steve jobs
-
కుంభమేళాపై స్టీవ్ జాబ్స్ లేఖ.. ఎన్ని కోట్లు పలికిందంటే?
ప్రపంచంలోని అతిపెద్ద మతపరమైన కార్యక్రమాలలో.. భారతదేశంలో జరిగే 'మహా కుంభమేళా' (Maha Kumbh Mela) ఒకటి. ఇటీవల ప్రారంభమైన ఈ కార్యక్రమానికి కోట్లాది మంది భక్తులు విచ్చేస్తున్నారు, పవిత్ర సంగమం వద్ద పుణ్యస్థానాలు ఆచరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి దివంగత స్టీవ్ జాబ్స్ భార్య 'లారెన్ పావెల్ జాబ్స్' కూడా వచ్చారు.మహా కుంభమేళాకు వచ్చిన లారెన్ పావెల్ జాబ్స్ తన పేరును 'కమల'గా మార్చుకున్నారు. కాగా ఇప్పుడు ఆపిల్ కో ఫౌండర్ స్టీవ్ జాబ్స్ చేతితో రాసిన ఓ లేఖ (Letter) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 1974లో రాసిన ఈ లేఖలో స్టీవ్ జాబ్స్ కుంభమేళా కోసం భారతదేశాన్ని సందర్శించాలని రాసినట్లు తెలుస్తోంది.50 ఏళ్లకింద స్టీవ్ జాబ్స్ రాసిన ఈ లేఖ బోన్హామ్స్ వేలంలో 500312 డాలర్లు లేదా రూ.4.32 కోట్లుకు పలికింది. ఇది స్టీవ్ జాబ్స్ స్వయంగా రాసిన మొదటి లేఖ కావడం గమనార్హం. ఈ కారణంగానే దీనిని చాలామంది సొంతం చేసుకోవడానికి ప్రయత్నించారు.స్టీవ్ జాబ్స్ 19వ పుట్టిన రోజుకు ఒక రోజు ముందు.. అతని చిన్ననాటి స్నేహితుడు టిమ్ బ్రౌన్కు ఈ లేఖను పంపించారు. ఇందులో ఆయన ఆధ్యాత్మిక, ఆత్మపరిశీలనకు సంబంధించిన చాలా విషయాలను వెల్లడించారు. అంతే కాకుండా బౌద్ధమతాన్ని గురించి ప్రస్తావిస్తూ.. కుంభమేళా కోసం భారతదేశాన్ని సందర్శించాలనే తన ఆకాంక్షను కూడా అందులో వెల్లడించారు.భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ.. తాను చాలా సార్లు ఏడ్చినట్లు లేఖలో పేర్కొన్నారు. ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే కుంభమేళా కోసం నేను భారతదేశానికి వెళ్లాలనుకుంటున్నాను. నేను మార్చిలో ఎప్పుడో బయలుదేరుతాను, కానీ ఇంకా ఖచ్చితంగా తెలియలేదని అందులో ప్రస్తావించారు.స్టీవ్ జాబ్స్ మొదట ఉత్తరాఖండ్‌లోని నీమ్ కరోలి బాబా ఆశ్రమాన్ని సందర్శించాలని అనుకున్నారు. అయితే, నైనిటాల్‌కు చేరుకోగానే, నీమ్ కరోలి బాబా అంతకుముందు సంవత్సరం మరణించినట్లు అతను కనుగొన్నాడు. నిరుత్సాహపడకుండా, జాబ్స్ కైంచి ధామ్‌లోని ఆశ్రమంలో ఉండి, నీమ్ కరోలి బాబా బోధనల నుంచి ఓదార్పు పొందారు. ఆ సమయంలో ఆయన పూర్తిగా ఆధ్యాత్మికతలో మునిగిపోయారు. ఆ తరువాత ఆయనలో చాలా మార్పు వచ్చిందని కూడా చెప్పారు.ఇప్పుడు, స్టీవ్ భార్య లారెన్ పావెల్ జాబ్స్, మహా కుంభమేళా 2025కి హాజరవడం ద్వారా అతని చిరకాల కోరికలలో ఒకదాన్ని నెరవేర్చింది. ఈమె జనవరి 15 వరకు నిరంజినీ అఖారా క్యాంపులోని కుంభ్ టెంట్ సిటీలో ఉండనున్నారు. ఆ తరువాత జనవరి 20న అమెరికాలోనూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించే కార్యక్రమానికి హాజరవుతారు.ఇదీ చదవండి: కుంభమేళాలో స్టీవ్ జాబ్స్ భార్యకు అస్వస్థతఈ కుంభమేళా కారణంగా రాష్ట్ర ఆర్థిక వృద్ధి కూడా భారీగా పెరుగుతుందని చెబుతున్నారు. ఈ కార్యక్రమానికి కేటాయించిన బడ్జెట్ రూ.7,000 కోట్లు కాగా.. రాష్ట్రానికి వచ్చే ఆదాయం రూ. 2 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా. 45 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి వచ్చే సందర్శకులు సగటున రూ. 5,000 ఖర్చు చేస్తే ఏకంగా రూ. 2 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని చెబుతున్నారు. ఈ ఖర్చు రూ.10వేలకు పెరిగితే.. వచ్చే ఆదాయం రూ. 4 లక్షల కోట్లకు చేరుతుంది.Steve Jobs letter to his friend about planning to visit Kumbh Mela in India.The thing to notice here is, he used the word "Shanti" before concluding. pic.twitter.com/s4yN2pupjr— Kartik Jaiswal (@draken73jp) October 24, 2021 -
కుంభమేళాలో స్టీవ్ జాబ్స్ భార్యకు అస్వస్థత
దివంగత యాపిల్ సహ వ్యవస్థాపకుడు 'స్టీవ్ జాబ్' భార్య 'లారెన్ పావెల్ జాబ్స్' ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా 2025కు హాజరయ్యారు. అయితే.. కొత్త వాతావరణం కారణంగా ఆమె అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని నిరంజనీ అఖాడాకు చెందిన మహా మండలేశ్వర్ స్వామి 'కైలాసనంద గిరి మహారాజ్' వెల్లడించారు.లారెన్ పావెల్ జాబ్స్ ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారని, ఆరోగ్యం కుదుటపడిన తరువాత ఆమె త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరిస్తారని కైలాసనంద గిరి మహారాజ్ చెప్పారు. ఇంత రద్దీగా ఉండే ప్రదేశానికి ఆమె ఎప్పుడూ వెళ్లలేదు. అంతే కాకుండా లారెన్ చాలా సాదాసీదాగా ఉంది, పూజా సమయంలో కూడా మాతో పాటు ఉండేవారని ఆయన పేర్కొన్నారు.ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు లారెన్ పావెల్ జాబ్స్ హాజరై.. ఆమె పేరును 'కమల'గా మార్చుకున్నట్లు కైలాసనంద గిరి మహారాజ్ పేర్కొన్నారు. అంతే కాకుండా ఆమె భారతదేశానికి రావడం ఇది రెండోసారి, ఇప్పుడు ధ్యానం చేసుకోవడానికి మన దేశానికి వచ్చినట్లు చెబుతున్నారు.లారెన్ పావెల్ జాబ్స్ జనవరి 15 వరకు నిరంజినీ అఖారా క్యాంపులోని కుంభ్ టెంట్ సిటీలో ఉండనున్నారు. ఆ తరువాత జనవరి 20న అమెరికాలోనూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించే కార్యక్రమానికి హాజరవుతారు.మంగళవారం జరిగే మొదటి అమృత స్నాన్ లేదా పవిత్ర స్నానానికి కనీసం 3-4 కోట్ల మంది ప్రజలు గంగా, యమునా, సరస్వతి నదుల సంగమ ప్రదేశమైన త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానం చేస్తారు. సనాతన ధర్మానికి చెందిన 13 అఖాడాలకు చెందిన సాధువులు ఒక్కొక్కరుగా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు.మహా కుంభమేళా అనేది ప్రపంచంలోని అతిపెద్ద, అత్యంత ముఖ్యమైన మతపరమైన సమ్మేళనాలలో ఒకటి. ఇది ఫిబ్రవరి 26 వరకు జరుగుతుంది. దీనికి సుమారు 40 కోట్ల మందికిపైగా ప్రజలు వచ్చే అవకాశం ఉందని సమాచారం. కుంభమేళా ప్రారంభమైన మొదటిరోజే.. 50 లక్షల మందికి పైగా ప్రజలు మొదటి పవిత్ర స్నానం చేశారు.రూ.2 లక్షల కోట్ల ఆదాయంఈ కుంభమేళా కారణంగా రాష్ట్ర ఆర్థిక వృద్ధి కూడా భారీగా పెరుగుతుందని చెబుతున్నారు. ఈ కార్యక్రమానికి కేటాయించిన బడ్జెట్ రూ.7,000 కోట్లు కాగా.. రాష్ట్రానికి వచ్చే ఆదాయం రూ. 2 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా. 45 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి వచ్చే సందర్శకులు సగటున రూ. 5,000 ఖర్చు చేస్తే ఏకంగా రూ. 2 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని చెబుతున్నారు. ఈ ఖర్చు రూ.10వేలకు పెరిగితే.. వచ్చే ఆదాయం రూ. 4 లక్షల కోట్లకు చేరుతుంది.2019లో జరిగిన ప్రయాగ్‌రాజ్ అర్ధ కుంభమేళా సమయంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు 1.2 లక్షల కోట్ల రూపాయలు వచ్చిందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. ఆ సమయంలో 24 కోట్లమంది కుంభమేళా సందర్శించారని పేర్కొన్నారు. అంతే కాకుండా ఈ కార్యక్రమ సంస్కృతుల సంగమం అని.. భిన్నత్వంలో ఏకత్వ సందేశంగా అభివర్ణించారు. -
Maha Kumbh 2025: ప్రయాగ్‌రాజ్‌కు స్టీవ్ జాబ్స్ సతీమణి
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో రేపటి (జనవరి 13) నుంచి కుంభమేళా జరగనుంది. ఈ మేళాకు భారీ ఎత్తున స్వామీజీలు, ప్రముఖులు, భక్తులు హాజరుకానున్నారు. ఆపిల్ సహ వ్యవస్థాపకులు స్టీవ్ జాబ్స్ (Apple co-founder Steve Jobs) భార్య, ప్రపంచంలోని అత్యంత ధనవంతురాలైన మహిళల్లో ఒకరైన లారెన్ పావెల్ కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రయాగ్‌రాజ్‌కు తరలిరానున్నారు. ఈ సమాచారాన్ని ఆధ్యాత్మిక గురువు స్వామి కైలాశానంద జీ తెలిపారు.స్వామి కైలాసానంద(Swami Kailasananda) మీడియాతో మాట్లాడుతూ ‘లారెన్ మా గురువును కలవడానికి వస్తున్నారు. ఆమె నా కూతురు లాంటిది. మేము ఆమెకు మా గోత్రాన్ని కూడా ఇచ్చి, కమల అని పేరు పెట్టాం. ఆమె భారతదేశానికి రావడం ఇది రెండోసారి. మహా కుంభమేళాకు అందరికీ స్వాగతం. ఆమె మూడు నాలుగు రోజులు ఇక్కడ ఉంటారు. ఆమె మహా కుంభమేళాకు వచ్చి, సాధువులను కలుసుకుని, మన సంప్రదాయాలను పాటిస్తారు.ప్రపంచంలోని చాలా మంది ఏదో ఒక గురువు మార్గదర్శకత్వంలో ముందుకుసాగుతున్నారు. ఈ నేపధ్యంలో చాలా మంది కుంభమేళాకు తరలి వస్తున్నారు. ఇది ఒక మతపరమైన ఉత్సవం. ప్రపంచం నలుమూలల నుండి భారతదేశానికి తరలివస్తున్నారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం వ్యాపారవేత్త లారెన్ 17 రోజుల పాటు భారత్‌లో ఉండనున్నారు. ఈ సమయంలో ఆమె సాధువుల మధ్య సాధారణ జీవితాన్ని గడుపుతారు. ఆమె భర్త స్టీవ్ లాగే, లారెన్‌కు కూడా హిందూ, బౌద్ధమతాలతో ప్రత్యేక అనుబంధం ఏర్పరుచుకున్నారు.లారెన్ జనవరి 13న ప్రయాగ్‌రాజ్(Prayagraj)కు చేరుకోనున్నారు. లారెన్ పావెల్, ఆమె కుటుంబం ఫోర్బ్స్ ప్రకటించిన ప్రపంచ బిలియనీర్ల వార్షిక జాబితాలో 59వ స్థానంలో ఉన్నారు. టైమ్స్ మ్యాగజైన్ ఆమెను ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన మహిళల జాబితాలో చేర్చింది. ఆమె జనవరి 29 వరకు నిరంజని అఖాడాకు చెందిన ఆచార్య మహామండలేశ్వర్ స్వామి ఆశ్రమంలో బసచేయనున్నారు. ఇది కూడా చదవండి: Delhi Elections: బీజేపీ రెండవ జాబితా విడుదల -
జీవిత పాఠాలు నేర్పిన గురువులు
మీలో ఆశలు రేకిత్తించి వాటిని సాధించేందుకు ఓదారి చూపే ప్రతి వ్యక్తి గురువే. అలా అందరి జీవితాల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామంది గురువులు తారసపడుతారు. అలాంటి వారి సలహాలు, సూచనలు సామాజికంగా, ఆర్థికంగా ఎదిగేందుకు ఉపయోగపడుతాయి. అలా గురువుల సాయంతో కొందరు వ్యాపారాల్లో స్థిరపడి మరెందరికో ఉపాధి కల్పిస్తున్నారు. అలాంటి వ్యాపార దిగ్గజాలు తమ గురువుల గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. అవేంటో తెలుసుకుందాం.వారెన్బఫెట్జీవితంలో కష్టనష్టాలు వారెన్బఫెట్కి అనేక పాఠాలు నేర్పాయి. తన తండ్రి హోవార్డ్ బఫెట్, కోచ్ బెంజమిన్ గ్రాహం, భార్య సుసాన్ బఫెట్ నుంచి ఎన్నో ఆర్థికపాఠాలు నేర్చుకున్నట్లు ఆయన చెప్పారు. సొంతంగా డబ్బు సంపాదించడం ఎలాగో తన తండ్రి నుంచి నేర్చుకున్నట్లు తెలిపారు. పెట్టుబడి నిర్వహణకు సంబంధించిన ఎన్నో విషయాలు ఆయన నేర్పించారని పేర్కొన్నారు.బిల్గేట్స్మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్ తనకు వారెన్‌బఫెట్ ఎన్నో విషయాల్లో మార్గనిర్దేశం చేశారని చెప్పారు. హార్వర్డ్ యూనివర్సిటీలో మధ్యలో చదువు మానేసిన తర్వాత క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నానని తెలిపారు. ఆ సమయంలో వారెన్‌బఫెట్ దీర్ఘకాల లక్ష్యాలతో డబ్బు ఎలా సంపాదించాలో నేర్పించినట్లు చెప్పారు.జెఫ్బెజోస్అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్‌బెజోస్ వారెన్‌బఫెట్, జేపీ మోర్గాన్ ఛైర్మన్ జామీ డిమోన్, డిస్నీ సీఈఓ బాబ్ ఇగర్లను తన గురువులుగా భావిస్తున్నట్లు చెప్పారు. వారెన్‌బఫెట్ తన పుస్తకాల్లో ఎన్నో విషయాలు పంచుకుంటారని, దాదాపు అన్నింటిని చదవడానికి ఇష్టపడతానని బెజోస్ అన్నారు. సంక్షిష్టమైన కంపెనీ ద్వారా పెట్టుబడి పెడుతూ డబ్బు ఎలా సంపాదించాలో డిమోన్ను చూసి నేర్చుకోవాలన్నారు. దీర్ఘకాలిక లక్ష్యాలను ఎలా నెరవేర్చుకోవాలో ఇగర్ ద్వారా తెలుసుకున్నానని చెప్పారు.ఇలాన్మస్క్ఎక్స్(ట్విటర్), టెస్లా, స్పేస్ఎక్స్ వంటి కంపెనీల అధినేత ఇలాన్‌మస్క్ స్పేస్ఎక్స్ బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ జిమ్ కాంట్రెల్‌ను గురువుగా భావిస్తారు. మస్క్ కంపెనీలో పనిచేస్తున్న ఉన్నతాధికారులకు కాంట్రెల్ మెంటార్‌గా వ్యవహరిస్తున్నారు. యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్‌జాబ్స్ పుస్తకాలు ఇప్పటికీ చదువుతున్నట్లు మస్క్ చెప్పారు. అవి తనకు మార్గదర్శకాలుగా పనిచేస్తాయని వివరించారు. బెంజమిన్ ఫ్రాంక్లిన్, నికోలా టెస్లా, థామస్ ఎడిసన్, ఐసాక్ న్యూటన్, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ పుస్తకాలు ఎంతో ప్రేరణ ఇస్తాయన్నారు.ఇదీ చదవండి: 2.75 లక్షల ఫోన్ నంబర్లకు చెక్‌మార్క్ జుకర్బర్గ్మెటా వ్యవస్థాపకులు మార్క్ జుకర్‌బర్గ్ యాపిల్ వ్యవస్థాపకులు స్టీవ్ జాబ్స్‌ను ఎంతో ఆరాధించేవారు. మేనేజ్మెంట్ నిర్వహణతోపాటు కంపెనీకి ప్రత్యేకంగా బ్రాండింగ్ ఎలా తీసుకురావాలో స్టీవ్ దగ్గరి నుంచి నేర్చుకున్నట్లు మార్క్ తెలిపారు. -
స్టీవ్ జాబ్స్, బిల్ గేట్స్ రెజ్యూమ్స్: ఫోటోలు చూశారా?
