సాక్షి, ముంబై: బాలీవుడ్ సంగీత దర్శక ద్వయం నదీమ్-శ్రవణ్‌లలో ఒకరైన శ్రవణ్ రాథోడ్ (66) కరోనాకు బలైన సంగతి తెలిసిందే. అయితే ఆయనకు కోవిడ్ ఎలా సోకిందనే దానపై షాకింగ్ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. వైరస్ బారిన పడటానికి కొన్ని రోజుల ముందు ఆయన కుంభమేళాకు హాజరయ్యారని శ్రవణ్ కుమారుడు సంజీవ్ రాథోడ్ వెల్లడించారు. (కరోనాతో సంగీత దర్శకుడు కన్నుమూత)
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సమాచారం ప్రకారం శ్రవణ్ రాథోడ్, ఆయన భార్య కరోనా బారిన పడటానికి కొన్నిరోజుల ముందు హరిద్వార్‌లోని కుంభమేళాకు హాజరయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా సంజీవ్ వెల్లడించిన సంజీవ్ తమ కుటుంబం ఇంత ఘోరమైన పరిస్థితిల్లో కూరుకుపోతుందని తాము ఎప్పుడూఅనుకోలేదంటూ కంటితడి పెట్టారు. కన్నతండ్రి దూరమయ్యారు.తాను, అమ్మ, సోదరుడు కూడా ప్రస్తుతం కరోనాతో బాధపడుతున్నా మంటూ ఆయన వాపోయారు. అయితే హోం అసోలేషన్‌లో ఉన్న సోదరుడు తన తండ్రి అంత్యక్రియలు చేసేందుకు అనుమతి తీసుకున్నట్టు వెల్లడించారు. అలాగే హాస్పిటల్ యాజమాన్యం బిల్లింగ్ సమస్య కారణంగా శ్రవణ్ మృత దేహాన్ని ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిందన్న పుకార్లను సంజీవ్ ఖండించారు. అలాంటిదేమీ లేదని వారు చేయగలిగిన సహాయం చేశారని తెలిపారు. కాగా కోవిడ్ పాజిటివ్ రావడంతో పరిస్థితి విషమించిన స్థితిలో శ్రవణ్‌ను ఎస్‌ఎల్ రహేజా ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. కానీ ఫలితం దక్కలేదు. గురువారం రాత్రి శ్రవణ్ తుదిశ్వాస విడిచారు. (ఆక్సిజన్ ట్యాంకర్ మిస్సింగ్ కలకలం)
Comments
Please login to add a commentAdd a comment