ఉత్తరప్రదేశ్‌లో జనవరి 13 నుంచి మహాకుంభమేళా జరగనుంది. ఈ మేళాకు లక్షలాదిమంది తరలిరానున్నారు. ఈ నేపధ్యంలో పటిష్టమైన భద్రత అవవసరమవుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకున్న యూపీ సర్కారు మహాకుంభమేళా భద్రతా బాధ్యతలను ఓ ఐపీఎస్ అధికారికి అప్పగించింది. ఈయన గతంలోనూ పలుమార్లు వార్తల ప్రధానాంశాల్లో కనిపించారు. ఇంతకీ ఆయన ఎవరు? ఆయనకే ఈ కీలక భాధ్యతలు ఎందుకు అప్పగించారు?
ఐపీఎస్ వైభవ్ కృష్ణ(IPS Vaibhav Krishna).. ఈయన అజంగఢ్ డీఐజీ. ఇప్పుడు ఇతనిని ప్రభుత్వం మహాకుంభ్ డీఐజీగా నియమించింది. uppolice.gov.in వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం వైభవ్ కృష్ణ ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ నివాసి. ఆయన 1983 డిసెంబర్ 12న జన్మించారు. 2010 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. వైభవ్‌కృష్ణ 2021, డిసెంబర్ 20న పోలీసుశాఖలో ప్రవేశించారు.
వైభవ్ కృష్ణ మొదటి నుంచి చదువులో ఎంతో చురుకుగా ఉండేవారు. 12వ తరగతి తర్వాత ఐఐటీలో అడ్మిషన్ దక్కించుకున్నారు. ఐఐటీ రూర్కీ(IIT Roorkee)లో మెకానికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తిచేశారు. అనంతరం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమయ్యారు. 2009లో తొలిసారిగా యూపీఎస్సీ పరీక్షకు హాజరై 86వ ర్యాంక్ సాధించారు. ఈ నేపధ్యంలోనే వైభవ్‌కృష్ణ యూపీ కేడర్ ఐపీఎస్‌గా ఎంపికయ్యారు.
ఐపీఎస్ వైభవ్ కృష్ణ తన ఉద్యోగ జీవితంలో చేదు అనుభవాలను ఎదుర్కొన్నారు. 2020 జనవరి 9న నోయిడాలో ఎస్‌ఎస్పీగా ఉన్నప్పుడు వైభవ్ కృష్ణ ఒక కేసులో సస్పెండ్ అయ్యారు. దాదాపు 14 నెలల తర్వాత 2021, మార్చి 5న తిరిగి ఉద్యోగంలో నియమితులయ్యారు. మూడు నెలల తరువాత ఆయనకు లక్నోలోని పోలీస్ ట్రైనింగ్ అండ్ సెక్యూరిటీ(Police Training and Security) సూపరింటెండెంట్‌గా బాధ్యతలు అప్పగించారు.
అనంతరం 2012 జూన్‌లో ఐపీఎస్ వైభవ్ కృష్ణ అజంగఢ్ జోన్ డీఐజీగా నియమితులయ్యారు. ఆ సమయంలో ఆయన బల్లియాలో రైడ్ నిర్వహించి, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న పోలీసు సిబ్బందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ కేసులో ఉన్నతాధికారులు 18 మంది పోలీసులను సస్పెండ్ చేశారు. ఇటీవల యూపీ డీజీపీ ప్రశాంత్ కుమార్ మహాకుంభమేళా జరిగే ప్రాంతాన్ని సందర్శించారు. అనంతరం ఐపీఎస్ వైభవ్ కృష్ణకు మహాకుంభమేళా బాధ్యతలు అప్పగించారు.
ఇది కూడా చదవండి: Maha Kumbh Mela: 16 ఏళ్లకే ఇంటిని వదిలి.. తాళాల బాబా సాధన ఇదే..
Comments
Please login to add a commentAdd a comment