Meet World Unluckiest Man Ronald Wayne Who Sold His 10 Pc Share For 800 Dollars In 1976 - Sakshi
Sakshi News home page

ప్రపంచ చరిత్రలో నష్ట జాతకుడు ఇతనే!

Published Fri, Jul 21 2023 6:48 PM | Last Updated on Fri, Jul 21 2023 7:49 PM

Meet World Unluckiest Man Ronald Wayne Who Sold His 10 Pc Share For 800 Dollars In 1976 - Sakshi

ప్రపంచంలో అత్యంత అదృష్టవంతుడు ఎవరో తెలుసా? జపాన్‌కు చెందిన సుటోము యమగుచి. ఎందుకంటే? ఇతను రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో హిరోషిమా, నాగసాకి అణు బాంబు దాడుల నుండి బయటపడిన వ్యక్తి . 

1945 ఆగస్ట్ 6న అమెరికా యుద్ధ విమానం ఎనోలా గే 'లిటిల్ బాయ్' అనే బాంబును హిరోషిమాపై జారవిడిచింది. ఒక్క క్షణంలోనే నగరంలోని రెండున్నర లక్షల జనాభాలో 80 వేల మందిని మృత్యువు బలి తీసుకుంది. సరిగ్గా ఆ బాంబు ప్రదేశం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సుటోము ప్రాణాలతో బయటపడ్డారు. సుటోము యమగచి ఉన్న ప్రాంతంలో ప్రాణాలతో బయపడింది ఇయన ఒక్కరే. జపాన్ ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన ఏకైక వ్యక్తి ఇతడే. అందుకే ఇతను ప్రపంచంలోనే అంత్యంత లక్కీయస్ట్‌ పర్సన్‌గా గుర్తింపు పొందారు. 

మరి ప్రపంచంలో అత్యంత దురదృష్టవంతుడు ఎవరో తెలుసా? రోనాల్డ్ వేన్! వ్యాపార ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు. ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌ మూడవ కో-ఫౌండర్‌. మరి అన్‌ లక్కీయస్ట్‌ పర్సన్‌ ఎందుకో తెలుసా? 290 బిలియన్‌ డాలర్ల షేర్లను కేవలం 800 డాలర్లకే అమ్మాడు. కాబట్టే ఇతనే వరల్డ్‌లోనే అన్‌ లక్కీయస్ట్‌ పర్సన్‌గా అప్రతిష్టను మూటగట్టుకున్నారు.  

సీఎన్‌బీసీ ‘ది ఫిల్తీ రిచ్ గైడ్’ ప్రకారం.. ఏప్రిల్ 1, 1976న కాలిఫోర్నియాలో  స్టీవ్ వోజ్నియాక్ (21), స్టీవ్ జాబ్స్ (25), అనుభవంలోనూ, ఇటు వయస్సుల్లో పెద్దవారైన రోనాల్డ్‌ వేన్‌ (42) ముగ్గురు కలిసి టెక్‌ దిగ్గజం యాపిల్‌ కంపెనీని ప్రారంభించారు.  

అదే రోజు యాపిల్‌ ముగ్గురు వ్యవస్థాపకుల్లో ఒకరైన రోనాల్డ్‌ వేన్‌.. కంపెనీలో ఎవరి బాధ్యతలు ఏంటో తెలుపుతూ ఓ అగ్రిమెంట్‌ రాశారు. దీంతో పాటు యాపిల్‌ ప్రొడక్ట్‌కు సంబంధించిన తొలి లోగోని తయారు చేశారు. ఐజాక్‌ న్యూటన్‌ ఒక చెట్టు కింద యాపిల్ తింటున్న ఫోటోని తయారు చేసింది ఇతనే. ఈ లోగోని ఏడాది కంటే తక్కువ కాలం ఉపయోగించింది యాపిల్‌ సంస్థ. 

ఇక, స్టీవ్ వోజ్నియాక్, స్టీవ్ జాబ్స్,రోనాల్డ్‌ వేన్‌ల భాగస్వామ్యంలో యాపిల్‌ సేవల్ని ప్రారంభించింది. కేవలం 12 రోజుల వ్యవధిలో అమెరికాలోనే తొలి యాపిల్‌ 1 కంప్యూటర్‌ను అమ్మిన కంప్యూటర్‌ రీటైల్‌ సంస్థ ‘బైట్‌ షాప్‌’ తమకు 100 కంప్యూటర్లను తయారు చేసి పెట్టాలంటూ యాపిల్‌కు ఆర్డర్‌ ఇచ్చింది. 

ఆర్డర్‌ రానైతే వచ్చింది. తయారు చేసేందుకు చేతిలో చిల్లిగవ్వలేదు. అప్పుడే కంప్యూటర్ల తయారీకి వినియోగించే పరికరాల కోసం స్టీవ్‌ జాబ్స్‌ 15,000 డాలర్ల లోన్‌ తీసుకున్నారు. నిర్ధేశించిన గడువులోగా స్టీవ్‌ జాబ్స్‌ యాపిల్‌ కంప్యూటర్లను తయారు చేసి ఇచ్చారు. ఒప్పందం ప్రకారం.. కంప్యూటర్లను తయారు చేసి ఇవ్వనైతే ఇచ్చారు. కానీ తయారు చేసిన కంప్యూటర్ల తాలుకు బిల్స్‌ ఆగిపోయాయి.

ఓ వైపు లోన్‌, మరో వైపు బైట్‌ షాప్‌ నుంచి రావాల్సిన డబ్బులు రాలేదు. అందుకే సంస్థలో కొనసాగితే ఎలాంటి పరిణామాలకు దారి తీస‍్తుందోనని బయపడ్డారు రోనాల్డ్‌ వేన్‌. యాపిల్‌ సంస్థ నష్టపోతే యువకులైన వోజ్నియాక్‌, జాబ్స్‌కు ఏమీ కాదు. ఎందుంకటే వాళ్ల చేతిలో ఏమీ లేవు. వేన్‌ అలా కాదే. అప్పటికే ధనవంతుడు. ఆస్తిపాస్తులు బాగానే సంపాదించారు. 

అందుకే తాను యాపిల్‌ సంస్థను వదిలేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటికే యాపిల్‌లో ఉన్న తన 10 శాతం వాటాను కేవలం 800 డాలర్లకు తన సహచరులకు అమ్మారు. ఆ విధంగా యాపిల్‌ సంస్థను విడిచిపెట్టాలని వేన్ తీసుకున్న నిర్ణయం అతనికి పెద్ద నష్టాన్ని మిగిల్చింది. నేడు,యాపిల్‌లో 10 శాతం వాటా విలువ 95 బిలియన్ల కంటే ఎక్కువగా ఉంటుంది. అదే వాటా వేన్‌ను సైతం ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరిగా నిలబెట్టేది. కానీ ఆ నిర్ణయమే ప్రపంచంలోనే అత్యంత అన్‌లక్కియస్ట్‌ పర్సన్‌గా నిలబెట్టింది.  

ఆశ్చర్యకరంగా, వేన్ తన నిర్ణయానికి చింతించలేదని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. యాపిల్‌ సంస్థ అభివృద్ది చెందలేదని, తాను రాబోయే 20 సంవత్సరాల పాటు డాక్యుమెంటేషన్ విభాగంలో విభాగంలో విధులు నిర్వహించాల్సి వచ్చేదని పేర్కొన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.

చదవండి👉 ఆ ఇద్దరు ఉద్యోగుల కోసం.. రెండు కంపెనీల సీఈవోలు పోటీ..రేసులో చివరికి ఎవరు గెలిచారంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement