ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13నుంచి జరగబోయే మహాకుంభమేళాకు సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయి. నగరంలోని ప్రతీప్రాంతాన్ని అధికారులు అందంగా తీర్చిదిద్దుతున్నారు.
ఈ నేపధ్యంలో ప్రయాగ్‌రాజ్ రైల్వే స్టేషన్‌ను అంత్యంత సుందరంగా ముస్తాబు చేశారు. కుంభమేళా సందర్భంగా ప్రయాగ్‌రాజ్ ప్రతిష్టను మరింతగా పెంచడంలో భారతీయ రైల్వే కూడా గొప్ప పాత్ర పోషిస్తోంది.
‘పెయింట్ మై సిటీ’ ప్రచారం పేరిట ప్రయాగ్‌రాజ్‌లోని రైల్వేస్టేషన్‌ను అద్భుత కళ, అందమైన సంస్కృతికి నిలయంగా మార్చారు.
స్టేషన్ గోడలపై హిందూ పురాణాలు, భారతీయ సంప్రదాయాలను వర్ణించే అందమైన, ఆకర్షణీయమైన వర్ణచిత్రాలను రూపొందించారు.
ప్రయాగ్‌రాజ్, ప్రయాగ్‌రాజ్ జంక్షన్, నైని జంక్షన్, ఫఫామౌ, ఝూన్సీ రైల్వే స్టేషన్, రాంబాగ్ రైల్వే స్టేషన్, చివ్కీ రైల్వే స్టేషన్, ప్రయాగ్‌రాజ్ సంగమ్ రైల్వే స్టేషన్, సుబేదర్‌గంజ్ రైల్వే స్టేషన్‌లన్నింటినీ అత్యంత సుందరంగా మలచారు.
రైల్వే స్టేషన్ గోడలపై రామాయణం, శ్రీకృష్ణ లీలలు, బుద్ధుడు, శివ భక్తి, గంగా హారతి, మహిళా సాధికారత తదితర చిత్రాలను రూపొందించారు.
పలువురు కళాకారులు తమ జీవితానుభవాలను ఈ కళాకృతులలో ప్రతిబింబించారు.
ఈ కళాకృతులు భక్తులకు, పర్యాటకులకు ప్రయాగ్‌రాజ్‌కు ప్రత్యేకంగా నిలిచిన సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని చూపిస్తాయి. రైల్వేశాఖ చూపిన ఈ చొరవ కేవలం సుందరీకరణకే పరిమితం కాకుండా, ప్రయాగ్‌రాజ్ చారిత్రక, సాంస్కృతిక సంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలిచింది.
రైల్వేశాఖ చేపట్టిన ‘పెయింట్ మై సిటీ’ కార్యక్రమం మహా కుంభమేళాను తిలకించేందుకు ప్రయాగ్‌రాజ్‌కు వచ్చే ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంది.
ఋషి సంప్రదాయం, గురు-శిష్య సంప్రదాయం, జ్ఞానం, త్యాగాలకున్న ప్రాముఖ్యత ఈ కళాకృతులలో కనిపిస్తుంది.
ఈ కళాఖండాలు మహాకుంభమేళాకు వచ్చే లక్షలాది మంది భక్తులు, పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
భారతీయ రైల్వే చేస్తున్న ఈ ప్రయత్నం ప్రయాగ్‌రాజ్ గొప్పతనాన్ని తెలియజేస్తుంది.
ఎంతో వైవిధ్యతతో కూడిన ఈ చిత్రాలు అందరినీ విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: బీహార్‌లోనూ ఎర్రకోట.. చరిత్ర ఇదే
Comments
Please login to add a commentAdd a comment