న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థలో సుస్థిరత, వినియోగదారుల విశ్వాసం పెరగడంతో ఈ జూలైలో మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్ వంటి ప్రధాన వాహన కంపెనీల విక్రయాలు రెండంకెల వృద్ధిని సాధించాయి. వ్యాధి సంక్రమణ రేటు భారీగా తగ్గుముఖం పట్టడంతో పాటు సెమి–కండెక్టర్ల సరఫరాను ఆటంకాలను ఆధిగమించి హోండా, నిస్సాన్, ఎంజీ మోటార్స్, స్కోడా కంపెనీలు అమ్మకాల్లో మెరుగైన వృద్ధిని సాధించాయి. దేశీయ వాహన దిగ్గజ సంస్థ మారుతీ సుజుకీ గతేడాది జూలైలో 1,01,307 వాహనాలను విక్రయించగా, ఈ ఏడాది జూలైలో 39 శాతం వృద్ధితో 1,41,238 వాహనాలను విక్రయించింది. హ్యుందాయ్ మోటార్ ఈ జూలైలో 48,042 వాహనాలను అమ్మింది. గతేడాది ఇదే జూలైలో విక్రయించిన 38,200 వాహనాలతో పోలిస్తే ఇది 26 శాతం అధికం.
కంపెనీ జూలై2021 జూలై2020 వృద్ధి/క్షీణత
మారుతీ సుజుకీ 1,41,238 1,01,307 39
హ్యుందాయ్ మోటార్స్ 48,042 38,200 26
టాటా మోటార్స్ 30,185 15,012 101
ఎంజీ మోటార్స్ 4225 2105 100
నిస్సాన్ 4,259 784 443
స్కోడా ఆటో 3,080 922 234
హోండా కార్ప్ 6,055 5,383 12
ద్విచక్రవాహనాలు
హీరో మోటోకార్ప్ 5,20,104 4,54,398 (–)13
రాయల్ ఎన్‌ఫీల్డ్ 44,038 40,334 9
Comments
Please login to add a commentAdd a comment