జనవరి 13 నుంచి యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా ప్రారంభం
గంగానదిలో లక్షలాదిమంది భక్తుల పుణ్యస్నానాలు
స్వాతంత్య్రానంతరం కుంభమేళాకు ప్రత్యేక గుర్తింపు
12 ఏళ్లకు ఒకసారి జరిగే కుంభమేళాకు రాజకీయ నేతలు, ప్రముఖులు, సామాన్యులు
1951లో జరిగిన కుంభమేళాకు హాజరైన పండిట్ జవహర్ లాల్ నెహ్రూ
కుంభమేళా భారతీయ సంస్కృతికి విశిష్ట చిహ్నంగా పేర్కొన్న ప్రధాని నరేంద్ర మోదీ
జనవరి 10 నుంచి సాంస్కృతి కార్యక్రమాలు.. అలరించనున్న ప్రముఖ గాయకులు
ప్రయాగ్‌రాజ్: వచ్చే ఏడాది(2025) జనవరి 13 నుంచి యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా లక్షలాదిమంది భక్తులు గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరించనున్నారు. విదేశాల నుంచి కూడా భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు తరలిరానున్నారు.
స్వాతంత్య్రానంతరం కుంభమేళాకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ కుంభమేళాలో సాధువులతో పాటు రాజకీయ ప్రముఖులు, సామాన్యులు కూడా పాల్గొంటున్నారు. నాటి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ మొదలుకొని పలువురు రాజకీయ ప్రముఖులు వివిధ సమయాల్లో జరిగిన కుంభమేళాలలో పాల్గొంటూవస్తున్నారు.
ताकि सनद रहे : पहले प्रधानमंत्री पंडित जवाहरलाल नेहरू भी कुंभ में स्नान कर चुके हैं और जनेऊ भी धारण किए हुए हैं।#KumbhMela2019 pic.twitter.com/06DUeCHBwr
— Vinod Kapri (@vinodkapri) January 18, 2019
పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ (1951)
భారత తొలి ప్రధాని పండిట్ నెహ్రూ కుంభమేళాను భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా అభివర్ణించారు. నెహ్రూ 1951లో జరిగిన కుంభమేళాకు హాజరయ్యారు.
ఇందిరా గాంధీ
భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కూడా కుంభమేళా నిర్వహణకు సహకారం అందించడమే కాకుండా, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందిరాగాంధీ హయాంలో కుంభమేళాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది.
అటల్ బిహారీ వాజ్‌పేయి (2001)
అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కుంభమేళాలో ఆయన పాల్గొన్నారు. పుణ్యస్నానాలు ఆచరించే భక్తులకు మెరుగైన ఏర్పాట్లు చేశారు. కుంభమేళా ఘనంగా నిర్వహించేందుకు అటల్ బిహారీ వాజ్‌పేయి విశేష కృషి చేశారు.
నరేంద్ర మోదీ (2019)
2019లో జరిగిన కుంభమేళాలో ప్రధాని నరేంద్ర మోదీ గంగాస్నానం చేసి, ఈ కార్యక్రమం భారతీయ సంస్కృతికి విశిష్ట చిహ్నంగా అభివర్ణించారు. కుంభమేళాలో పరిశుభ్రత, మెరుగైన వసతుల కల్పనపై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి సారించారు.
త్రివేణీ సంగమం కేంద్రంగా..
ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కార్యక్రమంగా కుంభమేళా గుర్తింపు పొందింది. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో వచ్చే ఏడాది జనవరిలో జరిగే మహాకుంభమేళాలో భక్తులు గంగా, యమున, సరస్వతి నదుల పవిత్ర సంగమంలో స్నానం చేయనున్నారు. ఈ సారి కుంభమేళాను మరింత ఘనంగా నిర్వహించేందుకు యూపీ సర్కారు ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది. ఈ సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో బాలీవుడ్ ప్రముఖులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.
అలరించనున్న సాంస్కృతి కార్యక్రమాలు
గాయకుడు, స్వరకర్త శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్, సోనూ నిగమ్, విశాల్ భరద్వాజ్, రిచా శర్మ, శ్రేయా ఘోషల్ తదితరులు తమ గానమాధుర్యంతో భక్తులను అలరించనున్నారు. కుంభమేళా సందర్భంగా ఏర్పాటు చేసే కార్యక్రమాలు జనవరి 10 నుంచి ప్రారంభం కానున్నాయి. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
శంకర్ మహదేవన్ సంగీత కార్యక్రమం
జనవరి 10న ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్ తన పాటలతో అలరించనున్నారు. జానపద గాయని మాలినీ అవస్థి జనవరి 11న తన సంగీత ప్రదర్శన ఇవ్వనున్నారు. జనవరి 18న గాయకుడు కైలాష్ ఖేర్ ప్రదర్శన ఉండవచ్చని సమాచారం. జనవరి 19న సాయంత్రం సోనూ నిగమ్ తన గానంతో మ్యాజిక్ చేయనున్నారు. జనవరి 20న ప్రముఖ జానపద గాయని మైథిలీ ఠాకూర్, జనవరి 31న కవితా పౌడ్వాల్, ఫిబ్రవరి 1న విశాల్ భరద్వాజ్, ఫిబ్రవరి 2న రిచా శర్మ, ఫిబ్రవరి 8న జుబిన్ నౌటియల్, ఫిబ్రవరి 10న రసిక శేఖర్, ఫిబ్రవరి 10న హన్స్‌రాజ్ రఘువంశీ, ఫిబ్రవరి 14న శ్రేయా ఘోషల్ తదితరులు తమ మధురమైన స్వరంతో భక్తులను అలరించనున్నారు.
ఇది కూడా చదవండి: బంగ్లాదేశ్‌కు శాంతి పరిరక్షక దళం?.. ఏం జరగనుంది?
Comments
Please login to add a commentAdd a comment