
మిత్సుబిషిలో మూడో వంతు వాటా నిస్సాన్ చేతికి
టోక్యో/న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన మిత్సుబిషి మోటార్స్ కార్పొరేషన్‌లో 34 శాతం వాటాను అదే దేశానికి చెందిన నిస్సాన్ మోటార్ కంపెనీ కొనుగోలు చేయనున్నది. ఈ వాటాను 200 కోట్ల డాలర్లకు నిస్సాన్ కొనుగోలు చేయనున్నది. దీనికి సంబంధించి వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకోవడానికి ఇరు కంపెనీల మధ్య ప్రాధమిక ఒప్పందం కుదిరింది.
ఈ ఏడాది చివరకు ఈ డీల్ పూర్తవుతుందని అంచనా. ఈ డీల్ పూర్తయిన తర్వాత మిత్సుబిషి మోటార్స్ కార్పొరేషన్‌లో అతి పెద్ద వాటాదారుగా నిస్సాన్ అవతరిస్తుంది. ఎంఎంసీలో నిస్సాన్‌కున్న వాటాకు లభించే ఓటింగ్ హక్కుల ప్రకారం నిస్సాన్ నామినీ డెరైక్టర్‌కు మిత్సుబిషి కంపెనీ బోర్డ్‌కు చైర్మన్ అయ్యే అవకాశాలున్నాయి. తమ మోడల్ కార్లలో మైలేజీ అధికంగా వస్తుందని దొంగ లెక్కలు చూపించిదన్న స్కామ్‌లో ప్రస్తుతం ఎంఎంసీ కూరుకుపోయింది.