Nissan Motor Company
-
నిస్సాన్‌లో భారీగా ఉద్యోగాల కోత
టోక్యో: ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ మోటార్ కార్ప్ అమ్మకాలు క్షీణించి, నష్టాలు పెరిగిపోవడంతో భారీ ఉద్యోగాలు, వేతనాల కోత దిశగా కఠిన చర్యలు ప్రకటించింది. సెపె్టంబర్ త్రైమాసికంలో 9.3 బిలియన్ యెన్ల నష్టాన్ని మూటగట్టుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో 191 బిలియన్ యెన్ల లాభం నుంచి, భారీ నష్టాల్లోకి వెళ్లడం గమనార్హం. అంతేకాదు త్రైమాసిక విక్రయాలు 3.1 ట్రిలియన్ యెన్ల నుంచి 2.9 ట్రిలియన్ యెన్లకు క్షీణించాయి. దీంతో అంతర్జాతీయంగా 9,000 మంది ఉద్యోగులను తగ్గించుకోనున్నట్టు నిస్సాన్ ప్రకటించింది. సంస్థకున్న 1,33,000 మంది ఉద్యోగుల్లో ఇది 6 శాతానికి సమానం. అంతేకాదు తయారీని 20 శాతం తగ్గించుకోనున్నట్టు తెలిపింది. తన వేతనంలో 50 శాతం కోత విధించుకుంటున్నట్టు కంపెనీ సీఈవో మకోటో ఉచ్చిద ప్రకటించారు. అయితే, ఏ ప్రాంతంలో సంస్థ పనితీరుపై ప్రభావం పడిందన్నది ఉచ్చిద వెల్లడించలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–సెప్టెంబర్ కాలానికి కంపెనీ లాభం 19.2 బిలియన్ యెన్లకు తగ్గిపోయింది. -
సరికొత్త ఫీచర్లతో అదరగొడుతోన్న..నిస్సాన్ మాగ్నైట్ రెడ్ ఎడిషన్ బుకింగ్స్ షురూ!
జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ ఇండియన్ మార్కెట్లో నిస్సాన్ మ్యాగ్నైట్ రెడ్ ఎడిషన్ కార్‌ను పరిచయం చేసింది. జులై 8 ( నిన్న శుక్రవారం) నుంచి ఈ కార్ బుకింగ్స్‌ను ప్రారంభించినట్లు తెలిపింది. జులై 18న ఈ కారును విడుదల చేయనుంది. మాగ్నైట్ ఎక్స్‌వీ వేరియంట్ ఆధారంగా ఇది రూపుదిద్దుకుంది. 8 అంగుళాల టచ్ స్క్రీన్, వైఫై కనెక్టివిటీ, 7 అంగుళాల ఫుల్ టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్ఈడీ డే టైమ్ రన్నింగ్ లైట్స్, డైమంట్ కట్ అలాయ్ వీల్స్ వంటి హంగులు ఉన్నాయి. మూడు వేరియంట్లలో నిస్సాన్ సంస్థ మ్యాగ్నైట్ రెడ్ పేరుతో మూడు వేరియంట్లలో మ్యాగ్నైట్ టర్బో ఎక్స్‌వీ ఎంటీ రెడ్ ఎడిషన్, మ్యాగ్నైట్ టర్బో ఎక్స్‌వీ సీవీటీ రెడ్ ఎడిషన్, మ్యాగ్నైట్ ఎక్స్‌వీ ఎంటీ రెడ్ ఎడిషన్ కార్లను బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ సందర్భంగా ఈ కార్ల వినియోగదారులకు మెమోరబుల్ జర్నీని అందించేందుకు బోల్డ్ డిజైన్, పవర్ ప్యాక్డ్ పర్మామెన్స్, కంఫర్ట్, అడ్వాన్స్ టెక్నాలజీ, కనెక్టివిటీ ఫీచర్లను జత చేసినట్లు నిస్సాన్ ప్రతినిధులు వెల్లడించారు. నిస్సాన్ మ్యాగ్నైట్ రెడ్ ఫీచర్లు నిస్సాన్ మ్యాగ్నైట్ రెడ్ ఎడిషన్ కార్లలో కారు గ్రిల్స్(కారు హెడ్‌లైట్స్ మధ్యలో ఉండే డిజైన్),ఫ్రంట్ బంపర్ క్లాడింగ్,వీల్ ఆర్చ్, బాడీ సైడ్ క్లాడింగ్‌లు ఉన్నాయి. వీటితో పాటు రెడ్ ఎడిషన్‌లో బోల్డ్ బాడీ గ్రాఫిక్స్, ఎల్ఈడీ స్కఫ్ ప్లేట్,టైల్ డోర్ గ్రానిషన్ పొందుపరిచింది. యాంబినెట్ మూడ్ లైటింగ్, వైర్లెస్ ఛార్జర్,7.0 అంగుళాల టీఎఫ్టీ ఇన్స్ట్రామెంట్ క్లస్టర్, వైఫై కనెక్టివీటి, స్టార్ట్, స్టాప్ కోసం పుష్ బటన్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టం, బ్రేక్ అసిస్ట్ వంటి సదుపాయం ఉంది. కార్లపై డిస్కౌంట్ ఇటీవల నిన్సాన్ ప్రతినిధులు నిస్సాన్ మ్యాగ్నైట్ సీవీటీ వేరియంట్ ఎక్స్, ఎక్స్వీలపై డిస్కౌంట్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ కార్ల ప్రైస్ రేంజ్ రూ.5.88లక్షల నుంచి రూ.10.56లక్షల మధ్య ఉంది. -
టాప్‌గేర్‌లో వాహనాల అమ్మకాలు
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థలో సుస్థిరత, వినియోగదారుల విశ్వాసం పెరగడంతో ఈ జూలైలో మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్ వంటి ప్రధాన వాహన కంపెనీల విక్రయాలు రెండంకెల వృద్ధిని సాధించాయి. వ్యాధి సంక్రమణ రేటు భారీగా తగ్గుముఖం పట్టడంతో పాటు సెమి–కండెక్టర్ల సరఫరాను ఆటంకాలను ఆధిగమించి హోండా, నిస్సాన్, ఎంజీ మోటార్స్, స్కోడా కంపెనీలు అమ్మకాల్లో మెరుగైన వృద్ధిని సాధించాయి. దేశీయ వాహన దిగ్గజ సంస్థ మారుతీ సుజుకీ గతేడాది జూలైలో 1,01,307 వాహనాలను విక్రయించగా, ఈ ఏడాది జూలైలో 39 శాతం వృద్ధితో 1,41,238 వాహనాలను విక్రయించింది. హ్యుందాయ్ మోటార్ ఈ జూలైలో 48,042 వాహనాలను అమ్మింది. గతేడాది ఇదే జూలైలో విక్రయించిన 38,200 వాహనాలతో పోలిస్తే ఇది 26 శాతం అధికం. కంపెనీ జూలై2021 జూలై2020 వృద్ధి/క్షీణత మారుతీ సుజుకీ 1,41,238 1,01,307 39 హ్యుందాయ్ మోటార్స్ 48,042 38,200 26 టాటా మోటార్స్ 30,185 15,012 101 ఎంజీ మోటార్స్ 4225 2105 100 నిస్సాన్ 4,259 784 443 స్కోడా ఆటో 3,080 922 234 హోండా కార్ప్ 6,055 5,383 12 ద్విచక్రవాహనాలు హీరో మోటోకార్ప్ 5,20,104 4,54,398 (–)13 రాయల్ ఎన్ఫీల్డ్ 44,038 40,334 9 -
నిస్సాన్ మోటార్స్ ఛైర్మన్ అరెస్ట్
నిస్సాన్ మోటార్స్ ఛైర్మన్ కార్లోస్ గోన్ (64)కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. వివిధ అవినీతి ఆరోపణల కింద విచారణాధికారులు గోన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆర్థిక వాణిజ్య చట్టం ఉల్లంఘనలు, ఎక్స్చేంజ్ చట్టం ఉల్లంఘనతదితర ఆరోపణల నేపథ్యంలో టోక్యో ప్రాసిక్యూటర్స్ గోన్‌ను అరెస్ట్ చేశారని రాయిటర్స్ నివేదించింది. మరోవైపు గోన్తోపాటు, బోర్డు డైరెక్టర్ గ్రెగ్ కెల్లీలపై కంపెనీ ఆస్తుల దుర్వినియోగం, తదితర పలు ఆరోపణల నేపథ్యంలో గత కొన్ని నెలలుగా విచారణ జరుగుతోందని జపనీస్ ఆటో దిగ్గజం నిస్సాన్ ధృవీకరించింది. అంతర్గత దర్యాప్తులో గోన్ నివేదించిన ఆదాయ వివరాలు అవాస్తవాలుగా తేలాయని తెలిపింది. దీంతో వీరిద్దరినీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్నుంచి తొలగించాల్సిందిగా సీఈవో హిరోటో సైకవా బోర్డును కోరనున్నారని తెలిపింది. ఈ వ్యవహారంపై మీడియా సమావేశం ద్వారా వివరాలను వెల్లడిస్తామని చెప్పింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో నిస్సాన్ , రెనాల్ట్ కౌంటర్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. -
‘డాట్సన్ గో, గో ప్లస్’ కొత్త వేరియంట్లు
చెన్నై: జపనీస్ ఆటోమేకర్ నిస్సాన్.. పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ‘డాట్సన్ గో, గో ప్లస్’ కార్లలో కొత్త వేరియంట్లను బుధవారం భారత మార్కెట్లో విడుదలచేసింది. దాదాపు 100కు పైగా అప్డేట్స్, 28 నూతన ఫీచర్లు ఈ వేరియంట్లలో ఉన్నట్లు ప్రకటించింది. గో బ్రాండ్ ధర రూ.3.29 లక్షలు కాగా, గో ప్లస్ ధర రూ.3.83 లక్షలుగా వెల్లడించింది. ఈ సందర్భంగా నిస్సాన్ ఇండియా మోటార్స్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) పీటర్ క్లిస్సోల్డ్ మాట్లాడుతూ.. ‘ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల లక్ష్యంగా నూతన ఆవిష్కరణలను కొనసాగిస్తున్నాం. కారును కొనుగోలు చేసే ముందు కస్టమర్లు డీలరు వద్దకు వెళ్లి సర్వీస్ బాగుందనే విషయం తెలుసుకున్న తరువాత మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం 270 అవుట్లెట్లు ఉండగా.. ఈ ఏడాదిలో మరింత మంది డీలర్లు జతకానున్నారని అంచనావేస్తున్నాం. ఇక ఎగుమతుల విషయానికి వస్తే.. దక్షిణ ఆఫ్రికా, నేపాల్‌తో పాటు మరికొన్ని దేశాలకు ఎక్స్‌పోర్ట్స్ కొనసాగుతున్నాయి. తాజా వేరియంట్లలో మ రింత సౌకర్యవంతమైన, సురక్షితమైన జపనీస్ ఇంజినీరింగ్ టెక్నాలజీ ఉంది.’ అని వ్యాఖ్యానించారు. -
భారత్‌లో నిస్సాన్ తొలి గ్లోబల్ హబ్
తిరువనంతపురం: జపాన్‌కు చెందిన వాహన తయారీ కంపెనీ ‘నిస్సాన్ మోటార్ కార్పొరేషన్’ తాజాగా డిజిటల్ కార్యకలాపాల కోసం తన తొలి గ్లోబల్ సెంటర్‌ను భారత్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. దీన్ని కేరళలోని తిరువనంతపురంలో నిర్మిస్తామని తెలిపింది. ఇందుకోసం కేరళ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నామని తెలియజేసింది. కేరళ ముఖ్యమంత్రి పి. విజయన్ సమక్షంలో నిస్సాన్ కార్పొరేషన్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ టోనీ థామస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాల్ ఆంటోనీ ఒప్పందాలపై సంతకాలు చేశారు. ‘‘ఆసియా, యూరప్, ఉత్తర అమెరికా ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలనుకున్న సాఫ్ట్వేర్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్లలో ఇది మొదటిది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి దాదాపు 500 మందిని నియమించుకుంటాం. యూజర్ ఎక్స్పీరియన్స్, ప్రొడక్ట్ డెవలప్మెంట్, సెక్యూరిటీ పెంపు సహా కనెక్టెడ్, ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ నేపథ్యంలో కనెక్టివిటీ వంటి కొత్త డిజిటల్ సామర్థ్యాల నిర్మాణంపై కేరళ సెంటర్ దృష్టి కేంద్రీకరిస్తుంది. దీని కోసం బృందాన్ని ఏర్పాటు చేస్తున్నాం. టెక్నాలజీ, టాలెంట్ కోణాల్లో చూస్తే భారత్ మాకు గొప్ప మార్కెట్ అవుతుంది’ అని టోనీ థామస్ తెలిపారు. -
నడచి వచ్చే పాదరక్షలు ఇవిగో!
సాక్షి, న్యూఢిల్లీ : సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు వస్తున్న విషయం తెల్సిందే. వాటికంటే ముందుగా సెల్ఫ్ డ్రైవింగ్ పాద రక్షకులు వచ్చినట్లున్నాయి. జపాన్‌లోని టోక్యో నగరానికి వెళితే ‘ప్రో పైలట్ పార్క్ ర్యోకన్’ అనే క్లాసికల్ హోటల్ కనిపిస్తోంది. అందులోకి వెల్లిన వినియోగదారులకు పాదరక్షలు వాటింతట అవే నడిచి వచ్చి స్వాగతం చెబుతాయి. వారు ఆ హోటల్లో ఎక్కడికెళ్లాలంటే అక్కడికి తీసుకెళతాయి. వారు ఆ పాదరక్షలను ఎక్కడ వదిలేసినా మళ్లీ గుమ్మం వద్దకు వచ్చి ఒకదాని పక్కన ఒకటి వరుసలో ఒదిగిపోతాయి. పాతాళభైరవి తెలుగు సినిమాలోలాగా ఆ పాదరక్షలు మహత్తు కలిగిన మాయా పాదరక్షలేమీ కావు. సాధారణ పాదరక్షలే. అయితే, వాటికి అడుగున రెండు చిన్నటి చక్రాలు, సెన్సర్లు, ఓ మోటారు ఉంటుంది. అందుకనే అవి వాటంతట అవి నడుచుకుంటూ లేదా నడుపుకుంటూ పోగలవు. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లలో ఉపయోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్నే ఈ పాదరక్షల్లో ఉపయోగించారు. ఆ హోటల్లో ఒక్క పాదరక్షలే కాదు. వినియోగదారులు కూర్చునే కుషన్లు, కుర్చీలు, టెలివిజన్ రిమోట్లు అన్నీ వాటంతట అవే నడిచి వస్తాయి. వెళతాయి. ప్రముఖ కార్ల కంపెనీ ‘నిస్సాన్’ తన కంపెనీ కార్ల ప్రచారం కోసం టోక్యో హోటల్లో వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇలా ఉపయోగించింది. -
నడచి వచ్చే పాదరక్షలు ఇవిగో!
-
భారీ బకాయి:భారత్‌పై నిస్సాన్ దావా
జపాన్ వాహన తయారీ సంస్థ నిస్సాన్ మోటార్ ఇండియాకు వ్యతిరేకంగా ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్‌ను ఆశ్రయించింది. సుమారు 770 మిలియన్ డాలర్లు చెల్లించాలంటూ నిస్సాన్ మోటార్స్ ఇండియాపై న్యాయపోరాటానికి సిద్ధమైంది. చాలా కాలంగా రావాల్సిన ఇన్సెంటివ్స్ను (సుమారు రూ.5 వేల కోట్లు)చెల్లించాలంటూ డిమాండ్ చేస్తోంది. గతేడాదే ప్రధాని నరేంద్ర మోదీకి లీగల్ నోటీస్ పంపించినట్లు నిస్సాన్ తెలిపింది. గత ఏడాది ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పంపిన చట్టపరమైన నోటీసులో, దక్షిణ రాష్ట్రంలో కార్ల తయారీ కర్మాగారం ఏర్పాటు కోసం 2008 ఒప్పందంలో భాగంగా తమకు తమిళనాడు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయలను చెల్లించాలని కోరింది. తమిళనాడులో కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు కోసం 2008లో ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదర్చుకుంది నిస్సాన్. ఈ ఒప్పందం ప్రకారం తమిళనాడు ప్రభుత్వం ఇన్సెంటివ్స్ చెల్లించాల్సి ఉంది. నిజానికి ఇది 2015లో ఈ మొత్తం ఇవ్వాల్సి ఉన్నాప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందనీ నిస్సాన్ పేర్కొంఆది. సంస్థ చైర్మన్ కార్లోస్ ఘోసన్ గత ఏడాది దేశ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసినా ఫలితం లేదని గతేడాది ఏకంగా ప్రధానికే లేఖ రాసినా ఫలితం లేదని ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ మధ్యవర్తిత్వాన్ని కోరినట్టు నిస్సాన్ తెలిపింది. అయితే అంతర్జాతీయ మధ్యవర్తిత్వం అవసరం లేకుండా సమస్య పరిష్కారమవుతుందనే ఆశాభావాన్ని తమిళనాడు అధికారి ఒకరు వ్యక్తంచేశారు. ప్రధాని మంత్రిత్వం కార్యాలలయం నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. మరోవైపు దీనిపై డిసెంబర్లో దీనికి సంబంధించి తొలి వాదనలు జరగనున్నాయి. అంతర్జాతీయ స్థాయి మధ్యవర్తిత్వం లేకుండానే సమస్య పరిష్కారం కోసం తాము ప్రయత్నిస్తున్నామని, ఆ బకాయి విషయంలో ఎలాంటి విభేదం లేదని చెప్పారు. మొత్తాన్ని చెల్లిస్తామని , సమస్యను పరిష్కరించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాని తమిళనాడు ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. ఇలాంటివి ఇండియాపై ఇప్పటికే 20 కేసులు ఉండటం గమనార్హం. ప్రపంచంలో మరే దేశంపై ఇన్ని కేసులు లేవని సమాచారం. -
అనూహ్య నిర్ణయం : జీతంలో సగం వెనక్కి
యోకోహామా : జపనీస్ కారు దిగ్గజం నిస్సాన్ సీఈవో అనూహ్యం నిర్ణయం తీసుకున్నారు. వాహనాలను సరిగ్గా తనిఖీ చేయకుండా డీలర్లకు సరఫరా చేసిన కుంభకోణానికి బాధ్యతగా.. వచ్చే మార్చి వరకు తన వేతనంలో సగం వెనక్కి ఇచ్చేయనున్నట్టు పేర్కొన్నారు. అక్టోబర్‌లో ఈ మోసాన్ని ఒప్పుకున్న నిస్సాన్ 1.2 మిలియన్ వాహనాల్లో కొన్నింటిని రీకాల్ చేస్తున్నట్టు ప్రకటించింది. తమ స్టాఫ్ సరియైన అధికారం లేకుండా కొన్ని వాహనాలకు తుది తనిఖీలు చేపట్టారు. అనంతరం వాటిని డీలర్స్కు రవాణా చేశారని నిస్సాన్ పేర్కొంది. ''ఈ తప్పిదంలో భాగంగా అక్టోబర్ నుంచి నేను వేతనంలో సగ భాగాన్ని వెనక్కి ఇచ్చేస్తాను'' అని నిస్సాన్ ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హిరోటో సైకవా తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలోనే సైకవా కంపెనీ సీఈవోగా పదవీ బాధ్యతలు చేపట్టారు. తన వేతనాన్ని స్వచ్ఛదంగానే వెనక్కి ఇచ్చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఇతర ఎగ్జిక్యూటివ్‌లు కూడా ఇదే మాదిరి చేస్తారని తాను అర్థం చేసుకుంటున్నానని చెప్పారు. అయితే ఎగ్జిక్యూటివ్‌ల వేతనాలు ఏ మేర ఉన్నాయో ఇంకా స్పష్టంగా తెలియదు. ఈ స్కాండల్ విచారణ ఫలితాలను నిస్సాన్ రహదారి మంత్రిత్వ శాఖకు కూడా సమర్పించనుంది. ఒక ప్లాట్‌లో 1979 నుంచి ఇలా తప్పుడు తనిఖీలు చేపడుతున్నారని రిపోర్టుల ద్వారా తెలిసింది. కాగ, ఉద్యోగులకు ఈ తనిఖీకి సంబంధించిన ప్రాముఖ్యత తెలియదని విచారణ వెల్లడించింది. దీన్ని నిర్మూలించడానికి తుది తనిఖీలు చేపట్టేందుకు అర్హత ఉన్న స్టాఫ్‌నే ప్లాట్స్‌లోకి ప్రవేశించడానికి ఓ స్పెషల్ సెక్యురిటీ గేట్‌ను ఇన్స్టాల్ చేయాలని సూచించింది. -
ఉత్పత్తి నిలిపివేసిన నిస్సాన్
టోక్యో: జపాన్‌కు చెందిన రెండవ అతిపెద్ద ప్రముఖకార్ల ఉత్పత్తి సంస్థ నిస్సాన్ స్థానికంగా ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేసింది. జపాన్‌లోని అన్ని ప్లాంట్లలోను ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్టుగా గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. డీలర్లకు రవాణా చేయకముందే దేశీయ విఫణికి ఉద్దేశించిన కొన్ని వాహనాలపై సరైన అధికారం లేకుండా తుది తనిఖీలను నిర్వహించారని సంస్థ ప్రకటించింది. ఉద్గారాల కుంభకోణంలో తనిఖీల సందర్బంగా చోటుచేసుకున్న అక్రమాలు సంస్థను చిక్కుల్లోకి నెట్టగా, తాజా పరిణామంతో నిస్సాన్ మరింత ఇబ్బందుల్లో పడింది. సంస్థకు చెందిన కొంతమంది అనధికారిక వ్యక్తుల ద్వారా అక్రమాలు జరిగాయని అంగీకరించిన నిస్సాన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే భారీగా వాహనాలను రీకాల్ చేసిన సంస్థ చివరకు తాత్కాలింగా ప్రొడక్షన్ బ్యాన్ విధించింది. ఈ సంక్షోభ నివారణకు చర్యలు తీసుకున్నప్పటికీ, జపాన్ లోని 6 ప్లాంట్లలో అక్రమాలను గుర్తించినట్టు తెలిపింది. ఇది చాలా క్లిష్టమైందనీ, దీనిపై అత్యవసర చర్యలు మాత్రమే సరిపోవని భావించామని తెలిపింది. ఈ నేపథ్యంలో సంబంధిత చర్యల్ని తక్షణమే తీసుకోనే యోచనలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ ప్రకటించింది. సాధారణ కార్యక్రమాలలో భాగమైన పాత అలవాట్లు నిరోధించడానికి తాము కొత్త చర్యలు తీసుకోవలసి ఉందని నిస్సాన్ అధ్యక్షుడు హిరోతో సైకావా మీడియాకు చెప్పారు. కానీ త్వరలోనే ఉత్పత్తిని పునరుద్ధరిస్తామని వెల్లడించారు. -
మిత్సుబిషిలో మూడో వంతు వాటా నిస్సాన్ చేతికి
టోక్యో/న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన మిత్సుబిషి మోటార్స్ కార్పొరేషన్లో 34 శాతం వాటాను అదే దేశానికి చెందిన నిస్సాన్ మోటార్ కంపెనీ కొనుగోలు చేయనున్నది. ఈ వాటాను 200 కోట్ల డాలర్లకు నిస్సాన్ కొనుగోలు చేయనున్నది. దీనికి సంబంధించి వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకోవడానికి ఇరు కంపెనీల మధ్య ప్రాధమిక ఒప్పందం కుదిరింది. ఈ ఏడాది చివరకు ఈ డీల్ పూర్తవుతుందని అంచనా. ఈ డీల్ పూర్తయిన తర్వాత మిత్సుబిషి మోటార్స్ కార్పొరేషన్లో అతి పెద్ద వాటాదారుగా నిస్సాన్ అవతరిస్తుంది. ఎంఎంసీలో నిస్సాన్‌కున్న వాటాకు లభించే ఓటింగ్ హక్కుల ప్రకారం నిస్సాన్ నామినీ డెరైక్టర్‌కు మిత్సుబిషి కంపెనీ బోర్డ్‌కు చైర్మన్ అయ్యే అవకాశాలున్నాయి. తమ మోడల్ కార్లలో మైలేజీ అధికంగా వస్తుందని దొంగ లెక్కలు చూపించిదన్న స్కామ్‌లో ప్రస్తుతం ఎంఎంసీ కూరుకుపోయింది.