యాపిల్ కో-ఫౌండర్ స్టీవ్ జాబ్స్, మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్ రెజ్యూమ్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని వారు 18ఏళ్ల వయసులో ఉన్నప్పుడు క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. టెక్ ప్రపంచంలో ఎవరికివారే అన్నట్టు ఎదిగిన వీరి రెజ్యూమ్స్ ఇక్కడ చూడవచ్చు.స్టీవ్ జాబ్స్ రెజ్యూమ్ ప్రకారం, ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీపై మక్కువ ఉందని తెలుస్తోంది. ఇది 1973లో రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందులో తనకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉందని ప్రస్తావించారు.ఇక బిల్ గేట్స్ రెజ్యూమ్ గమనిస్తే.. ఇది 1971లో క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో కోబాల్ట్, బేసిక్, పీడీపీ-10, పీడీపీ-8, సీడీసీ-6400 వంటి కంప్యూటర్లతో సహా వివిధ ప్రోగ్రామింగ్ భాషలలో తనకు అనుభవం ఉన్నట్లు వెల్లడించారు. అందులోనే తన జీతం అప్పట్లో 15000 డాలర్లుగా ప్రస్తావించారు. 970లలో ఒక విద్యార్థికి ఇది చాలా ఎక్కువ శాలరీ అనే చెప్పాలి.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ రెజ్యూమ్స్ ఎంతోమంది నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. దీనిపైన కొంతమంది తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు.Steve Jobs and Bill Gates’ resumes at age 18: pic.twitter.com/tFTltp80jM— Jon Erlichman (@JonErlichman) August 27, 2024 -
యాపిల్ ఉత్పత్తులు.. ఆసక్తికర అంశాలు (ఫొటోలు)
-
యాపిల్ కంప్యూటర్ దశాబ్దాల చరిత్ర - విస్తుపోయే ఆసక్తికర విషయాలు (ఫోటోలు)
-
ఇప్పటికీ తన విధానమే పాటిస్తున్నాం..: బిల్‌గేట్స్
యాపిల్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో స్టీవ్ జాబ్స్‌కు టెక్ ప్రపంచంలో ఎల్లప్పుడూ ప్రత్యేకస్థానం ఉంటుంది. కంపెనీ సమావేశాలు ఏర్పాటు చేసినా, కొత్త ఉత్పత్తులు విడుదలైనా ఆయన చేసే ప్రసంగం, తన వ్యవహారశైలి అందరినీ కట్టిపడేసేది. తాజాగా ఇదే విషయాన్ని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వెల్లడించారు. బహిరంగ వేదికలపై స్టీవ్ జాబ్స్‌లా తాను వ్యవహరించలేనని, ఆయన చాలా సహజంగా ప్రవర్తిస్తూ ఎదుటి వారిని తన మాటలతో ఆకట్లుకునేవారని గేట్స్ ఓ పాడ్‌కాస్ట్‌లో తెలిపారు. ఈ సందర్భంగా బిల్‌గేట్స్ మాట్లాడుతూ.. ‘స్టీవ్ జాబ్స్ చాలా సహజంగా ఉంటారు. స్టేజ్‌పై మాట్లాడటానికి ముందు ఆయన రిహార్సల్స్ చూడటం ఎంతో సరదాగా ఉంటుంది. కొన్నిసార్లు వేదికపై మాట్లాడుతుంటే అప్పటికప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లు అనిపిస్తుంది. ఆ స్థాయిని నేను ఎప్పటికీ అందుకోలేను. మైక్రోసాఫ్ట్ ప్రారంభించిన తొలి నాళ్లలో వాటి ఉత్పత్తుల గురించి వివిధ రకాల వ్యక్తులకు వివరించడమే కీలక ప్రక్రియగా ఉండేది. విద్య, వైద్యం, ఏఐకి సంబంధించి మైక్రోసాఫ్ట్ ఉత్పత్తుల గురించి అభిప్రాయ సేకరణ కోసం ఇప్పటికీ కొన్నిసార్లు స్టీవ్ జాబ్స్ అనుసరించే కమ్యూనికేషన్ విధానాన్నే పాటిస్తున్నాం’ అని చెప్పారు. కంపెనీకి సంబంధించి నూతన ఉత్పత్తుల విడుదలతో పాటు, ఇతర సమావేశాల్లో ప్రసంగించేందుకు స్టీవ్ చాలా రోజుల ముందు నుంచి సిద్ధమయ్యేవారట. ఈ విషయాన్ని 2015లో విడుదలైన ‘బికమింగ్ స్టీవ్ జాబ్స్’ అనే పుస్తకంలో రచయితలు బ్రెంట్ ష్లెండర్, రిక్ టెట్జెలీలు వెల్లడించారు. తామా గతంలో ఒక రోజంతా స్టీవ్ జాబ్స్‌తో ఉన్నామని పుస్తకంలో తెలిపారు. ఇదీ చదవండి: క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? కీలక మార్పులు చేసిన బ్యాంకులు చిన్న ప్రజెంటేషన్ కోసం ఆయన ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని, స్లైడ్స్‌కు ఎలాంటి రంగులు వాడాలి? స్టేజ్‌పై తన వ్యవహారశైలి ఎలా ఉండాలి? ఎక్కడ స్పాట్ లైట్ పడాలి? ఇలా ప్రతి విషయంలో ఎంతో ప్రణాళికతో వ్యవహరించేవారని వివరించారు. -
సొంత కంపెనీల్లోనే ఉద్యోగాలు కోల్పోయిన సీఈవోలు వీరే!
ఇటీవల ఓపెన్ఏఐ కంపెనీ తన సీఈఓ 'శామ్ ఆల్ట్‌మన్'ను పదవి నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ వార్త టెక్ ప్రపంచంలో పెద్ద చర్చలకు దారి తీసింది. సీఈఓ జాబ్ కూడా గ్యారెంటీ కాదని కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. 2022లో 969 మంది సీఈఓలు తమ ఉద్యోగాలకు రాజీనామా చేయగా.. ఈ ఏడాది మొదటి తొమ్మిది ఈ సంఖ్య 1425 కు చేరింది. వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ (World of Statistics) ప్రకారం, తాము నెలకొల్పిన సంస్థల నుంచి తమ సీఈఓ పదవులు కోల్పోయిన వారు ఎవరనేది ఈ కథనంలో తెలుసుకుందాం. స్టీవ్ జాబ్స్ (Steve Jobs) యాపిల్ కంపెనీ కో ఫౌండర్, సీఈఓ స్టీవ్ జాబ్స్ ఒకప్పుడు ఆ కంపెనీలోనే తన సీఈఓ జాబ్ కోల్పోయిన సంగతి బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. సంస్థ ప్రారంభమైనప్పుడు అతని వయసు 21 సంవత్సరాలు మాత్రమే, అయితే ఆ కంపెనీ స్థాపించిన సుమారు 9 సంవత్సరాలకు కంపెనీ బోర్డు సీఈఓగా తొలగించి, ఆ స్థానంలో జాన్ స్కూల్లేను నియమించింది. ఆ తరువాత 1997లో స్టీవ్ జాబ్స్ సీఈఓగా బాధ్యతలు చేపట్టాడు. ఈయన 2011లో అనారోగ్య కారణాల వల్ల కన్నుమూశాడు. ప్రస్తుతం ఈ స్థానంలో 'టిమ్ కుక్' ఉన్నారు. అంకితి బోస్ (Ankiti Bose) జిలింగో కో-ఫౌండర్, సీఈఓ అంకితి బోస్ కొన్ని ఆర్ధిక అవకతవకల దర్యాప్తు కారణంగా 2022లో సీఈఓగా తొలగించారు. బోర్డు ఆమోదం లేకుండానే.. ఆమె జీతం దాదాపు 10 రెట్లు పెరగటం కారణంగా సీఈఓగా తొలగించినట్లు తెలుస్తోంది. అప్పట్లో ఈ వార్త టెక్ ప్రపంచంలో పెద్ద సంచలనంగా మారింది. పరాగ్ అగర్వాల్ (Parag Agrawal) ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఎక్స్ (ట్విటర్) సంస్థను కొనుగోలు చేసిన తరువాత కంపెనీలో చాలామంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించారు. 2021లో సీఈఓగా ఎంపికైన పరాగ్ అగర్వాల్ ఆ సమయంలో కంపెనీని విడిచిపెట్టిన మొదటి వ్యక్తి. విధుల నుంచి తొలగించినందుకు నష్టపరిహారంగా పరాగ్ అగర్వాల్ దాదాపు 40 మిలియన్ల డాలర్ల భారీ మొత్తాన్ని అందుకున్నట్లు సమాచారం. ఫనీష్ మూర్తి (Phaneesh Murthy) ప్రముఖ ఐటీ సంస్థ 'ఐగేట్' (iGate) ప్రెసిడెంట్, సీఈఓ ఫనీష్ మూర్తికి తన సహోద్యోగితో సంబంధం ఉందనే కారణంగా తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. అరాసెలి రోయిజ్ అనే ఉద్యోగి లైంగిక వేధింపుల దావా వేసినప్పుడు విచారణంలో దోషిగా తేలడం వల్ల ఈయన సీఈఓగా తొలగించారు. ఈయన ఇన్ఫోసిస్‌లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఆరోపణలే ఎదుర్కొన్నట్లు సమాచారం. జాక్ డోర్సే (Jack Dorsey) 2006లో ప్రారంభమైన మైక్రోబ్లాగింగ్ స్టార్టప్ ట్విటర్ కో-ఫౌండర్ అండ్ సీఈఓ 'జాక్ డోర్సే' 2008లో కొన్ని కారణాల వల్ల తన పదవి కోల్పోయాడు. ఆ తరువాత ఆయన స్థానంలోకి పరాగ్ అగర్వాల్ నియమితుడై సీఈఓ బాధ్యతలు చేపట్టారు. శామ్ ఆల్ట్మాన్ (Sam Altman) సంస్థలో జరుగుతున్న అంతర్గత చర్చల్లో నిజాయతీ పాటించడం లేదని, బోర్డు తీసుకునే నిర్ణయాలకు అతడు అడ్డుపడుతున్నాడని.. ఓపెన్ఏఐకి నాయకత్వం వహించే అతడి సామర్థ్యంపై బోర్డు నమ్మకం కోల్పోయిందనే కారణంగా 'ఓపెన్ఏఐ' (OpenAI) 'శామ్ ఆల్ట్‌మన్'ను సీఈఓ పదవి నుంచి తొలగించింది. ఇదీ చదవండి: ఆ రెండు కార్ల ఖరీదే రూ.20 కోట్లు - అట్లుంటది అంబానీ ఫ్యామిలీ అంటే.. తమ కంపెనీలలోనే సీఈఓ పదవి కోల్పోయిన వ్యక్తుల జాబితాలో యాహూ సీఈఓ కరోల్ బార్ట్జ్ (2011), హెచ్‌టీసీ సీఈఓ పీటర్ చౌ (2015), తైవాన్‌కు కంప్యూటర్ కంపెనీ ఏసర్ సీఈఓ జియాన్ఫ్రాంకో లాన్సి (2011), విప్రో జాయింట్ సీఈఓలు గిరీష్ పరంజ్పే & సురేష్ వాస్వానీ (2011), మైక్రోసాఫ్ట్ సీఈఓ స్టీఫెన్ ఎలోప్, హెచ్‌పీ సీఈఓ మార్క్ హర్డ్ (2010) ఉన్నారు. -
టెక్ దిగ్గజం యాపిల్ కో-ఫౌండర్‌కి గుండెపోటు!
వోజ్నియాక్ గుండెపోటుకు గురవ్వడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నెటిజన్లు యాపిల్ కో-ఫౌండర్ గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా వోజ్నియాక్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ➤వోజ్‌గా సుపరిచితులైన వోజ్నియాక్ 1976లో టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. మరో యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ స్టీవ్‌జాబ్స్‌తో కలిసి వోజ్నియాక్ తొలి యాపిల్ కంప్యూటర్ను తయారు చేశారు. ➤ యాపిల్ కంప్యూటర్ 2 డిజైనింగ్‌లో వోజ్నియాక్ ప్రముఖ పాత్ర పోషించారు. అదే కంప్యూటర్.. పర్సనల్ కంప్యూటర్ల విభాగంలో సరికొత్త రెవెల్యూషన్‌ను క్రియేట్ చేసింది. ఇంజినీరింగ్ ఇన్నోవేషన్స్‌తో యాపిల్‌ను ప్రపంచంలో నెంబర్ వన్ టెక్ కంపెనీగా అవతరించేలా కృషి చేశారు. ➤ అయినప్పటికీ 1985లో వోజ్నియాక్ యాపిల్ సంస్థ నుంచి బయటకు వచ్చారు. పర్సనల్ కంప్యూటర్ టెక్నాలజీ తన దృష్టికి అనుగుణంగా లేదని భావించారు. ఆ తర్వాత మొదటి యూనివర్సల్ రిమోట్ కంట్రోల్‌ను అభివృద్ధి చేసిన సీఎల్ 9 ని స్థాపించడంతో పాటు సహా కొత్త వెంచర్లను ప్రారంభించారు. ➤ వోజ్నియాక్ టెక్నాలజీ అండ్ ఇంజినీరింగ్ విభాగాల్లో విశేషమైన కృషి చేసినందుకు గాను 11 డాక్టరేట్లు సొంతం చేసుకున్నారు. ➤ కాలేజీ చదివే రోజుల్లో యాపిల్ కో-ఫౌండర్‌కి క్రీమ్ సోడా అంటే మహా ప్రీతి. అందుకే దాని పేరుమీద ‘క్రీమ్ సోడా కంప్యూటర్’ పేరుతో ఓ కంప్యూటర్ను తయారు చేశారు. ఆ కంప్యూటర్‌కి కీబోర్డ్, స్క్రీన్లు ఉండవు. పంచ్ కార్డ్ ప్రోగ్రామ్‌తో దీనిని ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. ఇదే క్రీమ్ సోడా కంప్యూటర్ యాపిల్ తన తొలి యాపిల్ కంప్యూటర్ను విడుదల చేయడానికి కారణమైంది. ➤ 1981లో స్వల్ప విమాన ప్రమాదం జరిగింది. ప్రమాదంతో సదరు విమానంలో ఉన్న వోజ్నియాక్ మతి స్థిమితం కోల్పోయారు. తర్వాత కొన్ని వారాలకు మళ్లీ సాధారణ స్థితికి చేరుకున్నారు. మతి మరుపుతో విమన ప్రమాదం జరగడం, మతి స్థిమితం కోల్పోవడం గురించి మరిచిపోయినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. -
రహస్యాలన్నీ బట్టబయలు.. ఎలాన్ మస్క్ బయోగ్రఫీలో ఏమేం ఉంటాయంటే
అపరకుబేరుడు ఎలాన్ మస్క్ బయోగ్రఫీ కాపీలు హాట్ కేకుల్లో అమ్ముడు పోతున్నాయి. ‘ఎలాన్ మస్క్’ పేరుతో విడుదలైన మస్క్ బయోగ్రఫీ కాపీలు కేవలం వారం రోజుల వ్యవధిలోనే 92,560 అమ్ముడుపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా బయోగ్రఫీ పుస్తకాలు ఎన్ని అమ్ముడు పోయాయో సిర్కానా అనే మీడియా సంస్థ ట్రాక్ చేస్తుంది. ఆ కంపెనీ అందించిన సమాచారం మేరకు విడుదలైన వారంలో ఎక్కువ మొత్తంలో అమ్ముడు పోయిన పుస్తకాల్లో మొదటిది యాపిల్ కో- ఫౌండర్ స్టీవ్ జాబ్స్ బయోగ్రఫీ కాగా.. రెండోది ఎలాన్ మస్క్ బయోగ్రఫీయేనని సిర్కానా వెల్లడించింది. వారంలోనే అన్ని పుస్తకాల ప్రొఫెసర్, ఆథర్, ప్రముఖ మీడియా సంస్థ సీఎన్ఎన్ మాజీ సీఈవో వాల్టర్ సెఫ్ ఐజాక్సన్ (Walter Seff Isaacson) యాపిల్ కోఫౌండర్ స్టీవ్ జాబ్స్ బయోగ్రఫీని రాశారు. అయితే, అక్టోబర్ 5, 2011లో స్టీవ్ జాబ్స్ మరణించిన వారం రోజుల తర్వాత ఆ పుస్తకాన్ని విడుదల చేశారు. విడుదలైన వారం రోజుల్లో 3,83,000 కాపీలు అమ్ముడుపోయాయి. మస్క్ బయోగ్రఫీ కోసం రెండేళ్ల సమయం వాల్టర్ మస్క్ బయోగ్రఫీ రాసేందుకు సుమారు రెండేళ్ల పాటు శ్రమించారు. మస్క్ అటెండ్ అయ్యే సమావేశాలు. ఇచ్చిన ఇంటర్వ్యూలు, కుటుంబ సభ్యుల్ని, స్నేహితుల్ని, మస్క్ అనుచరుల్ని, సలహాదారుల్ని ఇలా అందరి నుంచి సమాచారం సేకరించి బుక్ రాశారు. ఎలాన్ మస్క్ బయోగ్రఫీ బుక్ ఎప్పుడు విడుదలైంది? Walter Isaacson's biography of Elon Musk sold 92,560 copies in its first week on sale! 📚 pic.twitter.com/WkfgtByzp6 — Dima Zeniuk (@DimaZeniuk) September 22, 2023 ఎలాన్ మస్క్ బయోగ్రఫీని వాల్టర్ ఐజాక్సన్ రాశారు. సెప్టెంబర్ 12,2023న విడుదల చేశారు. మస్క్ బయోగ్రఫీ బుక్‌లో ఏముంటుంది? ఎలాన్ మస్క్! ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. అలాంటి టార్చ్ బేరర్ బాల్యం, బాధలు, కష్టాలు, కన్నీళ్లు, పలువురి మహిళలతో నెరిపిన సంబంధాలు, తన తండ్రి ఎర్రోల్ మస్క్‌తో ఉన్న అనుబంధాలతో సహా బిలియనీర్ జీవితంలోని అనేక కోణాలను వెల్లడించింది. పలు నివేదికల ప్రకారం.. మస్క్ గర్ల్ ఫ్రెండ్లు, మాజీ భార్యలు, మాజీ గర్ల్‌ఫ్రెండ్‌లు, పలువురి మహిళలతో సంతానం వంటి అనేక కొత్త విషయాలు మస్క్ జీవిత చరిత్రలో ఉన్నట్లు తేలింది. దీంతో పాటు టెస్లా కార్ల షేర్ల తగ్గింపు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపుకుడు బిల్‌గేట్స్‌తో వాగ్వాదం గురించి బయోగ్రఫీలో రాశారు. వాల్టర్ ఇప్పటికే వాల్టర్ ఇప్పటికే రాసిన ఐన్‌స్టీన్, బెంజిమన్ ఫ్రాంక్లిన్ పుస్తకాలు ఎక్కువగా అమ్ముడు పోయిన జాబితాలో నిలిచాయి. బయోగ్రఫీపై ఎలాన్ మస్క్ స్పందన Cool, although it’s kinda weird seeing so many close-up pics of my face 😂 — Elon Musk (@elonmusk) September 22, 2023 తన బయోగ్రఫీ కాపీలు ఊహించని విధంగా అమ్ముడుపోవడంపై మస్క్ స్పందించారు. ‘క్లోజప్‌లో నా ఫోటోలు చూడటానికి విచిత్రంగా ఉన్నప్పటికి చాలా బాగుంది అంటూ’ చమత్కరించారు. -
ప్రపంచ చరిత్రలో నష్ట జాతకుడు ఇతనే!
ప్రపంచంలో అత్యంత అదృష్టవంతుడు ఎవరో తెలుసా? జపాన్‌కు చెందిన సుటోము యమగుచి. ఎందుకంటే? ఇతను రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో హిరోషిమా, నాగసాకి అణు బాంబు దాడుల నుండి బయటపడిన వ్యక్తి . 1945 ఆగస్ట్ 6న అమెరికా యుద్ధ విమానం ఎనోలా గే 'లిటిల్ బాయ్' అనే బాంబును హిరోషిమాపై జారవిడిచింది. ఒక్క క్షణంలోనే నగరంలోని రెండున్నర లక్షల జనాభాలో 80 వేల మందిని మృత్యువు బలి తీసుకుంది. సరిగ్గా ఆ బాంబు ప్రదేశం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సుటోము ప్రాణాలతో బయటపడ్డారు. సుటోము యమగచి ఉన్న ప్రాంతంలో ప్రాణాలతో బయపడింది ఇయన ఒక్కరే. జపాన్ ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన ఏకైక వ్యక్తి ఇతడే. అందుకే ఇతను ప్రపంచంలోనే అంత్యంత లక్కీయస్ట్ పర్సన్‌గా గుర్తింపు పొందారు. మరి ప్రపంచంలో అత్యంత దురదృష్టవంతుడు ఎవరో తెలుసా? రోనాల్డ్ వేన్! వ్యాపార ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు. ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ మూడవ కో-ఫౌండర్. మరి అన్ లక్కీయస్ట్ పర్సన్ ఎందుకో తెలుసా? 290 బిలియన్ డాలర్ల షేర్లను కేవలం 800 డాలర్లకే అమ్మాడు. కాబట్టే ఇతనే వరల్డ్‌లోనే అన్ లక్కీయస్ట్ పర్సన్‌గా అప్రతిష్టను మూటగట్టుకున్నారు. సీఎన్‌బీసీ ‘ది ఫిల్తీ రిచ్ గైడ్’ ప్రకారం.. ఏప్రిల్ 1, 1976న కాలిఫోర్నియాలో స్టీవ్ వోజ్నియాక్ (21), స్టీవ్ జాబ్స్ (25), అనుభవంలోనూ, ఇటు వయస్సుల్లో పెద్దవారైన రోనాల్డ్ వేన్ (42) ముగ్గురు కలిసి టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీని ప్రారంభించారు. అదే రోజు యాపిల్ ముగ్గురు వ్యవస్థాపకుల్లో ఒకరైన రోనాల్డ్ వేన్.. కంపెనీలో ఎవరి బాధ్యతలు ఏంటో తెలుపుతూ ఓ అగ్రిమెంట్ రాశారు. దీంతో పాటు యాపిల్ ప్రొడక్ట్‌కు సంబంధించిన తొలి లోగోని తయారు చేశారు. ఐజాక్ న్యూటన్ ఒక చెట్టు కింద యాపిల్ తింటున్న ఫోటోని తయారు చేసింది ఇతనే. ఈ లోగోని ఏడాది కంటే తక్కువ కాలం ఉపయోగించింది యాపిల్ సంస్థ. ఇక, స్టీవ్ వోజ్నియాక్, స్టీవ్ జాబ్స్,రోనాల్డ్ వేన్ల భాగస్వామ్యంలో యాపిల్ సేవల్ని ప్రారంభించింది. కేవలం 12 రోజుల వ్యవధిలో అమెరికాలోనే తొలి యాపిల్ 1 కంప్యూటర్ను అమ్మిన కంప్యూటర్ రీటైల్ సంస్థ ‘బైట్ షాప్’ తమకు 100 కంప్యూటర్లను తయారు చేసి పెట్టాలంటూ యాపిల్‌కు ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ రానైతే వచ్చింది. తయారు చేసేందుకు చేతిలో చిల్లిగవ్వలేదు. అప్పుడే కంప్యూటర్ల తయారీకి వినియోగించే పరికరాల కోసం స్టీవ్ జాబ్స్ 15,000 డాలర్ల లోన్ తీసుకున్నారు. నిర్ధేశించిన గడువులోగా స్టీవ్ జాబ్స్ యాపిల్ కంప్యూటర్లను తయారు చేసి ఇచ్చారు. ఒప్పందం ప్రకారం.. కంప్యూటర్లను తయారు చేసి ఇవ్వనైతే ఇచ్చారు. కానీ తయారు చేసిన కంప్యూటర్ల తాలుకు బిల్స్ ఆగిపోయాయి. ఓ వైపు లోన్, మరో వైపు బైట్ షాప్ నుంచి రావాల్సిన డబ్బులు రాలేదు. అందుకే సంస్థలో కొనసాగితే ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనని బయపడ్డారు రోనాల్డ్ వేన్. యాపిల్ సంస్థ నష్టపోతే యువకులైన వోజ్నియాక్, జాబ్స్‌కు ఏమీ కాదు. ఎందుంకటే వాళ్ల చేతిలో ఏమీ లేవు. వేన్ అలా కాదే. అప్పటికే ధనవంతుడు. ఆస్తిపాస్తులు బాగానే సంపాదించారు. అందుకే తాను యాపిల్ సంస్థను వదిలేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటికే యాపిల్‌లో ఉన్న తన 10 శాతం వాటాను కేవలం 800 డాలర్లకు తన సహచరులకు అమ్మారు. ఆ విధంగా యాపిల్ సంస్థను విడిచిపెట్టాలని వేన్ తీసుకున్న నిర్ణయం అతనికి పెద్ద నష్టాన్ని మిగిల్చింది. నేడు,యాపిల్‌లో 10 శాతం వాటా విలువ 95 బిలియన్ల కంటే ఎక్కువగా ఉంటుంది. అదే వాటా వేన్ను సైతం ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరిగా నిలబెట్టేది. కానీ ఆ నిర్ణయమే ప్రపంచంలోనే అత్యంత అన్లక్కియస్ట్ పర్సన్‌గా నిలబెట్టింది. ఆశ్చర్యకరంగా, వేన్ తన నిర్ణయానికి చింతించలేదని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. యాపిల్ సంస్థ అభివృద్ది చెందలేదని, తాను రాబోయే 20 సంవత్సరాల పాటు డాక్యుమెంటేషన్ విభాగంలో విభాగంలో విధులు నిర్వహించాల్సి వచ్చేదని పేర్కొన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. చదవండి👉 ఆ ఇద్దరు ఉద్యోగుల కోసం.. రెండు కంపెనీల సీఈవోలు పోటీ..రేసులో చివరికి ఎవరు గెలిచారంటే? -
ఐఫోన్ 14పై స్టీవ్ జాబ్స్ కూతురు.. ఇది కూడా ఎగతాళేనా?
