జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ ఇండియన్ మార్కెట్‌లో నిస్సాన్ మ్యాగ్నైట్ రెడ్ ఎడిషన్ కార్‌ను పరిచయం చేసింది. జులై 8 ( నిన్న శుక్రవారం) నుంచి ఈ కార్ బుకింగ్స్‌ను ప్రారంభించినట్లు తెలిపింది. జులై 18న ఈ కారును విడుదల చేయనుంది. మాగ్నైట్ ఎక్స్‌వీ వేరియంట్ ఆధారంగా ఇది రూపుదిద్దుకుంది. 8 అంగుళాల టచ్ స్క్రీన్, వైఫై కనెక్టివిటీ, 7 అంగుళాల ఫుల్ టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్‌ఈడీ డే టైమ్ రన్నింగ్ లైట్స్, డైమంట్ కట్ అలాయ్ వీల్స్ వంటి హంగులు ఉన్నాయి.
మూడు వేరియంట్లలో
నిస్సాన్ సంస్థ మ్యాగ్నైట్ రెడ్ పేరుతో మూడు వేరియంట్లలో మ్యాగ్నైట్ టర్బో ఎక్స్‌వీ ఎంటీ రెడ్ ఎడిషన్, మ్యాగ్నైట్ టర్బో ఎక్స్‌వీ సీవీటీ రెడ్ ఎడిషన్, మ్యాగ్నైట్ ఎక్స్‌వీ ఎంటీ రెడ్ ఎడిషన్ కార్లను బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ సందర్భంగా ఈ కార్ల వినియోగదారులకు మెమోరబుల్ జర్నీని అందించేందుకు బోల్డ్ డిజైన్, పవర్ ప్యాక్డ్ పర‍్మామెన్స్, కంఫర్ట్, అడ్వాన్స్ టెక్నాలజీ, కనెక్టివిటీ ఫీచర్లను జత చేసినట్లు నిస్సాన్ ప్రతినిధులు వెల్లడించారు.
నిస్సాన్ మ్యాగ్నైట్ రెడ్ ఫీచర్లు
నిస్సాన్ మ్యాగ్నైట్ రెడ్ ఎడిషన్ కార్లలో కారు గ్రిల్స్(కారు హెడ్‌లైట్స్ మధ్యలో ఉండే డిజైన్),ఫ్రంట్ బంపర్ క్లాడింగ్,వీల్ ఆర్చ్, బాడీ సైడ్ క్లాడింగ్‌లు ఉన్నాయి. వీటితో పాటు రెడ్ ఎడిషన్‌లో బోల్డ్ బాడీ గ్రాఫిక్స్, ఎల్‌ఈడీ స్కఫ్ ప్లేట్,టైల్ డోర్ గ్రానిషన్ పొందుపరిచింది. యాంబినెట్ మూడ్ లైటింగ్, వైర్‌లెస్ ఛార్జర్,7.0 అంగుళాల టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రామెంట్ క్లస్టర్, వైఫై కనెక్టివీటి, స్టార్ట్, స్టాప్ కోసం పుష్ బటన్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టం, బ్రేక్ అసిస్ట్ వంటి సదుపాయం ఉంది.
కార్లపై డిస్కౌంట్
ఇటీవల నిన్సాన్ ప్రతినిధులు నిస్సాన్ మ్యాగ్నైట్ సీవీటీ వేరియంట్ ఎక్స్, ఎక్స్‌వీలపై డిస్కౌంట్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ కార్ల ప్రైస్ రేంజ్ రూ.5.88లక్షల నుంచి రూ.10.56లక్షల మధ్య ఉంది.
Comments
Please login to add a commentAdd a comment