జయచిత్ర కుమారుడి వివాహం | Tomorrow producer Jayachitra son marriage | Sakshi
Sakshi News home page

రేపు జయచిత్ర కుమారుడి వివాహం

Published Tue, Oct 18 2016 8:07 AM | Last Updated on Sun, Sep 2 2018 4:41 PM

జయచిత్ర కుమారుడి వివాహం - Sakshi

జయచిత్ర కుమారుడి వివాహం

ప్రఖ్యాత నటి, దర్శకురాలు, నిర్మాత జయచిత్ర కొడుకు అమ్రేష్ వివాహం బుధవారం చెన్నైలో ఆడంబరంగా జరగనుంది. నాలుగు దశాబ్దాలకు పైగా నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా చిత్రరంగంలో రాణిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి జయచిత్ర. తమిళం, తెలుగు భాషల్లో 200కు పైగా చిత్రాల్లో నటించిన జయచిత్ర తన వారసుడు అమ్రేష్‌ను చిత్ర రంగానికి పరిచయం చేశారు. అమ్రేష్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ జయచిత్ర స్వీయ దర్శకత్వంలో నానే ఎన్నుళ్ ఇల్లై చిత్రాన్ని నిర్మించారు.
 
ఈ చిత్రం అమ్రేష్‌కు నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే ఆ తరువాత మరికొన్ని చిత్రాల్లో నటించే అవకాశం వచ్చినా అమ్రేష్ సంగీతంపై మక్కువ చూపారు. దీంతో సంగీత దర్శకుడిగా మారి లారెన్స్ కథానాయకుడిగా నటిస్తున్న మొట్టశివ కెట్టశివ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా అమ్రేష్ ఇప్పుడు ఓ ఇంటి వాడు కాబోతున్నారు. డీ.సుదర్శన్, విజయశ్రీ దంపతుల కూమార్తెను పెళ్లాడబోతున్నాడు.
 
బుధవారం ఉదయం వీరి వివాహ వేడుకకు  ఎగ్మోర్‌లోని రాణి మెయమ్మైకల్యాణ మండపం వేదిక కానుంది. ఈ వేడుకకు ఇరు కుటుంబాల బంధుమిత్రులతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. అదే రోజు సాయంత్రం వివాహ రిసెప్షన్‌ను నిర్వహించనున్నారు. కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు గంగైలమరన్ సంగీత విభావరి ఆహూతులను అలరించనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement