Kumbha Mela
-
Kumbh Mela: కుంభమేళాలో పాల్గొన్న ప్రధానులు వీరే
ప్రయాగ్‌రాజ్: వచ్చే ఏడాది(2025) జనవరి 13 నుంచి యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా లక్షలాదిమంది భక్తులు గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరించనున్నారు. విదేశాల నుంచి కూడా భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు తరలిరానున్నారు.స్వాతంత్య్రానంతరం కుంభమేళాకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ కుంభమేళాలో సాధువులతో పాటు రాజకీయ ప్రముఖులు, సామాన్యులు కూడా పాల్గొంటున్నారు. నాటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ మొదలుకొని పలువురు రాజకీయ ప్రముఖులు వివిధ సమయాల్లో జరిగిన కుంభమేళాలలో పాల్గొంటూవస్తున్నారు. ताकि सनद रहे : पहले प्रधानमंत्री पंडित जवाहरलाल नेहरू भी कुंभ में स्नान कर चुके हैं और जनेऊ भी धारण किए हुए हैं।#KumbhMela2019 pic.twitter.com/06DUeCHBwr— Vinod Kapri (@vinodkapri) January 18, 2019పండిట్ జవహర్లాల్ నెహ్రూ (1951)భారత తొలి ప్రధాని పండిట్ నెహ్రూ కుంభమేళాను భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా అభివర్ణించారు. నెహ్రూ 1951లో జరిగిన కుంభమేళాకు హాజరయ్యారు.ఇందిరా గాంధీభారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కూడా కుంభమేళా నిర్వహణకు సహకారం అందించడమే కాకుండా, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందిరాగాంధీ హయాంలో కుంభమేళాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది.అటల్ బిహారీ వాజ్‌పేయి (2001)అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కుంభమేళాలో ఆయన పాల్గొన్నారు. పుణ్యస్నానాలు ఆచరించే భక్తులకు మెరుగైన ఏర్పాట్లు చేశారు. కుంభమేళా ఘనంగా నిర్వహించేందుకు అటల్ బిహారీ వాజ్‌పేయి విశేష కృషి చేశారు.నరేంద్ర మోదీ (2019)2019లో జరిగిన కుంభమేళాలో ప్రధాని నరేంద్ర మోదీ గంగాస్నానం చేసి, ఈ కార్యక్రమం భారతీయ సంస్కృతికి విశిష్ట చిహ్నంగా అభివర్ణించారు. కుంభమేళాలో పరిశుభ్రత, మెరుగైన వసతుల కల్పనపై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి సారించారు.త్రివేణీ సంగమం కేంద్రంగా..ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కార్యక్రమంగా కుంభమేళా గుర్తింపు పొందింది. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో వచ్చే ఏడాది జనవరిలో జరిగే మహాకుంభమేళాలో భక్తులు గంగా, యమున, సరస్వతి నదుల పవిత్ర సంగమంలో స్నానం చేయనున్నారు. ఈ సారి కుంభమేళాను మరింత ఘనంగా నిర్వహించేందుకు యూపీ సర్కారు ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది. ఈ సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో బాలీవుడ్ ప్రముఖులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.అలరించనున్న సాంస్కృతి కార్యక్రమాలుగాయకుడు, స్వరకర్త శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్, సోనూ నిగమ్, విశాల్ భరద్వాజ్, రిచా శర్మ, శ్రేయా ఘోషల్ తదితరులు తమ గానమాధుర్యంతో భక్తులను అలరించనున్నారు. కుంభమేళా సందర్భంగా ఏర్పాటు చేసే కార్యక్రమాలు జనవరి 10 నుంచి ప్రారంభం కానున్నాయి. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.శంకర్ మహదేవన్ సంగీత కార్యక్రమంజనవరి 10న ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్ తన పాటలతో అలరించనున్నారు. జానపద గాయని మాలినీ అవస్థి జనవరి 11న తన సంగీత ప్రదర్శన ఇవ్వనున్నారు. జనవరి 18న గాయకుడు కైలాష్ ఖేర్ ప్రదర్శన ఉండవచ్చని సమాచారం. జనవరి 19న సాయంత్రం సోనూ నిగమ్ తన గానంతో మ్యాజిక్ చేయనున్నారు. జనవరి 20న ప్రముఖ జానపద గాయని మైథిలీ ఠాకూర్, జనవరి 31న కవితా పౌడ్వాల్, ఫిబ్రవరి 1న విశాల్ భరద్వాజ్, ఫిబ్రవరి 2న రిచా శర్మ, ఫిబ్రవరి 8న జుబిన్ నౌటియల్, ఫిబ్రవరి 10న రసిక శేఖర్, ఫిబ్రవరి 10న హన్స్‌రాజ్ రఘువంశీ, ఫిబ్రవరి 14న శ్రేయా ఘోషల్ తదితరులు తమ మధురమైన స్వరంతో భక్తులను అలరించనున్నారు.ఇది కూడా చదవండి: బంగ్లాదేశ్‌కు శాంతి పరిరక్షక దళం?.. ఏం జరగనుంది? -
Mahakumbh Mela 2025: మహాకుంభమేళా జరిగే తేదీలు.. ప్రాంతాలు ఇవే..
లక్నో: దేశంలో 12 ఏళ్లకు ఒకసారి జరిగే మహాకుంభమేళా ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. ఈ మేళాలో కోట్లాది మంది భక్తులు పాల్గొంటారు. మహాకుంభమేళాలో పుణ్యస్నానాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. 2025 జనవరిలో నిర్వహించే బోయే మహాకుంభమేళాకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహా కుంభమేళా ఏఏ ప్రాంతాల్లో ఏఏ తేదీల్లో జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో 2025 జనవరి 13న పౌష్య పూర్ణిమ నుంచి కుంభమేళా ప్రారంభం కానుంది. ఇది 2025, ఫిబ్రవరి 26న శివరాత్రితో ముగియనుంది. అంతకుముందు 2013లో ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా నిర్వహించారు.పుణ్యస్నానాలు- తేదీలుమొదటి పుణ్యస్నానం జనవరి 13న పౌష్య పూర్ణిమ రోజున జరగనుంది.జనవరి 14న మకర సంక్రాంతి శుభ సందర్భంగా భక్తులు పుణ్యస్నానాలు చేయనున్నారు.జనవరి 29న మౌని అమావాస్య నాడు పుణ్యస్నానాలు ఆచరించనున్నారు.ఫిబ్రవరి 3న వసంత పంచమి శుభ సందర్భంగా పుణ్యస్నానాలు చేయనున్నారు.ఫిబ్రవరి 12న మాఘ పూర్ణిమ రోజున పుణ్యస్నానాలు చేయున్నారు.ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజున కుంభమేళాలో చివరి పుణ్యస్నానాలు చేయనున్నారు.మహాకుంభమేళాలో పుణ్యస్నానాలను అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ ప్రత్యేకమైన రోజున సాధువులు, నాగా సాధువులు, ఇతర శాఖల మహంత్‌లు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. వారు స్నానం చేసిన తరువాత సామాన్య భక్తులకు పుణ్యస్నానాలు చేసే అవకాశం లభిస్తుంది. మనదేశం నుంచే కాకుండా విదేశాల నుండి కూడా కోట్లాది మంది హిందువులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఇక్కడకు తరలి వస్తుంటారు. మహాకుంభమేళా జరిగే సమయంలో త్రివేణిసంగమంలోని నీరు అమృతంలా మారుతుందని చెబుతుంటారు. మహాకుంభమేళా సమయంలో పుణ్య స్నానాలు చేయడం వల్ల పాపాలు నశించి, మోక్షం లభిస్తుందని హిందువులు నమ్ముతారు.పుణ్యస్నానాలు- ప్రాంతాలుప్రయాగ్రాజ్యూపీలోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాకు కేంద్రంగా నిలుస్తుంది. ఇక్కడి త్రివేణి సంగమంలో భక్తులు పూజలు, పుణ్యస్నానాలు చేస్తారు. గంగా, యమున, సరస్వతి నదుల సంగమం ఇది. ఇక్కడ సరస్వతి నది అదృశ్యంగా ఉంటుందని అంటారు.హరిద్వార్కుంభమేళా సమయంలో లక్షలాది మంది భక్తులు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో పుణ్యస్నానాలు చేస్తారు. గంగానది.. పర్వతాలను వీడి ఇక్కడి నుంచే మైదానాలలోకి ప్రవేశిస్తుంది. హరిద్వార్.. హిమాలయ పర్వత శ్రేణిలోని శివాలిక్ పర్వతాల దిగువన ఉంది. హరిద్వార్‌ను తపోవన్, మాయాపురి, గంగాద్వార్, మోక్ష ద్వార్ అని కూడా పిలుస్తుంటారు.నాసిక్నాసిక్లో జరిగే కుంభమేళాను నాసిక్ త్రయంబక్ కుంభమేళా అని కూడా అంటారు. దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో త్రయంబకేశ్వరం ఒకటి. త్రయంబకేశ్వరంలో 12 ఏళ్లకు ఒకసారి సింహస్థ కుంభమేళా జరుగుతుంది. కుంభమేళా సందర్భంగా, వేలాది మంది భక్తులు గోదావరి పవిత్ర జలాల్లో స్నానాలు చేస్తారు. ఇక్కడ శివరాత్రిని ఎంతో వైభవంగా నిర్వహిస్తారు.ఉజ్జయినిఉజ్జయినిలో క్షిప్రా నది ఒడ్డున పుణ్యస్నానాలు చేస్తారు. ఈ సందర్భంగా భక్తులు మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయాన్ని సందర్శిస్తారు. ఉజ్జయిని నగరం మధ్యప్రదేశ్‌కు పశ్చిమాన ఉంది.యూపీ రవాణాశాఖ సన్నాహాలుఉత్తరప్రదేశ్ రవాణాశాఖ మహాకుంభమేళా సందర్భంగా ఏడు వేల ప్రత్యేక బస్సులను నడిపేందుకు ప్రణాళిక రూపొందించింది. వీటిలో 200 ఎయిర్ కండిషన్డ్ బస్సులు కూడా ఉండనున్నాయి. మహిళలు, వృద్ధ యాత్రికులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని రవాణాశాఖ భావిస్తోంది. ఇది కూడా చదవండి: Jharkhand: ఇలా గెలిచి.. అలా రాజీనామాకు సిద్ధమై.. ఏజేఎస్‌యూలో విచిత్ర పరిణామం -
కుంభమేళా ఎఫెక్ట్: ఒక్కరి వల్ల 33 మందికి కోవిడ్
బెంగళూరు: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. ప్రతి రోజు లక్షల కొద్ది కేసులు నమోదవుతున్నాయి. సామాజిక దూరం పాటించండి, మాస్క్ ధరించండి అంటూ ప్రభుత్వాలు ఎంత మొత్తుకున్న వాటిని పట్టించుకోకుండా జనాలు అడ్డగోలుగా తిరుగుతున్నారు. ఉత్సవాలు, వేడుకలు నిర్వహించి.. కోవిడ్ వ్యాప్తిని పెంచుతున్నారు. తాజాగా కుంభమేళాకు వెళ్లొచ్చిన ఓ మహిళ.. మొత్తం 33 మందికి కరోనాను అంటించింది. బెంగళూరుకు చెందిన ఓ 67 ఏళ్ల మహిళ ఉత్తరాఖండ్‌లో ఇటీవల జరిగిన కుంభమేళాకు వెళ్లొచ్చింది. తర్వాత కొద్ది రోజులకే ఆమెకు కరోనా లక్షణాలు బయటపడ్డాయి. టెస్టు చేయించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆ మహిళతో పాటు ఆమె కుటుంబంలోని మరో 18 మందికి కరోనా వ్యాపించింది. సదరు మహిళా కోడలు.. వెస్ట్ బెంగళూరులోని స్పందన హెల్త్‌కేర్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్లో సైక్రియాటిస్టుగా పని చేస్తోంది. ఈ క్రమంలో ఆమె ద్వారా ఆ సెంటర్లో ఉన్న 13 మంది రోగులతో పాటు ఇద్దరు సిబ్బందికి కరోనా వ్యాపించింది. అలా మొత్తం 33 మందికి కరోనా సోకింది. ఈ విషయం తెలుసుకున్న అధికారులు.. 67 ఏళ్ల మహిళ నివాసంతో పాటు ఆ పరిసరాలను కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. చదవండి: Kumbh Mela 2021: ‘కుంభమేళా’పై విమర్శల వెల్లువ -
కుంభమేళా నుంచి వచ్చిన 99 శాతం మందికి కరోనా
భోపాల్: దేశంలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తుంది. ఇటువంటి సమయంలో మధ్యప్రదేశ్ నుంచి ఒక షాకింగ్ రిపోర్ట్ విడుదలైంది. ఈ రిపోర్ట్ లో హరిద్వార్ కుంభమేళా నుంచి తిరిగి వచ్చిన 99 శాతం మందికి కుంభం కరోనా వైరస్ సోకినట్లు తేలింది. కుంభమేళా నుంచి వచ్చిన 61 మందిలో 60 మంది యాత్రికులకు పాజిటివ్‌గా తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కుంభమేళాలో పాల్గొని రాష్ట్రానికి తిరిగివచ్చిన వారిలో మరికొందరిని ఇంకా గుర్తించకపోవడంతో వారి ద్వారా వైరస్ సంక్రమణపై ఆందోళన వ్యక్తమవుతోంది. కొవిడ్-19 కేసులు వేగంగా పెరగడంతో ప్రపంచంలోని అతిపెద్ద మతపరమైన సమావేశాలలో ఒకటైన కుంభమేళా నుంచి తిరిగివచ్చిన యాత్రికులు 14 రోజులు విధిగా క్వారంటైన్లో ఉండాలని పలు రాష్ట్రాలు నిర్ధేశించాయి. ఢిల్లీ ప్రభుత్వం కుంభమేళా నుంచి వచ్చిన వారు కచ్చితంగా 14 రోజులు తప్పనిసరిగా క్వారంటైన్లో ఉండాలని పేర్కొంది. చదవండి: కరోనా: చెత్తకుప్పలో మెతుకులే పరమాన్నం -
మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్‌కు కోవిడ్ ఎలా సోకిందంటే..
సాక్షి, ముంబై: బాలీవుడ్ సంగీత దర్శక ద్వయం నదీమ్-శ్రవణ్‌లలో ఒకరైన శ్రవణ్ రాథోడ్ (66) కరోనాకు బలైన సంగతి తెలిసిందే. అయితే ఆయనకు కోవిడ్ ఎలా సోకిందనే దానపై షాకింగ్ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. వైరస్ బారిన పడటానికి కొన్ని రోజుల ముందు ఆయన కుంభమేళాకు హాజరయ్యారని శ్రవణ్ కుమారుడు సంజీవ్ రాథోడ్ వెల్లడించారు. (కరోనాతో సంగీత దర్శకుడు కన్నుమూత) ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సమాచారం ప్రకారం శ్రవణ్ రాథోడ్, ఆయన భార్య కరోనా బారిన పడటానికి కొన్నిరోజుల ముందు హరిద్వార్‌లోని కుంభమేళాకు హాజరయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా సంజీవ్ వెల్లడించిన సంజీవ్ తమ కుటుంబం ఇంత ఘోరమైన పరిస్థితిల్లో కూరుకుపోతుందని తాము ఎప్పుడూఅనుకోలేదంటూ కంటితడి పెట్టారు. కన్నతండ్రి దూరమయ్యారు.తాను, అమ్మ, సోదరుడు కూడా ప్రస్తుతం కరోనాతో బాధపడుతున్నా మంటూ ఆయన వాపోయారు. అయితే హోం అసోలేషన్లో ఉన్న సోదరుడు తన తండ్రి అంత్యక్రియలు చేసేందుకు అనుమతి తీసుకున్నట్టు వెల్లడించారు. అలాగే హాస్పిటల్ యాజమాన్యం బిల్లింగ్ సమస్య కారణంగా శ్రవణ్ మృత దేహాన్ని ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిందన్న పుకార్లను సంజీవ్ ఖండించారు. అలాంటిదేమీ లేదని వారు చేయగలిగిన సహాయం చేశారని తెలిపారు. కాగా కోవిడ్ పాజిటివ్ రావడంతో పరిస్థితి విషమించిన స్థితిలో శ్రవణ్‌ను ఎస్ఎల్ రహేజా ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. కానీ ఫలితం దక్కలేదు. గురువారం రాత్రి శ్రవణ్ తుదిశ్వాస విడిచారు. (ఆక్సిజన్ ట్యాంకర్ మిస్సింగ్ కలకలం) చదవండి : షాకింగ్: గుండెపోటుతో పాపులర్ యాక్టర్ మృతి -
కుంభమేళాలో కరోనా: రెండుగా చీలిన సాధువులు
సాక్షి, న్యూఢిల్లీ: దేవభూమి ఉత్తరాఖండ్ ఇప్పుడు కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకుంటోంది. హరిద్వార్‌లో జరుగుతున్న మహా కుంభ్‌మేళాలో షాహీ స్నానాల సందర్భంగా లక్షల సంఖ్యలో భక్తులు గంగా నదిలో పుణ్యస్నానాలు చేసినప్పటి నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో కుంభ్ మేళా కాస్తా కరోనా మేళాగా రూపాంతరం చెందుతోంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఫిబ్రవరి 14 నుంచి ఫిబ్రవరి 28 వరకు 172 మందికి మాత్రమే కరోనా సోకినట్లు గుర్తించారు. ఈ సంఖ్య ఏప్రిల్ 1 నుంచి 15 మధ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ 15 రోజుల్లో రాష్ట్రంలో 15,333 మందిని కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. ఫిబ్రవరితో పోలిస్తే ఏప్రిల్ కల్లా కరోనా పాజిటివ్ కేసుల వృద్ధిరేటు 8814% గా నమోదైంది. మహా కుంభ్‌మేళాలో పాల్గొన్న సాధువుల్లో అధికారిక గణాంకాల ప్రకారం 49 మంది సాధువులకు కరోనా సోకగా అందులో రెండవ అతిపెద్ద అఖాడాకు చెందిన ప్రధాన సాధువు మహామండలేశ్వర్ కపిల్ దేవ్ దాస్ (65) చనిపోయారు. ఇది అధికారిక సంఖ్య మాత్రమే. కానీ వైరస్ సోకిన సాధువుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండవచ్చని అంచనా. వివిధ అఖాడాల్లో సాధువుల ఆర్టీపీసీఆర్ పరీక్షలు జరుగుతున్నాయని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. నేటి నుంచి అఖాడాల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలను వేగవంతం చేయనున్నారు. మరోవైపు షాహీ స్నానాల అనంతరం మహాకుంభ్ మేళా సూపర్ స్ప్రెడర్గా మారిపోయిందనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. హరిద్వార్ జిల్లాలో కుంభమేళా సమయంలో 2,483 మందికి కరోనా ఇన్ఫెక్షన్ సోకినట్లు అధికారులు గుర్తించారు. నేటితో కుంభ్‌మేళా పూర్తి: నిరంజని, ఆనంద్ అఖాడాలు కుంభ్‌మేళాకు లక్షల సంఖ్యలో భక్తులు హాజరుకావడంతో ఉత్తరాఖండ్‌లో కరోనా ఇన్ఫెక్షన్ వేగంగా పెరుగుతోంది. గత రెండు వారాలుగా, రాష్ట్రంలో ప్రతి ఒకటిన్నర నిమిషానికి ఒకరు కరోనా బారిన పడుతున్నారు. అయితే కుంభ్‌మేళాను నేటితో ముగించనున్నట్లు నిరంజని అఖాడా, ఆనంద్ అఖాడాలు ప్రకటించాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, తమ దృష్టిలో నేటితో కుంభమేళా ముగిసిందని నిరంజని అఖాడా కార్యదర్శి మహంత్ రవీంద్ర పూరి తెలిపారు. అయితే కుంభమేళా ముగిసిందని ప్రకటించిన ఆయనకు కరోనా సోకినట్లు శుక్రవారం నిర్ధారణ అయ్యింది. దీంతో అఖాడాల్లోని ఇతర సాధువులలో గందరగోళ వాతావరణం నెలకొంది. ఆయనతో పాటు మరో 16 మంది సాధువులను కూడా కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. అదే సమయంలో అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడు నరేంద్ర గిరికి ఏప్రిల్ 11న కరోనా పాజిటివ్‌గా తేలింది. ముగింపుపై సాధువుల ఆగ్రహం.. కరోనా సంక్రమణను పరిగణనలోకి తీసుకుని మహా కుంభ్‌మేళాను నేటితో మూసివేస్తున్నట్లు నిరంజన్, ఆనంద్ అఖాడాలు ప్రకటించిన తరువాత, సాధువులలో ప్రతిష్టంభన ఏర్పడింది. కుంభ్ రద్దు ప్రకటనపై ఒకవైపు బైరాగి సాధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, మరోవైపు జగద్గురు శంకరాచార్యుల శిష్యుడైన స్వామి అవిముక్తేశ్వరానంద నిర్ణీతకాలం వరకు కుంభ్ కొనసాగుతుందని ప్రకటించారు. కుంభ్‌మేళా ఏ ఒక్క సంస్థ లేదా అఖాడాలకు చెందినది కాదని స్వామి అవిముక్తేశ్వరానంద తెలిపారు. నిరంజని అఖాడా కుంభ్‌ను రద్దు చేసినట్లు ప్రకటించడంపై బైరాగి సాధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరంజని, ఆనంద్ అఖాడాలకు చెందిన సాధువులు తాము చేసిన ప్రకటనపై క్షమాపణ చెప్పాలని నిర్మోహి, నిర్వాణి, దిగంబర్ అఖాడాలు డిమాండ్ చేశాయి. కుంభ్‌మేళాను ముగించే హక్కు ముఖ్యమంత్రికి, మేళా అడ్మినిస్ట్రేషన్‌కు మాత్రమే ఉందని వారు ప్రకటించారు. కుంభ్ ముగిసిందని ప్రకటించిన సాధువు క్షమాపణ చెప్పకపోతే, అతను అఖాడా కౌన్సిల్లో కొనసాగలేడని తేల్చిచెప్పారు. ఏదేమైనా కుంభ్‌మేళా కొనసాగుతుందని, ఏప్రిల్ 27న బైరాగి సాధువులందరూ షాహీ స్నానాలు చేస్తారని తెలిపారు. -
కరోనాపై ఆటం బాంబు పేల్చిన రామ్‌గోపాల్ వర్మ
