హరేకృష్ణా ఆలయమే అన్నం పెట్టింది!
కష్టకాలం
యాపిల్ కంపెనీ వ్యవస్థాపకుడు స్టీవ్‌జాబ్స్ ఎదుగుదల ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథమే. అత్యంత దుర్భరమైన పరిస్థితుల నుంచి ఎదిగి, ప్రపంచానికి ‘ఐ ఫోన్’ అనే గిఫ్ట్‌ను ఇచ్చిన జాబ్స్ తన ఉన్నతి గురించే కాదు, జీవితంలో తను పడిన ఇబ్బందులను గురించి చెప్పుకోవడానికీ ఏనాడూ వెనుకాడలేదు. ఇలా జాబ్స్ 2005లో స్టాన్‌పోర్డ్ వర్సిటీలో చేసిన ప్రసంగంలో తన ప్రస్థానం గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. ‘‘నాకు కాలేజీ డార్మ్‌రూమ్ ఉండేది కాదు. స్నేహితుల గదుల్లో తలదాచుకొనే వాడిని, గచ్చు మీదే నిద్రపోయేవాడిని.
ఇక తిండి మరో కష్టం. దీని కోసం ఎన్నో పాట్లు పడ్డాను. అయితే వారానికి ఒకసారి మాత్రం మంచి భోజనం కడుపారా తినేవాడిని. అది హరేకృష్ణా టెంపుల్‌లో. ఆదివారం రాత్రికల్లా ఉచితంగా భోజనం పెట్టే అక్కడికి చేరుకొనేవాడిని. దీని కోసం ఏడు కిలోమీటర్ల దూరం నడిచేవాడిని. ఇప్పుడు ఆ కష్టాలన్నీ రొమాంటిక్ అనిపిస్తాయి..’’ అని జాబ్స్ ఆ ప్రసంగంలో హరేకృష్ణా టెంపుల్ తనను ఏ విధంగా ఆదరించిందీ వివరించారు.