దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పనికి తగ్గట్లు వేతనాలు ఇవ్వాలని ట్రోల్ చేస్తున్నారు. కానీ, ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ మాత్రం నారాయణ మూర్తి వ్యాఖ్యలతో ఏకీభవించారు.
ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో మోహన్ దాస్ పై’ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న నారాయణ మూర్తి భారతీయల పని సంసృ‍్కతిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యువత వారానికి 70 గంటలు పనిచేస్తే భారత్ ఆర్ధిక రంగంలో ఊహించని విజయాలు సాధించవచ్చని వ్యాఖ్యానించారు. చైనా లాంటి దేశాలతో పోల్చినా దేశంలో పని గంటలు తక్కువని, ప్రపంచంలోనే అత్యల్పమని వివరించారు. ఇలా కాకుండా రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన సమయంలో జపాన్, జర్మన్ ప్రజలు ఎలా విధులు నిర్వహించారో, అలా చేయాలని అభిప్రాయపడ్డారు.
Totally agree with Mr Murthy’s views. It’s not our moment to work less and entertain ourselves. Rather it’s our moment to go all in and build in 1 generation what other countries have built over many generations! https://t.co/KsXQbjAhSM
— Bhavish Aggarwal (@bhash) October 26, 2023
ఈ సందర్భంగా ప్రభుత్వాల్లోని అవినీతి, బ్యూరోక్రాట్స్ జాప్యం వంటి ఇతర సమస్యలను ప్రస్తావించారు. ‘‘ఉత్పాదకత విషయంలో భారత్ చాలా వెనుకబడి పోయింది. దీన్ని పెంచాలి. మెరుగుపరుచుకోకపోయినా, ప్రభుత్వంలో అవినీతిని ఏదో ఒక స్థాయిలో తగ్గించకపోయినా, అధికార యంత్రాంగం వేగంగా నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమైనా మనం ఏమీ సాధించలేం. అద్భుతమైన పురోగతి సాధించిన దేశాలతో పోటీ పడలేం’ అని తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు.
అయితే నారాయణ మూర్తి వ్యాఖ్యలపై ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్)లో పెద్ద దుమారమే చెలరేగింది. చాలామంది ఆయన వ్యాఖ్యలను ఖండించడం, విమర్శించడం చేశారు. కానీ... భవిష్ అగర్వాల్ మాత్రం మద్దతుగా మాట్లాడారు. ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘నారాయణ మూర్తి అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాం. తక్కువ పని చేసి మనల్ని మనం సమర్ధించుకోవడం కాదని ట్వీట్ చేశారు.
మరోవైపు టెక్కీలు మాత్రం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడి అభిప్రాయాలపై విభిన్నంగా స్పందిస్తున్నారు. 2005లో ఇన్ఫోసిస్‌లో కొత్తగా ఉద్యోగంలోకి చేరిన వారి వేతం ఏడాదికి రూ. 3.5 లక్షలుంటే 2023లోనూ అంతే ఇస్తున్నారని, ద్రవ్యోల్బణం నుంచి గట్టెక్కేలా రూ.15 లక్షల ప్యాకేజీ ఇస్తే .. అంచనాలకు మించి దాని కంటే 40 గంటలు అంకితభావంతో పనిచేస్తామని కొందరు ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లు మీరూ చేసేయండి.
Infosys fresher salary in 2005: 3.5 lakhs pa
— Abhishek (@MrAbhi_shek) October 26, 2023
Infosys fresher salary in 2023: 3.5 lakhs pa
If uncle adjusted inflation atleast, it would be well over 15LPA.
Pay that and then expect to work for 40 hours with full dedication. Everything will sort out as is. https://t.co/kaAXbgzhwB
Law limits work to 48 hours a week, but he wants 70. If we exclude Sundays, that's a grueling 12 hours a day. Dear Narayan murthy if youngsters work 12 hours daily, who will embrace your technology? It's time for your retirement; otherwise, Infosys faces a natural demise. https://t.co/7AesTZJWiS
— Abinash Sahoo (@irabinash) October 26, 2023
#Infosys management loooking for employees to work 70 hrs a week pic.twitter.com/VR9WkVZYck
— T.Ramesh (@hereiam_hi) October 26, 2023
First start paying salary to your Infosys employees like the companies pay in Germany and Japan. And then you call speak BS from your capitalist mouth.#NarayanaMurthy 🤡 pic.twitter.com/RO21ELrUbs
— 👑Che_ಕೃಷ್ಣ🇮🇳💛❤️ (@ChekrishnaCk) October 27, 2023
Indirectly #Infosys founder Narayana Murthy is saying..
— Sharanu.N🇮🇳 (@sharanu_ja) October 27, 2023
work 12 hours per day
spoil your mental health due to NO proper sleep
after spoiling ur health,spend lakhs of rupees in hospitals for ur treatment
increase the business of Infosys
increase profit,revenue of Infosys 😁😁 pic.twitter.com/YEEVdoEoig
Comments
Please login to add a commentAdd a comment