
కన్నడ నటి 'రన్యా రావు' 14.2 కేజీల బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారనే ఆరోపణలతో బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో దుబాయ్ బంగారం ధరల గురించి చర్చ మొదలైంది. ఇంతకీ దుబాయ్ నుంచి ఎంత బంగారం తీసుకురావాలి?, ఎక్కువ తీసుకురావాలనే ఏమైనా రూల్స్ పాటించాలా? అనే విషయాలను ఇక్కడ చూసేద్దాం.
భారతదేశంతో పోలిస్తే.. దుబాయ్‌కు బంగారం ధరలు తక్కువగా ఉంటాయని, చాలామంది అక్కడ నుంచి ఇండియాకు బంగారం తీసుకొస్తూ ఉంటారు. అక్కడ గోల్డ్ రేటు తక్కువగా ఉండటానికి కారణం.. అక్కడ ఆభరణాలపై జీఎస్టీ లేకపోవడం, తయారీ ఛార్జీలు తక్కువగా ఉండటమే.
భారతదేశంలోకి బంగారాన్ని తీసుకురావడానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) నిర్ణయించిన రూల్స్ తప్పకుండా పాటించాల్సిందే. లేకుంటే రన్యా రావు మాదిరిగా అరెస్ట్ అవ్వాల్సి వస్తుంది. విదేశాల నుంచి మన దేశానికి బంగారాన్ని తీసుకురావాలంటే.. దిగుమతి సుంకం చెల్లించాలి. ఈ ట్యాక్స్ ఇప్పుడు 6 శాతం వద్ద ఉంది. ఈ సుంకం నుంచి తప్పించుకోవడానికే.. చాలామంది అక్రమంగా బంగారాన్ని తరలిస్తుంటారు.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ ప్రకారం.. దుబాయ్‌లో ఆరు నెలల (1967 పాస్‌పోర్ట్ చట్టం) కంటే ఎక్కువ సమయం ఉండి, కస్టమ్స్ డ్యూటీ చెల్లించినవారు.. తమ బ్యాగేజీలో ఒక కేజీ వరకు బంగారం తీసుకురావచ్చు. అంతకంటే ఎక్కువ బంగారం తీసుకురావాలనుంటే.. ట్యాక్స్ చెల్లించిన బంగారం అని నిరూపించి తీసుకురావాల్సి ఉంటుంది. లేకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇదీ చదవండి: జీఎస్‌టీ రేట్ల తగ్గింపుపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన
కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండా.. పురుషులు 20 గ్రా, మహిళలు 40 గ్రా తెచ్చుకోవచ్చు. అయితే వీరు తెచ్చుకునే బంగారం.. గోల్డ్ బార్లు, కాయిన్స్ రూపంలో ఉండాలి. అయితే 15 ఏళ్లలోపు పిల్లలకు 40 గ్రా పరిమితి ఉంది. వీరికోసం కొనుగోలు చేసే బంగారం.. నగలు, గిఫ్ట్స్ రూపంలో ఉండాలి. కస్టమ్స్ డ్యూటీ వెరిఫికేషన్ సమయం.. బంగారం కొనుగోలుకు సంబంధించిన పూర్తి వివరాలను చూపించాల్సి ఉంటుంది. పిల్లలకు అయితే.. తల్లితండ్రులు లేదా గార్డియెన్లకు సంబంధించిన ఐడీ కార్డు ఉండాలి.
బంగారం ధరలు
భారతదేశంలో ఈ రోజు (మార్చి 10) 24 క్యారెట్ల 10 గ్రా గోల్డ్ రేటు రూ. 87820, 22 క్యారెట్ల 10 గ్రా బంగారం ధర రూ. 80,500గా ఉంది. దుబాయ్‌లో 10 గ్రా బంగారం విలువ 3,260 AED (దుబాయ్ కరెన్సీ). భారతీయ కరెన్సీ ప్రకారం రూ.77,281.46. అంటే ఇండియాకు.. దుబాయ్‌కు బంగారం విలువ తేడా సుమారు రూ. 3000. ఈ కారణంగానే చాలా మంది దుబాయ్ నుంచి బంగారం కొనుగోలు చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment