని కస్టమర్లకు కల్పిస్తోంది. దీంతోపాటు ఉచిత బీమా, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పోరేట్ ఆఫర్ సహా దాదాపు రూ. 71,000 వరకు డిస్కౌంట్ లభించనుంది. నిస్సాన్, డాట్సన్ మోడళ్లపై వినియోగదారులకు అందిస్తున్న ఈ ఆఫర్లు సెప్టెంబర్ 5 నుంచి అమల్లోకి వచ్చినట్టు నిస్సాన్ ఇండియా ప్రకటించింది. వినియోగదారులు నిస్సాన్ , డాట్సన్ కారును ఈ పండుగ ఆఫర్లో సెప్టెంబర్19వ తేదీ లోపు కొనుగోలు చేస్తే ఉచితంగా కారు గెలు చుకునే అవకాశం. ఇలా తొమ్మిదిమంది లక్కీ విజేతలను ఎంపిక చేయనుంది. ప్రతి నిస్సాన్, డాట్సన్ కారు కొనుగోలుపై కస్టమర్లకు ఒక బంగారు నాణాన్ని అందిస్తోంది. అలాగే 7.99 శాతం వడ్డీతో నిస్సాన్ రెనాల్ట్ ఫైనాన్షియల సర్వీసెస్ ఇండియా ద్వారా రుణ సదుపాయం కూడా ఉంది. ‘పిల్లర్స్ ఆఫ్ ఇండియా’ పథకంలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు డాట్సన్ రెడి-గోపై అదనంగా రూ.6వేల డిస్కౌంట్ అందిస్తోంది. మైక్రా ఎంసీ పై 39,000 రూపాయల వరకు, మైక్రా యాక్టివ్‌పై రూ. 34000 వరకు తగ్గింపు. (ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.10వేలు, రూ. 4వేల కార్పొరేట్ ఆఫర్ కలిపి) డాట్సన్ మోడళ్లలో గో ప్లస్ పై రూ.16,000, రెడి గోపై రూ.14, 500, రెడీ గో (800) సీసీపై 13వేల వరకు ప్రత్యేక ఆఫర్ అందించనుంది. వీటిలో ఉచిత బీమా, రూ. 2,000 కార్పోరేట్ ఆఫర్ తదితరాలు ఉండనున్నాయి. -
సన్నీలో కొత్త వెర్షన్
న్యూఢిల్లీ : జపనీస్ ఆటో దిగ్గజం నిస్సాన్ తన మిడ్ సెజ్ సెడాన్ సన్నీలో కొత్త వెర్షన్ కారును ఆవిష్కరించింది. రూ.7.91 లక్షల(ఎక్స్-షోరూం ఢిల్లీ ) ప్రారంభ ధరతో ఈ కారును భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. '' నిస్సాన్ ఇండియా వినియోగదారుల అభిప్రాయాలను నిరంతరం తీసుకుంటూ ఉంటుంది. కొత్త సన్నీ 2017లో విశాలమైన ఇంటీరియర్ ఉంటుంది. ఈ కారు మంచి ఇంధన సామర్థ్యం కలిగి ఉంది'' అని నిస్సాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ మల్హోత్రా చెప్పారు. పెట్రోల్, డీజిల్ రెండు వేరియంట్లలో ఈ కారును నిస్సాన్ వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. పెట్రోల్ వెర్షన్ 1,498సీసీ ఇంజిన్, డీజిల్ వేరియంట్ 1,461 సీసీ ఇంజిన్ సామర్థ్యం కలిగి ఉంది. పెట్రోల్ ఆప్షన్ ధర రూ.7.91 లక్షల నుంచి రూ.10.89 లక్షల మధ్య ఉండగా.. డీజిల్ వేరియంట్ ధరలు రూ.8.8 లక్షల నుంచి రూ.10.76 లక్షల మధ్య ఉంది. యాంటీ లాక్ బ్రేకింగ్(ఏబీఎస్), ఎలక్ట్రిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్(ఈబీడీ), బ్రేక్ అసిస్ట్(బీఏ), డ్యూయల్ ఫ్రంట్, సైడ్ ఎయిర్‌బ్యాగ్స్ దీనిలోని సేఫ్టీ ఫీచర్లు. నిస్సాన్ లైన్-అప్‌లో సన్నీకి మంచి డిమాండ్ ఉంది. ఈ కారు గ్లోబల్‌గా 16 మిలియన్ యూనిట్లు అమ్ముడుపోయింది. -
‘ఎక్స్-ట్రెయిల్’ హైబ్రీడ్ త్వరలో..
నిస్సాన్ ఇండియా ప్రెసిడెంట్ గిల్ సికార్డ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ నిస్సాన్ మోటార్ ఇండియా ఏటా ఒక కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించింది. అలాగే ఆరు నెలలకో కొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి తెస్తామని నిస్సాన్ ఇండియా ఆపరేషన్స్ ప్రెసిడెంట్ గిల్ సికార్డ్ బుధవారం తెలిపారు. హైదరాబాద్ మార్కెట్లో నిస్సాన్ బ్రాండ్ డాట్సన్ రెడీ-గో అర్బన్ క్రాస్ కారును విడుదల చేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నిస్సాన్ ఎక్స్-ట్రెయిల్ హైబ్రీడ్ ఎస్యూవీ కారును ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో పరిచయం చేస్తామని వెల్లడించారు. పెట్రోల్‌తోపాటు ఎలక్ట్రిక్ ఇంజిన్ ఉంటుందని, మైలేజీ లీటరుకు 20 కిలోమీటర్లు ఇస్తుందని సికార్డ్ తెలియజేశారు. ‘‘ఈ కార్లను జపాన్ నుంచి దిగుమతి చేసుకుని ఇక్కడ విక్రయిస్తాం. ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. నిజానికి హైబ్రిడ్ కార్లు విజయవంతం కావాలంటే ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలి. దీంతో పాటు ఛార్జింగ్ పాయింట్లను కూడా విరివిగా ఏర్పాటు చేయాలి. అప్పుడే అందరూ ముందుకొస్తారు’’ అని చెప్పారాయన. మార్కెట్ వాటా 5 శాతం.. దేశీయంగా విక్రయమవుతున్న నాలుగు కార్లలో ఒకటి చిన్న కారు ఉంటోందని సికార్డ్ తెలిపారు. ఎంట్రీ లెవెల్ విభాగం ప్రస్తుతం నిలకడైన వృద్ధి నమోదు చేస్తోందని , కంపెనీలు వినూత్న మోడళ్లను తీసుకొస్తే ఈ విభాగం మరింత వృద్ధి చెందుతుందని తెలియజేశారు. 2015లో నిస్సాన్ భారత్‌లో 40 వేల పైచిలుకు కార్లను విక్రయించింది. 2020 నాటికి వార్షిక అమ్మకాలు 2.50 లక్షలకు చేర్చాలని లక్ష్యంగా చేసుకుంది. తద్వారా 5 శాతం మార్కెట్ వాటా దక్కించుకుంటామని సికార్డ్ తెలియజేశారు. డాట్సన్ రెడీ-గో విక్రయాలతో సంస్థ వాటా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. వాల్యూ విభాగంలో డాట్సన్, హై ఎండ్పైన నిస్సాన్ ఫోకస్ చేస్తున్నట్లు తెలిపారు. దేశీయ కార్ల విపణిలో నిస్సాన్ వాటా 2 శాతం లోపు ఉంది. కాగా, హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో రెడీ-గో ధర వేరియంట్‌నుబట్టి రూ.2.43-3.40 లక్షలుంది.