ఫైల్ ఫోటో
డెహ్రడూన్: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మళ్లీ పెరుగుతూ కలవరపెడుతోంది. అయితే ఉత్తరఖండ్‌లోని హరిద్వార్‌లో త్వరలో కుంభమేళ ఉత్సవం ప్రారంభంకానుంది. ఈ ఉత్సవంలో పెద్దసంఖ్యలో భక్తులు, యాత్రికులు, విదేశీయులు పాల్గొని, పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఢిల్లీకి చెందిన జాతీయ అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం(ఎన్‌సీడీసీ) బృందాన్ని ఉత్తరఖండ్‌కు పంపింది. అదేవిధంగా కొవిడ్ నిబంధనలపై సూచనలు చేయాల్సిందిగా కోరింది.
అయితే ఈ బృందం మార్చి రెండో వారంలో కుంభమేళ జరిగే ప్రాంతాలను సందర్శించింది. ఆ ప్రాంతాల్లో సరైన సౌకర్యాలు లేవని తెలిపింది. అక్కడ ప్రతిరోజు 10 నుంచి 20 కరోనా కేసులు నమోదవుతున్నాయని అధికారులు వెల్లడించారు. కుంభమేళకు వచ్చే భక్తుల విధిగా కోవిడ్ నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకొవాలని ఎన్‌సీడీపీ బృందం సూచించింది. ప్రత్యేకంగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని పేర్కొంది. అధిక సంఖ్యలో వాలంటీర్లను నియమించి, ఎప్పటికప్పుడు కరోనా నింబంధనలపై అవగాహన కల్పించాలని పేర్కొంది.
కాగా, ఉత్తరఖండ్‌లో రోజుకు 50వేల ర్యాపిడ్ ఆంటీజెన్, 5వేల ఆర్టీపీసీఆర్ పరీక్షలు జరుపుతున్నామని ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఇక కుంభమేళ ఉత్సవ నేపథ్యంలో కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్యను మరింత పెంచుతామని తెలిపారు. ఎన్‌సీడీసీ బృందం చేసిన సూచనలను ఉత్సవ సమయంలో పాటిస్తామని ఉత్తరఖండ్ ప్రభుత్వ కార్యదర్శి ఉత్సాల్ సింగ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment