iit rurkee
-
నాడు సస్పెండ్.. నేడు కుంభమేళా బాధ్యతలు.. ఎవరీ వైభవ్ కృష్ణ?
ఉత్తరప్రదేశ్‌లో జనవరి 13 నుంచి మహాకుంభమేళా జరగనుంది. ఈ మేళాకు లక్షలాదిమంది తరలిరానున్నారు. ఈ నేపధ్యంలో పటిష్టమైన భద్రత అవవసరమవుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకున్న యూపీ సర్కారు మహాకుంభమేళా భద్రతా బాధ్యతలను ఓ ఐపీఎస్ అధికారికి అప్పగించింది. ఈయన గతంలోనూ పలుమార్లు వార్తల ప్రధానాంశాల్లో కనిపించారు. ఇంతకీ ఆయన ఎవరు? ఆయనకే ఈ కీలక భాధ్యతలు ఎందుకు అప్పగించారు?ఐపీఎస్ వైభవ్ కృష్ణ(IPS Vaibhav Krishna).. ఈయన అజంగఢ్ డీఐజీ. ఇప్పుడు ఇతనిని ప్రభుత్వం మహాకుంభ్ డీఐజీగా నియమించింది. uppolice.gov.in వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం వైభవ్ కృష్ణ ఉత్తరప్రదేశ్‌లోని బాగ్పత్ నివాసి. ఆయన 1983 డిసెంబర్ 12న జన్మించారు. 2010 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. వైభవ్‌కృష్ణ 2021, డిసెంబర్ 20న పోలీసుశాఖలో ప్రవేశించారు.వైభవ్ కృష్ణ మొదటి నుంచి చదువులో ఎంతో చురుకుగా ఉండేవారు. 12వ తరగతి తర్వాత ఐఐటీలో అడ్మిషన్ దక్కించుకున్నారు. ఐఐటీ రూర్కీ(IIT Roorkee)లో మెకానికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తిచేశారు. అనంతరం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమయ్యారు. 2009లో తొలిసారిగా యూపీఎస్సీ పరీక్షకు హాజరై 86వ ర్యాంక్ సాధించారు. ఈ నేపధ్యంలోనే వైభవ్‌కృష్ణ యూపీ కేడర్ ఐపీఎస్‌గా ఎంపికయ్యారు.ఐపీఎస్ వైభవ్ కృష్ణ తన ఉద్యోగ జీవితంలో చేదు అనుభవాలను ఎదుర్కొన్నారు. 2020 జనవరి 9న నోయిడాలో ఎస్ఎస్పీగా ఉన్నప్పుడు వైభవ్ కృష్ణ ఒక కేసులో సస్పెండ్ అయ్యారు. దాదాపు 14 నెలల తర్వాత 2021, మార్చి 5న తిరిగి ఉద్యోగంలో నియమితులయ్యారు. మూడు నెలల తరువాత ఆయనకు లక్నోలోని పోలీస్ ట్రైనింగ్ అండ్ సెక్యూరిటీ(Police Training and Security) సూపరింటెండెంట్‌గా బాధ్యతలు అప్పగించారు.అనంతరం 2012 జూన్‌లో ఐపీఎస్ వైభవ్ కృష్ణ అజంగఢ్ జోన్ డీఐజీగా నియమితులయ్యారు. ఆ సమయంలో ఆయన బల్లియాలో రైడ్ నిర్వహించి, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న పోలీసు సిబ్బందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ కేసులో ఉన్నతాధికారులు 18 మంది పోలీసులను సస్పెండ్ చేశారు. ఇటీవల యూపీ డీజీపీ ప్రశాంత్ కుమార్ మహాకుంభమేళా జరిగే ప్రాంతాన్ని సందర్శించారు. అనంతరం ఐపీఎస్ వైభవ్ కృష్ణకు మహాకుంభమేళా బాధ్యతలు అప్పగించారు.ఇది కూడా చదవండి: Maha Kumbh Mela: 16 ఏళ్లకే ఇంటిని వదిలి.. తాళాల బాబా సాధన ఇదే.. -
శతమానం భారతి : బ్రిటిష్ ఇండియాలో తొలి ఇంజనీరింగ్ కాలేజ్ ఐ.ఐ.టి. రూర్కీ
దేశాభివృద్ధిలో సాంకేతిక విద్య కీలక పాత్ర పోషిస్తుంది. అయితే భారతీయ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఏటా పట్టభద్రులవుతున్న సుమారు 15 లక్షల మంది విద్యార్థులలో అత్యధికులకు ఉద్యోగార్హ ప్రమాణాలు కొరవడుతున్నాయన్న విమర్శ ఉంది. అంతర్జాతీయంగా వస్తున్న అధునాతన సాంకేతిక మార్పులు, ఉన్నత ప్రమాణాలను అందిపుచ్చుకోవడంలో దేశీయ ఇంజనీరింగ్ కళాశాలలు విఫలం అవుతున్నాయన్న మాటలో కొంతైనా వాస్తవం లేకపోలేదు. ప్రపంచంలో అమెరికా తరువాత ఎక్కువ మంది ఆంగ్లం మాట్లాడేది భారతదేశంలోనే. అయినా, ఉన్నత విద్య కోసం వచ్చే విదేశీ విద్యార్థులను ఆకర్షించడంలో భారత్ తీసికట్టుగా ఉంది. స్వాతంత్య్రం అనంతరం మన ఉన్నత విద్య ప్రపంచ ప్రమాణాలకు దీటుగా ఎదగకపోవడమే దీనికి కారణం. పూర్వం భారత్‌లోని నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలలో విద్యాభ్యాసానికి ఇతర దేశాల నుంచి విద్యార్థులు వచ్చేవారు. కానీ, నాటి ప్రమాణాలు నేడు లేవు. మన ఇంజినీరింగ్ విద్యాలయాలు కేవలం బోధనతోనే సరిపెట్టుకోకుండా జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలతో అనుసంధానం కావాలి. ప్రపంచంలో అమెరికా, చైనాల తరవాత మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని ఇండియా ధ్యేయంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని 2030–32 నాటికి అందుకోవాలని భావిస్తోంది. అప్పటికి భారత్ 10 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగితేనే అనుకున్న లక్ష్యం సాధించగలుగుతుంది. బలమైన విద్యావ్యవస్థ పునాదిపై అధునాతన విజ్ఞానాధారిత సమాజాన్ని నిర్మించడం ద్వారానే అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థగా ఇండియా ఎదుగుతుంది. (చదవండి: మహోజ్వల భారతి: ఆక్స్ఫర్డ్ నుంచి తొలి ముస్లిం) -
ఉబర్‌లో జాబ్.. ఏడాదికి వేతనం రూ.2 కోట్లకు పైనే
IIT Bombay Student Gets More Than 2 Crore Rupees Job Offer From Uber: ఐఐటీలు, ఐఐఎంలు అంటేనే ప్రతిభకు పట్టుగొమ్మలు. అందుకే మల్టీ నేషనల్ కంపెనీలు ఐఐటీయన్స్‌కి ఏడాదికి కోట్లలో జీతం చెల్లించడానికి కూడా వెనకాడవు. తాజాగా ఈ జాబితాలోకి ట్యాక్సీ రైడ్ దిగ్గజ సంస్థ ఉబర్ టెక్నాలజీస్ చేరింది. ఓ ఐఐటీ విద్యార్థికి ఏడాడికి రూ. 2.5 కోట్ల ప్యాకేజీతో తమ కంపెనీలో ఉద్యోగం ఇచ్చింది. ఆ వివరాలు.. (చదవండి: హ్యాట్సాఫ్ ఆర్య: ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్న తండ్రికూతుళ్లు) ఐఐటీ బాంబే విద్యార్థి ప్రతిభకు ఉబర్ ఫిదా అయ్యింది. అందుకే ఏడాదికి ఏకంగా 2 కోట్ల రూపాయలకు పైగా వేతనం చెల్లించేందుకు ముందుకు వచ్చింది. అలానే ఐఐటీ గుహవటి విద్యార్థికి ఏడాదికి సుమారు 2 కోట్ల రూపాయల వేతనం ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఇది మాత్రమే కాక, నివేదికల ప్రకారం ఈ ఏడాది 11 మంది ఐఐటీ రూర్కీ విద్యార్థులు సంవత్సరానికి రూ. 1 కోటి కంటే ఎక్కువ వేతనంతో వేర్వేరు కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. (చదవండి: ఆమె కోపం.. రూ.8కోట్లు తెచ్చింది) ఈ ఆఫర్లు గత ఏడాదితో పోలిస్తే చాలా ఎక్కువ. ఉదాహరణకు, 2020లో ఐఐటీ బాంబే విద్యార్థి అందుకున్న అత్యధిక ప్యాకేజీ రూ. 1.54 కోట్లు మాత్రమే. గతేడాది కరోనావైరస్, ప్రపంచవ్యాప్త లాక్డౌన్.. వ్యాపారలపై భారీ ప్రభావం చూపింది. ఈ గందరగోళాలన్ని ముగిసి ప్రస్తుతం మార్కెట్లు స్థిరంగా ఉండటమే భారీ ప్యాకేజ్ ఆఫర్‌కి కారణమని నిపుణులు భావిస్తున్నారు. చదవండి: లేడీ కస్టమర్‌కు షాకిచ్చిన డెలివరీ బాయ్ -
ఇద్దరు ఐఐటీ ప్రొఫెసర్ల అరెస్టు
నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయిన కేసులో ఐఐటీ రూర్కీకి చెందిన ఇద్దరు ప్రొఫెసర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఒడిషాలోని తేహ్రి జిల్లాలో మూడేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించారు. విజయ్ ప్రకాష్, విజయ్ కుమార్ గుప్తా అనే ఇద్దరూ ఐఐటీ రూర్కీలోని సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్లు. వాళ్లను వాళ్ల వాళ్ల అపార్టుమెంట్ల నుంచే పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. గతంలో కోర్టు నుంచి సమన్లు వచ్చినా హాజరు కాకపోవడంతో వారిపై నాన్ బెయిలబుల్ వారంటు జారీ అయ్యింది. తేహ్రి జిల్లాలోని చౌరస్ ప్రాంతం వద్ద అలకనందా నదిపై వంతెన నిర్మాణానికి ఈ ప్రొఫెసర్లిద్దరూ డిజైన్ రూపొందించారు. అయితే, అది లోపభూయిష్టంగా ఉండటంతో వంతెన ఇంకా పూర్తి కాకముందే 2012లో కూలిపోయింది. ఎనిమిది మంది మరణించగా, వారిలో ఒక జూనియర్ ఇంజనీర్ కూడా ఉన్నారు. వంతెన కడుతున్న రెండు నిర్మాణ కంపెనీల యజమానులను కూడా ఇప్పటికే అరెస్టు చేశారు.