బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న యంగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ | Music Director Amresh Debut In Bollywood | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న యంగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌

Published Sat, Nov 20 2021 8:22 AM | Last Updated on Sat, Nov 20 2021 8:24 AM

Music Director Amresh Debut In Bollywood - Sakshi

యువ సంగీత దర్శకుడు అమ్రేష్‌ తాజాగా బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నారు. ఈయన ప్రఖ్యాత నటి, దర్శకురాలు, నిర్మాత కలైమామణి జయచిత్ర కుమారుడన్న విషయం తెలిసిందే. తొలుత నటుడిగా రంగప్రవేశం చేసిన అమ్రేష్‌ ఆ తర్వాత సంగీత దర్శకుడిగా స్థిరపడిపోయారు. మొట్టశివ కెట్టశివ, భాస్కర్‌ ఒరురాస్కెల్‌, చార్టీ చాప్లిన్‌-2, శత్రు, గర్జన​ వంటి సినిమాలకు సంగీతం అందించి మంచి పేరు తెచ్చుకున్నారు.

తాజాగా బాలీవుడ్‌కి అడుగుపెడుతున్నారు. మల్లికా షెరావత్‌ కథానాయికగా నటిస్తున్న నాగమతి చిత్రానికి అమ్రేష్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ ఇటీవలె పూజా కకార్యక్రమాలతో ప్రారంభమైంది. పాటల రికార్డింగ్‌ కార్యక్రమాన్ని అమ్రేష్‌ ముంబైలో రూపొందిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement