ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర‍్తి మనువడు ఏకాగ్రహ్ రోహన్ కేవలం ఐదు నెలల వయస్సులో ఇన్ఫోసిస్ నుంచి రూ.4.2 కోట్లు దక్కించుకున్నాడు.
నారాయణ మూర్తి గత నెలలో తన మనవడు ఏకాగ్రహ్ రోహన్‌కు రూ. 240 కోట్ల కంటే ఎక్కువ విలువైన 15 లక్షల ఇన్ఫోసిస్ షేర్లను (0.04% వాటా) రాసిచ్చారు. ఈ తరుణంలో ఇన్ఫోసిస్ గురువారం క్యూ 4 ఫలిteతాలను ప్రకటించింది. క్యూ 4 ఫలితాలతో పాటు ఒక్కో ఈక్విటీ షేర్ పై రూ. 28 డివిడెండ్‌ను కూడా ప్రకటించింది. దీంతో ఇన్ఫోసిస్‌లో తన పేరు మీద ఉన్న మొత్తం 15లక్షల షేర్ల ద్వారా డివిడెండ్ రూపంలో ఏకాగ్రహ్ రోహన్ ఇప్పుడు రూ.4.2 కోట్లు అర్జించాడు.
నారాయణ్ మూర్తి, సుధా మూర్తి దంపతులకు ఇద్దరు పిల్లలు. కూతురు అక్షతా మూర్తి, కొడుకు రోహన్ మూర్తి. అక్షతా మూర్తి, 2009లో రిషి సునాక్(ప్రస్తుత బ్రిటన్ ప్రధాని)ను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కూతుళ్లు. ఇక రోహన్ మూర్తికి 2011లో టీవీఎస్ కంపెనీ ఛైర్మన్ వేణుశ్రీనివాస్ కుమార్తె లక్ష్మితో వివాహం జరిగింది. ఈ జంట 2015లో విడిపోయారు. 2019లో అపర్ణ కృష్ణన్‌ను వివాహం చేసుకున్నాడు. వీరి సంతానమే ఏకాగ్రహ్.
Comments
Please login to add a commentAdd a comment