
తమిళ సినిమా (చెన్నై): రూ.26 కోట్ల మోసం కేసులో యువ సంగీత దర్శకుడు అమ్రేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నై పోలీసులు మంగళవారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో అరుదైన ఇరిడియం(రైస్ పుల్లింగ్) తన వద్ద ఉందని మార్కెట్లో విక్రయిస్తే కోట్ల లాభం గడించవచ్చని చెప్పి తన వద్ద రూ.26 కోట్లు తీసుకుని అమ్రేష్, బృందం నకిలీ ఇరిడియం ఇచ్చి మోసం చేసినట్లు వలసరవాక్కంకు చెందిన నెడుమారన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీంతో అమ్రేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి, మంగళవారం అతన్ని అరెస్ట్ చేసి ఎగ్మూర్‌లోని సీబీసీఐడీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి, కోర్టు ఆదేశాల మేరకు జైలుకు తరలించినట్లు పోలీసులు ప్రకటనలో తెలిపారు.
చదవండి: ('వీడియో చూపి 5 కోట్లు అడిగారు.. అక్కడుంది నేను కాదు')
Comments
Please login to add a commentAdd a comment