ప్రపంచంలోని అతిపెద్ద మతపరమైన కార్యక్రమాలలో.. భారతదేశంలో జరిగే 'మహా కుంభమేళా' (Maha Kumbh Mela) ఒకటి. ఇటీవల ప్రారంభమైన ఈ కార్యక్రమానికి కోట్లాది మంది భక్తులు విచ్చేస్తున్నారు, పవిత్ర సంగమం వద్ద పుణ్యస్థానాలు ఆచరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి దివంగత స్టీవ్ జాబ్స్ భార్య 'లారెన్ పావెల్ జాబ్స్' కూడా వచ్చారు.
మహా కుంభమేళాకు వచ్చిన లారెన్ పావెల్ జాబ్స్ తన పేరును 'కమల'గా మార్చుకున్నారు. కాగా ఇప్పుడు ఆపిల్ కో ఫౌండర్ స్టీవ్ జాబ్స్ చేతితో రాసిన ఓ లేఖ (Letter) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 1974లో రాసిన ఈ లేఖలో స్టీవ్ జాబ్స్ కుంభమేళా కోసం భారతదేశాన్ని సందర్శించాలని రాసినట్లు తెలుస్తోంది.
50 ఏళ్లకింద స్టీవ్ జాబ్స్ రాసిన ఈ లేఖ బోన్‌హామ్స్ వేలంలో 500312 డాలర్లు లేదా రూ.4.32 కోట్లుకు పలికింది. ఇది స్టీవ్ జాబ్స్ స్వయంగా రాసిన మొదటి లేఖ కావడం గమనార్హం. ఈ కారణంగానే దీనిని చాలామంది సొంతం చేసుకోవడానికి ప్రయత్నించారు.
స్టీవ్ జాబ్స్ 19వ పుట్టిన రోజుకు ఒక రోజు ముందు.. అతని చిన్ననాటి స్నేహితుడు టిమ్ బ్రౌన్‌కు ఈ లేఖను పంపించారు. ఇందులో ఆయన ఆధ్యాత్మిక, ఆత్మపరిశీలనకు సంబంధించిన చాలా విషయాలను వెల్లడించారు. అంతే కాకుండా బౌద్ధమతాన్ని గురించి ప్రస్తావిస్తూ.. కుంభమేళా కోసం భారతదేశాన్ని సందర్శించాలనే తన ఆకాంక్షను కూడా అందులో వెల్లడించారు.
భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ.. తాను చాలా సార్లు ఏడ్చినట్లు లేఖలో పేర్కొన్నారు. ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే కుంభమేళా కోసం నేను భారతదేశానికి వెళ్లాలనుకుంటున్నాను. నేను మార్చిలో ఎప్పుడో బయలుదేరుతాను, కానీ ఇంకా ఖచ్చితంగా తెలియలేదని అందులో ప్రస్తావించారు.
స్టీవ్ జాబ్స్ మొదట ఉత్తరాఖండ్‌లోని నీమ్ కరోలి బాబా ఆశ్రమాన్ని సందర్శించాలని అనుకున్నారు. అయితే, నైనిటాల్‌కు చేరుకోగానే, నీమ్ కరోలి బాబా అంతకుముందు సంవత్సరం మరణించినట్లు అతను కనుగొన్నాడు. నిరుత్సాహపడకుండా, జాబ్స్ కైంచి ధామ్‌లోని ఆశ్రమంలో ఉండి, నీమ్ కరోలి బాబా బోధనల నుంచి ఓదార్పు పొందారు. ఆ సమయంలో ఆయన పూర్తిగా ఆధ్యాత్మికతలో మునిగిపోయారు. ఆ తరువాత ఆయనలో చాలా మార్పు వచ్చిందని కూడా చెప్పారు.
ఇప్పుడు, స్టీవ్ భార్య లారెన్ పావెల్ జాబ్స్, మహా కుంభమేళా 2025కి హాజరవడం ద్వారా అతని చిరకాల కోరికలలో ఒకదాన్ని నెరవేర్చింది. ఈమె జనవరి 15 వరకు నిరంజినీ అఖారా క్యాంపులోని కుంభ్ టెంట్ సిటీలో ఉండనున్నారు. ఆ తరువాత జనవరి 20న అమెరికాలోనూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించే కార్యక్రమానికి హాజరవుతారు.
ఇదీ చదవండి: కుంభమేళాలో స్టీవ్ జాబ్స్ భార్యకు అస్వస్థత
ఈ కుంభమేళా కారణంగా రాష్ట్ర ఆర్థిక వృద్ధి కూడా భారీగా పెరుగుతుందని చెబుతున్నారు. ఈ కార్యక్రమానికి కేటాయించిన బడ్జెట్ రూ.7,000 కోట్లు కాగా.. రాష్ట్రానికి వచ్చే ఆదాయం రూ. 2 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా. 45 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి వచ్చే సందర్శకులు సగటున రూ. 5,000 ఖర్చు చేస్తే ఏకంగా రూ. 2 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని చెబుతున్నారు. ఈ ఖర్చు రూ.10వేలకు పెరిగితే.. వచ్చే ఆదాయం రూ. 4 లక్షల కోట్లకు చేరుతుంది.
Steve Jobs letter to his friend about planning to visit Kumbh Mela in India.
The thing to notice here is, he used the word "Shanti" before concluding. pic.twitter.com/s4yN2pupjr— Kartik Jaiswal (@draken73jp) October 24, 2021
Comments
Please login to add a commentAdd a comment