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్..గత ఏడాది జరిగిన 'యాపిల్ ఫార్ అవుట్ 2022 ఈవెంట్'లో ఐఫోన్ 14 సిరీస్‌తో పాటు సిరీస్ 8, ఎయిర్‌పాడ్స్ ప్రో, వాచీ ఎస్ఈ2 లను విడుదల చేసింది. ఈ సందర్భంగా యాపిల్ సంస్థ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ కుమార్తె ఈవ్ జాబ్స్ ఐఫోన్ 13తో పోలిస్తే కొత్త ఐఫోన్ 14 పెద్దగా అప్డేట్ ఏమీ లేదంటూ ఓ సెటైరికల్ మీమ్‌ను షేర్ చేశారు. అయితే త్వరలో ఐఫోన్ 15 సిరీస్ విడుదల కానున్న తరుణంలో ఈవ్ జాబ్స్ ఐఫోన్ 14 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐఫోన్ 14 లేకుండా జీవించలేనని వ్యాఖ్యానించారు.ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు టెక్ వరల్డ్ చర్చనీయాంశంగా మారాయి. ఐఫోన్ 14 లేకపోతే జీవించలేను న్యూయార్స్ మ్యాగజైన్ ‘ది స్ట్రాటజిస్ట్’తో జరిగిన ఇంటర్వ్యూలో ఏ వస్తువులు మీ దగ్గర లేకపోతే జీవించలేరన్న ఇంటర్వ్యూర్ ప్రశ్నకు ఈవ్ జాబ్స్ స్పందించారు. తాను 9 వస్తువులు లేకపోతే జీవించలేనని ఆవేంటో చెప్పారు. వాటిల్లో ఐఫోన్ 14కూడా ఉంది. నిజం చెబుతున్నారా? దీంతో ఇంటర్వ్యూ చేసే యాంకర్ గతంలో ఐఫోన్ 14పై వేసిన సెటైర్ల గురించి ప్రస్తావించారు. అందుకు ఆమె ‘ఇది క్రియేటివ్స్ కోసం సృష్టించిన టూల్ అని, దాని డిజైన్ మాస్టర్ పీస్ అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. మనుషుల జీవన విధానాల్ని సమూలంగా మార్చిన ఐఫోన్ 14 జీనియస్ అని అన్నారు. కొందరు ఈ విషయంపై ఈవ్ జాబ్స్ నిజం చెబుతున్నారా? లేదంటే సెటైర్లు వేస్తున్నారా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ధరించిన చొక్కాలాంటిదే మరోటి కొనుక్కోవడం సాధారణంగా యాపిల్ విడుదల చేసే ఐఫోన్లన్నీ దాదాపు ఒకే తరహాలో ఉంటాయి. టెక్నాలజీ పరంగా ఫోన్లలో మార్పులు చేస్తుందే తప్పా డిజైన్‌లో పెద్దగా మార్పులుండవు. ఈవ్ జాబ్స్ సైతం ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఐఫోన్ 14 విడుదల సమయాలో ఓ మీమ్‌ను నెటిజన్లతో పంచుకున్నారు. ‘ఐఫోన్ 13 నుంచి ఐఫోన్ 14కు మారడం అంటే ప్రస్తుతం ధరించిన చొక్కాలాంటిదే మరోటి కొనుక్కోవడం లాంటిది’ అని చెప్పే మీమ్‌ను తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్చేసింది. దీంతో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. గుర్రపుస్వారీలో నిష్టాతురాలు స్టీవ్ జాబ్స్ నలుగురు పిల్లలలో ఈవ్ జాబ్స్ చిన్న. ఆమె స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ గ్రాడ్యుయేట్, సైన్స్, టెక్నాలజీలో ప్రావీణ్యం సంపాదించింది. మోడల్, గుర్రపుస్వారీలో నిష్టాతురాలు కూడా. చదవండి👉 ‘ఐఫోన్’ పరువు తీసిన యాపిల్ బాస్ కూతురు, సమర్ధించిన టిమ్ కుక్ -
ఈ కంప్యూటర్ మౌస్ ధర కోటిన్నర? అసలు స్టోరీ ఏమిటంటే!
న్యూఢిల్లీ: దిగ్గజ టెక్ కంపెనీ యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ అంటే ఒక ఇన్సిపిరేషన్. ఆపిల్ కంప్యూటర్లతో, టెక్నాలజీకి విప్లవ బాటలు వేసిన స్ఫూర్తిమంతుడు స్టీవ్ జాబ్స్. అలాంటి స్టీవ్ జాబ్స్‌కే ప్రేరణగా నిలిచిన కంప్యూటర్ మౌస్ 147,000 పౌండ్లకు (రూ. 1,48,89,174) అమ్ముడైంది. కంప్యూటింగ్ ఐకాన్ డగ్లస్ ఎంగెల్బార్ట్ రూపొందించిన అరుదైన మూడు-బటన్ల మౌస్, కోడింగ్ కీసెట్ బోస్టన్-ఆధారిత ఆర్ఆర్ నిర్వహించిన వేలంలో దాని అంచనా 12వేల పౌండ్ల కంటే దాదాపు 12 రెట్ల రికార్డు ధరను దక్కించుకోవడం విశేషం. మెట్రో అందించిన రిపోర్ట్ ప్రకారం కంప్యూటర్ వాడకలో అత్యంత కీలకమైన మౌస్ రూ. 1.49 కోట్లను సాధించింది. ఎంగెల్బార్ట్ రూపొందించిన అరుదైన, తొలి త్రి-బటన్ కంప్యూటర్ మౌస్, (సుమారు 4″ x 2.75″ x 2.5″) దిగువన ఉన్న రెండు మెటల్ డిస్క్‌లను (X-యాక్సిస్, Y-యాక్సిస్‌కు అనుగుణంగా) వినియోగిస్తుంది. కోడింగ్ కీసెట్లోని ఐదు కీలను ఉపయోగించి మొత్తం 31 వేర్వేరు కీ ప్రెస్‌లను తయారు చేయవచ్చు. ఈ సెటప్‌ని ఉపయోగించి, వినియోగదారు తమ ఎడమ చేతితో టైప్ చేయవచ్చు. "మదర్ ఆఫ్ ఆల్ డెమోస్" దీన్ని అభివర్ణిస్తారు. ఇపుడు వాడుతున్న మౌస్‌లకు ఇది మాతృక. స్టీవ్ జాబ్స్ 1979లో ఒక పరిశోధనా కేంద్రాన్ని సందర్శించినప్పుడు మౌస్ , గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ (GUI)ని చూశారు. దీన్ని ఆపరేట్ చేయడం ఎంత సులభమో గ్రహించి చాలా సంతోష పడ్డారుట. దాంతో ఆపిల్ కంప్యూటర్లకు కూడా దీనిని అనుసరించాలని భావించారు. కానీ 245-పౌండ్ల జిరాక్స్ మౌస్ పని తీరు సరిగ్గాలేకపోవడంతో 12-పౌండ్లతో వన్ బటన్ మౌస్ రూపొందించాలని నిర్ణయించుకున్నారట. ఆర్ఆర్వేలంపై సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ బాబీ లివింగ్స్టన్ మాట్లాడుతూ ఎంగెల్బార్ట్ ఆవిష్కరణ కంప్యూటర్ చరిత్ర పరిణామంలో ఈ పరికరం కీలక పాత్ర పోషించింది. ఆధునిక జీవిత గమనాన్ని మార్చివేసిందన్నారు. SOLD! a computer mouse and coding keyset created by Doug Engelbart, as used in the 'Mother of All Demos,' sold for $178,936 @RRAuction. https://t.co/r9fz431woY#Xerox #Computer #Consign #Auction #History pic.twitter.com/f4uQZBiZJ4 — RR Auction (@RRAuction) March 17, 2023 -
స్టీవ్ జాబ్స్ పాత చెప్పులు వేలం: రికార్డు ధర
న్యూఢిల్లీ: యాపిల్ కోఫౌండర్ దివంగత స్టీవ్ జాబ్స్ పాత చెప్పులు రికార్డ్ ధరకు అమ్ముడు బోవడం విశేషంగా నిలిచింది. అమెరికాలో జూలియెన్స్ ఆక్షన్ కంపెనీ ఆదివారం నిర్వహించిన వేలంలో స్టీవ్ జాబ్స్ ధరించిన బిర్కెన్‌స్టాక్ కంపెనీ సాండల్స్ అత్యధిక ధరను దక్కించుకున్నాయి. 2,20,000 వేల డాలర్లు (సుమారు రూ.1.78 కోట్లు) ఒక వ్యక్తి వీటిని సొంతం చేసుకున్నారు. (అరిగిపోయిన చెప్పులకు అన్ని వేల డాలర్లా? ఎవరివో గుర్తు పట్టగలరా?) 1970ల మధ్యకాలంలో స్టీవ్ జాబ్స్‌కి ఎంతో ఇష్టమైన బ్రౌన్ స్వెడ్ బిర్కెన్‌స్టాక్ సాండిల్స్ అత్యధిక ధరతో రికార్డు సృష్టించాయని జూలియన్స్ ఆక్షన్ పేర్కొంది. వేలంలో వీటికి 60 వేల డాలర్ల ధర వస్తుందని భావించారు. ఈ సాండల్స్‌కి నాన్ ఫంజిబుల్ టోకెన్ ధర 2,18.750 డాలర్లుగా నిర్ణయించారు. అయితే, రికార్డు స్థాయిలో రెండు లక్షల ఇరవై వేల డాలర్లు వచ్చాయి. అయితే ఈ సాండల్స్‌ని కొనుగోలు చేసిన ఎవరు కొనుగోలు చేశారు అనే వివరాలను మాత్రం జూలియెన్స్ కంపెనీ వెల్లడించ లేదు. 1976లో స్టీవ్ వోజ్నియాక్ కలిసి కాలిఫోర్నియాలో యాపిల్ కంపెనీని ప్రారంభించారు స్టీవ్ జాబ్స్. ఆధునిక టెక్నాలజీతో, పాపులర్ యాపిల్ ఉత్పత్తులతో ఆధునిక టెక్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న స్టీవ్ జాబ్స్ క్యాన్సర్‌తో 2011లో కన్నుమూశారు. ఇదీ చదవండి: ElonMusk బ్లూటిక్ బాదుడు పక్కా,ముహూర్తం ఫిక్స్ -
అరిగిపోయిన చెప్పులకు అన్ని వేల డాలర్లా? ఎవరివో గుర్తు పట్టగలరా?
న్యూఢిల్లీ: యాపిల్ కో ఫౌండర్ స్టీవ్ జాబ్స్ ధరించిన పాత, అరిగిపోయిన చెప్పులు ఆన్లైన్లో వేలానికి ఉంచారు. 1970, 80ల కాలంలో ఆయన వేసుకున్న బ్రౌన్ స్వెడ్ లెదర్ బిర్కెన్‌స్టాక్ అరిజోనా చెప్పులను వేలానికి ఉంచింది. వీటి 60వేలు- 80 వేల డాలర్లు (మన కరెన్సీలో రూ. 48లక్షల నుంచి 64 లక్షలకు పైనే) ధర నిర్ణయించారని వేలం జూలియన్స్ ఆక్షన్స్ నిర్వాహకుడు వెల్లడించారు. ఇదీ చదవండి: యాపిల్ గుడ్‌న్యూస్: ఇండియాలో నాలుగురెట్లు పెరగనున్న ఉద్యోగాలు! ఈ వేలం నవంబర్ 11న మొదలు కాగా, నవంబర్ 13న ముగియనుంది. మార్క్ షెఫ్, స్టీవ్ జాబ్స్ హోమ్ మేనేజర్, 1980 లలో కాలిఫోర్నియాలోని అల్బానీలో బిర్కెన్‌స్టాక్ చెప్పులను భద్రపరిచారు. జూలియన్స్ వేలం వెబ్‌సైట్‌లోని తాజా సమాచారం ప్రకారం, బిడ్ 15 వేల డాలర్ల వద్ద వద్ద ప్రారంభమై 22,500 డాలర్ల వద్ద ఉంది. బిడ్ గెలిచిన వాళ్లు చెప్పులతోపాటు, చెప్పుల ఎన్ఎఫ్టీని కూడా సొంతం చేసుకోవచ్చు. అలాగే ఫోటోగ్రాఫర్ జీన్ పిగోజీ బుక్"ది 213 మోస్ట్ ఇంపార్టెంట్ మెన్ ఇన్ మై లైఫ్" ను కూడా దక్కించుకోవచ్చు. (క్యూ కడుతున్న టాప్ కంపెనీలు: అయ్యయ్యో ఎలాన్ మస్క్!) ఆయనకి ప్రత్యేకంగా ఉండటం ఇష్టం ఉండేది కాదు, సాధారణంగా ఉంటూనే, అత్యాధునిక టెక్నాలజీపై దృష్టి పెట్టేవారని వోగ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టీవ్ జాబ్స్ మాజీ భార్య క్రిస్సన్ బ్రెన్నాన్ తెలిపారు. స్టీవ్ జాబ్స్ వార్డ్రోబ్ లో చెప్పులు కూడా ఉండేవి. అవి ఆయన యూనిఫాంలో భాగం. ఒక బిజినెస్ మేన్‌గా స్పెషల్‌గా కంటే కూడా సింపుల్ డిజైన్, చెప్పులు కంఫర్ట్‌గా ఉన్నాయో లేదో మాత్రమే ఆలోచించేవారని ఆమె గుర్తు చేసుకున్నారు. యాపిల్ చరిత్రలో అనేక కీలకమైన క్షణాల్లో స్టీవ్ జాబ్స్ ఈ చెప్పులను ధరించినట్లు వేలం సంస్థ పేర్కొంది. 1976లో సహ-వ్యవస్థాపకుడు స్టీవ్ వోజ్నియాక్‌తో కలిసి లాస్ ఆల్టోస్ గ్యారేజీలో యాపిల్ కంప్యూటర్ ఆవిష్కరణ సందర్భంగా ఇదే చెప్పులను ధరించారట. మరోవైపు ఈ సాండిల్స్‌ను ఇప్పటికే పలుఎగ్జిబిషన్స్లో ప్రదర్శించారు. 2017లో ఇటలీలోని మిలన్లో సలోన్ డెల్ మొబైల్, 2017లో జర్మనీలోని రహ్మ్స్‌లోని బిర్కెన్‌స్టాక్ హెడ్‌క్వార్టర్స్, న్యూయార్క్‌లోని సోహోలో, జర్మనీలోని కొలోన్‌లో IMM కోల్న్ ఫర్నిచర్ ఫెయిర్ వంటి అనేక ప్రదర్శనలలో వీటిని ఉంచారు. అలాగే 2018లో Die Zeit మ్యాగజైన్ కోసం Zeit ఈవెంట్ బెర్లిన్,ఇటీవల, జర్మనీ స్టట్‌గార్ట్‌లోని ది హిస్టరీ మ్యూజియం వుర్టెంబర్గ్‌లో ఉంచడం విశేషం. (హ్యుందాయ్ భారీ ఆఫర్, ఆ కారుపై లక్ష దాకా డిస్కౌంట్) కాగా ఫాదర్ ఆఫ్ డిజిటల్ రివల్యూషన్, స్టీవ్‌జాబ్స్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 1976లో యాపిల్ సంస్థను నెలకొల్పి కోట్లాదిమంది అభిమానులతో యాపిల్ మ్యాక్స్, ఐఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఐప్యాడ్లు, యాపిల్ వాచెస్..ఇలా యాపిల్ అనే బ్రాండ్‌ను విశ్వవ్యాపితం చేసిన ఘనత ఆయన సొంతం. అందుకే రోడ్లపై పడేసిన కోక్ బాటిల్స్ అమ్ముకునే స్థాయినుంచి గ్లోబల్ టెక్ లీడర్‌గా ఎదిగిన ఆయన ప్రస్తానం పలువురికి స్ఫూర్తిదాయకం. గతంలో చార్టర్‌ఫీల్డ్స్ వేలం వేసిన స్టీవ్ జాబ్స్ ఉద్యోగ దరఖాస్తు సుమారు రూ.1.6 కోట్లకు విక్రయించబడింది. ఇదే ఉద్యోగ దరఖాస్తు 2018 ఏడాది నిర్వహించిన ఆక్షన్‌లో సుమారు రూ.1.2 కోట్లకు అమ్ముడైన సంగతి తెలిసిందే. -
వేలాది మంది ఉద్యోగుల తొలగింపు, ‘యాపిల్ సంస్థను అమ్మేయండి’!
స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు తర్వాత ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల్ని భారీ ఎత్తున తొలగించారు. ప్రపంచ వ్యాప్తంగా ట్విటర్లో 7500 మంది పని చేస్తుండగా..అందులో సగం మందికి పైగా తొలగిస్తున్నట్లు మెయిల్స్ పంపారు. ఇలా వేలాది మంది ఉద్యోగుల్ని ఒకేసారి తొలగించడం కొత్తేమి కాదని, సంస్థ సంక్షోభ సమయంలో యాపిల్ కో- ఫౌండర్ స్టీవ్ జాబ్ సైతం సిబ్బందికి ఉద్వాసన పలికినట్లు తెలుస్తోంది. ఎలన్ మస్క్ - ట్విటర్ మధ్య కొనుగోలు ఒప్పొందం పూర్తయిన వెంటనే శాన్ ఫ్రాన్సిస్కోలోని ట్విటర్ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. వెళ్లే సమయంలో తన చేతులో ఓ సింక్ పట్టుకొని కనిపించారు. ట్విటర్ హెడ్క్వార్టర్స్లోకి ఎంటర్ అవుతున్నానని, ఇక అది సింక్ కావాల్సిందే అని మస్క్ తన వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఆ తర్వాత రెండ్రోజుల్లో వరల్డ్ వైడ్‌గా ట్విటర్లో పనిచేస్తున్న ఉద్యోగుల తొలగింపులో భాగంగా..తొలత మాజీ సీఈవో పరాగ్ అగర్వాల్, లీగల్ ఎగ్జిక్యూటీవ్ విజయ గద్దెలపై వేటు వేశారు. సగానికి పైగా ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపారు. యాపిల్ ఉద్యోగులకు పింక్ స్లిప్ ఇలా దిగ్గజ సంస్థలు ఉద్యోగుల్ని ఫైర్ చేయడం తొలిసారి కాదని, యాపిల్ సైతం అర్ధాంతరంగా ఉద్యోగులకు పింక్ స్లిప్ ఇచ్చిన 1990 నాటి చరిత్రని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. అమెరికాకు చెందిన వెబ్ సాఫ్ట్వేర్ కంపెనీ ‘రూబీ ఆన్ రైల్స్’ క్రియేటర్,37 సిగ్నల్స్ కో- ఫౌండర్,సీటీవో డేవిడ్ హీనెమీయర్ హాన్సన్ నివేదిక నాడు యాపిల్ తన ఉద్యోగుల్ని తొలగించిన అంశాన్ని ప్రస్తావించింది. యాపిల్‌ను అమ్మేయండి 1997లో యాపిల్ చిక్కుల్లో పడింది. కంపెనీ స్టాక్ 12 సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోయాయి. దీంతో స్టాక్ మార్కెట్లో కంపెనీ విలువ పడిపోవడం ప్రారంభమైంది. ఆ సమయంలో కంప్యూటర్ మ్యానిఫ్యాక్చరింగ్ విభాగంలో యాపిల్‌కు కాంపిటీటరైన ‘డెల్’ విమర్శలు చేసింది. డెల్ అధినేత మైఖేల్ డెల్ యాపిల్ సంస్థను అమ్మేసి వాటాదారులకు డబ్బును తిరిగి ఇవ్వాలని పిలునిచ్చారు. ఆ పిలుపే యాపిల్ సంస్థలో ప్రకంపనలు రేపింది. అప్పుడే యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ జూలై 1997లో సంస్థలోకి తిరిగి వచ్చారు. ఉద్యోగులపై వేటు ఆర్ధిక సంక్షోభం నుంచి గట్టెక్కించేలా స్టీవ్ జాబ్ వచ్చీ రాగానే యాపిల్ సీఈవో గిల్ అమేలియో అడ్వైజర్‌గా జాయిన్ అయ్యారు. మైక్రోసాఫ్ట్‌తో జత కలిసి నిక్స్ ది న్యూటన్ ప్రాజెక్ట్‌పై వర్క్ చేయడం ప్రారంభించారు.ఆ మరుసటి నెలలో (ఆగస్ట్) యాపిల్ సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ ప్రాజెక్ట్‌లను భారీగా నిలిపివేసింది. అప్పటికి, యాపిల్ నిర్వహణ వ్యయాలను ప్రతి ఏడాది 500 మిలియన్ల మేర తగ్గించుకోవాలని భావించింది.అందుకే ఊహించని విధంగా స్టీవ్ జాబ్స్ 4,100 యాపిల్ ఉద్యోగుల్ని తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వ్యత్యాసం అదే అయితే నాటి యాపిల్ పరిస్థితుల్ని గుర్తు చేసుకుంటున్న నెటిజన్లు స్టీవ్ జాబ్స్‌కు..మస్క్‌కు అసలు పోలికే లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తన ఆలోచనలతో ప్రపంచాన్ని మార్చగలనని ఆలోచించేంత పిచ్చి ఉన్న మస్క్‌ను ఈ తరం ‘స్టీవ్ జాబ్స్’గా అభివర్ణిస్తుంటారు నెటిజన్లు. కానీ ఇప్పుడు వాళ్లే మస్క్ డబ్బు కోసం ఉద్యోగుల్ని తొలగించారని, స్టీవ్ జాబ్స్ సంస్థ కోసం ఉద్యోగుల్ని తొలగించాల్సి వచ్చిందంటూ చర్చించుకుంటున్నారు. చదవండి👉 ‘ట్విటర్లో నా ఉద్యోగం ఊడింది’, 25 ఏళ్ల యశ్ అగర్వాల్ ట్వీట్ వైరల్ -
‘ఐఫోన్’ పరువు తీసిన యాపిల్ బాస్ కూతురు, సమర్ధించిన టిమ్ కుక్
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్.. ఐఫోన్ 14 సిరీస్‌తో పాటు సిరీస్ 8, ఎయిర్‌పాడ్స్ ప్రో, వాచీ ఎస్ఈ2లను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఐఫోన్ 14 సిరీస్‌పై యాపిల్ సీఈవో టిమ్ కుక్ అసంతృప్తి వ్యక్తం చేశారు. లేటెస్ట్ సిరీస్ ఫోన్లపై యాపిల్ సంస్థ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ కుమార్తె ఈవ్ జాబ్స్ వేసిన మీమ్స్ సమర్ధించారు. 'యాపిల్ ఫార్ అవుట్ 2022 ఈవెంట్' జరిగింది. ఈ ఈవెంట్లో సీఈవో టిమ్ కుక్ ఐఫోన్ 14 సిరీస్‌లో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌లను రిలీజ్ చేయగా.. వాటిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఫోన్లలో ఎలాంటి ఆవిష్కరణలు లేవనే విమర్శలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చదవండి👉 ఐఫోన్ కోసం దుబాయ్ వెళ్లాడు..కానీ చివరికి ఈ క్రమంలో ఐఫోన్ 14 సిరీస్‌పై టిమ్‌కుక్ స్పందించారు. గత పదేళ్లుగా యాపిల్ కస్టమర్లలో నేను ఒకరిని. తొలిసారి బ్లాక్ బెర్రీ నుంచి ఐఫోన్ 4ఎస్‌కు షిఫ్ట్ అయ్యా. నాటి నుంచి మార్కెట్లో ఏ ఐఫోన్ వచ్చినా వెంటనే కొనుగోలు చేస్తుంటా. ఈ ఏడాది కూడా 256 జీబీ సిల్వర్ కలర్ ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌ను కొనుగోలు చేశా. ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌ను ఉద్దేశిస్తూ..‘‘నా కొత్త బొమ్మతో రెండు వారాల పాటు ఆడిన తరువాత, "డైనమిక్ ఐలాండ్" తప్ప.. ఆశ్చర్యపోయేలా ఆవిష్కణలు లేవని గట్టి నమ్మకంతో చెప్పగలను. సెల్ఫీ కెమెరా, నోటిఫికేషన్లు, అలెర్ట్స్, ఇతర కార్యకలాపాల్ని అనుసంధానం చేసేలా ఫేస్ ఐడి సెన్సార్ మాత్రమే ఉందని అన్నారు. స్టీవ్ జాబ్స్ కూతురు చెప్పింది నిజమే స్టీవ్ జాబ్స్ కూతురు ఈవ్ జాబ్స్ కొత్త ఐఫోన్ 14 సిరీస్‌పై సెటైర్ వేశారు. పాత స్మార్ట్ఫోన్ల లాగానే కొత్త జనరేషన్ ఫోన్లు ఉన్నాయని అర్ధం వచ్చే ఓ మీమ్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఐఫోన్ 13 నుంచి ఐఫోన్ 14కి అప్‌గ్రేడ్ అవుతున్నానని..ఓ వ్యక్తి తాను వేసుకున్న షర్ట్ లాంటిదే మరో షర్ట్ చేతిలో పట్టుకొని ఉన్న మీమ్‌ను ఈవ్ జాబ్స్ షేర్ చేసింది. ఆ మీమ్‌నే టిమ్ కుక్ సమర్ధించారు. చదవండి👉 ఐఫోన్ కోసం దుబాయ్ వెళ్లాడు..కానీ చివరికి -
ఆపిల్ ఐఫోన్14: స్టీవ్ జాబ్స్ కుమార్తె సెటైర్..ఏమైంది?
న్యూఢిల్లీ: ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఐఫోన్ 14 సిరీస్‌ను టెక్ దిగ్గజం ఆపిల్ ప్రపంచవ్యాప్తంగా అట్టహాసంగా లాంచ్ చేసింది. అయితే లేటెస్ట్ ఐఫోన్ 14 ఆపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ కుమార్తె ఈవ్ జాబ్స్‌కు నచ్చినట్టు లేదు. అందుకే సెటైర్ వేయడం ఇంటర్నెట్లో హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఊహించని విధంగా మీమ్‌ను పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో మీమ్ ఫెస్టివల్ జరుగుతోంది. స్టీవ్ జాబ్స్ కుమార్తె ఈవ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆపిల్ ఐఫోన్, 13, 14ని పోలుస్తూ ఒక స్టోరీ పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లు ఫన్నీగా కమెంట్ చేస్తున్నారు. ఆపిల్ ప్రకటన తరువాత ఐఫోన్14ను అప్డేట్ చేసుకుంటున్నా అని క్యాప్షన్‌తో ఒక పోస్ట్ పెట్టారు. ఐఫోన్ 13తోపోలిస్తే. కొత్త ఐఫోన్ 14 పెద్దగా అప్డేట్ ఏమీ లేదంటూ ఐఫోన్ లవర్స్ పెదవి విరుస్తున్న సందర్భంలో ఈవ్ పోస్ట్ చర్చకు దారి తీసింది. మరోవైపు యుఎస్‌లోని ఐఫోన్ మోడల్స్‌లో ఇ-సిమ్ యాక్టివేషన్‌పై కూడా యూజర్లు అంసతృప్తిగా ఉన్నారు. తాజా అప్డేట్స్పై సోషల్ మీడియా మీమ్స్ ఒక రేంజ్లో పేలుతున్నాయి. "తదుపరి ఐఫోన్లో మైక్రోఫోన్ ఉండదు. ఇక మీరు నేరుగా మీరు మాట్లాడాలను కుంటున్న వారి దగ్గరకు వెళ్లాలి." అని ఒక యూజర్ కమెంట్ చేయగా, "త్వరలో ఇది ఐఫోన్‌కు బదులుగా ఇ-ఫోన్ అవుతుందని మరొకరు వ్యాఖ్యానించడం గమనార్హం. అలాగే ఈ సిమ్స్ ఇండియాకు రాకపోవడం మంచిదైంది. ఐఫోన్ 14 సిరీస్ సిమ్ ట్రేతో ఉండడం గొప్ప విషయం. లేదంటే ఇక్కడ చాలా గందరగోళ పరిస్థితి ఉండేది. తాము ఇంకా ఇ-సిమ్‌లకు సిద్ధంగా లేం అంటూ ఇండియన్ యూజర్ ఒకరు రాశారు. కాగా బుధవారం రాత్రి నిర్వహించిన "ఫార్ అవుట్" మెగా ఈవెంట్లో ఆపిల్ ఐఫోన్ 14, ఎయిర్‌పాడ్స్ ప్రో, ఆపిల్ వాచ్ అల్ట్రాలను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రొ, ఐఫోన్ 14 మాక్స్‌ను ఆవిష్కరించింది. ఐఫోన్ 14 ప్రీ-ఆర్డర్లు సెప్టెంబర్ 9 నుండి ప్రారంభం. ఐఫోన్ 14 సెప్టెంబర్ 16 నుండి , ఐఫోన్ 14 ప్లస్ అక్టోబర్ 7 నుండి సేల్కు అందుబాటులో ఉంటాయి. ఇండియాలో ఐఫోన్ 14 ప్రారంభ ధర రూ. 79,900, ఐఫోన్ 14 ప్లస్ ప్రారంభ ధర రూ. 89,900గా ఉంటుంది. Eve Jobs, the daughter of Steve Jobs and Laurene Powell Jobs, reacts to today’s iPhone announcement on her Instagram. pic.twitter.com/bfn2VtbpsA — Yashar Ali 🐘 (@yashar) September 7, 2022 -
యాపిల్ పెను సంచలనం
Apple first company to cross $3 trillion market cap milestone: కార్పొరేట్ రంగంలో యాపిల్ కంపెనీ పెను సంచనలం సృష్టించింది. ఏకంగా 3 ట్రిలియన్ డాలర్ల(3 X రూ.75లక్షల కోట్లుపైనే) వాల్యూ మార్క్‌ను అందుకున్న తొలి కంపెనీగా అవతరించింది. సోమవారం (జనవరి 3, 2022)న మధ్యాహ్నాం మార్కెట్లో షేర్ల ధరల పెరుగుదలతో ఈ ఘనత సాధించింది ఈ అమెరికన్ మల్టీనేషనల్ టెక్ దిగ్గజం. స్టీవ్ జాబ్స్ 2007లో ఫస్ట్ యాపిల్ ఐఫోన్‌ను లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి విలువతో పోలిస్తే.. ఇప్పుడు యాపిల్ షేర్లు 5,800 శాతం రెట్లు పెరిగాయి ఇప్పుడు. కరోనా టైంలోనూ ఈ కార్పొరేట్ జెయింట్ హవాకు అడ్డుకట్ట పడకపోవడం విశేషం. 2020 మొదట్లో 200 శాతం పెరిగాయి షేర్ల ధరలు. మొత్తంగా ఇప్పుడు మూడు ట్రిలియన్ డాలర్ల మార్కెట్‌ను దాటేసింది. స్టీవ్ జాబ్స్ 1976లో ఓ కంప్యూటర్ కంపెనీగా మొదలైన యాపిల్ కంపెనీ.. ఇన్కార్పోరేటెడ్గా(విలీన కంపెనీగా) హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్, మీడియా సర్వీసులను అందిస్తున్న విషయం తెలిసిందే. 2 ట్రిలియన్ మార్కెట్‌ను అందుకున్న కేవలం పదిహేడు నెలలకే.. అది చిప్ కొరత లాంటి అసాధారణ సమస్యను ఎదుర్కొంటూనే 3 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ మార్క్‌ను టచ్ చేయగలగడం మరో విశేషం. యాపిల్ తొలి ఆఫీస్ నా జీవితంలో ఈ మార్క్‌ను కంపెనీ సాధిస్తుందని ఊహించలేదు.. కానీ, రాబోయే ఐదు పదేళ్లలో యాపిల్ ఊపు ఎలా ఉండబోతుందో ఈ గణాంకాలే చెప్తున్నాయి అంటున్నారు కంపెనీలో 2.75 మిలియన్ షేర్లు ఉన్న ప్యాట్రిక్ బర్టోన్(ఈయన మెయిన్ స్టే విన్స్లో లార్జ్ క్యాప్ గ్రోత్ ఫండ్‌కి కో-ఫోర్ట్‌ఫోలియో మేనేజర్). యాపిల్ కంపెనీ 2018లో 1 ట్రిలియన్ డాలర్ మార్క్ అందుకుంది. ఆగష్టు 2020లో 2 ట్రిలియన్ డాలర్ మార్క్ అందుకుంది. ఈ క్రమంలో మరో టెక్ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంది యాపిల్. మొత్తంగా 2 ట్రిలియన్ డాలర్ మార్క్ దాటిన తొలి కంపెనీ మాత్రం సౌదీ ఆరామ్కో(సౌదీ అరేబియన్ ఆయిల్ కంపెనీ). ప్రస్తుతం యాపిల్ మొదటి స్థానంలో ఉండగా, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్(గూగుల్), సౌదీ ఆరామ్కో, అమెజాన్‌లో తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాయి. చదవండి: యాపిల్+మేక్ ఇన్ ఇండియా= 50 బిలియన్ డాలర్లు!! -
45 ఏళ్ల క్రితం కంప్యూటర్.. దీని విలువ కోట్లలోనే!
45 ఏళ్ల క్రితం స్టీవ్ జాబ్స్ స్వయంగా తయారుచేసిన యాపిల్–1 కంప్యూటర్ ఇది. అమెరికాలో మంగళవారం జరిగిన జాన్ మోరాన్ ఆక్షనీర్స్ వేలంపాటలో ఇది దాదాపు రూ.3 కోట్ల ధర పలికింది. ఎయిర్ బెలూన్ రికార్డు ఫ్రాన్స్‌లో 3,637 మీటర్ల ఎత్తులో ఎగురుతున్న హాట్ ఎయిర్ బెలూన్‌పై ఎక్కువ సేపు నిలబడి ప్రయాణించి కొత్త ప్రపంచ రికార్డును సృష్టించిన ఈయన పేరు రెమీ ఓవర్డ్. బుధవారం చాటెలార్ట్లో తీసిందీ ఫొటో. -
సమయమే సంపద
కాలం ఎంతో విలువైనది. ఎవరికోసం ఆగనిది. బిరబిరమంటూ సాగిపోయే ఉధృతమైన నదీ ప్రవాహానికి మానవ మేధాశక్తితో ఆనకట్ట వేయవచ్చు. కానీ, నిరవధికంగా సాగిపోయే కాలప్రవాహానికి మాత్రం ఎవ్వరూ అడ్డుకట్ట వేయలేరన్నది వాస్తవమే కదా..!! కాలం మనకు ఉచితంగా లభిస్తుంది. కానీ కాలం విలువను వెలకట్టలేమన్నది జగమెరిగిన సత్యం. సకల ప్రాణుల్ని, సమస్త జగత్తునూ నడిపించేదీ, హరించేదీ కాలమే. సృష్టి, స్థితి, వినాశం అనే ప్రధానమైన కార్యాలకు సాక్షీభూతంగా నిలిచేదీ కాలమే. అత్యంత బలవత్తరమైన కాలప్రభావాన్ని ఎవరూ అతిక్రమించలేరు. ఏ భౌతిక సాధనాలూ, ఆధ్యాత్మిక సాధనలూ కాలాన్ని బంధించలేవు. ‘‘పారే నది లో ఈ క్షణం తాకిన నీటిని మరుక్షణం ఎలాగైతే తాకలేమో అలాగే గతించిన కాలాన్ని పట్టుకోలేం. అందుచేత కాలమహిమను గుర్తించండి’’ అన్న చాణుక్యుని వాక్యాలు ఎంతో అర్థవంతమైనవి. జీవితంలో ప్రతిక్షణం వెలకట్టలేనిదే. గడిచిపోయిన క్షణం తిరిగిరాదు. అందుకే, కాలాన్ని విధి గా పాటించడం లేదా సమయపాలనకు కట్టుపడడం అనేది ప్రతివారికీ అత్యంత ముఖ్యమైన విధి. సమయపాలనకు సంబంధించి రకరకాల నిర్వచనాలు మనకు నిత్యమూ కనబడుతూ ఉంటాయి. సమయానికి మనం అనుకున్న పనిలో, విహితమైన తీరులో, ఏకాగ్ర చిత్తంతో నిమగ్నం కావడాన్నే సమయపాలన అని చెప్పుకోవచ్చు. ఏదైనా పనికోసం మనం సమయాన్ని కేటాయిస్తే, అది మనకు ఆ కార్య పరిపూర్ణతకు ఉపకరించి, సంతృప్తిని కలిగిస్తుంది. ఏదైనా ఉన్నతమైన లక్ష్యాన్ని సాధించడంకోసం సమయాన్ని కేటాయిస్తే, అది మనలో మేధాశక్తినీ పెంచడమే గాక, వ్యక్తిత్వాన్ని శిఖరాగ్రానికీ చేరుస్తుంది. అమేయమైన సారాన్ని నింపుకున్న పుస్తకాలను గానీ, గ్రంథాలను గానీ చదవడానికి సమయాన్ని కేటాయిస్తే, మనలో మనోవికాసం పెంపొందుతుంది. ఎప్పుడూ ఏదో ఒక పనిలోనే నిమగ్నం కాకుండా, ఒకింత నవ్వుకోవడానికి సమయాన్ని కేటాయిస్తే, అది మన జీవితాన్ని ఆహ్లాదమయం చేస్తుంది. కొంత సమయాన్ని పక్కవాడికి సహాయం చేయడానికి కేటాయిస్తే, అది మనకు ఆత్మానందాన్ని కలిగిస్తుంది. దైనందిన జీవితంలో వ్యాయామానికి సమయాన్ని కేటాయిస్తే, అది మనకు ఆరోగ్యప్రదాయినియై సంతసాన్ని కలిగిస్తుంది. సమయం విలువ ప్రతివారూ గుర్తెరగడం అత్యంత ముఖ్యం. ప్రత్యేకించి, పిల్లలకు సమయానికి తగినట్లుగా పనులు అలవాటు చేయడం తల్లితండ్రుల బాధ్యత. ముఖ్యంగా ఉదయాన నిద్రలేవడం నుంచీ, రాత్రి పడుకునే వరకు, వాళ్ళు ఏ సమయానికి ఏం చేయాలో తెలియజెప్పడం తప్పనిసరిగా చేయాలి. ముందు కొంత బద్ధకించినా, కొన్ని రోజులకు సమయం ప్రకారం పనులు చేయడం వారికి అలవాటుగా మారుతుంది. జీవితానికి ఉత్తమ బాటను పరుస్తుంది. ‘‘ క్షణము గడిచిన దాని వెన్కకు మరల్ప సాధ్యమే మానవున కిలాచక్రమందు’ అంటాడు గుర్రం జాషువ. ఒక్క మాటలో చె ప్పాలంటే విశ్వవిఖ్యాతి గడించిన మహనీయులందరూ ఏ రంగానికి చెందిన వారైనా కాలం విలువ బాగా తెలిసిన వారే సమయాన్ని సద్వినియోగపరచుకున్నవారే. కాలం అనేది మనం ఆపితే ఆగదు. కాబట్టి ఏ సమయంలో ఏ పని చెయ్యాలో ఆ సమయంలో ఆ పని చేస్తే సమయం సద్వినియోగపరిచినట్లే. ప్రపంచంలో గొప్పవాళ్ళయిన వ్యక్తులందరూ కాలం విలువ తెలిసిన వాళ్ళే. ప్రతీ క్షణాన్నీ సద్వినియోగం చేసినవాళ్ళే. అందువల్లనే, ఆది శంకరాచార్యులు, ఏసుక్రీస్తు, వివేకానందస్వామి మొదలైన మహాపురుషులు చిన్నవయస్సులోనే శరీరాన్ని చాలించినప్పటికీ, తాము జీవించి ఉన్న స్వల్పమైన సమయంలోనే అద్వితీయమైన, అప్రతిహతమైన విజయాలను సాధించగలిగారు. ‘‘యువతీ యువకుల్లారా.. మీరంతా మేల్కొనండి. లక్ష్యసాధనకోసం శ్రమించే క్రమంలో ప్రతి క్షణాన్నీ సద్వినియోగపరచండి. మీరు మండే నిప్పు కణికలు అని గమనించండి. కాబట్టి కాలం విలువ ఎరిగినవారై, బద్ధకాన్ని వదలండి.’’ అంటూ స్వామి వివేకానంద ఇచ్చిన సందేశం ఎంతో విలువైనది. సమయం విలువను కాల రాచే మహమ్మారిలాంటి జాడ్యం సోమరితనం. సాధారణంగా మనసు సుఖాన్ని, బుద్ధి హితాన్ని కోరుకుంటాయి. పరీక్షలొస్తున్నాయి చదవడం వెంటనే ఆరంభించమని బుద్ధి చెబుతుంది. ఏమీ ఫరవాలేదు, పరీక్షలు బాగా దగ్గరకొచ్చాక చదవొచ్చని మనస్సు చెబుతుంది. మనం మనస్సు పలికిన మాటే వింటాం. బుద్ధి చెప్పింది వినం. అందుకే ఎంతో అనర్థం జరుగుతోంది. ప్రతి వ్యక్తీ, తన మనసును అదుపులో ఉంచుకుంటే సోమరితనాన్ని జయించి, కాలాన్ని ఉపయోగించుకుని తగిన రీతిలో సార్థకత్వాన్ని సాధించడం కష్టమైన పని కాదు. జగత్ప్రసిద్ధమైన ఆపిల్ కంపెనీ సహవ్యవస్థాపకుడైన స్టీవ్ జాబ్స్ మాట్లాడుతూ, ‘‘నీ సమయం ఎంతో విలువైనది. ఆ సమయాన్ని వినియోగించి నీ జీవితాన్ని స్వర్గమయం చేసుకో. కాలాన్ని వ్యర్థం చేసుకుని, ఇంకొకరి జీవితంలో నీవు బతకకు’’ అంటారు. కాలం విలువ తెలుసుకుని, ప్రగతిని సాధిస్తూ, ముందుకు సాగమని, ఇంకొకరితో తనను పోల్చుకోకుండా ధరిత్రిలో మరొక కొత్త చరిత్రను లిఖించమనే ప్రబోధమూ ఈ మాటల్లో దాగి ఉంది. ‘‘ప్రపంచంలో అతి విలువైన వస్తువులు రెండు.. మొదటిది సహనం, రెండోది కాలం.’’ అంటారు లియో టాల్‌స్టాయ్. సృష్టిలో మనకు లభించే అత్యంత విలువైన సంపద కాలమే. కానీ అత్యంత దయనీయంగా నిత్యమూ మనం వృథా చేసేదీ కాలాన్నే..!! ‘‘సమయం ప్రధానమైన విషయాల్లో ఒకటి కాదు. సమయమే అత్యంత ప్రశస్తమైన సంపద’’ అని యువత గ్రహిస్తే, వారి భవిత బంగరు బాట కావడం కష్టమేమీ కాదు. కాలాన్ని సద్వినియోగపరచిన ప్రతి వ్యక్తీ చేయగలిగేది మహేంద్రజాలమే. సమయం విలువను కాల రాచే మహమ్మారిలాంటి జాడ్యం సోమరితనం. సాధారణంగా మనసు సుఖాన్ని, బుద్ధి హితాన్ని కోరుకుంటాయి. పరీక్షలొస్తున్నాయి చదవడం వెంటనే ఆరంభించమని బుద్ధి చెబుతుంది. ఏమీ ఫరవాలేదు, పరీక్షలు బాగా దగ్గరకొచ్చాక చదవొచ్చని మనస్సు చెబుతుంది. మనం మనస్సు పలికిన మాటే వింటాం. బుద్ధి చెప్పింది ఏ మాత్రం వినం. అందుకే ఎంతో అనర్థం జరుగుతోంది. ప్రతి వ్యక్తీ, తన మనసును అదుపులో ఉంచుకుంటే సోమరితనాన్ని జయించి, కాలాన్ని ఉపయోగించుకుని తగిన రీతిలో సార్థకత్వాన్ని సాధించడం కష్టమైన పని ఏమాత్రం కాదు. –వ్యాఖ్యాన విశారద, వెంకట్ గరికపాటి -
అప్పుడే పదేళ్లు.. ఆయన సింగిల్ పీస్: ఆపిల్ సీఈఓ భావోద్వేగ లేఖ
ఆపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ 10వ వర్ధంతి సందర్భంగా ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ స్టీవ్ జాబ్స్ కృషిని గుర్తు చేసుకున్నారు.ఈ సందర్భంగా ఉద్యోగులకు ఒక లేఖ రాశారు. ప్రస్తుతం ఆపిల్ సాధించిన ఘన విజయాలను చూసేందుకు జాబ్స్ ఉండి ఉంటే బావుండేదని టిమ్ కుక్ అభిప్రాయపడ్డారు. తన ట్విటర్లో స్టీవ్‌కు సంబందించిన ఒక వీడియోను కూడా పోస్ట్ చేశారు. అభిరుచి ఉన్న వ్యక్తులు ప్రపంచాన్ని మంచిగా మార్చగలరు" అని స్టీవ్ నమ్మాడు. అపుడే దశాబ్దం గడిచిపోయిందంటే నమ్మలేకుండా ఉన్నాం. కానీ మీ ఉనికి ఎప్పటికీ సజీవమే ఆయనకు నివాళులర్పించారు. ఆపిల్ తన హోమ్‌పేజీలో జాబ్స్‌కు నివాళుర్పించింది.. స్టీవ్ మరణించి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా టిమ్ కుక్ఉద్యోగులకు ఒక లేఖ రాశారు.. స్టీవ్ వదిలిపెట్టిన అసాధారణ వారసత్వాన్ని గుర్తు చేసుకొనేందుకు ఇదొక అపూర్వ సందర్భం అని కుక్ తెలిపారు. ఆయనొక మేధావి.ఎంతో దూరదృష్టి గలవాడు. ప్రపంచం ఎలా ఉండబోతోందో చూడాలని సవాల్ చేసిన మనిషి. వాస్తవానికి తాను స్టీవ్ గురించి ఆలోచించని రోజు లేదని కుక్ పేర్కొన్నారు. ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా అద్భుతమైన వినూత్నమైన ఉత్పత్తులను తీసుకువచ్చాం. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలతో మమేకమయ్యేలా ఇన్నోవేటివ్ ఉత్సత్తులపై దృష్టి సారించాం. ఇందుకు చాలా అదృష్టవంతుడిగా భావిస్తున్నాను. విశ్వంలో కూడా తమంతట తాముగా సత్తా చాటేలా ప్రోత్సహించాం. స్టీవ్ మనందరికీ ఇచ్చిన అనేక బహుమతులలో ఇదొకటి. (Steve jobs: ఫాదర్ ఆఫ్ ది డిజిటల్ రెవల్యూషన్ గుడ్ బై స్పీచ్ విన్నారా?) ఈ క్రమంలో మీ అద్భుతమైన పని తీరు, మీలో దిగి వున్న ఆయన స్ఫూర్తిని చూసేందుకు స్టీవ్ ఇక్కడ ఉండి వుంటే బావుండేదని ఉద్యోగులనుద్దేశించి టిమ్ కుక్ రాశారు. కానీ అన్నింటికంటే ముఖ్యంగా భవిష్యత్తులో ఏమి సృష్టించబోతున్నారో చూడాలని భావిస్తున్నానన్నారు. తాను గర్వించదగ్గ విజయాలు ఇంకా చాలా రాబోతున్నాయని స్టీవ్ ముందే ఊహించారు. ఆయన ప్రతిరోజూ ఎవ్వరూ చూడని భవిష్యత్తును ఊహించుకుంటూ,తన ఆలోచనలకు జీవం పోసేలా నిర్విరామంగా కృషి చేశారంటూ టిమ్ కుక్ పేర్కొన్నారు. ఎదగడం ఎలాగే నేర్పిన వ్యక్తి స్టీవ్. ఆయనకు ఆయనేసాటి. ఆయనను మిస్ అవుతున్నాను. కానీ ఎప్పటికే ఆయనే స్ఫూర్తి అంటూ టిమ్ కుక్ స్టీవ్‌కు ఘన నివాళులర్పించారు. కాగా కేన్సర్‌తో బాధపడుతూ ఆపిల్ సీఈఓ పదవినుంచి వైదొలిగిన రెండు నెలల తరువాత 2011, అక్టోబర్ 5న 56 సంవత్సరాల వయస్సులో స్టీవ్ జాబ్స్ కన్నుమూశారు. స్టీవ్ స్థానంలో టిమ్ కుక్ సీఈఓగా బాధ్యతలను స్వీకరించారు. సుమారు 2026 వరకు ఈ బాధ్యతల్లో టిమ్ కొనసాగనున్నారు. “People with passion can change the world for the better.”— SJ. Hard to believe it’s been 10 years. Celebrating you today and always. pic.twitter.com/x2IUnlO7ta — Tim Cook (@tim_cook) October 5, 2021 -
జీవితం వడ్డించిన విస్తరి కాదు..అయినా లెజెండ్‌గా ఎదిగాడు
సాక్షి, హైదరాబాద్: కంప్యూటర్ మాంత్రికుడు, ఫాదర్ ఆఫ్ ది డిజిటల్ రెవల్యూషన్‌గా చరిత్రలో నిలిచిపోయిన ఘనత ఆయనది. ఎవరి పేరు చెబితే స్మార్ట్‌ఫోన్ రంగంలో గొప్ప బ్రాండ్ ఇమేజ్ గుర్తు వస్తుందో ఆయనే ప్రపంచంలోనే పాపులర్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఆపిల్ సహ వ్యవస్థాపకుడు, ఆపిల్ మాజీ చైర్మన్, సీఈఓ స్టీవ్ పాల్ జాబ్స్ . టెక్ ప్రియులను విషాదంలో ముంచేస్తూ అక్టోబరు 5న స్టీవ్ జాబ్స్ కన్నుమూశారు. ఈ సందర్భంగా స్పెషల్ స్టోరీ. ఒక్కరోజులో స్టీవ్ జాబ్స్ ఈ కీర్తిని సంపాదించలేదు. ఆయన జీవితం వడ్డించిన విస్తరి అంతకన్నా కాదు. బాల్యంలో అనేక కష్టాలు పడుతూ, చిన్నా చితకా ఉద్యోగాలు చేస్తూ ఎదిగిన వ్యక్తిత్వం ఆయనది. ఆ తరువాత కూడా అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని ఆపిల్ లాంటి కంపెనీని స్థాపించి చరిత్రలో తనకంటూ ఒకస్థానాన్ని మిగిల్చుకున్న వ్యక్తి స్టీవ్ జాబ్స్. దేశంలోని టాప్ 100 సీఈఓలకు సీఈఓ కోచింగ్ అందించడంలో కీలకపాత్ర, కేవలం స్టార్టప్ కంపెనీలకే కాదు అనేక కార్పొరేట్ కంపెనీలకు ఆయనొక మార్గదర్శకుడు. శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియాలోని ఒక సిరియన్ ముస్లిం కుటుంబంలో స్టీవ్ పాల్ జాబ్స్ 1955, ఫిబ్రవరి 24న జన్మించాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో పాల్, క్లారా దంపతులకు ఆ తరువాత దత్తతకువెళ్లిపోయాడు. ఒకవైపు నచ్చని చదువు, మరోవైపు తల్లితండ్రుల కష్టాల నేపథ్యంలో చదువు శ్రద్ధగా పెట్టలేక పోయాడు. పేపర్ బాయ్‌గా పనిచేశాడు. ఎలక్ట్రానిక్స్ స్టోర్‌లోని గిడ్డంగిలో పనిచేశాడు. అయినా తను అనుకున్న రంగంపై చిత్తశుద్ధితో కఠోర శ్రమ చేసి ఒక లెజెండ్‌గా ఎదిగాడు. 1972లో అమెరికాలో అత్యంత ఖరీదైన ప్రైవేట్ యూనివర్సిటీ అయిన రీడ్ కాలేజీలో చేరి, అది నచ్చక దాన్ని వదిలేశాడు. కాలిగ్రఫీ కోర్సు నేర్చుకున్నాడు. స్నేహితులతో కలిసి నేలపై పడుకునేవాడు. ఖాళీ కోక్ బాటిల్స్ అమ్ముకుని జీవించేవాడు. అంతేకాదు వారానికి ఒకసారయినా కడుపు నిండా భోంచేసేందుకు ఏడు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి మరీ ఇస్కాన్ దేవాలయంలో ఉచిత భోజనం తినేవాడు. అలా 1974లో జాబ్స్ అట్టారి ఒక వీడియో గేమ్ కంపెనీలో టెక్నీషియన్‌గా ఉద్యోగం సాధించాడు. ఈ కంపెనీ వ్యవస్థాపకుడు, అధిపతి అభిమానాన్ని చూరగొన్నాడు. 15 సంవత్సరాల వయస్సులోనే ఒక కారునుసొంతం చేసుకున్నాడు. అదే సంవత్సరంలో, ఉద్యోగాలు ఆధ్యాత్మిక జ్ఞానోదయం కోసం ఇండియాకు వచ్చాడు. జైన, బౌద్ధమతంపై తీవ్రంగా ఆకర్షితుడయ్యాడు. 7 నెలలు భారతదేశంలో ఉన్నాడు . పూర్తి శాకాహారిగా మారిపోయాడు. కొంతకాలం తరువాత కాలిఫోర్నియకు వెళ్లిపోయాడు. జాబ్స్ స్నేహితుడు, క్లాస్మేట్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్లంటే ఎంతో ఇష్టమైన స్టీఫెన్ వోజ్నియాకి కలుసుకోవడంతో అతని జీవితం కీలక మలుపు తిరిగింది. 1975 మార్చి 5న, హోమ్మేడ్ కంప్యూటర్స్ క్లబ్ సమావేశం, ఆ తరువాత స్టీఫెన్ వోజ్నియాక్‌తో కలిసి ఈ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం స్టీవ్స్ను, మినీ బస్సును, వోజ్నియాక్ తకెంతో ఇష్టమైన ప్రోగ్రామబుల్ కాలిక్యులేటర్ విక్రయించగా వచ్చిన సొమ్ముతో ఒక కంపెనీని మొదలు పెట్టారు. క్లబ్లో రెడీమేడ్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్లను విక్రయాలను మొదలు పెట్టారు. 21 ఏళ్ల వయసులో 1976, ఏప్రిల్ 1న కాలిఫోర్నియాలోని లాస్ ఆల్టోస్‌లో గ్యారేజిలో ఆపిల్ పేరుతో కంపెనీ మొదలు పెట్టారు. అలా తొలి ఆవిష్కారం "ఆపిల్ కంప్యూటర్" కు భారీ క్రేజ్ వచ్చింది. ఆ తరువాత ఆపిల్ 2 రిలీజ్ చేశాడు. ఇదొక సంచలనం. తద్వారా కోట్ల రూపాయల విలువైన కంపెనీగా ఆపిల్ అవతరించింది. జనవరి 3, 1977లో ఆపిల్ కంప్యూటర్ కంపెనీతో ఆపిల్ కార్పొరేషన్‌గా మారింది. మాకింతోష్ కంప్యూటర్లను కూడా రిలీజ్ చేశాడు. పెప్సీ జాన్ కెల్లీని ఆపిల్ కంపెనీకి తీసుకురావడంతో ఆపిల్ కంపెనీ సీఈవో గారావడం మరింత దూసుకు పోయింది ఆపిల్. ఇంతలో ఆర్థిక మంద్యం ఐబీఎంతో పోటీ, మరోవైపు బోర్డులో విబేధాలతో స్టీవ్‌జాబ్స్ ఆపిల్ కంపెనీకి గుడ్ బై చెప్పాల్సి వచ్చింది. 1985లో జాబ్స్ NeXT Incని కంప్యూటర్ కంపెనీ, సినిమా నిర్మాణ సంస్తలను స్థాపించాడు. ఇక్కడా అనేక విజయాలతోపాటు, ఇబ్బందులు తప్ప లేదు. చివరికి పోగొట్టుకున్నచోటే వెతుకున్నట్టుగా కొన్నాళ్లకే ఆపిల్ కంపెనీలో తిరిగి చేరిపోయాడు. ఇక అప్పటినుంచి స్టీవ్ జాబ్స్ వెనుదిరిగి చూసింది లేదు. ఎన్నో వినూత్న, విప్లవాత్మక ఆవిష్కరణలకు నాంది పలికాడు. మొదటి తరం ఐపాడ్ అక్టోబర్ 23, 2001 న విడుదలైంది. తొలి ఐఫోన్ జనవరి 2007లో వెలుగులోకి వచ్చింది. అత్యాధునిక ఫీచర్ల ఐపాడ్, ఐఫోన్లను ఈ ప్రపంచానికి పరిచయం చేశాడు. ప్రతి ఇంటికి కంప్యూటర్, అదీ చవక ధరలో అన్న తన కలను సాకారం దిశగా అడుగులు వేశాడు. 2003లో జాబ్స్ ప్రాణాంతక ప్యాంక్రియాటిక్ కేన్సర్ బారిన పడ్డాడు. ఆరంభంలో ఈ వ్యాధి చికిత్సకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నాడు జాబ్స్. దాదాపు తొమ్మిది నెలలపాటు అపరేషన్ చేయించుకోవడానికి నిరాకరించాడు. కానీ వ్యాధి మరింత ముదరడంతో, జూలై 2004లో, ప్యాంక్రియాటోడ్యూడెనెక్టమీ ఆపరేషన్ చేసి కణితిని తొలగించారు. కానీ అప్పటికే పరిస్థితి చేయిదాటింది.జాబ్స్ ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. 2009లో, జాబ్స్ తన అనారోగ్యం గురించి అందరికీ తెలియజేయడంతో పాటు తన వ్యాపారాన్ని టిమ్ కుక్కి అప్పగించాడు. అనంతరం 2009లో కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. కారు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి లివర్ డోనేషన్ కారణంగా తను బతికి ఉన్నానని ప్రకటించాడు. అంతేకాదు అందరూ అవయవదానంపై ఆలోచించాలని కూడా విజ్ఞప్తి చేశాడు. 2010 ప్రారంభంలో తిరిగి పనిలో పడినా అనారోగ్యం కారణాల రీత్యా ఆగస్టు 24, 2011న, జాబ్స్ తన పదవీ విరమణను ప్రకటించాడు. ఫలితంగా ఆయన వారసుడిగా టిమ్ కుక్ రంగంలోకి వచ్చాడు. చివరికి ఎనిమిది సంవత్సరాల పాటు క్యాన్సర్‌తో పోరాడి 56 ఏళ్ల వయసులో అక్టోబర్ 5, 2011 ఈ లోకాన్ని వీడాడు జాబ్స్. 2011లో ఆపిల్ ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. 2011 లో ఫోర్బ్స్ మ్యాగజైన్ స్టీవ్ జాబ్స్ నికర ఆస్తులను 7 బిలియన్ డాలర్లుగా అంచనా వేసింది. అమెరికా బిలియనీర్ల ర్యాంకింగ్‌లో అతడిని 39 వ స్థానంలో నిలిపింది. 2007లో, ఫార్చ్యూన్ మ్యాగజైన్ జాబ్స్ని వ్యాపారంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా పేర్కొంది. 2010లో అతను ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో 17 వ స్థానంలో నిలిచాడు. 2011 లో, స్టీవ్ జాబ్స్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. 2012 లో, స్టీవ్ జాబ్స్ "మన కాలంలోని గొప్ప పారిశ్రామికవేత్త" గా ఖ్యాతి దక్కించుకున్నాడు. మరణానంతరం గ్రామీ ట్రస్టీస్ అవార్డును అందుకున్నారు. డిస్నీ చిత్రం "జాన్ కార్టర్", పిక్సర్ కార్టూన్ "బ్రేవ్" అతనికి అంకితం ఇచ్చింది.. స్టీవ్ జాబ్స్ గురించి 10 పుస్తకాలు. 6 డాక్యుమెంటరీలు, 3 ఫీచర్ ఫిల్మ్‌లు రావడం విశేషం. జాబ్స్ వ్యక్తిగత విషయానికి వస్తే స్టాన్ఫోర్డ్ బిజినెస్ స్కూల్ గ్రాడ్యుయేట్ విద్యార్థి లారెల్ పావెల్ ప్రేమించాడు జాబ్స్. మార్చి 18, 1991 వీరు వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం. -
పాఠాలు చెప్పని గురువులు.. అయినా గెలిచిన శిష్యులు
Happy Teacher's Day 2021: గురువంటే బడిత పట్టి పాఠాలు నేర్పేవాడు మాత్రమే కాదు. శిష్యుడంటే పలక పట్టి దిద్దాల్సిన అవసరమూ లేదు. గెలుపు తీరాలను తాకిన వాళ్ల నుంచి పాఠాలు నేర్చుకునే వాళ్లను శిష్యులుగానే భావించొచ్చు. అలాగే వాళ్లకు ప్రత్యక్ష పాఠాలు చెప్పకుండా ‘సక్సెస్’ స్ఫూర్తిని నింపే మార్గదర్శకులు గురువులే అవుతారు. ద్రోణుడికి ఏకలవ్య శిష్యుడిలాగా.. వెతికితే వ్యాపార, టెక్ రంగాల్లో రాటుదేలిన ఎంతో మంది మేధావులు మనకు కనిపిస్తారు. వాళ్లలో గురువుల్ని మించిన శిష్యులుగా, వాళ్ల ‘లెగసీ’కి వారసులుగా ఆయా రంగాల్లో పేరు సంపాదించుకుంటున్న కొందరి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ►సుందర్ పిచాయ్(పిచాయ్ సుందరరాజన్).. 49 ఏళ్ల ఈ టెక్ మేధావి అల్ఫాబెట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌గా, గూగుల్ సీఈవోగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మెటీరియల్స్ ఇంజినీర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టిన సుందర్ పిచాయ్.. 2004లో గూగుల్‌లో అడుగుపెట్టారు. ఇంతకీ ఈయన గురువు ఎవరో తెలుసా? విలియమ్ విన్సెంట్ క్యాంప్‌బెల్ జూనియర్. అమెరికా వ్యాపార దిగ్గజంగా పేరున్న విన్సెంట్ క్యాంప్‌బెల్.. మొదట్లో ఫుట్‌బాల్ కోచ్ కూడా. ఆపై టెక్నాలజీ వైపు అడుగులేసి.. యాపిల్ లాంటి ప్రముఖ కంపెనీలకు పని చేశారు. సుందర్ పిచాయ్.. అంతకంటే ముందు గూగుల్ ఫౌండర్లు ల్యారీ పేజ్, సెర్గీ బ్రిన్, ఎరిక్ షిమిడెట్, జెఫ్ బెజోస్(అమెజాన్ బాస్), జాక్ డోర్సే, డిక్ కోస్టోలో(ట్విటర్), షెరీల్ శాండ్‌బర్గ్(ఫేస్బుక్) లాంటి ప్రముఖులెందరికో ఈయనే మెంటర్ కూడా. ఇక యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్‌కు వ్యక్తిగత గురువుగా చాలాకాలం పని చేశారు విన్సెంట్ క్యాంప్‌బెల్. ►మార్క్ జుకర్‌బర్గ్.. ఫేస్బుక్ ఫౌండర్ కమ్ సీఈవో. చిన్నవయసులోనే బిలియనీర్‌గా ఎదిగిన ఈ ఇంటర్నెట్ ఎంట్రెప్రెన్యూర్.. ఎవరి స్ఫూర్తితో ఈ రంగంలోకి అడుగుపెట్టాడో తెలుసా? టెక్ మేధావి స్టీవ్ జాబ్స్. అవును.. ఈ విషయాన్ని స్టీవ్ జాబ్స్ తన బయోగ్రఫీలోనూ రాసుకున్నాడు. ఇది చాలామందిని విస్తుపోయేలా చేసింది. అయితే స్టీవ్ జాబ్స్ చనిపోయిన చాన్నాళ్లకు ఓ అమెరికన్ టాక్ షోలో జుకర్‌బర్గ్ మాట్లాడుతూ.. ఇదే విషయాన్ని నిర్ధారించాడు. ► రిచర్డ్ బ్రాన్సన్ బ్రిటిష్ వ్యాపారవేత్త, వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు. లేకర్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు, బ్రిటన్ వ్యాపారదిగ్గజం ఫ్రెడ్డీ లేకర్‌ను తన గురువుగా ఆరాధిస్తుంటాడు. ఆయన స్ఫూర్తితోనే తాను ఇవాళ ఉన్నానంటూ చాలా ఇంటర్వ్యూలో గురుభక్తిని చాటుకుంటాడు బ్రాన్సన్. ►సత్య నాదెళ్ల.. మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈవోగా ఉన్న సత్య నాదెళ్ల.. సంస్థ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను గురువుగా ఆరాధిస్తుంటాడు. తన కెరీర్ ఎదుగుదలకు గేట్స్ ఇచ్చిన ప్రోత్సాహం, ప్రోద్భలమే కారణమని చెప్తుంటారు. గొప్ప విజయాలు సాధించేందుకు గేట్స్ చెప్పే సూత్రాలు పాటిస్తే చాలాని తనలాంటి వాళ్లకు సూచిస్తుంటాడు సత్య నాదెళ్ల. ►రతన్ నవల్ టాటా(రతన్ టాటా).. ప్రముఖ వ్యాపారవేత్త. టాటా గ్రూపుల మాజీ చైర్మన్. ప్రస్తుతం టాటా చారిటబుల్ ట్రస్ట్ వ్యవహారాలు చూసుకుంటున్న ఈ పెద్దాయన(83).. ఫ్రెండ్లీబాస్ తీరుతో, సహాయక కార్యక్రమాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇంతకీ ఈయన ఎవరిని గురువుగా భావిస్తాడో తెలుసా?.. టాటా గ్రూపుల మాజీ చైర్మన్ జహంగీర్ రతన్జీ దాదాబాయ్ టాటా(జేఆర్డీ టాటా)ని. ►ఎలన్ మస్క్.. బహుతిక్కమేధావిగా పేరున్న మస్క్ తనకు గురవంటూ ఎవరూ లేరని తరచూ ప్రకటనలు ఇస్తుంటాడు. అంతేకాదు స్పేస్ఎక్స్ బిజినెస్ డెవలప్మెంట్ వ్యవహారాలను చూసుకునే జిమ్ కాంట్రెల్ ఓ ఇంటర్వ్యూలో ‘మస్క్ రాకెట్ సైన్స్ గురించి తనంతట తానే తెలుసుకున్నాడ’ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు కూడా. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. కంప్యూటర్ సైంటిస్ట్-గూగుల్ ఫౌండర్ ల్యారీ పేజ్‌తో దగ్గరగా ఎలన్‌మస్క్ పని చేశాడని, ఆ ప్రభావంతోనే మస్క్ రాటుదేలాడని. ►బిల్ గేట్స్.. వ్యాపార మేధావిగా పేరున్న బిల్‌గేట్స్‌కు, అమెరికా ప్రముఖ వ్యాపారవేత్త వారెన్ బఫెట్‌కు మధ్య అపర కుబేరుడి స్థానం కోసం చాలాకాలం పోటీ నడిచిన విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ, బఫెట్‌ను అన్నింటా తాను గురువుగా భావిస్తానని బిల్‌గేట్స్ చాలా ఇంటర్వ్యూల్లో చెప్తుంటాడు. అంతేకాదు ఇద్దరూ వ్యాపార సలహాలు, ఛారిటీలకు సంబంధించిన వ్యవహారాలపై చర్చించుకుంటారు కూడా. - సాక్షి, వెబ్‌డెస్క్ స్పెషల్