Amresh
-
బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్
యువ సంగీత దర్శకుడు అమ్రేష్ తాజాగా బాలీవుడ్లో అడుగుపెడుతున్నారు. ఈయన ప్రఖ్యాత నటి, దర్శకురాలు, నిర్మాత కలైమామణి జయచిత్ర కుమారుడన్న విషయం తెలిసిందే. తొలుత నటుడిగా రంగప్రవేశం చేసిన అమ్రేష్ ఆ తర్వాత సంగీత దర్శకుడిగా స్థిరపడిపోయారు. మొట్టశివ కెట్టశివ, భాస్కర్ ఒరురాస్కెల్, చార్టీ చాప్లిన్-2, శత్రు, గర్జన వంటి సినిమాలకు సంగీతం అందించి మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా బాలీవుడ్‌కి అడుగుపెడుతున్నారు. మల్లికా షెరావత్ కథానాయికగా నటిస్తున్న నాగమతి చిత్రానికి అమ్రేష్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవలె పూజా కకార్యక్రమాలతో ప్రారంభమైంది. పాటల రికార్డింగ్ కార్యక్రమాన్ని అమ్రేష్ ముంబైలో రూపొందిస్తున్నారు. -
సీనియర్ నటి జయ చిత్ర కుమారుడికి కోర్టులో ఊరట
సాక్షి, చెన్నై: తన కుమారుడు అమ్రీష్‌పై అక్రమంగా బనాయించిన అన్ని కేసులను మద్రాసు హైకోర్టు కొట్టివేసిందని సీనియర్ సినీనటి, దర్శక, నిర్మాత జయచిత్ర తెలిపారు. ఆమె గురువారం మీడియాతో మాట్లాడుతూ సంగీత దర్శకునిగా తమిళ సినీ ప్రపంచంలో దూసుకుపోతున్న తన కుమారుడిని ఇరీడియం కేసులో ఇరికించి పెద్ద ఎత్తున డబ్బు కాజేయాలని పన్నాగం పన్నారని తెలిపారు. అందులో అమ్రీష్‌కు ఎలాంటి సంబంధం లేదని ఈ నెల 15వ తేదీన కోర్టు తీర్పు చెప్పిందన్నారు. అలాగే అన్ని కేసులనూ కొట్టివేసినట్లుగా తనకు బుధవారం కోర్టు పత్రాలు అందాయని ఆమె తెలిపారు. అమ్రీష్ మంచితనాన్ని అవకాశంగా తీసుకుని అక్రమ కేసుల్లో ఇరికించడం తల్లిగా తనను ఎంతో బాధించిందన్నారు. దైవానుగ్రహం వల్ల న్యాయమే గెలిచిందని, ఇకపై అమ్రీష్‌కు అన్నీ తానై వ్యవహారాలను పర్యవేక్షిస్తానని వివరించారు. కేసుల నుంచి బయటపడిన అమ్రీష్‌పై అభినందనల వర్షం కురిపిస్తూ ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆశీర్వదించిన సినీ ప్రముఖులకు కలైమామణి జయచిత్ర కృతజ్ఞతలు చెప్పారు. -
రూ.26 కోట్ల మోసం.. సంగీత దర్శకుడు అమ్రేష్ అరెస్ట్
తమిళ సినిమా (చెన్నై): రూ.26 కోట్ల మోసం కేసులో యువ సంగీత దర్శకుడు అమ్రేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నై పోలీసులు మంగళవారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో అరుదైన ఇరిడియం(రైస్ పుల్లింగ్) తన వద్ద ఉందని మార్కెట్లో విక్రయిస్తే కోట్ల లాభం గడించవచ్చని చెప్పి తన వద్ద రూ.26 కోట్లు తీసుకుని అమ్రేష్, బృందం నకిలీ ఇరిడియం ఇచ్చి మోసం చేసినట్లు వలసరవాక్కంకు చెందిన నెడుమారన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీంతో అమ్రేష్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి, మంగళవారం అతన్ని అరెస్ట్ చేసి ఎగ్మూర్‌లోని సీబీసీఐడీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి, కోర్టు ఆదేశాల మేరకు జైలుకు తరలించినట్లు పోలీసులు ప్రకటనలో తెలిపారు. చదవండి: ('వీడియో చూపి 5 కోట్లు అడిగారు.. అక్కడుంది నేను కాదు') -
ఫోన్ దొంగిలించాడని తలక్రిందులుగా వేలాడదీశారు
పాట్నా: సెల్‌ఫోన్ దొంగిలించాడని ఓ వ్యక్తిపై కిరాతంగా ప్రవర్తించారు కొందరు స్థానికులు. అతని కాళ్లను చైన్‌తో కట్టేసి చెట్టుపై నుంచి తలక్రిందులుగా వేలాడదీశారు. తాజాగా ఈ వీడియో బయటకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహర్‌లోని దర్భాంగా సమీపం వద్దగల హింగోలీ గ్రామంలో అమ్రేశ్ అనే వ్యక్తి సెల్‌ఫోన్ దొంగిలించాడంటూ గ్రామస్తులు పట్టుకున్నారు. అతన్ని బాగా చితకబాదారు. అనంతరం అంతా కలిసి అతన్ని చైన్‌తో కట్టేసి పెద్ద చెట్టుపై నుంచి వేడాలదీశారు. ఇదంతా ఒకరు వీడియో తీశారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. దీంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని అమ్రేశ్‌ను , మరో ముగ్గురు గ్రామస్తులను అరెస్ట్ చేశారు. -
ఇదో తల్లీ కొడుకుల రికార్డు
నటిగా నేను, సంగీత దర్శకుడిగా నా కొడుకు అమ్రేష్ ఒకేసారి చిత్ర పరిశ్రమలో కొనసాగడం ఒక రికార్డు అని సీనియర్ నటీమణి, దర్శక, నిర్మాత జయచిత్ర పేర్కొన్నారు. తెలుగు చిత్రాల ప్రముఖ దర్శకులు సుకుమార్ నిర్మాతగా ఏవీఏం స్టూడియోలో హండ్రెడ్ పర్సంట్ కాదల్ చిత్ర షూటింగ్ బుధవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా జయచిత్ర సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... సాక్షి, చెన్నై : హీరోయిన్ గా, తల్లిగా, అత్తగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇప్పటివరకు సుమారు రెండు వందల పై చిలుకు చిత్రాల్లో నటించాను. డైరెక్టర్ కే.బాలచందర్ సతీమణిగా సుమారు ఎనిమిదేళ్ల క్రితం నటించిన రెట్టైసుళి చిత్రం, ఐదేళ్ల క్రితం విడుదలైన జూనియర్ ఎన్ టీఆర్ హీరోగా నటించిన నరశింహుడు చిత్రాల తరువాత కుటుంబ బాధ్యతలకు దగ్గరగా సినిమాలకు దూరంగా ఉన్నాను. హీరోగా రాణించి, సంగీత దర్శకుడుగా సైతం ఎదుగుతున్న కుమారుడు అమ్రేష్‌కు తల్లిగా అండదండలు ఇవ్వడంలోని ఆనందాన్ని పొందుతున్నాను. నేను షూటింగులకు వెళ్లేటపుడు తాను సపర్యలు చేసేవాడు, ఈరోజు తనకు నేను సహకరించడం, సినీ పరిశ్రమలో పొందుతున్న పేరు ప్రఖ్యాతులను దగ్గరుండి చూడడంలో ఎంతో ఆత్మసంతృప్తి ఉంది. నాలుగో ఇన్నింగ్స్ ఆరంభం నటీమణిగా నా హయాంలో తొలితరం హీరోలు ఎంజీ రామచంద్రన్, శివాజీగణేశన్, రెండోతరం కమల్‌హాసన్, రజనీకాంత్, మూడోతరం అజిత్, విజయ్‌లతో ముచ్చటగా మూడు ఇన్నింగ్స్‌ను విజయవంతంగా పూర్తిచేశాను. హండ్రెడ్ పర్సంట్ కాదల్ (హండ్రడ్ పర్సంట్ లవ్ తెలుగు చిత్రానికి రీమేక్) తమిళ చిత్రంలో నాలుగోతరం హీరో అయిన జీవీ ప్రకాష్‌తో నాలుగో ఇన్నింగ్స్‌ను ప్రారంభించాను. చిత్ర కథను క్లుప్తంగా వివరిస్తూ ఒక అబ్బాయి, అమ్మాయి లు కలిగిన తరువాత ఏర్పడిన మనస్పర్థల వల్ల నేను భర్త (నాజర్) విడిపోతాం. అయితే మా పిల్లల పిల్లలు ( హీరో హీరోయిన్లు) ప్రేమించుకున్నా చిన్న గొడవ కారణంగా పెళ్లి చేసుకోకుండానే విడిపోతారు. వారిద్దరిలోని మనస్పర్థలు తొలగించి కలపడమే నా క్యారెక్టర్. నేను పిల్లలను కలిపితే పిల్లలు మా జంటను కలుపుతారు. సినిమాలో నాది కీరోల్. ఇలాంటి కీలకమైన పాత్ర వస్తే నటించేందుకు రెడీ. ఆలోచనలో పడ్డాను ఇటీవల నేను ఏ ఫంక్షన్ కు వెళ్లినా సినిమాల్లో ఎందుకు నటించడం లేదని పదే పదే అడగడంతో ఆలోచనలో పడ్డాను. ఇన్నాళ్లూ ఉద్దేశపూర్వకంగా సినిమాలకు దూరంగా ఉండలేదు. ఈ క్యారెక్టర్‌కు మీరే కావాలని ఎవరైనా వస్తే కాదనే ప్రసక్తేలేదు. బుధవారం ప్రారంభమైన తమిళ చిత్ర దర్శకులు చంద్రమౌళి, నిర్మాతలు నా ఇంటికి వచ్చి కోరడం, మంచి చిత్రకథాంశం కావడంతో అంగీకరించాను. మరలా నేను సినిమా ఒప్పుకోవడంతో అమ్రేష్ ఎంతో ఆనందించాడు. ఆకలితో రాత్రి నిద్రపట్టక పోవడంతో మంగళవారం అర్ధరాత్రి 1.30 గంటలకు స్వయంగా ఆమ్లేట్ తినిపించాడు. అదేంటిరా అని అడిగితే నాకు నీవు చేస్తున్నావు, నీకు నేను చేస్తే తప్పేంటి అని చిరునవ్వుతో సమాధనం ఇచ్చాడు. బుధవారం పొద్దున్నే లేచి సాగనంపాడు. నటిగా తల్లి, హీరో, సంగీత దర్శకునిగా కొడుకు ఒకేసారి చిత్ర పరిశ్రమలో ఉండడం బహుశా ఇది ఒక రికార్డు. -
అప్పుడు సీత.. ఇప్పుడు ద్రౌపది!
సీతమ్మ తల్లి ఎలా ఉంటుంది? అనడిగితే... చాలామంది అంజలీదేవి పేరు చెబుతారు. ‘లవకుశ’ సినిమాలో అంత అద్భుతంగా నటించారామె. నాటి తరంలో సీత పాత్రలో అంజలీదేవి మెప్పిస్తే నేటి తరంలో ‘శ్రీరామరాజ్యం’లో సీతగా మెప్పించారు నయనతార. ఆ సినిమా తర్వాత నయనతార గ్లామరస్ క్యారెక్టర్స్‌కి మాత్రమే కాదు.. నటనకు అవకాశమున్న సంప్రదాయబద్ధమైన పాత్రలూ చేయగలరనే అభిప్రాయం బలపడింది. ఇప్పుడీ బ్యూటీకి కన్నడ ‘కురుక్షేత్ర’లో ద్రౌపదిగా నటించే ఛాన్స్ వచ్చిందట. తమిళంలో బిజీగా ఉన్న నయనతార ఈ చిత్రంలో నటించే విషయమై హామీ ఇవ్వలేదట. అయితే మంచి అవకాశం కాబట్టి డేట్స్ అడ్జస్ట్ చేసి, గ్రీన్ సిగ్నల్ ఇస్తారని ఊహించవచ్చు. ఈ నెల 23న ‘కురుక్షేత్ర’ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఒకవేళ నయన అంగీకరిస్తే, ‘సూపర్’ తర్వాత కన్నడంలో ఇది ఆమెకు రెండో సినిమా అవుతుంది. ఇందులో దుర్యోధనుడిగా దర్శన్, భీష్ముడిగా అమ్రీష్, కర్ణుడిగా రవిచంద్రన్ నటించనున్నారు. -
జయచిత్ర కుమారుడి వివాహం
ప్రఖ్యాత నటి, దర్శకురాలు, నిర్మాత జయచిత్ర కొడుకు అమ్రేష్ వివాహం బుధవారం చెన్నైలో ఆడంబరంగా జరగనుంది. నాలుగు దశాబ్దాలకు పైగా నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా చిత్రరంగంలో రాణిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి జయచిత్ర. తమిళం, తెలుగు భాషల్లో 200కు పైగా చిత్రాల్లో నటించిన జయచిత్ర తన వారసుడు అమ్రేష్‌ను చిత్ర రంగానికి పరిచయం చేశారు. అమ్రేష్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ జయచిత్ర స్వీయ దర్శకత్వంలో నానే ఎన్నుళ్ ఇల్లై చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం అమ్రేష్‌కు నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే ఆ తరువాత మరికొన్ని చిత్రాల్లో నటించే అవకాశం వచ్చినా అమ్రేష్ సంగీతంపై మక్కువ చూపారు. దీంతో సంగీత దర్శకుడిగా మారి లారెన్స్ కథానాయకుడిగా నటిస్తున్న మొట్టశివ కెట్టశివ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా అమ్రేష్ ఇప్పుడు ఓ ఇంటి వాడు కాబోతున్నారు. డీ.సుదర్శన్, విజయశ్రీ దంపతుల కూమార్తెను పెళ్లాడబోతున్నాడు. బుధవారం ఉదయం వీరి వివాహ వేడుకకు ఎగ్మోర్‌లోని రాణి మెయమ్మైకల్యాణ మండపం వేదిక కానుంది. ఈ వేడుకకు ఇరు కుటుంబాల బంధుమిత్రులతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. అదే రోజు సాయంత్రం వివాహ రిసెప్షన్‌ను నిర్వహించనున్నారు. కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు గంగైలమరన్ సంగీత విభావరి ఆహూతులను అలరించనుంది.