share
-
భార్య ఒడిలో కేఎల్ రాహుల్.. ‘ఓ బేబీ’ అంటూ బిడ్డ కోసం ఎదురుచూపులు (ఫొటోలు)
-
ప్రతిరోజు నీ ప్రేమలో.. భార్య గురించి మనోజ్ అలా (ఫొటోలు)
-
ఈ ‘టీమిండియా క్రికెటర్’ ప్రముఖ నటి రాధికా శరత్‌కుమార్ అల్లుడు (ఫొటోలు)
-
నువ్వు లేకుండా నేను ఏదీ చేయలేను.. లవ్యూ: మృణాల్ ఠాకూర్ (ఫొటోలు)
-
16 ఏళ్లయింది.. ఎన్టీఆర్ కోసం తెగ ఆరాటపడ్డ యాంకర్.. ఇన్నాళ్లకు! (ఫొటోలు)
-
బేబీ బంప్ 'ఫోటోలు' షేర్ చేసిన దీపికా పదుకోనె (ఫొటోలు)
-
సినిమా స్టార్స్ ఇంట్లో రాఖీ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
వయస్సు 5 నెలలే.. కానీ ఇన్ఫోసిస్ ద్వారా 4.2 కోట్లు సంపాదించాడు
ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి మనువడు ఏకాగ్రహ్ రోహన్ కేవలం ఐదు నెలల వయస్సులో ఇన్ఫోసిస్ నుంచి రూ.4.2 కోట్లు దక్కించుకున్నాడు. నారాయణ మూర్తి గత నెలలో తన మనవడు ఏకాగ్రహ్ రోహన్‌కు రూ. 240 కోట్ల కంటే ఎక్కువ విలువైన 15 లక్షల ఇన్ఫోసిస్ షేర్లను (0.04% వాటా) రాసిచ్చారు. ఈ తరుణంలో ఇన్ఫోసిస్ గురువారం క్యూ 4 ఫలిteతాలను ప్రకటించింది. క్యూ 4 ఫలితాలతో పాటు ఒక్కో ఈక్విటీ షేర్ పై రూ. 28 డివిడెండ్‌ను కూడా ప్రకటించింది. దీంతో ఇన్ఫోసిస్‌లో తన పేరు మీద ఉన్న మొత్తం 15లక్షల షేర్ల ద్వారా డివిడెండ్ రూపంలో ఏకాగ్రహ్ రోహన్ ఇప్పుడు రూ.4.2 కోట్లు అర్జించాడు. నారాయణ్ మూర్తి, సుధా మూర్తి దంపతులకు ఇద్దరు పిల్లలు. కూతురు అక్షతా మూర్తి, కొడుకు రోహన్ మూర్తి. అక్షతా మూర్తి, 2009లో రిషి సునాక్(ప్రస్తుత బ్రిటన్ ప్రధాని)ను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కూతుళ్లు. ఇక రోహన్ మూర్తికి 2011లో టీవీఎస్ కంపెనీ ఛైర్మన్ వేణుశ్రీనివాస్ కుమార్తె లక్ష్మితో వివాహం జరిగింది. ఈ జంట 2015లో విడిపోయారు. 2019లో అపర్ణ కృష్ణన్‌ను వివాహం చేసుకున్నాడు. వీరి సంతానమే ఏకాగ్రహ్. -
షేర్ ఎట్ డోర్ స్టెప్: దానానికి దగ్గరి దారి
దానాలు, విరాళాల ప్రక్రియను సులభతరం చేయడానికి ‘షేర్ ఎట్ డోర్ స్టెప్’ అనే సోషల్ వెంచర్‌కు శ్రీకారం చుట్టింది దిల్లీకి చెందిన అనుష్క జైన్. దాతల ఇంటికి వెళ్లి వారు ఇచ్చే దుస్తులు, పుస్తకాలు... మొదలైన వాటిని తీసుకొని ఎన్జీవోలకు పంపిణీ చేస్తుంది షేర్ ఎట్ డోర్ స్టెప్. ఏఐ టెక్నాలజీ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న స్వచ్ఛంద సంస్థలతో కనెక్ట్ అవుతోంది.... ‘ప్రతిరోజు పిల్లల బట్టలు, యూనిఫాంను చేతితో ఉతికేదాన్ని. షేర్ ఎట్ డోర్ స్టెప్ ద్వారా వాషింగ్ మెషిన్ అందిన తరువాత నాకు చాలా శ్రమ తప్పింది. ఎంతో టైమ్ మిగులుతోంది. ఈ టైమ్‌లో పిల్లలకు కథలు చెబుతున్నాను’ అంటోంది బెంగళూరుకు చెందిన ఒక బామ్మ. బెంగుళూరు నుంచి జైపూర్ వరకు ‘షేర్ ఎట్ డోర్ స్టెప్’ను ఎంతోమంది ప్రశంసిస్తున్నారు. దిల్లీకి చెందిన కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ అయిన అనుష్కకు ‘షేరింగ్’ కాన్సెప్ట్ కొత్త కాదు. గతంలోకి వెళితే... తన ప్రతి పుట్టినరోజుకి ‘ఇవి కావాలి అవి కావాలి’ అని కాకుండా ‘ఈరోజు ఏ ఎన్జీవోకు వెళదాం’ అని తల్లిని అడిగేది. నగరంలో ఉన్న ఏదో ఒక ఎన్జీవోకు వెళ్లి అక్కడ ఉన్నవారికి స్వీట్లు పంచేది. అలా ‘షేరింగ్’ అనే కాన్సెప్ట్ తనతోపాటు పెరిగి పెద్దదైంది. దాతృత్వానికి సంబంధించి కాలేజీ రోజుల్లో తనకు స్పష్టత వచ్చింది. చాలామందికి దానం చేయాలనే కోరిక ఉన్నా, సమయం లేకపోవడం వల్ల దూరభారం వల్ల చేయలేకపోతున్నారు. ‘డొనేషన్ ఏ స్వచ్ఛంద సంస్థకు ఇస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది;’ అనే విషయంలో చాలామందికి అవగాహన ఉండదు’ అంటున్న అనుష్క ఈ సమస్యకు ఒక పరిష్కారం వెదకాలనుకుంది. తన డ్రీమ్ కంపెనీలో ఉద్యోగంలో చేరిన అనుష్క నైట్‌షిఫ్ట్‌లో డ్యూటీ చేసేది. పగటిపూట సేవాకార్యక్రమాలపై దృష్టి పెట్టేది. ఉద్యోగంలో చేరినా ఎన్జీవోలకు డొనేట్ చేయాలనే ఆలోచన అనుష్కను వదలలేదు. దీంతో ఒక వెబ్సైట్ రూపొందించి డొనేట్ చేయాలనుకుంటున్నవారు తమ ఐటమ్స్‌ను రిజిస్టర్ చేసుకోవాలని కోరింది. రిజిస్టర్ కాగానే పొద్దున్నే వెళ్లి వాటిని కలెక్ట్ చేసుకొని వచ్చేది. పికప్స్ రెండు వందలు దాటిన తరువాత ‘ఇంకా ఏదైనా చేయాలి’ అనే ఆలోచనతో బెంగళూరులోకి అడుగుపెట్టింది అనుష్క. అక్కడ మరో కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్‌గా ఉద్యోగంలో చేరింది. 2018లో ‘షేర్ ఎట్ డోర్ స్టెప్’కు పూర్తి సమయాన్ని కేటాయించింది. ‘ఇంకా ఏదైనా చేయాలి’ అనే ఆలోచనతో బెంగళూరులోకి అడుగుపెట్టింది అనుష్క. 2018లో ‘షేర్ ఎట్ డోర్ స్టెప్’కు పూర్తి సమయాన్ని కేటాయించింది. ‘మా వెబ్సైట్లోకి వచ్చి పికప్ బుక్ చేయండి. మీరు విరాళంగా ఇవ్వాలనుకుంటున్న వస్తువు, అది తేలికైనదా, బరువైనదా అనేది తెలియజేయండి. మా ఏజెంట్లు నిర్ణీత సమయంలో మీ ఇంటి ముందు ఉంటారు. మీ విరాళాన్ని మాకు అనుబంధంగా ఉన్న ఎన్జీవోలలో ఒకదానికి పంపిస్తాం’ అంటూ అనుష్క చేసిన ప్రకటనకు అద్భుత స్పందన వచ్చింది. ఏ వస్తువులు ఏ ఎన్జీవోకు వెళ్లాలి... అనే విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సాంకేతికత సహాయం తీసుకుంటుంది అనుష్క. ‘షేర్ ఎట్ డోర్ స్టెప్’ ద్వారా కంపెనీలకు మార్కెటింగ్ సొల్యూషన్స్‌ను అందించడంతో పాటు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్)కు సంబంధించిన కార్యక్రమాలకు సహకారం అందిస్తోంది. ఇండివిడ్యువల్స్‌తో పాటు కార్పొరేట్ డోనర్స్ కోసం డోర్‌స్టెప్ డొనేషన్ సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘షేర్ ఎట్ డోర్ స్టెప్’ దేశీయంగా తిరుగులేని విజయం సాధించిన తరువాత ఈ కాన్సెప్ట్‌ను విదేశాలలో ప్రచారం చేయాలని ఆలోచన చేసింది. తొలి అడుగుగా సింగపూర్‌లో ప్రచారం చేసింది. అక్కడ లభించిన స్పందన అమితమైన ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇవ్వడంతో మరింత వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది అనుష్క. ఎంతో శక్తి ఇస్తుంది దానం చేయడానికి అవసరమైన స్ఫూర్తిæ ఒక్కో దేశంలో ఒక్కోరకంగా ఉండవచ్చు. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయాలనే ఉన్నత ఆలోచన మాత్రం దేశాల సరిహద్దులను చెరిపేసి అందరినీ ఒకటి చేస్తుంది. ఇతరులకు సహాయం చేయడం అనే పని మనకు ఎంతో శక్తి ఇస్తుంది. – అనుష్క జైన్ -
కుప్పకూలిన పేటిఎమ్ షేర్
-
రాజమౌళి- మహేశ్ కాంబోలోకి ఎంట్రీ ఇస్తున్న నాగార్జున
సూపర్ స్టార్ మహేశ్‌బాబు– కింగ్ నాగార్జున స్క్రీన్ షేర్ చేసుకోనున్నారని ఫిల్మ్‌నగర్ వర్గాలు అంటున్నాయి. ఇంతకీ ఈ కాంబినేషన్ ఏ సినిమాకీ? అంటే.. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా రూపొందనున్న చిత్రానికి అంటున్నారు. ‘గుంటూరు కారం’ సినిమా హిట్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న మహేశ్‌బాబు తన తర్వాతి చిత్రాన్ని ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. మహేశ్‌బాబు కెరీర్లో 29వ మూవీగా ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందనుంది. ఈ చిత్రానికి రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. ఇటీవలే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన ఈ ప్రాజెక్టు కోసం నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టారట రాజమౌళి. ఈ సినిమాలో సౌత్ ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్స్ కీలక పాత్రల్లో నటించనున్నారని తెలిసింది. ఇందులో భాగంగానే నాగార్జున కూడా కీలక పాత్రలో నటించనున్నారని టాక్. సినిమాలో చాలాప్రాధాన్యం ఉన్న ఓ పాత్రకి నాగార్జునని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట రాజమౌళి. నాగార్జునకి దక్షిణాదితో పాటు ప్రత్యేకించి బాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు ఉంది. అందుకే జాతీయ స్థాయిలో పేరున్న నాగార్జునను ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ కోసం తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భోగట్టా. ఏప్రిల్‌లో ఈ సినిమాప్రారంభం కానుంది. మరి మహేశ్‌బాబు– నాగార్జున కాంబో తెరపై కనిపిస్తుందా? అంటే ఇప్పటికైతే సమాధానం లేని ప్రశ్న. -
Vasanthi Krishnan: ఎంగేజ్మెంట్ ఫోటోలు షేర్ చేసిన బిగ్‌బాస్ బ్యూటీ (ఫోటోలు)
-
Maanas Nagulapalli Srija Wedding: తొలిసారి పెళ్లి ఫొటోలు షేర్ చేసిన 'బిగ్ బాస్' మానస్ (ఫొటోలు)
-
బీఎస్ఈ లాభం హైజంప్
న్యూఢిల్లీ: మార్కెట్ దిగ్గజం బొంబాయి స్టాక్ ఎక్ఛేంజ్ (బీఎస్ఈ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం నాలుగు రెట్లు దూసుకెళ్లి రూ. 118 కోట్లను అధిగమించింది. ఆదాయం పుంజుకోవడం ఇందుకు దోహదపడింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో కేవలం రూ. 29 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 53 శాతం జంప్‌చేసి రూ. 367 కోట్లను తాకింది. గత క్యూ2లో రూ. 240 కోట్ల ఆదాయం సాధించింది. ఈక్విటీ విభాగంలో రోజువారీ సగటు టర్నోవర్ రూ. 4,740 కోట్ల నుంచి రూ. 5,922 కోట్లకు ఎగసింది. రైట్స్ ఇష్యూ ద్వారా ఇండియా ఇంటర్నేషనల్ ఎక్సే్ఛంజ్(ఐఎఫ్ఎస్సీ) లిమిటెడ్(ఇండియా ఐఎన్ఎక్స్)లో రూ. 22.36 కోట్లు, ఇండియా ఇంటర్నేషనల్ ఎక్సే్ఛంజ్(ఐఎఫ్ఎస్సీ) లిమిటెడ్(ఇండియా ఐసీసీ)లో రూ. 33.88 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేసేందుకు బోర్డు అనుమతించినట్లు బీఎస్ఈ వెల్లడించింది. -
బై బై ముంబై
రజనీకాంత్ హీరోగా ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లైకా ప్రోడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల ముంబైలో ప్రారంభమైంది. రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ ముంబై షెడ్యూల్ ముగిసిందని వెల్లడించి, ఓ వర్కింగ్ స్టిల్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు మేకర్స్. ఇలా ముంబైకి బై బై చెప్పారు రజనీకాంత్. ఇక 1991లో విడుదలైన హిందీ చిత్రం ‘హమ్’ తర్వాత రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ కలిసి 33 ఏళ్లకు స్క్రీన్ షేర్ చేసుకుంటున్న చిత్రం ఇది. రానా, ఫాహద్ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవి చంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఓ సామాజిక అంశం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పోలీసాఫీసర్ పాత్రలో రజనీకాంత్ కనిపిస్తారని, వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల కానుందనే టాక్ వినిపిస్తోంది. -
ప్రస్తుతానికి అందుబాటులో లేను!
పుట్టినరోజు (అక్టోబర్ 13) సందర్భంగా పూజా హెగ్డే తన తాజా చిత్రం గురించి థ్రిల్లింగ్ న్యూస్ ఒకటి చెప్పారు. షాహిద్ కపూర్ సరసన తొలిసారి ఆమె కథానాయికగా నటించనున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని దర్శకుడు రోషన్ ఆండ్రూస్ తెరకెక్కించనున్నారు. ఇలా బర్త్ డేకి ఓ థ్రిల్లర్ మూవీకి సైన్ చేయడం పట్ల పూజా హెగ్డే ఆనందంగా ఉన్నారు. ‘‘ఇది నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. ఎందుకంటే కథాంశం కొత్తగా ఉంది. అలాగే నాది చాలా విభిన్నమైన పాత్ర. షాహిద్ కపూర్‌తో స్క్రీన్ షేర్ చేసుకోనుండటం హ్యాపీగా ఉంది. తను మంచి నటుడు. అందుకే ఈ సినిమా ప్రయాణాన్ని ఆరంభించడానికి ఆసక్తిగా ఉన్నాను’’ అని పేర్కొన్నారు పూజా హెగ్డే. ఇక పుట్టినరోజుని ఎలా జరుపుకున్నారంటే.. ప్రస్తుతం ఈ బ్యూటీ మాల్దీవుల్లో ఉన్నారు. ‘కరెంట్లీ అన్ అవైలబుల్’ (ప్రస్తుతం అందుబాటులో లేను) అంటూ మాల్దీవుల్లో సేద తీరుతున్న ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు పూజా హెగ్డే. -
మనం లాంటి అనుభూతి కలుగుతుంది – సుధీర్ బాబు
‘‘మామా మశ్చీంద్ర’లో త్రిపాత్రాభినయం చేశాను. ఏయన్నార్ ఫ్యామిలీ నటించిన ‘మనం’ చూసినప్పుడు అరుదైన సినిమాగా ఎలా అనుభూతి చెందారో, ‘మామా మశ్చీంద్ర’ చూశాక అలాంటి అనుభూతే కలుగుతుంది. ఈ సినిమాతో హర్షవర్ధన్ టాప్ డైరెక్టర్ అవుతారు’’ అన్నారు సుధీర్ బాబు. హర్షవర్ధన్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా నటించిన చిత్రం ‘మామా మశ్చీంద్ర’. ఇషా రెబ్బా, మృణాలినీ రవి హీరోయిన్లు. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 6న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను హీరో మహేశ్ బాబు షేర్ చేశారు. ‘‘మనం’ రచయితగా మీ అందరి ప్రేమాభిమానాలు పొందాను. ఇంతకాలం విరామం తీసుకొని ‘మామా మశ్చీంద్ర’ చేయడానికి కారణం.. ప్రేక్షకుల నమ్మకాన్ని వమ్ము చేయకూడదని’’ అన్నారు హర్షవర్ధన్. ‘‘ఈ చిత్రంలో ప్రతి పదిహేను నిమిషాలకు ఒక మలుపు, సర్ర్పైజ్ వస్తుంది’’ అన్నారు పుస్కూర్ రామ్మోహన్ రావు. -
మీ ఆనందమే నాకు సంతృప్తి - విజయ్ దేవరకొండ
‘‘నేను చదువుకునే రోజుల్లో ఫ్రెండ్స్ అంతా విహార యాత్రకు వెళ్తే నేను ఇంట్లో డబ్బులు అడిగి ఇబ్బందిపెట్టడం ఇష్టం లేక అలాగే ఉండిపొయేవాడిని. ఆ విహార యాత్రలో నా స్నేహితులు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో అని ఆలోచిస్తూ ఉండేవాడిని. తమ్ముడి (ఆనంద్ దేవరకొండ) ఇంజినీరింగ్ ఫీజు కోసం ఇబ్బంది పడుతున్నప్పుడు ఎవరైనా కొంత సహాయం చేస్తే బాగుండును అనిపించేది. కానీ ఎవర్నీ అడగడానికి ఇష్టం ఉండేది కాదు. అవన్నీ దాటుకుని ఈ స్థాయికి చేరుకున్నాను. ఇవాళ మీకు (అభిమానులు) హెల్ప్ చేయగలుగుతున్నాను అంటే అది నా వ్యక్తిగత ఆకాంక్ష. నేను అందించే ఈ లక్ష రూపాయలతో మీకు ఒత్తిడి తగ్గి ఆనందం కలిగితే అది నాకు సంతృప్తిగా ఉంటుంది’’ అన్నారు విజయ్ దేవరకొండ. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్‌లు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 1న విడుదలైంది. ‘ఖుషి’ సినిమా హ్యాపీనెస్‌ను షేర్ చేసేందుకు ఎంపిక చేసిన 100 లక్కీ ఫ్యామిలీస్‌కు రూ. లక్ష చొప్పున చెక్స్ అందించారు విజయ్ దేవరకొండ. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘ఈ ప్రోగ్రామ్‌ను అనౌన్స్ చేసినప్పటి నుంచి మాకు ఇప్పటివరకూ 50 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అయితే ఈ ఏడాది వంద మందికి మాత్రమే సహాయం చేయగలుగుతున్నాం. ప్రతి ఏడాది కొంతమందికి సహాయం చేస్తూనే ఉంటాను. నేను స్ట్రాంగ్‌గా ఉన్నంతవరకూ, సినిమాలు చేస్తున్నంతవరకూ నేను సహాయం చేస్తూనే ఉంటాను. మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, సౌత్ స్టేట్స్ నుంచి సెలెక్ట్ చేశారు. సౌత్‌లో అన్ని ప్లేసెస్ నుంచి మా సినిమాకు మంచి స్పందన లభించింది’’ అన్నారు శివ నిర్వాణ. ‘‘వంద మందికి సహాయం చేయాలనే ప్రయత్నం మా మూవీతో విజయ్ మొదలుపెట్టినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు నవీన్, రవిశంకర్. -
బ్రైట్‌కామ్ సీఎండీ, సీఎఫ్‌వోల రాజీనామా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ బ్రైట్‌కామ్ గ్రూప్ సీఎండీ సురేశ్ రెడ్డి, సీఎఫ్‌వో నారాయణ రాజు రాజీనామా చేశారు. ఇరువురి రాజీనామాను ఆమోదించినట్టు కంపెనీ బోర్డు ప్రకటించింది. కొత్త సీఈవో, సీఎఫ్‌వో కోసం అన్వేషణ ప్రారంభించేందుకు సైతం బోర్డు ఓకే చెప్పింది. కాగా, కంపెనీ ఆర్థిక వ్యవహారాలలో అకౌంటింగ్ అక్రమాలు, తప్పుడు స్టేట్మెంట్లను వెల్లడించినట్టు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ విచారణలో తేలడంతో.. ఆగస్టు 22న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వు ద్వారా సీఎండీ, సీఎఫ్‌వోలను బోర్డు స్థానాల నుండి సెబీ నిషేధించిన సంగతి తెలిసిందే. కంపెనీ తన షేర్ల ప్రాధాన్యత కేటాయింపులకు సంబంధించిన బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్లు కల్పితమని సెబీ కనుగొంది. దీనిని అనుసరించి బ్రైట్‌కామ్ గ్రూప్ షేర్లను విక్రయించకుండా శర్మ, 22 ఇతర సంస్థలను సెబీ నిషేధించింది. -
జాక్‌పాట్ కొట్టిన ఆనంద్ మహీంద్రా.. ఒక్కరోజే రూ.7,672 కోట్లతో
ముంబై: ఫార్మా, ఐటీ షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు రెండోరోజూ లాభపడ్డాయి. అయితే విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ఉపసంహరణ మార్కెట్ భారీ ర్యాలీకి ప్రతిబంధకంగా మారింది. ఈ వారంలో ఆర్బీఐ ద్రవ్య విధాన వైఖరి, అమెరికా ద్రవ్యోల్బోణ డేటాతో సహా పలు దేశాల కీలక స్థూల ఆర్థిక గణాంకాల వెల్లడి నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం సానుకూలంగా మొదలయ్యాయి. ట్రేడింగ్ ఆద్యంతం పరిమిత శ్రేణిలో లాభ, నష్టాల మధ్య కదలాడుతూ ఊగిసలాట వైఖరిని ప్రదర్శించాయి. సెన్సెక్స్ ఉదయం 90 పాయింట్లు పెరిగి 65,811 వద్ద మొదలైంది. ట్రేడింగ్‌లో 65,748 వద్ద కనిష్టాన్ని, 66,068 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 232 పాయింట్లు పెరిగి 65,953 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 60 పాయింట్లు బలపడి 19,577 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఇంట్రాడేలో 19,525 – 19,620 పరిధిలో కదలాడింది. ఆఖరికి 80 పాయింట్లు పెరిగి 19,597 వద్ద నిలిచింది. ఫార్మా, ఐటీతో పాటు ఇంధన, రియల్టీ, ఆటో షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు అరశాతం చొప్పున లాభపడ్డాయి. బ్యాంకులు, మెటల్, మీడియా, ఇంధన షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,893 కోట్ల షేర్లను విక్రయించగా, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1,081 కోట్ల షేర్లను కొన్నారు. సెన్సెక్స్ 232 పాయింట్లు లాభపడటంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ మొత్తం కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.22 లక్షల కోట్లు పెరిగి రూ.305.38 లక్షల కోట్లకు చేరింది. అమెరికా బాండ్లపై రాబడులు పెరగడం, యూరోజోన్ స్థూల ఆర్థిక గణాంకాలు నిరాశపరచడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో అధిక భాగం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు... ►జూన్ క్వార్టర్లో నికర లాభం 56.04% వృద్ధి చెందడంతో మహీంద్రా అండ్ మహీంద్రా షేరు 4% లాభపడి రూ.1,527 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో నాలుగున్నర శాతం దూసుకెళ్లి రూ.1,531 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. దీంతో కంపెనీ విలువ ఒక్క రోజులో రూ.7,673 కోట్లు పెరిగి రూ.1.90 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ సూచీలో అత్యధికంగా లాభపడిన షేరు ఇదే. ►యధార్థ్ హాస్పిటల్ అండ్ ట్రామా కేర్ సర్వీసెస్ లిమిటెడ్ షేరు లిస్టింగ్ రోజు 11% ర్యాలీ చేసింది. ఈక్విటీ మార్కెట్లలోని అస్థిరత పరిస్థితుల దృష్ట్యా బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.300)తో పోలిస్తే 2% స్వల్ప ప్రీమియంతో రూ.306 వద్ద లిస్టయ్యింది. ఒక దశలో 14% ఎగసి రూ.343 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 11% లాభంతో రూ.334 వద్ద స్థిరపడింది. ఎక్సే్చంజీలో మొత్తం 15.16 లక్షల ఈక్విటీ షేర్లు చేతులు మారాయి. కంపెనీ విలువ రూ.2,854 కోట్లుగా నమోదైంది. ► తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోవడంలో విఫలం కావడంతో బ్రిటానియా షేరు అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ఎన్ఎస్ఈలో రెండున్నర శాతానికి పైగా నష్టపోయి రూ.4,670 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో నాలుగుశాతం క్షీణించి రూ.4618 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని దిగివచ్చింది. నిఫ్టీ–50 సూచీలో అత్యధికంగా నష్టపోయిన షేరు ఇదే కావడం గమనార్హం. -
రేపు ప్రారంభంకానున్న శ్రీ టెక్‌టెక్స్ ఐపీవో - ధరల శ్రేణి ఇలా..
న్యూఢిల్లీ: టెక్నికల్ టెక్స్టైల్ తయారీ కంపెనీ శ్రీ టెక్‌టెక్స్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఈ నెల 26న ప్రారంభంకానున్న ఇష్యూకి ధరల శ్రేణి షేరుకి రూ. 54–61గా నిర్ణయించింది. 28న ముగియనున్న ఇష్యూలో భాగంగా 74 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. తద్వారా రూ. 45 కోట్లకుపైగా సమీకరించే యోచనలో ఉంది. యాంకర్ ఇన్వెస్టర్లకు నేడు(25న) షేర్లను కేటాయించనుంది. చిన్నతరహా కంపెనీల కోసం ఎన్ఎస్ఈ ఏర్పాటు చేసిన ఎమర్జ్ ప్లాట్‌ఫామ్ ద్వారా కంపెనీ షేర్లు లిస్ట్‌కానున్నాయి. ఇష్యూ నిధులను ఫ్యాక్టరీ షెడ్ నిర్మాణం, సోలార్ ప్లాంటు ఏర్పాటు, వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ ప్రధానంగా పీపీ నాన్ఒవెన్ ఫ్యాబ్రిక్‌ను వివిధ పరిమాణాల్లో తయారు చేస్తోంది. -
పెట్టుబడులు పీపీఎఫ్ నుంచి ఈక్విటీ పథకాల్లోకి ఎలా మళ్లించుకోవాలంటే?
నా వయసు 40 ఏళ్లు. పీపీఎఫ్‌లో నేను 15 ఏళ్లుగా ఇన్వెస్ట్ చేస్తున్నాను. వచ్చే ఏడాదితో గడువు ముగుస్తుంది. దీంతో గడువు ముగిసిన తర్వాత చేతికి అందే మొత్తాన్ని మెరుగైన వృద్ధి అవకాశాలున్న ఎన్పీఎస్, తదితర పథకాల్లో వచ్చే 15–20 ఏళ్ల కాలానికి పెట్టుబడులు పెడదామని అనుకుంటున్నాను. పీపీఎఫ్ నుంచి వచ్చే మొత్తం పన్ను రహితమని తెలుసు. ఈ మొత్తాన్ని క్రమంగా ఈక్విటీ పథకాల్లోకి ఎలా మళ్లించుకోవాలి? సూచించగలరు. – సుచిత్ పూతియా మీ పెట్టుబడుల నిధిని ఈక్విటీ పథకాల్లోకి మళ్లించుకోవడానికి ముందు మీరు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. మొదటిది ఎంత కాలానికి పెట్టుబడులు పెడుతున్నారనేది స్పష్టత ఉండాలి. సాధారణంగా ఏకమొత్తంలో డబ్బు ఉండి, ఈక్విటీల్లో పెట్టుబడులు పెడదామనుకుంటే.. గరిష్టంగా మూడేళ్లకు మించకుండా క్రమానుగతంగా (సిప్) ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఉదాహరణకు మీ వద్ద రూ.30 లక్షలు ఉన్నాయని అనుకుందాం. ఈ మొత్తాన్ని సమకూర్చుకోవడానికి ఐదేళ్ల కాలం పట్టింది. అప్పుడు ఈ మొత్తాన్ని 12 నుంచి 24 భాగాలు చేసుకోవాలి. అన్ని వాయిదాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల పెట్టుబడుల సగటు వ్యవయం, రిస్క్‌ను తగ్గించుకోవచ్చు. మీరు 15–20 ఏళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నారు. కనుక మీరు ఈక్విటీలకు ఎక్కువ కేటాయింపులు చేసుకోవచ్చు. ఈక్విటీ పెట్టుబడులు దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని మించి మెరుగైన రాబడిని ఇవ్వగలవు. ఇక మీ పెట్టుబడిని ఎన్పీఎస్ ఖాతాలో ఇన్వెస్ట్ చేసుకోవాలని అనుకుంటే, యాక్టివ్ చాయిస్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. 75 శాతాన్ని ఈక్విటీలకు కేటాయించుకోవాలి. ఎన్‌పీఎస్‌లో ఉపసంహరణల పరంగా ఆంక్షలు ఉన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. 60 ఏళ్లకు వచ్చిన తర్వాత ఎన్పీఎస్ మొత్తం నిధి నుంచి మీరు 60 శాతాన్నే ఉపసంహరించుకోవచ్చు. మిగిలిన 40 శాతంతో యాన్యుటీ ప్లాన్ కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనే అంటే, వైద్య వ్యయాలు, పిల్లల ఉన్నత విద్య, వివాహాల కోసం పాక్షిక ఉపసంహరణకు వెసులుబాటు ఉంటుంది. మీరు క్రమశిక్షణ కలిగిన ఇన్వెస్టర్‌గా ఎన్పీఎస్ నిధిని రిటైర్మెంట్ వరకు ముట్టుకోకుండా ఉంటే, అలాంటప్పుడు ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇవి అచ్చమైన ఈక్విటీ పథకాలు. ఉపసంహరణపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. ఎన్‌పీఎస్‌లో ఈక్విటీ పెట్టుబడులు మొత్తం లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్ చేస్తుంటారు. కానీ ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ మిడ్, స్మాల్‌క్యాప్‌లోనూ ఇన్వెస్ట్ చేయడం ద్వారా వైవిధ్యం పాటిస్తుంటాయి. దీనివల్ల మెరుగైన రాబడులకు అవకాశం ఉంటుంది. అయితే మీరు ఇంత వరకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయని వారు అయితే, పెట్టుబడులు మొత్తాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే విషయమై ఆందోళన ఉంటే అప్పుడు అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ అన్నవి 65 శాతం పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించి, 35 శాతాన్ని డెట్‌లో పెడుతుంటాయి. దీనివల్ల ఈక్విటీ అస్థిరతలు తగ్గి, మరింత స్థిరమైన రాబడులకు వీలు కలుగుతుంది. నాకు ఒక అన్‌లిస్టెడ్ కంపెనీలో 20 ఏళ్ల నుంచి పెట్టుబడులు ఉన్నాయి. సదరు అన్‌లిస్టెడ్ కంపెనీ, ఒక లిస్టెడ్ కంపెనీలో విలీనం అయింది. దీంతో నేను ఈ షేర్లను విక్రయించేశాను. మూలధన లాభాల పన్నును నేను ఎలా లెక్కించాలో చెప్పగలరు? – విష్ణుప్రియ మూలధన లాభాల పన్నును నిర్ణయించే ముందు అన్‌లిస్టెడ్ కంపెనీలో పెట్టుబడి దీర్ఘకాలమా? లేక స్వల్పకాలమా? అన్నది తేల్చాలి. ఏదైనా అన్‌లిస్టెడ్ షేరులో పెట్టుబడి 24 నెలలకు మించి కొనసాగించి ఉంటే, అది దీర్ఘకాలిక మూలధన ఆస్తి అవుతుంది. 24 నెలలకు మించి కొనసాగించినప్పుడు వచ్చే మూలధన లాభంపై 20 శాతం పన్ను పడుతుంది. దీని నుంచి ఇండెక్సేషన్ (ద్రవ్యోల్బణం ప్రభావం మినహాయింపు) ప్రయోజనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీల్లో రూ.లక్ష దీర్ఘకాల మూలధన లాభం వరకు పన్ను ఉండదని తెలిసిందే. అంతకుమించిన దీర్ఘకాల మూలధన లాభంపై 10 శాతం పన్ను పడుతుంది. కానీ, కొనుగోలు, విక్రయం సమయంలోనూ సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ చెల్లించనట్టయితే ఈ ప్రయోజనానికి అనర్హులు. కానీ, మీ కేసులో మీరు కొనుగోలు సమయంలో కాకుండా, కేవలం విక్రయించేటప్పుడే సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను చెల్లించారు. కనుక దీర్ఘకాల మూలధన లాభం నుంచి ద్రవ్యోల్బణం మినహాయించి, మిగిలిన మొత్తంపై 20 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ధీరేంద్ర కుమార్ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ప్రపంచ చరిత్రలో నష్ట జాతకుడు ఇతనే!
ప్రపంచంలో అత్యంత అదృష్టవంతుడు ఎవరో తెలుసా? జపాన్‌కు చెందిన సుటోము యమగుచి. ఎందుకంటే? ఇతను రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో హిరోషిమా, నాగసాకి అణు బాంబు దాడుల నుండి బయటపడిన వ్యక్తి . 1945 ఆగస్ట్ 6న అమెరికా యుద్ధ విమానం ఎనోలా గే 'లిటిల్ బాయ్' అనే బాంబును హిరోషిమాపై జారవిడిచింది. ఒక్క క్షణంలోనే నగరంలోని రెండున్నర లక్షల జనాభాలో 80 వేల మందిని మృత్యువు బలి తీసుకుంది. సరిగ్గా ఆ బాంబు ప్రదేశం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సుటోము ప్రాణాలతో బయటపడ్డారు. సుటోము యమగచి ఉన్న ప్రాంతంలో ప్రాణాలతో బయపడింది ఇయన ఒక్కరే. జపాన్ ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన ఏకైక వ్యక్తి ఇతడే. అందుకే ఇతను ప్రపంచంలోనే అంత్యంత లక్కీయస్ట్ పర్సన్‌గా గుర్తింపు పొందారు. మరి ప్రపంచంలో అత్యంత దురదృష్టవంతుడు ఎవరో తెలుసా? రోనాల్డ్ వేన్! వ్యాపార ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు. ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ మూడవ కో-ఫౌండర్. మరి అన్ లక్కీయస్ట్ పర్సన్ ఎందుకో తెలుసా? 290 బిలియన్ డాలర్ల షేర్లను కేవలం 800 డాలర్లకే అమ్మాడు. కాబట్టే ఇతనే వరల్డ్‌లోనే అన్ లక్కీయస్ట్ పర్సన్‌గా అప్రతిష్టను మూటగట్టుకున్నారు. సీఎన్‌బీసీ ‘ది ఫిల్తీ రిచ్ గైడ్’ ప్రకారం.. ఏప్రిల్ 1, 1976న కాలిఫోర్నియాలో స్టీవ్ వోజ్నియాక్ (21), స్టీవ్ జాబ్స్ (25), అనుభవంలోనూ, ఇటు వయస్సుల్లో పెద్దవారైన రోనాల్డ్ వేన్ (42) ముగ్గురు కలిసి టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీని ప్రారంభించారు. అదే రోజు యాపిల్ ముగ్గురు వ్యవస్థాపకుల్లో ఒకరైన రోనాల్డ్ వేన్.. కంపెనీలో ఎవరి బాధ్యతలు ఏంటో తెలుపుతూ ఓ అగ్రిమెంట్ రాశారు. దీంతో పాటు యాపిల్ ప్రొడక్ట్‌కు సంబంధించిన తొలి లోగోని తయారు చేశారు. ఐజాక్ న్యూటన్ ఒక చెట్టు కింద యాపిల్ తింటున్న ఫోటోని తయారు చేసింది ఇతనే. ఈ లోగోని ఏడాది కంటే తక్కువ కాలం ఉపయోగించింది యాపిల్ సంస్థ. ఇక, స్టీవ్ వోజ్నియాక్, స్టీవ్ జాబ్స్,రోనాల్డ్ వేన్ల భాగస్వామ్యంలో యాపిల్ సేవల్ని ప్రారంభించింది. కేవలం 12 రోజుల వ్యవధిలో అమెరికాలోనే తొలి యాపిల్ 1 కంప్యూటర్ను అమ్మిన కంప్యూటర్ రీటైల్ సంస్థ ‘బైట్ షాప్’ తమకు 100 కంప్యూటర్లను తయారు చేసి పెట్టాలంటూ యాపిల్‌కు ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ రానైతే వచ్చింది. తయారు చేసేందుకు చేతిలో చిల్లిగవ్వలేదు. అప్పుడే కంప్యూటర్ల తయారీకి వినియోగించే పరికరాల కోసం స్టీవ్ జాబ్స్ 15,000 డాలర్ల లోన్ తీసుకున్నారు. నిర్ధేశించిన గడువులోగా స్టీవ్ జాబ్స్ యాపిల్ కంప్యూటర్లను తయారు చేసి ఇచ్చారు. ఒప్పందం ప్రకారం.. కంప్యూటర్లను తయారు చేసి ఇవ్వనైతే ఇచ్చారు. కానీ తయారు చేసిన కంప్యూటర్ల తాలుకు బిల్స్ ఆగిపోయాయి. ఓ వైపు లోన్, మరో వైపు బైట్ షాప్ నుంచి రావాల్సిన డబ్బులు రాలేదు. అందుకే సంస్థలో కొనసాగితే ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనని బయపడ్డారు రోనాల్డ్ వేన్. యాపిల్ సంస్థ నష్టపోతే యువకులైన వోజ్నియాక్, జాబ్స్‌కు ఏమీ కాదు. ఎందుంకటే వాళ్ల చేతిలో ఏమీ లేవు. వేన్ అలా కాదే. అప్పటికే ధనవంతుడు. ఆస్తిపాస్తులు బాగానే సంపాదించారు. అందుకే తాను యాపిల్ సంస్థను వదిలేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటికే యాపిల్‌లో ఉన్న తన 10 శాతం వాటాను కేవలం 800 డాలర్లకు తన సహచరులకు అమ్మారు. ఆ విధంగా యాపిల్ సంస్థను విడిచిపెట్టాలని వేన్ తీసుకున్న నిర్ణయం అతనికి పెద్ద నష్టాన్ని మిగిల్చింది. నేడు,యాపిల్‌లో 10 శాతం వాటా విలువ 95 బిలియన్ల కంటే ఎక్కువగా ఉంటుంది. అదే వాటా వేన్ను సైతం ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరిగా నిలబెట్టేది. కానీ ఆ నిర్ణయమే ప్రపంచంలోనే అత్యంత అన్లక్కియస్ట్ పర్సన్‌గా నిలబెట్టింది. ఆశ్చర్యకరంగా, వేన్ తన నిర్ణయానికి చింతించలేదని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. యాపిల్ సంస్థ అభివృద్ది చెందలేదని, తాను రాబోయే 20 సంవత్సరాల పాటు డాక్యుమెంటేషన్ విభాగంలో విభాగంలో విధులు నిర్వహించాల్సి వచ్చేదని పేర్కొన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. చదవండి👉 ఆ ఇద్దరు ఉద్యోగుల కోసం.. రెండు కంపెనీల సీఈవోలు పోటీ..రేసులో చివరికి ఎవరు గెలిచారంటే? -
సాక్షి మనీ మంత్రా: నష్టాల ముగింపు, జీఎస్టీ సెగ, డెల్టా కార్ప్ ఢమాల్!
దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుస లాభాల నుంచి వెనక్కి తగ్గాయి. ఆరంభంలో లాభాల్లో ఉన్న సూచీలు లాభాల స్వీకరణతో ఫ్లాట్‌గా మారాయి. ఆ తరువాత మరింత నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 224 పాయింట్ల నష్టంతో 65394 వద్ద,నిఫ్టీ 55 పాయింట్లు క్షీణించి 19384 వద్ద ముగిసాయి. తద్వారా నిఫ్టీ 19400దిగువకు చేరింది. ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్ షేర్లు లాభపడగా, ఐటీ షేర్లు నష్టపోయాయి. ఓఎన్జీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, కోటక్ మహీంద్ర బ్యాంకు, ఐషర్ మోటార్స్,సన్‌ఫార్మా టాప్ విన్నర్స్‌గా నిలిచాయి. మరోవైపు ఎల్‌టిఐఎండ్‌ట్రీ, అల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్ అదానీ ఎంటర్ప్రైజెస్ బీపీసీఎల్, టాటా మోటార్స్, బజాజ్ ఆటో నష్టపోయాయి. మరోవైపు రానున్న ఫలితాల నేపథ్యంలో టీసీఎస్, హెచ్‌సీఎల్ నష్టపోయాయి. జీఎస్టీ పెంపు: కుప్పకూలిన డెల్టా కార్ప్ మరోవైపు క్యాసినో ఆపరేటర్ డెల్టా కార్ప్ లిమిటెడ్ ఏకంగా 25 శాతం కుప్పకూలింది. తాజా జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కాసినోలపై జీఎస్టీ 18-28 శాతానికిపెంచడంతో25 లోయర్ సర్క్యూట్లో లాక్ అయింది. ఇది రెండు నెలల కనిష్ట స్థాయి. రికార్డులో స్టాక్‌కి ఇదే అతిపెద్ద సింగిల్ డే డ్రాప్ కూడా. ఫలితంగా సంస్థ మార్కెట్ క్యాప్ రూ.1,600 కోట్లు నష్టపోయింది. ఈ క్షీణత దాని మొత్తం ఆర్థిక సంవత్సరం 2023 ఆదాయం రూ.1,021 కోట్ల కంటే ఎక్కువే కావడం గమనార్హం. అటు మంగళవారం నాటి ముగింపు 82.36తో పోలిస్తే బుధవారం డాలర్‌తో రూపాయి 12 పైసలు పెరిగి 82.24 వద్ద ముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
‘70 ఏళ్ల మా అమ్మ నా పక్క సద్దుతుంది’.. అనగానే..
సోషల్ మీడియాలో ఒక వ్యక్తి షేర్ చేసిన ఫొటో ఇప్పుడు చర్చల్లోకి వచ్చింది. కిశోర్ స్వామి అనే అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో తన తల్లి 70 ఏళ్ల వయసులోనూ తన బెడ్ నీట్‌గా సద్దుతుందని, దీనిని చూస్తే ఆమె ఒక శక్తివంతమైన గృహిణి అనిపిస్తుందని పేర్కొన్నారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు పలు విధాలుగా రియాక్ట్ అవుతున్నారు. కొందరు ఈ ఫొటోను షేర్ చేసిన కిశోర్ తీరుకు మండిపడుతున్నారు. అతని దృష్టికోణం మారాలని, అతను ఆలోచనా తీరు మార్చుకోవాలని సూచిస్తున్నారు. ఆ వ్యక్తి ఫొటోకు క్యాప్షన్‌గా..‘70 ఏళ్లు దాటిన మా అమ్మ నేను ఇంటికి వచ్చేసరికి నా కోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తుంది. నా పక్కను పరిశుభ్రంగా ఉంచుతుంది. దీనిని చూస్తే ఆమె అత్యుత్తమ గృహిణి అని అనిపిస్తుందని రాశారు. ఆమెకు ఇటువంటి పనులు చేయాల్సిన అవసరం లేదని, అయినా ప్రేమతో ఈ పనులను చేస్తుందని’ పేర్కొన్నారు. ఈ పోస్టుకు ట్విట్టర్లో వెంటనే ప్రతిస్పందనలు వచ్చాయి. ఒక యూజర్ ‘మీకు సిగ్గులేదు. మీరు ఉదయాన్నే మీ పక్క సద్దుకోకుండా, మీ 70 ఏళ్ల అమ్మ చేత ఈ పని చేయిస్తున్నారు. మీరంటున్నట్లు ఇది గృహధర్మం కాదు.. పెద్దలను పీడించడం. వారికి గౌరవం ఇవ్వకపోవడం’ అని పేర్కొన్నారు. మరో యూజర్.. ఈ వ్యక్తి ఇటువంటి పోస్టుతో అపనమ్మకాన్ని పోషించే పనిచేస్తున్నారు’ అని ఆరోపించారు. ఇంకొక యూజర్ ‘మీ అమ్మ అంత పెద్ద వయసులోనూ పనులు చేస్తుంటే మీరు దానిని గొప్పగా చెప్పడం వింతగా ఉందని కామెంట్ చేశారు. Though 70+ my mom ensures that when I reach home , my bed is comfortable. The power of a home maker. There is no compulsion for her to do it. Yet she does it out of love. The value system that our dharma has inculcated protects this society. pic.twitter.com/t58Fir5IrT — kishore k swamy 🇮🇳 (@sansbarrier) July 7, 2023 దీనికి భిన్నంగానూ కొందరు యూజర్లు కామెంట్ చేశారు. ‘ఈ ఫొటోపై వస్తున్న కామెంట్లు చూస్తే, ఆశ్చర్యం కలుగుతున్నదని, మనం తల్లి మాతృత్వంలోని గొప్పదనాన్ని అర్థం చేసుకోలేమని, ఇటువంటి పనులు చేయడంలో ఆమెకు ఆనందం కలుగుతుందని’ ఒక యూజర్ పేర్కొన్నారు. మరో యూజర్ ‘అతని తల్లి ఈ పనులను బలవంతం మీద చేయడంలేదని, ప్రేమతోనే చేస్తున్నదని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: వైద్యునికి షాకిచ్చిన సమోసాలు.. రూ.1.40 లక్షలకు టోకరా! -
సీఎంఎస్ ఇన్ఫోలో తగ్గిన వాటా
న్యూఢిల్లీ: నగదు నిర్వహణ, చెల్లింపుల కంపెనీ సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్‌లో ప్రమోటర్ సంస్థ దాదాపు 14 శాతం వాటాను విక్రయించింది. ప్రమోటర్ కంపెనీ సియాన్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ 13.7 శాతం వాటాకు సమానమైన 2.12 కోట్ల షేర్లను విక్రయించింది. ఎన్ఎస్ఈ బల్క్ డీల్ వివరాల ప్రకారం ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా షేరుకి 300.23 సగటు ధరలో వాటాను దాదాపు రూ. 638 కోట్లకు అమ్మివేసింది. వేల్యూక్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజర్స్, ఎస్బీఐ ఎంఎఫ్, ఐఐఎఫ్ఎల్ ఎంఎఫ్, 306 వన్ ఎంఎఫ్, నార్జెస్ బ్యాంక్, అబుధాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ సీఎంఎస్ షేర్లను కొనుగోలు చేశాయి. ఈ లావాదేవీల తదుపరి సీఎంఎస్ ఇన్ఫోలో సియాన్ ఇన్వెస్ట్మెంట్ వాటా 60.24 శాతం నుంచి 46.54 శాతానికి తగ్గింది. వాటా విక్రయ వార్తలతో సీఎంఎస్ ఇన్ఫో షేరు ఎన్ఎస్ఈలో 6 శాతం పతనమై రూ. 307 వద్ద ముగిసింది. -
దేవర మూవీ కోసం ఎన్టీఆర్ మాస్టర్ ప్లాన్...
-
యాక్సిస్ బ్యాంక్‌కు కేంద్రం గుడ్‌బై!
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ నుంచి ప్రభుత్వం పూర్తిగా వైదొలగనుంది. యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ప్రత్యేక విభాగం (ఎస్‌యూయూటీఐ) ద్వారా మిగిలిన 1.55% వాటాను ప్రభుత్వం విక్రయించనున్నట్లు యాక్సిస్ బ్యాంకు తాజాగా పేర్కొంది. మొత్తం 4,65,34,903 షేర్లను ప్రభుత్వం ఆఫర్ చేయనున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. తద్వారా ప్రభుత్వానికి సుమారు రూ. 4,000 కోట్లు లభించే వీలుంది. వెరసి యాక్సిస్ బ్యాంకు నుంచి ప్రభుత్వం పూర్తిగా వైదొలగనుంది. కాగా.. గతేడాది మే నెలలోనూ ప్రభుత్వం ఎస్‌యూయూటీఐ ద్వారా యాక్సిస్ బ్యాంకులో 1.95 శాతం వాటాను విక్రయించింది. ఈ వార్తల నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్ షేరు 4% పతనమై రూ. 841 వద్ద ముగిసింది. -
వోల్టాస్‌లో అదనపు వాటా కొనుగోలు చేసిన ఎల్ఐసీ
న్యూఢిల్లీ: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) తాజాగా వోల్టాస్‌లో 2 శాతం వాటా పెంచుకుంది. బహిరంగ మార్కెట్ ద్వారా రూ.634.5 కోట్ల విలువైన వాటాలను కొనుగోలు చేసింది. ఈ డీల్ తదనంతరం వోల్టాస్‌లో ఎల్ఐసీ వాటా 8.884 శాతానికి ఎగసింది. ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, ఎలక్ట్రో-మెకానికల్ ప్రాజెక్టుల రంగంలో వోల్టాస్ నిమగ్నమైంది. సోమవారం నాటి రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం, ప్రభుత్వ యాజమాన్యంలోని జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ, వోల్టాస్‌లో తన వాటాను 2,27,04,306 షేర్ల (6.862 శాతానికి సమానం)నుండి 2,93,95,224 (8.884 శాతం)కిపెంచుకుంది. దీంతో ఎల్ఐసీ 0.84 శాతం లాభంతో రూ.633 వద్ద, వోల్టాస్ 1.24 శాతం క్షీణించి రూ.834 వద్ద ముగిసింది. -
టాటా మోటర్స్‌లో ఎల్ఐసీకి 5 శాతం వాటా
గడిచిన పది నెలల్లో వాహనాల తయారీ సంస్థ టాటా మోటార్స్‌లో జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) వాటాలు 5 శాతానికి పెరిగాయి. స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసిన సమాచారం ప్రకారం గతేడాది డిసెంబర్ 3 నుండి ఈ ఏడాది అక్టోబర్ మధ్య కాలంలో ఎల్ఐసీ తన షేర్లను 16.59 కోట్ల నుంచి 16.62 కోట్లకు (వాటాలు 4.997 శాతం నుంచి 5.004 శాతానికి) పెంచుకుంది. ఇందుకోసం షేరు ఒక్కింటికి సగటున రూ. 455.69 చొప్పున రూ. 11.39 కోట్లు వెచ్చించింది. టాటా మోటర్స్ మార్కెట్ క్యాప్ రూ. 1.38 లక్షల కోట్లుగా ఉంది. నియంత్రణ సంస్థ నిబంధనల ప్రకారం ఏదైనా సంస్థలో తమ వాటాలు 5 శాతం దాటితే లిస్టెడ్ కంపెనీలు తప్పనిసరిగా స్టాక్ ఎక్స్చేంజీలకు తెలియజేయాలి. మంగళవారం ఎల్ఐసీ షేర్లు స్వల్పంగా పెరిగి రూ. 605 వద్ద, టాటా మోటర్స్ షేర్లు 2 శాతం పెరిగి రూ. 421.50 వద్ద ముగిశాయి. -
" లైక్, షేర్ & సబ్‌స్క్రైబ్ " మూవీ టీంతో చిట్ చాట్
-
రూ.2,500 కోట్ల షేర్లను బైబ్యాక్ చేశాం, బజాజ్ ఆటో ప్రకటన
న్యూఢిల్లీ: బజాజ్ ఆటో తన వాటాదారుల నుంచి 64,09,62 షేర్లను బైబ్యాక్ చేసింది. ఇందుకు రూ.2,500 కోట్లు వెచ్చించినట్టు ప్రకటించింది. జూలై 4న బజాజ్ ఆటో షేర్ల బైబ్యాక్‌ను ప్రారంభించింది. సోమవారం సమావేశమైన బైబ్యాక్ కమిటీ, అక్టోబర్ 10తో బైబ్యాక్ ముగించేందుకు ఆమోదం తెలిపినట్టు పేర్కొంది. బహిరంగ మార్కెట్లో ఒక్కో షేరును రూ.4,600కు మించకుండా కొనుగోలు చేయా లని ఈ ఏడాది జూన్ 27న బజాజ్ ఆటో నిర్ణయించడం గమనార్హం. బైబ్యాక్ తర్వాత ప్రమోటర్లు, ప్రమోటర్ల గ్రూపు మొత్తం వాటా 53.77 శాతం నుంచి 54.98 శాతానికి పెరిగింది. -
కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు భారీ ఊరట!
న్యూఢిల్లీ: ఆర్కాడియా షేర్, స్టాక్ బ్రోకర్లకు సంబంధించిన షేర్ తనఖా కేసులో కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్)లో ఊరట లభించింది. ఈ వ్యవహారంలో స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్ఈ డిపాజిటరీ సీడీఎస్ఎల్ (సెంట్రల్ డిపాజిటరీ సర్వీస్ లిమిటెడ్–ఇండియా) జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేసింది. నాన్-ట్రేడింగ్ సభ్యునికి ఆదేశాలు జారీ చేసే అధికారాలు ఎన్ఎస్ఈ, సీడీఎస్ఎల్కు ఉండబోవని అప్పీలేట్ అథారిటీ స్పష్టం చేసింది. (ఢిల్లీ టూ సిమ్లా: విమాన టికెట్ ధర కేవలం రూ. 2480) కేసు వివరాలు ఇవీ... మార్చి 2008లో, ఆర్కాడియా తన షేర్ల తాకట్టు ఆధారంగా కోటక్ మహీంద్రా బ్యాంక్ నుంచి రుణాన్ని పొందింది. తనఖా షేర్ల చట్టపరమైన, ప్రయోజనం పొందిన యజమాని ఆర్కాడియా మాత్రమేనని, సెక్యూరిటీ స్వాధీన చర్యలను బ్యాంక్ చేపట్టకూడదని ఈ మేరకు జరిగిన ఒప్పందం పేర్కొంది. అయితే డిసెంబర్ 2020 నాటికి, ఆర్కాడియా తన రీపేమెంట్ బాధ్యతల విషయంలో విఫలం అవడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో తాకట్టు పెట్టిన సెక్యూరిటీలను తమ స్వాధీనంలోకి తీసుకునే ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ఆర్కాడియాకు బ్యాంక్ 2021 ఫిబ్రవరి 15వ తేదీన తెలియ జేసింది. దీనితో ఆర్కాడియా ఈ వ్యవహారంపై ఎన్ఎస్ఈ న్యాయ విభాగాన్ని ఆశ్రయించింది. తనఖా పెట్టిన ఆర్కాడియా అనుమతి లేకుండా షేర్ల స్వాధీనం కుదరదని ఎన్ఎస్ఈ బ్యాంక్‌కు స్పష్టం చేసింది. ఎన్ఎస్ఈ ఆదేశాల నేపథ్యంలో ఆర్కాడియా డీమ్యాట్ అకౌంట్‌ను సీడీఎస్ఎల్ స్తంభింపజేసింది. దీనితో ఆర్కాడియా తనఖా పెట్టిన షేర్లను బ్యాంక్ తన స్వాధీనంలోకి తీసుకోలేకపోయింది. ఈ వివాదంపై అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను కోటక్ బ్యాంక్ ఆశ్రయించింది. (Vivo Y35: స్లిమ్ ఫోన్ ‘వై35’ ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?) రూలింగ్ ఇలా... స్టాక్ ఎక్స్చేంజ్గా ప్రతివాది (ఎన్ఎస్ఈ) దాని ట్రేడింగ్ సభ్యులపై మాత్రమే అధికార పరిధిని కలిగి ఉంటుందని శాట్ స్పష్టం చేసింది. ట్రేడింగ్ సభ్యుడు కాని అప్పీలుదారు (కోటక్ మహీంద్రా బ్యాంక్)తో సహా మరే ఇతర సంస్థకు ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేమని పేర్కొంది. అదేవిధంగా, డిపాజిటరీ కూడా తన అధికార పరిధిలో లేని ఏ ఇతర సంస్థకు వ్యతిరేకంగా ఎలాంటి ఆదేశాలను జారీ చేయలేదని, లేదా అప్పీలుదారుకు అనుకూలంగా తాకట్టు పెట్టిన సెక్యూరిటీలను స్తంభింపజేయ జాలదని స్పష్టం చేసింది.ఆర్కాడియా తనఖా షేర్లపై -
పేటీఎంలో ఎఫ్‌పీఐల వాటాలు అప్
న్యూఢిల్లీ: విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ), మ్యూచువల్ ఫండ్లు ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్‌లో స్వల్పంగా వాటాలు పెంచుకున్నాయి. స్టాక్ ఎక్ఛేంజీ కంపెనీ ఇచ్చిన సమాచారం ప్రకారం ఎఫ్‌పీఐల సంఖ్య మార్చి త్రైమాసికంలో 54గా ఉండగా జూన్ క్వార్టర్లో 83కి పెరిగింది. వారి దగ్గరున్న షేర్ల సంఖ్య 2,86,80,948 నుంచి 3,53,72,428కి చేరింది. దీంతో సంస్థలో ఎఫ్‌పీఐల వాటా 4.42 శాతం నుంచి 5.45 శాతానికి పెరిగింది. మరోవైపు, ఇదే వ్యవధిలో మ్యుచువల్ ఫండ్స్ సంఖ్య కూడా 3 నుంచి 19కి చేరింది. వాటి దగ్గరున్న షేర్ల సంఖ్య 68,19,790 నుంచి 74,02,309కి పెరిగింది. జూన్ త్రైమాసికంలో పేటీఎం షేరు 18 శాతం పెరిగి రూ. 675కి చేరింది. ప్రస్తుతం గురువారం బీఎస్ఈలో రూ. 745 వద్ద క్లోజయ్యింది. -
దిగ్గజాలకు షాక్: వొడాఫోన్ ఐడియాలో భారీ పెట్టుబడులు?!
సాక్షి, ముంబై: దేశీయ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియాలో ఈ-కామర్స్ దిగ్గజం దిగ్గజం అమెజాన్ భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. అమెజాన్ ఏకంగా 20వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుందన్న నివేదికలు వెలువడ్డాయి. దీంతో వొడాఫోన్ ఐడియా షేరు 5శాతం లాభపడింది. ఈ భారీ పెట్టుబడుల అంచనాలతో వొడాఫోన్ ఐడియా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో కంపెనీ షేరు ఇంట్రా డేలో రూ.9.36కి చేరింది. అలాగే గత రెండు రోజుల్లో ఈ షేరు 7.33 శాతం లాభపడింది. ఇప్పటిదాకా అమెరికా టెక్ కంపెనీలనుంచి ఎలాంటి పెట్టుబడులు సాధించలేని ఏకైక టెల్కో వొడాఫోన్ ఐడియా. తాజా అంచనాలు అమలైతే కంపెనీకి భారీ పెట్టుబడి సమకూరినట్టే. గత రెండున్నరేళ్లుగా, అమెరికా టెక్ దిగ్గజాలు ఫేస్బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇండియాలో తమ క్లౌడ్ సేవల్ని మరింత బలోపేతం చేసేందుకు దేశీయ టాప్ టెలికాం ఆపరేటర్లు జియో, ఎయిర్‌టెల్‌లో భారీ పెట్టుబడి పెట్టాయి. కాగా రుణ సంక్షోభంలో చిక్కుకున్న వొడాఫోన్ ఐడియా మూల ధన సేకరణ నిమిత్తం ఇన్వెస్టర్ల వేటలో ఉన్న సంగతి తెలిసిందే. ఫండ్ రైజింగ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని నెట్‌వర్క్‌లో పెట్టుబడికి ఉపయోగించాలని కూడా యోచిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.7,023 కోట్ల నష్టంతో పోలిస్తే ఈ క్యూ4లో రూ.6,563 కోట్ల కన్సాలిడేటెడ్ నష్టాన్ని టెల్కో నివేదించింది. అయితే నవంబర్ 25, 2021 నుంచి అమలైన టారిఫ్ పెంపుతో ఏడాది క్రితం రూ. 9,608 కోట్ల నుండి క్యూ4లో కార్యకలాపాల ఆదాయం 6.5 శాతం ఎగిసి రూ. 10,240 కోట్లకు పెరిగింది. అలాగే మార్చితో ముగిసిన త్రైమాసికంలో, కంపెనీ పది లక్షలకు కంటే ఎక్కువ కొత్త 4జీ సబ్స్క్రైబర్లను సాధించింది. -
ఇండస్ టవర్స్‌లో ఎయిర్‌టెల్‌కు 4.7% వాటా!
న్యూఢిల్లీ: యూరో పసిఫిక్ సెక్యూరిటీస్ నుంచి ఇండస్ టవర్స్‌లో 4.7 శాతం వాటాల కొనుగోలు ప్రక్రియ పూర్తయినట్లు భారతి ఎయిర్టెల్ మంగళవారం వెల్లడించింది. షేరు ఒక్కింటికి రూ. 187.88 రేటు చొప్పున తమ అనుబంధ సంస్థ నెటిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ 12,71,05,179 షేర్లను కొనుగోలు చేసినట్లు వివరించింది. వొడాఫోన్ గ్రూప్‌లో యూరో పసిఫిక్ సెక్యూరిటీస్ భాగంగా ఉంది. ఇండస్ టవర్స్ (గతంలో భారతి ఇన్ఫ్రాటెల్) సంస్థ వివిధ మొబైల్ ఫోన్ సర్వీస్ ఆపరేటర్ల కోసం టెలికం టవర్లు మొదలైన మౌలిక సదుపాయాలను నిర్వహిస్తోంది. 22 టెలికం సర్కిళ్లలో 1,84,748 టవర్లతో ఇండస్ టవర్స్ దేశీయంగా అతి పెద్ద టవర్ ఇన్ఫ్రా కంపెనీల్లో ఒకటి. -
ఎక్కడా దాక్కోలేదు.. కీవ్‌లోనేఉన్నా.. సోషల్ మీడియాలో లోకేషన్ షేర్ చేసిన జెల్‌న్‌స్కీ
I'm Not Hiding, I'm Not Afraid Of Anyone: రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం నేటికి 13వ రోజుకి చేరుకుంది. రష్యా బలగాలకు ధీటుగా ఉక్రెయిన్ బలగాలు కూడా సమర్థవంతంగా ప్రతిదాడి చేస్తున్నాయి. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ చాలా దారుణంగా అతలా కుతలమైనప్పటికీ మా దేశాన్ని, ప్రజల్ని కాపాడుకుంటాం అంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తన దేశ భక్తిని చాటుతున్నారు. ఈ మేరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు పారిపోయాడని, అజ్ఞాతంలో ఉన్నారంటూ రకరకాల వదంతులు వ్యాపించాయి. దీంతో జెలెన్ స్కీ తాను ఇక్కడే ఉన్నా దేశం కోసం పోరాడుతున్నా అంటూ సెల్ఫీ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు కూడా. అయితే ఇప్పుడు మళ్లీ జెలెన్స్కీ తాజాగా ఒక వీడియోని పోస్ట్ చేశారు. ఆ వీడియోలో జెలెన్ స్కీ తన కార్యాలయంలోని డెస్క్ వద్ద కూర్చొని తన లోకేషన్ షేర్ చేస్తూ మాట్లాడారు. ఈ మేరకు జెలెన్ స్కీ వీడియోలో మాట్లాడుతూ..."నేను బంకోవా స్ట్రీట్‌లోని కైవ్‌లో ఉన్నాను. నేను ఎక్కడ దాక్కోలేదు. ఎవరికి భయపడను. మేమంతా పనిచేస్తున్నాము. రష్యాపై యుద్ధ సమయంలో ఉక్రెయిన్ సాయుధ దళాలు చేసిన సేవలకు ధన్యవాదాలు. ఉక్రెయిన్ తప్పక విజయం సాధింస్తుంది" అనే తన నమ్మకాన్ని పునరుద్ఘాటించాడు. View this post on Instagram A post shared by Володимир Зеленський (@zelenskiy_official) (చదవండి: రష్యాతో పోరాడేందుకు ఉక్రెయిన్ సైన్యంలో చేరిన తమిళ విద్యార్థి) -
‘ఎఫ్2’లో కల్ట్ఫిట్కు వాటాలు
న్యూఢిల్లీ: హెల్త్, వెల్నెస్ ప్లాట్‌ఫామ్ కల్ట్‌డాట్‌ఫిట్ తాజాగా ఎఫ్2 ఫన్ అండ్ ఫిట్నెస్ ఇండియాలో మెజారిటీ వాటాలు కొనుగోలు చేసింది. అయితే, ఇందుకోసం ఎంత మొత్తం వెచ్చించినదీ మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం ఎఫ్2 ఫన్ అండ్ ఫిట్నెస్ సంస్థ.. భారత్‌లో గోల్డ్స్ జిమ్‌కు మాస్టర్ ఫ్రాంచైజీ పార్ట్నర్గా ఉంది. ప్రస్తుత గోల్డ్స్ జిమ్ సెంటర్ల ఆదాయాలను పెంచేందుకు, ఫ్రాంచైజీలను మరింతగా విస్తరించేందుకు కల్ట్‌డాట్‌ఫిట్ ఇన్వెస్ట్ చేయనుంది. అలాగే శ్రీలంక, బంగ్లాదేశ్, మాల్దీవులు, నేపాల్, భూటాన్ వంటి దేశాల్లోకి కూడా ఈ సెంటర్లను విస్తరించనుంది. గోల్డ్స్ జిమ్‌తో భాగస్వామ్యం తమ నెట్‌వర్క్‌ను మరింత పటిష్టపర్చుకునేందుకు కూడా ఉపయోగపడగలదని కల్ట్‌డాట్‌ఫిట్ హెడ్ (గ్రోత్ అండ్ మార్కెటింగ్ విభాగం) నరేశ్ కృష్ణస్వామి తెలిపారు. భారత్‌లో గోల్డ్స్ జిమ్ తదుపరి వృద్ధికి ఇది దోహదపడగలదని సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నిఖిల్ కక్కర్ పేర్కొన్నారు. కల్ట్‌డాట్‌ఫిట్ గతేడాది డిసెంబర్లో .. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో సారథ్యంలోని ఇన్వెస్టర్ల నుంచి 150 మిలియన్ డాలర్ల మేర నిధులు సమీకరించింది. జొమాటో 100 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. దాదాపు 1.5 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో కల్ట్‌డాట్‌ఫిట్ .. యూనికార్న్‌ల (1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్ గల స్టార్టప్‌లు) జాబితాలోకి చేరింది. -
స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో షేర్ పోయినా..భారత్‌లో కింగ్ మాత్రం ఆ కంపెనీనే..!
భారత్‌లో గత 17 త్రైమాసికాల్లో స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్స్‌లో షావోమీ అగ్రస్థానాన్ని కొనసాగిస్తోంది. అయితే అనూహ్యంగా మార్కెట్ వాటాను షావోమీ వేగంగా కోల్పోతుందని మార్కెట్ పరిశోధన సంస్థ కానాలిసిస్ పేర్కొంది. కంపెనీల మధ్య పోటీ..! షావోమీ పలు స్మార్ట్‌ఫోన్ కంపెనీల నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కొంటుంది. సరఫరా గొలుసు పరిమితులతో 2020 క్యూ1 నుంచి ఇప్పటివరకు షావోమి 8 శాతం మార్కెట్ వాటా తగ్గింది. క్యూ1 2020లో, కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ డేటా ప్రకారం భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో షావోమీ 29 శాతం మార్కెట్ వాటాను దక్కించుకుంది. అప్పటి నుంచి మార్కెట్ గ్రాఫ్ నెమ్మదిస్తోంది. 2021 క్యూ 4లో 21 శాతం మార్కెట్ వాటాను షావోమీ సొంతం చేసుకుంది. అయినప్పటికీ, షావోమీ 2021 క్యూ 4లో భారత్‌లో 9.3 మిలియన్ యూనిట్లను షిప్ చేసి స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఆధిక్యంలో ఉందని కెనాలిస్ తెలిపింది. కాంపోనెంట్ కొరత..! స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీ విశ్లేషకుల ప్రకారం.. షావోమీ మాస్-మార్కెట్ ఎంట్రీ-లెవల్ విభాగంలో కాంపోనెంట్ కొరతతో మార్కెట్ వాటా దెబ్బతింది. షావోమీ ప్రత్యర్ధి బ్రాండ్లు Unisoc అనే కొత్త చిప్సెట్ ప్లేయర్‌తో మార్కెట్ వాటాలో వేగంగా లాభపడుతున్నాయి. యూనిసోక్ చిప్సెట్స్తో పలు బ్రాండ్స్ మార్కెట్లో స్మార్ట్‌ఫోన్ డిమాండ్‌ను తీర్చగలిగాయి. చదవండి: జియో నుంచి మరో సంచలనం..! అత్యంత తక్కువ ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్..! ధర ఎంతంటే..? -
విప్రో ఆజీమ్ ప్రేమ్‌జీ ఇటీవల షేర్లు కొనుగోలు చేసిన కంపెనీ ఏంటో తెలుసా?
Wipro Azim Premji's investment in Tanla Platforms Ltd: సీపాస్ (కమ్యూనికేషన్స్ ప్లాట్‌ఫాం యాజ్ ఏ సర్వీస్) దిగ్గజం తాన్లా ప్లాట్‌ఫామ్స్‌లో తాజాగా ఐటీ దిగ్గజం విప్రో అధినేత అజీం ప్రేమ్‌జీ పెట్టుబడులు పెట్టారు. ప్రేమ్‌జీకి చెందిన ఇన్వెస్ట్మెంట్ సంస్థలు సుమారు 20.6 లక్షల షేర్లను కొనుగోలు చేశాయి. ఇందుకోసం షేరు ఒక్కింటికి రూ. 1,200 వెచ్చించాయి. బన్యాన్ ఇన్వెస్ట్మెంట్స్ సంస్థ వీటిని విక్రయించింది. ప్రేమ్‌జీ పెట్టుబడులపై తాన్లా సీఈవో ఉదయ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ దిగ్గజ సంస్థలను తీర్చిదిద్దడంలోను, కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాల్లోను, దాతృత్వంలోను అజీం ప్రేమ్‌జీకి సాటిలేరని మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో ట్వీట్ చేశారు. తాన్లా ప్లాట్‌ఫామ్స్ ఏటా సుమారు 800 బిలియన్ల పైగా సందేశాలను ప్రాసెస్ చేస్తోంది. దేశీయంగా ఏ2పి ఎస్ఎంఎస్ ట్రాఫిక్‌లో దాదాపు 70% భాగం తాన్లాకు చెందిన ట్రూబ్లాక్ ద్వారా ప్రాసెస్ అవుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసిక ఫలితాల్లో కంపెనీ నికర లాభం 67% ఎగిసి రూ. 136 కోట్లుగా నమోదైంది. మంగళవారం బీఎస్ఈలో తాన్లా షేరు 5% ఎగిసి రూ. 1,327 వద్ద క్లోజయ్యింది. - హైదరాబాద్, బిజినెస్ బ్యూరో -
రూ. 850 కోట్లను సొంతం చేసుకోనున్న నైకా టాప్ ఉద్యోగులు..!
Nykaa Top 6 Employees To Earn Over Rs 850 Crore Amid IPO:మగువలు మెచ్చిన ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ నైకా ఐపీవోను అక్టోబర్ 28న ప్రారంభించనుంది.నైకా మాతృ సంస్థ ఎఫ్ఎస్ఎన్ కామర్స్ వెంచర్స్ దాని ప్రారంభ పబ్లిక్ ఆఫర్ కోసం ఒక్కో షేరు ధరను రూ. 1,085 నుంచి రూ. 1,125కు నిర్ణయించింది. మూడు రోజుల పబ్లిక్ ఆఫర్ నవంబర్ 1న ముగియనుంది. దీంతో కంపెనీలోని పలు టాప్ ఉద్యోగులకు కాసుల వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నైకాలోని ఆరుగురు సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు తమ షేర్ హోల్డింగ్స్, వెస్టెడ్ ఆప్షన్ల ద్వారా మొత్తంగా రూ. 850 కోట్లను ఆర్జించనున్నారని ప్రముఖ బిజినెస్ మీడియా సంస్థ మింట్ పేర్కొంది. చదవండి: గెలుపు బాటలో మరో స్టార్టప్.. ఓఫోర్‌ఎస్‌లోకి పెట్టుబడుల వరద ఆరుగురు ఎగ్జిక్యూటివ్‌లు డిజిటల్ బ్యూటీ, వెల్నెస్ , ఫ్యాషన్ ఉత్పత్తుల సంస్థ నైకాలో వివిధ విభాగాలకు నాయకత్వం వహిస్తున్నారు. నైకా ప్రైవేట్ లేబుల్ విభాగం ఎఫ్ఎస్ఎన్ బ్రాండ్స్ సీఈవో రీనా ఛబ్రా కంపెనీలో 2.1 మిలియన్ షేర్లను, 0.12 మిలియన్ ఉద్యోగుల స్టాక్ ఆప్షన్లతో సుమారు రూ. 250 కోట్లు సంపాదించే అవకాశం ఉంది. రీనా ఛబ్రా మే 2016 నుంచి ఎఫ్ఎస్ఎన్ బ్రాండ్స్‌తో అనుబంధాన్ని కలిగి ఉన్నారు. అదేవిధంగా నైకా, మ్యాన్ బిజినెస్ సీఈవో నిహిర్ పారిఖ్ కంపెనీలో 2 మిలియన్లకు పైగా షేర్లను కలిగి ఉండగా..వీటితో రూ. 245 కోట్లను సంపాదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పారిఖ్ 2015 నుంచి నైకాలో పనిచేస్తున్నారు. ఈ ఏడాది గాను రూ. 2.83 కోట్ల జీతాన్ని అందుకుంటున్నారు. నైకా ఈ-రిటైల్ సీటీవో సంజయ్ సూరి కంపెనీలో సుమారు 1.8 మిలియన్ షేర్లను కల్గి ఉండగా...దీంతో రూ.220 కోట్లను ఐపీవో ద్వారా సంపాదించుకొనున్నారు. కంపెనీ ఈ-రిటైల్ చీఫ్ సప్లై చైన్ ఆఫీసర్ మనోజ్ జైస్వాల్ వద్ద రూ. 63 కోట్ల విలువైన షేర్లను కల్గి ఉన్నారు. కంపెనీ సీఎఫ్‌వో అరవింద్ అగర్వాల్ వద్ద రూ. 45 కోట్ల విలువైన షేర్లను, నైకా ఫ్యాషన్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ గోపాల్ అస్థానా రూ. 29 కోట్ల విలువైన షేర్లను కల్గి ఉన్నారు. చదవండి: తిరుగులేని టెస్లా.. రూ.75 లక్షల కోట్ల విలువైన కంపెనీగా రికార్డు -
ఐఫోన్13 ఎంట్రీతో షావోమీకు భారీ షాక్...!
ఎట్టకేలకు గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో ఆపిల్ ప్రముఖ చైనీస్ కంపెనీ షావోమీని అధిగమించింది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో (క్యూ 3) ఆపిల్ 15 శాతం వాటాతో గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రెండవ స్థానాన్ని తిరిగి దక్కించుకుంది. ఐఫోన్ 13 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌కు వీపరితమైన డిమాండ్ రావడంతో షావోమిను వెనక్కి నెట్టేసింది. ఎప్పటిలాగానే శాంసంగ్ మొదటి స్థానంలో నిలిచింది. గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో శాంసంగ్ 23 శాతం వాటాను దక్కించుకుంది. చదవండి: నోకియా నుంచి టఫెస్ట్ స్మార్ట్‌ఫోన్...! లాంచ్ ఎప్పుడంటే.. గ్లోబల్ మార్కెట్ రీసెర్చ్ సంస్థ కెనాలిస్ అందించిన ప్రాథమిక డేటా ప్రకారం.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో షావోమీ 14 శాతం వాటాను దక్కించుకోగా వివో, ఒప్పో స్మార్ట్‌ఫోన్స్ 10 శాతం వాటాతో తరువాతి స్థానాల్లో నిలిచాయి. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ షిప్మెంట్లు 6 శాతం మేర తగ్గినట్లు పేర్కొంది. చిప్స్ కొరత.. అంతర్జాతీయంగా సెమికండక్టర్స్ కొరతతో పలు దిగ్గజ స్మార్ట్‌ఫోన్ కంపెనీలు తీవ్రంగా సతమతమయ్యాయి. చిప్స్ కొరత ఉన్నప్పటికీ పలు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఉత్పత్తి విషయంలో రాజీ పడలేదు. చిప్స్ కొరత పలు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఫోన్ ధరలను కూడా పెంచాయని కానలిస్ ప్రిన్సిపల్ ఆనలిస్ట్ బెన్ స్టాన్టాన్ వెల్లడించారు. స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు చిప్స్ కొరత 2022 వరకు వేధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ 'స్క్విడ్ గేమ్' మరో రికార్డు -
13 సంవత్సరాల క్రితం ఆరోపణలు, రిలయన్స్‌కు ఊరట
న్యూఢిల్లీ: షేర్‌పై వచ్చే ఆర్జన (ఈపీఎస్– ఎర్నింగ్స్ పర్ షేర్) విషయంలో 13 సంవత్సరాల క్రితం ఆర్థిక ఫలితాల్లో తప్పుడు సమాచారం ఇచ్చిందని రిలయన్స్ ఇండస్ట్రీస్‌పై దాఖలైన ఆరోపణలను ‘ఎటువంటి జరిమానా విధించకుండా’ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కొట్టివేసింది. దీనికి రెండు అంశాలను సెబీ ప్రాతిపదికగా తీసుకుంది. అందులో ఒకటి... ఒక లిస్టెడ్ కంపెనీ ఫలితాల్లో ఏదైనా తప్పుడు సమాచారం ఇస్తే, ఆ కంపెనీపై చర్యలు తీసుకునే అధికారాన్ని కల్పిస్తున్న చట్ట సవరణ 2019 మార్చి నుంచీ అమల్లోకి వచ్చింది. ఇక సెబీ పేర్కొన్న రెండవ అంశం (గ్రౌండ్) విషయానికి వస్తే... ఈ తరహా వివాదం, ఆరోపణలకు సంబంధించి సెక్యూరిటీస్ అప్పీలేట్ (శాట్) ఇచ్చిన తీర్పుపై అప్పీల్ ఒకటి సుప్రీంకోర్టులో పెండింగులో ఉంది. షేర్ వారెంట్స్ జారీ జరిగినప్పటికీ, 2007 జూన్ నుంచి 2008 సెప్టెంబర్ వరకూ త్రైమాసిక ఫలితాల స్టేట్మెంట్లు ఈపీఎస్‌ను ఒకే విధంగా కొనసాగించాయన్నది ఆర్‌ఐఎల్‌పై ప్రధాన ఆరోపణ. చదవండి: వారెన్ బఫెట్ తరువాత మనోడే, ధనవంతుల జాబితాలో ముఖేష్ అంబానీ -
రిలయన్స్ కొంపముంచిన జియోఫోన్..!
ముంబై: ప్రపంచంలోనే అత్యంత చౌక స్మార్ట్‌ఫోన్‌గా పేర్కొన్న జియోఫోన్ నెక్ట్స్ లాంఛింగ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. రిలయన్స్ 44 ఏజీఎం సమావేశంలో వినాయక చవితికి తమ ఫోన్‌ను లాంఛ్ చేస్తామని కంపెనీ చైర్మన్ ముఖేశ్ అంబానీ పేర్కొన్నారు. కాగా ఈ ఫోన్‌ను దీపావళి పండుగకు లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా జియోఫోన్‌నెక్ట్స్ లాంచ్ రిలయన్స్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ వాయిదా పడడంతో రిలయన్స్ షేర్లు సోమవారం రోజున 2 శాతం మేర నష్టపోయాయి. చదవండి: జియో నుంచి మరో సంచలనం..! త్వరలోనే లాంచ్..! సోమవారం జరిగిన బీఎస్ఈ ఇంట్రా డే ట్రేడ్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 2 శాతం క్షీణించి రూ .2,382.85 వద్ద నిలిచింది. ట్రేడింగ్ ప్రారంభంలో రిలయన్స్ షేర్ విలువ రూ. 2425.60 వద్ద ఉండగా ట్రేడింగ్ ముగిసే సమయానికి సుమారు రూ. 55.80 మేర నష్టపోయి షేర్ విలువ రూ. 2,382.85 వద్ద నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సెమీకండక్టర్ కొరత కారణంగా జియోఫోన్‌నెక్ట్స్ లాంచింగ్ వాయిదా పడిందని వ్యాపార నిపుణులు అంచనా వేస్తున్నారు. జియోఫోన్ నెక్ట్స్ స్మార్ట్‌ఫోన్‌ను రిలయన్స్, గూగుల్ కంపెనీలు కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. మరింత మెరుగుదల కోసం రెండు కంపెనీలు పరిమిత వినియోగదారులతో జియోఫోన్ నెక్స్ట్ ను పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. దీపావళి పండుగ సీజన్లో ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు కంపెనీ చర్యలు తీసుకుంటుంది. స్మార్ట్‌ఫోన్ లాంచ్‌ను వాయిదా వేయడంతో వచ్చే అదనపు సమయం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సెమీకండక్టర్ కొరతను తగ్గించడంలో సహాయపడుతుందని జియో, గూగుల్ ఒక ప్రకటనలో పేర్కొంది. చదవండి: భూమ్మీద అత్యంత సురక్షితమైన ఫోన్ ఇదే..! -
ఎస్బీఐ లైఫ్‌కు స్టోక్..కార్లయిల్ ఔట్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి పీఈ దిగ్గజం కార్లయిల్ గ్రూప్ వైదొలగింది. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా 1.9 శాతం వాటాను విక్రయించింది. షేరుకి రూ. 1,130 సగటు ధరలో ఎస్బీఐ లైఫ్లోగల 1.9 శాతం వాటాను అనుబంధ సంస్థ సీఏ ఎమరాల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ విక్రయించింది. బీఎస్ఈ బ్లాక్ డీల్ గణాంకాల ప్రకారం ఈ వాటా విలువ రూ. 2,147 కోట్లు. 2021 జూన్‌కల్లా ఎస్బీఐ లైఫ్‌లో సీఏ ఎమరాల్డ్ 1.9 శాతం వాటాను కలిగి ఉంది. కాగా.. ఈ షేర్లను మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్, మోర్గాన్ స్టాన్లీ ఆసియా సింగపూర్, హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్, బీఎన్పీ పరిబాస్ ఆర్బిట్రేజ్ తదితరాలతోపాటు. పలు మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఎన్ఎస్ఈలో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ షేరు 1.5 శాతం బలపడి రూ. 1,151 వద్ద ముగిసింది. -
క్యూ1లో బజాజ్ ఆటో స్పీడ్
న్యూఢిల్లీ: ఆటో రంగ దేశీ దిగ్గజం బజాజ్ ఆటో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి క్వార్టర్లో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో రూ. 1,170 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో నమోదైన రూ. 395.5 కోట్లతో పోలిస్తే నాలుగు రెట్లు అధికం. ఇందుకు ప్రధానంగా ఎగుమతులు కారణమైనట్లు కంపెనీ పేర్కొంది. గతేడాది క్యూ1లో దేశవ్యాప్త లాక్డౌన్లు అమ్మకాలను దెబ్బతీసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఆదాయం జూమ్ క్యూ1లో బజాజ్ ఆటో మొత్తం ఆదాయం సైతం రూ. 3,079 కోట్ల నుంచి రూ. 7,386 కోట్లకు జంప్‌చేసింది. ప్రస్తుత త్రైమాసికంలోనూ కోవిడ్–19 సెకండ్ వేవ్ ప్రభావం చూపినప్పటికీ పలు దేశాలకు పెరిగిన ఎగుమతులు దన్నునిచ్చినట్లు కంపెనీ వివరించింది. క్యూ1లో వాహన అమ్మకాలు 4,43,103 యూనిట్ల నుంచి 10,06,014 యూనిట్లకు ఎగసినట్లు తెలియజేసింది. వీటిలో ఎగుమతులు మూడు రెట్లు ఎగసి 6,48,877 యూనిట్లకు చేరగా.. దేశీయంగా 3,57,137 వాహనాలు విక్రయమయ్యాయి. జూన్ చివరికల్లా మిగులు నగదు, తత్సమాన నిల్వల విలువ రూ. 19,097 కోట్లను తాకినట్లు కంపెనీ వెల్లడించింది. మొబిలిటీ విభాగంలో ద్విచక్ర, త్రిచక్ర ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల తయారీ కోసం పూర్తి అనుబంధ సంస్థను ఏర్పాటు చేసేందుకు బోర్డు అనుమతించినట్లు బజాజ్ ఆటో తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో బజాజ్ ఆటో షేరు 1.2% నీరసించి రూ. 3,860 వద్ద ముగిసింది. -
భారత్ భారీవాటా: మొబైల్స్ ఆన్‘లైన్’..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోనా మహమ్మారి కారణంగా ఈ-కామర్స్ అనూహ్యంగా పుంజుకున్న సంగతి తెలిసిందే. మొబైల్స్ విషయంలోనూ 2020లో అదే జోరు కనపడింది. గతేడాది దేశవ్యాప్తంగా అమ్ముడైన మొబైల్స్‌లో ఆన్లైన్ వాటా 45 శాతం నమోదైందని పరిశోధన సంస్థ కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తాజా నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇదే అత్యధికం కావడం గమనార్హం. అంతర్జాతీయంగా 26 శాతం మొబైల్స్ ఆన్లైన్ ద్వారా కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. ఆన్లైన్ వాటా యూకేలో 39 శాతం, చైనా 34, బ్రెజిల్ 31, యూఎస్ 24, దక్షిణ కొరియాలో 16 శాతం కైవసం చేసుకుంది. ఆన్లైన్ జోరు క్రమంగా తగ్గుముఖం పడుతుందని.. ఈ ఏడాది 2020 ఏడాది మాదిరిగా లేదా స్వల్పంగా తగ్గుదల ఉండొచ్చని నివేదిక తెలిపింది. మల్టీ బ్రాండ్ రిటైల్ స్టోర్లు విస్తరిస్తున్నందున భారత్‌లో 2022 తర్వాత ఆన్లైన్ వాటా క్షీణిస్తుందని వెల్లడించింది. లాక్డౌన్లో తగ్గిన ఆన్లైన్.. సెకండ్ వేవ్ కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా రవాణా పరిమితులు విధించడంతో ఈ-కామర్స్ కంపెనీలకు డెలివరీ సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఈ ప్రభావం స్మార్ట్ఫోన్ల విక్రయాలపైనా పడింది. ఆన్లైన్లో ఆర్డర్ చేసిన వారం తర్వాతగానీ కస్టమర్లకు గ్యాడ్జెట్స్ చేరకపోవడంతో.. చాలా మంది వినియోగదార్లు తమ ఆర్డర్లను రద్దు చేసుకున్నారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. సమయానికి కస్టమర్‌కు ఉత్పత్తులను చేర్చలేని పరిస్థితి తలెత్తడంతో అటు విక్రేతలు సైతం ఈ-కామర్స్‌లో లిస్టింగ్‌కు వెనుకడుగు వేశారు. దీంతో రెండు నెలలుగా ఆన్లైన్ జోరు తగ్గింది. ఈ పరిణామాలన్నీ ఆఫ్‌లైన్ రిటైలర్లకు కలిసొచ్చిందని బిగ్-సి మొబైల్స్ సీఎండీ ఎం.బాలు చౌదరి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. రెండు గంటల్లోనే డెలివరీ.. ఈ-కామర్స్ కంపెనీలకు దీటుగా మల్టీ బ్రాండ్ మొబైల్ రిటైల్ స్టోర్లు ఆన్లైన్ ప్లాట్‌ఫాంను పటిష్టం చేసుకున్నాయి. ఆన్లైన్లో ఆర్డర్ అందుకున్న 2 గంటల్లోనే ఈ సంస్థలు డెలివరీ చేస్తున్నాయి. బిగ్–సి మొబైల్స్, లాట్ మొబైల్స్, సంగీత, బి-న్యూ మొబైల్స్, హ్యాపీ మొబైల్స్, సెలెక్ట్ మొబైల్స్, సెల్ పాయింట్ వంటి సంస్థలు చిన్న పట్టణాలకూ విస్తరించాయి. దీంతో ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్ కస్టమర్లను చేరుకోవడం వీటికి సులభం అయింది. మొబైల్స్ విషయంలో ఈ-కామర్స్ కంపెనీల నుంచి ఆఫ్‌లైన్‌కు రెండు నెలల్లో 25 శాతం కస్టమర్లు మళ్లారని మల్టీ బ్రాండ్ రిటైల్ సంస్థ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఆఫ్‌లైన్‌లో మాత్రమే ప్రత్యక్షంగా ఎంచుకోవడానికి విస్తృత శ్రేణి మొబైల్స్ డిస్ప్లేలో ఉంటాయని బి-న్యూ మొబైల్స్ సీఎండీ వై.డి.బాలాజీ చౌదరి వివరించారు. అమెజాన్ పే, ఫోన్‌పే వంటి పేమెంట్ యాప్స్ భాగస్వామ్యంతో మల్టీ బ్రాండ్ రిటైల్ స్టోర్లు కస్టమర్లను డిస్కౌంట్లతో ఆకట్టుకుంటున్నాయి. -
భారీ ఆఫర్: దూసుకుపోయిన ఇన్ఫోసిస్
సాక్షి, ముంబై: 1800 పాయింట్లుకు పైగా కుప్పకూలిన దలాల్ స్ట్రీట్‌లో ఈ సోమవారం బ్లాక్ మండేగా నిలిచింది. స్టాక్మార్కెట్లో 2021లో ఇదే అదిపెద్ద పతనం. అయితే దేశంలోని రెండవ అతిపెద్ద సాఫ్ట్వేర్ సేవల సంస్థ ఇన్ఫోసిస్ మాత్రం లాభాలతో మురిపించింది. తమ బోర్డు సమావేశంలో వాటాలను తిరిగి కొనుగోలు చేసే ప్రతిపాదనను పరిశీలిస్తుందని ఆదివారం ఎక్స్ఛేంజీలకు సమాచారం కంపెనీ వెల్లడించడమే ఇందుకు కారణం. దీంతో ఇన్ఫోసిస్ షేరు ఏకంగా 2.72 శాతం ఎగిసి రూ.1480 తాకింది. తద్వారా 52 వారాల గరిష్టాన్ని నమోదు చేసింది. ఫలితంగా ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ బీఎస్ఇలో ఆల్-టైమ్ గరిష్ట స్థాయి 6.12 లక్షల కోట్లను తాకింది. అనంతరం లాభాల స్వీకరణ కారణంగా స్వల్పంగా నష్టపోతోంది. (మార్కెట్ల క్రాష్: రూ. 7 లక్షల కోట్లు మటాష్) ఏప్రిల్ 14, 2021న బోర్డు సమావేశం ముగిసిన తరువాతఇన్ఫోసిస్ భారీ బైబ్యాక్ ప్రకటించనుందన్న అంచనాలు ఇన్వెస్టర్లను కొనుగోళ్లవైపు మళ్లించాయి. ప్రధానంగా క్యూ4 ఫలితాలు, బోర్డ్ మీటింగ్‌లో ఇన్ఫోసిస్ షేర్ల బైబ్యాక్‌పై నిర్ణయం తీసుకోనుందని అంచనా. దీనికితోడు ఫైనల్ డివిడెండ్ కూడా కంపెనీ ప్రకటించనుందని సీఎల్ఎస్ఏ అంచనాలు వెలువరించింది. దాదాపు ఒకటి నుంచి ఒకటిన్నరశాతం ఈక్విటీకి సమానమైన షేర్లను ఇన్వెస్టర్ల నుంచి ఇన్ఫోసిస్ తిరిగి కొనుగోలు చేయనుందనితెలిపింది. ఈ బైబ్యాక్‌ను డైరెక్టర్ల బోర్డు ఆమోదించినట్లయితే,రెండేళ్ళలో ఇన్ఫోసిస్ రెండో బై బ్యాక్ ఆఫర్ అవుతుంది. మార్చి 2019న 747 ధర వద్ద 11.05 కోట్ల ఇన్ఫోసిస్ షేర్లను 8,260 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. (బంపర్ ఆఫర్ : ఈ స్మార్ట్‌ఫోన్ ధర భారీ తగ్గింపు) చదవండి : ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా...అయితే మీకో శుభవార్త! -
బీహెచ్‌ఈఎల్‌షేరు ఢమాల్: ఎందుకంటే
సాక్షి, ముంబై: భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) కు ఫలితాల షాక్ తగిలింది. క్యు3లో ఆర్థికఫలితాలు తీవ్రంగా నిరాశ పరచడంతో సోమవారం నాటి మార్కెట్లో బీహెచ్ఈఎల్ భారీ పతనాన్ని నమోదు చేసింది. గత వరుస 5 రోజులుగా లాభపడిన షేరు సోమవారం 8.5 శాతానికి పైగా నష్టపోయింది. ఫలితంగా కీలకమైన రూ. 40 దిగువకు చేరింది. ఇది ఇన్వెస్టర్ల సెంటి మెంటును మరింత దెబ్బ తీసింది. 2020 ఆర్థిక సంవత్సరం క్యు3లో 218కోట్ల నికర నష్టాలను నమోదు చేసిన కంపెనీ, మార్కెట్ వర్గాలను భారీగా నిరాశపర్చింది. అలాగే ఆదాయం క్యూ 3 లో రూ .4,532 కోట్లకు పడిపోయింది. దీంతో సంస్థ మార్కెట్ క్యాప్ 14,067 కోట్ల రూపాయలకు చేరింది. మొత్తం ఆపరేటింగ్ నష్టాలు రూ.180కోట్లకు పెరిగాయి. మరోవైపు కరోనా మహమ్మారి సంక్షోభం, ఆర్డర్ల క్షీణత కూడా కంపెనీ లాభాలను దెబ్బతీసిందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దీంతో బ్రోకరేజ్ సంస్థ నోమురా ఈ షేరుకు సెల్ కాల్ ఇచ్చింది. రికవరీ ఆశలు కనిపించని నేపథ్యంలో బలహీనత కొనసాగుతుందని గోల్డ్‌మన్ సాచ్స్ అంచనా వేసింది. షేరు టార్గెట్ ధర రూ .25గా తెలిపింది. -
వారిది షేర్డ్ సైకోటిక్ డిజార్డర్ కావచ్చు!
మదనపల్లెలో ఇద్దరు విద్యాధికులైన తల్లిదండ్రులు ఒక ఉన్మాదం లాంటి స్థితిలో తమ ఇద్దరు కూతుళ్లనూ హత్య చేశారు. కలియుగం అంతమైపోయి ఆ మర్నాటి నుంచి సత్యయుగం ప్రారంభమవుతుందని నమ్మారు. తమ కూతుళ్లను ఆ యుగంలోకి పంపేందుకు పూజలు నిర్వహిస్తూ బిడ్డలను హతమార్చారు. పైగా తమ బిడ్డలు మరణించలేదనీ... కొద్దిసేపట్లో జీవించి తిరిగి లేస్తారని చెబుతున్నారు. యుగాంతమైపోతుందన్న నిహిలిస్టిక్ డెల్యూషన్స్‌తో పాటు మరెన్నో భ్రాంతులకు లోనైన ఈ తాజా సంఘటన ఇటీవలే మదనపల్లెలో చోటుచేసుకుంది. సరిగ్గా పైన చెబుతున్న సంఘటనతో పోలికలు కనిపిస్తున్న ఉదంతం దాదాపు రెండేళ్ల కిందట ఢిల్లీ బురారీలో జరిగింది. ఆ సంఘటనలో ఒకే ఇంట్లో పదకొండు మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆ సంఘటనలో... చాలాకాలం కిందటే ఢిల్లీలోని నారాయణి దేవి అనే ఆవిడ భర్త చనిపోయాడు. ఆయన మరణించాక ఆ కుటుంబం కష్టనష్టాలకు లోనైంది. ఆ తర్వాత కుటుంబ పెద్ద తాలూకు రెండో కొడుకైన లలిత్ భాటియా తీవ్రమైన సైకోటిక్ డిజార్డర్‌కు గురయ్యాడు. దాంతో కొన్ని భ్రాంతులకు లోనయ్యాడు. ఆ భ్రాంతులనే నిజమని నమ్ముతూ... తమ నాన్న తమతో మాట్లాడుతూ, బిజినెస్ సలహాలు ఇస్తున్నాడని భ్రమపడేవాడు. వాటిని పాటిస్తున్నందువల్లనే బిజినెస్ పుంజుకుందనీ, తమ కష్టాలు గట్టెక్కాయని నమ్ముతుండేవాడు. ఈ నమ్మకం ముదిరి, తాంత్రిక పూజల్లోకి దిగి, వటవృక్ష పూజ అనే తంతును నిర్వహిస్తే... కుటుంబ సభ్యులందరికీ మోక్షం తప్పదనీ, వటవృక్షపు ఊడల్లా వేలాడుతూ, తాము ఉరికి పాల్పడితే కొంత సమయం తర్వాత తామంతా తిరిగి బతుకుతామనీ విశ్వసించారు. దాంతో కుటుంబసభ్యులంతా పూజలో భాగంగా ఉరేసుకున్నారు. ఉరివేసుకున్న తర్వాత వారు బతకలేదు సరికదా... కుటుంబంలోని 11 మందీ చనిపోయారు. ఈ రెండు సంఘటనలలో ఇంట్లో ఎవరికో ఒకరికి పూజలూ, ప్రాణాలను అర్పించడాలపై నమ్మకం కలిగింది. కాకపోతే అక్కడ లలిత్భాటియా నమ్మాడు. అలాగే మదనపల్లెలో కుటుంబపెద్ద పురుషోత్తం నాయుడో లేదా అతడి భార్య పద్మజనో నమ్మారనుకుందాం. మరి కూతుళ్ల విచక్షణ ఏమైంది? ఆ పూజలతో తాము తిరిగి బతుకుతామనే నమ్మకానికి ఎందుకు వచ్చారనే ప్రశ్నలు ఉద్భవిస్తాయి. అలా ఒకరి నమ్మకాన్ని... కుటుంబసభ్యులందరూ కలిసి బలంగా విశ్వసించి, అలా తాను నమ్మిన సైకోటిక్ వైఖరిని మిగతావారికీ ‘షేర్’ చేసే వ్యాధి పేరే ‘‘షేర్డ్ సైకోసిస్’’. ఢిల్లీలో కుటుంబపెద్ద విశ్వాసానికి 11 మంది ప్రాణాలు కోల్పోతే... మదనపల్లె సంఘటనలో మంచి భవిష్యత్తు ఉన్న యువతులు తమ జీవితాలను కోల్పోయారు. పైగా ఈ సంఘటనలో పురుషోత్తం నాయుడు భార్య పద్మజ తనను తాను శివుని అంశగానూ, కొన్నిసార్లు, శివుడిగానే కొన్నిసార్లు భ్రమిస్తున్నారు. ఇలా భ్రాంతులకు (డెల్యూషన్స్కు) గురవడాన్ని డెల్యూషనల్ డిజార్డర్‌గా కూడా చెప్పవచ్చు. ఇక్కడ ఆ కుటుంబం రెండు రకాల డెల్యూషన్స్లో ఉంది. ఒకటి షేర్డ్ సైకోసిస్ డిజార్డర్ కాగా ఆమె భ్రాంతులతో కూడిన డెల్యుషన్ డిజార్డర్‌తోనూ బాధపడుతున్నారు. ఇక్కడ ఈ భార్యాభర్తల్లో ఎవరో ఒకరు మరొకర్ని ప్రభావితం చేసి ఉండవచ్చు. దాంతో భార్యాభర్తలలో సైకోసిస్ ‘షేర్’ అయి ఉండవచ్చు. ‘షేర్డ్ సైకోసిస్’ అంటే? ఇది భ్రాంతులు కలిగించే ఒక రుగ్మత. దీన్నే ఇండ్యూస్డ్ డెల్యూజన్ డిజార్డర్ అని కూడా అంటారు. ఈ భ్రాంతి రుగ్మతకు వైద్యపరమైన మరో ఫ్రెంచ్ పేరు కూడా ఉంది. అదే ‘ఫోలీ ఎ డ్యుయో’ అంటే వాస్తవంగా డ్యుయో అంటే రెండు అని అర్థం. మదనపల్లె ఉదంతంలోనూ భార్యాభర్తలు ఇరువురి లో ఒకరు మరొకరిని ప్రభావితం చేసి ఉండవచ్చు. అలాంటప్పుడు ఇది ‘ఫోలీ ఏ డ్యూయో’ అవుతుంది. ఒకవేళ ఇది కుటుంబ సభ్యుల్లో ఇద్దరికంటే ఎక్కువగా చాలామందికి వచ్చిందనుకోండి. అప్పుడు దీన్నే ‘ఫోలీ ఎన్ ఫ్యామిలే’ అంటారు. కానీ కూతుళ్లు ప్రభావితమయ్యారో లేదో అని ముందే అనుకున్నాం. ఒకవేళ అదే కుటుంబాన్ని దాటి ఇంకా చాలామందికి వచ్చిందనుకోండి. అప్పుడు దాన్ని ‘ఫోలీ ఎ ప్లసియర్స్’ అంటారు. ఇక మదనపల్లె దంపతుల్లో వారు యుగాంతం వస్తుందని నమ్మారు. ఇలా నమ్మడాన్ని ‘నిహిలిస్టిక్ డెల్యూషన్స్’ అంటారు. ఇలా ఆ దంపతులు ఈ నిహిలిస్టిక్ డెల్యూజన్స్ అనే మరో భ్రాంతికీ గురయ్యారు. ఢిల్లీలోని బురారీ కుటుంబంలో ఒకరు ప్రేరేపించడం వల్ల అందరూ ఆత్మహత్యలు చేసుకుంటే, మదనపల్లెలో మళ్లీ బతుకుతారంటూ తల్లిదండ్రులే కూతుళ్లను చంపేశారు. పోలీసులు రావడం ఆలస్యమైతే వారూ చనిపోయేరంటూ వస్తున్న వార్తలను బట్టి చూస్తే ఇది కూడా షేర్డ్ సైకోసిస్‌లోని పోలీ ఎన్ ఫ్యామిలే అనేందుకే ఆస్కారం ఎక్కువగా కనిపిస్తోంది. షేర్డ్ సైకోసిస్ అనే ఈ రకమైన సైకియాట్రీ ప్రవర్తనను, రుగ్మతను ఫ్రెంచ్ సైకియాట్రిస్ట్‌లు అయిన చార్లెస్ లేసెగ్, జీన్ పెర్రీ ఫార్లెట్ను 19వ శతాబ్దంలో కనుగొన్నారు. అందుకే దీన్ని లేసెగ్–ఫార్లెట్ సిండ్రోమ్ అని కూడా అంటారు. ఈ వ్యాధిలోని చిత్రం ఏమిటంటే... కనీసం ఇద్దరు భ్రాంతులకు గురైనప్పుడు కానీ దీన్ని గుర్తించడం సాధ్యం కాదు. గుర్తించడమెలా? తమకు ఎవరెవరో కనిపిస్తున్నారనీ, ఏవేవో వినిపిస్తున్నాయనీ చెప్పే స్కీజోఫ్రీనియా వంటి లక్షణాలు వీరిలోనూ కనిపిస్తాయి. పైగా వీరిలో కొందరు అందరికీ కనిపించే తాను తాను కాదనీ, తాను దైవాన్ననీ చెబుతూ ఉంటారు. యుగాంతం సంభవించబోతుందని అంటారు. రకరకాల భ్రాంతులకు గురవుతూ అవి నిజమని నమ్ముతుంటారు. చికిత్స ఇలాంటి సైకోటిక్ రుగ్మతలు కౌన్సెలింగ్‌తో తగ్గవు. తప్పనిసరిగా మందులతో చికిత్స తీసుకోవాల్సిందే. పేషెంట్స్ మెదడులో జరిగిన మార్పుల కారణంగా ఆ భ్రాంతులు వాళ్లవరకు నిజమే. కానీ ఆరోగ్యవంతులు అది సరికాదంటూ వారితో వాదించకూడదు. అందుకే పేషెంట్స్‌తో వ్యవహరించాల్సిన తీరుపై కుటుంబసభ్యులకు కొంత కౌన్సెలింగ్ అవసరమవుతుంది. కానీ ఈ వ్యాధులు కౌన్సెలింగ్‌తో తగ్గవు. ఈ తరహా రోగులకు యాంటీసైకోటిక్ మందులు, యాంగై్జటీని తగ్గించే మందులు, నిద్రలేమికి ఇవ్వాల్సిన ట్రాంక్విలైజర్లతో చికిత్స చేయాల్సి రావచ్చు. ఏమిటీ డెల్యూషన్ డిజార్డర్లు షేర్డ్ సైకోసిస్’కు వ్యక్తులు ఎందుకు, ఎలా గురవుతారో తెలుసుకునే ముందర... అసలు సైకోసిక్ అనే మానసిక రుగ్మతకు ఎలా గురవుతారోతెలుసుకోవాలి. మన మెదడులో పది పక్కన పన్నెండు సున్నాలు పెట్టినంత పెద్ద సంఖ్యలో నాడీకణాలు ఉంటాయి. మళ్లీ ఒక్కో కణానికీ పక్కనున్న పొరుగు కణాలతో అనేక కనెక్షన్లు ఉంటాయి. ఈ కనెక్షన్ల మధ్య కొన్నిచోట్ల ఖాళీ స్థలం ఉంటుంది. ఆ ఖాళీ స్థలంలో మెదడుకు సంబంధించిన కొన్ని రసాయనాలు ఉంటాయి. మెదడులోని రసాయనాలలో డోపమైన్, సెరిటోనిన్, ఎపీనెఫ్రిన్ వంటివి కొన్ని రసాయనాలు ఉంటాయి. ఈ రసాయనాలు తమ నార్మల్ స్థాయిని దాటి పెరిగినప్పుడు ‘సైకోటిక్ డిజార్డర్స్’ వస్తాయి. అంటే నిజానికి ఏ సంఘటనా జరగకపోయినా, మెదడు లో ఈ రసాయనాల మార్పులు జరిగినప్పుడు... వారికి నిజంగా ఏదో జరిగినట్లు భ్రాంతి కలుగుతుంది. అలా జరగని సంఘటనను జరిగినట్లుగా భావించే అనుభూతినే ఇంగ్లిష్‌లో ‘హేలూసినేషన్స్’ అంటారు. ఈ హేలూసినేషన్స్తో సైకోసిస్‌కు గురైన వారు మళ్లీ... ఇతరులను ప్రభావితంచేస్తే... పక్కవారిలోనూ కనిపించే మానసిక సమస్యనే ‘షేర్డ్ సైకోసిస్’ అంటారు. దాంతోపాటు తల్లిదండ్రులిద్దరూ డెల్యూషన్ డిజార్డర్‌తోనూ బాధపడుతున్నారు. డాక్టర్ శ్రీనివాస్ ఎస్‌ఆర్‌ఆర్‌వై హెచ్ఓడీ అండ్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైకియాట్రీ, ఎమ్జీఎమ్ గవర్నమెంట్ హాస్పిటల్, వరంగల్ సూచన: ఎవరైనా విచిత్రంగా, వింతగా వ్యవహరించడం, వాళ్ల ఆలోచనలూ అసాధారణంగా ఉండి, వివరణలకు అందకుండా ఉండటం వంటి లక్షణాలతో మానసిక రుగ్మతలను తేలిగ్గా గుర్తించవచ్చు. ఇలా ఎవరైనా ప్రవర్తిస్తూ ఉంటే వారిని తక్షణం గుర్తించి, వీలైనంత త్వరగా వారిని సైకియాట్రిస్ట్‌ల దగ్గరికి తీసుకెళ్లడం అవసరం. -
మరో ఘనతను సాధించిన టీసీఎస్
న్యూఢిల్లీ: ఐటి దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ చరిత్ర సృష్టించింది. సోమవారం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) షేర్ ధర 3.5 శాతం పెరిగి గరిష్ట స్థాయి 3,230 రూపాయలను తాకింది. దీంతో తొలిసారిగా టీసీఎస్ మార్కెట్ క్యాప్ 12 లక్షల కోట్ల రూపాయలను దాటి మరో ఘనతను తన పేరున లిఖించుకుంది. ఇంతకముందు ఈ ఘనతను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్) సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబందించిన అక్టోబర్-డిసెంబర్ త్రైమాసిక ఫలితాల ఊహించిన దాని కంటే మెరుగ్గా ఉన్నాయి. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.7,504 కోట్లతో పోలిస్తే కంపెనీ నికర లాభం సంవత్సరానికి 7.17 శాతం పెరిగి రూ.8,727 కోట్లకు చేరుకుంది.(చదవండి: ఐటీ దన్ను: స్టాక్‌మార్కెట్ దూకుడు) ట్రేడింగ్ సమయంలో టీసీఎస్ షేర్లు 52 వారాల గరిష్టానికి చేరుకున్నాయి. దీంతో సోమవారం తొలిసారిగా టీసీఎస్ కంపెనీ క్యాపిటలైజెషన్ వాల్యూ 12 లక్షల కోట్ల రూపాయలను దాటింది. దేశంలో 12 లక్షల కోట్ల క్యాపిటలైజెషన్ దాటిన రెండో కంపెనీగా టీసీఎస్ నిలిచింది. అలాగే, ప్రస్తుతం ఇన్ఫోసిస్ ఒక్కో షేరు ధర రూ.1,365.95, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ రూ.1,029, విప్రో రూ.444.95, మైండ్‌ట్రీ రూ.1,764.50, టెక్ మహీంద్రా రూ.1,068.65 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ లో పెరుగుదల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్ లో వృద్ధి కనిపించినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఈ రోజు మధ్యాహ్నం వరకు బిఎస్ఇ సెన్సెక్స్ 0.66 శాతం, నిఫ్టీ 50 0.58 శాతం లాభపడ్డాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ షేర్లు 72.8 శాతం లాభపడగా, బిఎస్ఇ ఐటి ఇండెక్స్ 108.30 శాతం లాభపడింది. -
ట్విటర్ లో మరో కొత్త ఫీచర్
సోషల్ మీడియా ద్వారా మనకు ఎంతో ముఖ్యమైన సమాచారం కూడా క్షణాలలో తెలిసిపోతుంది. సోషల్ మీడియాలో వచ్చే ఈ సమాచారం ద్వారా మనకు జరిగే మేలు ఎంతో, అంతే మొత్తంలో నష్టం కూడా జరుగుతుది. అందుకోసమే, సోషల్ మీడియాలో వచ్చే అసత్య వార్తల ప్రచారానికి అడ్డుకట్ట వేసేందుకు ఆయా కంపెనీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. దీని కోసం ఫేస్బుక్ వార్నింగ్ లేబుల్ తీసుకొస్తుంటే.. ట్విటర్ కూడా ఇదే తరహాలో డిస్ప్యూటెడ్ ట్వీట్(వివాదాస్పదమైన ట్వీట్) పేరుతో ఒక హెచ్చరికను జారీ చేస్తుంది. దీని ద్వారా మనం ఎక్కువ శాతం అసత్య ప్రచారాలకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది. కానీ వీటి గురుంచి చాలా మందికి తెలియక పోవడం వల్ల వాటిని తిరిగి పోస్ట్ చేయడం లేదా రీట్వీట్ చేస్తుంటారు. ఇది సోషల్ మీడియా కంపెనీలకు తల నొప్పిగా మారింది. దీంతో ఈ సమస్యకు పరిష్కారంగా ట్విటర్ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. (చదవండి: 43 యాప్స్ బ్యాన్ పై చైనా అభ్యంతరం) Giving context on why a labeled Tweet is misleading under our election, COVID-19, and synthetic and manipulated media rules is vital. These prompts helped decrease Quote Tweets of misleading information by 29% so we're expanding them to show when you tap to like a labeled Tweet. pic.twitter.com/WTK164nMfZ — Twitter Support (@TwitterSupport) November 23, 2020 ఇక నుండి ట్విట్టర్ వినియోగదారుడు డిస్ప్యూటెడ్ ట్వీట్ లేదా హెచ్చరికలు జారీ చేసిన ట్వీట్‌ను లైక్, షేర్ లేదా కామెంట్ చేయడానికి ట్విట్టర్ ఒక పాప్-అప్ విండోతో హెచ్చరిస్తోంది. అందులో ‘‘ఇది డిస్ప్యూటెడ్ ట్వీట్. నమ్మకమైన సమాచారం అందించే వేదికగా ట్విటర్‌ని ఉంచేందుకు సహాయపడండి. రీట్వీట్ చేసేముందు దాని గురించి మరింత సమాచారం తెలుసుకోండి’’ అని సందేశం కనిపిస్తుంది. ఈ ఫీచర్ పరీక్షల్లో భాగంగా ఇది సత్ఫలితాలనిచ్చిందని, దీని వల్ల 29 శాతం మేర అసత్య వార్తల ప్రచారం తగ్గిందని ట్విటర్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 మహమ్మారిపై జరిగే తప్పుడు సమాచార వ్యాప్తికి ఇది కొంత వరకు అడ్డుకట్ట వేస్తుందని ట్విటర్ అభిప్రాయపడింది. -
పెట్టుబడుల జోరు: రిలయన్స్ జోష్
సాక్షి, ముంబై: వరుస నష్టాల తరువాత దేశీయ మార్కెట్లు బుధవారం తేరుకున్నాయి. సెన్సెక్స్ 311 పాయింట్ల లాభంతో 38044 వద్ద, నిఫ్టీ 89 పాయింట్ల లాభంతో 11242 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ఉన్నాయి. ప్రధానంగా రిలయన్స్ రీటైల్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ కేకేఆర్ ద్వారా భారీ పెట్టుబడులను సాధించిన నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ 3 శాతానికి పైగా ఎగిసింది. ఇంకా విప్రో, ఇన్ఫో సిస్, బ్రిటానియీ, హెచ్ సీఎల్ టె క్, సన్ ఫార్మా, ఆసియన్ పెయింట్స్, టైటన్ కంపెనీ లాభాల్లో ఉన్నాయి. మరోవైపు భారతి ఎయిర్ టెల్, టాటా స్టీల్,జేఎస్ డబ్ల్యూ స్టీల్, భారతి ఇన్ ఫ్రాం, గ్రాసిం నష్టపోతున్నాయి. (రిలయన్స్ రీటైల్ : రూ. 5500 కోట్ల పెట్టుబడి) -
గంటల్లోనే 4.2 బిలియన్ డాలర్లు "జూమ్"
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా కాలంలో టెక్ ప్రపంచంలో అత్యంత ధనవంతుల ఆదాయం జామ్ జామ్ అంటూ రికార్డు స్థాయిలో పరుగులు పెడుతోంది. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఒక రోజులో నికర విలువ13 బిలియన్ డాలర్లు పెరగ్గా, టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ ఆదాయం గత నెల 24 గంటల్లో 8 బిలియన్లు పెరిగింది. తాజాగా రికార్డు ఆదాయం సాధించినవారి జాబితాలో ప్రముఖ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ జూమ్ వీడియో కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ ఎరిక్ యువాన్ చేరారు. (ప్రపంచ ధనవంతుల జాబితా.. 4వ స్థానంలో ఎలన్) ఆగస్టు 31న ప్రకటించిన జూలై 31తో ముగిసిన త్రైమాసిక ఫలితాల్లో జూమ్ ఆదాయం 355 శాతం పెరిగి 663.5 మిలియన్ డాలర్లకు చేరుకుంది. కేవలం ఒక సంవత్సరంలో ఆదాయం దాదాపు నాలుగు రెట్లు పెరుగుదలను నమోదు చేసింది. దీంతో కంపెనీ షేర్లు 26 శాతం ఎగిసాయి. ఎరిక్ యువాన్ కొద్ది గంటల్లోనే వందల కోట్ల డాలర్లను తన సంపదకు జోడించుకున్నారు. ఫలితంగా అతని సంపద 4.2 బిలియన్ డాలర్ల మేర పెరిగిందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. జూమ్ వీడియో పేరు ఇదే జోరు కొనసాగిస్తే యువాన్ సంపద 20 బిలియన్ డాలర్లకు మించిపోతుందని పేర్కొంది. కరోనా వైరస్ మహమ్మారి సంక్షోభ సమయం, లాక్ డౌన్ నిబంధనల కారణంగా ప్రజలు వర్చువల్ జీవితానికి అలవాటు పడాల్సిన పరిస్థితి. దీంతో వీడియోకాలింగ్ యాప్ కు భారీ ఆదరణ లభించింది. దీంతో ఈ త్రైమాసికంలో యువాన్ ఆదాయం గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నాలుగు రెట్లు పెరిగింది. సుమారు 50 మిలియన షేర్లతో కంపెనీలో దాదాపు 29 శాతం వాటా యువాన్ సొంతం. ఏప్రిల్ 2019లో పబ్లిక్ ఆఫర్ నాటికి ఇది 22 శాతంగా ఉంది. కాగా ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితా ప్రకారం యువాన్ నికర విలువ 14.4 బిలియన్ల డాలర్లు. -
‘ఈఎస్ఐ స్కామ్‌లో ఎవరి వాటా ఎంతో తేలుస్తాం’
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన 150 కోట్ల ఈఎస్ఐ స్కాంలో అవినీతి నిరోధక శాఖ విచారణ ఇంకా కొనసాగుతోందని ఏసీబీ జేడీ రవికుమార్ గురువారం తెలిపారు. రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ఈఎస్ఐ స్కాంలో ఎవరి వాటా ఎంతో త్వరలోనే తేలుస్తామని, గుర్తించిన నిందితులంతా రింగ్‌గా ఏర్పడి అవినీతికి పాల్పడ్డారని తెలిపారు. కాగా డబ్బుల పంపకాలకు సంబంధించిన వాటాలపై నిందితుల నుంచి వివరాలు రాబట్టనున్నామని పేర్కొన్నారు. ఈఎస్ఐ స్కామ్‌లో టీడీపీ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడుకు డబ్బులు చేరలేదని ఏసీబీ చెప్పినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఖజానాకు నష్టం చేసిన ఎవరినీ వదిలి పెట్టమని, నిందితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. తప్పుడు వార్తలతో కేసును తప్పుదారి పట్టించే యత్నం సరికాదని రవికుమార్ పేర్కొన్నారు. కాగా ఈ కేసులో ఇప్పటికే అచ్చెన్నాయుడుతో సహా 12 మందిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. చదవండి: అరకొర జవాబులు.. ఆపై దాటవేత -
రిలయన్స్ ఇండస్ట్రీస్ కొత్త రికార్డు
దేశీయ ప్రైవేట్ రంగ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు సోమవారం కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. తన డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ జియోలోకి వరుసగా పెట్టుబడులు వెల్లువెత్తడంతో రిలయన్స్ షేరుకు డిమాండ్ పెరిగింది. నేటి ఉదయం బీఎస్ఈలో రూ.1801 వద్ద ప్రారంభమైంది. మార్కెట్ మొదలైనప్పటి నుంచి ఈ షేరకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుండంతో ఒక దశలో 2.55శాతం పెరిగి రూ.1833.10 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఈ ధర(రూ.1833.10) షేరుకు కొత్త జీవితకాల గరిష్టస్థాయి కావడం విశేషం. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ క్యాప్ తొలిసారి రూ.11.5లక్షల కోట్ల మార్కును దాటింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ కంపెనీగా రిలయన్స్ రికార్డుకెక్కింది. ఉదయం 11గంటలకు షేరు మునుపటి ముగింపు(రూ.1787.50)తో పోలిస్తే రూ.1828.25 వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా షేరు ఏడాది షేరు కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.1833.10లు, రూ.1833.10గా నమోదయ్యాయి. జియోలోకి 12వ పెట్టుబడి: రిలయన్స్ జియోలోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుంది. గ్లోబల్ సెమీకండక్టర్ దిగ్గజం ఇంటెల్ కార్ప్ 0.39శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఇందుకు దాదాపు రూ. 1895 కోట్లను వెచ్చించనున్నట్లు తెలుస్తోంది. దీంతో డిజిటల్, టెలికం విభాగమైన రిలయన్స్ జియోలో 25.1 శాతం వాటా విక్రయం ద్వారా మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 1.17 లక్షల కోట్లను సమీకరించినట్లయిందని విశ్లేషకులు తెలియజేశారు. -
రిలయన్స్ షేరు ర్యాలీ ఇప్పట్లో ఆగదు
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ర్యాలీ మరింత కాలం కొనసాగే అవకాశం ఉందని స్టాక్ మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాప్తితో గత ఈక్విటీ మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూసిన సందర్భంలో... రిలయన్స్ షేరు ధర కేవలం 3నెలల్లో రెట్టింపు అయ్యింది. ఈ మార్చి 23న రూ.868 వద్ద ఉన్న షేరు జూన్ 20నాటికి రూ.1761కి చేరుకుంది. ఇంతటి స్థాయిలో ర్యాలీ చేసినప్పటికీ.., పలు బ్రోకరేజ్ సంస్థలు షేరుపై ‘‘బుల్లిష్’’ వైఖరిని కలిగి ఉన్నాయి. ఈ షేరుకు మొత్తం 17 బ్రోకరేజ్ సంస్థలు ‘‘స్ట్రాంగ్ బై’’ రేటింగ్‌ను, 8 కంపెనీలు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించాయి. మరోవైపు 3 బ్రోకరేజ్ సంస్థలు ‘‘సెల్’’ రేటింగ్‌ను ఇవ్వగా, 1 బ్రోకరేజ్ సంస్థ ‘‘స్ట్రాంగ్ సెల్’’ రేటింగ్‌ను ఇచ్చింది. మరో 3ఏళ్లలో షేరు ధర రెట్టింపు: ప్రభుదాస్ లిల్లాధర్ బ్రోకరేజ్ షేర్ హోల్డర్ల కోణంలో పరిశీలిస్తే వచ్చే 3ఏళ్లలో షేరు మరోసారి రెట్టింపు అయ్యే అవకాశాలున్నాయని ప్రభుదాస్ లిల్లాధర్ బ్రోకరేజ్ సంస్థ రీసెర్చ్ విశ్లేషకుడు అజయ్ బోడ్కే తెలిపారు. భారత క్యాపిటల్ మార్కెట్లో అతి తక్కువ కాల వ్యవధిలో రూ.1లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం అనేది అరుదుగా జరిగే సంఘటనగా ఆయన అభివర్ణించారు. ‘‘భారత్ జనాభాలో ఆరోవంతు అవసరాల్లో జియో భాగం కానుంది. రిటైల్, టెలికాం, కన్జ్యూమర్ కేంద్రీకృత వ్యాపారాల వృద్ధి రిలయన్స్ షేరు ర్యాలీకి సహకరిస్తాయి. ఈ షేరు మార్చి కనిష్టస్థాయి నుంచి డ్రీమ్ ర్యాలీ చేసింది. షేర్ హోల్డర్ల కోణంలో పరిశీలిస్తే వచ్చే 3ఏళ్లలో షేరు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది.’’ అని అజయ్ బోడ్కే తెలిపారు. వచ్చే 2-5ఏళ్లలో జియో వాల్యూయేషన్ 200 బిలియన్ డాలర్లు: కేఆర్ చౌక్సీ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే 2-5ఏళ్లలో జియో ప్లాట్‌ఫాం 200 బిలియన్ డాలర్ల వాల్యూయేషన్స్‌ను సాధించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కేఆర్ చౌక్సీ ఇన్వెస్ట్మెంట్స్ మేనేజర్ దేవన్ చౌక్సీ అన్నారు. జియో ప్లాట్‌ఫామ్ సామర్థ్యాన్ని గూగుల్, ఆపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి వాటితో పోలిస్తున్నారు. కంపెనీని రుణ రహితంగా మారుస్తామని ఇచ్చిన వాగ్ధానాన్ని ముకేశ్ నిలబెట్టుకున్నారని ఆయన తెలిపారు. రిటైల్, హెల్త్‌కేర్, పేమెంట్స్ గేమింగ్ అండ్ ఎడ్యుకేషన్, మీడియా, ఎంటర్టైన్మెంట్ వంటి అనేక పెద్ద మొత్తంలో వ్యాపార అవకాశాల కోసం రిలయన్స్ పూర్తి ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించిందని చౌక్సీ చెప్పారు. ఆశావాదం విస్తృతంగా వ్యాపించింది: ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ కంపెనీపై ఆశావాదం విస్తృత స్థాయిలో వ్యాపించడంతో షేరు మరి కొంతకాలం ర్యాలీ చేసేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ అయాన్ ముఖోపాధ్యాయ్ అన్నారు. ఇంకా చాలా ఫండింగ్ సంస్థలు ఈ షేరును కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. ఇటీవల స్టాక్ విభజన జరగవచ్చనే ఊహాగానాలు కూడా వెలుగులోకి వచ్చాయని ఆయన తెలిపారు. రిలయన్స్ వ్యాపారాల విభజన జరిగి వేర్వేరు సంస్థలుగా ఎక్చ్సేంజీల్లో లిస్ట్ కావచ్చన్నారు. దీంతో మరిన్ని పెట్టుబడులను రిలయన్స్‌ను ఆకర్షించేందుకు అవకాశం ఉందిని ముఖోపాధ్యాయ్ అభిప్రాయపడ్డారు. నిర్ణయించిన గడువుకు ముందే కంపెనీని నికర రుణరహితంగా మారుస్తామని ఇచ్చిన హామిని ముకేశ్ అంబానీ నిలబెట్టుకోవడంతో ఇన్వెస్టర్లు రిలయన్స్ షేరు కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. వాస్తవానికి వచ్చే ఏడాది మార్చి 31వ తేదిలోగా కంపెనీని రుణ రహిత కంపెనీగా మారుస్తామని గతంలో కంపెనీ ఛైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. రిలయన్స్ అనుబంధ సంస్థ జియో ఫ్లాట్‌ఫామ్ పెట్టుబడుల ప్రవాహం పెరగడంతో పాటు దేశంలో అతిపెద్ద రైట్స్ ఇష్యూను విజయవంతం చేయడంతో కంపెనీ మార్కెట్ క్యాప్ తొలిసారి 150బిలియన్ డాలర్లను అందుకుంది. ఈ క్రమంలో 150బిలియన్ డాలర్లను అందుకున్న తొలి భారతీయ కంపెనీగా రిలయన్స్ చరిత్ర సృష్టించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ కేవలం 58 రోజుల్లో రూ.1,68,818 కోట్లను సమీకరించింది. ఇందులో జియోలో వాటా విక్రయంతో రూ.115,693.95 కోట్లను, రైట్స్ ఇష్యూ ద్వారా రూ.53,124.20 కోట్లును సేకరించింది. గతంలో పెట్రో-రిటైల్ జాయింట్ వెంచర్లో బ్రిటన్ సంస్థ బీవీకి వాటాను విక్రయించడంతో రూ.7వేల కోట్లకు విక్రయించడంతో మొత్తం రూ.1.75లక్షల కోట్లు నిధుల సమీకరణ చేయగలిగింది. -
రిలయన్స్ జోరుతో ర్యాలీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ జోరుతో శుక్రవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. రుణ రహిత కంపెనీగా అవతరించామని ప్రకటించడంతో రిలయన్స్ షేర్ దూసుకుపోయింది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండటం కలసివచ్చింది. ముడి చమురు ధరలు 2 శాతం పెరిగినా, డాలర్‌తో రూపాయి మారకం విలువ 6 పైసలు పతనమై 76,20కు చేరినా సూచీలు ముందుకే దూసుకుపోయాయి. వరుసగా రెండు రోజులు సెన్సెక్స్, నిఫ్టీలు లాభపడ్డాయి. ఇంట్రాడేలో 640 పాయింట్ల మేర ఎగసిన సెన్సెక్స్ చివరకు 524 పాయింట్లు లాభంతో 34,732 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 153 పాయింట్లు పెరిగి 10,244 పాయింట్ల వద్దకు చేరింది. ఈ రెండు సూచీలు మూడు నెలల గరిష్టస్థాయికి చేరాయి. వారం పరంగా చూస్తే, సెన్సెక్స్, నిఫ్టీలు లాభపడ్డాయి. సెన్సెక్స్ 951 పాయింట్లు, నిఫ్టీ 272 పాయింట్లు చొప్పున ఎగిశాయి. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్ 2.8 శాతం, నిఫ్టీ 2.7 శాతం లాభపడ్డాయి. 712 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్..... సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లోనే ఆరంభమయ్యాయి. ఆ తర్వాత అరగంటకే నష్టాల్లోకి జారిపోయాయి. వెంటనే లాభాల్లోకి వచ్చాయి. ట్రేడింగ్ జరుగుతున్న కొద్దీ, లాభాలు పెరుగుతూ పోయాయి. ఒక దశలో 72 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ మరో దశలో 640 పాయింట్లు ఎగసింది. మొత్తం మీద రోజంతా 712 పాయింట్ల రేంజ్లో కదలాడింది. లాభాల్లో ప్రపంచ మార్కెట్లు.... కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నప్పటికీ, ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా పుంజుకోవడంతో ప్రపంచ మార్కెట్లు లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లు 2 శాతం,యూరప్ మార్కెట్లు కూడా 2 శాతం రేంజ్లో పెరిగాయి. ► దాదాపు 120కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. ముత్తూట్ ఫైనాన్స్, రుచి సోయా, వైభవ్ గ్లోబల్, డిక్సన్ టెక్నాలజీస్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల నిబంధనలను మార్చాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. ఈ తాజా ప్రతిపాదనల కారణంగా ఈ కంపెనీలకు నిధుల సమీకరణ మరింత సులభమవుతుంది. ఈ కారణంగా ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్ 32 శాతం లాభంతో రూ.204కు చేరింది. ఆల్‌టైమ్ హైకి రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో ప్లాట్‌ఫారమ్స్ రెండు నెలల్లో 1.15 లక్షల కోట్ల మేర నిధులు సమీకరించింది. రూ.53,000 కోట్ల మే రైట్స్ ఇష్యూను కూడా కలుపుకుంటే మొత్తం నిధులు రూ.1.69 లక్షల కోట్లకు చేరుతాయి. కాగా ఈ ఏడాది మార్చి నాటికి ఈ కంపెనీ నికర రుణ భారం రూ.1.61 లక్షల కోట్లుగా ఉంది. కాగా ఎలాంటి నికర రుణ భారం లేని కంపెనీగా అవతరించామని శుక్రవారం రిలయన్స్ ప్రకటించింది. దీంతో ఈ షేర్ 6 శాతం ఎగసి రూ.1,761 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హై, రూ.1,789æని తాకింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. సెన్సెక్స్ మొత్తం 524 పాయింట్ల లాభంలో ఈ ఒక్క షేర్ వాటాయే 306 పాయింట్లుగా ఉంది. మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ పాక్షిక చెల్లించిన షేర్లు(ఆర్ఐఎల్–పీపీ) 10% అప్పర్ సర్క్యూట్‌తో రూ.813 వద్దకు చేరాయి. మూడు నెలల్లో డబుల్..: రిలయన్స్ షేర్ 3 నెలల్లో రెట్టింపైంది. ఈ ఏడాది మార్చి 23న రూ.868 వద్ద ఉన్న ఈ షేర్ శుక్రవారం రూ.1,761కు చేరింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.11,89,746 లక్షల కోట్లు (15,000 కోట్ల డాలర్లు)కు చేరింది. ఈ స్థాయి మార్కెట్ క్యాప్ సాధించిన తొలి భారత కంపెనీగా రికార్డ్ సృష్టించింది. -
రిలయన్స్ రికార్డు ర్యాలీతో జాగ్రత్త
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు రికార్డు ర్యాలీ చేసిన నేపథ్యంలో అప్రమత్తత అవసరమని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ కంపెనీ షేరు సోమవారం రూ.1,624 వద్ద సరికొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. కంపెనీ కోర్ వ్యాపారాలైన రిఫైనరీ, పెట్రో కెమికల్స్‌లకు సంబంధించి బ్రోకరేజ్‌లు స్వల్పకాలిక అవుట్‌లుక్‌ను నెగిటివ్‌గా కేటాయించారు. మరోవైపు ఈ ఏడాది మార్చి 31 తేది లోపు పూర్తి కావాల్సిన సౌది ఆరాంకో డీల్‌పై ఇప్పటికి వరకు ఎలాంటి స్పష్టత లేదు. అలాగే జియో ప్లాట్‌ఫామ్‌లలో ఫేస్బుక్ పెట్టుబడులు పెట్టేందుకు రెగ్యులేటరీ అనుమతులు లభించాల్సి ఉంది. ఈ కారణాల దృష్టా్య రానున్న రోజుల్లో రిలయన్స్ షేరు రికార్డు ర్యాలీ పట్ల అప్రమత్తత అవసరం అని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. జియో-ఫేస్బుక్ డీల్‌కు ఇంకా అందని సెబీ అనుమతులు జియో, ఫేస్బుక్ మధ్య ఏప్రిల్ 22న డీల్ కుదిరింది. రిలయెన్స్ జియోలో రూ.43,574 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఫేస్బుక్ ఒప్పందం కుదుర్చుకుంది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో 9.99 శాతం వాటా కోసం ఫేస్బుక్ ఈ డీల్‌ను కుదుర్చుకుంది. డాటా వినియోగ కోణం నుంచి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఈ ఒప్పందాన్ని నిశీతంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఇప్పటికే కార్పోరేట్ వర్గాలు తెలిపాయి. ఫేస్బుక్ తన అనుబంధ యాప్‌లపై వాట్సప్, మెసెంజర్ యాప్‌ల్లో డేటా వినియోగం జియోకు భారీగా కలిసొచ్చే అంశంగా మారనుందని, ఇది ప్రత్యర్థి కంపెనీలైన ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలకు నష్టాన్ని కలిగించే అంశంగా మారిందని వారు అంటున్నారు. ఈ క్రమంలో సెబీ ఏ చిన్నపాటి అభ్యంతరం వ్యక్తం చేసినా రియలన్స్ షేరుకు ప్రతికూల వార్తగా నిలిచిపోయే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకుల అంటున్నారు. రీఫైనరీ, పెట్రో-కెమికల్స్ వ్యాపారాలపై కోవిద్-19 ఎఫెక్ట్ రిలయన్స్ కోర్ వ్యాపారాలైన రీఫైనరీ, పెట్రో-కెమికల్స్ వ్యాపారాలపై కోవిద్-19 ప్రభావం పడింది. ‘‘ఈ ఏడాదిలో రిఫైనరీ, పెట్రో కెమికల్స్ ఉత్పత్తుల డిమాండ్ బలహీనంగా ఉండొచ్చు. తద్వారా రిలయన్స్ ఆయిల్-టు-కెమికల్ విభాగాలు వ్యాల్యూమ్, మార్జిన్లు నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వచ్చే ఏడాదిలో క్రమంగా రికవరిని సాధించే అవకాశం ఉంది’’ అని మే 13న ఫిచ్ బ్రోకరేజ్ సంస్థ తన నివేదికలో పేర్కోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వార్షిక ప్రాతిపాదికన రీఫైనరీ, పెట్రోకెమికల్స్ వ్యాపారాల యుటిలిటీ కెపాసిటి దాదాపు 10శాతం క్షీణించవచ్చిన బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. అలాగే ఆయిల్-టు-కెమికల్స్ వ్యాపారంలో 20 శాతం వాటాను సౌదీ అరాంకోకు విక్రయ ఒప్పందం ఎప్పుడు కార్యరూపం దాల్చుతుందో అనే అంశంపై ఇరు కంపెనీల నుంచి స్పష్టత లేదు. కోవిడ్-19 ప్రభావంతో కంపెనీలు తీవ్ర నష్టాలను ఎదుర్కోంటున్న సమయంలో రిలయన్స్ జియోలోకి వరుసగా అంతర్జాతీయ కార్పోరేట్ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. జియో ఫ్లాట్‌ఫామ్‌లో అంతర్జాతీయ సంస్థలు రూ.97,885 కోట్ల పెట్టబడులు పెట్టడంతో పాటు 30ఏళ్ల తర్వాత ఇటీవల కంపెనీ రూ.53,124 కోట్ల అతిపెద్ద రైట్స్ ఇష్యూను విజయవంతంగా నిర్వహించింది. ఫలితంగా రియలన్స్ షేరు రూ.1,624 వద్ద కొత్త సరికొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. కరోనా సంక్షోభంలోనూ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు జీవితకాల రికార్డు ర్యాలీని అందుకోవడం విశేషం. మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10లక్షల కోట్లను అందుకుంది. ఈ క్రమంలో కంపెనీ దేశంలో అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన ఈ షేరు గడిచిన 5ఏళ్లలో 262శాతం పెరిగింది. మూడేళ్లలో 141శాతం, ఏడాదిలో 22శాతం ర్యాలీ చేసింది. -
క్యూ4 ఫలితాల తర్వాత ఎస్బీఐ టార్గెట్ ధర తగ్గింపు
ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్బీఐ గతవారంలో శుక్రవారం త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. ఫలితాలు అంచనాలకు మించి నమోదయ్యాయి. రుణ వృద్ధి స్తబ్దుగా ఉండటం, నికర వడ్డీ మార్జిన్లు ఇప్పటికీ ఒత్తిళ్లను ఎదుర్కోంటున్న నేపథ్యంలో పలు బ్రోకరేజ్ సంస్థలు ఎస్బీఐ షేరు టార్గెట్ ధరను తగ్గించాయి. అయితే తక్కువ వాల్యూయేషన్లు, మంచి అసెట్ నాణ్యతను కలిగి ఉండటంతో చాలా బ్రోకరేజ్ సంస్థలు ‘‘బై’’ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు ప్రకటించాయి. యస్ బ్యాంక్ సంక్షోభం తర్వాత ఎస్బీఐ డిపాజిట్లు భారీగా పెరగడం కలిసొచ్చే అంశంగా ఉందని బ్రోకరేజ్ సంస్థలు చెప్పుకొచ్చాయి. డిపాజిట్లు, అండర్రైట్, డిజిటలైజేషన్ అంశాల కారణంగా ఎస్బీఐ అత్యుత్తమ ప్రమాణాలను కనబరుస్తోంది. అనుబంధ సంస్థల వాల్యూయేషన్లను అన్‌లాక్ చేయగల భారీ సామర్థ్యం, బ్యాంక్ నిర్వహణ లాభం 1.7-2.0 శాతంగా నమోదు కావడం తదితర సానుకూలాంశాలతో ఎస్బీఐ ఒత్తిళ్లను తట్టుకోగలుగుతుంది. ‘‘మార్చి తర్వాత ఎంసీఎల్ఆర్ 50బేసిస్ పాయింట్లు తగ్గడంతో నికర వడ్డీ మార్జిన్లకు మరింత ప్రమాదం పొంచి ఉంది. ఆకర్షణీయమైన వాల్యూయేషన్, బలమైన ఫ్రాంచైజీలు ఉన్నప్పటికీ.., ఆర్థిక / సామాజిక బాధ్యతల భారాన్ని భరించడంలో ముందంజలో ఉండటం ఎస్బీఐ మరింత ఒత్తిడిని పెంచుతుంది.’’ అని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ బ్రోకరేజ్ చెప్పుకొచ్చింది. మారిటోరియం పరిగణనలోకి తీసుకుంటే ఇతర రుణదాతలతో పోల్చితే ఎస్బీఐ తక్కువ కేటాయింపులు జరపడం నిరాశపరిచిందని ఎంకే గ్లోబల్ సంస్థ తెలిపింది. -
10శాతం లాభపడ్డ టాటామోటర్స్ షేరు
టాటామోటర్స్ కంపెనీ షేరు శుక్రవారం మిడ్‌సెషన్ సమయానికి 10శాతానికి పైగా లాభపడింది. నేడు ఈ కంపెనీ షేరు బీఎస్ఈలో రూ.100.90 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్లో నెలకొన్న కొనుగోళ్లలో భాగంగా ఈ షేరుకు డిమాండ్ నెలకొంది. ఒక దశలో షేరు 10.50 పైగా లాభపడి రూ.108.85 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం 1గంటకు షేరు మునుపటి ముగింపు(రూ.98.50)తో పోలిస్తే 10శాతం లాభంతో రూ.108.35 వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.63.60, రూ.201.80గా ఉన్నాయి. ఇదే సమయానికి సెన్సెక్స్ 200 పాయింట్ల పెరిగి 34180 వద్ద, నిఫ్టీ 83 పాయింట్ల లాభంతో 10112.85 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఒక్క ఎఫ్ఎంసీజీ షేర్ల తప్ప, మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. అత్యధికంగా ప్రభుత్వరంగ బ్యాంక్ షేర్లు లాభపడుతున్నాయి. -
ఆశ్చర్యపర్చిన యస్ బ్యాంకు ఫలితాలు
సాక్షి, ముంబై : వివాదాల సంక్షోభం, మూలధన సమస్యల్లో ఇరుక్కున్న ప్రైవేటు రంగ బ్యాంకు యస్ బ్యాంకు మార్చి 31 తో ముగిసిన త్రైమాసికంలో మెరుగైన ఫలితాలతో అటు ఇన్వెస్టర్లను, ఇటు ట్రేడర్లను ఆశ్చర్య పర్చింది. దీంతో గురువారం నాటి నష్టాల మార్కెట్లో బ్యాంకు షేరు లాభాలతో దూసుకపోతోంది. రూ .2,629 కోట్ల నికర లాభాన్ని నమోదు చేయడంతో యస్ బ్యాంకు షేర్లు నష్టాల మార్కెట్లో భారీగా లాభపడుతున్నాయి. రూ. 31.60 వద్ద షేర్ ధర ఈరోజు 20 శాతం పుంజుకుంది. ఎన్ఎస్ఇ, బీఎస్‌ఇలలో 39.39 మిలియన్ షేర్లు చేతులు మారాయి. (నష్టాల్లో మార్కెట్ : యస్ బ్యాంకు జంప్) ఎస్ బ్యాంకు పునరుద్ధరణలో ఆర్బీఐ గైడెడ్ బెయిలౌట్ సహాయంతో ఇప్పుడు కోలుకుంటున్ బ్యాంకు, ఈ పరిణామాల తరువాత తన మొదటి ఫలితాలను ప్రకటించింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలోరూ. 18,560 కోట్ల నష్టాన్ని, జనవరి-మార్చి త్రైమాసికంలో రూ .1,506 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. నికర వడ్డీ ఆదాయం దాదాపు సగం తగ్గి రూ.1,274 కోట్లకు పరిమితమైంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.16,418 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోల్చితే తక్కువ జారడం వల్ల వరుసగా 19.6 శాతం వృద్ధి. రూ .32,878 కోట్ల స్థూల నిరర్ధక ఆస్తులను (స్థూల ఎన్‌పిఎ), నికర నిరర్ధక ఆస్తులను (నెట్ ఎన్‌పిఎ) 862,37 కోట్ల రూపాయలుగా నివేదించింది. డిసెంబర్ త్రైమాసికంలో మొత్తం ప్రొవిజన్లు రూ .24,766 కోట్లతో పోలిస్తే రూ .4,872 కోట్లకు తగ్గాయి. చాలా మంది విశ్లేషకులు ఊ హించిన దాని కంటే ఆదాయాలు మెరుగ్గా ఉండం విశేషం. కోటక్ సెక్యూరిటీస్ రూ .4,404 కోట్ల నికర నష్టాన్ని అంచనా వేసింది, (యస్ బ్యాంక్‌కు ఆర్బీఐ 60 వేల కోట్లు) యస్ బ్యాంకు వివాదంతో జోక్యం చేసుకున్న ఆర్బీఐ మారటోరియం, నగదు విత్‌డ్రాపై ఆంక్షలకు దిగింది. బోర్డును రద్దు చేసి, 30 రోజుల తాత్కాలిక నిషేధాన్ని విధించింది. ఆ తరువాత బ్యాంకు బోర్డును పునరుద్ధరించిన అనంతరం 2020 మార్చి18 నుండి అన్ని బ్యాంకింగ్ సేవలను తిరిగి ప్రారంభించింది. అలాగే బ్యాంకు పునరుద్దరణ చర్యల్లో భాగంగా ఎస్ బీఐ, హెచ్డీఎఫ్ సీ, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ లాంటి ఏడు ప్రైవేట్ బ్యాంకుల నుండి 10,000 కోట్ల రూపాయల ఈక్విటీ మూలధనాన్ని సమీకరించిన సంగతి తెలిసిందే. (యస్పై మారటోరియం ఎత్తివేత) -
రిలయన్స్‌కు చమురు షాక్
సాక్షి, ముంబై: కోవిడ్-19 వైరస్ వేగంగా విస్తరిస్తున్న ఆందోళనల కారణంగా స్టాక్‌మార్కెట్ల భారీ పతనానికి తోడు, సౌదీ అరేబియా, రష్యా ట్రేడ్ వార్ షాక్ ఆయిల్ రంగ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)ను భారీగా తాకింది. ఇన్వెస్టర్ల అమ్మకాలతో ఆర్ఐఎల్ షేరు 12 సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా సోమవారం అత్యంత ఘోరంగా పడిపోయింది. ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర బీఎస్ఈలో 13.65 శాతం పతనమై రూ.1,094.95 కు చేరుకుంది. గత నాలుగు రోజుల్లో 18శాతం కోల్పోయింది. తత్ఫలితంగా సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా కూడా భారీగా నష్టపోయి రూ. 7 లక్షల కోట్లకు చేరింది. మార్కెట్ క్యాప్ పరంగా ఐటీ మేజర్ టీసీఎస్ రూ .7.31 లక్షల కోట్లతో టాప్‌లోకి వచ్చింది. మార్కెట్ క్యాప్ పరంగా రూ .10 లక్షల కోట్లను అధిగమించి తొలి కంపెనీగా అవతరించిన ఆయిల్-టు-రిటైల్ దిగ్గజం, 2019 డిసెంబర్లో సాధించిన రికార్డు స్థాయిల నుంచి రూ .2.7 లక్షల కోట్లకు పైగా పడిపోయింది. గత ఏడాది డిసెంబరులో ఆర్ఐఎల్ షేరు రూ .1,617 వద్ద 52 వారాల గరిష్ట స్థాయి తాకింది. అప్పటి నుండి ఇది 522 పాయింట్లు లేదా 32 శాతం కుప్పకూలింది. మరోవైపు దేశీయ స్టాక్‌మార్కెట్లు చ రిత్రలో ఎన్నడూ లేని విధంగా రోజు నష్టాన్ని నమోదు చేసింది. కీలక సూచీ సెన్సెక్స్ 2,450 పాయింట్లు, నిఫ్టీ 6.15శాతం కుప్పకూలింది. ముడి చమురు ధరలు 29 ఏళ్ల కనిష్టానికి పడిపోవడంతో బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ ప్రభుత్వ రంగ ఆయిల్ స్టాక్స్ 13 శాతం ఎగియడం గమనార్హం. -
ఐడీబీఐ బ్యాంక్ షేరు జోరు
బడ్జెట్ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు పతనంకాగా.. ఐడీబీఐ బ్యాంక్ కౌంటర్‌కు మాత్రం డిమాండ్ పెరిగింది. బ్యాంకులో మిగిలిన వాటాను విక్రయించనున్నట్లు బడ్జెట్లో ప్రభుత్వం ప్రతిపాదించడంతో ఈ షేరు 10 శాతం దూసుకెళ్లింది. బీఎస్ఈలో శనివారం ఐడీబీఐ బ్యాంకు షేరు రూ. 3.4 ఎగసి రూ. 37.30 వద్ద ముగిసింది. ప్రమోటర్‌గా ప్రభుత్వం ఐడీబీఐ బ్యాంకులో 46.5 శాతం వాటాను కలిగి ఉంది. ఎల్ఐసీకి 51 శాతం వాటా ఉంది. గత సెప్టెంబర్‌లో ఎల్ఐసీ, ప్రభుత్వం సంయుక్తంగా బ్యాంకులో రూ. 9300 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. బ్యాంకు పెట్టుబడి అవసరాలకు తదుపరి ఎల్ఐసీ మరో రూ. 4743 కోట్లను పంప్చేసింది. కాగా.. ప్రభుత్వం స్టాక్ ఎక్సే్ఛంజీల ద్వారా ఐడీబీఐ బ్యాంకులో వాటాను విక్రయించేందుకు నిర్ణయించుకున్నట్లు తాజాగా వెల్లడించింది. -
ముఖేష్ అంబానీకి షాక్!
ప్రపంచ చమురు రంగంలో పాగా వేయాలనుకుంటున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానికి షాక్ తగలనుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిఫైనరీ, పెట్రో కెమికల్ వ్యాపారంలో 25 శాతం వాటా కొనుగోలు చేయాలని భావించిన ప్రపంచంలోనే అతి పెద్ద చమురు సంస్థ, సౌదీ ఆరామ్కోకు భారత ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రిలయన్స్ వ్యాపారంలోని 25 శాతం వాటాను ఆరామ్కో కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో దాన్ని భారత ప్రభుత్వం అడ్డుకున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక వార్తను ప్రచురించింది. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటిష్ గ్యాస్‌పై కొనసాగుతున్న కోర్టు కేసులో భాగంగా భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పత్రిక వెల్లడించింది. తమ కంపెనీ ఆస్తులను వెల్లడిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని రిలయన్స్ డైరెక్టర్లను ప్రభుత్వం కోరిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఫిబ్రవరి 6న విచారణ చేపట్టనున్నట్టు ఆ పత్రిక పేర్కొంది. గతంలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిఫైనరీ, పెట్రో కెమికల్స్ వ్యాపారంలో మైనారిటీ (25 శాతం)వాటా కోసం సౌదీ ఆరామ్కో కంపెనీ 1,000–1,500 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నదని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై స్పందించడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ నిరాకరించింది. మార్కెట్ ఊహాగానాలపై స్పందించడం తమ విధానం కాదని పేర్కొంది. ప్రభుత్వం నిర్ణయంపై రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎలా స్పందిస్తుందో చూడాలి. -
వాటాల విక్రయం : ‘జీ’ షేర్లు జంప్
సాక్షి, ముంబై: ప్రమోటర్ల వాటా విక్రయ వార్తలతో దేశీయ అతిపెద్ద లిస్టెడ్ మీడియా కంపెనీ జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్‌ప్రైజె భారీగా లాభపడుతోంది.గురువారం ఉదయం ట్రేడింగ్ సెషన్ ఆరంభంలోనే ఏకంగా 15 శాతం ర్యాలీ చేసింది. హై స్థాయిలో ట్రేడర్ల లాభాల స్వీకరణ కనిపించినప్పటికీ మిడ్ సెషన్ తరువాత తిరిగి పుంజుకుంది. గత రెండు రోజుల్లో 16.89 శాతం పెరిగింది. ప్రమోటర్ సుభాష్ చంద్ర నేతృత్వంలోని ఎస్సెల్ గ్రూప్ 16.5 శాతం వరకు వాటాను ఆర్థిక పెట్టుబడిదారులకు విక్రయించనున్నారు. జీల్ లోని 16.5 శాతం వాటాను ఆర్థిక పెట్టుబడిదారులకు విక్రయించాలని ఎస్సెల్ గ్రూప్ యోచిస్తోందని మీడియా సంస్థ బుధవారం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్కు అందించిన సమాచారంలోతెలిపింది. ఒప్పంద పత్రం ప్రకారం మూడు ప్రమోటర్లు ఈఎంవీఎల్ 77 మిలియన్ షేర్లను, క్వైతర్ గ్రూప్ 61 మిలియన్ షేర్లను, ఎస్సెల్ గ్రూప్ 11 మిలియన్ల ఈక్విటీ షేర్లను మొత్తం 15.72 శాతం వాటాకు సమానమైన ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. ఒక్కో ఈక్విటీ ధరను బుధవారం నాటి ముగింపు ధర(రూ.307)తో పోలిస్తే 10శాతం డిస్కౌంట్‌తో రూ.277 గా నిర్ణయించారు. ఈ మొత్తం ఒప్పందం విలువ దాదాపు రూ.4,132 కోట్లుగా ఉండవచ్చు. సిటీ గ్రూప్ సంస్థ డీల్స్‌కు బుక్ రన్నర్‌గా వ్యవహరించారు. ఈ విక్రయం ద్వారా సమకూరిన నిధులను సంస్థ రుణాల చెల్లింపునకు వినియోగించుకోనుంది. ఈ 16.50శాతంలో ఇన్వెస్కో ఒపెన్‌హైమర్ డెవలపింగ్ మార్కెట్స్ ఫండ్ అనుబంధ సంస్థ ఓఎఫ్సీ గ్లోబల్ చైనా ఫండ్‌కు 2..3శాతం వాటాను విక్రయించనుంది. ఈ సంస్థ ఇప్పటికే జీ లిమిడెలో 8.7శాతం వాటాను కలిగి ఉంది. సెప్టెంబర్ 30 నాటికి, జీ ప్రమోటర్లు 22.37 శాతం వాటాకు సమానమైన ఈక్విటీ షేర్లను కలిగి ఉన్నారు. షేర్‌హోల్డింగ్ డాటా ప్రకారం 96 శాతానికి సమానమైన వాటాను రుణదాతల వద్ద తనఖా పెట్టింది. ఈ లావాదేవీ తరువాత, సంస్థలో ఎస్సెల్ హోల్డింగ్ ఐదు శాతానికి పడిపోతుంది, వీటిలో ఎన్కంబర్డ్ హోల్డింగ్ 1.1 శాతంగా ఉంటుంది. సుభాష్ చంద్ర తన కుటుంబంతో కలిసి మ్యూచువల్ ఫండ్లతో సహా దేశీయ రుణదాతలకు, రష్యన్ రుణదాత విటిబితో సహా రూ 7,000 కోట్ల బాకీ పడిన సంగతి తెలిసిందే. -
టీసీఎస్‌కు ఫలితాల షాక్
సాక్షి, ముంబై: ఐటీ మేజర్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కు క్యూ2 ఫలితాల షాక్ తగిలింది. దేశీయ స్టాక్‌మార్కెట్లు ఆరంభంలో 400 పాయింట్లకు పైగాఎగిసినప్పటికీ టీసీఎస్ షేరు టాప్ లూజర్‌గా నిలిచింది. సెప్టెంబరు త్రైమాసిక ఆదాయాలు మార్కెట్ అంచనాలను అందుకోలేక పోవడంతోశుక్రవారం టీసీఎస్ షేర్లు 4 శాతం క్షీణించాయి. అటుకీలక సూచీలు కూడా ట్రేడర్ల అమ్మకాలతో భారీ లాభాలనుంచి వెనక్కి తగ్గాయి. సెన్సెక్స్,నిఫ్టీ కీలకమద్దతుస్థాయిలను కోల్పోయి స్వల్ప లాభాలతో తీవ్ర ఊగిసలాట మధ్య కొనసాగుతున్నాయి. గురువారం మార్కెట్ ముగిసిన తరువాత ప్రకటించిన ఫలితాల ప్రకారం.. ఈ ఏడాది రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాల అంచనాలను అందుకోలేకపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ2లో కంపెనీ నికర లాభం 1.8 శాతం వృద్ధి చెంది రూ. 8,042 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో నికర లాభం రూ. 7,901 కోట్లు. ఇక జూలై సెప్టెంబర్ త్రైమాసికంలో ఆదాయం 5.8% పెరిగి రూ. 36,854 కోట్ల నుంచి రూ. 38,977 కోట్లకు చేరింది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన ఆదాయ వృద్ధి 8.4శాతంగా నమోదైంది.రూ. 1 ముఖవిలువ గల షేరు ఒక్కింటికి రూ. 5 చొప్పున రెండో విడత మధ్యంతర డివిడెండుతో పాటు రూ. 40 మేర ప్రత్యేక డివిడెండ్ చెల్లించాలని టీసీఎస్ బోర్డు నిర్ణయించింది. దీనికి రికార్డు తేదీ అక్టోబర్ 18. చెల్లింపు తేదీ అక్టోబర్ 24. చదవండి : టీసీఎస్..అంచనాలు మిస్ -
యస్ బ్యాంకు షేరు ఎందుకు కుప్పకూలింది?
సాక్షి, ముంబై: ప్రయివేటు రంగ బ్యాంకు యస్ బ్యాంకుకు మరోసారి భారీ అమ్మకాల సెగ తగిలింది. దీంతో గురువారం 52 వారాల కనిస్టానికి పతనమైంది. ప్రధానంగా ప్రమోటర్ గ్రూప్ కంపెనీకి చెందిన మార్పిడికి వీలుకాని డిబెంచర్ల(ఎన్సీడీల) రేటింగ్‌ను..కేర్ డౌన్‌గ్రేడ్ చేసిన వార్తలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. దీంతో ఆ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఫలితంగా అయిదు నెలల్లో ఎన్నడూ లేనంతగా అతిభారీ పతనాన్ని నమోదు చేసింది. ప్రమోటర్ గ్రూప్‌లోని మోర్గాన్ క్రెడిట్స్ రూ. 800 కోట్ల జారీ అనంతరం ఎన్సీడీల రేటింగ్‌ను ఏ- నుంచి కేర్ రేటింగ్స్ తాజాగా బీబీబీకు సవరించినట్లు యస్ బ్యాంక్ పేర్కొంది. యస్ బ్యాంక్‌లో మోర్గాన్ క్రెడిట్స్ 3.03 శాతం వాటాను కలిగి ఉంది. బ్యాంకు షేర్ల ధరలు పతనమైన నేపథ్యంలో ఎంసీపీఎల్, తదితర ప్రమోటర్ల వద్ద గల వాటా విలువ పడిపోవడంతో రేటింగ్ డౌన్‌గ్రేడ్ చేపట్టినట్లు కేర్ రేటింగ్స్ తెలియజేసింది. ఈ నేపథ్యంలో యస్ బ్యాంక్ షేరు ఇంట్రాడేలో ఎన్ఎస్ఈలో 17 శాతం కుప్పకూలి రూ. 54 వద్ద ముగిసింది. -
కాఫీ డేకు భారీ ఊరట
సాక్షి, ముంబై : కెఫే కాఫీడే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ ఆత్మహత్య అనంతరం భారీగా నష్టపోయిన కాఫీ డే షేర్లు సోమవారం భారీగా పుంజుకున్నాయి. ఒకవైపు రుణ భారాన్ని తగ్గించుకోనే చర్యలు, మరోపక్క పానీయాల గ్లోబల్ కంపెనీ కోక కోలా వాటాను కొనుగోలు చేయవచ్చన్న అంచనాల నేపథ్యంలో కాఫీ డే ఎంటర్ప్రైజెస్ కౌంటర్లో జోష్ నెలకొంది. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో 5 శాతానికిపైగా లాభపడి రూ. 65.80 వద్ద అప్పర్ సర్క్యూట్ అయింది. సిద్ధార్థ అదృశ్యం, మరణానంతరం షేరు ధర మూడువారాల్లో (జులై 26 నుంచి) 68 శాతం పతనమైంది. పానీయాల రిటైల్ స్టోర్ల కంపెనీ కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ రూ. 2,400 కోట్ల రుణాలను తిరిగి చెల్లించనున్నట్లు తాజాగా వెల్లడించింది. దీంతో గ్రూప్ రుణ భారం ఆమేర తగ్గనునందని వివరించింది. జులై చివరికల్లా గ్రూప్ రుణభారం రూ.4970 కోట్లుగా నమోదైనట్లు తెలియజేసింది. దీనిలో కాఫీడే రుణభారాన్ని రూ.3472 కోట్లుగా పేర్కొంది. ప్రధానంగా బెంగళూరులోని గ్లోబల్ విలేజ్ పార్క్‌ను పీఈదిగ్గజం బ్లాక్‌స్టోన్‌కు విక్రయించడం ద్వారా ఈ రుణభారాన్ని తగ్గించుకోనున్నట్టు వెల్లడించిన సంగతి తెలిసిందే. మరోపక్క కంపెనీలో వాటాను విక్రయించేందుకు గ్లోబల్ దిగ్గజం కోక కోలాతో కాఫీ డేలో తిరిగి చర్చలు ప్రారంభించినట్లు మీడియా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. అయితే ఈ అంశంపై రెండు కంపెనీలూ అధికారికంగా స్పందించాల్సి వుంది. -
ఫలితాల దెబ్బ : ఎస్‌బ్యాంకు షేరు పతనం
సాక్షి,ముంబై: ప్రయివేటు రంగ బ్యాంకు ఎస్ బ్యాంకునకు ఫలితాల సెగ భారీగా తాకింది. మార్చి30తో ముగిసిన గత ఏడాది నాలుగవ త్రైమాసిక ఫలితాలు ప్రకటనతో ఎస్ బ్యాంకు కౌంటర్లో అమ్మకాల వెల్లువెత్తింది. దీంతో ఏకంగా షేరు 30శాతం కుప్పకూలింది. 2005 తర్వాత ఎస్ బ్యాంక్ ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే తొలిసారి. బ్యాడ్లోన్ల బెడదతో త్రైమాసికంలో 1506 కోట్ల రూపాయలను నికర నష్టాలను చవి చూసింది. అయితే గత ఏడాదితో పోలిస్తే ఆదాయం 16.29శాతం పుంజుకుని రూ. 2505 కోట్లు సాధించింది. ప్రొవిజన్లు 9 రెట్లు ఎగబాకి రూ.3661 కోట్లగా ఉన్నాయి. గత ఏడాది ఇదే క్వార్టర్లో ఇది రూ.399 కోట్లు మాత్రమే. -
మారుతీ కార్ల ఉత్పత్తిలో కోత
న్యూఢిల్లీ: వాహనాలకు డిమాండ్ అంతంతమాత్రంగానే ఉన్న నేపథ్యంలో ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఉత్పత్తిని తగ్గించింది. ఫిబ్రవరిలో వాహనాల తయారీలో 8 శాతం పైగా కోత విధించింది. స్టాక్ ఎక్సే్చంజీలకు ఇచ్చిన సమాచారం ప్రకారం మారుతీ సుజుకీ గత నెల 1,48,959 యూనిట్లు తయారు చేసింది. గతేడాది ఫిబ్రవరిలో ఉత్పత్తి చేసిన 1,62,524 యూనిట్లతో పోలిస్తే ఇది 8.3 శాతం తక్కువ కావడం గమనార్హం. ఆల్టో, స్విఫ్ట్, విటారా బ్రెజా తదితర ప్యాసింజర్ కార్ల ఉత్పత్తి 8.4 శాతం తగ్గింది. గత ఫిబ్రవరిలో 1,61,116 యూనిట్లతో పోలిస్తే 1,47,550 యూనిట్లకు క్షీణించింది. అయితే ఈకో, ఆమ్ని వంటి వ్యాన్స్ విభాగం ఉత్పత్తి 13,827 యూనిట్ల నుంచి 22.1 శాతం వృద్ధితో 16,898 యూనిట్లకు పెరిగింది. సూపర్ క్యారీ ఎల్సీవీ తయారీ ఒక్క యూనిట్ మేర పెరిగింది. అటు ఉత్పత్తిలో కోతకు కారణాలపై స్పందించేందుకు మారుతీ సుజుకీ నిరాకరించింది. మారుతీ సుజుకీ ఉత్పత్తి జనవరిలో 1,58,396 యూనిట్ల నుంచి 15.6 శాతం వృద్ధితో 1,83,064 యూనిట్లకు చేరింది. ప్యాసింజర్ వాహనాల ఉత్పత్తి 1,56,168 యూనిట్ల నుంచి 14.3 శాతం వృద్ధి చెంది 1,78,459 యూనిట్లకు పెరిగింది. అమ్మకాల విషయానికొస్తే.. జనవరిలో మారుతీ సుజుకీ విక్రయాలు 1.1 శాతం పెరిగాయి. గతేడాది జనవరిలో నమోదైన 1,40,600 యూనిట్ల నుంచి 1,42,150 యూనిట్లకు చేరాయి. అయితే ఫిబ్రవరిలో మాత్రం దేశీ విక్రయాలు 0.9 శాతం క్షీణించి 1,39,100 యూనిట్ల నుంచి 1,37,900 యూనిట్లకు తగ్గాయి. కంపెనీకి గురుగ్రామ్, మానెసర్‌లో 15.5 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్ధ్యంతో రెండు ప్లాంట్లు ఉన్నాయి. దీంతో పాటు మాతృసంస్థ సుజుకీకి గుజరాత్‌లోని హన్సల్పూర్ ప్లాంటులో 2.5 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్ధ్యంతో ఒక లైన్ ఉంది. -
మాక్స్‌బుపాలో వాటా విక్రయించిన మ్యాక్స్ ఇండియా
న్యూఢిల్లీ: మాక్స్ బుపా హెల్త్ ఇన్సూరెన్స్‌లో తనకున్న మొత్తం 51 శాతం వాటాను మ్యాక్స్ ఇండియా విక్రయించింది. ఈ వాటాను ప్రైవేట్ ఈక్విటీ సంస్థ, ట్రూ నార్త్ ఫండ్ ఫోర్ ఎల్ఎల్పీకి విక్రయించామని మ్యాక్స్ ఇండియా తెలిపింది. ఈ డీల్ విలువ రూ.510 కోట్లని పేర్కొంది. మొత్తం నగదులోనే ఈ లావాదేవీ జరిగింది. ఈ లావాదేవీ పరంగా చూస్తే, మాక్స్ బుపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ విలువ రూ.1,001 కోట్లుగా ఉంది. రెండేళ్లలో కొత్త బ్రాండ్... ఈ లావాదేవీ పూర్తయిన తర్వాత మాక్స్ బుపా డైరెక్టర్ల బోర్డ్‌కు డైరెక్టర్లను ట్రూ నార్త్ నామినేట్ చేయనున్నది. మరోవైపు మ్యాక్స్ ఇండియా నామినేట్ చేసిన డైరెక్టర్లు వైదొలుగుతారు. మ్యాక్స్ బ్రాండ్‌ను రెండేళ్ల పాటు కొనసాగిస్తారు. ఈ రెండేళ్లలో దశలవారీగా మరో కొత్త బ్రాండ్‌ను ఏర్పాటు చేస్తారు. బుపా బ్రాండ్ నేమ్ మాత్రం కొనసాగుతుంది. ఇక ఈ వాటా విక్రయం ద్వారా లభించిన రూ.511 కోట్లను ప్రస్తుత, కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతామని మ్యాక్స్ గ్రూప్ చైర్మన్ అనల్జిత్ సింగ్ చెప్పారు. కాగా భారత్‌లో ఆరోగ్య బీమా రంగం వృద్ధి చెందుతోందని, ఆరోగ్య బీమా రంగంలో మాక్స్ బుపాను అత్యంత విశ్వసనీయ బ్రాండ్‌గా రూపొందించడమే తమ లక్ష్యమని ట్రూ నార్త్ పార్ట్నర్ దివ్య సెహ్గల్ చెప్పారు. ఈ లావాదేవీ విషయంలో మ్యాక్స్ ఇండియాకు ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా కేపీఎమ్‌జీ కార్పొరేట్ ఫైనాన్స్ వ్యవహరిస్తోంది. ఆరు ప్రత్యేకమైన ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్... 1999 నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ట్రూ నార్త్(ఇండియా వేల్యూ ఫండ్ అడ్వైజర్స్–ఫోర్‌ఎఫ్‌ఏ)మధ్య తరహా లాభదాయక వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి, వాటిని ప్రపంచ స్థాయి ఉన్నత సంస్థలుగా మార్చుతోంది. ట్రూ నార్త్ సంస్థ ఇప్పటికే ఆరు ప్రత్యేకమైన ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్‌ను ఆరంభించింది. వీటి మొత్తం నిధులు 280 కోట్ల డాలర్లను మించిపోయాయి. కాగా ఇంగ్లండ్‌కు చెందిన హెల్త్‌కేర్ సర్వీసుల దిగ్గజ సంస్థ, బుపా, మ్యాక్స్ ఇండియా కంపెనీలు కలసి మాక్స్ బుపా జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేశాయి. కాగా ఈ వాటా విక్రయ వార్తల కారణంగా బీఎస్ఈలో మ్యాక్స్ ఇండియా షేర్ 2.6 శాతం లాభంతో రూ.82.50 వద్ద ముగిసింది. -
ఒక్క వాట్సాప్ మెసేజ్ : రూ. 9,200 కోట్లు గోవింద..!!
న్యూఢిల్లీ: ఇన్ఫీబీమ్ అవెన్యూస్ షేర్ శుక్రవారం 70 శాతం.. అక్షరాలా 70 శాతం క్షీణించింది. బీఎస్ఈలో గురువారం రూ.196 వద్ద ముగిసిన ఈ షేర్ శుక్రవారం 70.24 శాతం(రూ.139) నష్టపోయి రూ.58.80 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 73 శాతం పతనంతో తాజా ఏడాది కనిష్ట స్థాయి, రూ.53.80ను తాకింది. బీఎస్ఈలో 1.9 కోట్లు, ఎన్ఎస్ఈలో 15 కోట్లకు పైగా షేర్లు ట్రేడయ్యాయి. ఒక్క రోజులోనే కంపెనీ మార్కెట్ క్యాప్ ముప్పావు వంతు, రూ. 9,200 కోట్లు హరించుకుపోయి రూ. 3,902 కోట్లకు పడిపోయింది. కంపెనీ వార్షిక సాధారణ సమావేశం(ఈజీఎమ్) నేడు(శనివారం) జరగనున్నది. అంతా ఆ మెసేజ్ వల్లే...! కంపెనీ అకౌంటింగ్ విధానాలపై ఆందోళన కలిగించే వాట్సాప్ మెసేజ్ ట్రేడర్ల మధ్య వైరల్ కావడంతో ఈ కంపెనీ షేర్ ఈ స్థాయిలో పడిపోయిందని నిపుణులంటున్నారు. ఈక్విరస్ సెక్యూరిటీస్ పేరు మీద ఈ వాట్సాప్ మెసేజ్ వచ్చిందని సమాచారం. అయితే కొన్ని నెలల క్రితమే ఈ మెసేజ్‌ను ఈక్విరస్ సంస్థ, కొంతమంది క్లయింట్లకు పంపించిందని, అయితే కంపెనీ ఏజీఎమ్‌కు ఒక్క రోజు ముందు ఈ మెసేజ్ వైరల్ అయిందని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. కంపెనీ స్వచ్ఛంద వివరణ... షేర్ ధర భారీగా పతనం కావడంతో ఇన్ఫీబీమ్ స్వచ్ఛందంగా వివరణ ఇచ్చింది. కంపెనీ పనితీరుపై ప్రభావం చూపించే ప్రతీ చిన్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు స్టాక్ ఎక్సే్చంజ్‌లకు అందజేస్తున్నామని ఇన్ఫీబీమ్ వెల్లడించింది. అంతేకాకుండా స్టాక్ ఎక్స్చేంజ్లు ఎప్పుడు, ఏ వివరం అడిగినా, సకాలంలో అందజేశామని పేర్కొంది. షేర్ ధరల సరళిని ప్రభావితం చేసే పెండింగ్ సమాచారమేదీ లేదని తెలిపింది. కాగా ఇన్ఫీబీమ్ కంపెనీ తన అనుబంధ సంస్థకు ఎలాంటి వడ్డీ లేకుండా రుణాన్ని ఇచ్చిందన్న వార్తల పట్ల బీఎస్ఈ వివరణ కోరింది. తమ అనుబంధ సంస్థ, ఎన్ఎస్ఐ ఇన్ఫీనీయమ్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఎలాంటి తనఖా లేకుండా వడ్డీ రహిత రుణాలిచ్చామని ఇన్ఫీబీమ్ కంపెనీ వివరణ ఇచ్చింది. ఆ కంపెనీ ఆరంభమైనప్పటి నుంచి ఈ తరహా రుణాలిస్తున్నామని, ఇవి స్వల్పకాలిక రుణాలని, తాము ఎప్పుడు అడిగితే అప్పుడు ఆ అనుబంధ కంపెనీ ఈ రుణాలను తీర్చేసేదని పేర్కొంది. పేలవంగా ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిస్టింగ్ రైల్వే ఇంజినీరింగ్, కన్స్ట్రక్షన్ కంపెనీ ఇర్కాన్ ఇంటర్నేషనల్ పేలవంగా లిస్టయింది. ఇష్యూ ధర రూ.475తో పోల్చితే ఎన్ఎస్ఈలో 13% నష్టంతో రూ.413 వద్ద లిస్టయింది. ఇంట్రాడేలో రూ.465, రూ.409 గరిష్ట, కనిష్ట స్థాయిలను తాకింది. చివరకు 13 శాతం నష్టంతో రూ.415 వద్ద ముగిసింది. మార్కెట్ ముగిసిన తర్వాత కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.3,919 కోట్లుగా ఉంది. మరోవైపు ప్రభుత్వ రంగ గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ ఐపీఓ శుక్రవారం పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయింది. ఈ ఐపీఓ ప్రైస్‌బాండ్ రూ.114–118. కాగా 4 కంపెనీలు–చార్టర్డ్ స్పీడ్, నెక్కన్ పవర్ అండ్ ఇన్ఫ్రా, నర్మద బయో–కెమ్, డయాగ్నస్టిక్స్ కంపెనీ మెట్రోపొలిస్ హెల్త్‌కేర్ కంపెనీలు కూడా ఐపీఓకు రావడం కోసం సెబీకి దరఖాస్తు చేశాయి. -
అనగనగా...
చిన్నప్పుడు అమ్మమ్మలు, తాతయ్యలు తమ మనమ సంతానానికి కథలు చెప్పాలంటే ‘అనగనగా ఓ రాజకుమారుడు’ ఉండేవాడట అని ప్రారంభించేవారు. ఇప్పుడు అదే టైటిల్‌తో రామ్ సాయి గోకులం క్రియేషన్స్ పతాకంపై పి.వి. రాఘవులు నిర్మిస్తున్న చిత్రం ‘అనగనగా రాజకుమారుడు’. నవీన్ బాబు, సంజన జంటగా నటిస్తున్నారు. షేర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం పాటలను తెలంగాణ వ్యవసాయ అభివృద్ధి సంస్థ చైర్మన్ లింగంపల్లి కిషన్‌రావు విడుదల చేశారు. షేర్ మాట్లాడుతూ– ‘‘చిన్న మెసేజ్‌తో పాటు యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైన్మెంట్తో మా చిత్రం ఉంటుంది. హీరో హీరోయిన్లు చక్కగా నటించడంతో పాటు రాఘవులుగారు రాజీ పడక పోవడంతో సినిమా బాగా వచ్చింది’’ అన్నారు. ‘‘నేటి యువతకు మంచి సందేశాన్నిచ్చే సినిమాను తీశాం. దర్శకుడు చిత్రాన్ని చక్కగా తెరకెక్కించాడు. త్వరలోనే విడుదల చేస్తాం’’ అన్నారు రాఘవులు. తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, ప్రతాని రామకృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఈ ఐపీఓలకు ఏమైంది..?
(సాక్షి, బిజినెస్ విభాగం) : ప్రైమరీ మార్కెట్లో సందడి చేసిన అనేక కంపెనీల ఐపీఓలు (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) సెకండరీ మార్కెట్‌కు వచ్చే సరికి చతికిలపడిపోతున్నాయి. పలు సంస్థల ప్రకటనలు మూలధన సమీకరణకే పరిమితమైపోతున్నాయి. ఐసీఓ సమయంలో అది చేస్తాం, ఇది చేస్తాం.. కంపెనీ సమర్థత ఓ స్థాయిలో ఉందని చెప్పి ఓవర్ వాల్యుయేషన్స్ కట్టుకున్న అనేక కంపెనీల అసలు రంగు నెమ్మదిగా బయటపడుతోంది. గతేడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు రూ.500 కోట్లకు మించి నిధులను సమీకరించిన కంపెనీల జాబితాలో 33 సంస్థలుండగా వీటిలో ఏకంగా 17 కంపెనీల ప్రస్తుత మార్కెట్ ధరలు ఇష్యూధర కంటే కూడా దిగువకు పడిపోయాయి. వీటిలో 3 కంపెనీలు ఇన్వెస్టర్ల పెట్టుబడిని సగానికిపైగా హరించేశాయి. మార్కెట్ పైకి.. షేరు ధర కిందకి గడిచిన ఏడాదికాలంలో సెన్సెక్స్ 12 శాతం వృద్ధిని నమోదుచేసింది. గతేడాదిలో అయితే ఏకంగా 28 శాతం ర్యాలీ చేసింది. మధ్యలో భారీ పతనాలున్నప్పటికీ మొత్తంగా చూస్తే మేజర్ గ్లోబల్ మార్కెట్ల కంటే అధిక లాభాలనే పంచింది. యూకే, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, చైనా, రష్యా మార్కెట్లతో పోలిస్తే అవుట్ పెర్ఫార్మర్గానే నిలిచింది. ప్రధాన సూచీలు ఇలా ఉంటే.. తాజాగా ఐపీఓకు వచ్చి సెకండరీ మార్కెట్లోకి అడుగుపెట్టిన పలు కంపెనీలు ఇష్యూ ధర కంటే 11– 69 శాతం శాతం దిగువన ట్రేడవుతున్నాయి. ఈ జాబితాను ఒకసారి పరిశీలిస్తే.. దేశంలోనే అతి పెద్ద సాధారణ బీమా సంస్థగా ప్రైమరీ మార్కెట్లో సందడిచేసిన ‘న్యూ ఇండియా అష్యూరెన్స్’ ఐపీఓ ఆ తరువాత కాలంలో ఇన్వెస్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయింది. రూ.770– 800 ధరల శ్రేణినితో వచ్చి రూ.800 వద్ద 1.19 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. ఈ ఐపీఓ ద్వారా సంస్థ రూ.9,600 కోట్లు సమీకరించింది. లిస్టింగ్ రోజునే 6.39 శాతం డిస్కౌంట్‌తో షాకిచ్చి.. క్రమంగా పడిపోతూ ఏడాది కూడా పూర్తికాకముందే 70 శాతం పెట్టుబడిని ఆవిరిచేసింది. ప్రస్తుతం రూ.244 వద్ద ఉంది. ప్రభుత్వ రంగ సంస్థే ఇంతటి ఓవర్ వాల్యుయేషన్స్‌తో వచ్చి తమను దెబ్బతీస్తుందని ఎలా ఊహిస్తామన్నది రిటైల్ ఇన్వెస్టర్ల మాట. జనరల్ ఇన్సూరెన్స్దీ అదే దారి... ప్రభుత్వ రంగంలోని మరో బీమా సంస్థ జనరల్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ఐపీఓ సైతం ఇదే తీరును ప్రదర్శించింది. రూ.11,373 కోట్ల సమీకరణ లక్ష్యంతో అతిపెద్ద ఐపీఓగా సందడి చేసి చివరకు భారీ నష్టాలను మిగిల్చిందీ సంస్థ. ఇష్యూ ధర రూ.912 కాగా, మంగళవారం నాటి మార్కెట్ ముగింపు సమయానికి రూ.354 వద్ద నిలిచింది. గతేడాది అక్టోబరులో ఐపీఓకు వచ్చిన ఈ కంపెనీ ఇప్పటివరకు షేరు ధరలో 63 శాతం పతనాన్ని నమోదు చేసింది. ఇక ఐపీఓ ద్వారా రూ.515 కోట్లను సమీకరించిన పాఠ్యపుస్తకాల ముద్రణ సంస్థ ఎస్ చాంద్ అండ్ కంపెనీ కూడా ఇన్వెస్టర్ల పెట్టుబడిని సగం చేసింది. ఇష్యూ ధర రూ.670 ఉండగా, ప్రస్తుతం రూ.300 స్థాయిలో కొనసాగుతోంది. షేరు ధర 54 శాతం కరిగిపోయింది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఇండోస్టార్ క్యాపిటల్ ఫైనాన్స్, హిందూస్తాన్ ఏరోనాటిక్స్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, భారత్ రోడ్ నెట్వర్క్, రిలయన్స్ నిప్పన్ లైఫ్ సహా పలు కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. అధిక విలువలే అసలు కారణం..! కొనేవారు ఉండాలే కానీ, కొన్ని పరిమితులకు లోబడి షేరు ప్రీమియంను నిర్ణయించుకునే వెసులుబాటు కంపెనీలకు ఉంది. ఈ పరిమిత స్వేచ్ఛను ఆసరాగా తీసుకునే పలు కంపెనీలు ఐపీఓ ధరల శ్రేణిని అధిక వాల్యుయేషన్స్ వద్ద ప్రకటించేస్తున్నాయి. ఇలా అధిక విలువతో ప్రైమరీ మార్కెట్లో ఇన్వెస్టర్లను ఊదరగొడుతున్నప్పటికీ... సెకండరీ మార్కెట్లో క్రమంగా అసలు విలువ బయటపడుతోంది. ఈ క్రమంలోనే తాజా 17 కంపెనీల షేరు ధరలో పతనం నమోదైందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. సత్తా చూపిన అవెన్యూ సూపర్ మార్ట్స్ వాల్యుయేషన్స్ పక్కాగా ఉన్న కంపెనీలలో పెట్టుబడి పదిలంగా ఉండడమే కాకుండా, లాభాలు వందల శాతాల్లోనే ఉంటాయనే దానికి ‘డీ మార్ట్’ రిటైల్ చైన్‌ను నిర్వహించే అవెన్యూ సూపర్ మార్ట్స్ ఐపీఓ అద్ధం పట్టింది. ఈ కంపెనీ ఇష్యూ ధర కేవలం రూ.299 కాగా, ప్రస్తుతం రూ.1,534 స్థాయిలో కొనసాగుతోంది. ఏడాదిన్నర కాలంలోనే 413 శాతం రాబడిని అందించింది. 2017 ఐపీఓ మార్కెట్ వేడిలోనే పబ్లిక్ ఇష్యూకు వచ్చిన ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 94 శాతం, బంధన్ బ్యాంక్ 66 శాతం లాభాలను అందించాయి. విలువ సరిగ్గా ఉండడం, నిర్వహణ సజావుగా కొనసాగడం, వ్యాపార ధోరణిలో సత్తా ఉండడం వంటి అంశాల కారణంగా ఇదే తరహాలో హెచ్డీఎఫ్సీ ఏఎంసీ, హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్ ఐపీఓలు ఇష్యూ ధర కంటే 45 శాతానికి మించి రాబడిని అందించాయి. -
బ్యాంకు సీఈవోకు ఎక్స్టెన్షన్ : షేరు ఢమాల్
సాక్షి, ముంబై: ప్రముఖ ప్రయివేటు బ్యాంకు ఎస్ బ్యాంకు షేరు భారీ పతనాన్ని నమోదు చేసింది. శుక్రవారం 7శాతం వరకూ నష్టపోయి 8వారాల కనిష్టానికి చేరుకుంది. సీఈవో రాణా కపూర్ పదవిలో కొనసాగేందుకు ఆర్బీఐ ప్రస్తుతానికి అనుమతించినట్లు వార్తలు వెలువడినప్పటికీ ఎస్‌బ్యాంక్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకోవడం గమనార్హం. ఆరంభంలోనే 5శాతం నష్టంతో టాప్ విన్నర్‌గా నిలిచింది. అమ్మకాలు మరింత పెరగడంతో ఎస్‌బ్యాంకు షేరు 7శాతం వరకూ రూ.338.00ల స్థాయికి పతనమైంది. అనంతరం కొద్దిగా కోలుకుని 6శాతం నష్టాలకు పరిమితమైంది. ముఖ్యంగా బ్యాంకు సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్‌గా రాణా కపూర్ పదవీకాలాన్ని మరో మూడేళ్లు పొడిగించేందుకు ఆర్బీఐ అనుమతి లభించినట్టు ఎస్ బ్యాంకు తెలిపింది. తదుపరి నోటీస్ ఇచ్చేటంతవరకూ రాణా కపూర్‌ను సీఈవో, ఎండీగా కొనసాగనున్నారని గురువారం మార్కెట్ ముగింపు అనంతరం స్టాక్‌ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. అయితే విశ్లేషకులు మాత్రం సీవోఈ పునర్నిమాయకం చుట్టూ వివాదాలున్నట్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఎస్ బ్యాంకు వ్యవస్థాపక సీఈవోగా రాణా కపూర్ 2004 నుంచీ కొనసాగుతున్నారు. సీఈవోగా ఆయన పదవీ కాలం నేటితో(ఆగస్టు 31) ముగియనుంది. ఈ ఏడాది జూన్‌లో యస్ బ్యాంక్ వాటాదారులు మరో మూడేళ్లపాటు కపూర్ పదవిలో కొనసాగేందుకు అనుమతించారు. -
సైరస్ మిస్త్రీకి స్వల్ప ఊరట
న్యూఢిల్లీ: కార్పొరేట్ దిగ్గజం టాటా సన్స్, మిస్త్రీ వివాదంలో సైరస్ మిస్త్రీకి పాక్షిక ఉపశమనం లభించింది. టాటా సన్స్ సంస్థలో ఆయన వాటాలను విక్రయాలకు నేషనల్ కంపెనీ లా అప్పెలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీఏటీ) అడ్డకట్ట వేసింది. తన వాటాలను విక్రయించాల్సింది టాటాసన్స్ ఒత్తిడి తేలేదని కోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ ఎస్జే ముఖోపాధ్యాయ నేతృత్వంలోని ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ శుక్రవారం ఈ ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తుది విచారణను సెప్టెంబర్ 24కు వాయిదా వేసింది. టాటా సన్స్‌ను ప్రైవేటు కంపెనీగా మార్పు అంశంపై ఈ కేసులో తుది వాదనల తరువాత నిర్ణయిస్తామని తెలిపింది. టాటా సన్స్ ఛైర్మన్ పదవి నుంచి తొలగింపునకు వ్యతిరేకంగా మిస్త్రీ దాఖలు చేసిన ఎన్‌సీఎల్‌టీఏటీ స్వీకరించింది. ఛైర్మన్ గా సైరస్ మిస్త్రీ తొలగింపు సరైనదేనని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ ఇటీవల తీర్పు ఇచ్చింది. ఎన్ సీఎల్ టీలో న్యాయమూర్తులు ప్రకాశ్ కుమార్, సేనపతిల బెంచ్ తీర్పును సైరస్ సవాల్ చేశారు. టాటా సన్స్ గత 101 సంవత్సరాలుగా 1917 నుంచీ టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఉందని టాటాసన్స్ న్యాయవాది వాదించారు. కాగా గత ఏడాది టాటా సన్స్ ఛైర్మన్ పదవినుంచి ఉద్వాసనకు గురైన అనంతరం టాటా గ్రూప్‌లో మెజారిటీ స్టాక్ హోల్డర్స్ మిస్త్రీ కుటుంబం షాపూర్జీ, పల్లోంజి గ్రూప్ వాటా కొనుగోలు దారుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. -
హెక్సావేర్‌కు బ్లాక్‌డీల్ దెబ్బ
సాక్షి, ముంబై: టెక్ సంస్థ హెక్సావేర్ టెక్నాలజీస్ శుక్రవారం భారీగా నష్టపోయింది. బ్లాక్‌డీల్స్ ద్వారా భారీ సంఖ్యలో షేర్లు చేతులు మారినట్లు వెల్లడికావడంతో హెక్సావేర్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలతో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) లో 19 శాతం వరకు పతనమైంది. రూ.401 వద్ద ఆల్‌టైం కనిష్టాన్ని తాకింది. ప్రస్తుతం కాస్త కోలుకుని దాదాపు 13 శాతం నష్టంతో రూ. 433 వద్ద ట్రేడవుతోంది. అయితే పలు బ్లాక్‌డీల్స్ ద్వారా మొత్తం ఈక్వీటీలో13.5 శాతం 40.06 మిలియన్ల షేర్లు చేతులు మారినట్టు ఎక్స్చేంజ్ గణాంకాలు ద్వారా తెలుస్తోంది. కంపెనీ ప్రమోటర్ బేరింగ్ ప్రయివేట్ ఈక్విటీ ఆసియా సంస్థ బ్లాక్‌డీల్స్ ద్వారా 8.4శాతం వాటాను విక్రయించినట్లు తెలుస్తోంది. ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ సిటీ ఈ లావాదేవీలను నిర్వహించినట్లు తెలియజేశాయి. రూ. 447.5 ఫ్లోర్ ప్రైస్ ప్రకారం బేరింగ్ పీఈకి వాటా విక్రయం ద్వారా సుమారు రూ.1100 కోట్లు లభించనున్నట్లు మార్కెట్ వర్గాలు తెలియజేశాయి. ఈ వాటాను సంస్థాగత ఇన్వెస్టర్లకు విక్రయించి ఉండవచ్చని అంచనా. కాగా జూన్ 30, 2018 నాటికి, హెక్సావేర్ టెక్నాలజీస్‌లో పీరింగ్ ఆసియా గ్లోబల్ ఐటి సొల్యూషన్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ అనే ఒక సంస్థ ద్వారా 71.22శాతం వాటాను కలిగి ఉంది. హెక్సావేర్ టెక్నాలజీస్ మార్కెట్ గత ఏడాదితో పోల్చుకుంటే 81 శాతం పెరిగింది. -
‘ఆధార్’ షేర్ చేయకండి!
న్యూఢిల్లీ: ఆధార్ సంఖ్యను ఆన్లైన్లో, సోషల్ మీడియాలో బహిరంగంగా ఇతరులతో పంచుకోవద్దని, ఆధార్ సంఖ్య ఆధారంగా తమ వివరాలను వెల్లడించాలని సవాల్ చేయొద్దని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) పౌరులకు సూచించింది. ఇతరుల ఆధార్ సంఖ్యతో లావాదేవీలు చేయడం చట్టవ్యతిరేకమని, దాన్ని నేరంగా పరిగణిస్తామంది. ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ తన ఆధార్ సంఖ్యను బహిరంగంగా వెల్లడించి, దుర్వినియోగం చేయాలంటూ సవాల్ చేసిన విషయం, దాంతో స్పందించిన హ్యాకర్లు ఆయన బ్యాంక్ అకౌంట్ వివరాలు సహా పూర్తి సమాచారాన్ని సంగ్రహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే యూఐడీఏఐ ఈ సూచన చేసింది. -
డేటా లీక్: 130 బిలియన్ డాలర్లు మటాష్!
శాన్ఫ్రాన్సిస్కో: సోషల్ నెట్ వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. కేంబ్రిడ్జ్ ఎనలిటికా ద్వారా అధిక సంఖ్యలో వినియోగదారుల డేటా చోరీ నేపథ్యంలో ఫేస్బుక్ ఆదాయం భారీగా క్షీణించనుందన్న అంచనాలతో మార్కెట్లో ఫేస్బుక్ కౌంటర్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది. వినియోగదారుల వృద్ధి, రెవెన్యూ భారీగా పడిపోవడంతో మార్కెట్ ఆరంభంలోనే సంస్థ షేర్ కుప్ప కూలింది. వాడుకదారుల వృద్ధిలో విశ్లేషకుల అంచనాల కంటే తక్కువగా నమోదు చేసింది. దీంతో తీవ్ర అమ్మకాలతో ఒత్తిడితో 24 శాతానికిపైగా నష్టపోయింది. కేవలం రెండే రెండు గంటల్లో మార్కెట్ విలువలో 130 బిలియన్ డాలర్ల సంపద తుడిచిపెట్టుకు పోయింది. 2012తరువాత ఇదే అదిపెద్ద పతనమని ఎనలిస్టులు చెబుతున్నారు. అటు ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ 16.8 బిలియన్ డాలర్ల మేర వ్యక్తిగత సంపదను కోల్పోయారు. కంపెనీ ఆదాయ అంచనాల ప్రకటన తరువాత ఈ పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన ఆర్థిక అధికారి డేవిడ్ వేహ్నెర్ రాబోయే త్రైమాసికంలో బలహీనమైన ఆదాయం అంచనాలను వెల్లడించడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. రెవెన్యూ వృద్ధి రెండవ త్రైమాసికంలో "క్షీణించింది" ఇది మరింత తగ్గిపోనుందని డేవిడ్ ప్రకటించారు. ఈ క్షీణత రాబోయే సంవత్సరాల్లో కొనసాగే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. రెండవ త్రైమాసికంలో లాభాలు 31 శాతం పెరిగి 5.1 బిలియన్ డాలర్లగా నమోదు కాగా, ఆదాయాలు 42 శాతం పెరిగి 13.2 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. తాజా గణాంకాల ప్రకారం ఫేస్బుక్ నెలవారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య కేవలం 11శాతం పుంజుకుని 2.23 మిలియన్లుగా నమోదైంది. 2.25మిలియన్లుగా నమెదుకావచ్చని విశ్లేషకులు అంచనావేశారు. అలాగే రోజువారీ యూజర్ల సంఖ్య ఎనలిస్టులు అంచనాలను మిస్ చేసి 11శాతం వృద్ధితో 1.47మిలియన్లుగా నమోదైంది. భద్రత, గోప్యత అంశాలపై భారీ పెట్టుబడులు పెడుతున్నామని ఫేస్బుక్ అధిపతి జుకర్‌బర్గ్ ప్రకటించారు. సంస్థను తరువాతి త్రైమాసికం కోసం మాత్రమే కాకుండా దీర్ఘకాలికంగా నడపనున్నామంటూ ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంపొందించే వ్యాఖ్యలు చేశారు. -
టీసీఎస్‌కు బైబ్యాక్ కిక్
సాక్షి,ముంబై: ఐటీ సేవల దిగ్గజ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) కౌంటర్ భారీ లాభాలతో ట్రేడ్అవుతోంది. ఈ నెల15న సొంత షేర్ల కొనుగోలు(బైబ్యాక్) ప్రతిపాదనను పరిశీలించనుందన్నవార్తలతో ఇన్వెస్టర్ల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. భారీ కొనుగోళ్లతో టీసీఎస్ షేరు దాదాపు 3 శాతం పుంజుకుంది. బైబ్యాక్ ప్రతిపాదనను పరిశీలించేందుకు కంపెనీ బోర్డు ఈ నెల 15న సమావేశం నిర్వహిస్తున్నట్లు టీసీఎస్ మంగళవారం తెలియజేసింది. కంపెనీ వద్ద ఉన్న నగదు నిల్వలలో కొంతమేర వాటాదారులకు ప్రయోజనం చేకూర్చే షేర్ల బైబ్యాక్‌కు వెచ్చించాలని కంపెనీ ప్రణాళికలు వేసింది. కాగా గత ఏడాది రూ .16,000 కోట్ల మెగా బైబ్యాక్ ఆఫర్‌ను నిర్వహించింది టీసీఎస్. మొత్తం ఈక్విటీలో 3 శాతం లేదా 5.61 కోట్ల షేర్లను ఈక్విటీ వాటాకి 2,850 రూపాయల ధర వద్ద కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. -
దెబ్బ మీద దెబ్బ: ఇండిగో భారీ పతనం
సాక్షి, ముంబై: దేశీయ విమానయాన సేవల సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌కు అటు అధ్యక్షుడు రాజీనామా, ఇటు ఫలితాల షాక్ భారీగా తగిలింది. గత ఆర్థిక సంవత్సరం(2017-18) చివరి త్రైమాసికంలో సాధించిన ఫలితాలు ఇన్వెస్టర్లను నిరాశపరచడంతో ఈ కౌంటర్లో అమ్మకాలకు తెరలేచింది. దీంతో ఇండిగో షేరు 18 శాతానికి పైగా కుప్పకూలింది. 2016 జనవరి తరువాత ఇదే అదపెద్ద పతనమని మార్కెట్ వర్గాలు విశ్లేషించాయి. ముఖ్యంగా ఇండిగో అధ్యక్షుడు ఆదిత్య ఘోష్ రాజీనామా తర్వాత షేర్లు 26 ఏప్రిల్ నుంచి తగ్గుముఖం పట్టాయి. 26శాతం క్షీణించి దాదాపు రూ. 13650 కోట్ల విలువైన మార్కెట్ విలువ కోల్పోయింది. క్యూ4 ఫలితాల దెబ్బ క్యూ4(జనవరి-మార్చి)లో ఇండిగో నికర లాభం 75 శాతం పతనమై 118 కోట్ల రూపాయలను నమోదు చేసింది. నిర్వహణ, ఇంధన వ్యయాలు పెరగడం దీనికి కారణంమని ఇండిగో మార్కెట్ ఫైలింగ్‌లో పేర్కొంది. మొత్తం ఆదాయం మాత్రం 18 శాతం ఎగసి రూ. 6057 కోట్లకు చేరింది. ఇంధన వ్యయాలు రూ. 1751 కోట్ల నుంచి 2338 కోట్లకు పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది. అయితే గత ఏడాది ఇదే త్రైమాసికంలో రెవెన్యూ 17.8 శాతం పెరిగి రూ .5,141.99 కోట్లనుంచి రూ .656.84 కోట్లను ఆర్జించింది. ఈ త్రైమాసికంలో ఇంధన వ్యయం రూ .2,338 కోట్లు పెరిగి రూ .1,751 కోట్లకు చేరుకుంది. -
సాహో.. టీసీఎస్!
ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)... వంద బిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించింది. అంచనాలను మించిన ఆర్థిక ఫలితాలతో ఈ కంపెనీ షేర్ ధర ఆల్‌టైమ్ హైని తాకటంతో... వంద బిలియన్ డాలర్లకు చేరిన తొలి భారత ఐటీ కంపెనీగా రికార్డ్ సాధించింది. ఒకప్పుడు పోటీ కంపెనీ ఇన్ఫోసిస్ కన్నా ఒకటిన్నర రెట్లు తక్కువగా ఉన్న ఈ కంపెనీ... ఇప్పుడు ఇన్ఫోసిస్ కంటే రెండున్నర రెట్లు అధిక విలువ గల కంపెనీగా మారింది. ఇన్ఫీతో కలుపుకొని విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రాల మొత్తం మార్కెట్ క్యాప్కంటే టీసీఎస్ మార్కెట్ విలువే అధికం. ముంబై: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సోమవారం చరిత్ర సృష్టించింది. ఈ షేర్ ధర ఆల్‌టైమ్ హైని తాకటమే కాక... వంద బిలియన్ (పదివేల కోట్ల) డాలర్ల మార్కెట్ విలువ (రూ.6,60,000 కోట్లు) సాధించిన తొలి భారత ఐటీ కంపెనీగా రికార్డ్ సాధించింది. ఇపుడు ప్రపంచంలో ఇలా వంద బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ సాధించిన వాటిలో టీసీఎస్ 64వ కంపెనీగా నిలిచింది. అంతర్జాతీయం గా టాప్ 100 మార్కెట్ విలువ ఉన్న కంపెనీల్లో ఒకటి. ఒక్క నెలలో 25 శాతం పెరిగిన షేర్.. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడంతో టీసీఎస్ షేర్ దూకుడు చూపిస్తోంది. సోమవారం ఇంట్రాడేలో 4.42 శాతం లాభంతో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.3,557 ధరను తాకింది. ఈ ధర వద్ద ఈ కంపెనీ మార్కెట్ విలువ ఏకంగా రూ.6.8 లక్షల కోట్లు. ఈ మైలురాయిని దాటిన తర్వాత లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో ఈ షేర్ చివరకు 0.2 శాతం లాభంతో రూ.3,415 వద్ద ముగిసింది. మార్కెట్ క్యాప్ రూ.6.53 లక్షల కోట్లకు పరిమితమైంది. మార్కెట్ క్యాప్ పరంగా అగ్రస్థానంలో ఉన్న భారత కంపెనీ ఇదే. ట్రేడింగ్ పరిమాణం విషయానికొస్తే, బీఎస్ఈలో 5.06 లక్షలు, ఎన్ఎస్ఈలో 75 లక్షలకు పైగా షేర్లు ట్రేడయ్యాయి. గత మూడు రోజుల్లో ఈ షేర్ 8 శాతం వరకూ పెరిగింది. ఈ మూడు రోజుల్లో రూ.48,948 కోట్ల మార్కెట్ క్యాప్ జతయింది. మొత్తం సెన్సెక్స్ కంపెనీల మార్కెట్ క్యాప్‌లో టీసీఎస్ కంపెనీ మార్కెట్ క్యాప్ వాటాయే 11 శాతంగా ఉంది. ఈ ఏడాది ఇప్పటిదాకా ఈ షేర్ 27 శాతం ఎగసింది. ఈ ఒక్క నెలలోనే ఈ షేర్ 25 శాతం లాభపడటం విశేషం. గత ఎనిమిదేళ్లలో ఈ షేర్ ఈ స్థాయిలో(ఒక్క నెలలో 25 శాతం) లాభపడటం ఇదే మొదటిసారి. ఇంతకు ముందు రిలయన్స్.. కాగా 2007లోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ వంద బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ సాధించిన తొలి భారత కంపెనీగా అవతరించింది. 2007, అక్టోబర్ 18న ఈ కంపెనీ ఈ ఘనతను సాధించింది. అప్పుడు డాలర్‌తో రూపాయి మారకం 39.59గా ఉంది. ఇప్పుడు ఈ విలువ 66పైగానే ఉంది. 14 ఏళ్లలో...1,300 శాతం వృద్ధి 1970లో కార్యకలాపాలు ప్రారంభించిన టీసీఎస్ 2004లో ఐపీఓకు (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) వచ్చింది. ఇష్యూ ధర రూ.850. 2008 చివరి నాటికి రూ.206గా ఉన్న కంపెనీ షేర్ సోమవారం నాటికి ఆల్‌టైమ్ హై, రూ.3,557ను తాకింది. పదేళ్లలో 16 రెట్లు పెరిగింది. 2004, ఆగస్టు 25న ఈ షేర్ స్టాక్ మార్కెట్లో లిస్టయింది. అప్పటి నుంచి చూస్తే, ఈ షేర్ 1,300 శాతం (బోనస్‌లు, డివిడెండ్లు, షేర్ల విభజన అన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే) పెరిగింది. ఈ 13 ఏళ్లలో 21.3 శాతం చక్రగతిన వృద్ధి సాధించింది. ఇదే కాలానికి ఇన్ఫోసిస్ 14 శాతం చక్రగతి వృద్ధి చెందింది. టీసీఎస్ లిస్టింగ్ రోజున రూ.10,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఈ 13 ఏళ్లలో ఆ మొత్తం రూ.1.40 లక్షలయ్యేది (డివిడెండ్లు మినహాయించుకొని). మార్కెట్ క్యాప్‌పరంగా అతి పెద్ద కంపెనీగా టీసీఎస్ అవతరించినప్పటికీ, ఇన్వెస్టర్లకు రాబడుల పరంగా కొన్ని ఐటీ కంపెనీలతో పోలిస్తే టీసీఎస్ వెనకబడే ఉంది. నేను చాలా చాలా సంతోషిస్తున్నాను. ఇది ప్రత్యేకమైన సందర్భం, ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్నాం. రానున్న నెలలు, క్వార్టర్లో టీసీఎస్ మరింత జోరు చూపిస్తుంది. తర్వాతి పరుగుకు ఇది ప్రారంభం మాత్రమే. –ఎన్, చంద్రశేఖరన్, టీసీఎస్ చైర్మన్ 1970లో 25 మంది ఉద్యోగులతో ఆరంభమైన టీసీఎస్.. ఈ స్థాయికి విస్తరిస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. ప్రపంచంలో ఏ వ్యక్తికి అవసరమైన సేవలనైనా అత్యుత్తమ టెక్నాలజీలతో అందించగలిగాం. రామదొరై, చంద్ర ల సారథ్యంలో జోరుగా వృద్ధి చెందాం. ఇదొక అద్భుత ప్రయాణం. –ఎస్. మహాలింగమ్, టీసీఎస్ మాజీ సీఎఫ్ఓ ఇన్ఫీ కంటే ఇంతింతై... 2009, మార్చిలో ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్కంటే టీసీఎస్ మార్కెట్ క్యాప్ ఒకటిన్నర రెట్లు తక్కువ. 2009 చివరకు వచ్చేసరికి మార్కెట్ క్యాప్ విషయంలో రెండు కంపెనీలు సరిసమానంగా ఉన్నాయి. ఇక ఇప్పుడు ఇన్పీ కంటే టీసీఎస్ మార్కెట్ క్యాప్ రెండున్నర రెట్లు అధికం కావడం విశేషం. అంతే కాకుండా ఇన్ఫోసిస్‌తో కలుపుకొని మరో మూడు ఐటీ దిగ్గజాలు–విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రాల మొత్తం మార్కెట్ క్యాప్ కంటే కూడా టీసీఎస్ మార్కెట్ క్యాప్ అధికం కావడం ప్రస్తావించదగ్గ విషయం. ప్రస్తుతం విలువ పరంగా రెండో స్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో పోల్చితే టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ.61,000 కోట్లు అధికం. టీసీఎస్... ఇవీ ఘనతలు ♦ టాటా గ్రూప్ ఆదాయంలో 85 శాతం వాటా టీసీఎస్‌దే. ♦ టీసీఎస్‌లో ప్రస్తుతం 3,87,200 మంది ఉద్యోగులున్నారు. వీరంతా 130 దేశాలకు చెందిన వారు కావడం విశేషం. ♦ పాకిస్తాన్ స్టాక్ ఎక్సే్చంజ్‌లో లిస్టయిన మొత్తం 577 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్(81.38 బిలియన్ డాలర్లు)తో పోల్చినా ఒక్క టీసీఎస్ మార్కెట్ క్యాప్ కంటే కూడా తక్కువే. ♦ ప్రపంచ ఐటీ దిగ్గజం యాక్సెంచర్ మార్కెట్ క్యాప్(98 బిలియన్ డాలర్లు)ను కూడా టీసీఎస్ అధిగమించేసింది. మార్కెట్ క్యాప్ మైలురాళ్లు సంవత్సరం మార్కెట్క్యాప్ (బిలియన్ డాలర్లు) 2004 ఐపీఓ 2005 10 2010 25 2013 50 2014 75 2018 100 -
వాట్సాప్ అప్ డేట్ చేస్కోండి
సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్.. తన యూజర్లను యాప్ అప్ డేట్ చేసుకోవాలని కోరుతోంది. మరో సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టినట్లు వాట్సాప్ తెలిపింది. టైమ్తోపాటు లోకేషన్ స్టికర్లను పంపుకునే వెసులుబాటను కల్పించింది. ఇంతకు ముందు యూజర్లు గూగుల్ మ్యాపింగ్ ద్వారా లోకేషన్ షేర్ చేసుకునే వారు. అయితే ఆ అవసరం లేకుండా.. ఫోటోలు, వీడియోలు పంపుకునే ఆప్షన్(స్టిక్కర్ల) ద్వారానే లోకేషన్‌ను పంచుకునే వీలు కల్పించింది. అంతేకాదు మీరు ఎక్కడున్నది టైమ్‌తో సహా షేర్ చేసుకోవచ్చు. ఇందుకోసం యాప్‌ను అప్డేట్ చేసుకోవాలని వాట్సాప్ ఓ ప్రకటనలో సూచించింది. దీనివల్ల యూజర్లకు చాలా సమయం కలిసొస్తుందని సంస్థ పేర్కొంది. కాగా, కొద్ది రోజుల క్రితమే పేమెంట్స్ సౌకర్యాన్ని కూడా వాట్సాప్ కల్పించిన విషయం తెలిసిందే. -
‘గీతాంజలి’కి మరోఅధికారి గుడ్‌బై
సాక్షి, న్యూఢిల్లీ: పీఎన్బీ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న గీతాంజలి జెమ్స్ సంస్థనుంచి మరో టాప్ ఎగ్జిక్యూటివ్ తప్పుకున్నారు. రూ. 11,400కోట్ల భారీ కుంభకోణంలో ప్రధాన నిందితుడు డైమండ్ వ్యాపారి నీరవ్‌మోదీ మామ, మెహుల్ చోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్ ముఖ్య ఆర్థిక అధికారి (సీఎఫ్‌వో) చంద్రకాంత్ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల రీత్యా తాను పదవినుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. కాగా ఇప్పటికే గీతాంజలినుంచి కంపెనీ సెక్రటరీ ఫంకూరి వారంగీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు నీరవ్ మోదీ ఇంటిపైనా, ఆఫీసులపై ఈడీ దాడులు సోమవారం కూడా కొనసాగుతున్నాయి. ముంబైలోని 5 ప్రాంతాల్లో, సూరత్‌లోని 3 ఏరియాల్లో, ఔరంగాబాద్, ఢిల్లీలో సోదాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. నీరవ్ కంపెనీకి చెందిన ఉద్యోగులను సీబీఐ ప్రశ్నిస్తోంది. ఈ మెగా స్కాంలో గీతాంజలి జెమ్స్ షేరు వరుసగా నాలుగో రోజు సోమవారం కూడా భారీగా పతనాన్ని నమోదు చేసింది. ఇన్వెస్టర్ల అమ్మకాలతో 10శాతానికి పైగా నష్టపోయింది. ఈ మొత్తం నాలుగు సెషన్లలో 50 శాతానికిపై కుప్పకూలి రికార్డ్ కనిష్టాన్ని తాకింది. ఫిబ్రవరి 14నుంచి ఇప్పటివరకూ రూ. 344 కోట్ల రూపాయల గీతాంజలి మార్కెట్ క్యాప్ తుడిచిపెట్టుకుపోయింది. అటు పంజాబ్ నేషనల్ బ్యాంకు షేరు కూడా 10శాతానికి పైగా నష్టపోయింది. -
హైక్‌తో జతకట్టిన ఓలా సంస్థ
కొరుక్కుపేట: ప్రముఖ మెసేజింగ్ యాప్ హైక్‌తో ప్రపంచంలోనే అతిపెద్ద రైడ్ షేరింగ్ కంపెనీ ఓలా సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. వినియోగదారులకు మెరుగైన సేవల లక్ష్యంగా ఈ ఒప్పందం చేసుకున్నట్లు ఓలా సీఈవో భవిష్ అగర్వాల్, హైక్ వ్యవస్థాపకులు కవిన్ భారతీ మిట్టల్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం చెన్నైలో జరిగిన కార్యక్రమంలో కవిన్ భారతీ మిట్టల్ మాట్లాడుతూ వినియోగదారులకు సౌకర్యవంతంమైన సేవలు అందించేవిధంగా ఓలాతో ఒప్పందం చేసుకున్నామని అన్నారు. ఓలాకారును, ఆటోలను హైక్ యాప్ ద్వారానే బుక్ చేసుకోవచ్చునని అన్నారు. హైక్ వ్యాలెట్ ద్వారానే చెల్లింపులు చేయవచ్చని పేర్కొన్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని హైక్ వినియోగదారులకు తెలియజేశారు. -
అర్చకులపై అటెండర్ పెత్తనం!
ఆళ్లగడ్డ: ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో ఓ అటెండర్..అర్చకులపై పెత్తనం చెలాయిస్తున్నాడు. భక్తులు దయతలచి హారతి పళ్లెంలో వేసే కానుకుల్లో వాటా కావాలని పట్టుబడుతున్నాడు. వాటా ఇవ్వని పక్షంలో కక్ష గట్టి అర్చకులను వేధిస్తున్నాడు. హారతి పళ్లెంలో వేసే కానుకలను గుడిలో విధులు నిర్వహించే అర్చకుడు, పరిచారకులు ఇద్దరు సగం, సగం పంచుకోవడం ఆనవాయితీగా వస్తోంది. పంపకాల్లో కొంత మొత్తం (రూ. 100 వరకు ) అక్కడ ఆ రోజు విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఇస్తారు. అయితే ఈ మధ్యకాలంలో కానుకలు బాగా వస్తున్నాయని మంత్రి అనుచరుడిగా చెప్పుకుంటున్న ఓ అటెండర్ కొందరు సిబ్బందితో కలిసి ఆలయ అధికారికి ఆశలు రేకెత్తించారు. అధికారుల తరఫున ఆ అటెండర్.. అర్చకుల దగ్గరకు వెళ్లి ఇక మీదట కానుకలు మూడు భాగాలు చేయాలని అందులో ఒక భాగం తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొందరు అర్చకులు అడ్డుచెప్పడంతో హారతి పళ్లెంలో వేసే కానుకలు అన్నీ హుండీలో వేయిస్తున్నారు. అంతే కాకుండా ప్రసాదాల తయారీకి అందించే నిధుల్లో భారీగా కోతలు విధించారు. దీంతో పూర్వం నుంచి చేస్తున్న ఆచార వ్యవహారాలు కొనసాగించలేక పోతున్నామని కొంతమంది అర్చకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరకొర సరుకులతోనే ప్రసాదాలు తయారు చేసి స్వామికి నివేదిస్తూ, ఉభయదారులకు సర్దుతున్నారు. ఇంత జరుగుతున్నా మఠం ప్రతినిధులు పట్టించుకోక పోవడం విమర్శలకు తావిస్తోంది. ఆందోళనకు సిద్ధమవుతున్న అర్చకులు ఎన్నడూ లేని విధంగా ఓ అటెండర్ పెత్తనం చలాయిస్తూ ఉండడంతో అర్చకులంతా మూకుమ్మడి నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్నారు. అర్చకులందరూ సంతకాలు చేసి రాతపూర్వకంగా అహోబిలం మఠం ప్రతినిధి సంపత్‌కు ఫిర్యాదు కూడా చేశారు. చర్యలు తీసుకోకపోతే వైదిక కార్యక్రమాలు నిలిపి గుడి ఎదుట నిరసనకు దిగాలని సమాయత్తమవుతున్నారు. ఖర్చు ఎక్కువ అవుతోంది కల్యాణం నిర్వహించే సమయంలో భక్తులు రూ.800తో కేసరి టికెట్ తీసుకుంటున్నారు. దేవస్థానానికి రూ. 2300 ఖర్చు అవుతోంది. దీంతో నష్టం వస్తుందని రూ. 800 మేరకు సరిపోయే సరుకులు మాత్రమే ఇస్తున్నాం. – కామేశ్వరి, అహోబిలం ఈఓ -
బై బ్యాక్ ఆఫర్‌తో జస్ట్ డయల్ జోరు
న్యూఢిల్లీ: లోకల్ సెర్చ్ ఇంజీన్ జస్ట్ డయల్ బై బ్యాక్ ఆఫర్‌తో మంగళవారం నాటి బుల్మార్కెట్లో భారీ లాభాలను ఆర్జించింది. రూ. 84 కు సొంత షేర్ల కొనుగోలు(బైబ్యాక్) ప్రతిపాదనకు కంపెనీ బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో జస్ట్ డయల్ కౌంటర్‌కు ఉత్సాహాన్నిచ్చింది. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో దాదాపు 3శాతం జంప్ చేసింది. వాటాదారుల నుంచి బహిరంగ మార్కెట్ నుంచి పూర్తిస్థాయిలో చెల్లించిన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసే ప్రతిపాదనను బోర్డు ఆమోదించిందని రెగ్యులేటరీ ఫైలింగ్ లో బోర్డు డైరెక్టర్లు చెప్పారు. దీని ద్వారా రూ. 84 కోట్ల రూపాయలదాకా వెచ్చించనున్నట్టు ప్రకటించింది. షేరు ధర రూ. 700 ధర మించకుండా సంస్థ గరిష్టంగా 11.98 లక్షల షేర్లను కొనుగోలు చేయనుంది. అలాగే అభిషేక్ బన్సాల్ ని ఛీఫ్ ఫైనాన్షయిల్ ఆఫీసర్‌గా జస్ట్ డయల్ బోర్డ్ నియమించింది. -
క్విప్ ద్వారా రూ.1,000 కోట్లు: ఆంధ్రాబ్యాంకు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్ మెంట్ (క్విప్) ద్వారా డిసెంబరు నాటికి రూ.800–1,000 కోట్లు సమీకరించాలని ఆంధ్రాబ్యాంకు నిర్ణయించింది. తద్వారా బ్యాంకులో ప్రభుత్వ వాటా ప్రస్తుతమున్న 61.26 శాతం నుంచి 60 శాతం దిగువకు చేరుతుంది. గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం నుంచి మూలధనం కింద రూ.1,100 కోట్ల నిధులు సమకూరాయి. ఈ నిధుల రాకతో బ్యాంకులో ప్రభుత్వ వాటా పెరిగింది. జీవిత బీమాలో సంయుక్త భాగస్వామ్య (జేవీ) కంపెనీ అయిన ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో వాటా విక్రయ ప్రతిపాదన ఏదీ లేదని బ్యాంకు అధికారి ఒకరు స్పష్టం చేశారు. వచ్చే రెండు మూడేళ్లలో ఈ కంపెనీ విలువ మరింత పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. జేవీ ద్వారా డివిడెండు పెద్దగా స్వీకరించనప్పటికీ లాభాలు వస్తున్నాయని గుర్తుచేశారు. జేవీలో ఆంధ్రాబ్యాంకుకు 30 శాతం వాటా, బ్యాంక్ ఆఫ్ బరోడా 44 శాతం, యూకేకు చెందిన లీగల్ అండ్ జెనరల్‌కు 26 శాతం వాటా ఉంది. -
రుణగ్రస్త కంపెనీల్లో వాటా కొంటే..
ఓపెన్ ఆఫర్ అక్కర్లేదు నిబంధనలు సడలించిన సెబీ ముంబై: భారీ రుణాల్లో కూరుకుపోయిన లిస్టెడ్ కంపెనీల్లో వాటా కొనే రుణదాతలు (బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు)...మైనారిటీ షేర్హోల్డర్లకు ఓపెన్ ఆఫర్ ఇవ్వనక్కర్లేదు. ఈ మేరకు బ్యాంకులకు మినహాయింపునిస్తూ నిబంధనల్ని సడలిస్తున్నట్లు మార్కెట్ నియంత్రణా సంస్థ సెబి ప్రకటించింది. రూ. 6 లక్షల కోట్ల మొండి బకాయిల సమస్యని పరిష్కరించేందుకు రిజర్వుబ్యాంకు పలు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో సెబి తాజా ప్రకటన చేయడం గమనార్హం. బుధవారం సమావేశమైన సెబి బోర్డు సడలింపు ప్రతిపాదనల్ని ఆమోదించింది. ఇప్పటివరకూ ఎస్డీఆర్ స్కీము కింద రుణభారం కంపెనీల రుణాన్ని ఈక్విటీగా పునర్వ్యవస్థీకరించుకోవడంతో సమకూరే వాటాకు ఓపెన్ ఆఫర్ సడలింపు వుంది. ఇక ఆయా కంపెనీల వాటాను రుణదాతలు కొనుగోలు చేసే ఈక్విటీకి కూడా ఓపెన్ ఆఫర్ మినహాయింపు లభిస్తుంది. సాధారణంగా లిస్టెడ్ కంపెనీ నుంచి ఎవరైనా 15 శాతం మించి వాటాను కొంటే మైనారిటీ షేర్‌హోల్డర్ల నుంచి వాటాలు కొనుగోలు చేసేందుకు ఒక నిర్ణీత ధరపై ఓపెన్ ఆఫర్ జారీచేయాల్సివుంటుంది. రుణదాతల నుంచి సడలింపు కోరుతూ విజ్ఞాపనలు రావడంతో సెబి తాజా నిర్ణయం తీసుకుంది. ఓపెన్ ఆఫర్ సడలింపుతో రుణగ్రస్త కంపెనీలో వాటాను రుణదాతలు కొనుగోలు చేసి, కొత్త యాజమాన్యానికి విక్రయించడం వల్ల యాజమాన్య మార్పిడి వ్యయం తగ్గుతుంది. ఓపెన్ ఆఫర్ ద్వారా అదనపు వ్యయం సెబి తాజా నిర్ణయంతో రుణగ్రస్త కంపెనీల యాజమాన్య మార్పు సులభమవుతుందని, ఇది ఇన్వెస్టర్లకు ఊరట కల్పించే అంశమని కార్పొరేట్ అడ్వయిజరీ సంస్థ కార్పొరేట్ ప్రొఫెషనల్స్ పార్టనర్ మనోజ్ కుమార్ చెప్పారు. స్పెక్యులేషన్ కోసం పీ–నోట్స్ జారీపై నిషేధం.. స్పెక్యులేషన్ కోసం పార్టిసిపేటరీ నోట్స్ (పీ–నోట్స్) ద్వారా స్టాక్ మార్కెట్లో సెక్యూరిటీలను కొనుగోలు చేయడాన్ని నిషేధిస్తూ సెబి బోర్డు మరో నిర్ణయం తీసుకుంది. ఈ పీ–నోట్స్‌ను భారత్ మార్కెట్లను పరీక్షించడానికి కొంతమంది ఇన్వెస్టర్లు ఉపయోగిస్తున్నందున, వీటిని పూర్తిగా నిషేధించడం లేదని సెబి ఛైర్మన్ అజయ్ త్యాగి చెప్పారు. బోర్డు సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ స్పెక్యులేషన్ కోసం వీటిని వినియోగించడమే నిషిద్దమన్నారు. సెబి వద్ద రిజిష్టర్ అయిన విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల ఖాతాల ద్వారా విదేశీ ఇన్వెస్టర్లు పీ–నోట్స్‌ను ఉపయోగించి ఇక్కడ షేర్లను కొనడం, అమ్మడం చేస్తుంటారు. సాక్షి బిజినెస్ వెబ్సైట్లో... ⇔ చైనా రాక.. వర్థమాన దేశాలకు కాక ⇔ జీఎస్టీతో ఆటో డౌన్ ⇔ ఫండ్స్‌లో పెట్టుబడులకు మంచి తరుణమేనా? ⇔ ఆయిల్ కంపెనీ షేర్లకు క్రూడ్ సెగ ⇔ ఎల్ అండ్ టీకి బ్లాక్ డీల్స్ కిక్ ⇔ ఈ కంపెనీ ఫలితాల్లో నీరసం ⇔ ఆల్‌టైమ్ హైకి వందకు పైగా షేర్లు ⇔ మరిన్ని ఆసక్తికరమైన కథనాలు, స్టాక్ అప్డేట్స్.. WWW.SAKSHIBUSINESS.COM -
ఎల్ అండ్ టీలో వాటా విక్రయం
ప్రభుత్వానికి 4,000 కోట్లు న్యూఢిల్లీ: ఇంజనీరింగ్ దిగ్గజం లార్సన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టీ)లో ప్రభుత్వానికి ఉన్న వాటాలో 2.5 శాతం షేర్లను విక్రయించడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ. 4,000 కోట్లు సమకూరింది. బుధవారం ఎల్ అండ్ టీ షేరు ధర స్వల్ప పెరుగుదలతో రూ. 1,754 వద్ద ముగిసింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్పెషల్ అండర్‌టేకింగ్ ఆఫ్ యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (ఎస్‌యూయూటీఐ)లో 6.53 శాతం ఎల్ అండ్ టీ వాటాలు ఉన్నాయి. తాజా విక్రయంతో ఎస్‌యూయూటీఐలో ప్రభుత్వం కలిగిన ఎల్ అండ్ టీ 4 శాతానికి తగ్గుతుంది. ఈ వాటా విక్రయంతో ప్రభుత్వానికి డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ రూ. 6,400 కోట్లు సమకూరినట్లవుతుంది. వివిధ కంపెనీల్లో వున్న మైనారిటీ వాటాలు, ప్రభుత్వ రంగ సంస్థల వ్యూహాత్మక విక్రయం వంటి వాటి ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ. 72,500 కోట్లు సమీకరించాలని కేంద్రం బడ్జెట్లో ప్రతిపాదించింది. ఎస్‌యూయూటీఐ వద్ద దాదాపు 50 కంపెనీల వాటాలు ఉన్నాయి. వీటిలో ప్రధానమైనవి ఐటీసీ (9.17 శాతం), యాక్సిస్ బ్యాంక్ (11.53 శాతం). ఈ ఏడాది ఫిబ్రవరిలో 2 శాతం ఐటీసీ వాటాను విక్రయించడం ద్వారా ప్రభుత్వం రూ. 6,700 కోట్లు సమీకరించింది. -
టీసీఎస్ బై బ్యాక్ ఆఫర్ మే18-31వరకు
ముంబై: దేశీయ అతిపెద్ద టెక్ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇటీవల ప్రకటించిన బై బ్యాక్‌ను ప్రారంభించనుంది. గత నెల వాటాదారుల ఆమోదం పొందిన వాటా పునర్ కొనుగోలు కార్యక్రమం మే 18 న మొదలుపెట్టనుంది. ఈ ఆఫర్ మే 31ముగియనుందని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. పరిశ్రమలో అతి పెద్ద బైబ్యాక్‌గా చెబుతున్న టీసీఎస్ రూ. 16 వేల కోట్ల ఆఫర్ ను వాటా దారులకు అందించనుంది. . 2012లో రూ. 10,400 కోట్ల విలువైన షేర్లను రిలయన్స్ ఇండస్ట్రీస్ బైబ్యాక్ చేసింది. ఇప్పటివరకూ ఇదే అత్యధికం కాగా, ఇప్పుడీ మొత్తాన్ని టీసీఎస్ అధిగమిస్తుండడం విశేషం. మరోవైపు మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తప కాపిటల్ అలొకేషన్ లో భాగంగా ఈ ఆర్థిక సంవ్సతరంలో రూ.13వేల కోట్ల రూపాయల బై బ్యాక్‌ను ప్రకటించింది.ఈ ఏడాది ప్రారంభంలో, కాగ్నిజాంట్ 3.4 బిలియన్ల డాలర్ల వాటాల పునర్ కొనుగోలును ప్రకటించింది, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ రూ .3,500 కోట్ల విలువైన 3.50 కోట్ల షేర్లను తిరిగి కొనుగోలు చేసింది. ఏప్రిల్‌లో షేర్‌హోల్డర్ల నుంచి బైబ్యాక్‌కు అనుమతులు పొందగా మే 18 నుంచి ప్రారంభించి, మే 31వరకు కొనసాగించనున్నట్లు టీసీఎస్ సమాచారం ఇచ్చింది. అర్హత గలిగిన షేర్ హోల్డర్లకు లెటర్ ఆఫ్ ఆఫర్‌ను మే 16 నుంచి లేఖల ద్వారా పంపనున్నట్లు టీసీఎస్ తెలిపింది. అలాగే బోర్డ్ డైరెక్టర్ విజయ కేల్కర్ పదవీ కాలం మే 14న ముగిసిందని మరో ప్రకటనలో తెలిపింది. టిసిఎస్ సంస్థ పదవీ విరమణ వయస్సు విధానానికి అనుగుణంగా ఈ పరిణామామని ప్రత్యేక ఫైలింగ్‌లో తెలిపింది. ఫిబ్రవరిలో టిసిఎస్ బోర్డు రూ .16,000 కోట్ల మినహాయింపు కోసం 5.61 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనను ఆమోదించింది. కాగా ఫిబ్రవరిలో టిసిఎస్ బోర్డు రూ .16,000 కోట్ల మేర 5.61 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనను ఆమోదించింది. ప్రస్తుతం ముంబై ఆధారిత కంపెనీ టీసీఎస్ వద్ద రూ. 43,619 కోట్ల నగదు నిల్వలుండగా.. మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్లో ఇది 10 శాతంగా ఉంది. -
హెచ్‌సీఎల్ టెక్ లాభం జూమ్
-
హెచ్‌సీఎల్ టెక్ లాభం జూమ్
క్యూ4లో 27 శాతం వృద్ధి; రూ.2,475 కోట్లు ► ఒక్కో షేర్ కు రూ.6 డివిడెండ్ ► ఆశావహంగా రెవెన్యూ గైడెన్స్ న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (2016–17, క్యూ4)లో 27 శాతం పెరిగింది. 2015–16 క్యూ4లో రూ.1,939 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి రూ.2,475 కోట్లకు పెరిగినట్లు కంపెనీ తెలిపింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ పరంగా చూస్తే నికర లాభం 12 శాతం పెరిగిందని కంపెనీ ప్రెసిడెంట్, సీఈఓ సి. విజయ్‌కుమార్ చెప్పారు. మొత్తం ఆదాయం రూ.10,925 కోట్ల నుంచి 20 శాతం వృద్ధితో రూ.13,183 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఆదాయం–రూపాయల్లో 13 శాతం, డాలర్లలో 15 శాతం చొప్పున వృద్ధి చెందిందని వివరించారు. రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.6 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని పేర్కొన్నారు. ఈ డివిడెండ్‌కు ఈ నెల 25 రికార్డ్ డేట్అని, వచ్చే నెల 2న చెల్లింపులు జరుపుతామని తెలిపారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17 ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 53 శాతం వృద్ధితో రూ.8,606 కోట్లకు, మొత్తం ఆదాయం 52 శాతం వృద్ధితో రూ.48,641 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఆశావహ అంచనాలు మంచి ఆర్థిక ఫలితాలు సాధించామని విజయ్‌కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు. అధిక వృద్ధి అవకాశాలున్న విభాగాలపై పెట్టుబడుల జోరు పెంచుతామని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 10.5–12.5 శాతం వృద్ధి చెందగలదని అంచనా వేస్తున్నామన్నారు. నిర్వహణ లాభం 19.5–20.5 శాతం రేంజ్లో ఉండగలదని పేర్కొన్నారు. అంచనాలను మించి... కంపెనీ ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయని నిపుణులంటున్నారు. టీసీఎస్, ఇన్ఫోసిస్‌లతో పోల్చితే హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ మంచి వృద్ధి సాధించిందని తెలిపారు. నికర లాభంలో టీసీఎస్ 4.2 శాతం, ఇన్ఫోసిస్ 3.4 శాతం చొప్పున వృద్ధి సాధించగా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 27 శాతం వృద్ధి సాధించడం విశేషం. పన్ను రివర్సల్ కారణంగా నికర లాభం పెరిగిందని. ప్రముఖంగా ప్రస్తావించదగ్గ విషయం కంపెనీ రెవెన్యూ గైడెన్స్ అని షేర్‌ఖాన్ బ్రోకరేజ్ సంస్థ వ్యాఖ్యానించింది. ఐటీ రంగంలో కొనుగోలు రేటింగ్‌ను ఇచ్చింది. ఐటీ కంపెనీలకు ఆటోమేషన్, డిజిటలైజేషన్ వంటి కొత్త అవకాశాలు లభిస్తుండగా, వీసా నిబంధనలు కఠినతరం కావడం వంటి సమస్యలు తప్పట్లేదు. కాగా ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్ 0.4 శాతం నష్టపోయి రూ.839 వద్ద ముగిసింది. వీసా సమస్యల్లేవ్ వీసా నిబంధనలను అమెరికా కఠినతరం చేయడం తమపై పెద్దగా ప్రభావం చూపబోదని విజయకుమార్ వివరించారు. తమ ఉద్యోగుల్లో 55 శాతం మంది స్థానికులే ఉంటారని పేర్కొన్నారు. అమెరికాలో తమకు 12 సెంటర్లున్నాయని, వీటిల్లో 12,000కు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారని చెప్పారు. వీరిలో సగానికి పైగా అమెరికన్లేనని తెలిపారు. తమ కంపెనీ మొత్తం ఆదాయంలో 63 శాతం వరకూ అమెరికా మార్కెట్ నుంచే వస్తోందని విజయ్‌కుమార్ వివరించారు. ఈ ఏడాది మార్చినాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,15,973గా ఉందని, సమీక్షా క్వార్టర్లో కొత్తగా 10,605 మందికి ఉద్యోగాలిచ్చామని వివరించారు. కాగా రూ.3,500 కోట్ల షేర్ల బైబ్యాక్ మరో రెండు నెలల్లో ముగియగలదని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సీఎఫ్ఓ అనిల్ చనానా పేర్కొన్నారు. ఈ ఏడాది రిటర్న్స్ ఆన్ ఈక్విటీ (ఆర్ఓఈ) 27 శాతంగా ఉండగలదని తెలిపారు. -
సాహొరే ‘బాహుబలి’ షేర్
ముంబై:బుల్ రన్లో మార్కెట్ లీడర్ ఎంఆర్‌ఆఫ్ మరోసారి బాహుబలిగా నిలిచింది. ముఖ్యంగా రికార్డ్ స్థాయి లాభాలతో దూసుకుపోతున్న మార్కెట్లలో మరోసారి టైర్ స్టాక్స్‌కు డిమాండ్ కనిపిస్తోంది. మదుపర్ల కొనుగోళ్లతో టైర్ సెక్టార్ ఆకర్షణీయంగా ఉంది. దీంతో ఇటీవల భారీ లాభాలతో రికార్డ్ ధరను నమోదు చేసిన బాహుబలి షేర్ ఎంఆర్ఎఫ్ 5 శాతం జంప్‌చేసి ఒక దశలో రూ. 69,848 వద్ద ఇంట్రా డే గరిష్టాన్ని తాకింది. అంతేకాదు ఎంఆర్‌ఆఫ్ రూ.70వేల మార్క్‌ను అధిగమించే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు. అంతర్జాతీయ రబ్బరు ధరలు క్షీణత, డిమాండ్ పెరిగిన నేపథ్యంలో రబ్బర్ షేర్లపై బుల్లిష్ ట్రెండ్‌ను అంచనా వేస్తున్నారు. టీవీఎస్ శ్రీచక్ర 7 శాతం ఎగసి రూ. 4169కు, బాలకృష్ణ ఇండస్ట్రీస్ 6 శాతం దూసుకెళ్లి రూ. 1554కు చేరగా.. సియట్ దాదాపు 4 శాతం ఎగసి రూ. 1519ను తాకింది. ఇక జేకే టైర్స్ 2.4 శాతం పెరిగి రూ. 163కు చేరగా, అపోలో టైర్స్ 2.2 శాతం బలపడి రూ. 248 వద్ద ట్రేడవుతోంది. -
టైర్ల షేర్ల పరుగులు!
⇒ భారత్‌ను వదిలి అమెరికావైపు చూస్తున్న చైనా కంపెనీలు... ⇒ దిగుమతులు తగ్గటంతో దేశీ కంపెనీల హవా ⇒ 25 శాతం పడిపోయిన రబ్బరు ధరలు ⇒ లాభాలు పెరుగుతాయన్న అంచనాలతో షేర్ల జోరు.. సాక్షి, బిజినెస్ విభాగం టైర్ల షేర్లకు... రోడ్డు మునుపెన్నడూ లేనంత క్లియర్‌గా ఉన్నట్లుంది. మార్కెట్లో రయ్యిమని దూసుకుపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలానే మన మార్కెట్లు కూడా మంచి జోరుమీదుండటంతో... ఇతర రంగాల షేర్ల మాదిరిగా టైర్ల షేర్లు కూడా లాభపడుతున్నాయి. టైర్ల తయారీలో ఉపయోగించే రబ్బరు ధరలు బాగా తగ్గడం, చైనా నుంచి పోటీ తగ్గుతుండటం, డిమాండ్ పుంజుకుంటుండటం వంటివి టైర్ల షేర్లను మరింత ముందుకు తీసుకెళుతున్నాయి. పలితం... భవిష్యత్తులో కూడా వీటి లాభాలకు ఢోకా లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనా నుంచి పోటీ తగ్గింది... చైనా నుంచి టైర్ల దిగుమతులు ఈ మధ్య బాగా తగ్గాయి. దీనికితోడు రబ్బరు ధరలు పడిపోవడంతో టైర్ల కంపెనీల పంట పండుతోంది. చైనా టీబీఆర్ (ట్రక్, బస్, రేడియల్) టైర్లపై యాంటీ డంపింగ్ సుంకం విధించకూడదని అమెరికా నిర్ణయించింది. దీంతో చైనా కంపెనీలు ఇప్పుడు అమెరికా వైపు తమ టైర్ల ఎగుమతులను మళ్లిస్తున్నాయి. భారత్‌కు దిగుమతి అవుతున్న మొత్తం టీబీఆర్ టైర్లలో చైనా వాటా 90 శాతంగా ఉండేది. గత ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ కాలానికి చైనా నెలకు సగటున 1,20,000 టైర్లను భారత్‌కు ఎగుమతి చేసిందని అంచనా. అక్టోబర్‌లో 455 కంటైనర్ల టైర్లు చైనా నుంచి దిగుమతి కాగా, ఈ ఫిబ్రవరిలో ఈ కంటైనర్ల సంఖ్య 155కు తగ్గింది. భారత్ కంటే అమెరికాకు ఎగుమతి చేస్తే అధిక లాభాలొస్తాయి కనక చైనా కంపెనీలకు ఇప్పుడు భారత్ కంటే అమెరికా మార్కెట్టే అకర్షణీయంగా కనిపిస్తోంది. అందుకే భారత్‌లో టైర్ల దిగుమతిదారులను నిరుత్సాహపరిచేందుకు భారత మార్కెట్‌కు ఎగుమతి చేసే టైర్ల ధరలను చైనా కంపెనీలు 10–15 శాతం వరకూ పెంచాయి. దీంతో చైనా టైర్ల దిగుమతులు మరింతగా తగ్గుతున్నాయి. ఫలితంగా చైనా టైర్ల నుంచి దేశీయ టైర్ల కంపెనీలకు పోటీ బాగా తగ్గుతోంది. ఇటీవలే కొన్ని భారత టైర్ల కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను 5 శాతం వరకూ పెంచాయి కూడా. ఈ నెలాఖరు కల్లా ధరలను 15 శాతం వరకూ పెంచుకోవాలని టైర్ల కంపెనీలు యోచిస్తున్నాయి. రబ్బరు ధరలు 25 శాతం పతనం! ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి చూస్తే రబ్బరు ధరలు 25 శాతం వరకూ తగ్గాయి. రబ్బర్ ఎగుమతి చేసే దేశాల్లో రబ్బరు నిల్వలు అపారంగా ఉన్నందున ఇప్పట్లో రబ్బరు ధరలు పెరిగే అవకాశాలు కూడా కనిపించటం లేదు. ఇది టైర్ల కంపెనీలకు సానుకూలమైన అంశం. మరోవైపు కొన్ని రేడియల్ టైర్లపై యాంటీ డంపింగ్ సుంకాన్ని విధించాలని ప్రభుత్వం యోచిస్తుండటం కూడా టైర్ల కంపెనీలకు కలసివస్తోంది. లాభాలు కొనసాగుతాయ్... ఇటీవల కాలంలో ఎంఆర్ఎఫ్, బాలకృష్ణ టైర్స్ కంపెనీల షేర్లు జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. ఎంఆర్ఎఫ్ షేర్ ఈ నెల 3న రూ.61,000కు చేరింది. భారత స్టాక్ మార్కెట్లో అత్యంత ఖరీదైన షేర్ ఇదే. ఇక సియట్, అపోలో టైర్స్, జేకే టైర్ అండ్ ఇండస్ట్రీస్ కంపెనీలు తమ జీవిత కాల గరిష్ట స్థాయిలకు 10–22% రేంజ్ దూరంలోనే ఉన్నాయి. చాలా టైర్ల కంపెనీల ఆదాయాలు రీప్లేస్మెంట్ మార్కెట్ నుంచే వస్తాయి. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు, ఆర్థిక వ్యవస్థ చక్రీయ ప్రభావం ఈ రీప్లేస్మెంట్ మార్కెట్‌పై ఉండదు కాబట్టి, చైనా నుంచి పోటీ తగ్గడం, రబ్బరు ధరలు కూడా తగ్గడంతో టైర్ల షేర్ల లాభా లు కొనసాగుతాయని నిపుణులు అంచనావేస్తున్నారు. సియట్ షేర్‌ను రూ.1,550, అపోలో టైర్స్ షేర్ రూ.239 టార్గెట్ధరలుగా ప్రస్తుత ధరల్లో కొనుగోలు చేయవచ్చని ఫిలిప్ క్యాపిటల్ చెబుతోంది. -
కాక్స్ అండ్ కింగ్స్‌తో ఎస్బీఐ భాగస్వామ్యం
ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తాజాగా ట్రావెల్ ప్రిపెయిడ్ కార్డుల విక్రయానికి సంబంధించి ప్రముఖ ట్రావెల్ గ్రూప్ కంపెనీ కాక్స్ అండ్ కింగ్స్‌తో పంపిణీ భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఎస్బీఐ ట్రావెల్ ప్రిపెయిడ్ కార్డులు డాలర్, పౌండ్, యూరో, యెన్ వంటి ఎనిమిది కరెన్సీలలో లభ్యంకానున్నవి. ట్రావెల్ ప్రిపెయిడ్ కార్డుల మార్కెటింగ్‌కు కాక్స్ అండ్ కింగ్స్‌తో భాగస్వామ్యం దోహదపడగలదని ఎస్బీఐ ధీమా వ్యక్తం చేసింది. వీటి ద్వారా కార్పొరేట్ కస్టమర్లపై ప్రధానంగా దృష్టికేంద్రీకరించామని తెలిపింది. -
వి–గార్డ్ చేతికి హైదరాబాద్ కంపెనీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సంస్థ వి–గార్డ్ ఇండస్ట్రీస్ హైదరాబాద్‌కు చెందిన గట్స్ ఎలెక్ట్రోమెక్లో మెజారిటీ వాటా తీసుకుంటోంది. బోర్డు సభ్యుల నుంచి ఈ మేరకు సూత్రప్రాయంగా అనుమతి పొందింది. ఎంత పెట్టుబడి పెట్టేదీ కంపెనీ వెల్లడించలేదు. 1983లో ఏర్పాటైన గట్స్ ఎలెక్ట్రోమెక్ స్విచ్ గేర్లు, పవర్ ట్రాన్స్ఫార్మర్లను తయారు చేస్తోంది. ఈ విభాగంలో కంపెనీకి మంచి పేరుంది. 2015–16లో గట్స్ రూ.30 కోట్ల టర్నోవర్ సాధించింది. 2016–17లో రూ.35 కోట్లకుపైగా టర్నోవర్‌ను లక్ష్యంగా చేసుకుంది. కంపెనీకి హైదరాబాద్‌తోపాటు హరిద్వార్‌లో ప్లాంటు ఉంది. కాగా, 2015–16లో వి–గార్డ్ రూ.1,862 కోట్ల టర్నోవరు నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,000 కోట్లు ఆశిస్తోంది. -
భారతి ఇన్ ఫ్రా వాటా విక్రయించిన ఎయిర్టెల్
ముంబై: టెలికాం దిగ్గజం భారతి ఎయిర్టెల్ తన మొబైల్ టవర్‌సంస్థ భారతి ఇన్ ఫ్రాటెల్ లో వాటాలను విక్రయించింది. ఇన్వెస్ట్మెంట్ సంస్థలు కేకేఆర్, కెనడా పెన్షన్ ఫండ్ ల కన్సార్టియంకు భారతీ ఇన్ఫ్రాటెల్లో 10.3 శాతం వాటా విక్రయించింది. షేరుకి రూ. 325 ధరలో ఈ వాటాను విక్రయించినట్లు భారతీ ఎయిర్టెల్ ఒక ప్రకటనలో తెలిపింది. తద్వారా సమకూరే రూ. 6194 కోట్లతో రుణభారాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తామని ఎయిర్టెల్ పేర్కొంది. దీంతో భారతీ ఇన్ఫ్రాటెల్ కౌంటర్ 2శాతానికిపై లాభాలతో మార్కెట్ లో దూసుకుపోయింది. అటు ఇన్ఫ్రాటెల్ మాతృ సంస్థ భారతీ ఎయిర్టెల్ కూడా 0.7 శాతం లాభపడి రూ. 341 వద్ద ట్రేడవుతోంది. ఇది టెలికాం మౌలిక సౌకర్యాల రంగానికి అనుకూలమైన దృక్పధాన్ని పటిష్టం చేస్తుందని చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ చెప్పారు , కాగా ఈ లావాదేవీ తరువాత భారతి ఇన్ ఫ్రాటెల్ లో కేకేఆర్ రెండవసారి పెట్టుబడి పెట్టినట్టయింది. 2008-15 మధ్య కేకేఆర్ పెట్టుబడులు పెట్టింది. ఈ డీల్ తరువాత ప్రస్తుతం ఇన్ఫ్రాటెల్లో ఎయిర్టెల్ వాటా 61.7 శాతానికి తగ్గింది. అలాగే కేకేఆర్ ఏకైక పెద్ద పబ్లిక్ షేర్ హోల్డర్‌గా ఉండనుంది. -
సెబీ షాక్‌తో ఆర్ఐఎల్ డీలా
ముంబై: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ కు సెబీ షాక్ భారీగానే తాకింది. ఈక్విటీ డెరివేటివ్ మార్కెట్ కార్యకలాపాల్లో సంవత్సరంపాటు సెబీ నిషేధంతో సోమవారం ఈ కౌంటర్లో మదుపర్ల అమ్మకాలు భారీగాకొనసాగుతున్నాయి. ఒక దశలో దాదాపు 2 శాతానికి పైగా పతనమైంది. గతం ముగింపుతో పోలిస్తే ఆర్ఐఎల్ షేరు ధర 1.57 శాతం నష్టపోయి 1,266.50 వద్ద బలహీనంగా ట్రేడ్ అవుతోంది. అటు ఆరంభంలోనే బలహీనంగా ఉన్న మార్కెట్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో బలహీనంగా మొదలైన మార్కెట్లలో ఆర్ఐఎల్ అమ్మకాల ప్రభావం బాగా కనిపిస్తోంది. దీంతో సెన్సెక్స్ 155 పాయింట్లు క్షీణించి 29,266వద్ద, నిఫ్టీ 53 పాయింట్లు కోల్పోయి 9,055 దిగువకు చేరింది. పదేండ్ల క్రితం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్‌లో(ఎఫ్ అండ్ వో) మోసపూరిత ట్రేడింగ్‌కు పాల్పడి మూటగట్టుకున్న రూ.447 కోట్ల సొమ్మును 12 శాతం వార్షిక వడ్డీతో సహా కలిపి వెనక్కు ఇవ్వాల్సిందిగా ఆ సంస్థకు ఇటీవల సెబీ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు నవంబర్ 29, 2007 నుంచి 12 శాతం చొప్పున లెక్కగట్టి సుమారు రూ.500 కోట్లు చెల్లించాలని తెలిపంది. అంటే, ఈ ఆదేశాలతో సంస్థపై దాదాపు రూ.1,000 కోట్లు భారం పడనుంది. ఈ సొమ్మును 45 రోజుల్లో చెల్లించాలని సెబీ హోల్ టైం మెంబర్ మహాలింగం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. స్టాక్ ఎక్సేంజ్‌లలో ఈక్విటీ డెరివేటివ్‌ల ఎఫ్ అండ్ వో సెగ్మెంట్ ట్రేడింగ్‌లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొనకుండా రిలయన్స్, మరో 12 కంపెనీలపై ఏడాది కాలం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. రిలయన్స్ పెట్రోలియమ్(ఆర్పీఎల్)విలీనమైన సందర్భంలో ఆర్పీఎల్ షేర్లలో ఫ్యూచర్స్ అండ్ డెరివేటివ్స్ (ఎఫ్ అండ్ ఓ) సెగ్మెంట్లో అక్రమంగా ట్రేడింగ్ జరిగిందన్న 2007 నాటి కేసుకు సంబంధించి సెబీ ఈ ఆదేశాలు జారీ చేసింది. రిలయన్స్ పెట్రోలియంను ఇప్పటికే మాతృ సంస్థలో విలీనం చేశారు. ఈ కేసును సెటిల్ చేసుకుందామని గతంలో రిలయన్స్ కోరినప్పటికీ సెబీ నిరాకరించింది. కాగా ఈ ఆదేశాలను సెక్యూరిటీస్ అప్పిల్లేట్ ట్రిబ్యూనల్(శాట్)లో రిలయన్స్ ఇండస్ట్రీస్ సవాల్ చేయనుంది. -
కెన్ ఫిన్ హోమ్స్‌లో 13.5% వాటా విక్రయించిన కెనరా బ్యాంక్
డీల్ విలువ రూ.759 కోట్లు ముంబై: ప్రభుత్వ రంగ కంపెనీ కెనరా బ్యాంక్, తన అనుబంద సంస్థ, కెన్ ఫిన్ హోమ్స్‌లో 13.45 శాతం వాటాను విక్రయించింది. సింగపూర్ జీఐసీకి ఈ వాటాను రూ.758.8 కోట్లకు విక్రయించామని కెనరా బ్యాంక్ స్టాక్ ఎక్సే్చంజ్‌లకు నివేదించింది. ఒక్కో షేర్‌ను రూ.2,105 చొప్పున మొత్తం 35,80,849 షేర్లను జిఐసీ సింగపూర్ అనుబంధ సంస్థ కలాడియమ్ ఇన్వెస్ట్మెంట్(సింగపూర్ సావరిన్ హెల్త్ఫం డ్)కు అమ్మేశామని పేర్కొంది. ఈ ధర గురువారం కెన్ ఫిన్ హోమ్స్ ముగింపు ధరకు 9 శాతం అధికమని జేఎమ్ ఫైనాన్షియల్ తెలిపింది. ఈ వాటా విక్రయంలో కెనరా బ్యాంక్‌కు సలహాదారుగా ఈ సంస్థే వ్యవహరించింది. ఈ వాటా విక్రయ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో కెన్‌ఫిన్ హోమ్స్ షేర్ 2.1%లాభపడి రూ.1,978 వద్ద ముగిసింది. గతేడాది డిసెంబర్ నాటికి కెన్ ఫిన్ హోమ్స్‌లో కెనరా బ్యాంక్‌కు 44.1% వాటా ఉంది. కాగా స్టాక్ మార్కెట్లో లిస్ట్‌కాని అనుబంధ కంపెనీ కెనరా ఫ్యాక్టర్స్‌లో వాటా విక్రయం నిమిత్తం మర్చంట్ బ్యాంకర్లను నియమించామని గత నెలలోనే కెనరా బ్యాంక్ వెల్లడించిది. -
జియో గురి.. 50% మార్కెట్ వాటా
⇒ 2021కి డేటా మార్కెట్ ఆదాయంలో సగభాగంపై కన్ను ⇒ ప్రైమ్ యూజర్లకు అదనపు డేటా ప్రకటన న్యూఢిల్లీ: కేవలం ఆరు నెలల్లో యూజర్ల సంఖ్యను పది కోట్లకు పెంచుకున్న రిలయన్స్ జియో తాజాగా ఇప్పుడు టెలికం పరిశ్రమ ఆదాయంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. మొబైల్ డేటా వినియోగం వల్ల ఏర్పడే అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. దీని ద్వారా వచ్చే ఐదేళ్లలో కంపెనీ ఆదాయాన్ని బాగా పెంచుకోవాలని ప్రణాళికలు రూపొందించుకుంటోంది. సగం వాటాపై ధీమాగా.. 2021 నాటికి డేటా మార్కెట్ ఆదాయంలో 50% వాటాను దక్కించుకుంటామని జియో ధీమా వ్యక్తం చేసింది. ‘వాయిస్ విభాగపు ఆదాయం క్రమంగా డేటాకు మారుతోంది. దేశంలోని డేటా మార్కెట్ 2020–21 నాటికి రూ.3 లక్షల కోట్లకు చేరుతుంది’ అని రిలయన్స్ జియో తాజాగా పేర్కొంది. ప్రస్తుతం దేశంలోని మొబైల్ డేటా వినియోగంలో 85% వాటా ను కలిగి ఉన్నామని తెలిపింది. నెట్వర్క్ పూర్తిస్థాయిలో సిద్ధమయ్యిందని, 2020–21 నాటికి డేటా డిమాండ్‌లో 60%కి పైగా వాటాను హస్తగతం చేసుకుంటామని పేర్కొంది. డిజిటల్ సర్వీసులపై కనీసం రూ.500 వెచ్చించే సబ్స్క్రైబర్ల సంఖ్య 40 కోట్లుగా ఉందని తెలిపింది. భారత్‌లో 5జీ సపోర్ట్ నెట్వర్క్ కేవలం తమకు మాత్రమే సొంతమని పేర్కొంది. వాయిస్ నుంచి డేటాకు.. భారత్‌లో రానున్న కాలంలో డేటాకు బలమైన డిమాండ్ ఉంటుందని జియో అభిప్రాయపడింది. ‘వచ్చే రెండేళ్లలో వాయిస్ నుంచి డేటా విభాగానికి ఆదాయపు బదిలీ జరుగుతుంది. వాయిస్ విభాగపు ఆదాయం రూ.1.5 లక్షల కోట్ల నుంచి రూ.0.5 లక్షల కోట్లకు తగ్గుతుంది. డేటా ఆదాయం రూ.1.3 లక్షల కోట్లకు చేరుతుంది’ అని వివరించింది. పరిశ్రమలో గత ఐదేళ్లలో స్వల్ప వృద్ధి నమోదయ్యిందని, కానీ డేటా వినియోగం వల్ల వచ్చే ఐదేళ్లలో పరిశ్రమలో బలమైన వృద్ధి నమోదవుతుందని పేర్కొంది. ‘మొత్తంగా పరిశ్రమ ఆదాయం 2020–21 నాటికి రూ.3 లక్షల కోట్లకు చేరుతుంది. నెలకు 500–600 కోట్ల జీబీ డేటా డిమాండ్ ఉంటుందనే అంచనాలున్నాయి. ఇక్కడ ఒక జీబీకి రూ.50లు వేసుకున్నా సంవత్సరానికి రూ.3 నుంచి రూ.3.6 లక్షల కోట్ల ఆదాయం వస్తుంది. ఇది అంచనా జీడీపీలో 1.35–1.6 శాతానికి సమానం’ అని వివరించింది. ప్రైమ్ యూజర్లకు అదనంగా మరో 5 జీబీ డేటా జియో మరో శుభవార్త ప్రకటించింది. రూ.303లతో రీచార్జ్ చేసుకునే ప్రైమ్ యూజర్లకు ఇదివరకు ప్రకటించిన విధంగా 28 జీబీ డేటాను కాకుండా అదనంగా మరో 5 జీబీ డేటాను అందిస్తున్నట్లు పేర్కొంది. అదే రూ.499తో రీచార్జ్ చేసుకుంటే 56 జీబీ డేటాతోపాటు 10 జీబీ డేటాను అదనంగా పొందొచ్చని తెలిపింది. ఈ అదనపు డేటా ప్రయోజనాలు కేవలం ఒక నెలకే వర్తిస్తాయని పేర్కొంది. అంటే ఏప్రిల్‌లో మాత్రమే అదనపు డేటా వస్తుంది. కాగా కస్టమర్లు రూ.99ల వన్‌టైమ్ వార్షిక ఫీజుతో జియో ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌లో సభ్యులుగా చేరి తర్వాత అందుబాటులో ఉన్న ప్లాన్స్‌లో అనువైన దాన్ని ఎంపిక చేసుకుని కంపెనీ అపరిమిత సేవలను ఏడాదిపాటు నిరంతరాయంగా పొందొచ్చు. అయితే జియో ప్రైమ్ సబ్స్క్రిప్షన్ కేవలం వచ్చే ఏడాది మార్చి 31 వరకు మాత్రమే ఉంటుంది. కాగా జియో ప్రైమ్ ఆఫర్ మాత్రం ఈ నెల 31 వరకు మాత్రమే యూజర్లకు అందుబాటులో ఉంటుంది. -
టీవీఎస్ లాజిస్టిక్స్ చేతికి యూకే కంపెనీ
డీల్ విలువ రూ.165 కోట్లు చెన్నై: టీవీఎస్ గ్రూప్‌కు చెందిన టీవీఎస్ లాజిస్టిక్స్ ఇంగ్లండ్‌కు చెందిన ఒక కంపెనీలో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. ఇంగ్లండ్‌కు చెందిన ఎస్పీసీ ఇంటర్నేషనల్‌లో మెజారిటీ వాటాను టీవీఎస్ లాజిస్టిక్స్‌కు చెందిన ఇంగ్లండ్ అనుబంధ కంపెనీ టీవీఎస్ రికో సప్లై చెయిన్ సర్వీసెస్ చేజిక్కించుకుంది. దీని కోసం రూ.165 కోట్లు వెచ్చించామని టీవీఎస్ లాజిస్టిక్స్ సర్వీసెస్ ఎండీ, ఆర్. దినేశ్ చెప్పారు. ఎస్పీసీ ఇంటర్నేషనల్ కంపెనీ ఇంగ్లండ్, ఫ్రాన్స్, స్లోవేకియా, అమెరికా, భారత్‌ల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మొత్తం 350 మంది ఉద్యోగులున్నారు. సాంకేతికంగా, అంతర్జాతీయంగా మంచి సేవలందిస్తున్న కంపెనీలను కొనుగోలు చేయడంలో భాగంగా ఎప్పీసీలో మెజారిటీ వాటాను చేజిక్కించుకున్నామని వివరించారు. -
వాటా విక్రయించనున్న డీఎల్ఎఫ్ ప్రమోటర్లు
న్యూఢిల్లీ: డీఎల్ఎఫ్ కంపెనీ ప్రమోటర్లు, తమ రెంటల్ విభాగంలో 40 శాతం వాటాను విక్రయించనున్నారు. తమ రెంటల్ విభాగం, డీసీసీడీఎల్(డీఎల్ఎఫ్ సైబర్ సిటీ డెవలపర్స్ లిమిటెడ్)లో 40 శాతం వాటాను సింగపూర్‌కు చెందిన జీఐసీకు ప్రమోటర్లు విక్రయించనున్నట్లు డీఎల్ఎఫ్ తెలిపింది. డీల్ విలువ రూ.12,000–13,000 కోట్ల రేంజ్లో ఉండొచ్చని అంచనా. జీఐసీతో ఒప్పందం మరో రెండు, మూడు నెలల్లో కుదరగలదని డీఎల్ఎఫ్ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్ఓ) అశోక్ త్యాగి చెప్పారు. వాటా విక్రయ ప్రక్రియ ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా పూర్తవగలదని అంచనాలున్నాయని వివరించారు. డీఎల్ఎఫ్కు నికర రుణ భారం రూ.24,000 కోట్లుగా ఉంది. ఈ రుణభారం తగ్గించుకోవడానికి డీఎల్ఎఫ్ ప్రమోటర్లు ప్రయత్నిస్తున్నారు. -
‘సెన్సీ’లో ఎయిర్‌టెల్‌కు వాటా
న్యూఢిల్లీ: టెలికం కంపెనీ, భారతీ ఎయిర్టెల్, ఫైనాన్షియల్ టెక్నాలజీ స్టార్టప్ సెన్సీలో వ్యూహాత్మక ఈక్విటీ వాటాను కొనుగోలు చేసింది. తమ అనుబంధ కంపెనీ భారతీ ఎయిర్టెల్ సర్వీసెస్ ద్వారా ఈ డీల్ జరిగిందని భారతీ ఎయిర్టెల్ తెలిపింది. డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలు వెల్లడికాలేదు. సెన్సీ సంస్థ, లోన్ సింగ్ పేరుతో డిజిటల్ లెండింగ్ ప్లాట్ఫార్మ్ను ఏర్పాటు చేసింది. రుణం పొందగల వ్యక్తులకు సులభంగా రుణాలందేలా ఈ ప్లాట్ఫార్మ్ చూస్తుంది. వినియోగదారులకు ఉత్తమమైన సేవలందించేందుకు గత కొన్నేళ్లుగా డేటా సైన్స్ సొల్యూషన్లను సొంతంగానే డెవలప్ చేశామని భారతీ ఎయిర్టెల్ గ్లోబల్ సీఐఓ, డైరెక్టర్ (ఇంజినీరింగ్) హర్మీన్ మెహత చెప్పారు. తమ వినియోగదారులు 27 కోట్లకు పైగా ఉన్నారని, సెన్సీతో కలసి వారికి అవసరమైన ఉత్పత్తులను, సేవలను అందిస్తామని వివరించారు. కాగా ఎయిర్‌టెల్‌తో భాగస్వామ్యం తమకు మంచి అవకాశమని సెన్సీ డైరెక్టర్ గౌరవ్ జస్వాల్ చెప్పారు. ఎక్కువ మందికి వినూత్నమైన ఉత్పత్తులు, సేవలందించే అవకాశం లభించిందని పేర్కొన్నారు. -
బై బ్యాక్ కు టీసీఎస్ బోర్డు ఓకే
ముంబై: ప్రముఖ దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్)వాటాదారులకు ఉత్సాహకరమైన వార్త అందించింది. అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న షేర్ల బై బ్యాక్ పై టీసీఎస్ బోర్డు నిర్ణయం తీసుకుంది. 5.6 కోట్ల ఈక్విటీ షేర్లను రూ.16 వేల కోట్ల విలువకు మించకుండా తిరిగి కొనుగోలు చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. సోమవారం జరిగిన టీసీఎస్ బోర్డ్ సమావేశంలో బై బ్యాక్ ప్రతిపాదనను పరిశీలించింది. 14.6 శాతం ప్రీమియంతో తన సొంత షేర్ల కొనుగోలుకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత మార్కెట్ రేటు పై ఈ ప్రీమియాన్ని అందించనుంది. రూ.2,850 ధర వద్ద షేరును కొనుగోలు చేయనున్నట్టు స్టాక్ ఎక్సేంజ్ ఫైలింగ్ లో టీసీఎస్ తెలిపింది. టెండర్ ఆఫర్ ద్వారా బైబ్యాక్‌ను చేపట్టనున్నట్లు వెల్లడించింది. కంపెనీలో ప్రమోటర్ల వాటా 73.33 శాతంగా ఉంది. ఈ వార్తలతో మార్కెట్ ముగింపులో టీసీఎస్ కౌంటర్‌కు డిమాండ్ పుట్టింది. అటు టీసీఎస్ నిర్ణయంపై మార్కెట్ వర్గాలు హర్షం ప్రకటించాయి. -
‘కృష్ణా’లో పూర్తి వాటా రాబట్టండి
• పోలవరం, పట్టిసీమలో మన వాటా అడగండి • సాగునీటి అధికారులకు మంత్రి హరీశ్ దిశానిర్దేశం • కర్ణాటక ప్రాజెక్టులపై నివేదిక ఇవ్వాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్లో లభ్యతగా ఉన్న నీటిని పూర్తిగా రాబట్టేలా బోర్డు ముందు వాదనలు వినిపించాలని నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులకు సూచించా రు. బుధవారం బోర్డు సమావేశం నేపథ్యంలో మంగళవారం ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. సాగర్ కింద తాగు, సాగునీటి అవసరాలు, ఇప్పటివరకు బేసిన్లో ఇరు రాష్ట్రాల నీటి వినియోగంపై ఇందులో చర్చించారు. లభ్యతగా ఉన్న నీటిని సాధించేలా కొట్లాడాలని, కృష్ణా డెల్టా సిస్టమ్ కింద, పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ చేసిన అధిక వినియోగాన్ని బోర్డు దృష్టికి తేవాలని సూచించారు. మైనర్ ఇరిగేషన్ కింద నీటి వినియోగంపై గట్టిగా చెప్పాలని, మరింత వాటా కోసం పట్టుబట్టాలని ఆదేశించారు. వాటి కోసం కొట్లాడండి... ఈ నెల 12 నుంచి రాష్ట్ర పర్యటనకు రానున్న ఏకే బజాజ్ కమిటీ ముందుంచాల్సిన అంశాలపైనా సమావేశంలో చర్చించారు. 1978 గోదావరి అవార్డు ప్రకారం.. పోలవరం ప్రాజెక్టుకు అధికారిక అనుమతులు వచ్చిన వెంటనే నాగార్జునసాగర్ ఎగువన ఉన్న పైరాష్ట్రాలకు నీటి హక్కులు సంక్రమిస్తాయని స్పష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో 80 టీఎంసీల కేటాయింపుల్లో 21 టీఎంసీలు కర్ణాటక, 13 టీఎంసీలు మహారాష్ట్ర వినియోగించుకునేందుకు ఎత్తిపోతల పథకాలు చేపట్టిన అంశంపై సమావేశంలో చర్చ జరిగింది. మిగతా 45 టీఎంసీలు ఉమ్మడి ఏపీకి వస్తాయని ఒప్పందంలో ఉంది. ప్రస్తుతం ఎగువ రాష్ట్రంగా ఈ నీటి వాటా హక్కు తెలంగాణదేనని కమిటీ దృష్టికి తీసుకెళ్లాలని మంత్రి సూచించారు. పట్టిసీమ ద్వారా తరలిస్తున్న 80 టీఎంసీల్లో తెలంగాణకు 45 టీఎంసీల వాటా అడగాలని ఆదేశించారు. ఈ లెక్కన మొత్తంగా తెలంగాణ నీటి వాటాను 299 టీఎంసీల నుంచి 389 టీఎంసీలకు పెంచాలని సూచించినట్లు తెలిసింది. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల వాటాకు సంబంధించిన ప్రాజెక్టుల ’ఆపరేషన్ ప్రోటోకాల్’ ను అధ్యయనం చేసే కమిటీ ముందు సమర్థంగా వాదనలు విన్పించాలన్నారు. ఈ మేరకు తగిన హోంవర్క్ చేసి ప్రజెంటేషన్ రూపొందించాలని ఆదేశించారు. రెండ్రోజుల్లో ఈ ప్రజెంటేషన్‌ను తనకు చూపాలని కోరారు. ఆల్మట్టి–నారాయణపూర్ ప్రాజెక్టుల మధ్య కృష్ణాపై కర్ణాటక తలపెట్టిన ఎత్తిపోతల పథకాలు, లిఫ్టులపై సంక్షిప్త నివేదిక ఇవ్వాలని సూచించారు. ఆ నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. ఈ భేటీలో ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి, ఈఎన్సీలు మురళీధర్, విజయ్‌ప్రకాశ్, అంతర్రాష్ట్ర విభాగపు అధికారులు పాల్గొన్నారు. కృష్ణాపై నేడే బోర్డు భేటీ కృష్ణా జలాల వినియోగంపై బోర్డు బుధవారం పూర్తిస్థాయి సమావేశం నిర్వహించనుంది. కృష్ణా బోర్డు చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత హెచ్‌కే హల్దార్ నేతృత్వంలో జరిగే తొలి భేటీ ఇదే. ఈ సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నీటి పారుదల శాఖల ముఖ్య కార్యదర్శులు, ఈఎన్సీలు, బోర్డు సభ్యులు హాజరుకానున్నారు. నాగార్జునసాగర్, శ్రీశైలంలో లభ్యతగా ఉన్న జలాలన్నీ మాకంటే మాకేనని ఇరు రాష్ట్రాలు పట్టుబడుతున్న నేపథ్యంలో బోర్డు ఎలా స్పందిస్తున్నది ఆసక్తికరంగా మారింది. టెలీమెట్రీతోపాటు మైనర్ ఇరిగేషన్ కింద ఇరు రాష్ట్రాల నీటి వినియోగం తదితర అంశాలపై బోర్డు సమావేశంలో చర్చించనున్నారు. -
ఫ్లిప్‌కార్ట్ పెట్టుబడుల విలువను సగానికి తగ్గించిన ఫిడెలిటీ
న్యూఢిల్లీ: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ, ఫ్లిప్‌కార్ట్‌లో తన పెట్టుబడుల విలువను అమెరికాకు చెందిన మ్యూచువల్ ఫండ్ ఫిడెలిటీ రట్లాండ్ స్క్వేర్ ట్రస్ట్ టూ సగానికి పైగా తగ్గించింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఒక శాతం కంటే తక్కువగా(52,096 షేర్లు) ఫెడిలిటీకి వాటా ఉంది. ఈ షేర్ల విలువ గత ఏడాది నవంబర్ 30న 54 లక్షల డాలర్లుగా(ఒక్కో షేర్ విలువ 104 డాలర్లుగా) ఫిడెలిటీ అమెరికా నియంత్రణ సంస్థలకు నివేదించింది. ఇక ఈ నెల 24న నియంత్రణ సంస్థలకు వెల్లడించిన సమాచారంలో ఈ విలువను 27 లక్షల డాలర్లుగా(ఒక్కో షేర్ విలువ 52 డాలర్లని) ఫిడెలిటీ పేర్కొంది. కాగా ఈ విషయమై ఫ్లిప్‌కార్ట్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.మరోవైపు ఆన్లైన్ దిగ్గజం అమెజాన్‌లో పెట్టుబడులను 13% పెంచుకున్నట్లు ఫిడెలిటీ పేర్కొంది. ఇప్పుడు తమకు అమెజాన్‌లో 2,81,493 షేర్లు ఉన్నాయని, వీటి విలువ 21.12 కోట్ల డాలర్లని (ఒక్కో షేర్ విలువ 750 డాలర్లు) వివరించింది. -
టాటా కమ్యూనికేషన్స్‌తో బీఎస్ఎన్ఎల్ జట్టు
• అందుబాటులోకి రానున్న 4.4 కోట్ల వై–ఫై హాట్స్పాట్లు • ప్లాన్ ధర రూ.999 నుంచి ప్రారంభం న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్ రోమింగ్ మార్కెట్‌పై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించిన ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ ‘బీఎస్ఎన్ఎల్’ తాజాగా టాటా కమ్యూనికేషన్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో బీఎస్ఎన్ఎల్ యూజర్లకు అంతర్జాతీయంగా 4.4 కోట్ల వై–ఫై హాట్‌స్పాట్స్‌ను ఉపయోగించుకునే అవకాశం లభించింది. ‘దేశీ మొబైల్ ఆపరేటర్లలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న తొలి సంస్థ బీఎస్ఎన్ఎల్. దీంతో మా మొబైల్ సబ్స్క్రైబర్లు అంతర్జాతీయంగా వై–ఫైను ఉపయోగించుకోవచ్చు. హైస్పీడ్ డేటా సర్వీసుల కోసం టాటా కమ్యూనికేషన్స్‌తో జతకట్టాం. విదేశీ పర్యటనలోని మా కస్టమర్లు ఈ వై–ఫై హాట్‌స్పాట్స్‌లో నిర్ణీత మొత్తానికి అపరిమిత డేటాను వినియోగించుకోవచ్చు’ అని బీఎస్ఎన్ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ శ్రీవాత్సవ తెలిపారు. బీఎస్ఎన్ఎల్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వై–ఫై ప్లాన్లను యాక్టివేట్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ ప్లాన్ల ధర మూడు రోజులకు రూ.999గా, 15 రోజులకు రూ.1,599గా, 30 రోజులకు రూ.1,999గా ఉందని వివరించారు. ఈ మొబైల్ అప్లికేషన్ ఎక్కడెక్కడ హాట్‌స్పాట్స్ ఉన్నాయో చూపిస్తుందన్నారు. -
టాటా మోటార్స్, కేస్ట్రాల్ వ్యూహాత్మక భాగస్వామ్యం
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ వాహన కంపెనీ ‘టాటా మోటార్స్’, ప్రముఖ గ్లోబల్ లూబ్రికెంట్ బ్రాండ్ ‘కేస్ట్రాల్’ మధ్య ఒక అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం కుదిరింది. దీని ప్రకారం కేస్ట్రాల్ సంస్థ దాదాపు 50కిపైగా ప్రపంచ మార్కెట్లలో టాటా మోటార్స్ వాణిజ్య వాహనాలకు (కమర్షియల్ వెహికల్స్‌కి)కు మూడేళ్లపాటు ఆయిల్స్‌ను సరఫరా చేయనుంది. ‘కేస్ట్రాల్తో మాకు స్వదేశంలో సుదీర్ఘమైన అనుబంధం ఉంది. ఈ సంస్థ మా కస్టమర్లకు మంచి ప్రొడక్ట్‌లను, అత్యున్నతమైన సేవలను అందిస్తోంది. మా భాగస్వామ్యాన్ని ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి విస్తరించడం ఆనందంగా ఉంది’ అని టాటా మోటార్స్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ గ్యున్టర్ బషెక్ తెలిపారు. టాటా మోటార్స్‌కి ఎల్లప్పుడూ ఉత్తమమైన సేవలందిస్తామని, కొత్త మార్కెట్లలో మద్దతునిస్తామని బీపీ లూబ్రికెంట్స్ సీఈవో మంధీర్ సింగ్ పేర్కొన్నారు. -
వెస్ట్‌ల్యాండ్ మాల్లో 50% వాటా
బ్లాక్‌స్టోన్ చేతికి ముంబై: ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్‌స్టోన్... పుణేలోని వెస్ట్‌ల్యాండ్ మాల్లో 50 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈ వాటాను ఎంతకు కొనుగోలు చేసిందీ మాత్రం వెల్లడించలేదు. ఇది బ్లాక్‌స్టోన్ సంస్థ వాటాకొనుగోలు చేసిన నాలుగో మాల్ అని ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ జోన్స్ లాంగ్ లాసల్లె తెలియజేసింది. డీల్ సాకారం కావడానికి ఈ సంస్థే సహకరించింది. పశ్చిమ పుణేలో ఇదే అతిపెద్ద రిటైల్మాల్ అని జేఎల్ఎల్ ఇండియా ఎండీ (పుణే) సంజయ్ బజాజ్ చెప్పారు. ఇప్పటికే బ్లాక్‌స్టోన్ సంస్థ అహ్మదాబాద్, అమృత్సర్, నవీ ముంబైల్లోని రిటైల్ మాల్స్ల్లో వాటాలను కొనుగోలు చేసింది. బ్లాక్‌స్టోన్‌ను ప్రపంచంలోనే అతి పెద్ద రియల్ఎస్టేట్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థగా పేర్కొన్నారాయన. రియల్టీ రంగంలో వివిధ సమస్యలున్నప్పటికీ, సంస్థాగత రియల్టీ ఇన్వెస్టర్లు భారీ స్థాయి అవకాశాలను వదులుకోరనే విషయాన్ని ఈ డీల్ నిరూపిస్తోందని బజాజ్తెలియజేశారు. -
టాటా మోటార్స్‌లో పెరిగిన టాటా సన్స్ వాటా
న్యూఢిల్లీ: టాటా సన్స్ సంస్థ, టాటా మోటార్స్‌లో తన వాటాను పెంచుకుంది. టాటా మోటార్స్‌కు చెందిన 5 కోట్ల షేర్లు(1.73% వాటాను) టాటా సన్స్కొనుగోలు చేసిందని ఎన్ఎస్ఈ బల్క్‌డీల్ గణాంకాలు వెల్లడించాయి. ఈ షేర్లను ఒక్కోటి రూ.486.13 సగటు ధరకు కొనుగోలు చేశారు. దీంతో ఈ డీల్విలువ రూ.2,431 కోట్లుగా ఉంది. టాటా మోటార్స్ నుంచి సైరస్ మిస్త్రీని డైరెక్టర్‌గా తొలగించేందుకు ఈ నెల 22న టాటా మోటార్స్ ఈజీఎమ్(అసాధారణ సర్వ సభ్య సమావేశం) నేపథ్యంలో ఈ డీల్ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ డీల్ నేపథ్యంలో టాటా మోటార్స్ షేర్ బీఎస్ఈలో 3.4 శాతం లాభంతో రూ.470 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈలో ఇంట్రాడేలో 7 శాతం లాభపడి రూ.486ను తాకింది. ప్రస్తుతం టాటా మోటార్స్‌లో టాటా సన్స్‌కు 26.98 శాతం వాటా ఉంది. గత నెలలో నాటకీయంగా జరిగిన పరిణామాల కారణంగా టాటా సన్స్ చైర్మన్ గిరీ నుంచి సైరస్ మిస్త్రీ ఉద్వాసనకు గురయ్యారు. ఆయన స్థానంలోకి వచ్చిన రతన్ టాటా గ్రూప్ కంపెనీలపై తన పట్టు బిగించారు. ఇప్పటికే టాటా ఇండస్ట్రీస్, టీసీఎస్‌ల నుంచి మిస్త్రీ తొలగింపునకు వాటాదారులు ఓకే చెప్పారు. -
జీడీపీలో మొబైల్ రంగం వాటా 8.2 శాతం
2020 నాటికి సాధ్యమన్న ప్రభుత్వ నివేదిక న్యూఢిల్లీ: దేశ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో మొబైల్ రంగం వాటా 2020 నాటికి 8.2 శాతానికి చేరుకుంటుందని కేంద్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు, ప్రోత్సాహక విభాగం, టెలికం శాఖలు సంయుక్తంగా ఓ నివేదికలో తెలిపారుు. ప్రస్తుతం జీడీపీలో ఈ రంగం తోడ్పాటు 6.5 శాతం (140 బిలియన్ డాలర్లు/రూ.9.38 లక్షల కోట్లు)గా ఉందని... 40 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తోందని పేర్కొన్నారుు. ‘‘2020 నాటికి మొబైల్ ఫోన్ చందాదారుల సంఖ్య 100 కోట్లను దాటుతుందని ఈ నివేదిక అంచనా వేసింది. 2014 ఏప్రిల్-2016 మార్చి కాలానికి టెలికం రంగంలోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 4.19 బిలియన్ డాలర్లు (రూ.28,000 కోట్లు)గా ఉన్నట్టు తెలిపింది. -
కేజీ డీ6లో ‘నికో’ వాటా అమ్మకానికి..
ఆర్ఐఎల్ డీ6 బ్లాక్‌లో 10% వాటా రెండోసారి విక్రయ ప్రయత్నం న్యూఢిల్లీ: కృష్ణా, గోదావరి బేసిన్‌లోని డీ6 బ్లాక్‌లో ఆర్ఐఎల్ భాగస్వామ్య కంపెనీ, కెనడాకు చెందిన నికో రీసోర్సెస్ తన వాటాను తాజాగా మరోసారి విక్రయానికి పెట్టింది. కేజీ డీ6లో ఆర్ఐఎల్ 60 శాతం వాటాతో నిర్వహణ కంపెనీగా ఉండగా... బ్రిటన్‌కు చెందిన బీపీ పీఎల్‌సీకి 30%, నికోకు 10% చొప్పున వాటాలు ఉన్నారుు. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న నికో రీసోర్సెస్ కేజీ డీ6 (కేజీ-డీడబ్ల్యూఎన్-98/3) బ్లాక్‌లో 10% వాటాలను విక్రరుుంచి, దాని ద్వారా వచ్చే నిధులతో 340 మిలియన్ అమెరికన్ డాలర్ల (రూ.2,278 కోట్లు) రుణాలను తీర్చివేయాలని అనుకుంటున్నట్టు గతేడాది ఫ్రిబవరిలోనే తెలిపింది. వాటా విక్రయానికి 2015 ఏప్రిల్ 30వ తేదీని గడువుగా నిర్ణరుుంచగా, తర్వాత దాన్ని మే 31కి, సెప్టెంబర్ 15 వరకు పొడిగించినా కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దాంతో వాటాల విక్రయ ప్రతిపాదనను వారుుదా వేసింది. ప్రభుత్వ జరిమానాతో సంక్లిష్టం.. కేజీ డీ6లో అభివృద్ధి చేయని క్షేత్రాల్లోని సహజ వాయువు నిల్వలకు ధర విషయంలో ఉన్న సానుకూల పరిణామాల నేపథ్యంలో తమ వాటాల విక్రయ ప్రక్రియను తిరిగి చేపట్టామని నికో రీసోర్సెస్ తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాబర్ట్ ఎల్స్‌వర్త్ తెలి పారు. కానీ పక్కనే ఉన్న ఓఎన్జీసీ బావుల నుంచి గ్యాస్ తోడివేసినందుకు 1.55 బిలియన్ డాలర్ల మేర జరిమానా చెల్లించాలన్న ప్రభుత్వ డిమాండ్‌తో వాటాల విక్రయం సంక్లిష్టంగా మారినట్టు ఎల్స్‌వర్త్ తెలిపారు. -
మారుతీతో హెచ్డీఎఫ్సీ ఎర్గో జట్టు
ముంబై: దేశీ ప్రముఖ ప్రైవేట్ రంగ నాన్-లైఫ్ బీమా సంస్థ ‘హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్’ కంపెనీ తాజాగా మారుతీ ఇన్సూరెన్స్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. మారుతీ ఇన్సూరెన్స... దేశంలో అతిపెద్ద వాహన బీమా బ్రోకరేజ్ సర్వీస్ సంస్థ. తాజా ఒప్పందంలో భాగంగా హెచ్డీఎఫ్సీ ఎర్గో ఇక నుంచి మారుతీ సుజుకీ వాహన కొనుగోలుదారులకు వాహన బీమాను ఆఫర్ చేస్తుంది. మారుతీ కస్టమర్లకు తక్షణ పాలసీ ఆమోదం సౌకర్యంతోపాటు సాధ్యమైనంత త్వరగా సులభతరంగా క్లెరుుమ్ సెటిల్మెంట్ చేస్తామని హెచ్డీఎఫ్సీ ఎర్గో ఒక ప్రకటనలో పేర్కొంది. ‘మారుతీ సుజుకీ వాహన కొనుగోలుదారులు మారుతీ ఇన్సూరెన్స ద్వారా హెచ్డీఎఫ్సీ ఎర్గో నుంచి సమగ్రమైన మోటార్ ఇన్సూరెన్స పాలసీ తీసుకోవచ్చు. అలాగే వీరు క్యాష్‌లెస్ క్లెరుుమ్ సర్వీసులు వంటి సౌలభ్యాలను కూడా పొందొచ్చు’ అని హెచ్డీఎఫ్సీ ఎర్గో ఎండీ, సీఈవో రితేశ్ కుమార్ తెలిపారు. -
ఎల్అండ్టీలో ప్రభుత్వం1.63 శాతం వాటా విక్రయం
సర్కారుకు రూ.2,100 కోట్లు న్యూఢిల్లీ: మౌలిక రంగ అగ్రగామి కంపెనీ ఎల్అండ్టీలో కేంద్ర ప్రభుత్వం తనకున్న వాటాలో 1.63 శాతాన్ని విక్రరుుంచింది. దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.2,100 కోట్ల ఆదాయం సమకూరింది. స్పెసిఫైడ్ అండర్ టేకింగ్ ఆఫ్ ద యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (ఎస్‌యూయూటీఐ) ద్వారా శుక్రవారం ఈ విక్రయం జరిగింది. బ్లాక్ డీల్స్ మార్గంలో ప్రైవేటు సంస్థాగత ఇన్వెస్టర్లు వాటాలను కొనుగోలు చేశారు. దీంతో ఎల్ఐసీ సాయం అవసరం లేకపోరుుంది. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయానికి మార్కెట్ నుంచి సరైన స్పందన రాని సమయాల్లో... ఎల్ఐసీ ముందుకు వచ్చి ఆ మేరకు వాటాలను కొనుగోలు చేస్తుండటం తెలిసిందే. ఎస్‌యూయూటీఐ ద్వారా ఎల్అండ్టీలో కేంద్ర సర్కారుకు మొత్తం 8.16 శాతం వాటా ఉంది. ఇందులో 1.63 శాతం మేర వాటాలను విక్రరుుంచింది. బీఎస్ఈలో ఎల్అండ్టీ షేరు గురువారం క్లోజింగ్ ధర రూ.1,444.55 కంటే 2 శాతానికి పైగా తక్కువకే రూ.1,415కే ఒక్కో షేరును ప్రభుత్వం ఆఫర్ చేసిం ది. కాగా, శుక్రవారం ఈ షేరు బీఎస్ఈలో 2 శాతం నష్టంతో 1418.90వద్ద ముగిసింది. ఎస్‌యూయూటీఐ ద్వారా మొత్తం 51 కంపెనీల్లో కేంద్రానికి వాటాలున్నారుు. అత్యధికంగా ఐటీసీలో 11.17 శాతం, యాక్సిక్ బ్యాంకులో 11.53 శాతం వాటాలున్నారుు. -
ఒక షేరుతో.. ఓ బైక్ కొనొచ్చు!!
• ఐదంకెల ధరలోనూ షేర్ల పరుగులు • రూ.50వేలు దాటేసిన ఎంఆర్ఎఫ్ • రాబడిలోనూ టాప్ ఈ ‘ఆరు’ గుర్రాలు • అయినా కొనొచ్చంటున్న మార్కెట్ నిపుణులు సాక్షి, బిజినెస్ విభాగం : ఎంఆర్ఎఫ్ షేర్ ధర ఇటీవలే రూ.50 వేలు దాటింది. అంటే ఒక్కొక్క షేర్ ధర అక్షరాలా అర లక్ష!!. ఈ ధరతో తులంన్నర బంగారమో, ఒక మంచి బైకో, స్కూటరో కొనుక్కోవచ్చు. ఇలా పదివేలకు మించిన ఐదంకెల షేర్లు మన స్టాక్ మార్కెట్లో అరడజను దాకా ఉన్నాయి. ఇంత ధరున్నా ఈ ఏడాది ఇవి మంచి రాబడులే ఇచ్చాయి. ధర ఎక్కువైతే డిమాండ్ తగ్గుతుందన్నది సాధారణ ఆర్థిక సూత్రం. ధర అధికంగా ఉంటే లిక్విడిటీ తగ్గి, వృద్ధి లేదా లాభాలు అంతంత మాత్రంగానే ఉండొచ్చని స్టాక్ మార్కెట్ వర్గాలు కూడా చెబుతుంటాయి. కానీ ఈ అరడజను షేర్లూ అసాధారణ వృద్ధిని సాధించాయి. ఏడాది కాలంలో స్టాక్ సూచీలు అంతంత మాత్రం వృద్ధినే సాధిస్తే, ఇవి మాత్రం 14-55 శాతం వరకూ పెరిగాయి. అసలీ షేర్లేంటి? వాటి రాబడులెంత? అధిక ధరకు కారణాలేంటి? ఇంకా కొనుగోలు చేయొచ్చా? ఈ వివరాలే ఈ కథనం... ఎందుకింత అధిక ధర ? దాదాపు ప్రమోటర్లంతా స్టాక్ మార్కెట్లో తమ కంపెనీ షేరు ఎక్కువ ధరకు ట్రేడ్ కావాలనుకుంటుంటారు. కాబట్టి వారంతా తమ కంపెనీ షేర్ ధర సామాన్య ఇన్వెస్టర్‌కూ అందుబాటులో ఉండాలనుకుంటారు. ఇందుకోసం రేటు అధికం అనిపించినప్పుడల్లా, బోనస్ షేర్లు ఇవ్వటమో, షేర్లను విభజించటమో చేసి ధరను అందుబాటులోకి తెస్తారు. ఉదాహరణకు ఇన్ఫోసిస్‌ను తీసుకుంటే, ఇప్పటివరకూ ఎన్నోసార్లు బోనస్ షేర్లనిచ్చింది. విభజించింది. అలా చేయడం వల్ల ఈ షేర్ ముఖ విలువ రూ.1 గానూ, షేర్ ధర రూ.1,038గానూ ఉంది. ఒక వేళ ఇవేమీ లేకుంటే ఈ షేర్ రూ.2 లక్షల రేంజ్లో ఉండేది. అంత ధర ఉంటే ఇన్వెస్టర్లు ఈ షేర్ జోలికి వచ్చే వాళ్లు కాదు కదా! కొందరు ప్రమోటర్లు మరో రకంగా ఆలోచిస్తారు. షేర్ ధర అందరికీ అందుబాటులో ఉంటే, లిక్విడిటీ పెరిగి హెచ్చుతగ్గులు తీవ్రంగా ఉంటాయని, చిన్న ఇన్వెస్టర్ల దగ్గర ఎక్కువ షేర్లుంటే, చీటికి, మాటికీ చిల్లర కారణాలకే వాటిని విక్రయిస్తారని, షేర్ ధర పడిపోతుందని వారి అభిప్రాయం. అందుకని తమ షేర్లకు బోనస్‌లు ఇవ్వరు. విభజన చేయరు. ఫలితంగా వారి షేర్ ధర అంతకంతకూ పెరిగిపోతుంటుంది. బోనస్ ఇవ్వకపోవడం, విభజించకపోవటం, తక్కువ ఈక్విటీ, తక్కువ ఫ్లోటింగ్ షేర్లు వంటి కారణాల వల్లే కొన్ని షేర్లు రూ.10వేలకు మించి ధర ఉన్నాయి. ఉదాహరణకు ఎంఆర్ఎఫ్కు మార్కెట్లో 42 లక్షల షేర్లు... రూ.4 కోట్ల ఈక్విటీ ఉండగా, ఇన్పోసిస్‌కు 228 కోట్ల షేర్లు, రూ.1,148 కోట్ల ఈక్విటీ ఉన్నాయి. మార్కెట్ క్యాపిటల్ పరంగా చూస్తే ఇన్ఫోసిస్‌ది రూ.2,38,469 కోట్లుగా ఉండగా, ఎంఆర్ఎఫ్ మార్కెట్ క్యాప్ రూ.21,892 కోట్లుగానే ఉంది. చిత్రమేంటంటే మన మార్కెట్లోని ఈ అరడజను షేర్లూ ఐదేళ్లలో అద్భుతమైన రాబడులనిచ్చాయి. ధర అధికమే... రిస్కూ అధికమే! ఇతర షేర్లతో పోల్చితే ఈక్విటీ తక్కువగా ఉన్న ఈ షేర్లలో ఒడిదుడుకులు తక్కువే ఉంటాయి. ఎందుకంటే షేర్ హోల్డింగ్ కొద్ది మందిచేతుల్లోనే ఉంటుంది. సాధారణంగా వీళ్లంతా దీర్ఘకాలిక ఇన్వెస్టర్లై ఉంటారు కనక ఆపరేటర్లు సులభంగా ఆపరేట్ చేయలేరు. లిక్విడిటీ లేకపోవటం వల్ల షేర్ల ధరల్లో స్వల్పకాలంలో తీవ్రమైన ఒడిదుడుకుల్లాంటివి ఉండవు. షేర్ల విభజన లేకపోవడం, బోనస్ షేర్లు ఇవ్వకపోవడం వల్ల ఈక్విటీపై పరిమితి ఉంటుంది. షేర్ల సరఫరా తక్కువగా ఉంటుంది. డిమాండ్ అధికంగా ఉంటుంది కనక షేర్ ధర పెరిగే అవకాశాలుంటాయి. ధర అధికంగా ఉందనే కారణంతో ఇలాంటి షేర్లకు దూరంగా ఉండడం సరికాదన్నది నిపుణుల మాట. ధర ఎక్కువైనప్పటికీ కంపెనీ వ్యాపారం బావున్నా, భవిష్యత్ వ్యాపార అంచనాలు ఆశావహంగా ఉన్నా ఈ షేర్లను నిరభ్యంతరంగా కొనొచ్చన్నది వారి సూచన. కంపెనీ నిర్వహణ, అమ్మకాలు, నికర లాభం తదితర ఫండమెంటల్స్ క్షుణ్నంగా పరిశీలించి అవన్నీ బాగుంటే ధర అధికంగా ఉన్నా కూడా ఈ షేర్లను కొనుగోలు చేయవచ్చన్నది వారి విశ్లేషణ. రిస్క్ అధికంగా ఉంటుంది కనక దాన్ని భరించగలిగితేనే ఈ షేర్లలో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమమనేది వారి మాట. -
ఎయిర్ కోస్టాలో వాటా విక్రయం!.
♦ విదేశీ ఎయిర్‌లైన్స్‌తో చర్చలు ♦ కొత్త విమానాలకై త్వరలో ఒప్పందం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన రంగంలో ఉన్న ఎయిర్ కోస్టా వాటా విక్రయానికి రెడీ అయింది. గల్ఫ్ ప్రాంతానికి చెందిన విమానయాన సంస్థలతో సహా పలు అంతర్జాతీయ కంపెనీలతో చర్చలు జరుపుతోంది. 26 శాతం వాటా విక్రయానికై ఖతర్ ఎయిర్వేస్, ఎయిర్ కోస్టా మధ్య ఇటీవల చర్చలు జరిగాయి. అయితే ఎటువంటి నిర్ణయానికి ఇరు సంస్థలు రానట్టు తెలుస్తోంది. ఎయిర్ కోస్టాలో ఎమిరేట్స్, ఎతిహాద్, గల్ఫ్ ఎయిర్‌లలో ఏదో ఒక కంపెనీ వాటా తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. దేశవ్యాప్తంగా విమానాలను నడిపేందుకు ఎయిర్ కోస్టాకు ఈ నెల 3న డీజీసీఏ లెసైన్సు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వాటా విక్రయానికి ఇదే సరైన సమయమని కంపెనీ భావిస్తోంది. దేశవ్యాప్త లెసైన్సుతో సంస్థ విలువ పెరగడం ఇందుకు కారణం. ఇప్పటి వరకు ప్రాంతీయ విమానయాన సంస్థగా ఉన్న ఎయిర్కోస్టా హైదరాబాద్‌సహా 8 నగరాలకు సర్వీసులను నడిపింది. మరిన్ని విమానాలకై.. ప్రస్తుతం ఎయిర్ కోస్టా వద్ద ఒక్కొక్కటి 110 సీట్ల సామర్థ్యం గల మూడు ఎంబ్రార్ ఇ-190 ఫ్లైట్స్ ఉన్నాయి. ప్రతి రోజు 24 సర్వీసులను నడిపిస్తోంది. ఈ నెలలోనే మరో విమానం తోడవుతోంది. కొత్తగా ఆరు ఎయిర్‌క్రాఫ్ట్స్ కోసం సింగపూర్‌కు చెందిన జీఈ క్యాపిటల్ ఏవియేషన్ సర్వీసెస్‌తో అక్టోబరులోనే ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు ఎయిర్ కోస్టా సీఈవో వివేక్ చౌదరి తెలిపారు. 2017 జనవరి నుంచి కంపెనీలోకి వీటి రాక ప్రారంభం అవుతుందన్నారు. వచ్చే ఏడాది డిసెంబరుకల్లా సంస్థ చేతిలో ఎంబ్రార్ ఇ-190 రకం 10 విమానాలు ఉండనున్నాయి. రెండేళ్లలో మొత్తం 18 నగరాల కు సర్వీసులను అందించాలన్నది సంస్థ ప్రణాళిక. ఈ ఏడాది డిసెంబరు నుంచి కొత్త నగరాలను జోడించనుంది. -
ఫ్లిప్‌కార్ట్‌తో వాల్‌మార్ట్ జట్టు !
న్యూఢిల్లీ: ప్రపంచ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్, దేశీయ ఈ కామర్స్ లీడర్ ఫ్లిప్‌కార్ట్ చేతులు కలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. భాగస్వామ్యంపై వీటి మధ్య చర్చలు నడుస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఫ్లిప్‌కార్ట్‌తో చేతులు కలపడం ద్వారా బూమ్ మీదున్న దేశీయ ఈ కామర్స్ రంగంలోకి ప్రవేశించడంతోపాటు, అమెరికాలో వలే ఇక్కడ కూడా అమెజాన్‌కు వాల్‌మార్ట్ గట్టిపోటీనివ్వవచ్చన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఫ్లిప్‌కార్ట్‌లో బిలియన్ డాలర్ల పెట్టుబడి ద్వారా స్వల్ప వాటా తీసుకునేందుకు వాల్‌మార్ట్ ఆసక్తిగా ఉందని, భాగస్వామ్యంపై ఇరు సంస్థల మధ్య చర్చలు కొనసాగుతున్నట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. దీనిపై పీటీఐ వార్తా సంస్థ వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్‌లను సంప్రదించగా... వదంతులు, ఊహాగానాలపై స్పందించడం తమ విధానం కాదని తిరస్కరించాయి. -
1.2 బిలియన్ డాలర్లకు దేశీ డిజిటల్ క్లాసిఫైడ్ పరిశ్రమ!
హైదరాబాద్: దేశీ డిజిటల్ క్లాసిఫైడ్ పరిశ్రమ 2020 నాటికి మూడు రెట్లు వృద్ధితో 1.2 బిలియన్ డాలర్లకి చేరుతుందని గూగుల్-కేపీఎంజీ సంయుక్త నివేదిక పేర్కొంటోంది. డిజిటల్ క్లాసిఫైడ్స్ వృద్ధిలో ఇ-సర్వీసెస్, రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్స్ వంటి వెర్టికల్ క్లాసిఫైడ్ విభాగాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపింది. ఇక ఇ-సర్వీసెస్, రియల్ ఎస్టేట్ క్లాసిఫైడ్స్‌లో 2020 నాటికి వరుసగా ఏడు రెట్లు, నాలుగు రెట్లు వృద్ధి నమోదవుతుందని అంచనా వేసింది. మొత్తం డిజిటల్ క్లాసిఫైడ్స్‌లో 30% వాటాతో హారిజాంటల్ క్లాసిఫైడ్స్ ఆధిపత్యాన్ని కొనసాగిస్తాయని పేర్కొంది. 63 శాతం మంది వినియోగదారులు ఇ-క్లాసిఫైడ్స్‌ను యాక్సెస్ చేయనుండటంతో 2020కి ఆన్లైన్ జాబ్ మార్కెట్ రెట్టింపు అవుతుందని తెలిపింది. ఆన్లైన్ జాబ్ సెర్చ్‌లో బెంగళూరు, ముంబై, ఎన్సీఆర్, హైదరాబాద్‌లు అగ్రస్థానాల్లో నిలిచాయని పేర్కొంది. -
ప్రత్యేక ప్యాకేజీలో మీ వాటా ఎంత
– డిప్యూటీ సీఎంకి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య ప్రశ్న కర్నూలు(టౌన్): ప్రత్యేక ప్యాకేజీని సమర్థించిన డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అందులో ఆయన వాటా ఎంతో ప్రజలకు చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య ప్రశ్నించారు. బుధవారం కర్నూలులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హోదా విషయంలో ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందన్నారు. అసెంబ్లీలో పది నిముషాలు మాట్లాడని వారు ప్రజల పక్షాన పోరాడుతున్న తమ నాయకుడు వైఎస్ జగన్‌ను విమర్శించడం సిగ్గుచేటన్నారు. అడ్డగోలుగా 20 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన టీడీపీ నాయకులు ప్రతిపక్ష నేతను అరాచక వాదిగా పేర్కొనడం విడ్డూరమన్నారు. జిల్లాలో పరిశ్రమలకు 30వేల ఎకరాలు కేటాయించామని చెబుతున్న టీడీపీ నేతలు ఎన్ని పరిశ్రమలు తెచ్చారో చూపాలన్నారు. మూడేళ్లు అవుతున్నా కనీసం పునాది రాళ్లకూ దిక్కులేదన్నారు. ప్రజల కనీస అవసరాలు తీర్చలేని ప్రభుత్వం విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని చెప్పడం ఎవరి ప్రయోజనాలకోసమని ప్రశ్నించారు. దేశంలో 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు.. ఆంధ్రప్రదేశ్ విషయంలో 14వ ఆర్థిక సంఘాన్ని సాకుగా చూపడం ఇక్కడి ప్రజలను మోసగించడమేనన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, రాష్ట్ర లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి కర్నాటి పుల్లారెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాజా విష్ణువర్థన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రఘు పాల్గొన్నారు. -
బెడ్ లినెన్ మార్కెట్లో 25% వాటా లక్ష్యం: ఐసీఆర్వీఎల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వచ్చే ఐదేళ్లలో దేశీ బెడ్ లినెన్ మార్కెట్లో 25 శాతం వాటా సాధించాలని ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ ఇండో కౌంట్ రిటైల్ వెంచర్స్ (ఐసీఆర్వీఎల్) లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రస్తుతం రూ. 13,000 కోట్లుగా ఈ మార్కెట్ 2021 నాటికి రూ. 19,000 కోట్ల స్థాయికి చేరగలదని అంచనాలున్నట్లు కంపెనీ ఎండీ అసీమ్ దలాల్ వివరించారు. బుధవారమిక్కడ ‘బొటిక్ లివింగ్’ శ్రేణి బెడ్ లినెన్ ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెట్టిన సందర్భంగా దలాల్ ఈ విషయాలు చెప్పారు. వీటి ధర రూ. 2,000-రూ. 8,000 మధ్య ఉంటుంది. దేశీయంగా మార్కెటింగ్ నెట్వర్క్ మొదలైనవి పటిష్టం చేసుకునేందుకు రూ. 25 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. మొదటి ఏడాది సుమారు 200 స్టోర్స్ ఏర్పాటు చేయనున్నామని, వీటిలో దాదాపు 40 స్టోర్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఉండగలవని చెప్పారు. ఇప్పటిదాకా ఎగుమతుల ప్రధానంగా ఉన్న తమ సంస్థ తొలిసారిగా దేశీ బెడ్ లినెన్ మార్కెట్లోకి అడుగుపెడుతోందని, త్వరలో రూ. 500 కోట్ల అమ్మకాలు లక్ష్యంగా పెట్టుకున్నామని దలాల్ వివరించారు. -
జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ఖాతాలో జేఎస్‌డబ్ల్యూ ప్రక్సైర్ ఆక్సిజన్
న్యూఢిల్లీ: సజ్జన్ జిందాల్ నేతృత్వంలోని జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీ తాజాగా జేఎస్‌డబ్ల్యూ ప్రక్సైర్లో అధిక వాటాను కైవసం చేసుకుంటున్నట్లు ప్రకటించింది. దాదాపు రూ.240 కోట్లతో జేఎస్‌డబ్ల్యూ ప్రక్సైర్ ఆక్సిజన్‌లో 74% వాటాను కొనుగోలు చేస్తున్నట్లు జేఎస్‌డబ్ల్యూ స్టీల్ బీఎస్ఈకి నివేదించింది. జేఎస్‌డబ్ల్యూ ప్రక్సైర్ ఆక్సిజన్ కంపెనీ ప్రధానంగా ఇండస్ట్రియల్ వాయువులైన ఆక్సిజన్, నైట్రోజన్, ఆర్గాన్ వంటి వాటిని ఉత్పత్తి చేస్తుంది. దీనికి కర్ణాటకలోని బళ్లారిలో రెండు ఎయిర్ సెపరేషన్ ప్లాంట్లు ఉన్నాయి. ప్రస్తుతం జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ ప్రక్సైర్ ఆక్సిజన్‌లో 26% ఈక్విటీ వాటా ఉంది. వాటాల కొనుగోలు తర్వాత జేఎస్‌డబ్ల్యూ ప్రక్సైర్ ఆక్సిజన్ కంపెనీ జేఎస్‌డ బ్ల్యూ స్టీల్‌కు పూర్తి అనుబంధ కంపెనీగా మారుతుంది. -
సానియా, హింగిస్ విడిపోయారు
భాగస్వాములను మార్చుకున్న టెన్నిస్ స్టార్స్ న్యూఢిల్లీ: గతేడాది ప్రపంచ మహిళల టెన్నిస్ డబుల్స్‌లో సానియా మీర్జా, మార్టినా హింగిస్ జోడి సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. వరుసగా 41 మ్యాచ్‌ల్లో ఓటమనేదే లేకుండా రెండు గ్రాండ్‌స్లామ్ సహా తొమ్మిది టైటిళ్లతో పాటు డబ్ల్యుటీఏ చాంపియన్‌షిప్‌ను సైతం దక్కించుకున్నారు. అయితే ఇటీవలి కాలంలో అనుకున్న ఫలితాలు కనిపించకపోవడంతో 16 నెలల తమ భాగస్వామ్యానికి వీరు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు. ఇక నుంచి సానియా చెక్ రిపబ్లిక్కు చెందిన ప్రపంచ 21వ ర్యాంకర్ బార్బోరా స్ట్రికోవాతో... హింగిస్ అమెరికాకు చెందిన కోకో వాండెవేగ్తో కలిసి బరిలోకి దిగనున్నారు. 2015 మార్చిలో సానియా, హింగిస్ జతకట్టారు. ‘హింగిస్‌తో సానియా భాగస్వామ్యం ముగిసింది. గత ఐదు నెలలుగా ఈ జోడి అనుకున్నంతగా రాణించలేకపోతోంది. టాప్-100కు పైగా ర్యాంకింగ్స్ కలిగిన ఆటగాళ్ల చేతిలోనూ ఓడిపోతున్నారు. అందుకే విజయాలు రానప్పుడు భాగస్వామిని మార్చుకోవడం అనివార్యం’ అని సానియా సన్నిహిత వర్గాలు తెలిపాయి. చివరిసారిగా ఈ జోడి గత నెలలో జరిగిన మాంట్రియల్ ఈవెంట్లో పాల్గొని క్వార్టర్స్‌లో ఓడిపోయింది. -
చోళ జనరల్ ఇన్సూరెన్స్‌తో బీఓబీ ఒప్పందం
హైదరాబాద్: బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) తాజాగా చోళమండలం ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ మేరకు చోళమండలం ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్ మేనేజింగ్ డెరైక్టర్ ఎస్.ఎస్.గోపాల్ రత్నం... బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజింగ్ డెరైక్టర్, సీఈవో పి.ఎస్.జయకుమార్‌లు కార్పొరేట్ ఏజెన్సీ అగ్రిమెంట్‌ను మార్చుకున్నారు. దీని వల్ల బ్యాంకు చోళమండలం ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్‌ను చెందిన పలు జనరల్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్‌ను తన కస్టమర్లకు అందించనున్నది. తాజా భాగస్వామ్యం వల్ల ఇరు సంస్థలు ప్రయోజనం పొందుతాయని, దీని వల్ల తమ కస్టమర్లకు పలు బీమా పథకాలను అందించడం వీలవుతుందని బీఓబీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ మాయంక్ కె మెహ్తా తెలిపారు. -
పోకెమాన్తో నింటెండో జాక్‌పాట్!
♦ 15 రోజుల్లో రెట్టింపైన షేరు ♦ 42 బిలియన్ డాలర్లకు మార్కెట్ విలువ టోక్యో: ప్రపంచానికి పిచ్చెక్కిస్తున్న పోకెమాన్ గో గేమ్... దాన్ని రూపొందించిన నింటెండోను ఎక్కడికో తీసుకెళుతోంది. జపాన్ గేమ్ మేకింగ్ కంపెనీ అయిన నింటెండో షేరు ధర గడచిన పక్షం రోజుల్లోనే ఏకంగా రెట్టింపైపోయింది. అలాగని ఇదేమీ చిన్నాచితకా షేరు కాదు. జూలై 6న నింటెండో గేమ్ విడుదలయ్యే నాటికి ఈ సంస్థ మార్కెట్ విలువ దాదాపు 20 బిలియన్ డాలర్లుగా ఉంది. "" మంగళవారం ఒక్కరోజే టోక్యో స్టాక్ ఎక్స్ఛేంజ్లో ఈ షేరు ధర 14 శాతం పెరగటంతో దీని మార్కెట్ విలువ ఏకంగా 42 బిలియన్ డాలర్లకు చేరింది. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.2.85 లక్షల కోట్లన్నమాట. మంగళవారం 14 శాతం పెరగటంతో షేరు ధర కూడా 31,700 యెన్లకు (300 డాలర్లకు) చేరింది. చిత్రమేం టంటే మంగళవారం టోక్యో స్టాక్ ఎక్స్ఛేంజ్లో ట్రేడైన మొత్తం షేర్లలో నాలుగోవంతు నింటెండో కంపెనీవే. అంటే చేతులు మారిన ప్రతి నాలుగు షేర్లలో ఒకటి నింటెండో షేర్ కావడం విశేషం. పోకెమాన్ గో అంటే!! నింటెండోతో కలసి గూగుల్ మ్యాప్స్‌ను వినియోగిస్తూ నియాంటిక్ సంస్థ రూపొందించిన పోకెమాన్ గో స్మార్ట్ ఫోన్ యాప్‌కు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన స్పందన లభిస్తోంది. గత కొన్నేళ్లుగా కష్టాల్లో ఉన్న నింటెండో కంపెనీకి ఈ పోకెమాన్ గేమ్ కారణంగా తాత్కాలికంగా ఊరట లభించిందని నిపుణులంటున్నారు. -
శాంసంగ్ ‘స్మార్ట్‌ఫోన్’ వాటా 50%
♦ దేశవ్యాప్తంగా 48.3 శాతం ♦ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ మను శర్మ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో శాంసంగ్ హవా నడుస్తోంది. 2016 మే నాటికి దేశవ్యాప్తంగా 48.3% వాటాతో కంపెనీ అగ్రస్థానంలో ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఏకంగా 50% వాటాను కైవసం చేసుకున్నట్టు శాంసంగ్ ఇండియా మొబైల్ విభాగం వైస్ ప్రెసిడెంట్ మను శర్మ తెలిపారు. గెలాక్సీ జే2 (2016), జే మ్యాక్స్‌ను గురువారమిక్కడ విడుదల చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. అర్థవంతమైన ఆవిష్కరణలతో కస్టమర్లకు చేరువ అవుతున్నట్టు చెప్పారు. ఒక్కో ఉత్పాదనను 6-8 నెలల పరిశోధన అనంతరం మార్కెట్లోకి తీసుకొస్తున్నట్టు పేర్కొన్నారు. కొరియా వెలుపల సంస్థకు అతిపెద్ద పరిశోధన, అభివృద్ధి కేంద్రం భారత్‌లో ఉందన్నారు. భారత్‌తోపాటు ప్రపంచ విపణి కోసం వివిధ మోడళ్లను ఈ కేంద్రంలోనే అభివృద్ధి చేశామన్నారు. తగ్గుతున్న ధరలు.. మార్కెట్ తీరుకు అనుగుణంగా వివిధ ధరల్లో స్మార్ట్ఫోన్లను కంపెనీ ప్రవేశపెడుతోంది. విపణిలో రూ.10 వేలలోపు మోడళ్ల వాటాయే సింహ భాగం ఉంది. అందుకే కస్టమర్లను ఆకట్టుకోవడానికి తక్కువ ధరలోనూ 4జీ మోడళ్లను శాంసంగ్ తీసుకొస్తోంది. లో ఎండ్ స్మార్ట్‌ఫోన్స్ విభాగంలో ఉన్న జే2 మోడల్ ధర ప్రస్తుతం రూ.7,590 ఉంది. గతేడాదితో పోలిస్తే ఇది రూ.900 తక్కువ. ఇక కంపెనీ విక్రయిస్తున్న స్మార్ట్ఫోన్లలో ఒకటి మినహా అన్నీ 4జీ మోడళ్లే. గరిష్ట ధర రూ.56,900 ఉంది. టాప్‌లో ‘జే’ సిరీస్.. 2జీతో పోలిస్తే 4జీ డేటా వినియోగం 5.3 రెట్లు అధికంగా ఉందని మను శర్మ అన్నారు. ‘యూట్యూబ్‌ను అధికంగా చూస్తున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. రోజుకు సగటున 40 నిమిషాలు వీక్షిస్తున్నారు. 50% మంది మొబైల్లో యూట్యూబ్‌ను చూస్తున్నారు. 2014తో పోలిస్తే 2015లో యాప్స్ డౌన్లోడ్స్ 129% పెరిగింది. డౌన్లోడ్స్ పరంగా భారత్ నాల్గవ స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో డేటాను తక్కువగా వినియోగించేలా అల్ట్రా డేటా సేవింగ్ ఫీచర్‌తో ‘జే’ సిరీస్ ఫోన్లకు రూపకల్పన చేశాం. దేశంలో అధికంగా అమ్ముడవుతున్న సిరీస్‌లో జే తొలి స్థానంలో ఉంది’ అని వివరించారు. -
వాటాల కోసం వార్
అధికారపార్టీలోని రేషన్ ‘మాఫియా’ల మధ్య చిచ్చు రేగుతోంది.. వాటాల్లో తేడాలు.. హద్దుల వివాదాలతో తెలుగు తమ్ముళ్లు గ్రూపులుగా మారి దాడులు చేసుకుంటున్నారు. అధికార పార్టీ ముఖ్యనేతల భార్యలు, తనయులకు నెలవారీ మామూళ్లు కడుతూ దందా సాగిస్తున్నారు.. ఒక్కనెల మామూళ్లు చెల్లించకపోయినా ఒప్పుకోరు.. దాడులకు సైతం వెనకాడటంలేదు.. . గుంటూరు : టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్రమ మార్గాలకు ద్వారాలు తెరుచుకున్నాయి. ఇసుక, చౌక బియ్యం అక్రమ రవాణాకు అధికార పార్టీ ముఖ్య నేతలు, వారి భార్యలు, వారి కుటుంబ సభ్యులే అండదండలు అందిస్తున్నారు. జిల్లాలో రేషన్ మాఫియాలు రాజ్యాంగేతరశక్తులుగా మారి డబ్బు ఆశ చూపి పోలీస్ అధికారులను సైతం రొంపిలోకి లాగుతున్నట్లు విమర్శలున్నాయి. వారి ద్వారానే చౌక బియ్యం లారీలను జిల్లా దాటిస్తున్న విషయాలూ వెలుగు చూశాయి. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలకు చౌక బియ్యం అందించకుండా లారీలకు లారీలు బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. జిల్లాలో బియ్యం మాఫీయాకు ఓ మంత్రి భార్య, ఓ ముఖ్యనేత తనయుడు, ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేల అండదండలు ఉండటంతో వారు మరింతగా రెచ్చిపోయి చీకటి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. అక్రమ బియ్యం వ్యాపారంతో అధికార పార్టీ చోటా నాయకులు రూ.లక్షలు సంపాదిస్తుంటే వారికి వెన్నుదన్నుగా నిలిచిన ముఖ్య నేతలు మాత్రం కోట్లు గడిస్తున్నారు. ముఖ్యంగా నరసరావుపేట, గురజాల, తెనాలి డివిజన్లలో రేషన్ మాఫియా జూలు విదుల్చుతోంది. బెదిరించి డబ్బు వసూలు మామూళ్లు ఇవ్వలేదనే కారణంతో నరసరావుపేటలో రేషన్ మాఫియాకు చెందిన ఓ ఎస్సీ నేతను సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఓ పోలీస్‌స్టేషన్‌కు ఎత్తుకెళ్లిన ముఖ్యనేత తనయుడు పోలీసుల సాయంతో బెదిరించి రూ.25 లక్షలు వసూలు చేసిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వినుకొండ పట్టణంలో రేషన్ మాఫియా ముఠాల మధ్య వాటాలు, హద్దుల వివాదంతో తెలుగు తమ్ముళ్లు ఆదివారం తన్నులాటకు దిగారు.. ఇలా చెప్పుకొంటూ పోతే జిల్లాలో రేషన్ మాఫియాను అడ్డుపెట్టుకుని అధికార పార్టీ నేతలు చేస్తున్న దందాలు అన్నీ ఇన్నీ కావు.. మామూళ్ల మత్తులో అధికారులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణలు నిర్వహించడం మినహా ఇసుక, బియ్యం, కిరోసిన్ అక్రమ రవాణాపై దృష్టి సారించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా చుట్టూ రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టులు ఉన్నప్పటికీ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ బియ్యం మాఫియాకు సహకరిస్తున్నారు. ముఖ్యంగా చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, ప్రత్తిపాడు, గురజాల, మాచర్ల, వినుకొండ నియోజకవర్గాల్లో అయితే రేషన్ దుకాణాల్లో సగం మందికి కూడా చౌక బియ్యం అందడం లేదు. కొందరైతే నేరుగా ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి నేరుగా బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రూట్ ఆఫీసర్ల నుంచి సివిల్ సప్లైస్, పోలీస్ అధికారుల వరకూ ప్రతి ఒక్కరికీ నెలవారీ మామూళ్లు అందుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఇసుక, బియ్యం అక్రమ రవాణాపై సీరియస్‌గా దృష్టి సారించి నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో అందించాలని పలువురు కోరుతున్నారు. -
స్థానిక భాషలో సామాజిక మాధ్యమం!
♦ మాతృభాషలో వినియోగించుకునే వీలుండే షేర్‌చాట్ ♦ ప్రస్తుతం తెలుగు, హిందీ, మలయాళం, మరాఠీ భాషల్లో.. ♦ నెల రోజుల్లో తమిళం, గుజరాతీ భాషలకు విస్తరణ ♦ రూ.10 కోట్ల నిధుల సమీకరణ ♦ ‘సాక్షి స్టార్టప్ డైరీ’తో షేర్ చాట్ సీఈఓ ఫరీద్ హెసన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : 125 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో.. స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల సంఖ్య 30 కోట్ల లోపే. ఇందులో సామాజిక మాధ్యమాల యూజర్లు 15 కోట్ల కిందే. మరి ఇంత గ్యాప్ ఎందుకుంది? ఏ సోషల్ నెట్వర్కింగ్నైనా ఆంగ్లంలో వినియోగించాలనేది ఒక కారణమైతే! మెట్రో యువతతో పోల్చుకుంటే ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని యువత ఇంగ్లిష్‌లో వెనకబడి ఉండటం మరో కారణం!! మరి రోజూ మనం మాట్లాడుకునే భాషల్లో సోషల్ నెట్‌వర్క్‌ను వినియోగించుకునే వీలుంటే? ఎంచక్కా మాతృ భాషలో స్పందిస్తూ.. ఎప్పుడూ ఇతరులతో టచ్‌లో ఉంటూ ఎంజాయ్ చేయొచ్చు కదూ!! ఇదిగో ఇలాంటి సోషల్ నెట్వర్కింగ్ యాపే ‘షేర్‌చాట్’! యాప్ విశేషాలు, విస్తరణ ప్రణాళికల గురించి షేర్‌చాట్ సీఈఓ ఫరీద్ హెసన్ మాటల్లోనే.. నాతో పాటూ అంకుష్ సచ్దేవ్, భాను సింగ్‌లు ముగ్గురం ఐఐటీ కాన్పూర్ గ్రాడ్యుయేట్స్. ఇంగ్లిష్‌లో కంటే స్థానిక భాషలో సామాజిక మాధ్యమాలను వినియోగించే వీలుంటే చాలా మందికి చేరుతుందని అనుకున్నాం. అందుకే లక్ష రూపాయల పెట్టుబడితో ఆరు నెలలపాటు యాప్, సాఫ్ట్వేర్, ఫీచర్లను అభివృద్ధి చేసి గతేడాది అక్టోబర్‌లో బెంగళూరు కేంద్రంగా షేర్‌చాట్ సోషల్ నెట్వర్కింగ్ యాప్‌ను విడుదల చేశాం. షేర్ ప్రత్యేకత ఏంటంటే.. యూజర్లు తమ స్థానిక భాషలోనే కంటెంట్ పొందొచ్చు. పోస్ట్ చేయవచ్చు కూడా. ఫొటోలు, వీడియోలు, ఆడియోలు అన్నీ మీ భాషలోనే చేసుకునే వీలుంది. వీటికి తోడు న్యూస్, విషెస్, ఇతరుల కంటెంట్, ప్రొఫైల్‌ను ఎప్పటికప్పుడు ఫాలో కావొచ్చు. నెలాఖరుకల్లా తమిళం, గుజరాతీలో.. ప్రస్తుతం తెలుగు, హిందీ, మరాఠీ, మలయాళం భాషల్లో షేర్‌చాట్‌ను వినియోగించుకోవచ్చు. ఈ ఏడాది ముగింపు నాటికి బెంగాళీ, కన్నడ, పంజాబీ, ఒడియా భాషలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. తొలి విడత ఈ నెలాఖరుకల్లా గుజరాతీ, తమిళ భాషలకు విస్తరించనున్నాం. ఫీచర్ల విషయానికొస్తే.. చాటింగ్, కామెంట్ ఫీచర్లనూ అందుబాటులోకి తెస్తున్నాం. రూ.10 కోట్ల నిధుల సమీకరణ.. ప్రస్తుతం మా సంస్థలో 25 మంది ఉద్యోగులున్నారు. ఇటీవలే కాలిఫోర్నియాలో జరిగిన గూగుల్ లాంచ్‌ప్యాడ్ యాక్సలేటర్ కార్యక్రమానికి ఎంపికయ్యాం. మన దేశం తరపున ఎంకికైన ఏకైక యాప్ మాదే. ఇందులో 50,000 డాలర్ల నగదు బహుమతితో పాటూ 6 నెలల మెంటార్షిప్ కూడా ఇస్తారు. ఇటీవలే సైఫ్ పార్టనర్స్ నుంచి రూ.10 కోట్లు నిధులను సమీకరించాం. మరో మూడు నెలల్లో కొత్త ఇన్వెస్టర్ల నుంచి మరికొంత నిధుల సమీకరణ కూడా చేయనున్నామని ఫరీద్ వివరించారు. రోజుకు 2 లక్షల షేరింగ్స్ ప్రస్తుతం షేర్‌చాట్‌కు 12 లక్షల మంది యూజర్లున్నారు. ఇందులో సగానికి పైగా యాక్టివ్ యూజర్లే. నెలకు 4 లక్షల మంది కొత్తగా యాడ్ అవుతున్నారు. రోజుకు 2 లక్షల కంటెంట్స్ షేరింగ్ అవుతున్నాయి. మొత్తం యూజర్లలో దక్షిణాది రాష్ట్రాల నుంచి 5 లక్షల యూజర్లున్నారు. ప్రస్తుతం ఆండ్రాయిడ్ యాప్ మాత్రమే అందుబాటులో ఉంది. నెల రోజుల్లో ఐఓఎస్ యాప్‌నూ అందుబాటులోకి తీసుకొస్తాం. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
ఏడాదిలో 20,000 డ్రైవర్లకు రుణం
♦ ముందుకొచ్చిన టాటా గ్రూప్ ♦ ఉబర్ టెక్నాలజీస్‌తో భాగస్వామ్యం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ట్యాక్సీ అగ్రిగేటర్ ఉబర్ టెక్నాలజీస్ తాజాగా టాటా సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఉబర్ ప్లాట్‌ఫాంపై పనిచేసేందుకు ముందుకొచ్చిన డ్రైవర్ పార్టనర్లకు టాటా మోటార్స్‌కు చెందిన కార్ల కొనుగోలుకు సులభ వాయిదాల్లో రుణం ఇస్తారు. టాటా క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, టాటా మోటార్స్ ఫైనాన్స్‌లు ఈ రుణం అందిస్తాయి. ఇతర సంస్థలతో పోలిస్తే వడ్డీ రేట్లు కాస్త తక్కువగా ఉంటాయి. అందుబాటు ధరలో టాటా ఏఐజీ బీమా కల్పించనుంది. ఏడాదిలో 20,000 మందికిపైగా ఔత్సాహికులకు రుణం ఇవ్వాలని టాటా గ్రూప్ భావిస్తోంది. హైదరాబాద్‌లో తొలుత ఈ స్కీమ్‌ను ప్రారంభిస్తున్నట్టు టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు మధు కన్నన్ గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో 27 నగరాల్లో ఉబర్ సేవలందిస్తోంది. డిసెంబరు నాటికి మరో 23 నగరాల్లో అడుగుపెడతామని ఉబర్ ఆసియా బిజినెస్ హెడ్ ఎరిక్ అలెగ్జాండర్ పేర్కొన్నారు. సొంత పేమెంట్ వాలెట్ తీసుకొచ్చే విషయంలో కంపెనీ ఆసక్తిగా ఉందని చెప్పారు. ఆకట్టుకోవడానికే ప్రోత్సాహకాలు.. డ్రైవర్ పార్టనర్లను ఆకట్టుకోవడానికే నగదు ప్రోత్సాహకాలు ఇస్తున్నట్టు ఎరిక్ అలెగ్జాండర్ వెల్లడించారు. ‘కొత్తగా ఏదైనా నగరంలో ప్రవేశించినపుడు ప్రోత్సాహకాలు అందిస్తాం. ఎక్కువ ట్రిప్పులు చేసిన వారికి అదనపు ఆదాయం వస్తుంది. డబ్బులు వస్తేనే ఈ వ్యాపారం సాగుతుంది. డ్రైవర్లు నెట్‌వర్క్‌లోకి వస్తారు. డ్రైవర్ పార్టనర్లకు ఆదాయావకాశాల కల్పన మా విధి. సరఫరా-డిమాండ్‌లో వ్యత్యాసం ఉన్నప్పుడే సర్జ్ ప్రైసింగ్ ఉంటుంది. ఆ సమయంలో డిమాండ్ ఉంటుంది కాబట్టి అధిక ఆదాయం కోసం డ్రైవర్లు లాగిన్ అవుతారు. సర్జ్ ధర నిర్ణయం మానవ ప్రమేయం లేకుండా అంతా సాంకేతికంగా జరుగుతుంది’ అని వివరించారు. వ్యాపారం నిలదొక్కుకోవడానికి కంపెనీ ప్రయత్నిస్తోందని తెలిపారు. -
అలీబాబాలో వాటా విక్రయించనున్న సాఫ్ట్ బ్యాంక్
టోక్యో: చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబాలో ఉన్న తనకున్న వాటాలో కొంత భాగాన్ని విక్రయించనున్నది సాఫ్ట్‌బ్యాంక్. రుణ భారం తగ్గించుకోవడం కోసం అలీబాబాలో ఉన్న వాటాలో దాదాపు 7.9 బిలియన్ డాలర్లకు సమానమైన భాగాన్ని విక్రయిస్తామని సాఫ్ట్‌బ్యాంక్ పేర్కొంది. సాఫ్ట్‌బ్యాంక్ ఇటీవల అమెరికాకు చెందిన మొబైల్ కంపెనీ స్ప్రింట్‌ను 16 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడం వంటి తదితర కారణాల వల్ల బ్యాంక్ ఆర్థిక కార్యకలాపాలపై తీవ్ర ఒత్తిడి ఏర్పడింది. దీని రుణ భారం మార్చి చివరి నాటికి 106 బిలియన్ డాలర్లుకు చేరినట్లు తెలుస్తోంది. అలీబాబాలోని పెద్ద షేర్హోల్డర్లలో సాఫ్ట్‌బ్యాంక్ కూడా ఒకటి. వాటా విక్రయం జరిగితే అలీబాబాలో 32.2%గా ఉన్న సాఫ్ట్‌బ్యాంక్ వాటా 28%కి తగ్గనున్నది. విక్రయించనున్న వాటాలో 2 బిలియన్ డాలర్ల విలువైన వాటాను అలీబాబానే కొనుగోలు చేసే అవకాశం ఉంది. -
హిందుస్తాన్ పెట్రోలియంతో పేటీఎం జట్టు
హైదరాబాద్: ప్రముఖ మొబైల్ పేమెంట్స్ అండ్ కామర్స్ ప్లాట్‌ఫామ్ పేటీఎం.. తాజాగా హిందుస్తాన్ పెట్రోలియంతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో పేటీఎం వినియోగదారులు హిందుస్తాన్ పెట్రోలియం ఫ్యూయెల్ స్టేషన్స్‌లో పేటీఎం ద్వారా లావాదేవీలు నిర్వహించవచ్చు. అంటే హెచ్‌పీసీఎల్ పెట్రోల్ బంకుల్లో బండికి పెట్రోల్/డీజిల్ పట్టించుకొని జేబులో నుంచి డబ్బులు (నగదు) ఇవ్వాల్సిన అవసరం లేకుండా పేటీఎం వాలెట్ ద్వారా చెల్లిస్తే సరిపోతుంది. పేమెంట్స్‌ను సులభతరం చేయడమే తమ లక్ష్యమని పేటీఎం వైస్ ప్రెసిడెంట్ కిరణ్ వాసిరెడ్డి తెలిపారు. -
ఛార్జింగ్ కూడా షేర్ చేయొచ్చు!
యాండ్రాయిడ్ ఫోన్ల ప్రపంచం విస్తరించింది. ప్రతి మనిషికీ ఫోన్ అత్యవసర వస్తువుగా మారిపోయింది. కమ్యూనికేషన్ వ్యవస్థను వినియోగించుకోవడంలో జనం ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతున్నారు. ఫోన్ కాల్స్ మాట్లాడటమే కాక వాయిస్ మెసేజిలు పంపడంతో పాటు ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకుంటున్నారు. అంతేకాదు ఫోన్ బ్యాలెన్స్‌ను కూడా షేర్ చేసుకుంటున్నారు. అయితే టెక్స్ట్, ఫొటోలు, వీడియోలతో పాటు.. తాజాగా ఫోన్ ఛార్జింగ్ ను సైతం షేర్ చేసుకునే అవకాశాన్ని లండన్ పరిశోధకులు అందుబాటులోకి తేనున్నారు. అత్యవసర సమయాల్లో ఫోన్లలో ఛార్జింగ్ అయిపోతే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఇకముందు ఉండవట. ఫోన్ చార్జింగ్ ను షేర్ చేసుకునే వ్యవస్థను త్వరలో అందుబాటులోకి తేనున్నారు. ఫోన్ లో పూర్తిగా ఛార్జింగ్ అయిపోయినపుడు ఇతరుల ఫోన్ నుంచి ఎటువంటి వైర్, కేబుల్ అవసరం లేకుండా పవర్ షేర్ చేసుకునే విధానాన్ని అభివృద్ధి చేస్తున్నారు. పవర్ షేక్ పేరుతో లండన్ యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి పరుస్తున్న కొత్త వైర్ లెస్ టెక్నాలజీని త్వరలో అందరికీ అందుబాటులోకి తేనున్నారు. పవర్ ట్రాన్స్ మిట్ కాయిల్స్ ద్వారా ఒక మొబైట్ ఫోన్ నుంచి మరో మొబైల్ ఫోన్ కు కరెంట్ ప్రసరింపజేసే కొత్త విధానాన్ని కనుగొన్నారు. ఫోన్ పక్కనే మరో ఫోన్ ఉంచి 12 సెకన్లపాటు షేర్ చేసిన పవర్.. ఒక నిమిషం పాటు కాల్ మాట్లాడేందుకు వినియోగిస్తుందని పరిశోధకులు చెప్తున్నారు. -
క్యాస్ట్రాల్ ఇండియాలో వాటా విక్రయించిన బీపీ
డీల్ విలువ రూ.2,075 కోట్లు న్యూఢిల్లీ: క్యాస్ట్రాల్ ఇండియాలో 11.5 శాతం వాటాను ఇంగ్లండ్‌కు చెందిన బీపీ కంపెనీ విక్రయించింది. ఒక్కో షేర్‌ను రూ.365 చొప్పున 5.68 కోట్ల షేర్లను(11.5 శాతంవాటా)ను దేశీయ, అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు విక్రయించామని బీపీ కంపెనీ పేర్కొంది. ఈ వాటా విక్రయ విలువ రూ.2,075 కోట్లని వివరించింది. ఈ వాటా విక్రయాన్ని సిటి గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ సంస్థలు నిర్వహించాయి. ఈ డీల్ కారణంగా క్యాస్ట్రాల్ ఇండియా ఉద్యోగులు, వినియోగదారులు, ప్రస్తుత కాంట్రాక్టులపై ఎలాంటి ప్రభావం ఉండబోదని బీపీ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బాబ్ డడ్లీ చెప్పారు. వృద్ధికి అవకాశాలున్న భారత్ తమకు కీలకమైన మార్కెటని, భారత్‌లో పెట్టుబడులు కొనసాగిస్తామని బీపీ ఇండియా హెడ్ శశి ముకుందన్ చెప్పారు. గతేడాది మంచి పనితీరు కనబరిచామని క్యాస్ట్రాల్ ఇండియా ఎండీ ఒమర్ డోర్‌మెన్ చెప్పారు. నికర లాభం 30 శాతం వృద్ధితో రూ.615 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. క్యాస్ట్రాల్ ఇండియాలో బీపీ సంస్థకు 70.92 శాతం వాటా ఉంది. వాటా విక్రయ నేపథ్యంలో క్యాస్ట్రాల్ ఇండియా షేర్ బీఎస్ఈలో 3.2 శాతం క్షీణించి రూ.373 వద్ద ముగిసింది. -
ఇండస్ఇండ్ బ్యాంక్‌తో హోండా జట్టు
న్యూఢిల్లీ: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) తాజాగా ఇండస్ఇండ్ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా హోండా టూవీలర్ల కొనుగోలుకు బ్యాంక్.. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లలో ఫైనాన్స్ సదుపాయాన్ని కల్పించనున్నది. టూవీలర్ పరిశ్రమలో రిటైల్ ఫైనాన్స్ ప్రాధాన్యం పెరుగుతోందని, కస్టమర్లు పలు ఫైనాన్స్ మార్గాలను అన్వేషిస్తున్నారని హెచ్ఎంఎస్ఐ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) యాద్విందర్ సింగ్ గులారియా తెలిపారు. టూవీలర్ ఫైనాన్సింగ్ విభాగంలో అధిక వాటా లక్ష్యంలో భాగంగా హెచ్ఎంఎస్ఐతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని బ్యాంక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, హెడ్ (కన్సూమర్ ఫైనాన్స్ విభాగం) ఎస్.వి.పార్థసారథి పేర్కొన్నారు. ఒప్పందంలో ఇందులో భాగంగా కస్టమర్లు గంటలో రుణ ఆమోదం, జీరో ప్రాసెసింగ్ ఫీజు వంటి తదితర సౌలభ్యాలను పొందొచ్చని హెచ్ఎంఎస్ఐ పేర్కొంది. బైక్ విలువలో 90 శాతం వరకు రుణాన్ని పొందొచ్చని, దీన్ని 36 నెలల్లో ఇన్స్టాల్మెంట్ల రూపంలో కట్టొచ్చని వివరించింది. -
మిత్సుబిషిలో మూడో వంతు వాటా నిస్సాన్ చేతికి
టోక్యో/న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన మిత్సుబిషి మోటార్స్ కార్పొరేషన్లో 34 శాతం వాటాను అదే దేశానికి చెందిన నిస్సాన్ మోటార్ కంపెనీ కొనుగోలు చేయనున్నది. ఈ వాటాను 200 కోట్ల డాలర్లకు నిస్సాన్ కొనుగోలు చేయనున్నది. దీనికి సంబంధించి వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకోవడానికి ఇరు కంపెనీల మధ్య ప్రాధమిక ఒప్పందం కుదిరింది. ఈ ఏడాది చివరకు ఈ డీల్ పూర్తవుతుందని అంచనా. ఈ డీల్ పూర్తయిన తర్వాత మిత్సుబిషి మోటార్స్ కార్పొరేషన్లో అతి పెద్ద వాటాదారుగా నిస్సాన్ అవతరిస్తుంది. ఎంఎంసీలో నిస్సాన్‌కున్న వాటాకు లభించే ఓటింగ్ హక్కుల ప్రకారం నిస్సాన్ నామినీ డెరైక్టర్‌కు మిత్సుబిషి కంపెనీ బోర్డ్‌కు చైర్మన్ అయ్యే అవకాశాలున్నాయి. తమ మోడల్ కార్లలో మైలేజీ అధికంగా వస్తుందని దొంగ లెక్కలు చూపించిదన్న స్కామ్‌లో ప్రస్తుతం ఎంఎంసీ కూరుకుపోయింది. -
అవీవా ఇండియాలో అవీవాకు మరో 23 శాతం వాటాలు
న్యూఢిల్లీ: బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని పెంచిన నేపథ్యంలో అవీవా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇండియాలో అదనంగా 23 శాతం వాటాల కొనుగోలు ప్రక్రియ పూర్తయినట్లు విదేశీ భాగస్వామ్య సంస్థ అవీవా వెల్లడించింది. దీంతో వాటాలు గరిష్ట పరిమితి 49 శాతానికి చేరినట్లు సంస్థ తెలిపింది. బ్రిటన్‌కు చెందిన అవీవా.. దేశీ దిగ్గజం డాబర్ గ్రూప్‌లో భాగమైన డాబర్ ఇన్వెస్ట్ కార్ప్‌తో కలసి ఈ బీమా సంస్థను ఏర్పాటు చేసింది. -
ఎన్‌హెచ్‌పీసీ వాటా విక్రయం సక్సెస్
ప్రభుత్వానికి రూ.2,700 కోట్లు న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన తొలి డిజిన్వెస్ట్‌మెంట్, ఎన్‌హెచ్‌పీసీ వాటా విక్రయం విజయవంతమైంది. గురువారం రిటైల్ ఇన్వెస్టర్ల వాటా విక్రయానికి మంచి స్పందనే లభించింది. వాటా విక్రయంలో భాగంగా 125.76 కోట్లు(11.36 శాతం వాటా) షేర్లను ఒక్కో షేర్ రూ.21.75 బేస్ ధరపై ప్రభుత్వం విక్రయానికి పెట్టింది. సంస్థాగత ఇన్వెస్టర్లకు కేటాయించిన 100.61 కోట్ల షేర్లకు గాను 156.79 కోట్ల షేర్లకు బిడ్లు, రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించిన 25.15 కోట్ల షేర్లకు గాను 41.45 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. సంస్థాగత వాటా ఇన్వెస్టర్ల విభాగం 1.58 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల వాటా విభాగం 1.65 రెట్లు చొప్పున ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యాయి. మొత్తం మీద ఈ వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ.2,700 కోట్లు సమకూరాయి. ఎన్‌హెచ్‌పీసీలో ప్రభుత్వ వాటా 85.96 శాతం నుంచి 74.6 శాతానికి తగ్గుతుంది. ఫ్లోర్ ప్రైస్(రూ.21.75)లో రిటైల్ ఇన్వెస్టర్లకు 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఈ వాటా విక్రయం నేపథ్యంలో ఎన్‌హెచ్‌పీసీ షేర్ ధర బీఎస్ఈలో 1.8 శాతం క్షీణించి రూ.21.15 వద్ద ముగిసింది. కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వాటాల విక్రయం ద్వారా రూ.56,500 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. -
ఎన్‌హెచ్‌పీసీ వాటా విక్రయానికి మంచి స్పందన
♦ నేడు రిటైల్ ఇన్వెస్టర్లకు విక్రయం ♦ కట్ ఆఫ్ ధర లో 5 శాతం డిస్కౌంట్ న్యూఢిల్లీ: ఎన్‌హెచ్‌పీసీ వాటా విక్రయానికి మంచి స్పందన లభించింది. ఈ ప్రభుత్వ రంగ విద్యుదుత్పత్తి కంపెనీలో 11.36 శాతం వాటాను ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) విధానంలో ప్రభుత్వం విక్రయానికి పెట్టింది. వ్యవస్థాగత ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా షేర్లు మూడు గంటలలోనే ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యాయి. వ్యవస్థాగత ఇన్వెస్టర్లకు కేటాయించిన 100.61 కోట్ల షేర్లకు గాను 1.58 రెట్లు అంటే 156.79 కోట్ల షేర్లకు బిడ్స్ వచ్చాయి. ఈ బిడ్స్ విలువ రూ.3,410 కోట్లు. అత్యధిక బిడ్లు ఎల్ఐసీ, మ్యూచువల్ ఫండ్స్ నుంచి వచ్చాయని సమాచారం. గురువారం మిగిలిన 25.15 కోట్ల షేర్లను రిటైల్ ఇన్వెస్టర్లకు విక్రయిస్తారు. ఆఫర్‌కు ఫ్లోర్‌ప్రైస్ రూ. 21.75కాగా, రిటైల్ ఇన్వెస్టర్లకు కట్ ఆఫ్ ధరకు 5 శాతం డిస్కౌంట్‌ను ఇవ్వనున్నారు. కాగా ఈ వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ.2,700 కోట్ల నిధులు లభిస్తాయని అంచనా. వాటా విక్రయ నేపథ్యంలో ఈ కంపెనీ షేర్ 5.8 శాతం నష్టపోయి రూ.21.70 వద్ద ముగిసింది. ఈ ఆర్థిక సంవత్సరం పీఎస్‌యూల్లో తొలి డిజిన్వెస్ట్‌మెంట్ ఇది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటా విక్రయం ద్వారా రూ.56,500 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. -
ఎన్హెచ్పీసీలోవాటా విక్రయం నేడు
♦ షేర్ విక్రయ ధర రూ.21.75 ♦ రిటైల్ ఇన్వెస్టర్లకు 5% డిస్కౌంట్ న్యూఢిల్లీ: ఎన్‌హెచ్‌పీసీ కంపెనీలో 11.36 శాతం వాటాను ప్రభుత్వం నేడు(బుధవారం) విక్రయించనున్నది. డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం విక్రయిస్తున్న తొలి పీఎస్‌యూ వాటా విక్రయం ఇది. ఒక్కో షేర్‌ను రూ.21.75(మంగళవారం ముగింపుధర రూ.23.05తో పోల్చితే ఇది 5.64%తక్కువ) చొప్పున ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) విధానంలో విక్రయించనున్నారు. దీని ప్రకారంప్రభుత్వానికి రూ.2,700 కోట్లు సమకూరుతాయని అంచనా.ఎన్‌హెచ్‌పీసీలో ప్రభుత్వానికి 85.96% వాటా ఉంది. దీంట్లో 11.36% వాటా(125.76 కోట్ల షేర్లను)ను అమ్మనున్నది. సెబీ కొత్త నిబంధనల ప్రకారం ఓఎఫ్ఎస్ తొలి రోజు వ్యవస్థాగత ఇన్వెస్టర్లు, రెండో రోజు రిటైల్ ఇన్వెస్టర్లు షేర్లకు బిడ్ చేస్తారు. ఈ ఓఎఫ్ఎస్లో 20 శాతం వాటా షేర్లను రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించామని, రిటైల్ ఇన్వెస్టర్లకు 5 శాతం డిస్కౌంట్‌కే ఎన్‌హెచ్‌పీసీ షేర్లను విక్రయిస్తామని ప్రభుత్వం తెలిపింది. మ్యూచువల్ ఫండ్ సంస్థలకు, బీమా కంపెనీలకు 25 శాతం వాటాను కేటాయించామని పేర్కొంది. మరోవైపు సెక్యూర్డ్ నాన్-కన్వర్టబుల్ కార్పొరేట్ బాండ్ల జారీ ద్వారా రూ.900 కోట్లు సమీకరించడానికి తమ డెరైక్టర్ బోర్డ్ ఆమోదం తెలిపిందని ఎన్‌హెచ్‌పీసీ తెలిపింది. -
టాటా స్టీల్ యూకేలో 25% వాటా తీసుకుంటాం
బ్రిటన్ ప్రభుత్వం వెల్లడి లండన్: సంక్షోభంలో చిక్కుకున్న టాటా స్టీల్ యూకేను గట్టెక్కించే ప్రయత్నాల్లో భాగంగా అవసరమైతే 25 శాతం మేర వాటాలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని బ్రిటన్ వాణిజ్య మంత్రి సాజిద్ జావిద్ తెలిపారు. కార్యకలాపాల కొనుగోలుకు ముందుకొచ్చే సంస్థలకు వందల మిలియన్ల కొద్దీ పౌండ్ల మేర రుణపరమైన ఉపశమనం కలిగించేందుకు కూడా సుముఖంగా ఉన్నట్లు వివరించారు. ఇందుకు సంబంధించిన ఆర్థిక ప్యాకేజీపై బ్రిటన్, వెల్ష్ ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. విశ్వసనీయమైన కొనుగోలుదారును అన్వేషించే ప్రక్రియలో టాటా స్టీల్ యూకే సంస్థతో కలసి బ్రిటన్ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి వివరించారు. అయితే, ఉక్కు రంగాన్ని జాతీయం చేసే ప్రయత్నాల్లో భాగంగా ఈ చర్యలను భావించరాదని ప్రధాని డేవిడ్ కామెరాన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. -
ఇన్ఫ్రాటెల్లో ఎయిర్టెల్ వాటా విక్రయం!
న్యూఢిల్లీ: బారతీ ఎయిర్టెల్ కంపెనీ తన టవర్ల విభాగమైన భారతీ ఇన్ ఫ్రాటెల్‌లో 5 శాతం వాటాను విక్రయించాలని యోచిస్తోంది. బహిరంగ మార్కెట్ లావాదేవీల ద్వారా ఈ వాటా విక్రయంతో రూ.3,500 కోట్ల నుంచి రూ.4,000 కోట్లు సమీకరించాలని భారతీ ఎయిర్టెల్ యోచిస్తోందని సమాచారం. ఇన్ఫ్రాటెల్లో ఎయిర్‌టెల్‌కు 71.7 శాతం వాటా ఉంది. ఈ వాటా విక్రయం ద్వారా వచ్చిన నిధులతో రుణ భారాన్ని తగ్గించుకోవాలని భారతీ ఎయిర్టెల్ భావిస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ వాటా విక్రయ వార్తలపై వ్యాఖ్యానించడానికి కంపెనీ ప్రతినిధి నిరాకరించారు. కాగా గత ఏడాది డిసెంబర్ నాటికి ఎయిర్టెల్ నికర రుణభారం రూ.78,816 కోట్లుగా ఉంది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ రంగంలోకి వస్తుండటంతో ఎయిర్టెల్ 4జీ సేవలను విస్తృతం చేస్తోంది. -
బిర్లా సన్లైఫ్లో అదనపు వాటా విక్రయం పూర్తి
న్యూఢిల్లీ: బిర్లా సన్‌లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో విదేశీ భాగస్వామి, కెనడాకు చెందిన సన్‌లైఫ్ ఫైనాన్షియల్ సంస్థ వాటా 26 శాతం నుంచి 49 శాతానికి పెరిగింది. ఈ అదనపు 23 శాతం వాటా విక్రయాన్ని ఆదిత్య బిర్లా నువో సోమవారం పూర్తి చేసింది. ఈ అదనపు వాటాను తమ జాయింట్ వెంచర్ భాగస్వామి, కెనడాకు చెందిన సన్ లైఫ్ ఫైనాన్షియల్ సంస్థకు రూ.1,664 కోట్లకు విక్రయించడం పూర్తయిందని ఆదిత్య బిర్లా నువో(ఏబీఎన్‌ఎల్) బీఎస్ఈకి నివేదించింది. దీంతో బిర్లా సన్‌లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ విలువ రూ.7,235 కోట్లుగా ఉంది. వాటా విక్రయంతో తమ నికర రుణ భారం గణనీయంగా తగ్గుతుందని ఏబీఎన్‌ఎల్ పేర్కొంది. డీల్ తర్వాత బిర్లా సన్‌లైఫ్ ఇన్సూరెన్స్‌లో ఆదిత్య బిర్లా నువోకు 51 శాతం, సన్ లైఫ్ ఫైనాన్షియల్‌కు 49 శాతం చొప్పున వాటాలుంటాయి. -
షేర్లలో నష్టాలొచ్చాయా..?
పన్ను మినహాయింపు పొందవచ్చు * ఒక ఏడాదిలో నష్టాలు... 8 ఏళ్లలో సర్దుబాటు * ఏడాది దాటిన హోల్డింగ్స్‌పై లాభానికి పన్నుండదు * షార్ట్‌టర్మ్ నష్టాలకు మాత్రమే ఈ సర్దుబాటు రాజేష్‌కు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడమంటే ఇష్టం. అదో అలవాటుగా కూడా మార్చేసుకున్నాడు. అయితే ఈ అలవాటు ఇపుడు ట్రేడింగ్‌కూ విస్తరించింది. రోజూ కొన్ని షేర్ల లాట్లు కొనటం, అమ్మటంతో పాటు డెరివేటివ్స్లోకీ (ఫ్యూచర్స్, ఆప్షన్స్) కాలు పెట్టాడు. కాకపోతే ఈ ఏడాది ట్రేడింగ్‌లో మునుపెన్నడూ లేనంత నష్టాలొచ్చాయి. తనకు కలిసిరాలేదని అనుకున్నాడు. బాధపడ్డాడు. ఇంతలో రాజేష్‌కు తన మిత్రుడు సురేష్ తారసపడ్డాడు. ఏంటలా డల్‌గా ఉన్నావ్? అని అడిగితే విషయం చెప్పాడు రాజేష్. ‘‘సరె! పోయిందెలాగూ పోయింది. మళ్లీ ట్రేడింగ్ చేస్తావు కదా! పన్ను లాభం పొందొచ్చులే’’ అన్నాడు సురేష్. అదెలా? అని రాజేష్ అడగ్గా... ‘‘ఒక ఏడాది ట్రేడింగ్‌లో వచ్చిన నష్టాల్ని ఎనిమిదేళ్లలో ఎప్పుడైనా వచ్చే లాభాల్లో పన్ను సర్దుబాటు చేసుకోవచ్చునని ఐటీ నిబంధనలు చెబుతున్నాయి’’ అని వివరించాడు సురేష్. అదెలాగో ఇపుడు చూద్దాం... ఎంత పన్ను చెల్లించాలి? ఎవరైనా షేర్లు, బంగారం, రుణపత్రాల వంటి క్యాపిటల్ ఆస్తులు గనక కొన్నా, అమ్మినా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎంత పన్ను చెల్లించాలి? అసలు చెల్లించాలా? వద్దా? అనేది ఆయా ఆస్తుల్ని ఎంతకాలం ఉంచుకుంటారన్న దానిపై ఆధారపడి ఉంటుంది. * షేర్ల విషయానికొస్తే ఏడాదిలోపు గనక క్రయ విక్రయాలు జరిపితే స్వల్పకాల క్యాపిటల్ గెయిన్స్, లేదా స్వల్పకాల క్యాపిటల్ లాస్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఏడాదికి మించి ఉంచుకుంటే... ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన అవసరం ఉండదు. * రుణ పత్రాలు, బంగారం, ప్రాపర్టీ విషయంలో స్వల్పకాల గెయిన్స్ లేదా లాస్ వ్యవధి మూడేళ్లు. మూడేళ్ల తరవాత లావాదేవీలు జరిపితే... అది లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లేదా లాస్ కిందికి వస్తుంది. * ఆదాయపు పన్ను చట్టం ప్రకారం... ఒక వ్యక్తి తనకు వచ్చిన స్వల్పకాల క్యాపిటల్ లాస్‌ను స్వల్పకాల క్యాపిటల్ గెయిన్స్‌తో గానీ, లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌తో గానీ సర్దుబాటు చేసుకోవచ్చు. లాంగ్‌టర్మ్ క్యాపిటల్ లాస్‌ను మాత్రం లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌తోనే సర్దుబాటు చేసుకోవాలి. * ఒక వ్యక్తికి షేర్లలో రూ.5 లక్షల నష్టం వచ్చిందనుకోండి. అందులో ఏడాదిలోపు హోల్డ్ చేసిన షేర్లపై వచ్చిన నష్టమెంత? ఏడాదికి మించి హోల్డ్ చేసిన షేర్లపై వచ్చిన నష్టమెంత? అనేది ముందు విడదీయాలి. స్వల్పకాలంలో వచ్చిన నష్టం రూ.4 లక్షలు, దీర్ఘకాలం ఉంచిన షేర్లపై రూ.1 లక్ష నష్టం వచ్చాయనుకుందాం. అలాగే తనకు షార్ట్‌టర్మ్ లాభం రూ.2 లక్షలు, లాంగ్‌టర్మ్ లాభం రూ.50వేలు వచ్చాయనుకుందాం. * ఈ వ్యవహారంలో దీర్ఘకాల క్యాపిటల్ లాస్‌ను లాభాల్లో సర్దుబాటు చేయజాలరు. ఎందుకంటే దీనిపై పన్నే ఉండదు కాబట్టి. అయితే స్వల్పకాల క్యాపిటల్ లాస్‌ను... స్వల్పకాల గెయిన్స్‌తో సర్దుబాటు చేసుకునే వీలుంటుంది. దీనర్థం... తనకు నికరంగా రూ.2 లక్షల స్వల్పకాల లాస్ మిగులుతుంది. (రూ.4 లక్షల్లోంచి 2 లక్షలు తీసివేస్తే...). ఈ మొత్తాన్ని తదుపరి సంవత్సరాల్లో సర్దుబాటు చేసుకునే వీలుంటుంది. సకాలంలో పన్ను చెల్లిస్తేనే..! పన్ను చెల్లింపుదారులు సకాలంలో పన్ను చెల్లించి, రిటర్న్‌లు వేస్తేనే ఈ పన్ను ప్రయోజనాన్ని పొందగలుగుతారని ‘జెన్ మనీ’కి చెందిన ఫైనాన్షియల్ ప్లానర్ వేణుగోపాల్ జాగర్లమూడి తెలియజేశారు. ఈ అంశంలో మరింత లబ్ధి పొందాలని భావిస్తే గనక... డెట్ మ్యూచ్‌వల్ ఫండ్ల వంటి వాటిపై వచ్చే లాభాలను కూడా షేర్లపై వచ్చిన నష్టాలతో సర్దుబాటు చేసుకునే అవకాశముంది. నిపుణుల సూచన ప్రకారం... ఫ్యూచర్స్, ఆప్షన్స్‌లో ట్రేడింగ్ చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో నష్టాలను వ్యాపారంలో వచ్చిన నష్టాలుగా భావిస్తారు కనక సదరు వ్యక్తి బిజినెస్ యజమానిగా రిటర్న్ దాఖలు చేయాలి. ‘‘ఈ నష్టాలను ఎనిమిదేళ్లపాటు వచ్చే లాభాలతో సర్దుబాటు చేస్తూ పోవచ్చు. అయితే ఒకరోజులోనే అమ్మటం కొనటం చేసే (ఇంట్రాడే) వారికి ప్రత్యేక నిబంధనలున్నాయి’’ అని ‘టిక్ ఎన్ ట్రేడ్ డాట్‌కామ్’ వ్యవస్థాపకుడు మూర్తి గరిమెళ్ల చెప్పారు. వీటిలో వచ్చే లాభాలు లేదా నష్టాలను స్పెక్యులేటివ్ వ్యాపారంపై వచ్చినవిగా భావిస్తారు. ఇందులో వచ్చే నష్టాలను ఇలాంటి స్పెక్యులేటివ్ బిజినెస్‌లో వచ్చే లాభాలతో మాత్రమే సర్దుబాటు చేసుకునే వీలుంటుంది. వీటిని నాలుగేళ్ల పాటు మాత్రమే క్యారీ ఫార్వర్డ్ చేయవచ్చు. - సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం -
‘టియాగో’తో మార్కెట్ వాటా పెరుగుతుంది
టాటా మోటార్స్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ బర్మన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్ల మార్కెట్లో ఒకానొక దశలో దాదాపు 17 శాతం వాటా దక్కించుకున్న టాటా మోటార్స్... 2016 ఫిబ్రవరి నాటికి 6.5 శాతం వాటాతో సరిపెట్టుకుంది. మూడేళ్లు శ్రమించి మార్కెట్లోకి తెచ్చిన ‘టియాగో’తో సంస్థ పూర్వ వైభవం సంతరించుకుంటుందని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్ బిజినెస్ యూనిట్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ ఎస్.ఎన్.బర్మన్ చెప్పారు. హైదరాబాద్ మార్కెట్లో గురువారం టియాగో విడుదల చేసిన సందర్భంగా కస్టమర్ సపోర్ట్ వైస్ ప్రెసిడెంట్ దినేష్ భాసిన్, వెహికిల్ ఇంజనీరింగ్ హెడ్ అనంద్ విజయ్ కులకర్ణితో కలిసి మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా 60 వేల మందికిపైగా టియాగో పట్ల ఆసక్తి కనబరిచారని తెలిపారు. దశలవారీగా నూతన మోడళ్లతో ర్యాంకు మెరుగు పర్చుకుంటామన్నారు. ఆటో ఎక్స్‌పోలో 20 కొత్త మోడళ్లను టాటా మోటార్స్ ప్రదర్శించడం తెలిసిందే. వీటిలో కొద్దిరోజుల్లో హెక్సా క్రాస్ ఓవర్‌ను కంపెనీ ప్రవేశపెడుతోంది. ఆ తర్వాత కాంపాక్ట్ సెడాన్ కైట్-5(కోడ్ నేమ్), సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ నెక్సన్ రానున్నాయని బర్మన్ చెప్పారు. హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో టియాగో కారు ధర వేరియంట్‌నుబట్టి రూ.3.32-5.69 లక్షలుంది. -
కనిష్ట స్థాయికి ఐవీఆర్ సీఎల్ షేరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిర్మాణంలో ఉన్న కోల్‌కతా ఫ్లై ఓవర్ కుప్పకూలటంతో దాని నిర్మాణసంస్థ ఐవీఆర్సీఎల్ షేరు... నేల చూపులు చూస్తోంది. రెండు రోజుల్లో 18 % నష్టపోయి, పదమూడేళ్ల కనిష్ట స్థాయికి చేరింది. కంపెనీ మేనేజ్మెంట్పై క్రిమినల్ కేసులు నమోదు చేశారన్న వార్తలతో శుక్రవారం ఒక్కరోజే భారీ ట్రేడింగ్ పరిమాణంతో 12 శాతం నష్టపోయి రూ. 5.65 వద్ద ముగిసింది. 2003 తర్వాత షేరు ఈ స్థాయికి పడిపోవడం ఇదే ప్రధమం. నాణ్యతా లోపం లేదు...: నిర్మాణంలో మాత్రం ఎటువంటి నాణ్యతా లోపం లేదని కంపెనీ ప్రతినిధి కె. పాండురంగారావు తెలిపారు. ఫోటోలను బట్టి చూస్తూంటే బాంబు పేళ్లుల్ల వల్ల కూలినట్టుగా కనిపిస్తోందని, దర్యాప్తు పూర్తయితే కానీ ఈ దురదృష్టకర సంఘటనకు గల కారణాలు తెలియవని కంపెనీ న్యాయ సలహాదారు పి.సీత అన్నారు. వంతెన కూలడం విధిరాత అన్నట్లుగా వచ్చిన వార్తలపై యాజమాన్యం మరోసారి వివరణ ఇచ్చింది. ‘‘మా మాటల్లో భావాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. నిర్మాణంలో ఎలాంటి లోపాలూ లేవని, జరిగిన దుర్ఘటన మా చేతుల్లో లేదు అని చెప్పాం. దీన్ని మీడియా తప్పుగా అర్థం చేసుకుంది’’ అని కంపెనీ వివరించింది. -
ఉబెర్‌తో ఎస్బీఐ జట్టు
ముంబై: ప్రభుత్వ దిగ్గజ బ్యాంక్ ఎస్బీఐ తాజాగా ట్యాక్సీ అగ్రిగేటర్ ఉబెర్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఉబెర్ ప్లాట్‌ఫామ్‌లోని ‘డ్రైవర్ పార్ట్నర్స్’కు తక్షణ రుణ సదుపాయం కల్పించడమే ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. డ్రైవర్లకు రుణాలను కేవలం ఒకే రోజులో మంజూరు చేస్తామని, వడ్డీ రేట్లు కూడా అందుబాటు స్థాయిలోనే ఉంటాయని ఎస్బీఐ తెలిపింది. అన్ని రుణాలకు ప్రధాన్ మంత్రి ముద్రా యోజన పథకం వర్తిస్తుందని పేర్కొంది. దేశంలో ట్రాన్స్పోర్ట్ విభాగం మంచి వృద్ధిని నమోదు చేస్తోందని, ఎంట్రప్రెన్యూర్లుగా ఎదగాలని భావిస్తోన్న వారికి ఇది మంచి అవకాశమని ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య తెలిపారు. అలాగే ఎస్బీఐ పదవీ విరమణ చేసిన సైనిక ఉద్యోగులకు ఎంట్రపెన్యూరియల్ అవకాశాలను అందించడమే లక్ష్యంగా ఆర్మీ వెల్ఫేర్ ప్లేస్మెంట్ ఆర్గనైజేషన్‌తో కూడా భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
వాట్సప్‌లో మరో కొత్త ఆప్షన్!
న్యూ ఢిల్లీ: ఇటీవలే ఫేస్బుక్ యాజమాన్యంలోకి మారిన మెసేజింగ్ యాప్ వాట్సప్.. మరింత యూజర్ ఫ్రెండ్లీగా మారేందుకు తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా వారం వ్యవధిలోనే రెండు సరికొత్త అప్డేట్లను వాట్సప్ అందించింది. ఇటీవలే షేర్డ్ లింక్ హిస్టరీ ట్యాబ్‌ను వాట్సప్ పరిచయం చేసిన విషయం తెలిసిందే. తాజాగా పీడీఎఫ్ ఫైళ్లను షేర్ చేసుకునే అవకాశాన్ని వినియోగదారులకు కల్పిస్తోంది. అంతేకాదు ఇతర ఫార్మాట్ల లోని ఫైళ్లను సైతం షేర్ చేసుకునే సదుపాయాన్ని యూజర్లకు అందించడానికి సంస్థ కృషి చేస్తోంది. పీడీఎఫ్ ఫార్మాట్లోని ఫైళ్లను షేర్ చేసుకునే సదుపాయం పొందడానికి వాట్సప్ లేటెస్ట్ వెర్షన్‌ను వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీ చాట్ లాంటి పలు చాట్ యాప్‌లతో నెలకొన్న పోటీ దృష్ట్యా.. పలు కొత్త ఫీచర్లను వాట్సప్ ప్రవేశపెడుతోంది. అందులో భాగంగా ఇటీవల ప్రవేశపెట్టిన నూతన ఎమోజీలలో వివాదాస్పదమైన మిడిల్ ఫింగర్ ఎమోజీని కూడా ప్రవేశపెట్టి వాట్సప్ దూకుడును ప్రదర్శించింది. తమ యూజర్ల సంఖ్య 100 కోట్లకు చేరిందని వాట్సప్ ఓ ప్రకటనలో వెల్లడించింది. -
ఆంధ్రాబ్యాంక్ లో పెరిగిన ఎల్ఐసీ వాటా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బీమా దిగ్గజం ఎల్ఐసీ... ఆంధ్రాబ్యాంక్‌లో తన వాటాను పెంచుకుంది. తాజాగా రూ.136.48 కోట్లు ఇన్వెస్ట్ చేయనుండటంతో షేరు రూ.47.30 చొప్పున 2.88 కోట్ల షేర్లను ఎల్ఐసీకి కేటాయించడానికి శుక్రవారం సమావేశమైన ఆంధ్రా బ్యాంక్ బోర్డ్ ఆఫ్ డెరైక్టర్లు ఆమోదం తెలిపారు. దీనికి మార్చి 21న జరిగే అత్యవసర సమావేశంలో వాటాదారులు ఆమోదం తెలియజేయాల్సి ఉంటుంది. డిసెంబర్ 31 నాటికి ఆంధ్రా బ్యాంక్‌లో ఎల్ఐసీ 4.99 కోట్ల షేర్లతో 7.66 శాతం వాటాను కలిగి ఉంది. దీంతో బ్యాంకులో ఎల్ఐసీ షేర్ల సంఖ్య 7.87 కోట్లు దాటింది. దీన్లో కేంద్ర ప్రభుత్వానికి 63.97% వాటా ఉండగా ఆ తరవాత అత్యధిక వాటా ఉన్నది ఎల్ఐసీకే. ఈ మధ్యనే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి టైర్-1 మూలధనం కింద రూ. 800 కోట్లు సమీకరించింది. శుక్రవారం బీఎస్ఈలో ఆంధ్రా బ్యాంక్ షేరు స్థిరంగా రూ. 46.85 వద్ద ముగిసింది. -
బెల్మండ్ లో కొంత వాటా విక్రయం: ఇండియన్ హోటల్స్
న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌కు చెందిన ఇండియన్ హోటల్స్ కంపెనీ బెల్మండ్ సంస్థలో రూ.82 కోట్ల విలువైన 12.7 లక్షల షేర్లను విక్రయించింది. బెల్మండ్ సంస్థలో ఈ షేర్లను తమ విదేశీ విభాగమైన సంసార ప్రాపర్టీస్ విక్రయించిందని ఇండియన్ హోటల్స్ తెలిపింది. ఈ వాటా విక్రయం ద్వారా లభించిన నిధులను రుణ భారం తగ్గించుకోవడానికి వినియోగించుకుంటామని పేర్కొంది. బెల్మండ్ సంస్థ 23 దేశాల్లో 46 హోటళ్లను, రివర్ క్రూయిజ్, సఫారి, లగ్జరీ రైల్ వ్యాపారాలను నిర్వహిస్తోంది. ఈ షేర్ల విక్రయానంతరం బెల్మండ్ సంస్థలో సంసార ప్రాపర్టీస్‌కు 5.73 శాతం వాటా ఉంటుంది.