తనకు నచ్చిన విషయాన్ని ఏదైనా స్పష్టంగా చెప్పడంతో పాటు వ్యంగ్యంగా చెప్పడంతో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు సర్వసాధారణం. ఏది తోచితే అది ఆ అంశంపై స్పందించి సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయం చెబుతాడు. ఆయన్ను అభిమానించేవారు ఎంతమంది ఉన్నారో ద్వేషించేవారు అంతకన్నా అధికంగా ఉంటారు. తాజాగా మరో అంశంపై ఆర్జీవీ స్పందించారు. వరుసగా అదే అంశంపై రోజంతా ట్వీట్లు చేస్తూ ఉన్నారు. కరోనా ఆటం బాంబుగా పోల్చారు. దీంతో మహారాష్ట్రలో లాక్డౌన్ ప్రకటించలేదు కానీ తీవ్ర ఆంక్షలు విధించిన విషయంపై స్పందించి ట్వీట్ చేశారు. ఉగాది సందర్భంగా ప్రారంభమైన కుంభమేళాను ప్రస్తావిస్తూ ట్వీట్లు చేశారు. కుంభమేళాను కరోనా ఆటం బాంబుగా సరిపోల్చారు. ఈ పేలుడుకు ఎవరు బాధ్యత తీసుకుంటారు? అని ప్రశ్నించారు. గుడ్‌బై ఇండియా, వెల్కమ్ కరోనా అంటూ ట్వీట్ చేశారు. కుంభమేళ నుంచి వచ్చినవారికి మాస్క్‌లే అవసరం లేదని.. వాళ్లు ఇప్పటికే గంగలో మునిగి వైరస్‌ను వదిలేశారు అని పేర్కొన్నారు. ఇక మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ప్రకటించిన నిషేదాజ్ఞలపై స్పందించారు. నేను దీనిని లాక్డౌన్ అని ఉద్దవ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై ట్వీట్ చేశారు. ‘దానికి ఇంకో పేరు పెడుతున్నా. బారసాల కార్యక్రమానికి అందరూ రండి. గిఫ్ట్‌లు తీసుకురావడం మర్చిపోవద్దు’ అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. కుంభమేళాలో 31 లక్షల మంది పాల్గొంటే వారిలో 26 మందికే పాజిటివ్ సోకిన వార్తపై కూడా ఆర్జీవీ స్పందించి ఓ పోస్టు చేశారు. ‘అయితే అందరికీ ఎలాంటి సమస్య లేదు. అందరం పార్టీ చేసుకుందాం’ అని తెలిపాడు. If in a 31 lakh congregation like this as per govt only 26 tested positive then there’s no problem at all 💃💃 💃💃💃💃💃💃 Let’s all party 💐💐💐 https://t.co/Py8t66rnx5 pic.twitter.com/WZvt7pNqQQ — Ram Gopal Varma (@RGVzoomin) April 13, 2021 Lakhs are dipping in kumbh mela to wash off their karma and as a blessing are getting the covid and then they are further gifting it to many more and when they die all will get double karma.😍😍😍😍 — Ram Gopal Varma (@RGVzoomin) April 14, 2021 -
Kumbh Mela 2021: ఇలపైనే భారీ ఉత్సవం ఈసారి నెల మాత్రమే
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో గంగానది తీరాన నిర్వహించే కుంభమేళా ఈసారి నెల రోజులపాటు మాత్రమే కొనసాగనుంది. కోవిడ్–19 మహమ్మారి తీవ్రత దృష్ట్యా ఈ అసాధారణ నిర్ణయం తీసుకున్నట్లు అధికార యంత్రాంగం తెలిపింది. కోవిడ్ ఆర్టీ–పీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ కలిగి ఉన్న యాత్రికులనే అనుమతిస్తామని స్పష్టం చేసింది. ఏప్రిల్ 1న మొదలై 30వ తేదీతో ముగిసే ఈ ఉత్సవంలో ఏప్రిల్ 12, 14, 27వ తేదీల్లో షాహీస్నాన్ (ప్రధాన పుణ్య స్నానం) ఉంటాయని ప్రభుత్వం ఒక నోటిఫికేషన్లో తెలిపింది. ఈ రోజుల్లో పెద్ద సంఖ్యలో భక్తులు నదిలో పుణ్యస్నానాలు చేస్తారు. దీంతోపాటు పుణ్య దినాలైన చైత్ర ప్రతిపాద (ఏప్రిల్ 13), శ్రీరామ నవమి (ఏప్రిల్ 21) రోజున భక్తులు భారీగా తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. 12 ఏళ్లకోసారి జరిగే కుంభ్ మేళా సాధారణంగా మూడున్నర నెలల పాటు కొనసాగుతుంది. 2010లో జనవరి 14న ప్రారంభమై ఏప్రిల్ 28వ తేదీన ముగిసింది. నెల రోజులపాటు మాత్రమే కుంభ్ జరగడం చరిత్రలో ఇదే మొదటిసారని అధికారులు చెప్పారు. హరిద్వార్‌కు చేరుకునే ముందు 72 గంటల్లోపు పొందిన ఆర్టీ–పీసీఆర్ నెగెటిట్ సర్టిఫికెట్‌ను భక్తులు తప్పనిసరిగా కలిగి ఉండాలన్న ఉత్తరాఖండ్ హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ సర్టిఫికెట్‌ను అధికారిక పోర్టల్‌లో అప్లోడ్ చేసి, మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది. దేశంలో కోవిడ్ వ్యాప్తి పెరుగుతున్న దృష్ట్యా కుంభ్ సమయంలో తప్పనిసరిగా ప్రజలు జాగ్రత్తలు పాటించేలా చూడాలని కేంద్రం రాష్ట్రాన్ని కోరింది. -
త్వరలో కుంభమేళ.. ఈ సూచనలు పాటించాలి
డెహ్రడూన్: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మళ్లీ పెరుగుతూ కలవరపెడుతోంది. అయితే ఉత్తరఖండ్‌లోని హరిద్వార్‌లో త్వరలో కుంభమేళ ఉత్సవం ప్రారంభంకానుంది. ఈ ఉత్సవంలో పెద్దసంఖ్యలో భక్తులు, యాత్రికులు, విదేశీయులు పాల్గొని, పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఢిల్లీకి చెందిన జాతీయ అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం(ఎన్సీడీసీ) బృందాన్ని ఉత్తరఖండ్‌కు పంపింది. అదేవిధంగా కొవిడ్ నిబంధనలపై సూచనలు చేయాల్సిందిగా కోరింది. అయితే ఈ బృందం మార్చి రెండో వారంలో కుంభమేళ జరిగే ప్రాంతాలను సందర్శించింది. ఆ ప్రాంతాల్లో సరైన సౌకర్యాలు లేవని తెలిపింది. అక్కడ ప్రతిరోజు 10 నుంచి 20 కరోనా కేసులు నమోదవుతున్నాయని అధికారులు వెల్లడించారు. కుంభమేళకు వచ్చే భక్తుల విధిగా కోవిడ్ నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకొవాలని ఎన్సీడీపీ బృందం సూచించింది. ప్రత్యేకంగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని పేర్కొంది. అధిక సంఖ్యలో వాలంటీర్లను నియమించి, ఎప్పటికప్పుడు కరోనా నింబంధనలపై అవగాహన కల్పించాలని పేర్కొంది. కాగా, ఉత్తరఖండ్‌లో రోజుకు 50వేల ర్యాపిడ్ ఆంటీజెన్, 5వేల ఆర్టీపీసీఆర్ పరీక్షలు జరుపుతున్నామని ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఇక కుంభమేళ ఉత్సవ నేపథ్యంలో కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్యను మరింత పెంచుతామని తెలిపారు. ఎన్సీడీసీ బృందం చేసిన సూచనలను ఉత్సవ సమయంలో పాటిస్తామని ఉత్తరఖండ్ ప్రభుత్వ కార్యదర్శి ఉత్సాల్ సింగ్ తెలిపారు. చదవండి: ఢిల్లీ చేరుకున్న కుంభ్ సందేశ్ యాత్ర -
‘వేల మందిని చంపిన పాపం నెహ్రూదే’
లక్నో : ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి కాంగ్రెస్ పార్టీపై, దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మీద విమర్శల వర్షం కురిపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కౌశాంబీలో పర్యటించిన మోదీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుంభమేళా నిర్వహణ విషయంలో ఎలా వ్యవహరించాయో వివరించారు. ఈ క్రమంలో 1954లో కుంభమేళా సందర్భంగా జరిగిన తొక్కిసలాటను మరోసారి తెరమీదకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘ఈ ఏడాది యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కుంభమేళాను చాలా చక్కగా నిర్వహించారు. కానీ దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అధ్వర్యంలో 1954లో అలహాబాద్‌లో కుంభమేళా నిర్వహించినప్పుడు తొక్కిసలాట జరిగింది. వేల మంది చనిపోయారు. అయితే ఈ ఘటనలో చనిపోయిన వారి పేర్లు ఒక్కటి కూడా బయటకు రాలేదు. అంతేకాక వారికి కనీసం ఒక్క రూపాయి కూడా నష్ట పరిహారం అందలేద’ని మోదీ ఆరోపించారు. నెహ్రూను కాపాడటం కోసమే అప్పటి మీడియా ఈ వార్తలను ప్రజల దృష్టికి తీసుకురాలేదన్నారు మోదీ. అంతేకాక ఆ తొక్కిసలాటలో వేల మంది మరణించారని.. ఈ పాపం దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూదే అని ఆరోపించారు. గతంలో కూడా మోదీ.. నెహ్రూను ఉద్దేశిస్తూ.. గులాబీలు ధరించే వారికి తోటల గురించి అవగాహన ఉంటుందేమో కానీ.. రైతుల కష్టాల గురించి వారికి ఏ మాత్రం తెలియదని విమర్శించారు. -
ప్రచారం కోసం ఇంత అబద్ధమా!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ వెళ్లి కుంభమేళ సందర్భంగా గంగా నదిలో పవిత్ర స్నానం ఆచరించిన విశయం తెల్సిందే. ‘భారత దేశాధినేత (హెడ్ ఆఫ్ స్టేట్) కుంభమేళలో పాల్గొనడం ఇదే మొట్టమొదటి సారి’ అంటూ భారతీయ జనతా పార్టీ ఐటీ విభాగం అధిపతి అమిత్ మాలవియా ఓ ట్వీట్ చేశారు. ఆయనకు దేశాధినేతకు ప్రధాన మంత్రికి తేడా కూడా తెలియదనుకుంటా! దేశాధినేత అంటే భారత్‌కు రాష్ట్రపతే. 1953లోనే అప్పటి భారత రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ కుంభమేళలో పాల్గొన్నారు. ఆయన తర్వాత కుంభమేళలో పాల్గొన్న రెండో దేశాధినేతను తానేనంటూ దేశాధ్యక్షుడు రామ్‌నాథ్ కోవింద్ జనవరి 17వ తేదీ సాయంత్రం స్వయంగా ట్వీట్ చేశారు. పోనీ కుంభమేళలో పాల్గొన్న తొలి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీని గుర్తించాలంటే అది నిజం కాదు. 1954లో తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ కుంభమేళను సందర్శించి గంగా జలాన్ని నెత్తిన చల్లుకున్నారు. కుంభమేళ ఏర్పాట్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి వచ్చేవి అయినప్పటికీ జవహర్ నెహ్రూ స్వయంగా కుంభమేళ ఏర్పాట్లు దగ్గరుండి చూసుకున్నారు. ఈ విశయాన్ని కామా మాక్లీన్ అనే రచయిత్రి ‘పిలగ్రమేజ్ అండ్ పవర్: ది కుంభమేళా ఇన్ అలహాబాద్ 1765–1954’ అనే పుస్తకంలో ప్రస్థావించడమే కాకుండా గంగా జలాన్ని తల మీద చల్లుకుంటున్న నెహ్రూ ఫొటోను కూడా ప్రచురించారు. ఆ తర్వాత 1977లో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ కూడా కుంభమేళలో పాల్గొన్నారు. ఆమె గంగలో ఉన్నప్పుడు తాను పక్కనే ఉన్నానని సీనియర్ జర్నలిస్ట్, రచయిత్రి, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కాలమిస్ట్ తవ్లీన్ సింగ్ పేర్కొన్నారు. ఇందిరాగాంధీ దేశ ప్రధానిగా కుంభమేళను సందర్శించినట్లు సాక్ష్యాలు ఉన్నాయి. గంగా నదిలో మునిగి పవిత్ర స్నానం చేశారనడానికి సాక్ష్యాధారాలు కనిపించడం లేవు. -
4న బాధ్యతలు చేపట్టనున్న ప్రియాంక!
న్యూఢిల్లీ: ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయ ప్రవేశానికి ముహూర్తం ఖరారైంది. ఉత్తరప్రదేశ్ (తూర్పు) పార్టీ వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా ఫిబ్రవరి 4న ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు. కుంభమేళాలో గంగానదిలో పుణ్యస్నానమాచరించి పార్టీలో ఆమె పదవీ బాధ్యతలు తీసుకుంటారని ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది. ప్రియాంకతో పాటు ఆమె సోదరుడు రాహుల్ గాంధీ కూడా గంగా నదిలో పుణ్యస్నానం చేయనున్నారు. అదే రోజు వీరిద్దరూ కలిసి లక్నోలో విలేకరుల సమావేశంలో పాల్గొనున్నారు. ఒకవేళ ఫిబ్రవరి 4న కాకుంటే 10న వసంత పంచమి రోజు కావడంతో ఆ రోజు ప్రియాంక బాధ్యతలు చేపడతారు. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ 2001లో గంగా నదిలో పుణ్యస్నానం చేశారు. ప్రియాంక, రాహుల్ గానీ అప్పట్లో స్నానమాచరించలేదు. కాగా, త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో పాగా వేసేందుకు ప్రియాంక గాంధీ పాటు జ్యోతిరాదిత్య సింధియాకు కాంగ్రెస్ పార్టీ కీలక బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. -
కుంభమేళా కేంద్రంగా రాహుల్ వ్యూహం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రియాంక గాంధీని పార్టీలోకి తీసుకువచ్చి యూపీ బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఇక బీజేపీ హవాకు చెక్ పెట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. హిందూ కార్డ్‌తోనే ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీని నిలువరించాలని రాహుల్ భావిస్తున్నారు. యూపీలో రాహుల్ పాల్గొనే 12 ర్యాలీల్లో తనకు తోడుగా ప్రియాంకను కూడా ఆయా సభల్లో ముందు నిలిపేలా రాహుల్ ప్రణాళికలు రూపొందిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. లక్నో కేంద్రంగా యూపీ అంతటా ప్రియాంక ప్రచార పర్వంతో హోరెత్తించనున్నారు. కుంభమేళా కేంద్రంగా.. హిందుత్వ కార్డుతో హిందీ రాష్ట్రాల్లో బీజేపీ దూసుకుపోతుంటే అదే అంశాన్ని రాహుల్ తనకు అనుకూలంగా మలుచుకునేందుకు పావులు కదుపుతున్నారు. కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించే ఘట్టాన్ని రాహుల్ ఇందుకు మెరుగైన అవకాశంగా భావిస్తున్నారు. ఫిబ్రవరిలో కుంభమేళాలో పాల్గొనే రాహుల్ ఈ కార్యక్రమాన్ని పార్టీకి అనుకూలంగా మలిచేందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గతంలో రాహుల్ జంధ్యం ధరించే బ్రాహ్మణుడని కాంగ్రెస్ ప్రతినిధి సుర్జీవాలా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక కుంభమేళాలో లక్షలాది మంది వీక్షిస్తుండగా పుణ్యస్నానం ఆచరించడం ద్వారా హిందూ మూలాలను బలంగా ప్రజల్లోకి పంపవచ్చని రాహుల్ భావిస్తున్నారు. రాహుల్ జంధ్యంతో పాటు పసుపు పంచె, కండువా ధరించి గంగా జలాల్లో పుణ్యస్నానం ఆచరిస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. రాహుల్ స్నానం చేస్తుండగా 12 మంది పండితులు వేదమంత్రాలను జపిస్తారని వెల్లడించాయి. కాగా రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పుష్కర్‌లోని బ్రహ్మ ఆలయంలో రాహుల్ తొలిసారి తన కులగోత్రాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆలయ పూజరి అడిగిన వివరాల మేరకు రాహుల్ తాను బ్రాహ్మణుడినని, తమది దత్తాత్రేయ గోత్రమని బదులిచ్చారు. యూపీపై గురి సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కీలకమైన ఉత్తరప్రదేశ్‌పై కాంగ్రెస్ ప్రధానంగా దృష్టిసారించింది. ప్రియాంక ఎంట్రీతో పాటు తమ పార్టీ హిందువులకు వ్యతిరేకం కాదనే బలమైన సంకేతాలు పంపాలని ఆ పార్టీ యోచిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో మెరుగైన ఫలితాల కోసం తాము శక్తియుక్తులను కూడదీసుకుని బలంగా పోరాడతామని తన నియోజకవర్గం అమేథి పర్యటన సందర్భంగా రాహుల్ స్పష్టం చేశారు. -
కుంభమేళాతో రూ 1.2 లక్షల కోట్ల రాబడి
లక్నో : జనవరి 15న ప్రారంభమై మార్చి 4న ముగిసే మహా కుంభమేళా యూపీ ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపించనుంది. ఈ చారిత్రక అతిపెద్ద ఆథ్యాత్మిక మేళా ద్వారా యూపీ సర్కార్‌కు రూ 1.2 లక్షల కోట్ల ఆదాయం సమకూరుతుందని ప్రముఖ పరిశ్రమ సంస్థ సీఐఐ అంచనా వేసింది. పలు రంగాలకు చెందిన ఆరు లక్షల మందికి పైగా ఈ ఉత్సవాలతో ఉపాధి లభిస్తుందని పేర్కొంది. మహా కుంభమేళా కోసం యూపీ ప్రభుత్వం రూ 4200 కోట్లు కేటాయించి పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఇక సీఐఐ అంచనా ప్రకారం దేశ, విదేశీ టూరిస్టుల రాకతో ఆతిథ్య రంగంలో కొత్తగా 2,50,000 మందికి, టూర్ ఆపరేటర్లుగా 45,000 మంది ఎయిర్‌లైన్స్, ఎయిర్‌పోర్ట్స్‌లో దాదాపు 1,50,000 మందికి ఉపాధి సమకూరుతుందని, మెడికల్, ఎకో టూరిజంలో 85,000 మందికి ఉపాధి లభిస్తుందని సీఐఐ అథ్యయనం అంచనా వేసింది. వీటితో పాటు టూర్ గైడ్స్, ట్యాక్సీ డ్రైవర్లు, వాలంటీర్లు వంటి అసంఘటిత ఉద్యోగాలు పెద్దసంఖ్యలో అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. కుంభమేళాకు ఆస్ర్టేలియా, బ్రిటన్, కెనడా, మలేషియా, సింగపూర్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, మారిషస్, జింబాబ్వే, శ్రీలంక సహా పలు దేశాలకు చెందిన టూరిస్టులు తరలిరానున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా కుంభమేళాను నిర్వహించేందుకు యూపీ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టిందని ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి రాజేష్ అగర్వాల్ పేర్కొన్నారు. కాగా మార్చి 4న మహాశివరాత్రి రోజున ముగిసే మహా కుంభమేళాకు దాదాపు 12 కోట్ల మంది హాజరై ప్రయాగరాజ్‌లో పవిత్ర నదీ సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తారని అధికారులు భావిస్తున్నారు. -
భళా.. కుంభమేళా...
ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ అర్ధ కుంభమేళాకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మకర సంక్రాంతి నుంచి మహా శివరాత్రి వరకు సాగే ఈ కుంభమేళాకు కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశారు. జనవరి 15 నుంచి మార్చి 4 వరకు జరిగే ఈ అర్ధ కుంభమేళాలో సాధారణ భక్తులతోపాటు వీఐపీలు, వీవీఐపీలు, ఎన్నారైల కోసం వేర్వేరుగా ఏర్పాట్లు చేసినట్లు ఉత్తరప్రదేశ్ సర్కారు ప్రకటించింది. అలహాబాద్‌ను పేరును ప్రయాగ్‌రాజ్‌గా మార్చిన తర్వాత జరిగే తొలి అర్ధ కుంభమేళా ఇదే. దీంతో యోగి ఆదిత్యనాథ్ సర్కారు కూడా ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది. ఈ వేడుకలకు పూర్తిగా కార్పొరేట్ కళను అద్దింది. గంగ, యమున నది ఒడ్డున 100 హెక్టార్ల స్థలంలో అత్యంత ఆధునిక సౌకర్యాలతో ‘టెంట్ సిటీ’ని నిర్మించింది. 250 కిలోమీటర్ల పొడవైన రోడ్లు, 22 తాత్కాలిక వంతెనలు, 40 వేల ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేసింది. ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు, ఎంటర్టైన్మెంట్ సెంటర్లు వెలిశాయి. కుంభమేళా భక్తులకు అసౌకర్యం తలెత్తకుండా 1.25 లక్షల టాయిలెట్స్‌ను నిర్మించారు. కుంభమేళా జరిగే ప్రాంతం పరిశుభ్రంగా ఉండటం కోసం 20వేల చెత్తడబ్బాలను ఏర్పాటు చేశారు. ఈ పండుగను అపురూపమైన సాంస్కృతిక వారసత్వ ప్రతీకగా ఇప్పటికే యునెస్కో గుర్తించింది. దేశవ్యాప్తంగా 6 లక్షల గ్రామాలున్నాయని.. ఈ గ్రామాల నుంచి కనీసం ఒక్కొక్కరైనా ఈసారి అర్ధ కుంభమేళాకు హాజరవ్వాలని యోగి సర్కార్ పిలుపునిచ్చింది. మొత్తంగా 71 దేశాల ప్రభుత్వ ప్రతినిధులు ఇప్పటికే త్రివేణి సంగమాన్ని సందర్శించి గంగానదీ తీరంలో తమ దేశాల జెండాలను ఎగురవేశారు. పుణ్యస్నానాలు ఆచరించడానికి వచ్చే భక్తులే కాకుండా, పర్యాటకుల్ని కూడా ఆకర్షించేలా ఫైవ్‌స్టార్ హోటల్స్ ఉండే సదుపాయాలతో 2 వేల గుడారాలను ఏర్పాటు చేశారు. ఎన్నారైలు బస చేయడానికి విల్లాలు, మధ్యతరగతి వారికి కాటేజీలు, సామాన్య భక్తుల కోసం డార్మెటరీలు ఇలా అన్ని తరగతుల వారు బస చేసేలా టెంట్ సిటీని రూపొందించారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ కుంభమేళా అంటే! ప్రతీ పన్నెండేళ్లకు ఒకసారి భక్తులంతా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించే పుణ్య కార్యక్రమమిది. కుంభరాశిలో ఈ ఉత్సవం జరుగుతుంది. అందుకే దీనిని కుంభమేళా అని పిలుస్తారు. ప్రతీమూడేళ్లకి ఒకసారి హరిద్వార్, ప్రయాగరాజ్, ఉజ్జయిని, నాసిక్‌లలో కుంభమేళా జరుగుతుంది. అంటే పన్నెండేళ్లకి ఒకసారి ఒక్కో పట్టణంలో నిర్వహించడానికి అవకాశం వస్తుంది. ఆరేళ్లకోసారి జరిగే వేడుకని అర్ధ కుంభమేళా అని, పన్నెండేళ్లకు ఒకసారి జరిగే ఉత్సవాన్ని పూర్ణ కుంభమేళా అని, 144 ఏళ్లకు ఒకసారి జరిగే వేడుకల్ని మహా కుంభమేళా అని పిలుస్తారు. సూర్యుడు, బృహస్పతుల గతుల ఆధారంగా ఈ వేడుకలు నిర్వహిస్తారు. మేషరాశిలో బృహస్పతి, మాఘమాసంలో మకరరాశిలోకి సూర్యుడు, చంద్రుడు ప్రవేశించినప్పుడు ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా జరుగుతుంది. ఇప్పుడు నిర్వహిస్తున్నది ఆరేళ్లకి ఒకసారి జరిగే అర్ధకుంభమేళా. కుంభమేళా జరిగే సమయంలో మకర సంక్రాంతి, మాఘ పుష్య పౌర్ణమి, మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో గంగ, యమున, సరస్వతి సంగమించే త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని, పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. సంక్రాంతి, వసంత పంచమి, మాఘ పౌర్ణమి, మహాశివరాత్రి వంటి కొన్ని ప్రత్యేకమైన దినాల్లోనే భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఒక రాత్రి బసకే రూ. 40 వేలు కుంభమేళా కోసం వచ్చే భక్తులు బస చేయడం కోసం ఇంద్రప్రస్థం, కల్పవృక్ష, కుంభ కాన్వాస్, వేదిక్ టెంట్‌సిటీ పేరుతో గుడారాలు నిర్మించారు. ఇంద్రప్రస్థం విల్లాలో ఒక రాత్రి బసకే రూ.40 వేలు వసూలు చేయనున్నారు. రెండు బెడ్రూమ్లు, ఒక లివింగ్ రూమ్, అటాచ్డ్ బాత్రూం సౌకర్యం ఉండే ఈ విల్లాల నుంచి గంగానది అందాలను వీక్షించవచ్చు. ఈ టెంట్ సిటీలో 200 లగ్జరీ టెంట్స్, 250 డీలక్స్ టెంట్స్ కూడా ఉన్నాయి. లగ్జరీ టెంట్స్‌లో ఒక రాత్రి బసకి రూ.16వేలు, డీలక్స్ టెంట్స్ రూ.12 వేలు వసూలు చేస్తారు. ఇక డార్మెటరీల్లో 650 రూపాయల నుంచి ఉన్నాయి. అడుగడుగునా భద్రత ప్రతీరోజూ లక్షల్లో భక్తులు వస్తారు కాబట్టి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. 1,150 సీసీకెమెరాలు, 40 పోలీసు స్టేషన్లు, 62 పోలీసు పోస్టులు ఏర్పాటు చేశారు. 22,000– 24,000 మంది పారామిలటరీ జవాన్లు పహారా కాస్తారు. 11 తాత్కాలిక ఆసుపత్రులు భక్తులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా.. ఇబ్బందులు ఎదురుకాకుండా 11 తాత్కాలిక ఆసుపత్రులు నిర్మించారు. 100 పడకల ఆసుపత్రి, 30 పడకల ఆసుపత్రులు ఇందులో ఉన్నాయి. 170 మంది వైద్యులు, 100మంది నర్సులు సేవలందిస్తారు. 100 అంబులెన్స్‌లు, 4 ఎయిర్ అంబులెన్స్‌లు 24 గంటలు అందుబాటులో ఉంటాయి. లాహిరి లాహిరిలో.. పర్యాటకరంగాన్ని ప్రోత్సహించేందుకు యోగి సర్కార్ ఈసారి కుంభమేళాలో ప్రత్యేకంగా పడవ ప్రయాణాన్ని ఏర్పాటు చేసింది. కాశీ నుంచి త్రివేణీ సంగమానికి భక్తులు పడవల్లోనే చేరుకోవచ్చు. గంగానదీ అందాలను ఆస్వాదిస్తూ 60 కిలోమీటర్ల దూరాన్ని గంటలోపే చేరుకోవచ్చు. ఇందుకోసం గంటకి 80 కిలోమీటర్ల వేగంతో నడిచే ఎయిర్‌బోట్లను ఏర్పాటు చేసింది. ఈ పడవల కోసం కాశీలో కాళీఘాట్, సరస్వతి ఘాట్, నైని బ్రిడ్జ్, సుజావన్ ఘాట్లను సిద్ధం చేసింది. సీఎల్ కస్తూర్బా, ఎస్ఎల్ కమ్లా అనే పెద్ద పడవలతో పాటు భక్తు ల రద్దీని బట్టి పలు చిన్న పడవలు రెండు పుణ్యక్షేత్రాల మధ్య తిరుగుతాయి. -
కుంభమేళాకు భారీ ఏర్పాట్లు
సాక్షి, అలహాబాద్: యూపీ సీఎంగా యోగి ఆదిత్యా నాథ్ పగ్గాలు చేపట్టిన అనంతరం తొలిసారి జనవరి 2019లో జరిగే కుంభమేళాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత 2013 కుంభమేళా బడ్జెట్‌తో పోలిస్తే రెండున్నర రెట్లు అధికంగా వెచ్చించనున్నారు. రూ 2500 కోట్లతో 16 శాఖల సమన్వయంతో దాదాపు 200కు పైగా ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు పనులు జరుగుతున్నాయి. కుంభమేళాలో కేవలం పుణ్య స్నానాలు ఆచరించడమే కాక, యాత్రికులకు మెరుగైన ఆథ్యాత్మిక, ధార్మిక అనుభూతులను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. యాత్రికులకు నడక ఇబ్బందులు తొలగించేందుకు ఈసారి షటిల్ సర్వీసులు ప్రారంభిస్తున్నామని అలహాబాద్ కమిషనర్ అశిష కుమార్ గోయల్ చెప్పారు. కుంభమేళాను యూపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీ ఏర్పాట్లు చేస్తోందన్నారు. ఉత్సవాలకు ఏడాది ముందుగానే మేళా ఇన్చార్జిగా బాద్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారి విజయ్ కిరణ్ ఆనంద్ అలహాబాద్‌లో కుంభమేళా పనుల పురోగతిని సమీక్షిస్తున్నారు. యూపీ ప్రభుత్వం ఇప్పటికే రూ.1648 కోట్లతో 199 ప్రాజెక్టులను ఆమోదించి పనులు ప్రారంభించిందని చెప్పుకొచ్చారు. కుంభ్ ప్రాజెక్టులు సకాలంలో పూర్తయ్యేలా లైవ్ డాష్బోర్డులతో ఆన్లైన్ ప్రాజెక్టు మానిటరింగ్ వ్యవస్థను నెలకొల్పారు. ఈ ప్రాజెక్టుల్లో భాగంగా రూ. 500 కోట్లతో అలహాబాద్‌లో బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నారు. -
ప్రతిపాదనలు గోదారంత.. కేటాయింపులు కాలువంత...
ఆదిలోనే నీళ్లు వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలు.. ఉభయగోదావరి జిల్లాలకు మహాసంరంభమేనన్న అంచనా ‘నీటిబుడగే’ అనిపిస్తోంది. రానున్నది మహా పుష్కరమనీ, కుంభమేళాగా నిర్వహిస్తామని ఇటీవలే గొప్పగా చెప్పారు ప్రజాప్రతినిధులు. ఈ నేపథ్యంలో వచ్చే ఏటి పుష్కరాలకు గత పుష్కరాల కన్నా రెట్టింపు మంది సందర్శకులు వస్తారని భారీ అంచనాలు సిద్ధం చేశారు అధికారులు. అయితే వాటిపై ఆదిలోనే ప్రభుత్వం నీళ్లు జల్లింది. సాక్షి, రాజమండ్రి : పుష్కరాలకు టోకెన్ గ్రాంటుగా రూ.100 కోట్లు మాత్రమే కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేవలం సదుపాయాలకు మాత్రమే చేసే ఖర్చులకు అదనంగా మరో రూ.వంద కోట్లయినా ఇస్తాము తప్ప ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు పైసా ఇచ్చేది లేదని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శుక్రవారం రాజమండ్రిలో చెప్పారు. దీంతో అవాక్కవడం - అధికారుల వంతైంది. ‘12 ఏళ్ల క్రితమే రూ.వంద కోట్లు వెచ్చించారు. ఈ వ్యవధిలో అన్నింటి ధరలూ పదిరెట్లు పెరిగాయి. ఈ పుష్కరాలకు రెట్టింపు యాత్రికులు వస్తారంటున్నదీ ప్రభుత్వమే. అలాంటప్పుడు ఆ వంద కోట్లు ఎలా సరిపోతాయి?’ అని గుంజాటన పడడమే వారి వంతైంది. పుష్కరాలకు కనీసం రూ.500 కోట్లయినా అవసరమని ఈ నెల 3న జరిగిన అధికారుల సమావేశంలో దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు స్వయంగా అన్నారు. కానీ ప్రభుత్వం ఏర్పాట్లు ఘనంగా చేస్తామంటూనే నిధులను పరిమితం చేస్తోంది. ఆర్థిక మంత్రి యనమల అధ్యక్షతన ఏర్పాటైన మంత్రుల కమిటీ శుక్రవారం రాజమండ్రి ఆర్అండ్బీ అతిథిగృహంలో ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమైంది. పుష్కర నిధులకు ఆకాశమే హద్దన్న నోటితోనే యనమల వెంటనే పుష్కరాలకు టోకెన్ గ్రాంటుగా వంద కోట్లు మాత్రమే విడుదల చేస్తున్నట్టు ప్రకటించడం అందరినీ విస్మయపరిచింది. రెండు జిల్లాల్లోని వివిధ శాఖల అధికారులు.. పుష్కరాలతో గోదావరి తీర ప్రాంతాల అభివృద్ధికి దోహదపడాలన్న భావనతో రూ.1100 కోట్ల మేర ప్రతిపాదనలను రూపొందించి మంత్రుల కమిటీకి అందించారు. అయితే ‘నిధులు ఎంతైనా ఇస్తాం, పనులు పుష్కర యాత్రికులకు సదుపాయాలు కల్పించేవి మాత్రమే అయి ఉండాలి’ అంటూ ఆర్థిక మంత్రి నిబంధన పెట్టారు. కేంద్రం ఇస్తే మరింత ఖర్చు చేయగలం.. ‘గత పుష్కరాలకు ఉమ్మడి రాష్ట్రంలో రూ.100 కోట్లు వెచ్చించాం. రూ.50 కోట్లు కేవలం రాజమండ్రిలోనే ఖర్చు చేశాం. ఈసారి నిధుల కొరత ఉంది. అయినా ఖర్చుకు వెనుకాడం. కేంద్రం నుంచి అదనపు నిధులు వస్తే మరింత ఎక్కువ ఖర్చు చేయగలం. గతంలో కేంద్రం పెద్దగా సహకారం అందించలేదు. ప్రముఖ దేవాలయాల ఆదాయం పుష్కరాల్లో భారీగా పెరుగుతుంది. అందువల్ల ఆలయాల అభివృద్ధికి వారి నిధులనే వెచ్చించాలి. పరిసరాల్లోని చిన్న ఆలయాల అభివృద్ధి వ్యయం కూడా అవే భరించాలి. ఇరిగేషన్ అధికారులు ప్రజలు, ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చే డిమాండ్ల ఆధారంగా కాక అవసరాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఘాట్ల నిర్మాణం, పునర్నిర్మాణం చేయాలి. ప్రతిపాదనలు పుష్కరాలకు వర్తించేవా, కాదా అని కలెక్టర్లు పరిశీలించాకే నిధులు వస్తాయి’.. ఆర్థిక మంత్రి యనమల అధికారులకు చేసిన కర్తవ్యబోధ ఇది. కాగా ఇరిగేషన్, ఆర్అండ్బీ, దేవాదాయ తదితర శాఖల నుంచి, రాజమండ్రి నగరపాలక సంస్థ నుంచి ప్రతిపాదనలను కమిటీ స్వీకరించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సూచనలు తెలుసుకుంది. పుష్కరాలు శుభంగా జరగాలన్న సంకల్పంతో.. వేద పండితుల మంత్రపఠనంతో సమావేశం ప్రారంభించారు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్లు నామన రాంబాబు, ముళ్లపూడి బాపిరాజు, ఎమ్మెల్సీలు చైతన్యరాజు, రవికిరణ్ వర్మ, బలసాలి ఇందిర, లక్ష్మీ శివకుమారి, తూర్పుగోదావరి ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, వేగుళ్ల జోగేశ్వరరావు, చిర్ల జగ్గిరెడ్డి, వనమాడి వెంకటేశ్వర రావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎస్.వి.ఎస్.ఎన్ వర్మ, పి.నారాయణమూర్తి, అయితాబత్తుల ఆనందరావు, దాట్ల సుబ్బరాజు, తోట త్రిమూర్తులు, గొల్లపల్లి సూర్యారావు, పశ్చిమగోదావరి ఎమ్మెల్యేలు కె.ఎస్.జవహర్, బూరుగుపల్లి శేషారావు, పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, బండారు మాధవరాయుడు, ముప్పిడి వెంకటేశ్వరరావు, తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ముత్యాలరాజు, ఏజేసీ మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు. పుష్కరాల్లో యాత్రికుల సౌకర్యం కోసం ఎన్టీఆర్ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం. ఎమ్మెల్సీ చైతన్యరాజు ఉచిత భోజనసదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. యాత్రికులకు అన్నదానం చేసే వారి వివరాలు, చేసే స్థలాలు ముందుగానే రిజిస్టరు చేసుకోవాలి. - నిమ్మకాయల చినరాజప్ప, ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి అన్ని శాఖల అధికారులకు ఎవరు ఏం చేయాలో నిర్దేశించాం. గతం కంటే ఘనంగా పుష్కరాలు ఉంటాయి. అధికారుల ప్రతిపాదనలు తుది రూపు దాల్చి, కమిటీ ముందుకు వచ్చాక తుది కార్యాచరణ ఉంటుంది. - పి.నారాయణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి రాజమండ్రిలోరూ.4 కోట్లతో పర్యాటక శాఖ కన్వెన్షన్ సెంటర్ నిర్మిస్తుంది. అది ఈసారి పుష్కరాలకు గుర్తుగా ఉండిపోతుంది. వీఐపీ, వీవీఐపీ భక్తుల కోసం కొవ్వూరు, రాజమండ్రిల్లో కొత్త ఘాట్లు నిర్మిస్తాం. - పైడికొండల మాణిక్యాలరావు, దేవాదాయ శాఖ మంత్రి మహిళా యాత్రికులకు ప్రత్యేక సదుపాయాలు ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేయాలి. వారి భద్రతకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంది. - పీతల సుజాత, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పుష్కరాలకు ప్రధానవేదికైన రాజమండ్రిలో వద్ద గోదావరి కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలి. భక్తులకు సదుపాయాల కోసం నగరపాలక సంస్థ అంచనా వేసిన రూ.270 కోట్లు మంజూరు చేయాలి. - పంతం రజనీ శేషసాయి, మేయర్, రాజమండ్రి భక్తులు ఇబ్బంది లేకుండా నదీస్నానాలు చేసి, ఆలయ దర్శనం చేయగలిగితే పుష్కరాలు విజయవంతం అయినట్టే. మహిళలకు స్నాన ఘట్టాల దుస్తుల వూర్పిడికి వసతులు మెరుగు పరచాలి. రాజమండ్రిలో కోటిలింగాల రేవు నుంచి గోదావరి రోడ్డుతో పాటు నగరంలోని అన్న ఇరుకు రోడ్లలో ఆక్రమణలు తొలగించి వెడల్పు చేయాలి. ఖాళీ స్థలాల్లో భారీ టెంట్లు వేసి ప్రయాణికులకు విశ్రాంతి సదుపాయం కలగచేయాలి. - ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్సీ, రాజమండ్రి జిల్లాలో చారిత్రక ప్రసిద్ధి గాంచిన దేవాలయాలు చాలా ఉన్నాయి. పుష్కరాల సందర్భంగా వాటిని తీర్చిదిద్దాలి. అందుకు సరిపడా నిధులు కేటాయించాలి. - జ్యోతుల నెహ్రూ, జగ్గంపేట ఎమ్మెల్యే పుష్కరాల్లో పితృదేవతలకు పిండప్రదాన కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతాయి. అందుకోసం వచ్చే భక్తులకు రవాణా, వసతి, భోజన సదుపాయాలు కల్పించేందుకు ఎక్కువగా దృష్టి పెట్టాలి. ఈ కార్యక్రమాలకు సామగ్రి కూడా ప్రభుత్వమే అందించాలి. - ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్యే, రాజమండ్రి సిటీ అధికారులు దీర్ఘకాలిక, స్వల్పకాలిక పనుల ప్రణాళికలు రూపొందించుకోవాలి. వాటిలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమివ్వాలి. - నీతూ కుమారి ప్రసాద్, కలెక్టర్, తూర్పుగోదావరి అన్ని శాఖల అధికారులతో సవిరంగా చర్చిస్తాం. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రణాళికలు రూపొందిస్తాం. - కాటమనేని భాస్కర్, కలెక్టర్, పశ్చిమగోదావరి